
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ మీద వచ్చిన ఓ యువకుడు షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల చౌరస్తాలో ఆగాడు. రోడ్డుమీద వెళ్తున్న జనం.. చూస్తుండగానే... అతను తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకుని అంటించుకున్నాడు. స్థానికులు తేరుకుని.. మంటలు ఆర్పే సమయానికి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బైక్‌పై విష్ణువర్థన్‌రెడ్డి, మేడ్చల్ అని ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.