banaras hindu university
-
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
కోవాగ్జిన్‌తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. -
PM Narendra Modi: ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి: భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనా(మోడల్)గా మారడం ఖాయమని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ‘సంసద్ సంస్కృత్ ప్రతియోగితా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వారసత్వం, అభివృద్ధికి కాశీ నగరం ఒక మోడల్‌గా కనిపిస్తోందని, సంస్కృతి, సంప్రదాయం చుట్టూ ఆధునిక అభివృద్ధిని ప్రపంచం వీక్షిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మన దేశం అభివృద్ధికి మోడల్‌గా మారుతుందని చెప్పారు. భారతీయ సుసంపన్న ప్రాచీన వారసత్వం గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగితా, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగితా, కాశీ సంసద్ సంస్కృత్ ప్రతియోగితా అవార్డులను నరేంద్ర మోదీ విజేతలకు అందజేశారు. అనంతరం రూ.13,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత పదేళ్లుగా ఇక్కడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వారణాసి తనను బనారసిగా మార్చిందని అన్నారు. వారణాసి యువతను కొందరు కాంగ్రెస్ నేతలు నషేరీ(మత్తులో మునిగిపోయినవారు) అని దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాం«దీపై మోదీ మండిపడ్డారు. నిజంగా స్పృహలో ఉన్నవారు అలా మాట్లాడరని చెప్పారు. గత 20 ఏళ్ల పాటు తనను తిట్టారని, ఇప్పుడు యువతపై ఆక్రోశం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య, కాశీని అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వారు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి రోడ్లపై నడుస్తూ తనిఖీ చేశారు. ప్రజలను విపక్షాలు కులాల పేరిట రెచ్చగొడుతున్నాయ్ విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. విపక్షాలు కులాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులు చేపడితే విపక్ష నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తాము పోటీకి దింపితే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఓడించేందుకు ప్రయతి్నంచాయని గుర్తుచేశారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచి్చన పథకాలను విపక్షాలు వ్యతిరేకించాయని చెప్పారు. వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో మోదీ మాట్లాడారు. ప్రతి శకంలో యోగులు ప్రజలకు దారి చూపారని, తప్పుడు మార్గంలో నడవకుండా అప్రమత్తం చేశారని చెప్పారు. కులం పేరిట ఎవరైనా వివక్ష చూపితే అది మానవత్వంపై చేసిన దాడి అవుతుందని పేర్కొన్నారు. -
Najma Parveen: మోదీపై పీహెచ్డీ
నరేంద్ర మోదీ గుజరాత్ సి.ఎం. అయ్యాక, ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పీహెచ్‌డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కాని వారిలో ముస్లిం స్కాలర్లు... అందునా మహిళా ముస్లిం స్కాలర్లు దాదాపుగా లేరు. ఆ విధంగా చూస్తే మోదీపై పీహెచ్డీ చేసిన మొదటి మహిళా స్కాలర్‌గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. చేనేత కుటుంబంలో పుట్టి నజ్మా పర్వీన్‌ది వారణాసి దాపున ఉన్న లల్లాపుర. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. కాని వారు ఆమె చిన్నప్పుడే మరణించారు. అయినా తన చదువుకు ఆటంకం కలిగించకుండా కొనసాగించింది పర్వీన్. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బి.హెచ్.యు.)లో పొలిటికల్ సైన్స్ చదివి 2014లో పీహెచ్డీ సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం ‘నరేంద్రమోడీస్ పొలిటికల్ లీడర్షిప్: యాన్ అనలిటికల్ స్టడీ’. నజ్మా పర్వీన్ తన పీహెచ్‌డీకి ఈ అంశం తీసుకున్నాక ‘నాక్కూడా భవిష్యత్తులో రాజకీయ నేత కావాలని ఉంది. అందుకే నేను భారతీయ ఆవామ్ ΄ార్టీనీ స్థాపించాను కూడా. ఆ ΄ార్టీని ఎలా రూపుదిద్దాలి అనుకున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద దృష్టి మళ్లింది. ఆయన రాజకీయాలలో ధ్రువతార వంటి వారు. 2014 నుంచి దేశంలో ఆయన సమర్థ నాయకత్వం కొనసాగింది. ట్రిపుల్ తలాక్ మీద ఆయన తెచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ నేను మొదటగా శుభాకాంక్షలు తెలియచేశాను’ అని తెలిపింది నజ్మా. పేదరికంలో ఉన్న నజ్మా పర్వీన్ చదువుకు ‘విశాల్ భారత్ సంస్థాన్’ స్థాపించిన ప్రొఫెసర్ రాజీవ్ శ్రీవాస్తవ సహకరిస్తే బి.హెచ్.యు. ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ గైడ్‌గా వ్యవహరించారు. 8 ఏళ్ల సమయం తీసుకుని 20 హిందీ, 79 ఇంగ్లిష్ గ్రంథాలు అధ్యయనం చేసి నజ్మా ఈ పీహెచ్‌డీని పూర్తి చేసింది. -
‘సంస్కృతం’ పట్ల ఇదేమీ సంస్కృతి!?
న్యూఢిల్లీ : ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విశ్వవిద్యాలయమైనా రాజ్యాంగంలోని 14వ అధికరణను గౌరవించాల్సిందే! కుల, మత, లింగ వివక్షతలకు దూరంగా ఉండాల్సిందే. వారణాసిలోని ‘బనారస్ హిందు యూనివర్శిటీ’ ఇందుకు అతీతం ఏమీ కాదు. ఈ యూనివర్శిటీలో సంస్కృతం చెప్పే ముస్లిం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా గత పది రోజులుగా విద్యార్థులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం ఈ ఏడాది మొదట్లోనే సంస్కృత అధ్యాపకుడిగా బనారస్ యూనివర్శిటీలో చేరారు. తెలుగు వారికన్నా మంచిగా సంస్కృతం చెబుతున్నారన్న మంచి పేరు కూడా ఆయనకు వచ్చింది. పైగా ఆయన రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ‘సంస్కృత్ యువ ప్రతిభా సమ్మాన్’ను కూడా అందుకున్నారు. విద్యార్హతలుండి అర్హులైన 11 మందిని ఇంటర్వ్యూచేసి బనారస్ విశ్వవిద్యాలయం అధికారులు ఫిరోజ్ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఆయన ముస్లిం అవడం వల్లనే వారు ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎవరు ఇటీవల విద్యార్థులను రెచ్చగొట్టారో తెలియదుగానీ, ఓ ముస్లిం వ్యక్తి తమకు సంస్కృతం బోధించడం ఏమిటని, అందులోనూ హిందూ పురాణాల గురించి చెప్పడం ఏమిటంటూ ఆందోళనకు దిగారు. ఫిరోజ్ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించే వరకు తాము తరగతులకు రామంటూ భీష్మించుకొని బహిష్కరణకు దిగారు. ఫిరోజ్ ఖాన్‌కు అండగా నిలబడిన బనారస్ యూనివర్శిటీ అధికారులు, విద్యార్థులకు శతవిధాల నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. యూనివర్శిటీ అధికారులు లంచం పుచ్చుకొని అనర్హుడైన ఫిరోజ్ ఖాన్‌కు ఉద్యోగం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో 14వ అధికరణం కుల, మత, లింగ వివక్షతలను నిషేధించిన విషయం గురించి సదరు విద్యార్థులకు తెలియదా? తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌ను ఎన్నుకుని, ఇష్టమైన ఉద్యోగం చేయడం ఫిరోజ్ ఖాన్ ప్రాథమిక హక్కనే విషయం కూడా తెలియదా? యూనివర్శిటీలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కేంద్రంలోని మానవ వనరుల శాఖా మాత్యులు పెదవి విప్పరెందుకు? జేఎన్‌యూ యూనివర్శిటీలో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చేస్తుంటే నోరు విప్పని మంత్రులు మతం పేరుతో జరుగుతున్న రాద్దాంతంలో నోరు విప్పుతారనుకోవడం అతిశయోక్తే కావచ్చు! బనారస్ హిందు యూనివర్శిటీ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఉంది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే మోదీ జాతి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అన్ని మతాల వారు ఐక్యంగా ఉండాలని, పరస్పరం గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తి ఆయన మంత్రులకు కొరవడిందా? మోదీ పిలుపు బనారస్ విద్యార్థులకు చేరలేదా?! -
ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ హిందూ యూనివర్శిటీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థినిలపై వేధింపుల సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్శిటీ ముఖ్య అధికారి డాక్టర్ గిరీష్ చంద్ర త్రిపాఠి పదవి నుంచి వైదొలిగారు. మంగళవారం సాయంత్రం ఆయన తన రాజీనామాను అధికారులకు సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన విశ్వవిద్యాలయ అధికారులు త్వరలోనే ఈ స్థానాన్ని భర్తి చేయనున్నట్టు చెప్పారు. తాత్కాలికంగా బీహెచ్‌యూ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఎంకే సింగ్ కు అదనంగా ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా యూపీ సర్కారుపై విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు మోహన్ ప్రకాష్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పోలీసు అధికారులను వివరణ కోరారు. అయితే విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం బయటికి వాళ్లే ఈ హింసకు కారణమని ఆరోపించారు. కాగా, యూనివర్శిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిని ముగ్గురు యువకులు వేధించిన ఘటనకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఈ ఘటనలో విద్యార్థినులతోపాటు పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. వెయ్యిమంది ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో సెమిస్టర్ సెలవులను ముందస్తుగానే వర్శిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆవుల కన్నా మేం అధ్వాన్నమా?
సాక్షి, న్యూఢిల్లీ : బనారస్ యూనివర్శిటీలో శనివారం నాడు తమకు తగిన భద్రత కల్పించాలంటూ నినదించిన విద్యార్థినలపై పోలీసులు పాశవికంగా దాడి జరపడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఆదివారం నాడు కూడా కొనసాగడంతో సోమవారం నుంచి యూనివర్సిటీకి ముందస్తు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీలో తాము ప్రశాంతంగా తిరగలేకపోతున్నామని, తమపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి రాక సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేయడంపై పోలీసులు తమ లాఠీ విన్యాసం చూపించిన విషయం తెల్సిందే. విద్యార్థినులను చితకబాదుతున్న చిత్రాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో ఆగ్రహించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాల్సిందిపోయి ఎవరు తమ సెల్ఫోన్లో ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో పట్టుకొని బొక్కలో వేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదంతా జాతీయ వ్యతిరేకులు, నరేంద్ర మోదీ రాజకీయ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా ఆందోళన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత మోదీ మొదటిసారి తన పార్లమెంట్ నియోజక వర్గంలో పర్యటించేందుకు వారణాసి వస్తున్న సందర్భంగానే బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన చేయవచ్చు. వారి ఉద్దేశం యూనివర్సిటీలో కూడా తమకు రక్షణ లేకపోతోందని, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయనే విషయాన్ని వారణాసి ఎంపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దష్టికి తీసుకెళ్లడం మాతమే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మోదీ పర్యటన బనారస్ యూనివర్శిటీ మీదుగా కొనసాగాల్సి ఉంది. అయితే యూనివర్సిటీలో శనివారం విద్యార్థులు ఆందోళన చేయాలని నిర్ణయించడంతో భారీ ఎత్తున యూపీ ప్రభుత్వం క్యాంపస్‌లో పోలీసులను మోహరించింది. పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించడంతో ప్రధాన పర్యటన రూటును మార్చారు. ఆదిత్యనాథ్ యోగి ఆదేశం మేరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు తమ లాఠీ ప్రతాపం చూపారు. పర్యవసానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి యూనివర్శిటీని దసరా సెలవులు ఉండగా, మూడు రోజుల ముందుగా, అంటే సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. విద్యార్థినీ విద్యార్థులను హాస్టళ్లను ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంత గొడవ జరుగుతున్న ప్రధాని మోదీ తమ భద్రత గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అన్యాయమని యూనివర్శిటీ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మోదీ మగాళ్ల ఆధిపత్యవాదనే విషయం దీనివల్ల నిజమేమోనని అనిపిస్తుందని వారన్నారు. శనివారమంతా ఆవుల ఆరోగ్య పరీక్షలను పర్యవేక్షిస్తూ మూగజీవుల హక్కులను పట్టించుకున్న మోదీ, నోరు విప్పి హక్కుల గురించి మాట్లాడుతున్న తమ గురించి ఎందుకు పట్టించుకోరని, ఓటు హక్కులేని ఆవులకంటే ఓటు హక్యు, రాజ్యాంగ హక్కులు కలిగిన తాము తీసిపోయామా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇజ్జత్ ఘర్ నినాదంతో మహిళల మానరక్షణకు మరుగుదొడ్లు అత్యవసరమంటూ చెబుతున్న మోదీ, తమ మాన, ప్రాణాల మీద జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోరని విద్యార్థి నాయకురాలు వందనా సింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. విద్యార్థినులపై పోలీసులు జరిపిన పాశవిక దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ‘బీహెచ్‌యూ బజ్’ పేరిట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఆదిత్యనాథ్ యోగికి పరిపాలనలో పరిణితి లేకపోవడం, తొందరపాటు నిర్ణయాల వల్లనే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
గోవులకన్నా మేము అధ్వాన్నమా ?
-
నెల్లూరు విద్యార్థి అనుమానాస్పద మృతి
- బెనారస్ వర్సిటీలో ఐఐటీ చదువుతున్న జైభీమ్ రాజు - హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకాడంటున్న స్నేహితులు - తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వర్సిటీ అధికారులు - హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటున్న తల్లిదండ్రులు నాయుడుపేట టౌన్ (సూళ్లూరుపేట): ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటీ ద్వితీయ సంవత్సరం (మైనింగ్ ఇంజనీరింగ్) చదువుతున్న నెల్లూరు జిల్లా విద్యార్థి దారా జైభీమ్ రాజు (19) అనుమానాస్పదస్థితిలో మరణించాడు. రాజు ఒంటికి నిప్పంటిం చుకుని కళాశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ట్లుగా అతడి స్నేహితులు మంగళవారం రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే బుధవా రం సాయంత్రం వరకు బెనారస్ ఐఐటీ కళాశాల అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందకపోవ డం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాజు తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మార్చిలోనే వచ్చి వెళ్లాడు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గిండివారితోటకు చెందిన దారా వెంకటకృష్ణయ్య రైల్వే టీసీ. ఆయన కుమారుడు జైభీమ్ రాజుకు ఇంటర్లో మంచి ర్యాంక్ రావడంతో రెండేళ్ల క్రితం బెనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ కళాశాలలో చేరాడు. ప్రతిరోజు క్రమం తప్ప కుండా తల్లి భాగ్యమ్మతో మాట్లాడుతుండే వాడు. మార్చిలో సెలవులు ఇవ్వడంతో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సొంతూరిలో ఉండి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి జైభీమ్ ఫోన్ చేయకపోవ డంతో తల్లి భాగ్యమ్మ రెండు, మూడుసార్లు అతనికి ఫోన్ చేసినా ఎవరూ తీయలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అతడి స్నేహితులకు ఫోన్ చేయగా ఏదేదో చెబుతూ వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో జైభీమ్ రాజు శరీరానికి నిప్పంటించుకుని హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందకి దూకేశాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్నేహితులు సమాచారం అందించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేసి తగులబెట్టి మిద్దెపై నుంచి పడేసి ఉండొచ్చునని మృతుని తండ్రి వెంకటకృష్ణయ్య విలేకరుల ఎదుట ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం బంధువులతో కలసి ఆ మేరకు స్థానిక సీఐ రత్తయ్య, ఎస్సై మారుతీకృష్ణలకు ఫిర్యాదు చేశారు. కళాశాల హెచ్ఓడీ సంజయ్శర్మతో సీఐ ఫోన్లో మాట్లాడగా.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో జైభీమ్ రాజు సెల్‌కు ఒక ఫోన్ రాగా కోపంగా మాట్లా డటం అక్కడి విద్యార్థులు గమనించారని ఆయన చెప్పారు. తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. అంతకుముందు హాస్టల్ వార్డెన్ తరంగ్‌కు ఫోన్ చేసి మాట్లాడగా అతను.. కళాశాల వద్ద ఏమి జరిగిందో తెలియదని విద్యార్థులను అడిగి చెబుతాననడం గమనా ర్హం. దీంతో జిల్లా ఎస్పీతో మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేలా చర్యలు చేపడతామని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజు కుటుంబసభ్యులు బుధవారం వారణాసికి బయలుదేరి వెళ్లారు. -
విద్యార్థినులపై వివక్షేం లేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: విద్యార్థినులపట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో వైఫై సౌకర్యాన్ని విద్యార్థినులకు ఇవ్వడం లేదని, ఇతర ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘నేను బీహెచ్‌యూ నుంచి సమాచారం సేకరించాను. ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పట్ల ఎలాంటి వివక్ష ఉన్నట్లు నాకు అనిపించలేదు’ అని అన్నారు. అబ్బాయిలతో సమానంగా విద్యార్థినులకు వైఫై సౌకర్యం అందించకపోవడంతోపాటు హాస్టల్లో మాంసాహారం తినేందుకు అనుమతివ్వడం లేదని, మెస్‌లోకి షార్ట్స్ వేసుకొని వెళ్లనివ్వడం లేదని 10గంటల తర్వాత ఫోన్లు చేసుకోనివ్వడం లేదని ఆయా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓమంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన జవదేకర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. -
కుడిచేతికి, ఎడమచేతికి వేర్వేరు డాక్టర్లు !
-
కుడిచేతికి, ఎడమచేతికి వేర్వేరు డాక్టర్లు!
దేశంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం బాగా పెరిగిపోయిందని, ఇప్పుడు కళ్లకో డాక్టర్, కాళ్లకో డాక్టర్, చేతులకో డాక్టర్.. ఇలా వస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాబోయే రోజుల్లో కుడిచేతికి ఒక డాక్టర్, ఎడమ చేతికి మరో డాక్టర్ వస్తారేమోనని ఆయన చమత్కరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత రోజుల్లో ఊరి మొత్తానికి ఒకరే వైద్యుడు ఉండేవారని, ఆయన నాడి పట్టుకుని చూసి ఏం సమస్య ఉందో చెప్పేవారని గుర్తు చేశారు. ఆ తర్వాతి కాలంలో ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారని.. వాళ్లు పది పదిహేను రకాల ప్రశ్నలు అడిగి ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకునేవారని చెప్పారు. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీతో పాటు.. డాక్టర్ల పాత్ర తగ్గి టెక్నాలజీ పాత్ర పెరిగిందని ఆయన అన్నారు. రోగిని మిషన్ లోపలకు పంపేసి, ఏం సమస్య వచ్చిందో చెబుతున్నారన్నారు. అయితే.. వైద్య రంగంలో టెక్నాలజీ రావడం వల్లే కచ్చితత్వం కూడా పెరిగిందని, సరైన చికిత్సలు అందుతున్నాయని వివరించారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాదని.. ఈ రంగంలో పరిశోధనలు కూడా పెరగాలని సూచించారు. ఏయే మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలని, వాటిపై పరిశోధించాలని మోదీ తెలిపారు. భారత్ లాంటి దేశాల్లో కూడా అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయని, ఇందుకు బెనారస్ హిందూ యూనివర్సిటీ, టీఐఎఫ్ఆర్ లాంటి సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. -
బెనారస్ వర్శిటీలో 'అతడి'పై అత్యాచారం
వారణాసి: ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్శిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఏ హిందీ ప్రథమ సంవత్సరం విద్యార్థి (19)ని కిడ్నాప్ చేసి అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై లంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. విద్యార్థిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు కూడా ధ్రువీకరించారు. కాగా దీనిపై వైస్ ఛాన్సులర్ గిరిష్ చంద్ర త్రిపాఠి పెదవి విప్పడం లేదు. అయితే ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగటం లేదని వర్శిటీ అధికారులే అంగీకరిస్తున్నారు. విచారణ చేయటంలో పోలీసులు జాప్యం చేస్తుంటే తామేమీ చేయగలమని చెబుతున్నారు. ప్రస్తుతం వీసీ అందుబాటులో లేరని, ఆయన తిరిగి వచ్చాక ఈ ఘటనపై కమిటీ వేయనున్నట్లు చెప్పారు. మరోవైపు బాధిత విద్యార్థి కుటుంబం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ తమ కుటుంబం మొత్తం షాక్‌లో ఉందని, దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఘటన జరగటం సిగ్గు చేటు అన్నారు. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదని విద్యార్థి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరిగేవరకూ పోరాడతామని ఆయన తెలిపారు. -
నినాదాలు చేయడంతో ఈడ్చికొట్టారు!
వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్ యూ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తుండగా నినాదాలు చేసిన ఓ విద్యార్థిపై కొందరు దాడికి పాల్పడ్డారు. బీహెచ్ యూ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం ఇక్కడ జరిగిన స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ స్థాపకుడు, భారత రత్న మదన్మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళులర్పించారు. విద్యార్థులకు స్నాతకోత్తర డిగ్రీలు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగం ముగించి వేదిక నుంచి వెనుదిరుగుతుండగా.. అశుతోష్ కుమార్ అనే విద్యార్థి బిగ్గరగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల అంశాన్ని ఆయన లేవనెత్తాడు. ఈ యూనివర్సిటీలో 1997 నుంచి విద్యార్థి సంఘం ఎన్నికలను రద్దు చేయడంతో ఈ అంశంలో 'మోదీజీ విద్యార్థుల మాట వినండి' అంటూ నినదించాడు. దీంతో పోలీసులు అతన్ని బలవంతంగా వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి విద్యార్థి అశుతోష్ పై చేయిచేసుకున్నాడు. అతడిని ఈడ్చికొట్టాడు. మిగతా బీజేపీ మద్దతుదారులు కూడా అతన్ని చుట్టుముట్టడంతో కష్టంమీద అతన్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. విద్యార్థులపై లాఠీచార్జ్! ప్రధాని మోదీ రాక సందర్భంగా బీహెచ్ యూ యూనివర్సిటీ వెలుపల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. -
డాక్టరేట్ వద్దన్న ప్రధాని
న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకునేందుకు ప్రధాని మోదీ తిరస్కరించారు. అలాంటి డిగ్రీలు అంగీకరించబోనంటూ తన విధానాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 22న మోదీ బెనారస్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఆ సమయంలో డాక్టరేట్‌తో సత్కరిస్తామని యూనివర్సిటీ ప్రతిపాదించగా.. వద్దని సున్నితంగా తిరస్కరించారు. -
మూడోసారి వారణాసికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ట్రామా సెంటర్‌ను ప్రారంభించనున్న మోదీ విద్యుత్, రహదారుల రంగాలకు సంబంధించి కొత్త పథకాలను ఆరంభిస్తారు. అనంతరం స్థానిక రిక్షా సంఘం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోదీ వారణాసిలో పర్యటించడం ఇది మూడోసారి. సుమారు 90 నిమిషాల పాటు మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా రెండుసార్లు వారణాసి పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. -
'వైద్య పరీక్షలు చేయమంటే...జాతకం చూడమన్నారు'
వారణాసి: ప్రసిద్ధ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో దేశంలో మహిళల భద్రతను సవాల్ చేసే మరో అవమానకర సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్‌లో తనపై లైంగిక దాడికి యత్నించారని ఆమెరికాకు చెందిన భారతీయ మహిళా డాక్టర్ ...పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కేసు నమోదుకు సుమారు తొమ్మిది రోజుల పాటు తాత్సారం చేశారు. ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అయితే వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆ వైద్యురాలికి మరో చేదు అనుభవం ఎదురైంది.... వివరాల్లోకి వెళితే.. డాక్టర్ భాస్వతి భట్టాచార్య. వారణాసిలోని బనారస్ యూనివర్శిటీలో ఆయుర్వేదంలో పీహెచ్డీ చేస్తున్నారు. సుగర్ వ్యాధి-నివారణపై ఆమె పరిశోధన చేస్తున్నారు. ఏప్రిల్ 22న తన ఫ్రెండ్‌తో కలిసి యూనివర్శిటీలో క్యాంపస్‌లో నడుస్తుండగా అయిదుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. సెల్‌ఫోన్ ఎత్తుకుపోయారు. లాప్‌టాప్‌ను ధ్వంసం చేశారు. దీనిపై స్థానిక లంకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెడితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, కామ్‌గా ఉండమని సలహా ఇచ్చారన్నారు. అదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన దాడి నుండి తాను తప్పించుకున్నాననీ, లేకుంటే తాను మరో నిర్భయగా మారేదాన్ని అని ఆమె వాపోతున్నారు. ఆత్మరక్షణ కోసం గతంలో తాను తీసుకున్న శిక్షణ ఈ సందర్భంగా తనకు బాగా ఉపయోగపడిందని డా.భట్టాచార్య తెలిపారు. చివరికి ఎస్పీ జోక్యం తరువాత కానీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. లైంగిక దాడి బాధితులను మహిళా వైద్యులు మాత్రమే పరీక్షించాలన్న కనీస నిబంధనను పక్కన బెట్టి, ఇద్దరు మగ డాక్టర్లు, ఒక మహిళా పోలీస్ అధికారి సమక్షంలో పరీక్షలు నిర్వహించారనీ అది తనకు చాలా బాధ కలిగించిందని.. మరోసారి లైంగిక దాడి జరిగినంత ఆవేదన కలిగిందని ఆమె వాపోయారు. అంతేకాదు.. తాను ఆయుర్వేద డాక్టర్ అని తెలియగానే.. తమ అరచేతులు చూపించి, తమ భవిష్యత్తు చూడమంటూ వైద్యులు బలవంతం చేశారన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. దాడి జరిగిన ప్రదేశానికి తనను తీసుకెళ్లి అప్పటి సంఘటనను నటించి చూపాలని పోలీసు అధికారి వేధించడం మరో ఎత్తు అని డాక్టర్ భాస్వతి భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ సంఘటనపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసిన డా.భట్టాచార్య..ప్రధాని విదేశాలపై మోజును విడిచిపెట్టి తనసొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మండిపడ్డారు. విదేశీ పెట్టుబడిదారుల కంటే దేశంలోని ప్రజల బాగోగులు ముఖ్యమనే విషయాన్ని మోదీ గుర్తించాలన్నారు. అయితే దీనిని లంకా పోలీస్ స్టేషన్ అధికారి రమేష్ యాదవ్ ఖండిస్తున్నారు. కేసు నమోదులో ఆలస్యానికి కారణం భట్టాచార్యేనన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.కాగా ప్రధాని మోదీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గం వారణాసి. నిర్భయ డాక్యుమెంటరీ ఉదంతంతో దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులు, మహిళా రక్షణ అంశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. -
భారతరత్న మాలవీయ
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన మదన్ మోహన్ మాలవీయ ఆ బృహత్ కర్తవ్యంలో ఉండగా ఎన్నో సమస్యలు చుట్ట్టు ముట్టాయి. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిం ది. దేశభక్తి నిండిన ఆయన విద్యావ్యాప్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన ద్రష్ట. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ఆయన దృఢనిశ్చయం సడలలేదు. ఊరూరూ తిరిగి, ఎందరినో కలసి విరాళాలు పోగుచేశారు. ఆ సందర్భం గా హైదరాబాద్ నిజాం నవాబును కూడా కలసి విరా ళం అడిగారు. దానికి నిజాం నవాబు... ‘‘ఎంత ధైర్యం హిందూ విశ్వ విద్యాలయం స్థాపన కోసం నన్నే విరాళం అడుగుతావా?’’ అని ఆగ్రహించి, తన కాలి చెప్పుని తీసి ఆయనపైకి విసిరాడు. మాలవీయగారు మారు మాట్లాడకుండా ఆ చెప్పుని తీసుకుని బజారులో వేలం వెయ్యడం మొదలుపెట్టారట. నవాబుగారి చెప్పు అని చాలామంది పోటీపడి వేలం పాడసాగారట. ఇది తెలిసి నవాబుగారు ‘‘ఎవరైనా నా చెప్పుని తక్కువ ధరకు కొంటే ఎంత అవ మానం’’ అని భటులని పంపి పెద్ద మొత్తానికి తానే వేలంలో కొనుక్కు న్నారట. ఏ పరిస్థితిని అయినా అవకాశంగా మలచుకున్నవారే గొప్ప నేతలు. మాలవీయకు భారతరత్న గుర్తింపు సమంజసం. - తలారి సుధాకర్ కోహెడ, కరీంనగర్ -
మనం రోబోలను తయారుచేయకూడదు!
మన విద్యావ్యవస్థ రోబోలను తయారుచేయకూడదు.. ఈ మాటలు అన్నదెవరో తెలుసా? ప్రధానమంత్ర నరేంద్రమోదీ. విద్యావ్యవస్థలో మంచి అధ్యాపకులుండాలని, వారు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి తప్ప.. వాళ్లను యాంత్రికంగా మార్చకూడదని ఆయన చెప్పారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గంగానది ప్రవహించే ఈ భూమిలో సాంస్కృతిక విద్య ఉండేదని, అంతకంటే ముఖ్యంగా విద్యాసంస్కృతి అలరారిందని ప్రధాని చెప్పారు. మన పిల్లలు మంచి ఉపాధ్యాయులుగా ఎలా తయారవుతారో మనం ఆలోచించాలన్నారు. దేశంలో మంచి ఉపాధ్యాయులుంటే.. పిల్లలు వాళ్లంతట వాళ్లే బాగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఉపాధ్యాయుడు అవ్వాలనుకునే విద్యార్థి కేవలం పరీక్షల కోసం చదవడం కాకుండా.. తన ఉపాధ్యాయులను జాగ్రత్తగా పరిశీలిస్తాడని మోదీ అన్నారు. ప్రపంచానికే మంచి ఉపాధ్యాయులను మనం అందించాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం టీచర్లు కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. -
మాలవ్యా జీవిత విశేషాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవ్యాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) ని స్థాపించారు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్‌కు నాలుగు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. దేశంలోని పలు పత్రికలకు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. మరణాంతరం మదన్ మోహన్ మాలవ్యా ఈ పురస్కారం అందుకుంటున్న 11 వ వ్యక్తి. 2014, డిసెంబర్ 25న మాలవ్యా 153వ జయంతిని ప్రభుత్వం నిర్వహించనుంది. మాలవ్యా జీవన ప్రస్థానం: 1861 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు మాలవ్యా తల్లిదండ్రులు బ్రిజ్‌నాథ్, మూనాదేవిలు కలకత్తా యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా అందుకున్నారు. అలహాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ తర్వాత అలహాబాద్ కోర్టు, హైకోర్టులో న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. చౌరీచౌరా అల్లర్ల కేసులో ఉరి శిక్ష పడిన నిందితుల తరపున మాలవ్యా వాదించి... దాదాపు 150 మందిని నిర్ధోషులుగా విడుదల చేయించారు. 1878లో మీర్జాపూర్‌కు చెందిన కుందన్ దేవిని వివాహం చేసుకున్నారు. మాలవ్యా, కుందన్ దేవి దంపతులకు అయిదుగురు కుమార్తెలు, అయిదుగురు కుమారులు ఉన్నారు. 1886లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభం 1887లో నేషనలిస్ట్ వీక్లీ సంపాదకుడిగా నియమితులయ్యారు. 1907లో అభ్యుదయ వేదిక, మరియాద హిందీ వార పత్రికలను స్థాపించారు 1916లో బనారస్ హిందూ యూనివర్శిటీని స్థాపించారు. 1919 -39 మధ్య ఆ యూనివర్శిటీ వీసీగా వ్యవహారించారు. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. 1924 - 46 మధ్య కాలంలో హిందూస్థాన్ టైమ్స్ ఛైర్మన్‌గా వ్యవహారించారు. 1941లో గోరక్ష మండల్‌ను ఏర్పాటు చేశారు. మకరంద్ కలం పేరిట మాలవ్య పద్యాలు రాశారు. అనేక పత్రికల్లో ప్రచురితమైయ్యాయి. 1946 నవంబర్ 12న మృతి