gollapudi
-
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఖండించారు.
-
గొల్లపూడిలో సీఎం జగన్‌ను మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
-
కొబ్బరికాయలతో గణనాథుడు
-
గొల్లపూడి సమీపంలో BSR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
-
బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, విజయవాడ: గొల్లపూడి వద్ద ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు బోల్తా పడటంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును అధికారులు తొలగించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? -
ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందుతుంది: మంత్రి పెద్దిరెడ్డి
-
AP: నేడు కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం.. ప్రమాదాల నివారణ దీని ప్రత్యేకత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్మించిన కంటైనర్ సబ్‌స్టేషన్‌ను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్డ్ టెక్నాలజీ)తో అతి తక్కువ స్థలంలో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ కె.పద్మజనార్దనరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్‌స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఈ కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాసనగర్‌లో ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సబ్‌స్టేషన్ ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతమైంది. ఈ సబ్‌స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవున ఉంది. అందులోనే సబ్ స్టేషన్‌కు సంబంధించిన పరికరాలు అన్నింటినీ ఏర్పాటు చేశారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా ఈ కంటైనర్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. దీని నుంచి ట్రాన్‌ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తారు. పూర్తి ఆటోమేషన్ విధానంలోనే ఈ కంటైనర్ సబ్ స్టేషన్ పనిచేస్తుంది. ఈ సబ్ స్టేషన్‌తో అర్బన్ ప్రాంతాల్లో బహుళ ప్రయోజనాలున్నాయి. ఎంతో ప్రయోజనకరం గొల్లపూడి ప్రజలకు ఈ కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం «శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిషత్తులో నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ కంటైనర్‌లో సబ్ స్టేషన్‌ను నిర్మించారు. మా ప్రాంత విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన వెంటనే స్పందించారు. కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – కారంపూడి సురేష్, మార్కెట్ యార్డు చెర్మన్ గొల్లపూడి నిర్వహణ వ్యయం తక్కువ కంటైనర్ సబ్స్టేషన్ల ద్వారా డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. దీని నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. – వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ప్రయోజనాలు ఇలా.. కంటైనర్ సబ్‌స్టేసన్‌లో సమస్య తలెత్తితే వెంటనే సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా సబ్‌స్టేషన్ పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చి సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉంది. సబ్‌స్టేషన్ లోపల ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలో అయినా సమస్య తలెత్తితే సబ్‌స్టేసన్‌లో తెలుసుకొనే వీలుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని చోట రిమోట్ లోకేషన్ నుంచి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. -
తలశిల సతీమణి భౌతికకాయానికి సీఎం జగన్ దంపతుల నివాళులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి కన్నుమూయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం గొల్లపూడి బయల్దేరి వెళ్లారు. రఘురాం భార్య స్వర్ణకుమారికి నివాళులు అర్పించి.. తలశిల కుటుంబాన్ని సీఎం జగన్ దంపతులు పరామర్శించారు. -
కలెక్టర్ ఆదేశాలు.. గొల్లపూడి టీడీపీ ఆఫీస్‌ను తొలగించిన అధికారులు..
ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడి వన్ సెంటర్లో ప్రైవేట్ స్థలంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. శేషారత్నం పేరిట ఉన్న ఈ స్థలంలో గత కొన్నాళ్లుగా టీడీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్థలాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలంటూ శేషారత్నం కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో గిఫ్ట్ డీడ్ రద్దు చేశారు కలెక్టర్. శేషారత్నానికి ఆ స్థలాన్ని స్వాధీనం చేసి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేతల ఆందోళనల నడుమ రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని కూల్చివేసి స్థలాన్ని శేషారత్నంకు అప్పగించారు. -
ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడిలో టీడీపీ కార్యాలయం వివాదం
-
గొల్లపూడి టీడీపీ ఆఫీస్ పై యజమాని శేషారత్నం కీలక వ్యాఖ్యలు
-
గొల్లపూడి వన్ సెంటర్ లో టీడీపీ నేతల డ్రామా
-
AP: శరవేగంగా ‘గొల్లపూడి-చినఅవుటపల్లి’ బైపాస్ నిర్మాణ పనులు
గన్నవరం(కృష్ణా జిల్లా): విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు చేపట్టిన 16వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతమాల ప్రాజెక్ట్‌లో భాగంగా చిన అవుటపల్లి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు 48 కిలోమీటర్ల పొడవునా రెండు ప్యాకేజీలుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. ప్యాకేజీ–3లో భాగంగా చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేపట్టిన మెగా ఇంజినీరింగ్ సంస్థ ఇప్పటికే 80 శాతం పనులను పూర్తిచేసింది. మరో మూడు నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచింది. ప్యాకేజీ–4లో చేపట్టిన గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 18 కిలోమీటర్ల బైపాస్ పనులు కూడా పూర్తయితే విజయవాడపై పూర్తిగా ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఏలూరు వైపు నుంచి హైదరాబాద్, గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు గొల్లపూడి మీదుగా బైపాస్ రోడ్డులో వెళ్లనున్నాయి. మర్లపాలెం రైల్వేట్రాక్ వద్ద నిర్మిస్తున్న వంతెన రూ.1,148 కోట్లతో నిర్మాణం ప్యాకేజీ–3లో భాగంగా రూ.1,148 కోట్లతో చేపట్టిన బైపాస్ నిర్మాణ పనులు చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సమీపంలో జీరో పాయింట్ నుంచి ప్రారంభమై గొల్లపూడిలో 30వ కిలోమీటర్ వద్ద ముగుస్తుంది. ఈ మార్గంలో రెండు రైల్వే ఫ్లై ఓవర్లు మినహా 36 మైనర్ వంతెనలు, 17 వెహికల్ అండర్ పాస్‌లు, రెండు బాక్స్ కల్వర్ట్లు, మరో 44 పైపు కల్వర్టులు, గ్రామాల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. మర్లపాలెం, గొల్లపూడి వద్ద రైల్వేట్రాక్‌లకు ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఫ్లైఓవర్ కోసం గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చినఅవుటపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి మర్లపాలెం నుంచి అంబాపురం వరకు ఆరులైన్ల రహదారి నిర్మాణం పూర్తికాగా, చినఅవుటపల్లి, మర్లపాలెం, బీబీ గూడెం వద్ద వంతెనలు, అండర్ పాస్‌లకు రహదారిని అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయి. సూరంపల్లి–నున్న మధ్యలో టోల్‌ప్లాజా నిర్మాణం కూడా జరుగుతోంది. వాహనదారుల సౌకర్యార్ధం పలుచోట్ల బైపాస్ రోడ్లకు ఇరువైపులా టాయిలెట్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. నున్న వద్ద హైటెన్షన్ వైర్లు ఎత్తు పెంచకపోవడంతో నిర్మాణ పనులకు కొంత ఆటంకంగా మారింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు ఎన్హెచ్ఏ అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా మార్చిలోపు పూర్తిచేసే దిశగా మెగా ఇంజినీరింగ్ సంస్థ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
విజయవాడ గోల్లపూడిలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
రైతులకోసం RBK సేవలు
-
దళితద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు
-
చంద్రబాబు గో బ్యాక్ అంటూ దళిత సంఘాల నినాదాలు
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమాకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులు భారీగా గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబును అడ్డుకోవాడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు దళిత సంఘాలను అడ్డుకున్నాయి. అనంతరం దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. పదిహేనేళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమా దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. కావాలనే దళితుల పేరు చెప్పుకుని చంద్రబాబు కుళ్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దేవినేని ఉమా ఇప్పటికైనా దళితులపై చేస్తున్న కుట్ర రాజకీయం మానుకొవాలన్నారు. లేనిపక్షంలో మళ్లీ ప్రజాక్షేత్రంలో టీడీపీకి బుద్ధి చెబుతామని తెలిపారు. -
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం వైఎస్ జగన్
-
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్.. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలిని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని సీఎం జగన్ అన్నారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు మాట్లాడుతూ.. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించాలనుకోవడం గొప్ప చర్య అని, సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని తాము చూడలేదని వాలంటీర్లు చెప్పారు. చదవండి: విద్యారంగ ప్రక్షాళన తర్వాత ఖాళీల భర్తీ కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు -
నేడు గొల్లపూడిలో దిశ యాప్ అవగాహన సదస్సు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో మంగళవారం నిర్వహించనున్న ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొంటారు. (ఫైల్‌ఫోటో) ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం 10గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదుగురు మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో వీక్షిస్తారు. ఈ సందర్భంగా దిశ యాప్ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా చెబుతారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరిస్తారు. మహిళా భద్రతకు సీఎం పెద్దపీట ఈ కార్యక్రమం కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను సోమవారం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొననుండటం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని చెప్పారు. ఇప్పటికే 20 లక్షలమంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దిశ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, దిశ యాప్ అమలు విభాగం ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదవండి: కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు -
ఈ నెల 29న గొల్లపూడికి వెళ్లనున్న సీఎం జగన్
-
రేపు గొల్లపూడికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): రేపు (మంగళవారం) గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మహిళ భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో కార్యక్రమం జరగనుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రతి మహిళా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ గొల్లపూడి వెళ్లనున్నారు. ఈ క్రమంలో గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలిస్తున్నారు. సభ ఏర్పాట్లపై ఆయన డీఐజీ పాల్‌రాజ్ (టెక్నికల్ సర్వీస్), దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ–2 విక్రాంత్ పాటిల్, విజయవాడ వెస్ట్ ఏసీపీ డాక్టర్ కె. హనుమంతరావులతో చర్చించారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలోనే ఆయన స్వయంగా యాప్ డౌన్ లోడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రఘురాం వివరించారు. ఎంపీడీఓ సునీత, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస నాయక్, భవానీపురం సీఐ జె. మురళీకృష్ణ, గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: కడదాం.. 'దిశ' కంకణం ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి -
బ్రేకింగ్: బాబు, ఉమపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు
గొల్లపూడి: తెలుగు వాడి చరిత్ర దేశంలో లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని తెలిపారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా మేము సిద్ధమేనని వంశీ ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్ బదులిచ్చారు. అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోమని పేర్కొన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని తెలిపారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ.. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసని.. ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి.. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని పేర్కొన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదని తెలిపారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ హితవు పలికారు. -
వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా రక్తి కట్టించారు. గొల్లపూడిలో సోమవారం 3648 ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా.. దేవినేని ఉమకు వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం గొల్లపూడి సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండగా.. దేవినేని మాత్రం ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా ప్రారంభించారు. (చదవండి : నాడు ఎన్టీఆర్ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!) అంతేకాక బహిరంగ చర్చకు హాజరు కాకుండా ఉండేందుకు తన దీక్ష గురించి ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు దేవినేనిని అరెస్ట్ చేశారు. చర్చకు హాజరుకాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తోనే దేవినేని నిరసన దీక్ష ప్రారంభించి.. అరెస్ట్ అయ్యేలా వ్యూహం పన్నారు. చర్చ జరగకుండా తప్పించుకున్నారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలోని నారాయణ కళాశాల హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి రామాంజనేయరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న అతను.. కాలేజీ హాస్టల్లోని రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యతో హాస్టల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే రామాంజనేయరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
గోనె సంచిలో చిన్నారి ద్వారక మృతదేహం
సాక్షి, విజయవాడ: ఇంటి ముందు ఆడుకుంటూ నిన్న సాయంత్రం అదృశ్యమైన చిన్నారి ద్వారక మువ్వ ఉదంతం విషాదంగా ముగిసింది. పక్కింట్లోనే చిన్నారి మృతదేహం ఓ గోనె సంచిలో లభ్యమైంది. పక్కింట్లో నివాసం ఉంటున్న ప్రకాష్ అనే వ్యక్తి ... ద్వారకపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారకా మువ్వ ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద్వారక తల్లి ఇంటి పక్కనే ఉన్న కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. పని ముగించుకుని ఆమె ఇంటికి వచ్చినా.. కూతురు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ పుటేజీ కెమెరాలను పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లను తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో ద్వారక ఉంటున్న పక్కింట్లోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రకాష్...అత్యాచారానికి పాల్పడి అనంతరం హతమార్చి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు. అయితే భర్త ప్రవర్తన తేడాగా ఉండటాన్ని గమనించిన ప్రకాష్ భార్య ఇంట్లో వెతకగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రకాష్ పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరోవైపు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య? వర్షిత హంతకుడు ఇతడే! -
అమరావతిలో హైకోర్టు తొలి తీర్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తొలి తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజీ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మద్యం గోడౌన్లలో 40 శాతం మంది హమాలీలను కొత్త గోడౌన్లలో పనిచేసేందుకు అనుమతించాలంటూ హమాలీల సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం గమనార్హం. ఇదీ నేపథ్యం విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్ మద్యం గోడౌన్ నిర్వహించేది. ఇందులో పలువురు హమాలీలు పనిచేసేవారు. అనంతరం నిడమానూరులో కొత్త మద్యం గోడౌన్‌ను ఏపీబీసీఎల్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి గోడౌన్లో పనిచేస్తున్న హమాలీల్లో 40 శాతం మందిని నిడమానూరు గోడౌన్లో పనిచేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ హమాలీల సంఘం ఏపీబీసీఎల్‌కు వినతిపత్రం సమర్పించింది. అధికారులు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ యూనియన్ అధ్యక్షుడు ఎ.సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై సతీష్ దాఖలు చేసిన అప్పీల్ తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గోడౌన్లో 40 శాతం మంది హమాలీలు పనిచేసేందుకు అనుమతిస్తూ గతంలో సర్కులర్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ తెలిపారు. అయితే ఈ సర్కులర్‌ను కేవలం మానవతా దృక్పథంతోనే ఇచ్చామని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది నివేదించారు. స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగి శాంతిభద్రతల సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యూనియన్ తరఫున సతీష్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. -
మార్చి 31 నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి
అధికారుల సమీక్షలో సీఎం సాక్షి, అమరావతి: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికల్లా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు గడువు విధించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సీఎం శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు. పనులు మందకొ డిగా చేస్తూ నిర్మాణ సంస్థ సోమా ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచి ఇకనుంచీ 24 గంటలూ.. పగలు, రాత్రీ పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులకు అంతరాయం కలగకుండా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకుగాను ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 31 వరకు దాదాపు నాలుగు నెలలపాటు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు. అయితే దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం నడకదారికి అనుమతించాలని సూచించారు. రహదారి మూసివేసినన్ని రోజులూ పాసుల పేరుతో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతివ్వవద్దని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేవరకు రెండువైపులా శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని కోరారు. కేఈ ప్రధాన కాలువ బంద్ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు, అలాగే 2018 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కేఈ ప్రధాన కాలువ ప్రవాహాన్ని నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. అటు దుర్గగుడి సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. -
బాబోయ్.. ఆయన చేత రిబ్బన్ కటింగా?
గాసిప్ ‘ఏం తమషాగా ఉందా? నా నియోజకవర్గ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తూ నన్నే విస్మరిస్తారా? వ్యాపారం చేసుకోవాలని లేదా? నేను ప్రారంభోత్సవం చేయాలంటే చెప్పినట్లు చేయాల్సిందే? లేదంటే మీకే ఇబ్బందులు..’ పది రోజుల కిందట కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యాపారులను బెదిరించిన తీరు ఇది. విజయవాడకు పక్కనే ఉన్న నియోజకవర్గానికి చెందిన గొల్లపూడిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. ‘ఫార్మా’ పేరిట కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సోమవారం (ఏప్రిల్ 17న) ఆర్భాటంగా ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభోత్సవానికి రావాలని కాంప్లెక్స్ యాజమాన్యం సదరు మంత్రిని ఆహ్వానించగా.. ఆయన వారిపై ఆగ్రహించి కోర్కెల చిట్టా విప్పారట. కాంప్లెక్స్‌లో ఓ షాపును నజరానాగా ఇవ్వాలని హుకుం జారీ చేశారట. ఆయన కోరిక మరీ ఖరీదైనది కావడంతో వారు విస్తుపోయారు. అయినా.. ఆయన కోరినట్టే మార్కెట్ విలువ ప్రకారం రూ.40 లక్షలు చేసే షాపును నామ మాత్రపు ధరకే అప్పగించినట్లు తెలిసింది. ఆ సొమ్ము కూడా మంత్రి ఇతరుల నుంచే ఇప్పించినట్లు సమాచారం. మంత్రి ఏ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో నజరానాలు అందుకున్నట్లుగా వ్యాపారవర్గాల్లో గుసగుస. మంత్రి ప్రారంభోత్సవం చేసి వెళ్లాక.. ఆయన సతీమణి వచ్చి.. అక్కడ తనకు కావాల్సినవి పట్టుకెళ్తారట! ఇందుకు ఎలాంటి బిల్లు చెల్లింపులూ ఉండవు. మంత్రి, కుటుంబసభ్యుల వ్యవహారంతో విసుగెత్తిపోయిన వ్యాపారులు.. అయన చేత రిబ్బన్ కట్టింగ్ అంటేనే.. వద్దు బాబోయ్ అని బెంబేలెత్తిపోతున్నారు. -
అమరజవాన్లకు నివాళులర్పిస్తూ సైకిల్‌యాత్ర
గొల్లపూడి(మైలవరం): దేశం కోసం అసువులు బాసిన అమరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రిటైర్డు మేజర్ జనరల్ సోమనాథ్‌జా సైకిల్ యాత్ర చేపట్టారు. ఆయన మంగళవారం గొల్లపూడి గ్రామం చేరుకున్నారు. గ్రామంలో ఆయనకు మాజీ సైనికులు సుబ్బారావు, నరిసింహారావు తదితరులు స్వాగతం పలికి సత్కరించారు. సోమనా«థ్‌జా మాట్లాడుతూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ హర్యానా రాష్ట్రం నుంచి సైకిల్‌యాత్ర చేస్తున్నానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి మృతి చెందిన 21వేల మందికి సంతాపం తెలియజేయాలని అక్టోబర్ 19వ తేదీ నుంచి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 9వేల మంది అమరజవాన్లకు సైకిల్‌యాత్రలో రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించినట్టు వివరించారు. ఏప్రిల్ నాటికి మిగిలిన వారికి శ్రద్ధాంజలి ఘటించి ఢిల్లీలోని అమరజ్యోతికి చేరుకోనున్నట్టు చెప్పారు. సోమనా«థ్‌జాతోపాటు ఆయన సతీమణి చిత్రజా కూడా యాత్రలో పాల్గొన్నారు. -
ట్రాఫిక్ చక్రబంధంలో గొల్లపూడి
గొల్లపూడి (విజయవాడ రూరల్) : గొల్లపూడి గ్రామంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ జఠిలమవుతోంది. ఈ గ్రామం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో గ్రామస్తులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా మైలురాయి సెంటర్, వన్ సెంటర్, సారాకొట్టు సెంటర్లో ప్రజలు రోడ్డును క్రాస్‌చేసి ఆవలి వైపునకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. మైలురాయి సెంటర్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వైపునుంచి వచ్చే వాహనాలు, బైపాస్‌రోడ్డులో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి మైలురాయి సెంటర్‌వద్ద క్రాస్ అవుతాయి. అదే ప్రాంతంలో భవానీపురం నుంచి వచ్చే బస్సులు, ప్రభుత్వ వాహనాలు రోడ్డును క్రాస్ చేసుకుని వెళ్లాల్సి రావడంతో నిత్యం చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా ప్రమాదం పొంచి ఉందన్నమాటే. పోలీసు అవుట్ పోస్టు ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు లారీలను బైపాస్ రోడ్డుకు పంపేందుకు సూచికలు చూపిస్తున్నారే తప్ప విజయవాడ వైపునుంచి (టీటీడీసీ)వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వడంలేదు. అదేవిధంగా వన్ సెంటర్లో క్లాస్ వన్ పీపుల్స్ ఉంటారు. ప్రతి కుటుంబానికి రెండు కార్లు, మూడు బైక్‌లు ఉంటాయి. రోజూ ఉదయం సాయంత్రం ట్రాఫిక్ రద్దీ చెప్పనలవి కాదు. మొన్నటి వరకు రాష్ట్రనీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ సెంటర్‌కు దగ్గరలో ఉండటం వలన ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉండడంతో పోలీసులు కనిపించడం లేదు. సారాకొట్టు సెంటర్ మాస్ పీపుల్స్ సెంటర్. సాయంత్రం అయ్యిందంటే సెంటర్ కిటకిటలాడుతోంది. హోటల్స్, టిఫిన్స్ అమ్ముకొనేవారు అక్కడే ఉండడంతో ఎలాంటి వాహనాలైనా అక్కడ ఆగాల్సిందే. ఇరుకైన సెంటర్ కావడం తో సహజంగా ఉండాల్సిన ట్రాఫిక్ కం టే ఎక్కువగా సమస్య ఉంటుంది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధులను గామస్తులు కోరుతున్నారు. -
పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం
గొల్లపూడి(విజయవాడరూరల్) : గొల్లపూడి పుష్కరఘాట్వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్ ఏఈ సురేంద్ర తెలిపారు. -
పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం
గొల్లపూడి, పుష్కరఘాట్, పిండప్రదానాలు gollapudi, pushkara ghat, pinda pradhanam గొల్లపూడి(విజయవాడరూరల్) : గొల్లపూడి పుష్కరఘాట్వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్ ఏఈ సురేంద్ర తెలిపారు. -
అద్దె ఇంట్లో ఉంటున్న ఏపీ మంత్రి
విజయవాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. తనకు గజం స్థలం కూడా లేదని, కృష్ణా జిల్లా గొల్లపూడిలోని అద్దె ఇంట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం గొల్లపూడిలో మంత్రి ఇంటి నుంచి ప్రజాసాధికారిక సర్వే ప్రారంభించిన అధికారులకు ఆయన ఈ వివరాలు ఇచ్చారు. అధికారులకు తన ఆధార్, ఓటరుకార్డులోని విషయాలు మాత్రమే అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి ఈ వివరాలను నమోదుచేసుకున్నారు. -
'నాకు ఒక్క గజం స్థలం కూడా లేదు'
విజయవాడ : నాకు ఒక్క గజం స్థలం కూడా లేదని విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మంగళవారం గొల్లపూడిలో ప్రజాసాధికారిక సర్వే కార్యక్రమాన్ని అధికారులు మంత్రి ఉమా ఇంటి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా... ఆధార్‌కార్డు, ఓటరుకార్డు వివరాలను మాత్రమే అధికారులకు అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలను మంత్రి దేవినేని ఉమ వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి వివరాలను సేకరించారు. -
మృత్యు వేగం
మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం గొల్లపూడి శివారులో ఘోర ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదం ట్రావెల్స్ నిర్లక్ష్యమూ ఘటనకు కారణం మద్యం మత్తు.. ఆపై మితి మీరిన వేగం.. పైగా విద్యార్థులతో ఘర్షణ... వెరసి నలుగురు వైద్య విద్యార్థుల విలువైన జీవితాలను డ్రైవర్ చిదిమేశాడు. ఇదే ప్రమాదంలో తాను కూడా మరణించి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాడు. అప్పటికే అతడు మద్యం తాగి ఉన్నట్లు పసిగట్టిన విద్యార్థులు బస్సును వేగంగా నడపవద్దంటూ పదేపదే చెప్పినా వారి మాటల్ని ఖాతరుచేయలేదు. ఇదే విషయాన్ని ట్రావెల్స్ యాజమాన్యానికి చెబితే వారు కూడా స్పందించలేదు. ఫలి తంగా ఈ ఘోరం జరిగింది.. ఆయా కుటుంబాల్లో విషా దాన్ని నింపింది. విజయవాడ సిటీ/భవానీపురం : గుంటూరుకు చెందిన వేముల శివశంకర్ హైదరాబాద్‌లో ఉంటూ ధనుంజయ్ ట్రావెల్స్‌లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. పదేళ్లుగా ఇదే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన మెడికో అంతర్ కళాశాలల స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 46 మంది వైద్య విద్యార్థులు సోమవారం ఉదయం ధనుంజయ్ ట్రావెల్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో బయలుదేరేందుకు సిద్ధమవగా.. కొందరి విద్యార్థుల నగదు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు కనిపించలేదు. డ్రైవర్‌ను గట్టిగా నిలదీయగా తెలియదని బుకాయించాడు. క్లీనర్ కోసం ప్రయత్నిస్తే కనిపించలేదు. ఎట్టకేలకు క్లీనర్ మొబైల్ నంబర్‌ను గుర్తించి ఫోన్ చేశారు. తర్జనభర్జనలు జరిగాక విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్దకు వస్తే తీసుకున్న వస్తువులు తిరిగిచ్చేస్తానంటూ క్లీనర్ చెప్పాడు. ఆ మేరకు అదే బస్సులో వీరు విజయవాడ చేరుకుని పాత బస్టాండ్ సమీపంలో కొద్దిసేపు వేచి ఉన్నారు. క్లీనర్ వచ్చిన తర్వాత సామగ్రి తీసుకుని తమతోపాటు బస్సులో ఎక్కించారు. ఇదే సమయంలో ట్రావెల్స్ నిర్వహకులకు సమాచారం ఇచ్చి డ్రైవర్‌ను మార్చాలని చెప్పగా తగిన సమాధానం రాకపోవడంతో ఆ బస్సులో వెళ్లేందుకు విద్యార్థులు సుముఖత చూపలేదు. ఇదే సమయంలో డ్రైవర్ సూచనల మేరకే వాటిని తాను దొంగిలించినట్టు క్లీనర్ తెలిపాడు. విద్యార్థుల ప్రమేయం లేకుండానే బస్సును నడుపుతుండడంపై పలువురు విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వీరి మాటలను ఖాతరు చేయకుండా బస్సును నడుపుతున్నాడు. నగర శివారుకు వెళ్లిన తర్వాత డ్రైవర్ వాలకంతో బెంబేలెత్తిన కొందరు విద్యార్థులు వెళ్లి బస్సు ఆపాలని అరిచారు. ఓ వైపు వీరితో వాదిస్తూనే బస్సును మరింత వేగంగా శివశంకర్ నడిపాడు. నల్లకుంట సమీపంలో బస్సు ఒక్కసారిగా బస్సు డివైడర్‌ను ఢీకొంది. అక్కడ రోడ్డు కొద్దిమేర ఎడమ వైపు మలుపు ఉంటుంది. ఇది గమనించక నేరుగా వెళ్లి డివైడర్‌ను కొట్టి కంగారుపడి వేగంగా ఎడమ వైపు స్టీరింగ్ తిప్పాడు. బస్సు వేగంగా వెళ్లడం, పవర్ స్టీరింగ్ కావడంతో రోడ్డు మార్జిన్లో ఉన్న చెట్టును బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయి తిరగబడింది. డ్రైవర్‌తో పాటు నలుగురు విద్యార్థులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా, 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ట్రావెల్స్ నిర్లక్ష్యం.. ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సామగ్రి చోరీతో పాటు డ్రైవర్ ప్రవర్తనపై సాయంత్రమే విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. పదే పదే సమాచారం ఇచ్చినా వారు సక్రమంగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పైగా గట్టిగా నిలదీస్తే సూర్యాపేటలో డ్రైవర్‌ను మార్చుతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. విద్యార్థుల సమాచారంపై యాజమాన్యం స్పందించినట్టయితే విజయవాడలోనే ఆగిపోయేవారు. మరో డ్రైవరు వచ్చేవరకు వేచి చూసే వాళ్లమని విద్యార్థులు చెబుతున్నారు. గతంలో కూడా ధనుంజయ్ ట్రావెల్స్ నిర్వాహకులపై పలు ఆరోపణలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. హైదరాబాద్ నల్లకుంట ప్రధాన కార్యాలయంగా దూర ప్రాంత బస్సులకు ఓల్వో బస్సులను వీరు నడుపుతుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి దీపక్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మాట్లాడుకున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు చేరడానికి ధనుంజయ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
విజయవాడ : విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీచైతన్య కాలేజీ సమీపంలో నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం కాల్వలోకి దూసుకు వెళ్లింది. అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణీకులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు నల్గొండ నుంచి విజయవాడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్రేన్ల సాయంతో బస్సును కాల్వ నుంచి బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. -
ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న లారీ
విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ట్రావెల్స్ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
విజయవాడ : విజయవాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గొల్లపూడిలోని ఫ్రీడం రిఫైండ్ ఆయిల్ గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు వ్యాపించాయి. గోదాములో మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
గొల్లపూడి వద్ద దేవినేని ఉమ అరెస్ట్
విజయవాడ : టీడీపీ మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్ష చేయటానికి శిబిరానికి బయల్దేరిన ఆయనను గొల్లపూడి హైవే వద్ద శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దేవినేని ఉమను పోలీసులు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ నాయకుడిని తక్షణమే విడుదల చేయాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు .దాంతో విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా అవనిగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దేవినేని ఉమ దీక్షకు అనుమతి లేదని, అందువల్లే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీక్షకు అనుమతి లేదని తాము ముందు నుంచి చెబుతున్నామని, అయినా దేవినేని ఉమ దీక్షకు బయల్దేరటంతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దీక్ష అనుమతికి ఎన్నికల కమిషన్ కు లేఖ రాశామని, ఈసీ అనుమతి లభిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.