విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కేశినేని ట్రావెల్స్కు చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ట్రావెల్స్ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న లారీ
Published Sun, May 31 2015 11:19 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement