వెలమలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు | Shadnagar MLA Veerlapally Shankar Controversial Comments, Velama Sangam Leaders Filed Complaint | Sakshi
Sakshi News home page

వెలమలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

Published Fri, Dec 6 2024 9:34 PM | Last Updated on Sat, Dec 7 2024 11:39 AM

Shadnagar Mla Veerlapally Shankar Controversial Comments

సాక్షి, హైదరాబాద్‌: షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్‌ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

వెలమ సామాజికవర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వీర్లపల్లి శంకర్‌పై  దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం పద్దతి కాదన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం ఖండిస్తోందని.. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వాడిన భాషతో వెలమ సామాజికవర్గ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement