shad nagar
-
వెలమలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.వెలమ సామాజికవర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం పద్దతి కాదన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం ఖండిస్తోందని.. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వాడిన భాషతో వెలమ సామాజికవర్గ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. -
మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్మెంట్ రూ.లక్ష!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ సాయిబాబా హోటల్లో దారుణం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని కుటుంబం ఆసుపత్రి పాలైంది. కలుషిత బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురైయ్యారు. శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు.ఖమ్మంలో..ఖమ్మం నగరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఒక హోటల్లో వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్‌లో కల్తిని గుర్తించారు.వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్‌లో ఫంగస్‌ను గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నఇలాంటి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ అతిపెద్ద స్కాం: రాహుల్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఏ ప్రాజెక్టులో జరగని అవినీతి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం చేసిన దోపిడీ సొమ్ము ప్రజలకిస్తామన్నారు. కంప్యూటరైజేషన్ పేరుతో ధరణిలో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2500 జమ చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500తో పాటు 500కే సిలిండర్ వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమని రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎక్కడికైనా వెళ్లేందుకు బస్సు చార్జీలకే రూ. 1000-1500 ఖర్చు అవుతుందని ఆ ఖర్చుల బాధలను తగ్గించేందుకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనపై 24 కేసులు పెట్టాయని, వాళ్లు దేశాన్ని విభజించాలని చూస్తే.. నేను మాత్రం దేశాన్ని కలిపి ఉంచాలని చూస్తానన్నారు. ధరణితో 25 లక్షల మంది రైతుల భూములను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశంలో కులగణన జరగాల్సిందేనని.. ఓబీసీలకు అధికారాన్ని ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్లు నిరాకరిస్తున్నాయని.. అందుకే బీసీ కులగణనకు ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడతామని ప్రకటించారు. అదే విధంగా కేంద్రంలో అధికారం చేపట్టగానే హిందూస్థాన్ అంతా కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు -
యువతి నుదిట సింధూరం.. యువకుడి పాలిట మరణ శాసనం
సాక్షి, క్రైమ్: షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. బలవంతంగా యువతి నుదట దిద్దిన సింధూరం!.. ఓ యువకుడిపాలిట మరణ శాసనమైంది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. సినీ ఫక్కీలో పక్కా మర్డర్‌కు ప్లాన్ వేసి మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు. బీహార్‌కు చెందిన కరుణాకర్ కుటుంబం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్ కనిపించకుండా పోయాడు. దీంతో.. అతని సోదరుడు దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే కరుణాకర్‌ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. రంజిత్ కుమార్ కూతురిపై కరుణాకర్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని రంజిత్ రగిలిపోయాడు. కరుణాకర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగష్టు 15వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి పిలిపించుకున్నాడు. విచక్షణా రహితంగా కరుణాకర్‌పై దాడికి దిగాడు. కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. దర్యాప్తు ద్వారా ఈ కేసును చేధించామని, ప్రధాన నిందితుడు రంజిత్‌తో పాటు అతనికి సహకరించిన వాళ్లనూ అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. వాళ్లను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. -
రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. -
తాళం వేస్తే చాలు.. ఇదేమి తలాంగు తకధిమి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీలో గుండ్ల శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీలు జరిగాయి. ఇంటికి తాళం వేస్తే చాలు చోరీలు జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో రెండుసార్లు వరుస చోరీలు జరుగుతుండటంతో ఈ చోరులు పోలీసులకు సవాల్ విసురుతున్నట్టు ఉంది. ఫిబ్రవరి 9న ఇదే ఇంట్లో చోరీ జరిగినట్టు షాద్ నగర్ పట్టణ సిఐ నవీన్ కుమార్ ఇదివరకే మీడియాకు తెలిపారు. బాధితుడు శేఖర్ గౌడ్ పనిమీద భార్యతో పాటుగా ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. గత బుధవారం ఉదయం తిరిగి షాద్ నగర్ లోని తన ఇంటికి వచ్చే చూసే సరికి ఇంటి డోర్ తాళం పగల గొట్టబడి ఉన్నదని పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా కబోర్డులో ఉన్న బంగారం 2.5 తులాలు, 6 గ్రాముల వెండి ఆభరణాలు దొంగలించుకొని పోయారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
తగ్గనున్న ప్రయాణ సమయం: ఫాస్ట్ ఫాస్ట్‌గా బెంగళూరుకు..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది.. కానీ అడుగడుగునా రెడ్ సిగ్నల్ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఎదురుగా మరో ఎక్స్‌ప్రెస్ వస్తుంటే ఏదో ఓ స్టేషన్ లూప్లైన్లో నిలిచిపోవాల్సిందే. గంటలో మహబూబ్‌నగర్ చేరుకోవాల్సిన రైలు గంటన్నరకుపైగా సమయం తీసుకుంటుండటం కూడా ఈ సమస్యలో భాగమే. ఇక ఈ విసుగు ప్రయాణానికి కాలం చెల్లింది. త్వరలో ఈ మార్గంలో అనవసర సిగ్నళ్లులేని ప్రయాణానికి మార్గం సుగమమవుతోంది. తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టులో డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేసుకుని సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహబూబ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. డిసెంబరు నాటికి రెండు వరసల మార్గం అందుబాటులోకి రాబోతోంది. ఈ మార్గం పూర్తయితే కర్నూలు, తిరుపతి, బెంగళూరుకు భారీగా ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పనులు.. సికింద్రాబాద్ నుంచి 113 కి.మీ. దూరంలో ఉన్న మహబూబ్‌నగర్‌కు సింగిల్ రైలు మార్గం మాత్రమే ఉంది. కీలక బెంగళూరు మార్గం అయినప్పటికీ దీన్ని రెండు వరుసలకు విస్తరించాలన్న ప్రాజెక్టు కలగానే మిగులుతూ వచ్చింది. ఫలితంగా ఈ మార్గంలో ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌లు నడపాల్సిన డిమాండ్ ఉన్నా, నడపలేని దుస్థితి. అత్యంత రద్దీ ఉండే తిరుపతికి కూడా ఈ మార్గంలో అదనపు రైళ్లు వేయాల్సి ఉంది. కానీ సింగిల్ లైన్ కారణంగా నడపలేని పరిస్థితి. ఈ తరుణంలో రైల్వేశాఖ 2015–16లో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇది పూర్తయితే బెంగళూరుకు దాదాపు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు ఓ ప్రాజెక్టుగా, అటు డోన్ నుంచి మహబూబ్‌నగర్‌కు మరో ప్రాజెక్టుగా దీన్ని పూర్తి చేసేలా అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ సమీపంలోని ఉందానగర్ వరకు 28 కి.మీ. డబ్లింగ్ పనులను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించి ఎంఎంటీఎస్ రెండో దశలో చేర్చి దాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఉందానగర్ నుంచి 85 కి.మీ. దూరంలోని మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభించి తాజాగా గొల్లపల్లి వరకు పూర్తి చేశారు. అక్కడి నుంచి మరో 25 కి.మీ. మేర పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులను డిసెంబరులోపు పూర్తి చేసేలా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఇక రైళ్ల వేగం.. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని పెంచుతూ ఇటీవల రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్వర్ణ చతుర్భుజి, వజ్ర వికర్ణ కారిడార్లలో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, మహబూబ్‌నగర్ మార్గంలో సగటు వేగం 60 కి.మీ. నుంచి 80 కి.మీ. దాటడం లేదు. ఇప్పుడు ఈ మార్గంలో రెండో లైన్ వస్తే ఏకకాలంలో ఎదురెదురు రైళ్లు ఏదీ నిలిచిపోకుండా పరస్పరం క్రాస్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇక విద్యుదీకరణ పూర్తి చేయటం వల్ల మరో జాప్యం కూడా తొలగనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ (ఇంజిన్)తో వచ్చే రైళ్లు ఈ మార్గంలోకి వచ్చేసరికి ఆగిపోయి డీజిల్ ఇంజిన్‌ను తగిలించుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇది కూడా కొంత ఆలస్యానికి కారణమవుతోంది. ఇప్పుడు పూర్తి నిడివి ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపొచ్చు. చదవండి: వావ్.. ఈ రైలు అంత దూరం వెళ్తుందా! -
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ముల మృతి
సాక్షి, షాద్‌నగర్ : సరదాగా గడిపేందుకు చేపల వేటకు బయలుదేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు.. మరో వ్యక్తి స్నేహితుడు. వీరంతా హైదరాబాద్ రహమత్‌నగర్ హబీబ్ ఫాతీమానగర్ ఫేజ్–1 బస్తీవాసులు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బోరబండకు చెందిన సొంత అన్నదమ్ములు జీషాన్(24), హన్నన్(22). వీరి స్నేహితులైన మలక్‌పేటకు చెందిన సయ్యద్ ఉబేర్(20), బంజారాహిల్స్ నివాసి హరీస్(21) ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. సెలవు రోజు సరదాగా గడపాలనుకున్నారు. తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని తమ బంధువుల ఫాంహౌస్ దగ్గర చేపల వేట కోసం స్విఫ్ట్ కారులో బయలుదేరారు. షాద్‌నగర్ సమీపంలోని అనూస్ పరిశ్రమ ఎదురుగా జాతీయ రహదారిపై వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపు బెంగళూరు వైపు నుంచి కారు విడిభాగాల లోడుతో నగరానికి వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాదంలో అన్నదమ్ములైన జీషాన్, హన్నన్‌తోపాటు సయ్యద్ ఉబేర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన హరీస్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు షాద్‌నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతులు అవివాహితులని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది
సాక్షి, షాద్‌నగర్ : ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది... ఓ అమ్మాయి పట్ల జరిగిన దారుణ మారణ కాండ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది.. దిశ ఉదంతం.. మహిళ రక్షణ దిశగా పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులలో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికి ఏడాది అయ్యింది. ప్రతి ఒక్కరినీ కదిలించి కన్నీటితో ముంచిన ఈ ఘటన తరువాత జరిగిన పరిణామాలను ఓసారి నెమరేసుకుంటే.. 2019 నవంబర్ 27న సుమారు 8.30 గంటల ప్రాంతంలో అత్యవసర పరిస్దితుల్లో స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్ళిన దిశ నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఓ పాడు పడిన ప్రహరి పక్కకు తీసుకెళ్ళి దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రాణాలను సైతం బలితీసుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్ శివారులోని చటాన్‌పల్లి బైపాస్ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్ 28న తెల్లవారే సరికి దిశ పట్ల జరిగిన దారుణం నలుదిశలా పాకింది. ఈ దారుణం ప్రతి గుండెను కదిలించింది. ఆ రోజు రాత్రే నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (దిశ.. కొత్త దశ) ఎన్నో మలుపులు దిశ హత్యోదంతం తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. నిందితులను పోలీసులు నవంబర్ 29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకరావడంతో ఇక్కడే వారిని ఎన్కౌంటర్ చేయాలని వేలాది మంది జనం పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాను నిర్వహించారు. పోలీసుల పైకి ఆందోళన కారులు రాళ్లురువ్వడం, చెప్పులు విసరడంతో లాఠీ చార్జీ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదేరోజు నిందితులను తహిసీల్దార్ ఎదుట హాజరు పర్చారు. దీంతో 14రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్‌నగర్ నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. డిసెంబర్ 2న నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు షాద్‌నగర్ కోర్టులో ఫిటీషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 3న కోర్టు పదిరోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. హంతకులు ఉపయోగించిన లారీలో కీలమైన ఆధారాలను డిసెంబర్ 5న సేకరించారు. షాద్‌నగర్ డిపో ఆవరణలో ఉంచిన లారీలో క్లూస్‌టీం బృందం ఆధారాలను సేకరించింది. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దీంతో నిందితులు పోలీసుల పైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. నలుగురు నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. డిసెంబర్ 7న ఢిల్లీ నుండి మానవహక్కుల కమీషన్ బృందం దిశను ఆహుతి చేసిన ప్రాంతాన్ని, నిందితులు ఎన్కౌంటర్ జరిగిన స్ధలాన్ని పరిశీలించారు. డిసెంబర్ 9న దిశనను హతమార్చిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని క్లూస్‌టీం 3డీ స్కానర్‌తో చిత్రీకరించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన క్లూస్‌టీం బృందం చటాన్‌పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని పరిశీలించారు. దిశను దహనం చేసిన ప్రదేశంతో పాటుగా, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని పూర్తిగా 3డీ స్కానర్‌తో చిత్రీకరించారు డిసెంబర్ 11,15 తేదీల్లో క్లూంటీం బృంందాలు ఎన్కౌంటర్ ఘటనా స్ధలానికి వచ్చి మరిన్ని ఆధారాల కోసం వెతుకులాడాడు. డిసెంబర్ 23న ఎన్‌కౌంటర్‌కు గురైన మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ నిమిత్తం గత జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. (వారిని ఏ తుపాకీతో కాల్చారు?) చట్టాలకు దిశ జాతీయ రహదారి పై టోల్ గేట్‌కు కూత వేటు దూరంలో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాలుగా మారింది. పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ నేపధ్యంలోనే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ మహిళ రక్షణ దిశగా పోలీసులు కొత్త అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగ రిత్యా బయటికి వెళ్లే మహిళల స్వీయ రక్షణ కోసం యాప్‌లు ఏర్పాటు చేయడం, కళాశాలల్లో మహిళా రక్షణ దిశగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకరావడం మహిళల నుండి పిర్యాదులు వస్తే వెంటనే స్వీకరించడం, వెంటనే దర్యాప్తు ప్రారంభించడం వంటి కార్యక్రమాలను విసృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. మరో వైపు పోలీసుల అప్రమత్తత దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా ఏడాది కాలంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అయితే మహిళలు కూడ ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పరిస్ధితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్ధించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు -
రంగారెడ్డి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
-
కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలును బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్వీకరించారు. షాద్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సంతోష్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ మట్టిమనుషులని, మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉందని కొనియాడారు. తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ఐదారేండ్లలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చారని అన్నారు. (ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మరికొంత మందికి ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసిరారు. ఈ జాబితాలో కన్నడ నటుబు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష ఉన్నారు. తన అభిమానులకు కూడా మొక్కలు నాటి, పది మందితో మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా హరితహారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలువురు ప్రముఖులు సైతం మొక్కలు నాటుతున్నారు. -
ప్రేమ వ్యవహారం: తల్లీకూతుళ్ల బలి
సాక్షి, షాద్‌నగర్: కుమార్తెను బాగా చదివించాలనుకున్నారు ఆ తలిదండ్రులు.. భవిష్యత్‌లో మంచి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు.. కానీ, ఆ అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమ వ్యవహారం ఆ ఇంట్లో ఇద్దరిని బలి తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మొగిలిగిద్ద గ్రామానికి చెందిన స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసు అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై స్రవంతి (17), ఆమె తల్లి చంద్రకళ (35) తరచూ గొడవపడుతుండేవారు. ఈ నెల 15న తల్లీకూతురు మళ్లీ ఘర్షణ పడ్డారు. అదే సమయంలోనే చంద్రకళ భర్త పాండు ఇంటికి వచ్చీరాగానే స్రవంతిపై కిరోసిన్ పోయడానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న చంద్రకళపై కూడా కిరోసిన్ పడింది. ప్రేమ వ్యవహారంపై కోపంతో ఉన్న చంద్రకళ.. కూతురుకు నిప్పంటించగా తనకు కూడా మంటలంటుకున్నాయి. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పాండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణమా? మొగిలిగిద్ద గ్రామానికి చెందిన చంద్రకళ దంపతులకు ఒక కుమార్తె స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త పాండు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటర్ చదువుతున్న స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసుతో ప్రేమలో పడింది. అయితే వారిని తల్లిదండ్రులు మందలించడంతో ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయారు. పెద్దలు నచ్చచెప్పి వీరిని మళ్లీ గ్రామానికి తీసుకువచ్చారు. తర్వాత కూడా వీరిలో మార్పురాకపోవడంతో తల్లిదండ్రులు కుమార్తెను పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే తండ్రి క్షణికావేశంలో చేసిన పని ఇద్దరి మృతికి కారణం కాగా, తండ్రిపై కేసు నమోదు కావడంతో కుటుంబం ఛిన్నాభిన్నమైంది. -
వీడిన రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా రాంచంద్రారెడ్డి సమీప బంధువు ఐనా ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు కిడ్నాప్‌కు పాల్పడి అనంతరం హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య!) షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూ వివాదమే హత్యకు కారణంగా కాగా, దీని వెనుక ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాంచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనను షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హతమార్చారు. నిన్న షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాంచంద్రారెడ్డి హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పుత్తడి బొమ్మకు పుస్తెల తాడు
సాక్షి, షాద్‌నగర్ : బాల్య వివాహాలను రూపుమాపాలని ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తెచ్చినా సమాజంలో ఏమాత్రం మార్పు రావడంలేదు. రాజధాని సమీపంలో జరిగిన ఓ బాల్యం వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో 12 ఏళ్ల బాలికను 37 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంలో బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి పత్తాలేకుండా పారిపోయాడు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యవారి పల్లి గ్రామానికి చెందని మల్లేష్ (37)కు కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. ఇటీవల అతని భార్య అత్మహత్య చేసుకుంది. అయితే మల్లేష్ అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా సమ్మతి తెలపడంతో మే 15న వీరికి రహస్యంగా వివాహం జరిగింది. అయితే బాలికకు పెళ్లి జరిగిందన్న ముచ్చట గ్రామంలో ఆనోటా ఈ నోటా పాకింది. ఈ విషయం షాద్ నగర్ ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో విచారణ ప్రారంభించారు. అధికారులు వస్తున్నారన్న సమాచారం అందటంతో కొత్త పెళ్లికొడుకు పరారయ్యాడు. సీడీపీఓ అధికారి నాగమణి గ్రామానికి వెళ్లికి విచారణ చేశారు. అనంతరం బాల్యం వివాహం జరిపిన బాలిక తల్లిదండ్రులను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం మైనర్ బాలినకు హైదరబాద్‌లోని ప్రగతి వెల్ఫేర్ కేంద్రానికి తరలించారు. మల్లేష్‌పై కేసు నమోదు చేశారు. -
దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ స్థలం వద్ద పహారా
సాక్షి, షాద్‌నగర్: దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో షాద్‌నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. త్రిసభ్య కమిటీ సభ్యులు దిశను దహనం చేసిన స్థలంతో పాటు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. నవంబర్ 27న దిశను హత్య చేసిన నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును నవంబర్ 29న పోలీసులు అరెస్టు చేసి అదే రోజు రాత్రి షాద్‌నగర్‌కు తీసుకొచ్చారు. షాద్‌నగర్ కోర్టులో జడ్జి అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్‌ను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి నిందితులను 30న తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. చటాన్‌పల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం అదేరోజు నిందితులకు తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 2న కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత సీన్ రీకన్‌క్ష్రషన్ నిమిత్తం వారిని డిసెంబర్ 6న అర్ధరాత్రి చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీçసుకువచ్చారు. నిందితులు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు చనిపోయిన విషయం విదితమే. అప్రమత్తమైన పోలీసులు ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిటీ షాద్‌నగర్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్కౌంటర్ జరిగి 58 రోజులు గడుస్తున్నా ఘటనా స్ధలానికి ఎవరికి వెళ్లకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా దారి మూసేశారు. పోలీసులు ప్రత్యేంగా గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
దిశ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం
-
దిశకేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్
-
దిశ కేసు: గాయపడ్డ పోలీసులను ఎన్హెచ్ఆర్సీ విచారణ
-
ఎన్కౌంటర్ ప్రదేశం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరణ
సాక్షి, షాద్‌నగర్ : దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని క్లూస్ టీం సోమవారం మధ్యాహ్నం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరించింది. 8 మంది సభ్యులతో కూడిన బృందం ప్రతినిధులు చటాన్‌పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దిశను దహనం చేసిన స్థలంతో పాటు హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతాన్ని పూర్తి త్రీడీ స్కానర్‌తో చిత్రీకరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశ స్వభావం మారిపోయినా గుర్తించేందుకు వీలుగా క్లూస్‌టీం సభ్యులు ఆ ప్రాంతాన్ని మొత్తం స్కాన్ చేసి వీడియో చిత్రీకరణ చేయడంతో పాటుగా ఫొటోలు తీసుకున్నారు. ఎన్కౌంటర్ ఘటనాస్థలం వద్ద మరిన్ని ఆధారాలు సేకరించారు. సుమారు రెండున్నర గంటల పాటు టీం సభ్యులు ఇక్కడే ఉన్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సుమారు 50 మంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా జాతీయ రహదారి వద్దే జనాన్ని కట్టడి చేస్తున్నారు. -
వారిని ఏ తుపాకీతో కాల్చారు?
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. తొలుత దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వరకు పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయా రు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు లేకపోవడంపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్‌లను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా.. పెద్ద గన్స్ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్ ఓపెన్ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అన్న విషయాలపై ఎన్హెచ్ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్కౌంటర్లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు. ముగ్గుర్ని తూర్పు వైపు నుంచి.. ఎన్కౌంటర్లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్ఎల్ఆర్ తుపాకులతోనే కాల్చా రు. ఈ ఘటనలో చటాన్‌పల్లి బ్రిడ్జి నుంచి పారిపోతున్న నిందితులను లొంగిపొమ్మని హెచ్చరిస్తూ.. వెంబడించిన పోలీసులు రెండువైపులా చుట్టుముట్టారు. అయినా నిందితులు కాల్పులు ఆపకపోవడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఆరిఫ్, శివ, నవీన్ ముగ్గురిని పోలీసులు తూర్పు వైపు నుంచి కాల్చారు. అందుకే, వారి తలలు పడమర వైపు వాలి ఉన్నాయి. అంటే పోలీసుల తూటాలు వారికి ఎదురుగా వచ్చి తగిలినట్లు తెలుస్తోంది. ఇక చెన్నకేశవులుకు మాత్రం బుల్లెట్లు వెనక నుంచి వచ్చి తగిలినట్లుగా అతని శరీరం పడి ఉన్న తీరు చెబుతోంది. అందుకే, ఇతని ఒక్కడి తల మాత్రం తూర్పు వైపు వాలి ఉంది. గాయం ఆధారంగా చెప్పొచ్చు..! నిందితుల పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు ఏ తుపాకీతో కాల్చింది చెప్పగలరు. తూటా గాయం ఆధారంగా చేసుకుని, శరీరాన్ని తగిలిన చోట, వెలుపలికి వచ్చిన ప్రాంతంలో ఏమేరకు గాయం చేసింది అన్న విషయాలను ఆధారంగా చేసుకుంటారు. సాధారణంగా ఏ బుల్లెటయినా శరీరాన్ని తగి లిన చోట మామూలు వ్యాసార్థంలో.. వెలుపలికి వచ్చినపుడు అందుకు రెట్టింపు వ్యాసార్థం లో గాయాలను ఏర్పరుస్తాయి. అదే సమయం లో గాయంపై ఉన్న గన్‌పౌడర్ రెసిడ్యూ (జీపీఆర్) ఆధారంగా చెప్పగలరు. గాయం తగిలిన విధానాన్ని బట్టి, అది ఏ దిశ నుంచి దూసుకొచ్చింది.. ఎంత దూరం నుంచి వచ్చింది.. కచ్చితంగా చెప్పే పరిజ్ఞానం మన ఫోరెన్సిక్ నిపుణుల వద్ద ఉంది. వీరిని ఫోరెన్సిక్ బాలిస్టిక్ ప్రొఫెసర్లు అని పిలుస్తారు. ఈ ఎన్కౌంటర్లో వీరు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఘటనాస్థలి వద్ద బందోబస్తు.. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 59 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా దిశను దహనం చేసిన చోటు, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే పోలీసులు ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా జాతీయ రహదారి వద్దనే కట్టడి చేస్తున్నారు. ‘ఎన్కౌంటర్’పై సీన్ రీకన్స్ట్రక్షన్ షాద్‌నగర్ : దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్కౌంటర్ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు.. ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.. ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయన్న వాటిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. దీనిని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. -
బుల్లెట్ల కోసం పోలీసుల గాలింపు
సాక్షి, షాద్‌నగర్ : దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం ప్రత్యేక బృందాలు శనివారం ఉదయం గాలించాయి. చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలోని ఘటనా స్థలంలో మెటల్ డిటెక్టర్ల సాయంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వెతికారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులకు మొత్తం 12 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోలీసులు వారిపై మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో పడిన బుల్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు వాటి కోసం చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఎన్ని బుల్లెట్లు లభించాయనే వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. -
మరోసారి ఉలిక్కిపడ్డ షాద్‌నగర్
షాద్‌నగర్‌టౌన్: షాద్‌నగర్ మరోసారి ఉలిక్కిపడింది. మూడేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నయీంను షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్ ఇళ్ళ మధ్య ఎన్కౌంటర్ చేయగా..దిశ హత్యకేసు నిందితుల్ని చటాన్‌పల్లి శివారులో జాతీయ రహదారి పక్కన కాల్చిపారేశారు. ఈ రెండు ఘటనలు పోలీసుల చెర నుంచి నిందితులు తప్పించుకుని వెళ్తున్నప్పుడు జరిగినవే. ఈ రెండు ఘటనలు కూడా షాద్‌నగర్ ప్రాంత వాసులకు ఉదయం 7గంటల ప్రాంతంలో తెలిశాయి. తాజాగా ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో షాద్‌నగర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. -
నా కూతుర్ని చంపిన వాళ్లింకా బతికే ఉన్నారు
ఏడు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగింది. ఆ కేసులో నిందితులకు విధించిన శిక్ష ఇప్పటివరకు అమలు జరగలేదు. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణలో ‘దిశ’ నిందితులు నలుగురూ సరిగ్గా వారు ‘హత్యాచారానికి’ పాల్పడిన వారానికి ఎన్కౌంటర్ కావడం పట్ల ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి సంతోషం వెలిబుచ్చారు. ‘‘ఆ నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారన్న విషయం విన్నాను. అసలు ఎలా జరిగిందా అనుకున్నాను. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. పరుగెత్తుకుంటూ వచ్చి టీవీ పెట్టాను. నిజమే!! హైదరాబాద్ పోలీసులకు నమస్కరిస్తున్నాను. వారి చర్యను స్వాగతిస్తున్నాను, దిశపై అత్యాచారం చేసిన నిందితులకు సరైన శిక్ష పడిందని భావిస్తున్నాను. ఈ ఎన్‌కౌంటర్‌తో ‘దిశ’ ఆత్మ శాంతించే ఉంటుంది. అయితే నా కుమార్తె విషయంలో కూడా నేరస్థులకు తక్షణం శిక్ష అమలు కావాలని నేను ఏడేళ్లుగా కోరుకుంటున్నా నాకు న్యాయం దక్కలేదని ఆవేదనగా ఉంది. నిర్భయ కేసులో దోషులుగా తేలినవారు ఇంకా బతికే ఉన్నారనే విషయాన్ని నేను పదేపదే గుర్తు చేయవలసి వస్తోంది. నా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష అమలు చేసినప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ ఏడేళ్లూ నేను నిర్భయకు న్యాయం చేయాలని కోరుతూ చాలామందినే కలిశాను. అందరూ హామీ ఇచ్చారే కాని, ఆచరణ మాత్రం శూన్యమే. ఇప్పుడు దిశ కేసులో జరిగిన ఎన్కౌంటర్ తర్వాతైనా నిర్భయ నిందితులకు వెంటనే ఉరిశిక్షను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయవ్యవస్థను మరోసారి అభ్యర్థిస్తున్నాను. అత్యాచారం తర్వాత నా కూతురు పదిరోజులు బతికే ఉంది. ప్రతిరోజూ కొద్ది కొద్దిగా మరణించడం నా కళ్లతో చూస్తూ ఉండిపోయాను. పది రోజుల పాటు, ఆమెకు కనీసం చెంచాడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను’’ అంటూ బరువైన హృదయంతో మీడియాతో అన్నారు ఆశాదేవి. 2012 డిసెంబర్ 16న జరిగిన సంచలనాత్మక ‘నిర్భయ’ ఘటనలో అత్యాచారం, హత్య, కిడ్నాప్, దోపిడీ, దాడి వంటి పలు కేసుల కింద అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులలో ఒకరు బాలనేరస్థుడు. జైల్లోనే అతడి శిక్షాకాలం పూర్తవడంతో విడుదల చేశారు. మిగిలిన ఐదుగురిలో రామ్‌సింగ్ అనే నిందితుడు విచారణ జరుగుతున్న కాలంలోనే చనిపోయాడు. మిగతా నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే ఇంతవరకు ఆ శిక్ష అమలు అవలేదు. దీనిపై ఈ నెల 13న ఆశాదేవి మళ్లీ కోర్టును ఆశ్రయించబోతున్నారు. ‘‘వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉందని వస్తున్న వార్తలు నా మనసును కలచివేస్తున్నాయి. అదే నిజమైతే నా కూతురి ఆత్మకు శాంతి చేకూరదు’’ అని ఆశాదేవి అన్నారు. -
ప్రియాంక హత్య: కిషన్ రెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితుకుల ఉరి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు త్వరలోనే మార్పులు చేయబోతున్నట్టు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మార్పులు తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని.. ఇకనుంచి అలాంటి ప్రక్రియ లేకుండా చేస్తామని అన్నారు. ట్రయల్ కోర్టులో విధించిన తీర్పును మధ్యలో మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలను మారుస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై లోక్‌సభలో కూడా ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం112 ప్రత్యేక యాప్‌లను రూపొందించామని, ప్రతీ మహిళా ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
షాద్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరంతా స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరారు. అయితే షాద్ నగర్ టోల్గేట్ వద్దకు రాగానే ముందు వెళుతున్న మరో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో మారుతి ఎరిక్టా కారు అదుపు తప్పింది. దీంతో కారు సుమారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘కేసీఆర్ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం’
సాక్షి, షాద్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ నేతలను తెలంగాణలో ఎలా పుట్టారో అంటున్నారని, కేసీఆర్ ఆయన జిల్లాలో ఎలా పుట్టారో తాము కూడా తమ జిల్లాలో అలానే పుట్టామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం షాదనగర్ మండలం చౌదరి గూడలో జరిగిన జలసాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా.. అమెరికాలో ఇంజనీర్ సదివిన.. కానీ కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ మాత్రం అర్థం కావడం లేదు. మా ప్రాంతానికి నాలుగు నెలల్లో నీళ్లు తెస్తే కేసీఆర్‌కు గుడి కడతా. మృగశిర పండుగ తరువాత చంద్రశిర పండగ చేస్తాం. ఇచ్చిన మాట తప్పితే... చంద్రశిర ఖండన చేద్దాం’’ అంటూ ధ్వజమెత్తారు. -
బుల్లెట్‌పై వచ్చి.. ఒంటిమీద పెట్రోల్ పొసుకొని..
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ మీద వచ్చిన ఓ యువకుడు షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల చౌరస్తాలో ఆగాడు. రోడ్డుమీద వెళ్తున్న జనం.. చూస్తుండగానే... అతను తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకుని అంటించుకున్నాడు. స్థానికులు తేరుకుని.. మంటలు ఆర్పే సమయానికి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బైక్‌పై విష్ణువర్థన్‌రెడ్డి, మేడ్చల్ అని ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
ఆవిరైన ఆశలు
షాద్‌నగర్‌రూరల్: కన్న కూతురుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు.. విద్యాబుద్దులు నేర్చి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలుస్తుందని కలలు కన్నారు.. కానీ ఆ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. భవిష్యత్తును తేల్చే పరీక్షలను రాసి తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబలించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శనివారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకంది. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండలం పర్వతాపూర్‌కు చెందిన మంగలి శ్రీనివాసులు, అనురాధ దంపతుల కూతురు మంగలి స్రవంతి(17) షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజూ పర్వతాపూర్ నుంచి షాద్‌నగర్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా శనివారం విశ్వభారతీ జూనియర్ కళాశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాలనీ మీదుగా బస్టాండ్‌కు బయలుదేరింది. మోర్ సూపర్ మార్కెట్ ఎదుట నుంచి ఆర్టీసీ కాలనీకి వెళ్లే మార్గంలో ఇనుప రాడ్డులతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యార్థిని స్రవంతిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇనుప లోడుతో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ స్రవంతి తలపై నుంచి వెళ్లడంతో తల పూర్తిగా చిట్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్రవంతి మృతదేహన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
షాద్‌నగర్ బాద్షా ఎవరో..!
షాద్‌నగర్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కలిసిన అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్కు పట్టం కట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ముఖ్యంగా నలుగురి మధ్యే గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి(కాంగ్రెస్), బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల నడుమ హోరాహోరీ పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్యయాదవ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అండతో కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీర్లపల్లి శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఏనుగు గుర్తుతో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన శ్రీవర్ధన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య: 17 ప్రధాన అభ్యర్థులు నలుగురు ఎల్గనమోని అంజయ్యయాదవ్ (టీఆర్ఎస్) చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్) నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి (బీజేపీ) వీర్లపల్లి శంకర్ (బీఎస్పీ) సాక్షి, షాద్‌నగర్: తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఎల్గనమోని అంజయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా రు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు కృషి చేస్తాయని అంజయ్య యాదవ్ చెబుతున్నారు. నియోజకవర్గంలో వరుసగా ఒక్క శంకర్రావు తప్పా ఇతరులెవరు వరుసగా విజయం సాధించసాధించలేదు. ఈసారి ఆ రికార్డును తాను సమం చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి (కాంగ్రెస్) అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, అధికారంలోకి వస్తే హమీలన్నీ నెరవేరుస్తామని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. కేంద్ర సాయంతో అభివృద్ధి చేస్తాం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నుంచి బరిలో దిగిన నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సాయంతో కనీవిని ఎరగని రీతితో షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రజలకు శాశ్వత తాగు, సాగు నీరు అందించడానికి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తామని శ్రీవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. గత ఎన్నికల్లో తృతీయ స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇస్తూ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పరిపూర్ణనందస్వామి పర్యటనలతో కేడర్‌లో జోష్ పెరిగింది. చాపకింది నీరులా బీఎస్పీ.. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వీర్లపల్లి శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి బీఎస్పీ నుంచి బీఫామ్ దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాలను కలుపుపోతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శంకర్ టీఆర్ఎస్లో ఉండగానే తనకంటూ ఓ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చివరకు పార్టీ టికెట్ నిరాకరించడంతో బీఎస్పీ నుంచి బరిలో దిగారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో అధికార పార్టీకి చెందిన ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
యూటర్న్ తీసుకున్న మాజీ మంత్రి
సాక్షి, రంగారెడ్డి : మాజీ మంత్రి శంకర్రావు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన షాద్‌నగర్ స్థానంలో ఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీపై మనసు మార్చుకున్నట్లు శంకర్రావు తెలిపారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. మహాకూటమి బలపరిచిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్‌పై శంకర్రావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నలభైఏళ్లు పార్టీకి సేవచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని, పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్లు అమ్మకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ మారి 24 గంటలు కూడా కాకముందు ఇలా ప్లేటు ఫిరాయించడంతో ప్రజలు అవాక్కయ్యారు. కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేసిన మరికొంత మంది నేతలు కూడా ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీని కొరకు ఇప్పటికే నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం దూతలను రంగంలోకి దింపినట్లు సమాచారం. -
షాద్‌నగర్‌లో పదో తరగతి విద్యార్ధి కిడ్నాప్
-
నయీం ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : జలధరింపజేసిన పోలీసుల వేట... నయీం గుండెల్లోకి దూసుకెళ్లిన పోలీసుల తూట. స్థానికుల వదనాల్లో భయంతో నిండిన చమట.. ఒళ్లు గగుర్పాటు పొడింపించిన ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నయీం ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా నేటితో రెండేళ్లు పూర్తయింది. వెన్నులో వణుకు పుట్టించిన ఘటనను షాద్‌నగర్ ప్రాంత వాసులు నేటికీ మరిచిపోలేకపోతున్నారు. ఉదయం 6గంటలకు 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ పట్టణ శివారులోని మిలీనియం టౌన్షిప్లో ఒక్కసారిగా పోలీసులు ఓ ఇంటిని చుట్టుముట్టారు. అసలు ఏం జరుగుతుందో కాలనీ వాసులకు అర్థం కాని పరిస్ధితి. భారీ ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు మొహరించారు. తుపాకులెక్కుపెట్టి ఓ వ్యక్తిపై పోలీసులు ఏకదాటిగా కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో హతమైంది కరుడుగట్టిన నేరస్తుడు, వంద కేసుల్లో నిందితుడు, 40హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు నయీం అని ఆ రోజు తెలిసింది. వెంటాడుతున్న జ్ఞాపకాలు షాద్‌నగర్‌లోని మిలీనియంటౌన్‌షిప్ అంటేనే నయీం డెన్‌గా మారిపోయింది. మిలీనియం టౌన్షిప్లో ఇంటిని కొనుగోలు చేసి డెన్‌గా ఏర్పర్చుకొని రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించాడు. గుట్టు చప్పుడు కాకుండా నయీం షాద్‌నగర్‌కు వచ్చి వెళ్లేవాడు. ఇంట్లో ఉండే వారు పెద్దగా బయటికి వచ్చే వారు కాదు. షాద్‌నగర్‌లోని ఇంటికి మామిడితోటగా పేరుపెట్టుకొని దందాలను నిర్వహించేవాడు. భారీ ఎత్తున సెటిల్మెంట్లు, మాటవినని వారిని హత్య చేసేందుకు ఇక్కడ నుండే పథకం రచించేవాడని సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఇప్పటికీ నయీం ఇల్లు మూతే మిలీనియం టౌన్షిప్లో సుమారు రెండు వందల చదరపు గజాల్లో ఉన్న ఇంటిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చెందిన సయ్యద్ సాధిక్‌పాషా పేరుపై 2012లో కొనుగోలు చేశాడు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ఇంట్లో దొరికిన సామగ్రిని వాహనాల్లో తరలించారు. అయితే సుమారు నాలుగేళ్ల పాటు షాద్‌నగర్ నుంచి నయీం కార్యకలాపాలు కొనసాగించాడు. 2016 ఆగస్టు నుంచి నయీం ఇల్లు మూత పడే ఉంది. ఇప్పటికీ నయీం ఇంటి వైపు వెళ్లాలంటే చాలా మంది జంకుతుంటారు. ప్రస్తుతం ఇంటి గేటుకు తాళం వేసి ఇంటి ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి చిందరవందరగా ఉంది. షాద్‌నగర్ మున్సిపాలిటీ వారు మిలీని యం టౌన్ షిప్లో మొక్కలు పెంచేందుకు స్మృతి వనం ఏర్పాటు చేశారు. నయీం ఎన్కౌంటర్ స్మృతి వనం ఎదుట జరిగింది. అయితే ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ఓ బుల్లెట్ స్మృతి వనం గేటుకు తాకడంతో రంద్రం పడింది. బుల్లెట్ తాకి గేటుకు రంద్రం పడిన దృశ్యం నేటికి కనిపిస్తుంది. -
చూడండి సారూ.. మా గోస
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకొని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘హాస్టల్లో భయం భయంగా’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురించిన కథనానికి ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, చేవేళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషితలు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సోమవారం ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి పెచ్చులూడుతున్న భవనాన్ని పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికే విద్యార్థులు హాస్టల్ ఎదుట భైఠాయించారు. విద్యార్థులంతా ఒక్కసారిగా తమ సమస్యలను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే తామందరం ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, మాకు టీసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే హాస్టల్ విద్యార్థులు ఉండేందుకు భవనాన్ని అద్దెకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషిత, ఇన్చార్జి వార్డెన్ సుశీలను ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి గృహంలో ఈ విధంగా సమస్యలు ఉంటే విద్యార్థినులు ఏవిధంగా చదువుకుంటారని వారిని ప్రశ్నించారు. హాస్టల్లో పనిచేసేందుకు కావల్సిన సిబ్బందిని వెంటనే నియమించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఎస్డబ్ల్యూను ఆదేశించారు. వాహనం ఎదుట భైఠాయింపు స్ధానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సీ హాస్టల్లో సమస్యలు నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. హాస్టల్ నూతన భవన నిర్మాణం, సమస్యల పరిష్కారం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినులతో కలిసి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వాహనం ఎదుట భైఠాయించారు. సమస్య పరిష్కారానికి మార్గం చూపే వరకు వెళ్లనీయమని విద్యార్థులు భీష్మించుకొని కూర్చోవడంతో ఆయన వినతిపత్రం స్వీకరించారు. అనంతరం విద్యార్థినులు హాస్టల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, మనోహర్, పవన్, సాయి, సుమన్, పవన్, జాంగారి రవి పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే కార్మికుడి మృతి
షాద్‌నగర్‌టౌన్: ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ల్యంతోనే కార్మికుడు వెంకటేష్ మృతి చెందాడని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. షాద్‌నగర్ ఆర్టీసీ బస్ డిపోలో పని చేస్తున్న కార్మికుడు హైదరాబాద్‌లోని హకీంపేటలోని ఆర్టీసీ గ్యారేజీలో రెండు బస్సుల మధ్య నలిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు మంగళవారం షాద్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వెంకటేష్ (30) ఐటీఐ పూర్తి చేసి గత కొంత కాలంగా షాద్‌నగర్ ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సును రిపేర్ నిమిత్తం ఆర్టీసీ వారు హైదరాబాద్‌లోని హకీంపేటకు పంపాచారు. బస్సు డ్రైవర్‌తో పాటుగా డీజిల్ మెకానిక్ వెంకటేష్ కూడ హకీంపేటకు వెళ్లాడు. అయితే అక్కడ రెండు బస్సులు ఒకదాని వెంట మరొకటి నిలబడ్డాయి. ఓ బస్సును రివర్స్ తీసే క్రమంలో బస్సు వెనక నిలబడి ఉన్న వెంకటేష్ ప్రమాదవశాత్తు రెండు బస్సుల మధ్య చిక్కుకొని నలిగిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నష్టపరిహారం చెల్లించాలి... కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీయం, బీఎల్ఎఫ్ నాయకులతో పాటుగా వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని కార్మికుడిని బస్సు మరమ్మతులకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో కారణంగా వెంకటేష్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడు వెంకటేష్ కుటుంబానికి పరిహారం అందజేస్తామని టీఆర్టీసీ డీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు దంగు శ్రీనివాస్‌యాదవ్, శివశంకర్‌గౌడ్, ఎన్.రాజు, బుద్దుల జంగయ్య, నాగరాజు, ఈశ్వర్ నాయక్, అల్వాల దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
షాద్‌నగర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బార్ అసోసియోషన్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి న్యాయవాదులు అవకాశం కల్పించి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా తనను ఎన్నుకోవాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులను లాభం చేకూర్చే విధంగా వారికి ఉపకార వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ఉపయోగపడే విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అడ్వకేట్స్ ఫండ్ కింద వంద కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. షాద్‌నగర్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమమే «ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. జూన్ 29న నిర్వహించే రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. 22 ఏళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యుడిగా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నో సేవలు అందించానని, మరిన్ని సేవలు అందించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు చెంది మహేందర్‌రెడ్డి, మోముల బసప్ప, కంచి రాజ్‌గోపాల్, పాతపల్లి కృష్ణారెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి, జగన్, శ్రీనివాస్, ప్రణీత్‌రెడ్డి, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
సాక్షి, షాద్‌నగర్: ప్రమోషన్ వచ్చి ఉన్నత స్థానానికి చేరుకున్న ఓ పోలీస్ అధికారి మక్కాకు వెళ్ధామనుకునేలోపే అనంతలోకాలకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. షాద్‌నగర్ పట్టణంలోని ఆనంద్‌నగర్ కాలనీలో నివాసముంటున్న కానిస్టేబుల్ ఖుర్షిద్ (55) నెల క్రితమే హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా తన పని నిమిత్తం షాద్‌నగర్ నుంచి కొత్తూరు వైపు పాత జాతీయ రహదారిలో బైక్‌పై వెళ్తున్న ఆయన్ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. దీంతో ఖుర్షిద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమోషన్ వచ్చిన అనంతరం మక్కాకు వెళ్లి దర్శనం చేసుకువస్తానని నెల నుంచి కుటుంబ సభ్యులతో సన్నిహితులతో అనే ఖుర్షిద్ మరణాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మక్కాకు వెళ్లే ఆశ తీరకుండానే ఆయన మరణం కుటుంబసభ్యులు, సహచరుల్ని కలిచి వేసింది. ఈ మేరకు షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం
నందిగామ(షాద్‌నగర్): షాద్‌నగర్ రాజకీయాల్లో తెలంగాణ ఇంటి పార్టీ త్వరలోనే నూతన ఒరవడి సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. నందిగామకు చెందిన విద్యావేత్త ఎర్ర రామేశ్వర్‌గౌడ్ తన అనుచరులతో కలసి ఆదివారం షాద్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో సుధాకర్ సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తమ పార్టీ ప్రజల ఆంక్షలమేరకు పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు కొత్తూరులో రామేశ్వర్‌గౌడ్ భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. బైపాస్ చౌరస్తాలోని అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
దళారులకు కోడింగ్
షాద్‌నగర్ రూరల్ : పారదర్శకత ఉండాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖలో ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అవినీతిని అంతం కావడం లేదు. దళారులతో వెళితేనే పనులు జరుగుతున్నాయి. అమ్యామ్యాలు ఇవ్వనిదే ఏ ఫైలూ ముందుకు కదలడం లేదు. దీనికి నిదర్శనం ఎంవీఐ అ«ధికారి ఏసీబీకి చిక్కిన ఉదంతం. కోడింగ్ లేని ఫైళ్లు వెనక్కి.. షాద్‌నగర్ ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారులు చెప్పిందే వేదంగా మారింది. కార్యాలయానికి వెళితే.. అక్కడ ప్రజల కంటే దళారులే అధికంగా కనిపిస్తారు. నేరుగా కార్యాలయానికి ప్రజలు వచ్చినా వారి పనులు మాత్రం జరగడం లేదు. మధ్యవర్తులకు అధికారులు కోడింగ్ కేటాయించారు. ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయి. కోడింగ్ లేకుండా ఏదైనా ఫైల్ వచ్చిందంటే అధికారులు ఆపేస్తున్నారు. కార్యాలయంలో తమ పని సులువుగా కావాలంటే దళారులు తమ కోడింగ్‌లను ఫైళ్లపై వేసి కార్యాలయం లోపలికి పంపుతున్నారు. కోడింగ్ ఉంటే చాలు ఎలాంటి పరీక్షలు, తనిఖీలు లేకుండానే లైసెన్సులు, ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదీ కోడ్ భాష షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయంలో కోడ్ భాష భలే పని చేస్తుంది. ఇక్కడి ఏజెంట్లు ఎవరికి వారు కోడింగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంవీఐ కార్యాలయానికి తాము పంపించే ఫైళ్లపై కోడింగ్ ఉంటేనే సదరు అధికారి ఆ పనిని చేసిపెడతారు. లేదంటే సవాలక్ష కారణాలతో తిప్పిపంపుతారు. ఏజెంట్లు నిర్ణయించుకున్న కోడ్ భాషలు జేసీ, హెచ్, వీఆర్, 45, 35, ఏకే, ఎల్, ఎస్ స్టార్, ఎస్ అని ఇలా ఏజెంట్ల ఫైళ్లపై రాస్తున్నారు. ఈ ఫైళ్లు ఉంటే చాలు అధికారులు పని సులభంగా చేసి పెడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు... ఏసీబీకి చిక్కిన అధికారి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్సుకు రూ. 250, ఫిట్‌నెస్‌కు రూ. 1200, కొత్త రిజిస్ట్రేషన్లకు రూ. 2వేలు, డ్రైవింగ్ లైసెన్సుకు రూ. 750, వాహనాల ట్రాన్స్ఫర్ కోసం రూ. 500 వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఆయా పనులపై వెళితే ఎంవీఐ కేటాయించిన రేట్ల ప్రకారం డబ్బు చెల్లించి పని చేయించుకోవాలి. అలా కాకుండా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చూస్తే మాత్రం జీవితకాలం ఎదురు చూడాల్సిందే. సాయంత్రం లెక్క చూస్తారు ఏసీబీ వలకు చిక్కిన శ్రీకాంత్ చక్రవర్తి తనదైన శైలిలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని ఫైళ్లు వచ్చాయో ఎంవీఐ అ«ధికారి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న కారు డ్రైవర్ చూసుకునేవాడు. సాయంత్రం ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలో ఏయే ఏజెంటు డబ్బులు ఇచ్చాడో లెక్క చూసి మరీ సంతకాలు చేసేవాడని ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టజెప్పని వారి ఫైళ్లను సదరు అధికారి పెండింగ్‌లో పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. ఇలా రోజుకు వేల రూపాయల్లో లంచం వచ్చేదని సమాచారం. రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. దళారులను ఆశ్రయించొద్దు ప్రజలు ఏదైనా పనికోసం వస్తే నేరుగా అధికారులనే సంప్రదించాలి. ధళారులను ఆశ్రయించవద్దు. పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలుంటే ప్రజలు అధికారులను నేరుగా వచ్చి కలిసి సమస్యలు తెలియజేయాలి. షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. అవినీతిని నిరోధించడంలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలి. – ఇన్చార్జి ఎంవీఐ సాయిరాంరెడ్డి -
వర్గీకరణ జరిగేదాకా పోరాటం ఆగదు
షాద్‌నగర్‌రూరల్ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టబద్దత కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మార్పీస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగటి సత్యం అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగటి సత్యం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టడానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదింపజేయడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని కలిసి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అధికారంలోనికి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పిన బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వర్గీకరణ విషయమై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హాజరైనా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరుకాకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుంటే సీపీఐ పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి నాయకత్వంలో అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి బయలుదేరే పనిలో ఉన్నామన్నారు. వర్గీకరణ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 7న తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ నాయకత్వాన్ని కేంద్ర, రాష్ట్రాలపై యుద్ధానికి సమాయత్తం చేయడానికి జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఫిబ్రవరి 1న షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేవానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఫిబ్రవరి 12, 13న హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కార్యనిర్వాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీస్ నాయకులు వనం నర్సింహ, మద్దిలేటి, శంకర్ రావు, బుర్రా రాంచంద్రయ్య, కట్ట జగన్, నర్సయ్య, చిన్నోళ్ల అనంతయ్య, జోగు మల్లేష్, పెంటనోళ్ల నర్సింలు, శ్రవణ్ కుమార్, జోగు శివరాములు, పాండు, యాదగిరి, రవి, రాజు, సురేష్ పాల్గొన్నారు. -
నగరంలో ఎర్రచందనం స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని దోబీ ఘాట్ వద్ద 240 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు ఓ ఆటో ట్రాలీలో తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలను గుర్తించిన ఆటో డ్రైవర్ ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ పూల డెకరేషన్ షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న పేషంట్ సుబ్బమ్మ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) : ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పద్మావతి కాలనీలో శనివారం జరిగింది. కాలనీకి చెందిన అక్షయ(3) అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. -
ప్రైజ్‌మనీ అంటూ రూ.4 లక్షలకు టోపీ
షాద్‌నగర్ (మహబూబ్ నగర్) : ప్రైజ్ మనీ వచ్చిందని ఓ అమాయకుడిని మోసం చేసి లక్షలు దండుకున్న ఉదంతం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యూసుఫ్‌కు ఇటీవల 92347880001 నంబరు నుంచి ఆకాష్ వర్మ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. 'కంగ్రాచులేషన్స్.. మీకు లక్కీ డిప్లో రూ.25 లక్షలు ప్రైజ్ వచ్చింది... ఆ డబ్బు కావాలంటే మేం సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత డబ్బు జమ చేయాల్సి ఉంటుంది' అని చెప్పాడు. ప్రైజ్ మనీ ఆనందంలో యూసుఫ్ ఆ వ్యక్తి చెప్పినట్టుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతను చెప్పిన సమయం ప్రకారం, తెలియజేసిన వ్యక్తుల పేరుతో రూ.4 లక్షలు జమ చేశాడు. అనంతరం ప్రైజ్‌మనీ ఎంతకీ రాకపోయేసరికి యూసఫ్ పదే పదే ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. చివరికి ఆన్లైన్లో ఒక చెక్కును యూసఫ్‌కు పంపించాడు. అది డూప్లికేట్ చెక్కు అని, ఒరిజినల్ చెక్కు కావాలంటే మరో రూ.1.70 లక్షలు ఖాతాలో జమ చేయాలని ఫోన్ చేశాడు. దీంతో యూసుఫ్ మోసపోయిన విషయం గమనించి శుక్రవారం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు. -
'ఓర్వలేకనే నాపై ఆరోపణలు'
షాద్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, అందుకే తరుచుగా అక్కడికి వస్తున్నట్టు చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయం ముందు నాగులపల్లి గ్రామానికి చెందిన మహిళ చేసిన రాద్దాంతం గురించి సీఎం, డీజీపీ, రెవెన్యూ కమిషనర్, జిల్లా ఎస్పీ, స్థానిక సీఐకు ఫిర్యాదు చేశానన్నారు. భూములను కబ్జా పెట్టానని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వాటిని కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకున్నానని.. అందుకు సంబంధించిన ప్రతులను మీడియాకు అందచేశారు. తన దగ్గర డబ్బులు తీసుకొని కూడా కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ విసిరారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
హైదరాబాద్ శివారులో ఘటన.. మృతుల్లో నలుగురిది ఒకే కుటుంబం హైదరాబాద్: శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. నగరంలోని కాటేదాన్ గణేష్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ స్థానికంగా కాంగ్రెస్‌పార్టీలో క్రియాశీల నాయకుడు. ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తన సాగుభూమిలో జరుగనున్న ఓ పూజా కార్యక్రమానికి బంధువులతో కలసి కారులో బయలుదేరారు. షాద్‌నగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తోన్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రీనివాస్‌గౌడ్ కుమారులు చంద్రప్రతాప్ గౌడ్(22), సూర్యప్రణయ్ గౌడ్(20), కారు డ్రైవర్ రామాంజనేయులు (22), తమ్ముడి కుమారుడు మేహ ష్ గౌడ్(19), అక్క కుమారుడు సాయితేజ గౌడ్(12)లు మృతి చెందారు. చిన్న కుమారుడు మేఘప్రతాప్ గౌడ్(16)కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గణేశ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవడంతో శ్రీనివాస్‌గౌడ్ రోదనకు అంతులేకుండా పోయింది. -
నడుస్తున్న కారు నుంచి మంటలు
-
‘ఆక్టెవ్’.. అదుర్స్
ఆక్టెవ్- 2014 ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈశాన్యరాష్ట్రాల కళాకారుల ప్రదర్శలను ఔరా అనిపించాయి. నాగాలాండ్‌కు చెందిన చిన్నారులు వారియర్స్ డ్యాన్స్, మణిపూర్ విద్యార్థులు లయహోరాబా నృత్యం, లంగ్ మై చింగ్ కొండ ప్రాంతానికి చెందిన కళాకారుల పాంతోయబి, నోంగ్‌పాంక్ కళారూపాలు భళా అని పించాయి. అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థుల గాసోస్య నృత్యం.. మిజోరాం కాళాకారుల చెరావ్ నాట్యం కనువిందు చేసింది. షాద్‌నగర్: షాద్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్హాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, దక్షిణ భారత సాంస్కృతికశాఖ తంజావూరు వారు, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ, ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక మండ లి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఆక్టెవ్-2014 ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేఘాలయా, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల కళాకారుల కళారూపాలు రూపరులను అలరించాయి. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల జానపద నృత్యా లు భళా అనిపించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద, అవి దేశానికి ప్రతీకలని అన్నా రు. సంస్కృతిని ముందుతరాల వారికి తెలి యజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు. తెలంగాణలో షాద్‌నగర్, వరంగల్, హైదరాబాద్‌లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాం తాల సంస్కృతి, సంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. అలాంటి సంప్రదాయాలను అన్ని ప్రాంతాల వారికి తెలిపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తెలంగాణ బోనాలు, బతుకమ్మ రాష్ట్ర ఔన్నత్యం చాటుతాయన్నారు. ఏజే సీ రాజారాం, తహశీల్దార్ చందర్రావు. ఎంఈఓ శంకర్‌రాథోడ్, మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి, ఎంపీపీ బుజ్జినాయక్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న జానపద నృత్యాలు తెలంగాణకు చెందిన వివిధ వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ విద్యార్థులు చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. నాగాలాండ్ చిన్నారులు వారి యర్స్ డ్యాన్స్‌ను ప్రదర్శించారు. మణిపూర్ విద్యార్థులు లయహోరాబా పండుగ గురిం చి,లంగ్ మై చింగ్ కొండ ప్రాంతానికి చెంది న దేవతలు పాంతోయబి, నోంగ్‌పాంక్ ఒకరినొకరు కలిసే వేళ నృత్యాన్ని ప్రదర్శించా రు. అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులు గాసోస్య నృత్యం చేయగా.. మిజోరాం విద్యార్థులు చెరావ్ అనే నృత్యాన్ని ప్రదర్శించారు. -
షాద్ నగర్లో వ్యక్తిపై హత్యాయత్నం
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురుదేవోభవ..
కురుక్షేత్ర సూత్ర దారి శ్రీకృష్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కృష్ణం వందే జగద్గురం... అంటూ శ్రీకృష్ణభగవానుడిని జగత్తుకంతా గురువుగా భావిస్తాం. కానీ శ్రీకృష్ణుడికి కూడా సాందీపుడు అనే గురువున్న విషయం చాలామందికి తెలియదు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జీవితానికి వెలుగుబాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేదు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువుల గురించి ‘సాక్షి’ ఇస్తున్న కథనం... నవ సమాజ నిర్మాత టీవీ రంగయ్య షాద్‌నగర్ రూరల్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తిరునగరి వెంకట రంగయ్య (టీవీ రంగయ్య) చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యంతో కష్టపడి చది వారు. చిన్నరంగయ్య, రా ములమ్మల దంపతుల కు మారుడు రంగయ్య. ఎంఏ, బీఈడీ చేసి 1991లో మొదటిసారిగా పెద్దమందడి మండలంలోని పెద్దమునగాల చేడు పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా చేరారు. 1992నుంచి 2002 వరకు కొత్తకోట మండలం విలి యం కొండ పాఠశాలలో పని చేశారు. 2002- 2009 వరకు ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల పరిధిలోని కడియాలకుంట పాఠశాలలో పనిచేశారు. 2009నుంచి ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి పాఠశాలలో పని చేస్తున్నారు. రంగ య్య క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించడంతో పాటు కళారంగంలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేశారు. సామాజిక సృహ, క్రమశిక్షణ, మానవతా విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడతారని, ఆ దిశగా విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కళారంగంపై కూడా టీవీ రంగయ్యకు ఎంతో మక్కువ. అందుకే ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూనే ఎన్నో నాటకాలను స్వతహాగా రచించి, విద్యార్థులతో ప్రదర్శింపజేసేవారు. 2012లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించిన ‘అందరూ..అందరే’ నాటిక లో హాస్యపాత్రలో నటించిన రంగయ్య నంది అవార్డు దక్కించుకున్నారు. 2010లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ నుంచి ఉత్తమ విశిష్ట కళాకారుడిగా అవార్డును అందుకున్నారు. బోధన...పేద విద్యార్థులకు చేయూత నవాబ్‌పేట: మండల పరిధిలోని ఖానాపూర్ కి చెందిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. రాములు 1990 డిసెంబర్ 18న ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్లుగా ఆయన మండలంలోనే విద్యాబోధన చేశారు. మొదట సత్రోనిపల్లితండాలో నాలుగేళ్లు, రుక్కంపల్లిలో ఆరేళ్లు, తీగలపల్లిలో ఆరేళ్లు పని చేసిన ఆయన ప్రస్తుతం ఖానాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నారు. గతేడాది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన రాములు విద్యార్థులు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ భాషను సులువుగా నేర్చుకునే బోధిస్తున్నారు. పిల్లలకు చేతిరాత్ర బాగుండేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి పేరుతో పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులను చేర్పించారు. రెండుసార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన రాములుకు ఈసారి ఏకంగా రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. అలాగే పాఠశాలల్లో మొక్కలు పెంచడం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గ్రామాల్లో అంటువ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు వారు చదువుకునేందుకు ఎంతో సాయం చేశారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే... రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో జిల్లాకు చెందిన ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో నేషల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కె.రఘురాములు గౌడ్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ మార్చల, కల్వకుర్తి), ఉత్తమ ఉపాధ్యాయులుగా టీవ రంగయ్య (ఎస్జీటీ, పీఎస్ హాజిపల్లి, షాద్‌నగర్), బి.జగదీశ్వర్‌రెడ్డి (గెజిటెడ్ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ వెలిగొండ, వీపనగండ్ల), టి.నర్సప్ప (స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జెడ్పీహెచ్ఎస్బీ, ధన్వాడ), శ్రీరాములు (ఎస్జీటీ, పీఎస్ ఖానాపూర్, నవాబ్‌పేట)లు ఉన్నారు. సమాజ హితం... నర్సప్ప అభిమతం ధన్వాడ: పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చిత్రకళలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు పండిత్ తాటి నర్సప్ప రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. గతంలో పలు పాఠశాలల్లో పని చేసిన ఆయన చిత్రకళల్లో మేటీ అనిపించుకున్నారు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన నర్సప్ప నారాయణపేటలోని తాటి భీమయ్య, చంద్రమ్మ దంపతుల కుమారుడు. 1985 డిసెంబర్ 9న ఇటిక్యాల మండలం ధర్మవరం ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా ఆయన విధుల్లో చేరారు. 1990-96 వరకు జెడ్పీహెచ్ఎస్ అయిజలో, 1996-2000 వరకు మరికల్ జెడ్పీహెచ్ఎస్లో, 2000-09 ఊట్కూర్ ఉన్నత పాఠశాలలో, 2009-11 వరకు ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో పదోన్నతి పొంది సీనియర్ తెలుగు పండిత్‌గా ధన్వాడలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న తాటిని తండ్రి భీమయ్య వృత్తిపరంగా ప్రోత్సహించారు. ఆయన గీసిన చిత్రాలకు 2002లో బెస్ట్ డ్రాయింగ్ మాస్టర్‌గా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. సమాజ హితంతో పాటు కరువు, వలసలు, చేనేత కార్మికుల దయనీయ పరిస్థితిపై ఎక్కువ చిత్రాలు గీస్తారు. మద్యపానం, సిగరెట్లు, గుట్కా వల్ల జరిగే అనర్థాల గురించి కళారూపంలో వివరించారు. ఒక చిత్రకారుడే కాకుండా కవిగా పలుసార్లు మంత్రులు, అధికారులతో సన్మానాలు పొందారు. బాధ్యత పెరిగింది... రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడంతో వృత్తిపరంగా, సా మాజికంగా నా బాధ్యత మరింత పెరి గింది. నా విధులు సక్రమంగా నిర్వర్తించి విద్యార్థులకు ఉన్నతమైన సేవ లు అందిస్తాను. ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ఉపాధ్యాయులపరంగా ఇంకా కృషి జరగాలి. భవిష్యత్‌లో విద్యార్థులను చిత్రకళ, సాహిత్య రంగాల్లో నాకంటే మిన్నగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. - తాటి నర్సప్ప, సీనియర్ తెలుగు పండిత్, జెడ్పీహెచ్ఎస్, ధన్వాడ -
మావోయిస్టుల ఊసే లేదు
కల్వకుర్తి : కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో చెక్‌జంగ్ అనే పేరుతో మావోయిస్టుమంటూ పోస్టర్లు వేయడం ఆకతాయిల పనేనని ఓఎస్డీ చెన్నయ్య కొట్టిపారేశారు. ఆయా ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో నక్సల్స్ ఊసేలేదని, కేవలం ఆకతాయిల అయిఉంటారని తేల్చారు. బుధవారం ఆయన కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకొని పోస్టర్లు వేస్తున్నారని అన్నారు. పోస్టర్లు వేసిన వారిని మరో రెండు, మూడు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. చెక్‌జంగ్ పేరు మావోయిస్టులకు సంబందించిన దళాలకు లేదని, ఏదో ఒక పేరు చెప్పి ప్రజలను భయపెట్టే వారిని కఠినంగా శిక్షిస్తామని ఓఎస్డీ హెచ్చరించారు. రాడికల్స్, నక్సల్స్ భావాలున్న వ్యక్తులపై సైతం ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సమాజంలో శాంతిని పెంపొందిస్తూ, ప్రజల సఖ్యత కోసం కృషిచేస్తామన్నారు. సమావేశంలో షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపిన పాలమూరు రన్
షాద్‌నగర్: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు 3కే రన్ స్ఫూర్తి నింపింది. షాద్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఈ పరుగులో యువజన సంఘాలు, పట్టణ వాసులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ అథ్లెట్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్‌కు ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన గురుకులం విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు హాజరయ్యారు. స్థానిక సత్యసాయి పాఠశాల ఆవరణ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో అదనపు జేసీ రాజారాం, యువకులు, క్రీడాకారులు, నాయకులు, పలువురు ప్రముఖులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని సత్యసాయి పాఠశాల ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. లక్ష్మణ్, ఎవరెస్టు వీరులు పూర్ణ ఆనంద్‌లతో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌ల కోసం స్థానికులు ఎగబడ్డారు. చదువుతో క్రీడలూ అవసరమే... విద్యార్థులకు, యువకులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. పాలమూరు 3కే రన్ ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడల్లో శిక్షణ అందించాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు ఆటలపై అవగాహన కల్పించాలన్నారు. క్రీడల వల్ల శారీరక సామర్థ్యంతో పాటు మానసిక స్థైర్యం కలుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో యువకులు వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించిన వారు ఉన్నారని, వారికి సరైన శిక్షణ ఇస్తే ఆణిముత్యాలుగా మారుతారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను క్రీడాకారులు సన్మానించారు.రన్‌కు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. డీఎస్పీ ద్రోణాచార్యులు, సీఐలు గంగాధర్, నిర్మల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
అదృశ్యమైన మహిళ దారుణ హత్య
వెల్దండ, న్యూస్‌లైన్ : సుమారు 40 రోజుల క్రితం అదృశ్యమైన ఓ మహిళ చివరకు ప్రియుడి చేతి లో దారుణ హత్యకు గురైంది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకా రం... ఆమన గల్లు పట్టణానికి చెందిన తోట లక్ష్మమ్మ (40) స్థానికంగా ఉంటూ వంటల మేస్త్రీగా పనిచేస్తూ జీవనం గడిపేది. భర్త బంగారి స్థానికంగా కూలిపని చేస్తున్నాడు. వీరికి కుమారుడు అల్లాజీ ఉన్నాడు. ఈమెకు ఎనిమిదేళ్లుగా గోపాల్పేట మండలం శిర్కాపల్లికి నాగోజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే గత నెల 9న ఇంటి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకసాగారు. ఎంత కూ ఆచూకీ లభ్యంకాకపోవడంతో అదే నెల 25న పోలీసులకు ఫిర్యాదు చే యడం తో కేసు దర్యాప్తు చేపట్టారు . అనుమానంతో ప్రియుడిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. అదే రోజు లక్ష్మమ్మను తల్లిగారి గ్రామమైన బంగోనిపల్లి సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లి మద్యం తాపి బండరాయితో మోదిచం పేశాడు. ఒంటిపై ఉన్న అర తులం బం గారు కమ్మలు, 30 తు లాల వెండి కడియాలు అపహరిం చినట్టు అం గీకరించాడు. అనంత రం సంఘటన స్థలా న్ని షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణచార్యులు, సీఐ ఫజలుర్హ్రమాన్ పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అభివృద్ధి పథంలో షాద్‌నగర్
రాష్ట్ర రాజధానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువలో, పాలమూరు జిల్లా ముఖ ద్వారంగా ఉన్న షాద్‌నగర్ మొదటి నుంచి వ్యాపారకేం ద్రంగా ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. వివిధ రకాల ఉత్పత్తి సంస్థలకు, వినియోగదారులకు అనుసంధానంగా ఇక్కడి వ్యాపార వేత్తలు, వాణిజ్య, విద్యా సంస్థల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా కాకుండా వినియోగదారుల సేవలే పరమావధిగా కృషి చేస్తున్నారు. విద్యా రంగానికి వెలుగులు పంచడంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వారికి వివిధ రకాల బైక్‌లను అందుబాటులో ఉంచడంలో సాయికృష్ణ హీరో షోరూం ముందు వరుసలో ఉంది. మేనేజర్ మురళీకాంత్రెడ్డి పర్యవేక్షణలో కంపెనీ ద్వారా శిక్షణ పొందిన నైపుణ్యం గల మెకానిక్‌లతో సర్వీస్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. వివాహాది శుభకార్యాలకు వేదికగా, అవసరమైన పార్కింగ్ ప్లేస్‌తో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించడంలో కుంట్ల రాంరెడ్డి గార్డెన్స్ నంబర్‌వన్‌గా నిలిచింది. పేదోడి బిర్యానీ (కుష్కా)కి పేరుగాంచడంతో పాటు 20 ఏళ్లుగా భోజన ప్రియుల టేస్ట్‌కు తగ్గట్లుగా వివిధ రకాల వంటకాలను అందించడంలో ఆశియా నా హోటల్‌ది అందెవేసిన చేయి. నాణ్యతే పరమావధిగా బంగారు ఆభరణాలు విక్రయించడంలో శ్రీ వెంకటరమణ జ్యువెలరీస్, హోల్‌సేల్ ధరలకే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న శ్రీ వెంకటరమణ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్, గృహాలను ఆకర్షణీయంగా తీర్చిదిదే ఏషియన్ పెయింట్స్ విక్రయంలో జిల్లాలో నంబర్‌వన్‌స్థానంలో నిలచిన శ్రీ వెంకటరమణ పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ వ్యాపారంలో దినాదినాభివృద్ధి చెందుతున్నాయి. వినియోగదారుల చేత పొదుపు చేయిస్తూ వారి అవసరాలు తీర్చడంలో మణికంఠ చిట్‌ఫండ్స్ అధినేత మలిపెద్ది శంకర్ విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎల్ఐసీ ప్రీమియం పాయింట్ ద్వారా మలిపెద్ది చైతన్య సుదీర్ఘసేవలు అందిస్తున్నారు. నాణ్యత గల విత్తనాలు, ఎరువులను రైతులకు అందిస్తూ అన్నదాత సేవలో శ్రీనివాస ట్రేడర్స్ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ ముందు వరుసలో నిలిచింది. రోగులకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అత్యాధునికమైన టె క్నాలజీతో సంతాన సాఫల్యం కోసం విజయజ్యోతి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా డాక్టర్ విజయకుమారి వైద్యసేవలు అందజేస్తున్నారు. ఫ్లెక్సీ బ్యానర్స్ ముద్రణారంగంలో వినూత్న తరహాలో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ వినాయక డిజిటల్ దినదినాభివృద్ధి చెందుతుంది. వివాహాది శుభకార్యాలకు తనదైన శైలిలో వీడియో, ఫొటో కవరేజీ చేస్తూ రాజేశ్వరి ఫొటో స్టూడియో, జిరాక్స్ అందరికీ అందుబాటులో ఉంది. మరోవైపు టాటా ఏస్, ట్రాక్టర్లతో పాటు వివిధ కంపెనీల ఫోర్ వీలర్ స్పేర్ పార్ట్సు మరియు అన్ని రకాల బ్రాండెడ్ ఆయిల్‌ను ప్రభు ఆటోమొబైల్స్ వినియోగదారులకు అందజేస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆధునిక స్టైల్ తో టైలరింగ్ నిర్వహిస్తున్న వినోద్ టైలర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలా వ్యాపార వాణిజ్య విద్యారంగాలలో పేరెన్నికగన్న సంస్థలన్నీ నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా సేవలందిస్తున్నాయి. -
సోనియా గుడికి శంకుస్థాపన చేసిన శంకర్రావు
మహబూబ్‌నగర్ : ఇందిరాగాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా పేరున్న మాజీమంత్రి, కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆలయం కట్టేందుకు ఆయన పూనుకున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం నందిగామలో శంకర్రావు సోమవారం సోనియా గుడికి శంకుస్థాపన చేశారు. తన 9 ఎకరాల పొలంలో కొంతమేర సోనియాగాంధీ గుడి నిర్మాణానికి శంకరన్న సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులు చరిత్ర హీనులుగా మారుతారని మండిపడ్డారు. సీమాంధ్రులు రాజీవ్ విగ్రహాలు కూల్చడం దారుణమని ఆయన విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి స్థానిక నేతల వైఫల్యమే కారణమని రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌కు ఎలాంటి ఢోకా లేదని శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని....మంచి చేసిన వారికి సమాధులు కట్టే సంస్కృతి సీమాంధ్రులకు ఉంటే, గుడులు నిర్మించి సంస్కృతి తెలంగాణ ప్రజలదని ఆయన అన్నారు. సోనియాను ప్రతి ఒక్కరూ తెలంగాణ తల్లిగా కొలుస్తున్నారని, ఆమెకు గుడి కట్టించడం తమ లక్ష్యమన్నారు.