
సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
జిల్లా సేంద్రియ వ్యవసాయ శాఖ
మేనేజర్ రామ్మోహనరావు
ముంచంగిపుట్టు: గిరిజన రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని జిల్లా సేంద్రియ వ్యవసాయ మేనేజర్ రామ్మోహనరావు అన్నారు. సేంద్రియ వ్యవసాయ విస్తరణలో భాగంగా మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో బుధవారం రైతులతో పొలంలో నవధాన్యాలను జల్లించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం దొడిపుట్టు పంచాయతీలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయంపై గిరిజన రైతులతో అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా రామ్మోహనరావు మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సేంద్రియ వ్యవసాయ మేనేజర్ భాస్కరరావు,మండల వ్యవసాయాధికారి ఎం.శ్రీనివాసబాబు, సేంద్రియ వ్యవసాయ మండల కోఆర్డినేటర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సమతా ఎక్స్‌ప్రెస్ రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ): నాగ్‌పూర్ డివిజన్ పరిధి రునిజా–కలమ్మ స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైన్ సంబంఽధిత ప్రి నాన్ ఇంటర్ లాకింగ్, నాన్–ఇంటర్ లాకింగ్ పనుల నిమత్తం ఆయా తేదీల్లో సమతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 30, మే 3, 5, 6, 8వ తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో హజరత్ నిజాముద్దీన్‌లో మే 2, 3, 5, 6, 8వ తేదీల్లో బయల్దేరే హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం (12808) సమ తా ఎక్స్‌ప్రెస్‌లు రద్దయినట్లుపేర్కొన్నారు.

సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి