గుర్తు తెలియని దుండగులు ఓ విద్యార్థిని కిడ్నాప్ చేయడం షాద్‌నగర్‌లో కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కౌశిక్ అనే విద్యార్థి ఠాగూర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తున్న కౌశిక్‌ను కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. వారు ఏపీ 22ఈఈ 5201 నంబర్ కలిగిన ఇన్నోవా వాహనంలో వచ్చినట్టు ప్రత్యుక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో షాద్‌నగర్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కౌశిక్ తండ్రి వెంకటేశ్వర్‌రావు బీఏఎం కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.