సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నతాధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కాస్త ఛీబీఐగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో కేంద్రం స్పందించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సెలవుపై పంపినట్టు సమాచారం. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు)
నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లాలోని బోరె నర్సాపూర్. ప్రస్తుతం ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్‌డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిషా కేడర్‌లో డీజీపీగా పనిచేశారు. ఇదిలాఉండగా.. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్టవ్వడం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment