
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరంతా స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరారు. అయితే షాద్ నగర్ టోల్‌గేట్ వద్దకు రాగానే ముందు వెళుతున్న మరో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో మారుతి ఎరిక్టా కారు అదుపు తప్పింది. దీంతో కారు సుమారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.