
దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?
హుస్సేన్ సజ్వానీ ఎవరు?
దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్‌డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.
చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్

డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.
Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM
— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025
1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్‌మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది.
చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం