బుల్లెట్‌ ఢీకొనడంతో కానిస్టేబుల్‌ మృతి | On Duty Police Man Died In A Road Accident At Suryapet | Sakshi
Sakshi News home page

‘పేట’లో దారుణం..

Published Tue, Jul 9 2019 9:56 AM | Last Updated on Tue, Jul 9 2019 9:56 AM

On Duty Police Man Died In A Road Accident At Suryapet - Sakshi

 కానిస్టేబుల్‌ సుధాకర్‌గౌడ్‌ (ఫైల్‌)

సాక్షి, సూర్యాపేట: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ కొత్త బస్టాండ్‌ వద్ద టీ తాగేందుకు తన బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా.. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బుల్లెట్‌ వాహనంపై అతివేగంతో ట్రిపుల్‌ రైడ్‌ చేస్తూ వచ్చి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఈ  ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం ఉర్లుగొండ గ్రామానికి చెందిన చామకూరి సుధాకర్‌గౌడ్‌ (32) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.

ఇటీవల కాలంలో తన సర్వీసును మొత్తం కోల్పోయి కూడా స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజుమాదిరిగానే ఆదివారం రాత్రి 7 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో వాచ్‌ డ్యూటికి ఎక్కారు. 2 గంటల ప్రాంతంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి తన రిలీవర్‌ రావడంతో కొత్త బస్టాండ్‌ వద్ద టీ తాగేందుకు వెళ్తున్నాడు. శంకర్‌ విలాస్‌ సెంటర్‌లోని రిలియన్స్‌ ట్రెండ్స్‌ వద్దకు చేరుకోగా.. పూటుగా మద్యం సేవించిన ముగ్గురు యువకులు అతివేగంగా వచ్చి సుధాకర్‌గౌడ్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టారు.

దీంతో సుధాకర్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తలరించాలని తెలపడంతో హైదరాబాద్‌ కామినేని తరలించగానే.. మృతిచెందారు. బుల్లెట్‌ వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు ఎలాంటి గాయాలు కాలేదు.  మృతుడికి భార్య రాధిక, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మిన్నంటిన రోదనలు..
సుధాకర్‌ గౌడ్‌ హైదరాబాద్‌ కామినేని ఆస్పత్రికి తరలించగానే.. మృతిచెందాడు. దీంతో సుధాకర్‌ మృతదేహాన్ని స్థానిక ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. సుధాకర్‌ తల్లి, భార్య, సోదరులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. సుధాకర్‌ కుమార్తె, కుమారులు కూడా యూకేజీ, నర్సరీ చదువుతున్న వారు కావడంతో వారిని చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయి కంటతడిపెట్టారు. 

కానిస్టేబుల్‌ వాహనంపైనే ఆస్పత్రికి వెళ్లిన యువకులు..
పూటుగా మద్యం సేవించి ఉన్న యువకులు కాని స్టేబుల్‌ సుధాకర్‌గౌడ్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో సుధాకర్‌తో పాటు.. ము గ్గురు యువకులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో యువకులు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ వాహ నం నుజ్జునుజ్జయింది. ముగ్గురిలో ఒక్కరికి కూడా బలమైన గాయాలు కాలేదు. సుధాకర్‌గౌడ్‌ తన వాహనంపై నుంచి ఎగిరిపడడంతో బలమైన గాయాలై రక్తపుమడుగులో కొట్టుకుంటున్న కూడా యువకులు ఆయనను పట్టించుకోలేదు.

అంతేకాకుండా సుధాకర్‌ ప్రయాణిస్తున్న బైక్‌ను తీసుకొని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి ముగ్గురు యువకులు వెళ్లి అడ్మిట్‌ అయ్యారు. శంకర్‌ విలాస్‌సెంటర్‌ నుంచి ప్రయాణం చేస్తున్న సంబంధం లేని వ్యక్తులు 100 కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌ హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు.  యువకులు కానిస్టేబుల్‌ సు ధాకర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికి ఉండేవారని పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. 

సుధాకర్‌ కుటుంబాన్ని ఓదార్చిన జెడ్పీ వైస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సుధాకర్‌ మృతదేహాన్ని జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌లు విషయం తెలుసుకొని ఏరియాస్పత్రికి తరలివచ్చారు. సుధాకర్‌ మృతదేహంపై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

కుటుంబాన్ని ఆదుకుంటాం.. : ఎస్పీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుధాకర్‌గౌడ్‌ మృతదేహాన్ని స్థానిక ఏరియాస్పత్రిలో జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు పరిశీలించి సంతాపం తెలిపారు. తక్షణ సహాయం కింద ఎస్పీ సుధాకర్‌ భార్య రాధికకు రూ.25 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సహాయాన్ని అందించి, కుటుంబ సభ్యులను ఆదుకుంటామని భరోసా కల్పిం చారు. ఆయన వెంట డీఎస్పీ నాగేశ్వరరావు, పోలీసు అధికారు సంఘం అధ్యక్షులు బెల్లంకొండ రాం చందర్‌గౌడ్, అమర్‌సింగ్, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు, కానిస్టేబుల్, హోంగా ర్డులు ఉన్నారు.

కన్నీరు పెట్టిన ఖాకీలు..
సుధాకర్‌గౌడ్‌ కొద్ది కాలంలోనే పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ స్థాయి నుంచి కానిస్టేబుల్, హోంగార్డు స్థాయి వరకు ఉన్న సిబ్బంది మనసులో మంచి స్థానాన్ని సంపాదించారు. ఎవరి నోటా కూడా సుధాకర్‌గౌడ్‌ అందరితో కలివిడిగా ఉండేవారని.. కల్మషం లేని మనిషని కొనియాడుతూ నమ్మలేని ఘటన జరిగిందని వాపోయారు. సుధాకర్‌ మరణించడంతో.. ఆయన అంతిమయాత్రలో కానిస్టేబుళ్లు రోదించిన తీరును పలువురిని కంటతడిపెట్టించింది. 

పేట ఏరియా ఆస్పత్రి నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు సాగిన అంతిమయాత్ర..
సుధాకర్‌ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పేట పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పెద్ద ఎత్తున ఏరియాస్పత్రికి చేరుకొని అంతిమయాత్ర చేపట్టారు. ఏరియాస్పత్రి నుంచి సుధాకర్‌ అంతి మయాత్ర నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీస్‌స్టేషన్‌ వద్ద సుధాకర్‌గౌడ్‌ చిత్రపటానికి సీఐ శివశంకర్‌ పూలమాలలు వేసి ఘన నివా ళులర్పించారు. ప్రధాన కూడళ్లలో బాణాసంచాలు కాలుస్తూ అంతిమయాత్ర నిర్వహించా రు. సుధాకర్‌ మృతదేహాన్ని నేరుగా స్టేషన్‌ నుంచి స్వగ్రామమైన ఉర్లుగొండకు తరలిం చారు. అంత్యక్రియలు రాత్రి ముగిసాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రోదిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement