Rakesh Asthana
-
ప్రజా ప్రయోజనాల కోసమే ఆస్తానా నియామకం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాను నియమించడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించుకుంది. ఢిల్లీలో భిన్నమైన శాంతి భద్రతల సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసమే ఆయనను నియమించినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆస్తానా పెద్ద రాష్ట్రమైన గుజరాత్లో పనిచేశారని, భారీ స్థాయిలో పోలీసు బలగాలను నేతృత్వం వహించిన అనుభవజ్ఞుడని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పారా మిలటరీ దళాల్లో పని చేశారని వెల్లడించారు. అలాంటి అపార అనుభవం ఉన్న అధికారి సేవలు ఢిల్లీలో అవసరమని భావించామని, అందుకే నగర పోలీసు కమిషనర్‌గా నియమించినట్లు అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఆస్తానా సర్వీసు గడువును సైతం పొడిగించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడానికి కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) కేడర్‌లో ప్రస్తుతం నిర్దేశిత అనుభవం ఉన్న అధికారులెవరూ అందుబాటులో లేరని వివరించారు. అందుకే తగిన అనుభవం కలిగిన గుజరాత్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ ఆస్తానాను నియమించినట్లు పేర్కొన్నారు. ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా అపాయింట్ చేస్తూ కేంద్ర హోంశాఖ జూలై 27న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. -
నేరస్థుల వెన్నులో వణుకు.. చట్టాలను పాటించే ప్రజలకు భద్రత..!
దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశం లోపల పోలీసులు ఉన్నారనే ధైర్యంతోనే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోగలుగుతున్నారు. ప్రతి వ్యవస్థలో అవినీతి అధికారులు ఉన్నట్లే.. పోలీసు శాఖలో కూడా కొన్ని అవినీతి కలుపు మొక్కలు ఉండవచ్చు. అంత మాత్రం చేత వ్యవస్థ మొత్తాన్ని శంకించాల్సిన అవసరం లేదు. పల్లె, పట్టణం, నగరం.. ఇలా పేరేదైనా పోలీసుల నిరంతర నిఘా ప్రజలకు భరోసానిస్తుంది. సాక్షి, న్యూఢిల్లీ: పోలీసులంటే నేరస్థులకు భయం, చట్టాన్ని పాటించే పౌరులకు భద్రతా భావం కలిగేలా ఉండాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. తీవ్రమైన నేరాలు జరిగితే జిల్లా డీసీపీలు తప్పనిసరిగా నేర ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన ఆదేశించారు. చైన్ స్నాచింగ్, దోపిడీల వంటి పట్టణ నేరాలను నిరోధించడానికి వీధుల్లో పోలీసుల నిరంతర నిఘా ఉండాలని సీపీ కోరారు. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయాలు ఢిల్లీ సీపీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాకేశ్ ఆస్తానా కీలక నిర్ణయాలు చేపడుతున్నారు. ఉన్నత స్థాయి ర్యాంకు అధికారులతో నేరాలకు అదుపు చేయడానికి మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్‌ను విభజించి నేర పరిశోధనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పోలీసు అధికారులకు నిర్దిష్ట పనులు అప్పగించన్నుట్లు సమాచారం. టాస్క్‌ల ఆధారంగా పోలీసులు ఒంటరిగా ఉండవద్దని సూచిస్తున్నారు. అనవసరంగా తప్పులు వెతుకొద్దు..! వివిధ ప్రదేశాల్లో డ్యూటీని నిర్వర్తించడానికి ఏ పోలీసు వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దని, సీనియర్ అధికారులు మార్గదర్శకులుగా ఉండి ఫోర్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. అనవసరంగా వారి వద్ద తప్పులు వెతకవద్దని కోరారు. 14,000 మంది పోలీసు సిబ్బంది హాజరైన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పోలీసులు పెట్రోలింగ్ సమయంలో అనేక సాంకేతిక కార్యక్రామాలను చేపట్టారని అన్నారు. సాక్ష్యం, శాస్ట్రీయ దర్యాప్తు ఆధారంగా నిందితులను దోషులుగా నిర్థారిస్తారని అన్నారు. ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్లలో మూడు డ్యూటీ షిఫ్ట్‌లు కూడా పైలట్ ప్రాతిపదికన ప్రారంభమవుతాయని సీపీ సూచించారు. మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలి వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు, ఆటో డ్రైవర్లు, రిక్షావాలా మొదలైన వారి సహకారంతో ఢిల్లీ పోలీసులు తీవ్రవాద కార్యకలాపాలను, నేరాలకు ప్రణాళికలు రచించే వారిని గుర్తించాలని అన్నారు. ఫిర్యాదుదారులు, బాధితులు, పోలీస్ స్టేషన్లకు వచ్చే సందర్శకులకు తగినంత సమయం ఇచ్చి, శ్రద్ధ చూపాలని అన్నారు. వారితో మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలని ఆస్తానా ఎస్హెచ్ఓలకు చెప్పారు. నగరానికి వచ్చే సందర్శకులు తమ మొదటి అభిప్రాయాన్ని ట్రాఫిక్ సిబ్బంది వలనే పొందుతారని, అందువల్ల ఢిల్లీ పోలీసులపై సరియైన అభిప్రాయాన్ని కలిగించే బాధ్యత ట్రాఫిక్ విభాగానికి ఉందని ఆయన అన్నారు. ఇక స్వాతంత్ర్యదినోత్సవం కోసం ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట వద్ద ఎవరూ ఆందోళనలు చేయకుండా.. పెద్ద పెద్ద కంటైయినర్లను గోడలుగా ఏర్పాటు చేస్తున్నారు. జమ్మూ ఎయిర్‌బేస్‌పై ఇటీవలి డ్రోన్ దాడి నేపథ్యంలో.. భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఆయన నియామకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అధికార పక్షం ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. వివాదాస్పదుడైన ఓ అధికారిని దేశ రాజధానిలోని పోలీసు బలగాలకు అధిపతి కారాదని తీర్మానం పేర్కొంది. ఆస్తానా నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నా రు. నిబంధనలకు లోబడి కేంద్రం నియామకాలు చేపట్టాలన్నారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసున్న ఏ అధికారిని కూడా దేశంలో పోలీసు విభాగాధిపతిగా నియమించరాదంటూ 2019 మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాజాగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఆస్తానాను నియమిస్తున్నట్లు మంగళవారం తెలిపిన కేంద్రం..ఆయన సర్వీసును ఏడాది కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ‘పదవీకాలం రీత్యా ఆయన అనర్హుడు కాబట్టే సీబీఐ డైరెక్టర్‌గా పరిగణనలోకి తీసుకోలేదు. మరి అదే నిబంధన ఢిల్లీ పోలీసు కమిషనర్ నియామకానికి కూడా వర్తించాలి కదా.. అని కేజ్రీవాల్ అన్నారు. -
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానా
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా గుజరాత్ కేడర్‌కు చెందిన రాకేశ్ ఆస్తానా బుధవారం నియమితులయ్యారు. నియామకానికి సంబంధించిన ఆదేశాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను అదుపులో ఉంచడం, నేరలు జరకుండా చూడడం పోలీసుల ప్రాథమిక విధి అని, అది తనకు తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు పనులు చేస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆస్తానా గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– యూనియన్ టెర్రిటరీ కేడర్‌కు చెందని ఐపీఎస్ అధికారిని ఢిల్లీ కమిషనర్‌గా నియమించడం అత్యంత అరుదు కావడం గమనార్హం. -
వార్షిక నివేదిక వెల్లడించిన బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా శనివారం వార్షిక నివేదికను వెల్లడించారు. గతేడాది సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.2,786 కోట్ల విలువైన 632 కిలోల డ్రగ్స్ పట్టుకున్నామని వెల్లడించారు. 55 తుపాకులు, 4223 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరిహద్దుల్లో 22 మంది చొరబాటుదారులను మట్టుబెట్టామని చెప్పారు. మొత్తం 165 మంది చొరబాటుదారులను అరెస్ట్ చేశామని తెలిపారు. -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్‌బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్‌కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
బీఎస్ఎఫ్ డీజీగా రాకేష్ ఆస్థాన నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్ధానా సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆస్ధానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆస్ధానా 2021 జులై 31 వరకూ బీఎస్ఎఫ్ డీజీగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం వంటి హైప్రొఫైల్ కేసులను ఆయన విచారించారు. ఇక 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రాకేష్ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి.ఓ మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదిర్శిగా కౌముది కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఏపీ క్యాడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కౌముది నియమితులయ్యారు. కౌముది ప్రస్తుతం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక యూపీ క్యాడర్‌కు చెందిన ఆయన బ్యాచ్‌మేట్ మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్‌కు ఊరట -
సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, డీఎస్పీ దేవేందర్ కుమార్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం సమర్థించింది. రాకేష్ ఆస్థానా, దేవేందర్ కుమార్ల అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ తెలిపారు. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన కేసులకు ఆధారాలు లేవంటూ కోర్టు తెలిపింది మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మోయిన్ ఖురేషీ వ్యవహారంలో విచారణ సందర్భంగా.. కేసు నుంచి బయటపడేందుకు తాను రూ.2 కోట్ల లంచం పది నెలల్లో చెల్లించానని హైదరాబాద్ వ్యాపారి సతీష్ సానా ఫిర్యాదు మేరకు అక్టోబరు 15న ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేస్తారా?
న్యూఢిల్లీ: సొంత డీఎస్పీని అరెస్ట్ చేసి, కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయడంపై సీబీఐకి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అవినీతికి సంబంధించిన ఒక కేసును సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా అనేక ఆధారాలు కన్పిస్తున్న సోమేశ్వర్ శ్రీవాస్తవను అరెస్ట్ చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాయ్ వ్యాపారి, ప్రధాన నిందితుడు అయిన మనోజ్ ప్రసాద్‌కు శ్రీవాస్తవ్ సోదరుడవుతాడు. ‘శ్రీవాస్తవ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనోజ్ ప్రసాద్ కన్నా ఈయనే కీలకంగా కనిపిస్తున్నాడు. ఆయనను స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారు? మీరు మీ సొంత డీఎస్పీనే అరెస్ట్ చేశారు. కేసులో పెద్ద పాత్ర పోషించినవారిని వదిలేశారు’ అని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీబీఐ.. శ్రీవాస్తవ్ పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని వివరణ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై ఎల్ఓసీ(లుక్ ఔట్ సర్క్యులర్) జారీ చేశామంది. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఎల్ఓసీ ఎందుకు? దాంతో ఏం లాభం. భారతదేశం చాలా పెద్దది. ఇక్కడే హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్ కన్నా శ్రీవాస్తవ్‌కు వ్యతిరేకంగా ఎక్కువ సాక్ష్యాలున్నాయని, కీలక నిందితుడైన ఆయనను అలా వదిలేశారని వ్యాఖ్యానించారు. అనంతరం.. అవసరమైతే గతంలో ఈ కేసును విచారించిన అధికారిని పిలిపిస్తామని చెప్పి.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. మాంసం ఎగుమతిదారు అయిన మొయిన్ ఖురేషీకి సంబంధించిన 2017 నాటి కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్ బాబు నిందితుడు. ఆ కేసును విచారిస్తున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు తనపై చర్యలేవీ తీసుకోకూడదని కోరుతూ పలు విడతలుగా రూ. 2 కోట్లు మనోజ్ ప్రసాద్, శ్రీవాస్తవ్‌ల ద్వారా ఇచ్చానని సతీశ్ బాబు ఫిర్యాదు చేశారు. దాంతో ఆస్థానాపై కేసు నమోదు చేశారు. సహ నిందితుడిగా సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను, మధ్యవర్తిగా వ్యవహరించిన మనోజ్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. -
అస్తానా నరకం చూపిస్తానన్నాడు
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విచారణలో చెప్పినట్లు వినకుంటే జైలులో తన జీవితాన్ని నరకప్రాయం చేస్తానని సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా బెదిరించినట్లు ఆరోపించాడు. మంగళవారం ఢిల్లీ కోర్టు ముందు ఆయన ఈ విషయాలు వెల్లడించాడు. చాలా మందిని చంపిన నేరగాళ్ల పక్కనే తనను జైలులో ఎందుకు ఉంచారని, తానేం నేరం చేశానని ప్రశ్నించాడు. ‘కొన్నేళ్ల క్రితం రాకేశ్ అస్తానా నన్ను దుబాయ్‌లో కలిసి నా జీవితాన్ని నరకప్రాయం చేస్తానని బెదిరించారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నా గది పక్కనే గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను ఉంచారు. 16–17 మంది కశ్మీరీ వేర్పాటువాదుల్ని కూడా నేనున్న జైలులోనే నిర్బంధించారు’ అని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, మిచెల్‌ను నేడు, రేపు తీహార్ జైలులోనే విచారించేందుకు స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతిచ్చారు. ఈ సమయంలో జైలు అధికారి ఒకరు అక్కడే ఉంటారు. మిచెల్‌ను ఆయన లాయర్ ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున కలుసుకునేందుకు కూడా అనుమతిచ్చారు. జైలులో తనని మానసిక వేధింపులకు గురిచేశారన్న మిచెల్ ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు..సీసీటీవీ ఫుటేజీని గురువారం నాటికి సమర్పించాలని జైలు అధికారుల్ని ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో లాయర్ గౌతమ్ ఖైతాన్ బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. ఖైతాన్ విదేశాల్లో నల్లధనం, ఆస్తులు కూడబెట్టాడని ఈడీ ఆరోపించడంతో జనవరి 26న కోర్టు ఆయన్ని రెండ్రోజుల కస్టడీకి పంపిన సంగతి తెలిసిందే. -
‘భారత్ వస్తే జీవితం నరకం అవుతుందన్నారు’
న్యూఢిల్లీ : సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనను బెదిరింపులకు గురిచేశారంటూ క్రిస్టియన్ మైకేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి మైకేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్ ఆస్థానా గత మేలో దుబాయ్‌లో తనతో మాట్లాడారంటూ మైకేల్ మంగళవారం కోర్టుకు తెలిపాడు. భారత్‌కు తిరిగి వస్తే తన జీవితం నరకం అవుతుందని రాకేష్ తనను హెచ్చరించాడని అతడు పేర్కొన్నాడు. ఇక వైట్ కాలర్ నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను హంతకులు, ఉగ్రవాదుల బ్లాకులో ఉంచడం సరైంది కాదని మైకేల్ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. ఈ క్రమంలో మైకేల్ ఉన్న బ్లాక్‌లో అటువంటి వ్యక్తులెవరూ లేరని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. రాకేష్ ఆస్థానాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేయగా.. తనను ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్తాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇంతకీ మైకేల్ ఎవరు? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశాడు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగాడు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చాడు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగాడు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997-2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
‘వర్మా.. ఈ ఒక్కరోజు పనిచేయండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ తీరుతో పోలీస్ సర్వీసుకు సీబీఐ మాజీ చీఫ్ ఆలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీవిరమణ చేసే వరకూ సర్వీసులో కొనసాగాలని కోరింది. అలోక్ వర్మ ఈనెల 31న (నేడు) పదవీవిరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ ఒక్కరోజు పనిచేయాలని ఆయనను హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. కాగా,సీబీఐ చీఫ్‌గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ ఆస్ధానాను వేరే శాఖకు బదలాయించింది. -
సీబీఐలో మరో నలుగురిపై వేటు
న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్‌వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
రాకేష్ ఆస్ధానాపై బదిలీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించిన ప్రభుత్వం ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్ధాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐలో నెంబర్ టూగా ఉన్నరాకేష్ ఆస్థానాను దర్యాప్తు ఏజెన్సీ నుంచి ప్రభుత్వం తప్పించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేసింది. కాగా తనపై నమోదైన అవినీతి కేసుపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లినా ఆయనకు ఊరట లభించలేదు.ఆలోక్ వర్మ పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే ఆస్ధానాపై బదిలీ వేటు పడింది. -
అలోక్ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ తొలగింపు వెనకనున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలోక్ వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థాన చేసిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి దర్యాప్తు జరిపి సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఆయన్ని సీబీఐ నుంచి తప్పించడం, ఆయన్ని ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడం, ఆ కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచే తప్పుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. వర్మపై దర్యాప్తును సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఏకే పట్నాయక్‌తోపాటు సీవీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ ఆయనపై ఎనిమిది ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కేవీ చౌదరి ఎందుకు తప్పుడు నివేదికను సమర్పించారన్నది ఓ ప్రశ్నయితే, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తప్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు మద్దతిచ్చారన్నది మరో ప్రశ్న. ప్రధాని సిఫార్సు మేరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితుడైన రాకేశ్ అస్థాన హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు రావడం, వాటిని పురస్కరించుకొని సీబీఐ డైరెక్టర్ హోదాలో వర్మ, ఆయనపై కేసు పెట్టడం, వర్మకు వ్యతిరేకంగా రాకేశ్ ప్రత్యారోపణలు చేయడం, ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపించడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. వారిపై కేంద్రం చర్యలు తీసుకోకముందే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి 2018, అక్టోబర్ నెలలో అలోక్ వర్మను స్వయంగా కలుసుకొని ఆయనకు అస్థానకు మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అందుకు అలోక్ వర్మ అంగీకరించకపోవడంతో రాజీ కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అలోక్ వర్మపై చౌదరి స్వయంగా దర్యాపు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు లొంగారు? అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెల్సినా ఆయనపై చర్యకు నిజాయితీపరుడిగా గుర్తింపున్న జస్టిస్ సిక్రీ మొగ్గు చూపడానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమన్న వార్తలు వచ్చాయి. కానీ అది ఎలాంటి ఒత్తిడి? ఆయన ఎలాంటి ప్రలోభానికి లొంగారు? అన్న విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే వర్మ ఉద్వాసనకు ప్రభుత్వం తరఫున వత్తాసు పలకడం వల్ల ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. లండన్‌లోని ‘కామన్వెల్త్ ట్రిబ్యునల్’కు జస్టిస్ ఏకే సిక్రీ పేరును శనివారం నాడు మోదీ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఆ ప్రలోభం ఏమిటో బయటి ప్రపంచానికి తెల్సింది. అప్పటికే విమర్శలతో కలత చెందిన జస్టిస్ సిక్రీ కేంద్రం సిఫార్సును సున్నితంగా తిరస్కరించారు. దీంతో వర్మ ఉద్వాసనపై తలెత్తిన ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలే దొరికాయి. అయితే ఆయన్ని ఎందుకు తొలగించారన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షం చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించినందుకే ఆయనపై వేటు పడిందా! -
అలోక్ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ శనివారం మీడియా ముందు స్పష్టం చేశారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్ వర్మపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అంతేకాకుండా అలోక్ వర్మపై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా కూడా అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శుక్రవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించడం మరింత షాకింగ్ న్యూస్. అలోక్ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ యజమాని మాటలను పలికే పంజరంలో రామ చిలక’ అంటూ 2013లో వ్యాఖ్యానించినదీ కూడా జస్టిస్ ఆర్ఎం లోధానే. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను విశ్వసించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. విచారణను ఇటు సీవీసీ తరఫున అటు సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన జస్టిస్ లోధా, జస్టిస్ పట్నాయక్, ఇద్దరూ ఆధారాలు లేవని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ నుంచి సుప్రీం కోర్టుకు, కోర్టు నుంచి ప్రధాని కార్యాలయానికి నివేదిక ఎలా వెళ్లిందన్నది కోటి రూకల ప్రశ్న. సీవీసీ కూడా పంజరంలో రామ చిలకేనా? వర్మపై తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీకి సూచించినప్పటికీ వర్మను తొలగిస్తూ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటేనని పట్నాయక్ అన్నారు. అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీవీసీ అభిప్రాయమే తుది అభిప్రాయం ఎందుకు అవుతుందని, విచారణను పర్యవేక్షించిన తన నివేదికను పరిగణలోకి తీసుకోవచ్చుగదా! అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సుప్రీం కోర్టుకు అందజేసిన పట్నాయక్ నివేదికను సుప్రీం కోర్టు ప్రధాని కార్యాలయానికి పంపి ఉండకపోవచ్చు. పంపినా పట్టించుకోక పోవచ్చు. నరేంద్ర మోదీకి మంచి విశ్వాసపాత్రుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అలోక్ వర్మ ప్రయత్నించడం, అలోక్ వర్మపైనే రాకేశ్ అస్థాన ప్రత్యారోపణలు చేయడంతో సీబీఐలో ముసలం పుట్టడం, వారిద్దరిని బలవంతపు సెలవుపై మోదీ సర్కార్ పంపించడం, అలోక్ వర్మ తనపై చర్యను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. చదవండి: అలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు -
ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ఓ అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వ్యాపారి సతీశ్ సానా ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆస్థానా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆస్థానాపై క్రిమినల్ విచారణ జరపకుండా, అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వజీరీ మాట్లాడుతూ.. ఆస్థానా, కుమార్‌లను విచారించేందుకు, అరెస్ట్ చేసేందుకు ఇకపై కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కేసు విచారణను 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీబీఐ అప్పటి డైరెక్టర్ ఆలోక్ వర్మపై చేసిన అభియోగాలకు తగిన ఆధారాల్లే్లవని అభిప్రాయపడ్డారు. ఓ కేసులో తనకు ఊరట కల్పించేందుకు ఆస్థానా లంచం తీసుకున్నారని సతీశ్ సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ హోదాను దుర్వినియోగం చేస్తూ తనను వేధించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. దీంతో ఆస్థానాపై అవినీతి నిరోధక చట్టంలోని నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ తీర్పును ఆస్థానా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశముంది. -
రాకేష్ ఆస్ధానాకు ఢిల్లీ హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్ధానాతో పాటు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్, దళారి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నేర విచారణలపై ఆస్ధానాకు కల్పించిన మధ్యంతర ఊరటను తొలగించారు. ఆస్ధానా సహా ఇతరులపై నమోదైన కేసు విచారణను పది వారాల్లోగా పూర్తిచేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆస్ధానాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన నేరపూరిత కుట్ర, అవినీతి, నేర ప్రవర్తన అభియోగాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ ప్రమేయంతో కూడిన మనీల్యాండరింగ్ కేసు నుంచి తనను తప్పించేందుకు తాను ముడుపులు ముట్టచెప్పానని హైదరాబాద్‌కు చెందిన సాన సతీష్ బాబు ఫిర్యాదు ఆధారంగా ఆస్ధానా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మపై ఆరోపణలు చేసినందుకే తనపై ముడుపుల కేసును ముందుకు తెచ్చారని, తనపై అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని రాకేష్ ఆస్ధానా కోర్టుకు నివేదించారు. ఇక ఫైర్ సర్వీసుల డీజీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన ఆలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు
న్యూఢిల్లీ: గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలు ఒకరిపై మరొకరి ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపి నాగేశ్వరరావును అక్టోబర్ 23న సీబీఐకి కొత్త డైరెక్టర్(ఇన్చార్జ్)గా నియమించడం తెల్సిందే. సీబీఐ డైరెక్టర్ హోదాలో నాగేశ్వరరావు.. భారీస్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు. ఆస్థానా అవినీతి ఆరోపణల కేసును దర్యాప్తుచేస్తున్న డీఎస్పీ ఏకే బస్సీ, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా ముఖ్యమైన ఉన్నతాధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు.. మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ తీర్పుచెప్పడం తెల్సిందే. దీంతో బుధవారం సీబీఐ డైరెక్టర్ హోదాలో విధులకు హాజరైన ఆలోక్ వర్మ.. నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దుచేశారు. -
సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
-
కేంద్రానికి ఎదురుదెబ్బ.. సీబీఐ కేసులో కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపలేరని, ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అలోక్ వర్మను సెలవులపై పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొటివేస్తూ... సీబీఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునేముందు అపాయింట్మెంట్ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని పేర్కొంది. అలోక్ వర్మపై ఆరోపణలు ఉన్నందున హైపవర్ కమిటీ విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం పేర్కొంది. కమిటీ విచారణ పూర్తి అయ్యి నివేదికను అందించిన తరువాతనే నిర్ణయాలు తీసుకుంటారని ధర్మాసనం తీర్పులో పొందుపరిచింది. అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్ 23న సెలవుపై పంపంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
సీబీఐ జేడీ బదిలీ.. వెంటనే నిలిపివేత
న్యూఢిల్లీ: ఉన్నతాధికారుల అవినీతి ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న సీబీఐ..శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై తీవ్ర అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ వి.మురుగేశన్‌ను మరో కేసు దర్యాప్తునకు బదిలీ చేస్తూ శుక్రవారం సీబీఐ అంతర్గత ఉత్తర్వు జారీ చేసింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మురుగేశన్‌ను అవినీతి వ్యతిరేక విభాగం నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేస్తున్నట్లు సీబీఐ ఇన్చార్జి డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వెలువరించిన ఉత్తర్వు మీడియాకు లీకైంది. బొగ్గు కుంభకోణం కేసుల దర్యాప్తును వేగవంత చేయటానికి గాను ఆయన్ను ఆ విభాగానికి మార్చుతున్నట్లు అందులో పేర్కొన్నారు. -
సీబీఐ వివాదం : సుప్రీంలో ముగిసిన వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ఎన్జీవో కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశామని కోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు వినిపించిన కామన్ కాజ్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. సీబీఐ చీఫ్‌గా వర్మ అధికారాలను కేంద్ర కత్తిరించడాన్ని తప్పుపట్టారు. సీబీఐ డైరెక్టర్ పదవి నిర్ణీత పదవీకాలంతో కూడుకుని ఉన్నందున దీనికి అఖిల బారత సర్వీస్ నిబంధనలు వర్తించవని కోర్టుకు నివేదించారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుందని అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అనూహ్య, అసాధారణ సందర్భాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని విజిలెన్స్ కమిషన్ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సీబీఐలో పరిస్థితులు ఈ ఏడాది జులైలోనే గాడితప్పడం ప్రారంభించాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. సెలక్షన్ కమిటీని సంప్రదించకుండానే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలను కత్తిరించే అవసరం ఎందుకొచ్చిందని కోర్టు విజిలెన్స్ కమిషన్‌ను ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు వర్మ, ఆస్ధానాల మధ్య రాత్రికి రాత్రే వివాదం చెలరేగలేదని పేర్కొంది. సీబీఐ ఉన్నతాధికారులు కేసుల దర్యాప్తును గాలికొదిలేసి వారిద్దరి మధ్య కేసులపై విచారణ చేపడుతున్నారని మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలను చక్కదిద్దాల్సిన పరిధి విజిలెన్స్ కమిషన్‌కు ఉందని, లేకుంటే భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టులకు సీవీసీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్‌పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చిందని, విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించినా నెలల తరబడి వర్మ సంబంధిత పత్రాలను ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. మరోవైపు ఈ కేసులో తమ క్లెయింట్ ముందస్తు హెచ్చరికలతో వ్యవస్థను మేలుకొల్పేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం ఆయననూ అదే తరహాలో చూస్తోందని రాకేష్ ఆస్ధానా తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగీ వాదించారు. వర్మపై సీవీసీ విచారణను ప్రభుత్వం ముందుకుతీసుకువెళ్లాలని కోరారు. ఇక రాకేష్ ఆస్ధానా సహా సీబీఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులను కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ కేసులో వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్‌లో ఉంచామని సుప్రీం బెంచ్ పేర్కొంది. -
ఇద్దరూ పిల్లుల్లా కొట్లాడుకున్నారు!
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో దేశ ప్రజల ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నవ్వులపాలయిందని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కీచులాటతో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సీబీఐపై చెదిరిన ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే కేంద్రప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ పేర్కొన్నారు. తనను సీబీఐ డైరెక్టర్‌గా తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలోక్ వర్మ, అస్తానాల గొడవతో సీబీఐలో అసాధారణ పరిస్థితి నెలకొందనీ, ఇద్దరు పిల్లుల్లా కొట్లాడుకోవడంతో కేంద్రం జోక్యం చేసుకోవడం మినహా మరే ప్రత్యామ్నాయం లేకపోయిందని ఈ సందర్భంగా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాము కల్పించుకోకుంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలుసన్నారు. చట్టానికి లోబడే ఇద్దరు ఉన్నతాధికారులపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. సీబీఐలో పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న అలోక్ వర్మ, అస్తానాలను కేంద్రం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. -
వారు పిల్లుల్లా పోట్లాడుకున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ సీనియర్ అధికారుల మధ్య వివాదంలో ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య విభేదాల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సీబీఐ ఉన్నతాధికారులు ఇరువురూ పిల్లుల మాదిరిగా కీచులాడుకున్నారని సుప్రీం బెంచ్ ఎదుట అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. వర్మ, ఆస్ధానాల మధ్య వివాదం తీవ్రస్ధాయికి చేరి బహిరంగ చర్చలా మారిందని ఆయన కోర్టుకు నివేదించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై తీసుకున్న చర్యలు బదిలీ వేటు కాదని, ఆయన విధులను ప్రభుత్వం ఉపసంహరింపచేసిందని కేంద్రం వివరణ ఇచ్చింది. సీబీఐ పట్ల ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టవలసివచ్చిందని వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వర్మను విజిలెన్స్ కమిషన్ ప్రశ్నించడంపై కొన్ని వార్తాపత్రికల క్లిప్పింగ్స్‌ను కూడా అటార్నీ జనరల్ కోర్టుకు సమర్పించారు. కాగా ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
కేంద్ర మంత్రి లంచం తీసుకున్నారు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో అంతఃకలహం కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీశ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు హరిభాయ్ చౌదరి జూన్ తొలిపక్షంలో కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారనీ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనీ, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సతీశ్ సానా కలిశారని మనీశ్ సిన్హా ఆరోపించారు. రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిన్హా విచారిస్తుండగా, ఇటీవల సీబీఐలో కీలక మార్పులు చేపట్టిన సమయంలో ఆయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు.ఆ బదిలీని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లోనే ఆయన పై విషయాలన్నీ పొందుపరిచారు. అజిత్ దోవల్ అడ్డుకున్నారు.. రాకేశ్ అస్థానాపై విచారణలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కలుగజేసుకుని సోదాలు జరపకుండా, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని మనీశ్ సిన్హా పిటిషన్లో ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీశ్‌ల కేసులో ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చి అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌లతో అజిత్ దోవల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానాకు సన్నిహితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్టవ్వడం తెలిసిందే. అస్థానాపై కేసును మరో సీబీఐ అధికారి ఏకే బస్సీ విచారించారు. ‘ఆధారాలుగా వాట్సాప్ చాట్లను సేకరించడం కోసం అస్థానా, దేవేంద్రల ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మను బస్సీ కోరారు. కానీ అలోక్ వర్మ అనుమతి ఇవ్వలేదు. అజిత్ దోవల్ తనకు ఆ అనుమతి ఇవ్వడం లేదనీ, సెల్ఫోన్లు తీసుకోవద్దంటున్నారని అలోక్ వర్మ చెప్పారు’ అని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయాన్ని దోవల్‌కు అలోక్ వర్మ చెప్పగా, అదే రోజు ఆ విషయాన్ని దోవల్ అస్థానాకు చేరవేశారని సిన్హా ఆరోపించారు. ఈ కేసు నుంచి బయటపడేయాల్సిందిగా దోవల్‌ను అస్థానా కోరారన్నారు. ‘అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు తన తండ్రి రా (పరిశోధన, విశ్లేషణ విభాగం)లో గతంలో పనిచేశారనీ, ఎన్ఎస్ఏ దోవల్ ఆయనకు బాగా తెలుసని మనోజ్ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం రాలో పనిచేస్తున్న సామంత్ గోయల్ అనే ఉన్నతాధికారి కూడా తన సోదరుడికి బాగా తెలుసన్నాడు. సీబీఐ అధికారుల ఉద్యోగాలు పీకేయించి అంతం చేస్తానని కూడా మనోజ్ బెదిరించాడు. సోమేశ్, సామంత్‌లు ఇటీవలే ఒక వ్యక్తిగత విషయంలో దోవల్‌కు బాగా సాయం చేశారని కూడా చెప్పాడు’ అని పిటిషన్లో సిన్హా పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్‌తో సంబంధాలు నెరిపిన అధికారులపై విచారణకు కూడా దోవల్ అనుమతించలేదని ఆరోపించారు. అలాగే సామంత్‌తో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడనీ, సీబీఐ నుంచి బయటపడేయాలని కోరగా ‘ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి అంతా సెట్ చేశాం. ఏం భయం లేదు’ అని హామీనిచ్చారనీ, ఆ రాత్రే సీబీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిన్హా ఆరోపించారు. కేసుల నుంచి రక్షణకు సురేశ్ హామీ.. సతీశ్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర హామీనిచ్చారని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రేఖా రాణి సతీశ్‌కు, సురేశ్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తానెప్పుడూ లండన్ వెళ్లలేదనీ, రేఖా రాణి ఎవరో తనకు తెలీదని సురేశ్ చంద్ర చెప్పారు. ఖండించిన హరిభాయ్ చౌదరి: తనపై వచ్చిన ఆరోపణలను హరిభాయ్ చౌదరి ఖండించారు. సతీశ్ సానా ఎవరో తనకు అస్సలు తెలీదనీ, అతణ్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఏ విచారణను ఎదుర్కొనేందుౖకైనా సిద్ధమనీ, లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. మనీశ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చౌదరిని సతీశ్ కలిశాడు అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ కేవీ చౌదరి విచారణ జరపడం తెలిసిందే. అయితే సీవీసీని ఆయన బంధువు గోరంట్ల రమేశ్ ద్వారా సానా సతీశ్ ఢిల్లీలో కలిశాడని కూడా సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. మెయిన్ ఖురేషీ కేసు విషయమై చౌదరితో సతీశ్ మాట్లాడాడనీ, అనంతరం అస్థానాకు చౌదరి ఫోన్ చేసి కేసు విషయమై వాకబు చేయగా.. సతీశ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలేవీ లేవని అస్థానా చెప్పారని సిన్హా తెలిపారు. ఈ విషయాలను విచారణలో సతీశే బయటపెట్టారన్నారు. ‘ఇందులో అక్రమమేమీ లేదు. కానీ విషయాన్ని పూర్తిగా తెలియజెప్పడం కోసం పిటిషన్లో ఈ విషయాలను కూడా పొందుపరిచా’ అని సిన్హా చెప్పారు. అలాగే హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారన్నారు. సిన్హా ఆరోపణలపై సీవీసీని స్పందన కోరగా, కోర్టులో ఈ కేసు ఉన్నందున మీడియాతో దీనిపై మాట్లాడటం సరికాదంటూ వెళ్లిపోయారు. -
అసమగ్రంగా సీవీసీ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతికి సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సమర్పించిన భారీ ప్రాథమిక నివేదిక అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాల్లో కొన్నింటిలో సీవీసీ విచారణ అభినందించదగ్గ స్థాయిలో ఉందని, మరికొన్నింటి విషయంలో దర్యాప్తు అసమగ్రంగా ఉందని పేర్కొంది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘సీవీసీ సుదీర్ఘమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. అభియోగాల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిపేందుకు మరికొంత సమయం కావాలని సీవీసీ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపింది. సీబీఐ సంస్థ గౌరవం దృష్ట్యా ఈ నివేదికను గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని సీవీసీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో నివేదికను అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు అలోక్ వర్మకు సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ పట్నాయక్‌కు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సీవీసీ నివేదికపై ప్రతిస్పందనను ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని అలోక్‌వర్మను ఆదేశించింది. ఈ సందర్భంగా తమ క్లయింట్, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు కూడా నివేదిక ప్రతిని అందజేయాలన్న ఆయన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్టీవో సంస్థ కామన్‌కాజ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే దాఖలుచేసిన పిటిషన్లను నవంబర్ 20న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
సీబీఐ వివాదం : సుప్రీం ముందుకు సీవీసీ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో నిగ్గుతేలిన అంశాలపై సుప్రీం కోర్టు సోమవారం ఆరా తీయనుంది. ప్రాధమిక దర్యాప్తు నివేదికను నేడు సుప్రీం కోర్టు పరిశీలించనుంది. వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై రాకేష్ ఆస్ధానా చేసిన ఆరోపణలను పాయింట్ల వారీగా అలోక్ వర్మ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తోంది. కాగా, వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణకు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీం కోర్టు పర్యవేక్షకుడిగా నియమించింది. వర్మపై అవినీతి ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, సీవీసీలకు గత నెల 26న నోటీసులు జారీ చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ రగడ : సీవీసీ ఎదుట హాజరైన వర్మ
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఎదుట హాజరయ్యారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో వర్మ విచారణకు హాజరైనట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. కేవీ చౌదరి నేతృత్వంలో విజిలెన్స్ కమిషనర్లు శరద్ కుమార్, టీఎం భాసిన్, ఇతరులతో కూడిన కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. వర్మపై ఆస్థానా చేసిన ఆరోపణలను రెండు వారాల్లోగా నిగ్గుతేల్చాలని సుప్రీం కోర్టు గత నెల 26న సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం వర్మ గురువారం సైతం విజిలెన్స్ ఉన్నతాధికారులు చౌదరి, కుమార్‌లను కలిసిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ వర్మపై ఆస్ధానా చేసిన ఆరోపణలకు సంబంధించి పలువురు సీబీఐ అధికారులను సీవీసీ ప్రశ్నించినట్టు సమాచారం. సీబీఐలో ఇన్స్పెక్టర్ స్ధాయి నుంచి ఎస్పీ వరకూ పలువురు సిబ్బందిని విచారించి సీవీసీ సీనియర్ అధికారి సమక్షంలో వారి వాదనలను సీవీసీ రికార్డు చేసింది. మొయిన్ ఖురేషీ ముడుపుల కేసు, లాలూ ప్రసాద్ ప్రమేయం ఉన్న ఐఆర్సీటీసీ స్కామ్ సహా పలు కేసులను విచారించిన అధికారుల స్టేట్మెంట్లను సైతం సీవీసీ రికార్డు చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
సీవీసీని కలిసిన సీబీఐ డైరెక్టర్ వర్మ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ గురువారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. విజిలెన్స్ కమిషనర్ శరద్ కుమార్‌తో వర్మ భేటీ అయ్యారని సీవీసీ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం సీవీసీ కార్యాలయానికి వెళ్లిన అలోక్ వర్మ దాదాపు రెండు గంటలపాటు అక్కడ ఉన్నారు. వర్మపై అస్తానా చేసిన లంచం ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణను చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సీవీసీని గత నెల 26వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఆ ఆరోపణలు కేసు పెట్టదగినవే
న్యూఢిల్లీ: అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలన్న ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో అస్థానాతో పాటు ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కేసు పెట్టదగినవేనని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అస్థానా పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించగా సీబీఐ గురువారం ఈ మేరకు బదులిచ్చింది. ఇంకా చార్జిషీట్ దాఖలుచేయలేదని, విచారణ పూర్తయ్యే సరికి చాలా విషయాలు బయటికి వస్తాయని తెలిపింది. అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌ల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వాజిరి బెంచ్ విచారణకు చేపట్టింది. ఈ దశలో అనవసర సందేహాలొద్దు.. ‘అవినీతి సంబంధ కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్ను రిట్ పిటిషన్ ద్వారా సవాలుచేసినప్పుడు, ఆ ఎఫ్ఐఆర్లోని ఆరోపణల్లో కేసు పెట్టదగినవి ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ దశలో కేసుతో సంబంధంలేని విషయాలు, సందేహాల్ని లేవనెత్తకూడదు. ఇక ప్రస్తుత కేసులో వచ్చిన ఆరోపణలు కేసుపెట్టదగినవే అని తేలడంతోనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ ప్రారంభించాం. కొత్త బృందం దర్యాప్తును ప్రారంభించి, కీలక పత్రాలను పరిశీలిస్తోంది. తదుపరి దశలో సవివర అఫిడవిట్ దాఖలుచేస్తాం’ అని సీబీఐ పేర్కొంది. కాగా, అస్థానాపై విచారణ చేపట్టకుండా యథాతథ స్థితిని కోర్టు నవంబర్ 14 వరకు పొడిగించింది. -
సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సంక్షోభ పరిస్థితులను సకాలంలో చక్కదిద్దే సమర్థుడు’గా పలు బిరుదులతోపాటు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద పోలీసు అధికారి మన్నెం నాగేశ్వరరావును కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. అంతుచిక్కని ఆయన నియామకం వెనకనున్న అంశాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తెలుగువాడైన మన్నెం నాగేశ్వర రావు 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 1994లో ఒడిశాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మత మార్పిడులకు వ్యతిరేకంగ, ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించవద్దంటూ కరపత్రాలు పంచారట. 1998లో ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ముస్లింలు, క్రైస్తవులు సహనం ఏమాత్రంలేని హింసోన్మాదులు. మెజారిటి హిందువుల పన్నుల చెల్లింపులతో ఈ మైనారిటీలు బతుకుతున్నారు. ఇదీ మానవ హక్కులను ఉల్లంఘించడమే. అసలు భారత రాజ్యాంగ నిర్మాతలే మైనారిటీ పక్షపాతులు’ అని ప్రసంగించారు. ఆయన ప్రసంగంపై అప్పటి ఒడిశా సీపీఎం కార్యదర్శి అలీ కిశోర్ పట్నాయక్ హైకోర్టులో కేసు వేయడంతో బరంపురం నుంచి నాగేశ్వరరావును బదిలీ చేశారు. 2008లో కాందమల్ అల్లర్లు చెలరేగినప్పుడు ఒడిశాలో నాగేశ్వరారావు సీఆర్పీఎఫ్ ఇనిస్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. క్రైస్తవుల సెటిల్మెంట్లపై కాషాయ దళాలు దాడులు జరిపి మారణ కాండను సష్టిస్తుంటే సీఆర్పిఎఫ్ దళాలను అటు వెళ్లకుండా నివారించారని పట్నాయక్ ఆరోపించారు. పైగా ఆ అల్లర్ల సందర్భంగా ‘క్రైసెస్ మేనేజర్’గా పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఒడిశాలో నేరప్రదేశంలో నేరస్థుల డీఎన్ఏను సేకరించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఆయన కాస్త మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో అగ్నిమాపక సిబ్బంది యూనిఫామ్‌ల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒడిశా ఆర్థిక శాఖ విచారణ చేపట్టింది. ఓపక్క విచారణ కొనసాగుతుండగానే అదే ఏడాది ఆయన సీబీఐ కేంద్ర కేడర్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన నియామకానికి వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ ఇంటలెజెన్స్ విభాగం పూర్తి ప్రతికూల నివేదికను ఇచ్చినా కేంద్ర పాలకులు పట్టించుకోలేదు. అందుకు హిందూత్వ వాదే కాకుండా ఆరెస్సెస్ ప్రచారక్, ప్రస్తుత బీజేపీ వ్యూహకర్త రామ్‌మాధవ్‌కు ఆయన మంచి మిత్రుడవడం కూడా కారణం కావచ్చు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులుకాగానే గుజరాత్ క్యాడర్‌కు చెందిన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు సహా మొత్తం 13 మంది అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. నిజాయితీకి నిలువుటద్దం, అవినీతికి మారుపేరుగా ముద్ర పడిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను కేంద్ర ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించిన విషయం తెల్సిందే. -
రాకేష్ ఆస్ధానాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాకు ఊరట లభించింది. ఆస్ధానాపై అవినీతి ఆరోపణల కేసులో నవంబర్ 1 వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని, అప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం దర్యాప్తు ఏజెన్సీని ఆదేశించింది. మరోవైపు కేసుకు సంబంధించి సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని సీబీఐ చేసిన వినతిని కోర్టు అంగీకరించింది. కేసును పర్యవేక్షిస్తున్న బృందంమారిపోయిందని, ఆరోపణలపై దృష్టిసారించిన విజిలెన్స్ కమిషన్ వద్ద ఫైళ్లు ఉన్నాయని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది. కాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లోగా విచారణ ముగించాలని గత వారం సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుగుణంగా అలోక్ వర్మపై దర్యాప్తుకు సంబంధించి అవసరమైన పత్రాలు, ఫైళ్లను సీవీఈసీకి దర్యాప్తు ఏజెన్సీ అందిస్తోంది. తనపై ముడుపుల కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ రాకేష్ ఆస్ధానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆస్ధానా హైకోర్టును ఆశ్రయించారు. -
రాయని డైరీ: సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
వ్యక్తుల్ని సెలవుపై పంపించగలం. వాళ్ల నిజాయితీని సెలవుపై పంపించగలమా? అలోక్ వర్మని సెలవుపై పంపించినప్పుడు.. మోదీజీ అసలు దేశంలోనే ఉంటున్నారా అనే సందేహం కలిగింది నాకు. దేశాధినేతలతో కలిసి ప్రీతికరమైన ఆహారాన్ని ఆరగించడానికే నాలుగున్నరేళ్లుగా ఆయన సమయం సరిపోతోంది! అలోక్ ఎంత ఆనెస్టో నాకు తెలుసు. ఎవరి ఇంటికైనా వెళితే కనీసం మంచినీళ్లు కూడా తాగరాయన. మంచినీళ్లు తాగినందుకు ప్రతిఫలంగా.. ‘మంచిది కాని సహాయం’ ఏదైనా ఆ ఇంటì వాళ్లకు చెయ్యవలసి వస్తుందేమోనని ఆయన భయం! సీబీఐకి ఇలాంటి వాళ్లే కదా డైరెక్టర్లుగా ఉండాల్సింది? కానీ ఏం జరిగింది? నీళ్లయినా ముట్టని సీబీఐ ఆఫీసర్‌కి తన ఆఫీస్‌లోనే నీళ్ల గ్లాసు లేకుండా చేశారు. నీళ్లుంచి గ్లాసు తీసేయడమూ, పదవి ఉంచి సెలవుపై పంపించడమూ.. రెండూ ఒకటే. అవినీతిపరుడైన అస్థానాతో పాటు, నిజాయితీపరుడైన అలోక్నీ సెలవుపై పంపించగానే.. మోదీజీకి వివరంగా ఒక బహిరంగ లేఖ రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది నాకు. అలా కాకుండా ‘టు’ అడ్రస్ పెట్టి నేరుగా మోదీజీకే లేఖ పంపిస్తే ఒక ప్రమాదం ఉంది. అరుణ్ జైట్లీ ఆ లేఖను మధ్యలోనే అందుకుని ముక్కలుముక్కలుగా చింపేసి, ఆ ముక్కల్ని నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తాడు. అలాక్కూడా కాకుండా నేనే స్వయంగా పీఎంవో ఆఫీస్‌కి వెళ్లి మోదీజీతో మాట్లాడాలనుకున్నా.. అప్పుడు కూడా జైట్లీనే అడ్డు పడతాడు. ఆర్థికశాఖ నాకు రాకుండా అడ్డుకున్న మనిషికి, ఏ శాఖా లేని వట్టి రాజ్యసభ సభ్యుడిని అడ్డుకోవడం ఏమంత కష్టం! బహిరంగలేఖను ఎలా మొదలుపెట్టాలో తేల్చుకోలేక రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనే ఉన్నాను. ‘డియర్ మోదీజీ’ అనాలా? ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అనాలా? ‘రెస్పెక్టెడ్ మోదీజీ’ అనాలా? చివరికి ఒకటనిపించింది. దేశాధినేతలు మోదీజీకి పంపే ఆహ్వాన పత్రాలపై ఉన్నట్లు.. ‘ఆనరబుల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్’ అని ప్రారంభిస్తే!! అప్పుడైతే ఆయన ఆసక్తిగా చూసే అవకాశాలుంటాయి. కరప్షన్‌పై పని చేస్తున్న మోదీజీ, కరప్షన్ పైనే పనిచేస్తున్న ఒక సీబీఐ ఆఫీసర్ని కరప్షన్‌పై కంప్లయింట్ చేసినందుకు సెలవిచ్చి పంపడం కూడా కరప్షనేనని బహిరంగ లేఖలో రాయాలి. ఈ స్టెయిల్ ఆఫ్ రైటింగ్ మోదీజీకి నచ్చుతుంది. లెటర్ మొత్తమంతా ఇలాగే రాయగలిగితే ఆయన లెటర్ మొత్తమంతా ఇంట్రెస్టుగా చదవగలుగుతారు. ఇంకో పేరాలో.. ‘‘మోదీజీ, మీరిలాగే మంచిమంచి సీబీఐ ఆఫీసర్లని సెలవుపై పంపించేస్తుంటే.. నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీ, విజయ్ మాల్యాలు.. దసరా సెలవులకో, దీపావళి సెలవులకో, కోర్టు సెలవులకో వెళ్లినట్లుగా వెళ్లి, విదేశాల్లోనే ఉండిపోతారు. అప్పుడిక కరప్షన్ చేసినవాళ్లు దేశంలో ఉండరు. కరప్షన్ జరక్కుండా చూసేవాళ్లు దేశంలోని సీబీఐ ఆఫీసులలో ఉండరు’’.. అని రాయాలి. అలోక్ని చేసినట్లే, రాజేశ్వర్ సింగ్నీ టార్గెట్ చేయబోతున్నారని నాకు అనిపిస్తోంది. సీబీఐలో అలోక్ ఎలాగో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో రాజేశ్వర్ అలాగ. కుర్రాడు. స్మైలింగ్ ఫేస్. చిదంబరం కరప్షన్ కేసుల్ని డీల్ చేస్తున్నది అతడే. అతడిని తప్పించి, చిదంబరాన్ని కేసుల నుంచి తప్పించాలని బీజేపీలోనే కొందరు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే సోనియా మీద, రాహుల్ మీద, చిదంబరం మీద, శశి థరూర్ మీద.. ఇంకా కాంగ్రెస్ వాళ్ల మీద నేను పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకుంటానని మోదీజీకి రాసే బహిరంగ లేఖలోని చివరి పేరాలో చిన్న పంచ్ ఇవ్వాలి. మాధవ్ శింగరాజు -
సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావుపై ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారంది. అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల మధ్య వర్గపోరు నేపథ్యంలో వారిద్దరినీ కేంద్రం విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. దీంతో తనను ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తప్పించిందనీ, సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీబీఐలో జేడీగా ఉన్న, ప్రస్తుతం డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలూ తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. డైరెక్టర్ విధులను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు కట్టబెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏయే అధికారులను బదిలీ చేశారు, ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ఎవరి నుంచి ఎవరికి అప్పగించారు తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నాగేశ్వర రావు నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అందించాలని స్పష్టం చేసింది. తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ అస్థానా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ కేసును తర్వాత విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వంపై పైచేయి కాదు.. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ జరగాలని తాము చెప్పడాన్ని ప్రభుత్వంపై ఆధిపత్యంలా చూడకూడదని జడ్జీలు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న విపరీత ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందన్నారు. నాగేశ్వర రావు నిర్ణయాలను అమలు చేయకూడదని తొలుత చెప్పిన కోర్టు.. తర్వాత మాత్రం ఇకపై ఆయన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోకుండా నిలువరిస్తూ, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమీక్షించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామంది. అలోక్ పిటిషన్‌పై కేంద్రం, సీవీసీల స్పందనలను కోరింది. సీబీఐ అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ లాయరు ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌నూ ఇదే బెంచ్ విచారించింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 12లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, సీబీఐ, సీవీసీ, అలోక్, అస్థానా, నాగేశ్వర రావులను ఆదేశించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, సీవీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్, అలోక్ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. సీవీసీ విచారణను పది రోజుల్లోనే పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని తుషార్ మెహతా కోరడంతో గడువును రెండు వారాలకు పెంచింది. సీవీసీకి చిత్తశుద్ధి లేదని కాదు: అధికారి అలోక్ వర్మపై సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్‌ను కేంద్రం నియమించిందంటే సీవీసీకి చిత్తశుద్ధి లేనట్లేమీ కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘అలోక్, అస్థానాలను బాధ్యతల నుంచి తప్పిస్తూ, డైరెక్టర్ విధులను నాగేశ్వర రావుకు అప్పగిస్తూ సీవీసీ, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పినంత మాత్రాన సీవీసీ చిత్తశుద్ధిని శంకించినట్లు కాదు. విచారణను సీవీసీయే చేస్తుంది కదా. ఈ కేసులో ఉన్న కొన్ని అసాధారణ అంశాల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారి వివరించారు. సానుకూల పరిణామం: జైట్లీ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు గొప్ప సానుకూలాంశమని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఈ ఆదేశాలతో నిజాలు బయటకొచ్చి దేశ ప్రయోజనాలు నిలబడతాయని అన్నారు. సీబీఐ సమగ్రత, నిబద్ధతను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమకు లేదన్నారు. నిజం నిలిచింది: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ నిజం నిలబడిందని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘తమ చెప్పుచేతల్లో ఉండే మనుషులను నియమించుకుని సీబీఐని చేజిక్కించుకోవాలన్న మోదీ ప్రభుత్వ దుష్ట ప్రయత్నం విఫలమైంది. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా నిజం నిలబడుతుంది. సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూసిన నిరంకుశ పాలకుల చెంప చెళ్లుమనేలా ఈ తీర్పు ఉంది. మోదీ ప్రభుత్వ పావుగా సీవీసీ ఇక వ్యవహరించలేదు. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని అన్నారు. ‘పంజరం చిలుక’కు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ అనంగ కుమార్ పట్నాయక్ గతంలో సీబీఐకి సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. సంయుక్త కార్యదర్శి లేదా ఆపై స్థాయి అధికారులపై సీబీఐ విచారణ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనలను 2014లో కొట్టేసి, సీబీఐకి స్వేచ్ఛనిచ్చిన ఐదుగురు జడ్జీల్లో జస్టిస్ పట్నాయక్ ఒకరు. 1949లో ఒడిశాలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉండి పలు కీలక తీర్పులను ఇచ్చారు. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌పై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారులు అఫ్తాబ్ అన్సారీ, జములుద్దీన్ నజీర్లకు ఉరిశిక్షను రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనంలో ఈయన ఒకరు. అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసులోనూ ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన బెంచ్‌లో పట్నాయక్ సభ్యుడు. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి శ్రీనివాసన్ దిగిపోవాలని ఆదేశించిన కోర్టు, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులనూ విచారించేందుకు నియమితమైన ద్విసభ్య బెంచ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవైనా కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ, పై కోర్టుల్లో వారు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు లాభం కలిగించేలా ప్రజాప్రతిధుల చట్టంలో ఉన్న సెక్షన్ 8(4)ను రద్దు చేసిన ధర్మాసనాల్లోనూ పట్నాయక్ సభ్యుడే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ వివాదం పూర్వాపరాలు.. 2017 జనవరి 19: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ నియామకం. అక్టోబర్ 22: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం. నవంబర్ 2: అస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన లాయర్ ప్రశాంత్ భూషణ్. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు. 2018 జూలై 12: పదోన్నతులు, కొత్త నియామకాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన సీవీసీ. అప్పటికే అలోక్ విదేశాలకు వెళ్లారనీ, ఆయన స్థానంలో ఈ భేటీకి హాజరయ్యే అధికారం అస్థానాకు లేదని చెప్పిన సీబీఐ. ఆగస్టు 24: అలోక్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన అస్థానా. విషయాన్ని సీవీసీకి అప్పగించిన కేంద్రం. సెప్టెంబర్ 21: అస్థానానే 6 అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని సీవీసీకి వివరణ ఇచ్చిన సీబీఐ. అక్టోబర్ 15: అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, మధ్యవర్తులు మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. అక్టోబర్ 22: సోదాల అనంతరం అస్థానా బృందంలోని డీఎస్పీ దేవేంద్ర కుమార్ అరెస్ట్. అక్టోబర్ 23: అస్థానాపై చర్యల విషయంలో యథాతథ స్థితి విధించిన ఢిల్లీ హైకోర్టు. దేవేంద్రకు కస్టడీ విధించిన సీబీఐ కోర్టు. అలోక్, అస్థానాలను విధుల నుంచి తప్పించి నాగేశ్వర రావుకు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించిన కేంద్రం. అక్టోబర్ 24: సీబీఐ స్వతంత్రాధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందంటూ కోర్టుకెళ్లిన అలోక్. అక్టోబర్ 26: విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సీవీసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ‘సీబీఐ.. పంజరంలో చిలక’ అని చూపుతూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన -
కూపీ లాగితే ‘సీబీఐ’ డొంక కదులుతోంది!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నేడు ఇంతగా భ్రష్టుపట్టి పోవడానికి కారకులు ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు? సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలయితే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై కూడా ఎందుకు చర్యలు తీసుకుంది? ఇద్దరిని బలవంతపు సెలవు మీద ఎందుకు పంపించింది? అసలు గుజరాత్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ అస్థానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన నియామకాన్ని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎందుకు సవాల్ చేశారు? ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అభిమాన పాత్రుడు ఎలా అయ్యారు? మోదీకి అస్థానాను పరిచయం చేసిందెవరు? అస్థానా ఇంతవరకు డీల్ చేసిన కేసులేమిటీ? 2016లో వడోదరలో విలాసవంతమైన తన కూతురు పెళ్లి వేడకులకు డబ్బులు ఖర్చు పెట్టిందెవరు? చివరకు తానే ఓ కేసులో పీకల దాకా ఎలా కూరుకుపోయారు? ఆ కేసేమిటీ? సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శ నాయకుడని చెప్పుకునే రాకేశ్ అస్థానా తనకు తాను ‘ఉక్కు మనిషి’ని అని చెప్పుకుంటారు. ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాశ్ చంద్రబోస్, వివేకానందుడినితో పోలుస్తూ 2018, ఏప్రిల్ నెలలో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అస్థానానే తనకు తాను అలా ప్రమోట్ చేసుకున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. హవాలా కేసులో ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొన్న ‘డైరీ ఆఫ్ 2011’ కేసులో ఆస్థానా నిందితుడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉన్న ‘అగస్ట వెస్ట్‌ల్యాండ్’ రక్షణ కుంభకోణం, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, రాజస్థాన్ అంబులెన్స్ కుంభకోణం లాంటి కేసులను విచారించడం ద్వారా అస్థానా పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అంతకంటే 2002లో ‘గోద్రా రైలు దుర్ఘటన’ కేసును దర్యాప్తు జరిపిన సిట్‌కు నాయకత్వం వహించిందీ అశోక్ అస్థానానే. 2002, ఫిబ్రవరి 27వ తేదీన కర సేవకుల బోగీలు తగులబడి 58 మంది మరణించిన విషయం తెల్సిందే. 2002, మార్చి నెలలో దాఖలైన మొదటి చార్జిషీటులో రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నారు. ఈ బోగీలను ముస్లింలు తగులబెట్టారన్న వార్తల కారణంగానే గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగడం, రెండువేల మందికి పైగా మరణించడం తెల్సిందే. అప్పటి మోదీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం 2002, మే నెలలో రాకేశ్ అస్థానా నాయకత్వాన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 9వ తేదీ నాటికల్లా కేసు దృక్కోణమే మారిపోయింది. రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు కుట్రపన్ని రైలు బోగీలను తగులబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు 2002, సెప్టెంబర్ నెలలో ఛార్జిషీటు దాఖలయింది. 2003, ఫివ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్’ కింద నిందితులపై అభియోగాలు మోపారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో 2005లో ‘పోటా’ రివ్యూ కమిటీ పోటా ఆరోపణలను కొట్టివేసింది. గోద్రా కేసు విచారణ మాత్రం వివిధ కోర్టుల్లో అనేక ఏళ్లపాటు కొనసాగింది. 2011లో ట్రయల్ కోర్టు 11 మంది నిందితులకు మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గుజరాత్ హైకోర్టు మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. అహ్మదాబాద్ పేలుళ్ల కేసును కూడా 2008లో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు బృందానికి కూడా అస్థానానే ఇంచార్జీగా వ్యవహరించారు. నగరంలో నాడు సంభవించిన 22 పేలుళ్లలో 56 మంది అమాయకులు మరణించారు. నరేంద్ర మోదీ ‘సెక్యూరిటీ’ అనే నినాదంపైనే వరుసగా రెండో సారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ కేసు దర్యాప్తులో మరో పోలీసు అధికారి అభయ్ చుడాసమా కూడా ముక్యపాత్ర వహించారు. అప్పుడు అస్థానా బరోడా పోలీసు కమిషనర్‌గా పనిచేస్తుండగా, అభయ్ డిప్యూటీ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2005లో జరిగిన షొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో అభయ్ చుడాసమ ప్రధాన నిందితుల్లో ఒకరు. ‘ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)’ విద్యార్థులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అస్థానా బృందం చివరకు తేల్చింది. అద్వానీతో పరిచయం లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని పశుదాణా కేసులో విచారించి ఆయనపై చార్జిషీటు దాఖలవడానికి బాధ్యుడయ్యాడని ప్రశంసలు అందుకున్న అస్థానా 2000 సంవత్సరంలో ఎల్కే అద్వానీకి పరిచయం అయ్యారు. అద్వానీ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెళ్లిన అస్థానా, తనకుతాను పరిచయం చేసుకొని తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిమానినని, ఆ తర్వాత తమనూ అభిమానిస్తానని చెప్పారట. 2002లో అద్వానీ స్వయంగా తన వెంట తీసుకెళ్లి అస్థానాను మోదీకి పరిచయం చేశారట. ఢిల్లీకి పిలుపు.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఢిల్లీకి బదిలీ చేస్తూ అస్థానాకు ఉత్తర్వులు అందాయి. 2017లో ఆయన్ని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్టెర్లింగ్ బయోటెక్’ హవాలో కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానాను సీబీఐ అధికారిగా ఎలా నియమిస్తారంటూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. దాన్ని తొలుత సుప్రీం కోర్టు కొట్టి వేయగా, మళ్లీ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. 3.83 కోట్ల ముడుపులు స్టెర్లింగ్ బయోటెక్ కంపునీ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో రాకేశ్ అస్థానాకు 3.83 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు నమోదై ఉంది. ఈ డైరీ ఆధారంగానే ఆ కంపెనీపై సీబీఐ 2017లోనే చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో అస్థానా పేరును పేర్కొనలేదు. 2016లో వడోదరలో వైభవంగా జరిగిన కూతురు పెళ్లికి పెళ్లి వేదిక నుంచి భోజనాల వరకు ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ వర్గాలే స్పాన్సర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గత జూలై నెలలో అలోక్ వర్మ విధి నిర్వహణలో భాగంగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా అస్థానా సీబీఐలో కొత్త నియామకాలు జరిపారు. వర్మ వచ్చాక ఈ విషయమై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈడీ దాడులతో స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ డైరెక్టర్లు చేతన్, నితిన్ సండేసర ఆస్తులపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ నెలలో దాడులు చేయడంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హవాల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అస్థానా తనను వేధిస్తున్నారని, ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే కేసు లేకుండా చూస్తానని చెబుతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారి సీబీఐకే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీబీఐ డైరెక్టర్ వర్మ అక్టోబర్ 15వ తేదీన అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ పక్షపాతి అని, అవినీతికి పాల్పడుతున్నారంటూ అస్థానా కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాశారు. ఇద్దరిపై ఆరోపణలు వచ్చినందునే.. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానాపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయనపై చర్య తీసుకోవాలిగానీ, డైరెక్టర్ అలోక్ వర్మపై ఎందుకు చర్య తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణియం ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. ఓ నిందుతుడు చేసిన కౌంటర్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారంటే అరుణ్ జైట్లీకి వివేకమెంతుందో ఆయనకే తెలియాలి. -
‘సిట్’ పిటిషన్‌కు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. సీబీఐని ప్రభావితం చేస్తున్న విస్తృత అవినీతికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే విచారణకు చేపట్టాలన్న ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ అంగీకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్‌ను అత్యవసరంగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని భూషణ్‌కు తెలిపింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని భూషణ్ కోర్టును కోరారు. కేబినెట్ సెక్రటరీ, సీవీసీ, రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ, నాగేశ్వరరావులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ‘ప్రతివాదులు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూశారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆ నిబంధనను పక్కనబెడుతూ ఆయన్ని సెలవులోకి పంపి తాత్కాలిక డైరెక్టర్‌ను నియమిస్తూ చట్టబద్ధమైన నియామక ప్రక్రియను ఉల్లంఘించారు. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఫిర్యాదులు వస్తే సీవీసీ నేరుగా తొలగించకూడదు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. దురుద్దేశపూర్వకం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు దురుద్దేశపూర్వకమని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ‘రాకేష్ అస్థానాపై చర్యలు తీసుకున్నందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బాధితుడిగా చేసినట్లు తెలుస్తోంది. రాకేష్ అస్థానాను స్పెషల్ డైరెక్టర్‌గా నియమించినప్పుడే అలోక్ వర్మ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అస్థానాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అలోక్ 2017 అక్టోబరు 21న కేబినెట్ కన్సల్టేషన్ కమిటీకి లేఖ రాశారు. సంబంధిత ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సీనియర్ ఐటీ అధికారులు ముగ్గురు గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్, సందేసర గ్రూప్ కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో అస్థానా పాత్ర కూడా ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సతీష్ బాబు సానా అస్థానాకు లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా దర్యాప్తులో ఉంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు నమోదవగానే అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు రాత్రి కేంద్రం, సీవీసీలు..డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఆపరేషన్ ‘ఎల్లో’.. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్టకు టీడీపీ కుట్ర!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–న్యూఢిల్లీ: ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో చోటుచేసుకున్న తాజా పరిణామాలను తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిపింది. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్ట వేయడానికి వీలుగా బలహీన మనస్తత్వం ఉన్న అధికారులను ప్రలోభాలకు గురి చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. దానికోసం తన పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులకు ఈ అసైన్మెంట్ అప్పగించింది. సీబీఐ కీలక అధికారితో ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ప్రధాని మోదీకి ఆ అధికారిని సన్నిహితుడిగా భావించిన ఎల్లో గ్యాంగ్.. ఆయన ద్వారా కొన్ని కేసులను ఆపరేట్ చేసింది. అంతటితో ఆగకుండా సీబీఐ వ్యవస్థను తలకిందులు చేసే వ్యూహానికి పదునుపెట్టింది. కీలకమైన అధికారుల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమైంది. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని దీనికోసం పావుగా వాడుకుంది. ఇప్పుడదే మొత్తం సీబీఐ విశ్వసనీయతకు అగ్నిపరీక్షగా మారింది’’ ఢిల్లీలోని ఓ సీబీఐ అధికారి ఆవేదన ఇది. బీజేపీ నేతలకు ఈ వ్యవహారం గురించి తెలిసినా టీడీపీ తమ భాగస్వామి కావడంతో ఏనాడు పట్టించుకోలేదు. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య ఘర్షణల నేపథ్యంలో డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావు నియామకం వెనుక టీడీపీ స్కెచ్ స్పష్టంగా కనిపిస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ బీజేపీ నేత అన్నారు. ప్రస్తుత డైరెక్టర్ నియామకం అనివార్యంగా జరిగిపోవడానికి టీడీపీ మంత్రాంగమే ప్రధాన కారణమనేది ఢిల్లీలో బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ మంత్రి దగ్గర తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి టీడీపీ నేతలు సీబీఐ వ్యవస్థలోకి చొరబడ్డారని ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో పలువురు అధికారులు మండిపడుతున్నారు. సీబీఐని అపఖ్యాతిపాలు చేసే వ్యవహారం నడపడం వెనుక ఎల్లో గ్యాంగ్ వద్ద పెద్ద కథే ఉంది. ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత తన, తన ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చంటూ గత 4–5 నెలలుగా వస్తున్న వార్తలను గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ సంస్థ అధిపతిగా తనకు అనుకూలుడైన వ్యక్తిని నియమించుకోవడమో లేదా ఆ సంస్థకు విశ్వసనీయత లేదని చెప్పించేందుకో పెద్ద కథ నడిపించారన్నది ఢిల్లీలోని అధికార వర్గాల కథనం. సీబీఐ విచారణకు ఆదేశిస్తారేమోనన్న భయంతోనే... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు తమకు తెలుసునని, దీనిపై విచారణకు సిద్ధంగా ఉండాలని ఏపీ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తూ రావడంతో ఎందుకైనా మంచిదని భావించిన టీడీపీ... కీలకస్థాయిలోని అధికారులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. అప్పటికే ఢిల్లీలో సీబీఐ అధికారులతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ జోరును పెంచారు. ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య ప్రచ్చన్న యుద్ధాన్ని వారు అనుకూలంగా మలచుకున్నారని సీబీఐ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. సీబీఐలో తమకు చెందిన ఓ అధికారి (ఇతర రాష్ట్రాల కేడర్‌కు చెందిన)ని తమిళనాడు జోన్‌కు జాయింట్ డైరెక్టర్‌గా నియమించేందుకు వారు సీవీసీని వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెన్నై ప్రధాన కార్యాలయం కింద సీనియర్ అధికారిగా ఉంటూ హైదరాబాద్‌లో వై.ఎస్. జగన్ కేసులను పర్యవేక్షించడంతోపాటు బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేయడం వెనుక ఈ అధికారి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సదరు అధికారిని చండీగఢ్‌కు బదిలీ చేశారు. ఇలా సీబీఐలో పోస్టింగ్‌లను శాసించే స్థాయికి చేరుకున్న టీడీపీ ప్రముఖులు... అంతటితో ఆగకుండా అధికారులు, కేసులు ఎదుర్కొంటున్న వారితో రాజీలు కుదిర్చే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య వచ్చిన పొరపొచ్ఛాలు వారి ఉద్యోగాలు పోవడానికి కారణమయ్యాయి. ‘‘గతంలో ఎప్పుడూ మేము ఇలాంటి ఘటనలు చూడలేదు. సీబీఐ కేసుల్లో పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్నవారు జోక్యం చేసుకోవడం సహజం. అది ఎక్కడా బయటకు కనిపించేలా ఉండదు. కానీ టీడీపీ చర్యలను సీబీఐలో చాలా మంది ప్రత్యక్షంగా చూశారు. వై.ఎస్. జగన్ కేసులకు సంబంధించి ఓ రాజ్యసభ సభ్యుడు నేరుగా వచ్చి స్పెషల్ డైరెక్టర్‌ను కలువడం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో పెద్ద సంచలనమే అయ్యింది’’ అని ఓ ఎస్పీ స్థాయి అధికారి పేర్కొన్నారు. అనుకూలత కోసం అడ్డదారులు... న్యాయవ్యవస్థలో అయినా, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖల్లో అయినా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూసుకునేందుకు టీడీపీది మొదటి నుంచే అడ్డదారే! ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై విచారణకు ఆదేశించాలని ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్తే తమకు అనుకూలమైన బెంచ్ దగ్గరకు ఆ కేసు వెళ్లేదాకా నాట్ బిఫోర్ ప్రయోగాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. సంక్షోభ సమయాల్లో వ్యవస్థలను వారికి అనుకూలంగా మలుచుకోవడం ఒక ఎత్తయితే, రాజకీయ ప్రత్యర్థులపై లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించడం మరో ఎత్తు. అందులో భాగంగానే ఎన్డీఏ భాగస్వామిగా ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకుని వై.ఎస్. జగన్‌కు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలకు పాల్పడ్డారు. ఇప్పుడు కేసులు తమపైకి ఎక్కడ వస్తాయోనన్న భయంతో కావాల్సిన అధికారులను కీలకస్థాయిలో నియమించుకోవడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సీవీసీ ద్వారా సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించేలా చంద్రబాబు పావులు కదిపారని బీజేపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. నాగేశ్వరరావు నియామకాన్ని కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు తప్పుపట్టినా టీడీపీ స్పందించలేదు. నాగేశ్వరరావు నియామకాన్ని విపక్షాలు తప్పుపట్టడం, సుప్రీంలో పిటిషన్ దాఖలు కావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మీడియా ముందుకు వచ్చి కేంద్ర విజిలెన్స్ కమిషనర్ సూచన మేరకే నాగేశ్వరరావును నియమించామని చెప్పారు. నాగేశ్వరరావు నియామకంపై టీడీపీ నోరు మెదపకపోగా సీబీఐ వ్యవస్థ దిగజారిందని, దానికి ప్రధాని మోదీయే కారణమంటూ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సన్నాయి నొక్కులు నొక్కడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. చదవండి: తెరచాటు బంధానికి ప్రతీకా? -
మోదీ, బాబు మధ్య యుద్ధం ఉత్తుత్తిదే.. ఇదిగో రుజువు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్‌గా నాగేశ్వర రావు నియామకం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సీబీఐలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాల మధ్య విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ సెలవుపై పంపిన ప్రభుత్వం.. సీబీఐ కొత్త డైరెక్టర్‌గా జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఎం నాగేశ్వర రావును నియమించింది. సీనియారిటీలో తనకన్నా ముందున్న అధికారి ఏకే శర్మను కాదని, నలుగురు జాయింట్ డైరక్టర్లలో ఒకరైన, చెన్నై జోన్ బాధ్యతలు చూస్తున్న నాగేశ్వర రావుకు కీలక బాధ్యతలు అప్పగించడంపై న్యూఢిల్లీ రాజకీయ వర్గాల్లో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నాగేశ్వర రావుపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని.. ఇప్పటికే అలోక్‌వర్మ, అస్థానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్న సీబీఐ చీఫ్‌గా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారిని అధిపతిగా నియమించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా ఇవే అంశాలను లేవనెత్తుతూ.. ‘నాగేశ్వర రావుపై వచ్చి న అవినీతి ఆరోపణలపై డైరెక్టర్ హోదాలో విచారణ జరిపిన అలోక్ వర్మ.. నాగేశ్వర రావును సీబీఐ నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు సిఫారసు చేశారు. కానీ సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి అంతర్గత విచారణ, వ్యక్తిత్వ మదింపు జరపకుండానే నాగేశ్వర రావును నియమించడాన్ని సీబీఐలోనే కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది పక్కా రాజకీయ నియామకమేనని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, నాగేశ్వర రావు నియామకం వెనుక రాజకీయ కోణం ఒకటి బయటపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు, పార్టీలోని కొందరు కీలక నేతలకు నాగేశ్వర రావు అత్యంత సన్నిహితుడని పేరు. టీడీపీలోని కొందరు నేతలపై అవినీతి ఆరోపణలున్నాయి. విచారణ దశలో పలు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి సన్నిహితుడైన అధికారిని అత్యున్నత దర్యాప్తు సంస్థకు చీఫ్‌గా కేంద్రం నియమించడంలో లోగుట్టేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రంపై, ప్రధాని మోదీపై అవకాశం లభించిన ప్రతీసారి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం వెనక మతలబేంటనే చర్చ జరుగుతోంది. ‘మోదీ– బాబు వార్ ఉత్తుత్తి యుద్ధమే.. పై పై ప్రచారమే.. అవసరమైతే, అవకాశం లభిస్తే మోదీతో కలిసి నడిచేందుకు బాబు సిద్దంగానే ఉంటారు. పట్టువిడుపులకు మోదీ కూడా రెడీనే. సీబీఐ చీఫ్‌గా నాగేశ్వర రావు నియామకం దీన్నే రుజువు చేస్తోంది’ అని ఢిల్లీ– అమరా వతి రాజకీయాలపై పట్టున్న ఓ రాజకీయ విశ్లేషకు డు అన్నారు. ‘మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు లభించే ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోడని, నాగేశ్వర రావు నియామకంపై విపక్షాలు పెద్దగా రాద్ధాంతం చేస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరెత్తకపోవడం అందులో భాగమేనని, సయోధ్య కోసం బీజేపీ ఒక అడుగేస్తే.. బాబు నాలుగడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని బీజేపీ సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య గమనార్హం. చదవండి: ఆపరేషన్ ‘ఎల్లో’.. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్టకు టీడీపీ కుట్ర! -
సీబీఐలో మిడ్నైట్ డ్రామా
వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్ వర్మను పదవి నుంచి తొలగించామంది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్‌ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్‌ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్ స్కాం పత్రాలను అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యూఢిల్లీ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్ చేసి, అలోక్ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. వివిధ ప్రాంతాలకు బదిలీలు నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్ నికోబార్ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీశ్ దగర్‌లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసును సతీశ్ విచారించగా, తరుణ్ గౌబా మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు. అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్‌ను జబల్పూర్కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్‌పూర్‌కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్ కుమార్ శర్మను.. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్ అధికారి సాయి మనోహర్‌ను చండీగఢ్ జోన్ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణకు కొత్త బృందం మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్‌ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించనుంది. హెడ్‌క్వార్టర్స్‌లో హంగామా సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్ఎఫ్కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్ వేయించారు. ఆ తర్వాత అలోక్ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు. అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్‌ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్ -
నాగేశ్వర్ రావు ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కలిక డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986వ బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారైన ఆయన ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మను తొలగిస్తూ ఆ స్థానంలో నాగేశ్వర రావును ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించిన విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పీజీ పట్టా అందుకున్న నాగేశ్వరరావు ఐపీఎస్ అధికారి కాకముందు ఐఐటీ మద్రాస్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. ( చదవండి: అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?) ఒడిశా కేడర్ ఐపీఎస్‌గా ఎంపికైన అనంతరం ఆయన తన తొలి పోస్టింగ్‌ను ఒడిశా తాల్చెర్ సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో)గా అందుకున్నారు. అనంతరం ఒడిశాలోని నాలుగు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. అలాగే రూర్కెలా రైల్వేస్ ఎస్పీగా, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఉపయోగించిన తొలి పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. 1996 జగస్తింగ్‌పూర్‌లోని ఓ రేప్ కేసులో ఫింగర్ ప్రింట్స్ ద్వారా నేరస్థులను పట్టుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా ఉన్నప్పుడు కటక్‌లో 200 మందిని చంపిన నేరస్థుడు బెలుదాస్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఒడిశా ఫైర్ సర్వీస్ ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఫైలిన్(2013) హుదూద్ (2014) తుఫానుల్లో చేపట్టిన సహయక చర్యలకుగాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అవార్డులందుకున్నారు. ఆయనందించిన విశేష సేవలకుగాను రాష్ట్రపతి, ఒడిశా గవర్నర్ల చేతుల మీదుగా మెడల్స్ కూడా లభించాయి. ఆయన సీఆర్పీఎఫ్ మణిపూర్ డీఐజీగా కూడా పనిచేశారు. (చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి) -
అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారైన నాగేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నాగేశ్వరావు నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్పమెయిలీ వ్యతిరేకించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో నాగేశ్వరావు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. సీబీఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, అనుకూలమైన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. నాగేశ్వరరావు నియామకంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను రక్షించేందుకే అలోక్ వర్మ తొలిగించారని ఆయన ఆరోపించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులున్నాయని, అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌ను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి -
సీబీఐని కుదిపేసిన సానా సతీష్ ఇక్కడివాడే
సాక్షి, కాకినాడ: ఇరవైయేళ్ల క్రితం అతనో సాధారణ చిరుద్యోగి. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద విద్యుత్‌శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరాడు. కొంతకాలానికే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి వ్యాపార రంగంలో అడుగుపెట్టి...చిరుద్యోగి నుంచి బడా వ్యాపారిగా, పొలిటికల్ లాబీయింగ్‌లో దిట్టగా గుర్తింపు పొందాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా ఉన్న ఓ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నాడు. ఆయనే సీబీఐలో తీవ్ర సంక్షోభానికి తెరలేపిన సానా సతీష్. తూర్పు గోదావరిజిల్లా కాకినాడకు చెందిన ఆయన పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారు పదిహేనేళ్ల క్రితమే సబ్ ఇంజినీర్‌గా, ఏఈగా పనిచేస్తూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆ తరువాత ఉన్నత స్థాయిలో ఏర్పడిన పరిచయాలతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ప్రఖ్యాత క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ వంటి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలతో ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ మ్యూజియం కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. పెరిగిన పరిచయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తి 25కుపైగా కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు సీబీఐని ఓ కుదుపు కుదిపింది. ఇదే వ్యవహారంలో ఓ సీబీఐ డీఎస్పీ అరెస్టు కావడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో సానా సతీష్ కీలక వ్యక్తి అన్న సమాచారం ఈ ప్రాంతవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ టీడీపీ ఎంపీతో ఆయనకున్న సాన్నిహిత్యంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. సీబీఐ వ్యవహారంలో సదరు ఎంపీ పాత్ర ఉందన్న సమాచారంపై ఈ ప్రాంతవాసులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశంలోనూ సానా సతీష్ క్రియాశీలకంగా వ్యవహరించాడని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారేందుకు ఇచ్చే తాయిలాలు, నగదు లావాదేవీలను డాయనే దగ్గరుండి జరిపించాడని చెబుతున్నారు. -
సీబీఐ అధికారుల ఛాంబర్లు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలో రాత్రికి రాత్రే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావుని సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే నూతన డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీబీఐ ఆఫీసులో సోదాలు మొదలయ్యాయి. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో వారిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని అలోక్ వర్మ, అస్థానా, సస్పెండైన డీఎస్పీ దేవేందర్ ఆఫీసుల్లో నాగేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. వారి ఛాంబర్లను సీజ్ చేశారు. ఇతరులెవరూ సీబీఐ కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. (చదవండి : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి) -
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు
-
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నతాధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కాస్త ఛీబీఐగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో కేంద్రం స్పందించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సెలవుపై పంపినట్టు సమాచారం. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు) నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లాలోని బోరె నర్సాపూర్. ప్రస్తుతం ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్‌డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిషా కేడర్‌లో డీజీపీగా పనిచేశారు. ఇదిలాఉండగా.. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్టవ్వడం విదితమే. (చదవండి : సీబీఐ కోటలో ‘దేశం’ ఆటలు) -
సీబీఐతో ఇద్దరు టీడీపీ ఎంపీలకు దోస్తీ
-
సీబీఐ కోటలో ‘దేశం’ ఆటలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని అవసర మైన సందర్భాల్లో ఉప యోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహరచన చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ ముఖ్యంగా రెండు ప్రయోజనాలను ఆశించే.. సీబీఐ ఉన్నతాధికారులతో సన్ని హిత సంబంధాలకు ప్రయత్నించి నట్లు తెలుస్తోంది. ఒకటి రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించడం కాగా.. రెండోది తమపై విచారణకు ఆదేశిస్తే బయటపడే మార్గాలు అన్వేషించడం. ఇప్పటికిప్పుడే తెర వెనుక జరిగిన పరిణామాలు బయటకు వచ్చే అవకాశాల్లే నప్పటికీ..కాలక్రమేణా సీబీఐ కేసుల్లో కీలకంగా వ్యవహ రించిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు, మరో రాజ్యసభ సభ్యుని వ్యవ హారం బయటకు వస్తుం దని సీబీఐ వర్గాలే అంటు న్నాయి. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అస్థానాపై అవినీతి కేసు నమోదు కావడం, డీఎస్పీ స్థాయి అధికారి ఒకరిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ సంస్థ అధికారు లతో టీడీపీ నేతల సంబంధాలపై ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు) కార్తీ చిదంబరం కేసు నుంచే.. కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ సీనియర్ నేత చిదం బరం కుమారుడు కార్తీ చిదంబరం కేసు సంద ర్భంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) డైరెక్టర్ చిన్న బాల నాగేశ్వర రెడ్డి (సీబీఎన్ రెడ్డి)ని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడొకరు సీబీఐ ఉన్నతాధికారితో చర్చలు జరిపారని సమా చారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం ద్వారా ఏఎస్‌సీపీఎల్ డైరెక్టర్లకు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్లను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ సంస్థ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన సీబీఎన్ రెడ్డి.. కార్తీ చిదంబరానికి అత్యంత సన్నిహితుడు. మామూలుగా ఆ కేసులో సీబీఎన్ రెడ్డిని అరెస్టు చేస్తారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే.. సీబీఎన్ రెడ్డికి.. ఓ టీడీపీ ముఖ్య నేత కుమారుడితో పాటు ఆ పార్టీ ఎంపీ (రాజ్యసభ)కి సన్నిహిత సంబంధాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని సీబీఎన్ రెడ్డి అప్పట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ‘నాకు తెలిసినంత వరకు సీబీఎన్ రెడ్డి విషయంలో ఆ టీడీపీ రాజ్యసభ సభ్యుడు చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే ఆయన కలిసి సీబీఎన్రెడ్డిని ఎలాగైనా బయటపడేయాలని కోరారు. అయితే ఆ డీల్‌లో ఎంత మొత్తం చేతులు మారిం దన్నది ఇప్పుడే చెప్పలేను. కొద్ది రోజులు ఆగితే.. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి’ అని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సీబీఐతోపాటు.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లోనూ టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారని దానికి సంబంధించి ఆధారాలతో సహా వచ్చిన ఫిర్యాదును సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తొక్కిపెట్టారని ఆయన వెల్లడించారు. పోస్టింగుల్లోనూ ఒత్తిళ్లే! సీబీఐ పోస్టింగుల్లో సాధారణంగా రాజకీయ ఒత్తిడులు పెద్దగా ఉండవు. కానీ, టీడీపీ నేతలు కొందరు మాత్రం.. కావాల్సిన వారిని తమకు అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు అనేక ఒత్తిడులు తెచ్చారని ఢిల్లీ సీబీఐ కార్యాలయంలోని మరో అధికారి వెల్లడించారు. వీని ఒత్తిళ్ల ఫలితంగా నిజాయితీపరులైన అధికారులకు మంచి పోస్టులు దక్కకుండా పోయాయని ఆయన చెప్పారు. ‘రెండేళ్లుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి హవా (టీడీపీ నేతల) కొనసాగుతోంది. ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో చాలామంది అధికారులు ఈ విషయం తెలిసి విస్తుపోయారు. దీని కారణంగానే పరిస్థితులు దారుణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణాదిలో సీబీఐ పోస్టుల్లో ఎవరిని నియమించాలో టీడీపీ నేతలు నిర్దేశించినట్లు జరిగింది’ అని సదరు అధికారి వివరించారు. (ఆస్ధాన మోదీ ఆస్ధానవాసే..) స్పెషల్ డైరెక్టర్ అవినీతి కేసులో కీలకంగా మారిన ఏపీకి చెందిన సతీష్ బాబుతోనూ టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీబీఐ అధికారులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కేసు నుంచి బయటపడేస్తామని ఓ రాజ్యసభ సభ్యుడు అతనికి మాటిచ్చిన సంగతి ఏడాది క్రితమే వెలుగులోకి వచ్చిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీబీఐతో దోస్తీ చేసుకుని తమకు కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీడీపీ ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. వారి అనుకూల మీడియా మాత్రం ఛీ(సీ)బీఐ అంటూ కథనాలు ప్రచురించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
కోర్టుకు చేరిన సీబీఐ పోరు
న్యూఢిల్లీ/ముంబై: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గ పోరు మంగళవారం కోర్టుకు చేరింది. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా, అరెస్టవ్వడంతోపాటు సస్పెండైన డీఎస్పీ దేవేంద్ర కుమార్‌లు ఢిల్లీ హైకోర్టును వేర్వేరుగా ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కోర్టు దేవేంద్రను 7 రోజుల కస్టడీకి అప్పంచింది. అస్థానాపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణ కొసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి అక్కర్లేదని తెలిపింది. అస్థానాకు సీబీఐలో ఉన్న అధికారాలను ఆ సంస్థ మంగళవారం తొలగించింది. కేంద్ర ప్రభుత్వమే సీబీఐని నాశనం చేస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపించాయి. అస్థానా, దేవేంద్రల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వజీరీ మంగళవారం విచారించి, అస్థానాపై మాత్రమే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పారు. అలాగే అస్థానా, దేవేంద్రల పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ, సిబ్బంది, శిక్షణ విభాగాలను జస్టిస్ నజ్మీ ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులతోపాటు తమ మొబైల్ రికార్డులను కూడా భద్రంగా ఉంచుకోవాలని అస్థానా, దేవేంద్రలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్టవ్వడం తెలిసిందే. ఆయనో చెదపురుగు: సీబీఐ సీబీఐ తరఫు న్యాయవాది రాఘవాచార్యులు తన వాదన వినిపిస్తూ అస్థానాను చెదపురుగుతో పోల్చడంతో కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దనీ, కోర్టులో అలాంటి వాటికి చోటులేదని మందలించింది. అస్థానాపై ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సీబీఐ మంగళవారం మరిన్ని ఆరోపణలు చేర్చింది. అస్థానా తరఫు న్యాయవాది వాదిస్తూ ఒక నిందితుడి వాంగ్మూలం ఆధారంగా అక్రమంగా అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. అస్థానాపై బలవంతంగా చర్యలను తీసుకోకుండా సీబీఐని నిలువరించాలని ఆయన కోర్టును కోరారు. అటు సీబీఐ ప్రత్యేక కోర్టులో దేవేంద్రను అధికారులు మంగళవారం ప్రవేశపెట్టి, ఆయనపై నేరారోపణలు చేయదగిన ఆధారాలు దొరికినందున ఆయనను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలనీ కోరారు. విచారణను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడిన బృందంలో దేవేంద్ర ఒకరని ఆరోపించారు. దేవేంద్రపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కొత్తగా మరిన్ని సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చేందుకు కూడా వారు జడ్జి అనుమతి కోరగా, వారంపాటు కస్టడీలో విచారించేందుకు సీబీఐ న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ అనుతించారు. దేవేంద్ర బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు. సొంత అవినీతిని కప్పిపుచ్చేందుకే: అస్థానా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన సొంత అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తనను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని అస్థానా ఆరోపించారు. కొన్ని అక్రమ లక్ష్యాలను సాధించేందుకు సీబీఐలోని ఓ వర్గం అధికారాలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తూ, సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తూ తనను బలిపశువును చేసిందని దేవేంద్ర పేర్కొన్నారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ హైకోర్టులో విడివిడిగా వేసిన పిటిషన్లలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై సతీశ్‌ను తమ బృందం అరెస్టు చేయా ల్సి ఉందనీ, అందుకు తాము సిద్ధమవుతున్న తరుణంలో మరో వర్గం అదే సతీశ్‌తో తప్పు డు వాంగ్మూలం ఇప్పించి తామే లంచం అడిగినట్లు ఆరోపణలు చేయించి కేసులు పెట్టారని వారిరువురు పేర్కొన్నారు. అలోక్ వర్మ, ఇతర అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తున్నారన్నారు. సీబీఐ నాశనానికి మోదీయే కారణం: కాంగ్రెస్ దేశ అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ విచ్ఛిన్నం, నాశనం కావడానికి, అప్రతిష్టను మూటగట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ కార్యకలాపాల్లో ఆయన ప్రత్యక్షంగానే జోక్యం చేసుకున్నారంది. సీబీఐ, రా చీఫ్‌లను మోదీ సోమవారం తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడి విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేసి ఉంటే సీబీఐ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉండేవి కావని విమర్శించారు. సీబీఐలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మౌనంగానే ఉన్నారనీ, అవినీతిపరులపై ఆయన చర్యలు తీసుకోవాలని పవార్ కోరారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేస్తూ సీబీఐ వంటి ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్గీ ఘోర, పాపాత్మక విధానాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.గత నాలుగేళ్లలో వ్యవస్థల్లోకి అనేక మంది నకిలీ అధికారులు ప్రవేశించారని దుయ్యబట్టారు. -
సీబీఐ దురవస్థ!
పదవి, అధికారం ముసుగులో వాస్తవాలను మసిపూసి మరుగుపరచాలని చూస్తే అంతిమంగా అది వ్యక్తి లేదా మొత్తం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, ఆ సంస్థను ధ్వంసం చేస్తుందని విఖ్యాత ఆర్థికవేత్త పాల్ క్రుగ్మాన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పుడు పరస్పర ఫిర్యాదులతో, ఆరోపణలతో, కేసులతో, అరెస్టులతో బజా ర్నపడిన తీరు ఆ వ్యాఖ్య అక్షరసత్యమని నిరూపిస్తోంది. కేంద్రంలో అధికారం చలాయించే పాల కులు ఆడమన్నట్టు ఆడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న సీబీఐ పోకడల్ని గమనించి సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం అది ‘పంజరంలో చిలుక’గా మారిందని కొన్నేళ్లక్రితం వ్యాఖ్యానించింది. దానికి స్వయంప్రతిపత్తి ఇస్తే తప్ప అది సరిగా పనిచేయదని తేల్చింది. కానీ దురదృష్టమేమంటే ఇంతక్రితం యూపీఏ హయాంలోనూ, ఇప్పుడు ఎన్డీఏ హయాంలోనూ ఆ విషయంలో పెద్దగా మారిందేమీ లేదు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు అనుగుణంగా, వారు ఎవర్ని వేధిం చమంటే వారిని వేధిస్తూ, కేసులు పెడుతూ కాలక్షేపం చేసిన సీబీఐ తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందాన ఇప్పుడు తన కార్యాలయంలో తానే సోదాలు జరుపుకునే స్థితికి... తన ఉన్న తాధికారిపై తానే కేసు పెట్టే స్థితికి... తన ఉన్నతాధికారిని తానే అరెస్టు చేసే స్థితికి దిగజారింది. ఇందులో ‘రా’ అధికారులపై సైతం ఆరోపణలొచ్చాయి. దీన్నంతటినీ కేవలం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆ సంస్థ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాల మధ్య రాజుకున్న అధికార పోరాటంగానే చూస్తే విషయం అర్థంకాదు. దీని మూలాలు అంతకన్నా లోతైనవి. ఇవాళ సీబీఐలో సాగుతున్న పరిణామాలు గమనించి సాధారణ పౌరులు కలవరపడటంలో అర్ధముంది. ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థగా ఉండాల్సిన సీబీఐ ఇంతటి దుస్థితిలో పడిందేమిటని బాధపడటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ పరిణామాలను చూసి గుండెలు బాదుకుని బావురుమంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ పార్టీ కేంద్రంలో అధికారం చలాయించినప్పుడు దాన్నెలా భ్రష్టు పట్టించిందీ గుర్తుకు తెచ్చు కోవాలి. ఆరోజు సుప్రీంకోర్టు సీబీఐని ‘పంజరంలో చిలుక’ని అభివర్ణించడానికి కారణం ఆ నిర్వాకం పర్యవసానమేనని గుర్తెరగాలి. ఇదే అదునుగా చంద్రబాబు నాయుడు సైతం తగుదు నమ్మా అంటూ సుద్దులు చెప్పడానికి ప్రయత్నించడం అన్నిటికన్నా విడ్డూరం. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో ఆయన్ను మించినవారు లేరు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఆ వ్యవస్థలన్నీ తన చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోగలిగిన ఘనుడాయన! ఆయన సైతం సీబీఐలోని పరిణామా లపై తెగ బాధపడిపోతున్నారు. సీబీఐలోని ప్రస్తుత పరిణామాలు అసాధారణమైనవి. అందులో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్రకుమార్‌ను ఒక అవినీతి కేసులో ఆ సంస్థే అరెస్టు చేసింది. ఆయన కార్యాలయంలో, ఆయన ఇంట్లో ఫోన్లు, ఐపాడ్లు స్వాధీనం చేసుకుంది. ఇంకా చిత్రమేమంటే ఆయన అరెస్టయిన కేసులోనే స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా కూడా నిందితుడు! తనపై కేసు పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆస్తానా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి, వచ్చే సోమవారం వరకూ యధాతథ స్థితిని కొనసా గించమని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దేవేంద్ర ఏడురోజుల కస్టడీకి వెళ్లారు. అటు ఆస్తానా కూడా అలోక్ వర్మపై ఆరోపణలు చేశారు. వాటి సంగతేమవుతుందో మున్ముందు చూడాలి. దాని సంగతలా ఉంచి ఈ కేసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం నేతల పేర్లు ప్రస్తావనకు రావడం, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో పైరవీలు చేసిందెవరు...ఎవరు ఎవరితో మాట్లాడారు...ఎక్కడ కలుసుకు న్నారు... ఎక్కడ డబ్బులు చేతులు మారాయి అనే అంశాలు గమనిస్తే పైకి కనిపిస్తున్న, ప్రచార మవుతున్న కథనాలను మించి వ్యవహారాలు నడిచి ఉంటాయని అర్ధమవుతుంది. ఇదే సీబీఐ గతంలో పాలకుల రాజకీయ ప్రత్యర్థులను ఎలా వేధించిందో ఎవరూ మర్చిపోరు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో విభేదించి బయటికొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కుమ్మక్కయి హైకో ర్టులో పిటిషన్లు వేయడం, సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశాలివ్వడం తడవుగా సీబీఐ ఎక్కడలేని చురుకుదనమూ ప్రదర్శించడం అందరికీ తెలుసు. ఆ ఆదేశాలు వెలువడిన కొన్ని గంట ల్లోనే వందలమంది సిబ్బందితో టీంలు ఏర్పరిచి, వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ దాడులకు దిగింది. ఆ తర్వాత పచ్చ మీడియాకు లీకుల మీద లీకులిస్తూ జగన్మోహన్రెడ్డి పరువు ప్రతిష్టల్ని దిగజార్చే ప్రయత్నం చేసింది. ఆయన్ను అరెస్టు చేసి, బెయిల్ రాకుండా దీర్ఘకాలం అడ్డుపడింది. అసలు ఆ కేసుల్లో దర్యాప్తే తల్లకిందులుగా ప్రారంభించింది. ఏడాదిన్నర గడిచాక అసలు ‘క్విడ్ ప్రో కో’ ఆరో పణలకు మూలాధారమైన 26 జీవోల కూపీ తీయడం లేదేమని సర్వోన్నత న్యాయస్థానం మందలించాక సీబీఐ వాటిపై దృష్టి పెట్టింది. కానీ చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌర వాధ్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆ సంస్థ బాబు అప్పీల్‌కి వెళ్లి స్టే తెచ్చుకునేవరకూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు గమనించాక ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే కాదు... దేశంలోని ప్రజాస్వామికవాదులు, న్యాయనిపుణులు సైతం ఆ సంస్థ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఈ ధోరణి మారనందునే సుప్రీంకోర్టు భిన్న సందర్భాల్లో సీబీఐపై నిప్పులు చెరిగింది. కనీసం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అయినా సీబీఐ ప్రక్షాళనకు కేంద్రం నడుం బిగించాలి. ఈ పరస్పర ఆరో పణల్లోని నిజానిజాలను వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పాత్రధారులు మాత్రమే కాదు... సూత్రధారుల పని కూడా పట్టాలి. -
రాకేష్ అస్తానాకు హైకోర్టులో స్పల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సీబీఐ ముడుపుల వ్యవహారంలో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని ఆస్తానా వేసిన పిటిషన్‌పై విచారించిన హై కోర్టు..తదుపరి ఆదేశాల వరకు ఆస్తానాను అరెస్ట్ చేయకూడదని సీబీఐని ఆదేశించింది. ఐతే తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను అక్టోబరు 29కి వాయిదా వేసింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. -
ఆస్తానా కేసు పూర్వాపరాలు..
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై ఆ సంస్థే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజా పరిణామం నేపథ్యంలో ప్రధాని కార్యాలయం సోమవారం సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలకు సమన్లు జారీ చేసింది. సీబీఐ అత్యున్నత అధికారులిద్దరి మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న అంతర్గత పోరాటం ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదుతో తీవ్రరూపం దాల్చింది. దీన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిననున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 22న ఆస్తానాను సిబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా స్వయంగా నియమించారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఆస్తానాపై అప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయన నియామకాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. (సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై కేసు) కేసు ఏమిటి? మాసం ఎగుమతి వ్యాపారవేత్త అయిన ఖురేషి సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి డైరెక్టర్ల తరఫున పలువురి నుంచి లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ తాను ఖురేషికి 3 కోట్లు లంచంగా ఇచ్చినట్టు మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు నుంచి తనను బయటపడేయడానికి గత పది నెలల్లో దఫదఫాలుగా ఈ సొమ్ము ఇచ్చానని, తాజాగా అక్టోబర్ 9వ తేదీన 25 లక్షలు ఇచ్చానని సతీష్ చెప్పారు. సతీష్ తన వాగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, ప్రసాద్ బంధువు సోమేశ్‌ల పేర్లు ప్రస్తావించారు. ఆస్తానా కోసమే ఈ సొమ్ము తీసుకుంటున్నట్టు ఖురేషి చెప్పారని కూడా సతీష్ పేర్కొన్నారు. అయితే, ఆస్తానాను తాను ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం చేశారు. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై కేసు నమోదు చేసింది. (సీబీఐ డీఎస్పీ అరెస్ట్) ఎవరీ ఖురేషీ? ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మొయిన్ అక్తర్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూలు విద్యార్ధి. చదువయిపోయాకా 1993లో ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో చిన్న పశువధశాల ప్రారంభించాడు. అక్కడ నుంచి మాంసం ఎగుమతిదారుగా మారాడు. అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు సంపాదించాడు. ఏళ్లు గడిచేకొద్ది నిర్మాణం, ఫ్యాషన్ వంటి వివిధ రంగాలకు విస్తరించాడు.పాతిక కంపెనీలకు పైగా నెలకొల్పాడు. ఆయనపై అనేక పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా కోట్లు గడించాడు. సీబీఐ మాజీ డైరెక్టర్లు రంజిత్ సింగ్, ఏపీ సింగ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. వారి తరఫున సీబీఐ కేసుల్లో నిందితుల నుంచి ముడుపులు తీసుకునేవాడని ఈడీ ఆరోపించింది. ఖురేషీకి రాజకీయ ప్రముఖులతో కూడా సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు ఖురేషీపై పలు కేసులు నమోదు చేశాయి. ఖురేషీపై ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగకుండా సోనియా గాంధీ అడ్డుపడుతున్నారని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి అక్రమంగా 200 కోట్లను విదేశాలకు తరలించాడని ఖురేషీపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖల అధికారులు ఖురేషీ నివాసాల్లో చేపట్టిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, సేకరించిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఖురేషీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ కేసుల దర్యాప్తునకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సతీష్‌ను కేసు నుంచి తప్పించడం కోసం ఆస్తానా తరఫున ఖురేషీ 5.75 కోట్లు తీసుకున్నట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. సతీష్ వాంగ్మూలం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ వాంగ్మూలం ఆస్తానాపై కేసుకు ప్రాతిపదికగా మారింది. ఖురేషీ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ అక్టోబర్ 4న స్థానిక మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇస్తూ ఆస్తానా కోసం తాను ఖురేషీకి ఇంత వరకు 3 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఖురేషీ కేసులో విచారించడానికి సీబీఐ సెప్టెంబర్‌లో సతీష్‌కు సమన్లు పంపింది. ఆస్తానా ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సతీష్ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే,అప్పటికే సతీష్‌పై లుక్ ఔట్ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముంద సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కేసుల దర్యాప్తుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తన విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. వర్మపై 10 అవినీతిఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. ఆస్తానా పై కేసుకు దారి తీసిన పరిణామాలు: కేసులోంచి తప్పించేందుకు లంచం ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారంటూ హైదరాబాద్ వ్యాపారి సతీష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో సీబీఐ అధికారి దేవేంద్ర కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌ల పేర్లు, మరికొందరు ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం... మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీష్‌ను కలుసుకున్నారు. సీబీఐ అధికారి సహాయంతో సతీష్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సోమేశ్ తనతో సీబీఐ అధికారితో ఫోన్లో మాట్లాడించాడని, ఐదు కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తానని ఆ అధికారి చెప్పారని, ముందుగా 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలన్నారని సతీష్ ఆరోపించాడు. తనతో మాట్లాడింది రాకేశ్ ఆస్తానా అని సోమేశ్ చెప్పాడని కూడా సతీష్ పేర్కొన్నాడు. వాట్సాప్‌లో ఆస్తానా ఫోటో కూడా చూపించాడని తెలిపాడు. వారి మాటలు నమ్మి, కేసు నుంచి బయటపడాలన్న కోరికతో దుబాయ్‌లో మనోజ్ ప్రసాద్‌కు కోటి రూపాయలు ఇచ్చానని సతీష్ పేర్కొన్నాడు. తర్వాత సోమేశ్ చెప్పిన మేరకు ఢిల్లీలో సునీల్ మిట్టల్ అనే వ్యక్తికి 1.95 కోట్లు ఇచ్చానని సతీష్ వివరించాడు. అధికారులకు 2.95 కోట్లు లంచం ఇచ్చినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సతీష్‌కు నోటిసు పంపింది. దాంతో సతీష్ మనోజ్‌ను క లిసి లంచం ఇచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా 2 కోట్లు ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. గత నెల్లో సతీష్ హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం అధికారులు అతనిని వెళ్లకుండా ఆపారు. సెప్టెంబర్ 26న తమ ముందు హాజరు కావలసిందిగా సీబీఐ సతీష్‌ను ఆదేశించింది. అక్టోబర్ 1న సతీష్ ఢిల్లీలో సీబీఐ ముందు హాజరయ్యాడు. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, ఎస్పి జాగ్రూప్లను కలుసుకున్నాడు. జరిగిందంతా సతీష్ మనోజ్‌కు చెప్పాడు.2 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మనోజ్ చెప్పడంతో త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అక్టోబర్ 9వ తేదీన 2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు.అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పెట్టాడు. తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలు రాలేదు. సతీష్ అక్టోబర్ 10న 25 లక్షలు మనోజ్‌కు ఇచ్చాడని, మిగతా సొమ్ము అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే అక్టోబర్ 16న సొమ్ము తీసుకోవడానికి భారత్ వచ్చిన మనోజ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
సీబీఐ డైరెక్టర్ల మధ్య తారస్థాయికి చేరిన విబేధాలు
-
సీబీఐ డీఎస్పీ అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్ వర్మ పీఎంవోలోని సీనియర్ అధికారులను కలిశారు. సతీశ్ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్ ప్రసాద్ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్‌కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు. సీఎం రమేశ్‌తో మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో ఈ ఏడాది జూన్‌లో తాను మాట్లాడానని సతీశ్ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్‌తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్ నుంచి అలోక్ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది. అసలు ఏమిటీ కేసు? మొయిన్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన కేసులో ఒక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్ కోర్టులో సతీశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ల పేర్లను సతీష్ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది. ఎఫ్ఐఆర్లో ఏముంది? సతీశ్ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీశ్‌ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు సోమేశ్ ఫోన్ చేసి సతీశ్‌తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారు. దీంతో మనోజ్‌కు దుబాయ్‌లోనే సతీశ్ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్ మిత్తల్‌కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్ మనోజ్‌ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. అక్టోబర్ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్ 10న రూ. 25 లక్షలను సతీశ్ మనోజ్‌కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్ భారత్ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. -
రోడ్డునపడ్డ సీబీఐ పరువు
-
సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై కేసు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాపై అదే సంస్థ కేసు నమోదుచేసింది. సీబీఐలో రెండో అత్యున్నతాధికారిపై సీబీఐనే కేసు పెట్టడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాంస వ్యాపారి మొయిన్ ఖురేషికి సాయం చేసేందుకు మధ్యవర్తి నుంచి అస్తానా లంచం తీసుకున్నారన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ అని అధికారులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఖురేషి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రూ. 24 కోట్లు చెల్లించాడని అస్తానా ఆగస్టు 24న కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోంది. అప్పటి నుంచి అలోక్, అస్తానా వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరమైన నేపథ్యంలో సీబీఐ అస్తానాపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేర దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై కేసు నమోదుచేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీశ్‌బాబు సనా ఫిర్యాదు మేరకు సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం పలు సెక్షన్ల కింద అస్తానాతో పాటు మరికొందరిపై తాజా కేసు నమోదుచేసింది. -
రాకేష్ ఆస్తానాకు సుప్రీంలో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులైన గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాకేష్ ఆస్తానను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాకలైన పిటీషన్‌ను సుప్రీకోర్టు మంగళవారం కొట్టిపారేసింది. రాకేష్ ఆస్తానా నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న ప్రభుత్వం తుది తీర్పును నవంబర్ 24న రిజర్వ్‌లో ఉంచింది. ఆస్తానా నియమకాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆస్తానా నియామకాన్ని సమర్థించుకుంది. రాకేష్ ఆస్తానా (56) 40 ఏళ్ల సర్వీసులో అత్యంత భారీ కుంభకోణాలపై విచారణ చేశారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రధానంగా యూపీఏ హయాంలో దేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణం సహా, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్, నల్లధనం, మనీలాండరింగ్ వంటి ప్రతిష్టాత్మక కేసులను సమర్థవంతంగా కొలిక్కి తీసుకువచ్చారని ప్రభుత్వం పేర్కొంది. రాకేష్ ఆస్తానా నియామకం పూర్తిగా అక్రమమని ప్రశాంత్ భూషన్ కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై ఐటీ అధికారులు దాడులు చేసినప్పుడు లభించిన డైరీల్లో ఆస్తానా పేరుందని ఆయన చెప్పారు. అంతేకాక సదరు సంస్థ ఆస్తానా కనుసన్నల్లో నడిచేదని ప్రశాంత్ భూషణ్ అన్నారు. -
'రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమం'
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమమని, దీనిపై తాను కోర్టులో పిటిషన్ వేస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. రాకేశ్ ఆస్థానాపై స్టెర్లింగ్ బయోటెక్ డైరీలో పేరు ఉందని, సీబీఐయే రాకేశ్ పేరును ఎఫ్ఐఆర్లో పేర్కొందని చెప్పారు. ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న వ్యక్తిని సీబీఐకు స్పెషల్ డైరెక్టర్‌గా ఎలా చేస్తారని ప్రశ్నించారు. చూస్తుంటే దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ స్వతంత్రతను నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అనిపిస్తోందని అన్నారు. -
సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా అస్తానా
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా రాకేష్ అస్తానా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అనిల్ కుమార్ సిన్హా శుక్రవారం పదవీ విరమణ చేయడంతో అసిస్టెంట్ డెరైక్టర్ అస్తానాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం పూర్తికాలం చీఫ్‌ను ఎంపికచేయకపోవడంతో గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అస్తానాను తాత్కాలిక డెరైక్టర్‌గా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాకేష్ అస్తానా డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అరుుతే గడిచిన పదేళ్లలో తదుపరి పూర్తికాలం డెరైక్టర్‌ను ఎంపిక చేయకపోవడం ఇదే తొలిసారి.