సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులైన గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాకేష్ ఆస్తానను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాకలైన పిటీషన్‌ను సుప్రీకోర్టు మంగళవారం కొట్టిపారేసింది. రాకేష్ ఆస్తానా నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న ప్రభుత్వం తుది తీర్పును నవంబర్ 24న రిజర్వ్‌లో ఉంచింది. ఆస్తానా నియమకాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆస్తానా నియామకాన్ని సమర్థించుకుంది. రాకేష్ ఆస్తానా (56) 40 ఏళ్ల సర్వీసులో అత్యంత భారీ కుంభకోణాలపై విచారణ చేశారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రధానంగా యూపీఏ హయాంలో దేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణం సహా, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్, నల్లధనం, మనీలాండరింగ్ వంటి ప్రతిష్టాత్మక కేసులను సమర్థవంతంగా కొలిక్కి తీసుకువచ్చారని ప్రభుత్వం పేర్కొంది.
రాకేష్ ఆస్తానా నియామకం పూర్తిగా అక్రమమని ప్రశాంత్ భూషన్ కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై ఐటీ అధికారులు దాడులు చేసినప్పుడు లభించిన డైరీల్లో ఆస్తానా పేరుందని ఆయన చెప్పారు. అంతేకాక సదరు సంస్థ ఆస్తానా కనుసన్నల్లో నడిచేదని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment