ఖుర్షిద్(ఫైల్ )
సాక్షి, షాద్‌నగర్: ప్రమోషన్ వచ్చి ఉన్నత స్థానానికి చేరుకున్న ఓ పోలీస్ అధికారి మక్కాకు వెళ్ధామనుకునేలోపే అనంతలోకాలకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. షాద్‌నగర్ పట్టణంలోని ఆనంద్‌నగర్ కాలనీలో నివాసముంటున్న కానిస్టేబుల్ ఖుర్షిద్ (55) నెల క్రితమే హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా తన పని నిమిత్తం షాద్‌నగర్ నుంచి కొత్తూరు వైపు పాత జాతీయ రహదారిలో బైక్‌పై వెళ్తున్న ఆయన్ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. దీంతో ఖుర్షిద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమోషన్ వచ్చిన అనంతరం మక్కాకు వెళ్లి దర్శనం చేసుకువస్తానని నెల నుంచి కుటుంబ సభ్యులతో సన్నిహితులతో అనే ఖుర్షిద్ మరణాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మక్కాకు వెళ్లే ఆశ తీరకుండానే ఆయన మరణం కుటుంబసభ్యులు, సహచరుల్ని కలిచి వేసింది. ఈ మేరకు షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment