విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీచైతన్య కాలేజీ సమీపంలో నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం కాల్వలోకి దూసుకు వెళ్లింది.
విజయవాడ : విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీచైతన్య కాలేజీ సమీపంలో నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం కాల్వలోకి దూసుకు వెళ్లింది. అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణీకులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు నల్గొండ నుంచి విజయవాడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
క్రేన్ల సాయంతో బస్సును కాల్వ నుంచి బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తోపాటు ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.