venkanna
-
మా వాళ్లని హీరోల్లా చూపించారు
‘‘పోలీస్ విభాగంలో క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైనదో ‘అథర్వ’లో చూపించారు. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనితా ఎవాంజెలిన్. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలోని వారికి ‘అథర్వ’ ప్రత్యేక ప్రదర్శన వేశారు. ‘‘మేం నిజంగానే క్రైమ్ సీన్లను చూస్తుంటాం కాబట్టి ఆ జానర్ సినిమాలు చూడం. కానీ ‘అథర్వ’ అద్భుతంగా అనిపించింది’’ అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న. -
ఓ సవాల్‌గా తీసుకున్నా – తల్లాడ వెంకన్న
తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే నెం.1’. సునీత, శృతిక, మధువని హీరోయిన్లుగా నటించారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో క్లాసిక్ సినీ క్రియేషన్ ్సపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో తల్లాడ వెంకన్న మాట్లాడుతూ–‘‘వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన నేను, సినిమా రంగాన్ని కూడా ఓ సవాల్‌గా తీసుకున్నాను. మంచి కథ, కథనంతో ‘ఒక్కడే నెం.1’ తీశాం. సురేశ్ బాబు, ఏషియన్ ఫిలింస్ వారు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాను రిలీజ్ చేసేందుకు ఒప్పుకోవడంతో సినిమా విజయంపై మా నమ్మకం మరింత పెరిగింది. కర్ణాటకలో కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను గతంలో భక్తిరస చిత్రాలు తీశాను. వెంకన్నగారి ప్రోత్సాహం వల్లే ‘ఒక్కడే నెం.1’ లాంటి మంచి కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది’’ అన్నారు దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు. నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, డైరెక్టర్ రేలంగి నరసింహారావు అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
పండుగ వేళ విషాదం..! రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు..
సాక్షి, వరంగల్: పండగకు ఇంటికి వస్తున్న తండ్రీకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని కిష్టాపురంలో జరిగింది. ఎస్సై విజయ్‌కుమార్ కథనం ప్రకారం మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న(50)కు కూతురు అనూష(33) ఉంది. పండుగ నిమిత్తం కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజు.. హైదరాబాద్ నుంచి తొర్రూరు చేరుకున్నారు. తొర్రూరు బస్టాండ్‌లో ఉండగా వెంకన్న బైక్‌పై వెళ్లి వారిని తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ వైపు నుంచి వస్తున్న కారు కిష్టాపురం క్రాస్ వద్ద బైక్‌ను ఢీకొంది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన అనూష, రాజును తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అనూష చికిత్స పొందుతూ మృతిచెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పండగపూట ఆ కుటుంబలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. -
సముద్రంలో పడవ బోల్తా.. జాలరి గల్లంతు
అచ్యుతాపురం (అనకాపల్లి): సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడటంతో ఓ జాలరి గల్లంతయ్యాడు. విశాఖ జిల్లా పూడిమడక తీరంలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఇంజన్ లేని బోటులో పూడిమడకకు చెందిన తిక్కల వెంకన్న, మరో ముగ్గురు జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక బోటు బోల్తా పడింది. వీరిలో తిక్కల వెంకన్న (50) గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురూ బోటును తిరగేసి వెంకన్న కోసం గాలించారు. అయినా జాడ కానరాకపోవడంతో ఒడ్డుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేటకు వెళ్లిన వారిలో వెంకన్నతో పాటు అతని కుమారుడు రాజు కూడా బోటులో ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర చెప్పారు. -
సాయుధ పోరులో ‘సాహు’
వరంగల్, భీమదేవరపల్లి(హుస్నాబాద్) : బూర్జువా పాలకులపై తుపాకీ ఎక్కుపెట్టి రాజీలేని పోరుసల్పిన ధీరత్వం.. గొండు బిడ్డల దీనత్వాన్ని ఆర్తిగా కవితల్లో ఆవిష్కరించే భావోద్వేగం...ఆయన జీవితమనే నాణానికి బొమ్మబొరుసులు. తూటాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో అగ్గిబరాటై కదం తొక్కి, అన్నార్తుల అక్రందనలకు అక్షర రూపమిచ్చిన ఆ శైలి స్ఫూర్తిమంతం. ఏకకాలంలో రచయితగా, ఉద్యకారుడిగా విశేష గుర్తింపు పొందిన ఈ సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దుబిడ్డ. ఆ గ్రామ ప్రజలు ముద్దుగా వెంకన్న అని పిలుచుకునే ఆయన అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు అలియాస్ సాహు. నేడు ప్రజా కవి కామ్రెడ్ సాహు 63వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ‘నీ కన్నీరు నా కన్నీరు కలిగినోడికి పన్నీరాఝె ఒంటిగా ఓ శోకం పెట్టె చిన్ని తమ్మయ్య నీ జంటగా నేనుంటరారా చిన్ని తమ్మయ్యా...’ అంటూ బాల కార్మికుల గాధలను సమాజానికి తెలియపర్చి వారి న్యాయం కోసం పోరాడిన ఘనత సాహుదే. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆయన తప్పకుండా ఉంటాడు. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, సాహిత్య ప్రపంచమూ కావచ్చు...ఆయన ఆలోచన, ఆచరణ, సామాజాన్ని తట్టి లేపే శక్తి అమోఘం. అన్ని ఉద్యమాల్లో ఆయన ఓ పోరాట యోధుడు, విరామమెరుగని యుద్ద సైనికుడు...ఆయనే ప్రజా కవి కామ్రెడ్ సాహు... ఓ వైపు ఉద్యమయోధుడిగా మరో వైపు సాహితి వేత్తగా ఏకకాలంలో రాణించి సమాజానికి దిక్చూచిలా నిలిచాడు సాహు. లిపి లేని గొండు భాషకు లిపిని సృష్టించి కొమురంభీం జీవిత చరిత్రను వెలికి (అల్లం రాజయ్యతో కలిసి) తీసి బాహ్య ప్రపంచానికి అందించిన గోండు ధీరుడు, విప్లవ యోధుడు ప్రజాకవి కామ్రెడ్ సాహు. ఉద్యమ జీవితంలో కేంద్ర కమిటీలో క్రీయశీలక పాత్ర పోషించాడు. భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో 1955 అక్టోబర్ 2న శనిగరం స్వామి–అయోధ్యలకు వెంకటేశ్వర్లు (సాహు) జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం హుజురాబాద్‌కు, డిగ్రీ కోసం జమ్మికుంటకు వెళ్లాడు. హుజురాబాద్‌లో చదువుకున్న రోజుల్లో 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. పలు నిరసన కార్యక్రమాలు పాల్గొని తెలంగాణ అవసరంగా భావించి ప్రజలను చైతన్యవంతం చేశాడు. తెలంగాణ వస్తేనే ఈ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడ్తాయంటూ అనేక సమావేశాలు, సభల్లో పాల్గొని ప్రసంగించాడు. ఉద్యమంలో... హుజురాబాద్‌లో చదువుకునే రోజుల్లోనే గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న ఆగడాలు, పేదలు పడుతున్న కష్టాలు అతనిని విప్లవోద్యమం వైపు అడుగులేసేలా చేశాయి. ఆ విధంగా ఉద్యమానికి ఆకర్షితులైన సాహు జ మ్మికుంటలో డిగ్రీ చదువుకునే రోజు ల్లోనే ‘గ్రామాలకు తర లిరండి’ అనే కా ర్యక్రమాన్ని ఆయన స్వంత గ్రామామైన మాణిక్యాపూర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాణిక్యాపూర్తో పరిసర గ్రామాల ప్రజలతో పాటు మావోయిస్ట్ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు, నల్ల ఆదిరెడ్డితో పాటుగా అనేక మంది మావోయిస్టులు హాజరై విప్లవ ఆవశ్యకతను వివరించారు. అనంతరం సాహు ఆదిలాబాద్ అడవుల్లోకి పయనమయ్యాడు. అక్కడ గొండులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటాలు చేస్తూనే గొండు భాషను నేర్చుకొని వారిలో ఒకడిగా మారిపోయాడు. ఆ క్రమంలోనే అతని కలం పేరును సాహుగా పెట్టుకున్నాడు. విప్లవ రచయితల సంఘం(విరసం)లో సభ్యుడిగా కొనసాగుతూనే గొండులపై అనేక కథలు, కవితలు, పాటలు రాశాడు. అతని పాటలు నేటికి ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో గొండు ధీరుడు కొమురం భీం జీవిత చరిత్రను రాసాడు. అటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్లిన సాహు ఆదిలాబాద్ అడువుల్లో అరెస్ట్ అయిన సమయంలో పోలీసుల అడిగిన ప్రశ్నలకు గొండు భాషలోనే సమాధానం ఇవ్వడంతో పుట్టు గిరిజనుడనుకొని లాకప్పులో వేశారు. అనంతరం తెలిసింది అతనొక విప్లవోద్యమనాయకుడని. సాహు జైల్లో ఉన్న సమయంలో విప్లవోద్యమం రెండు వర్గాలుగా విడిపోయింది. కానీ ఏ వర్గం కూడా తనను జైలు నుంచి విడిపించేందుకు కృషి చేయలేదని సాహు తన స్నేహితుల వద్ద మధన పడేవాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఉద్యమంలో ఇమడలేక సాధారణ జీవితం గడపలేక తీవ్ర సంఘర్షణను ఎదుర్కొన్నాడు సాహు. మళ్లీ కలం పట్టిన సాహు... అనేక ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన సాహు జైలు నుంచి విడుదలయ్యాక సాధారణ జీవితం గడపలేక తీవ్ర సంఘర్షణను ఎదుర్కొన్నాడు. తన కోసం తాను జీవించడం కాదు.. పేదల కోసం జీవించాలంటూ తిరిగి తన కలానికి పదును పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో బీఎస్ రాములు నేతృత్వంలో ఆవిర్భవించిన దరకమే (దళిత రచయిత కళాకారుల మేధావుల) ఐక్య వేదిక జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తిరిగి సాహిత్యంపై తన కలానికి పదును పెట్టాలనుకొని మాన్యం అడవుల్లో కిడ్నాప్ అయిన బాలరాజు ఉదాంతంపై నవల రాయాలనుకున్న సాహు అకస్మాత్తుగా మార్చి 16, 1993న గుండె పోటుతో మృతి చెందాడు. ప్రభుత్వం గుర్తించాలి.. మరుగున పడిన కొమురం భీం జీవిత చరిత్రను బాహ్య ప్రపంచానికి అందించడంతో పాటుగా తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గిరిజన అభివృద్ధికి ఆయన చేసిన రచనలను ప్రభుత్వం వెదికి ఆచరణలో పెట్టాలని ఆయన మిత్రులు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.
-
కల్యాణ వైభోగమే
ద్వారకాతిరుమల: శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటిన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో ఉభయ దేవేరులను పెళ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హేవిళంబి నామ సంవత్సర వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిపించారు. అంతకుముందు ఉదయం సింహ వాహనంపై ఉభయ దేవేరులతో ఆశీనులైన శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అట్టహాసంగా జరిగిన ఈ తిరువీధిసేవను భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఆకర్షణీయంగా కల్యాణ వేదిక శ్రీవారి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. తర్వాత ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. శుభముహూర్త సమయంలో వధూవరుల శిరస్సులపై జీలక్రర్ర, బెల్లం ధరింపజేసి మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పట్టువస్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న గరుడోత్సవం శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామి ఉభయదేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. స్వామికి గరుడ నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అలంకరణలో.. మోహినీ అలంకారంలో స్వామి మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో మోహినిగా శ్రీవారు భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ∙ఉదయం ..10 గంటలకు భక్తిరంజని ∙సాయంత్రం ..5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన ∙రాత్రి 7 గంటలకు ..శ్రీవారి దివ్య రథోత్సవం ∙రాత్రి 8.30 గంటల ..నుంచి అన్నమాచార్య సంకీర్తనలు -
కన్నుల పండువగా పుష్పోత్సవాలు
వాడపల్లి, ర్యాలిలో ముగిసిన కల్యాణోత్సవాలు వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి వార్ల పుష్పోత్సవాలు బుధవారం కన్నులపండువగా నిర్వహించారు. వీటితో ఈ రెండు ఆలయాల్లో జరుగుతున్న కల్యాణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కల్యాణోత్సవాల ముగింపు సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం గోవిందనామస్మరణతో మార్మోగింది. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, బాలభోగం, నివేదన, తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. వాడపల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి భక్తులు గోవింద నామస్మరణతో గ్రామోత్సవం చేశారు. వైఖానస పండితులు శ్రీమాన్ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు పుష్పోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. 11 రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి 121 రకాల మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పూలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోలపాటలతో శయనింపజేశారు. వందలాది దంపతులకు దంపతి తాంబులాలు అందించారు. తీర్థ మహోత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణ మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉదయం స్వామివారికి వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో మేలుకొలుపు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శ్రీ పుష్పోత్సవాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
ఘనంగా చక్రస్నానం
వాడపల్లి, ర్యాలి ఆలయాలకు పోటెత్తిన భక్తులు వాడపల్లి (ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి, పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి చక్రస్నాన మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, పూర్ణాహుతి, బాలబోగం, ప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలను వేదపండితులు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు చోళ సంవాదాన్ని జరిపించారు. చక్రస్నానం సందర్భంగా స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామి వారిని ఆలయం నుంచి పల్లకీపై ఊరేగింపుగా గ్రామ పుర వీధులో బాణసంచాకాల్పుల నడుమ బ్యాండ్ మేళాలతో గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ గోదావరి సమీపంలో ఏర్పాటు చేసిన పూరి పాకలో స్వామివార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం స్వామి వారిని గౌతమీ గోదావరి వద్ద వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ర్యాలి శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి చక్రస్నానాన్ని స్థానిక అమలాపురం కాలువలో వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పూర్ణాహుతి, బాలభోగం, ప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలను వేదపండితులు, ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి చక్రస్నానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఆయా ఆలయాల వద్ద జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందో బస్తు నిర్వహించారు. -
మార్మోగిన గోవింద నామం
పోటెత్తిన భక్తులు ఘనంగా పండిత సదస్యం వాడపల్లి (ఆత్రేయపురం) : ‘కోనసీమ తిరుపతి’ వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆల యం ప్రాంగణం ఆదివారం గోవింద నామస్మరణతో మారుమోగింది. పండిత సదస్యం సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించుకున్నారు. స్వామికి వేకువ జామునే గ్రామోత్సవం నిర్వహించారు. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వేదపారాయణంతో స్వామికి వేదాశీర్వచనం అందజేశారు. సుప్రభాత సేవ, బాలభోగం, విష్వక్సేనపూజ, వేదపారాయణ, నివేదన, బలిహరణ, దివ్య ప్రబంధం వంటి కార్యక్రమాలను వేదపండితులు, అర్చక స్వాములు వేద మంత్రాల పఠనతో నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామిని ఆభరణాలతో అలంకరించి మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం పవళింపు సేవ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, సభ్యులు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నయన మనోహరం వెంకన్న కల్యాణం
వాడపల్లి(ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కోనేటి రాయుడు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి గంటలకు రమణీయంగా జరిగాయి. సుందరంగా అలంకరించిన కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ కుమార్ దంపతులు, డీఎల్పీవో జేవీవీఎస్ శర్మ దంపతులు, ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు , ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ఎంపీపీలు వాకలపూడి వెంకట కృష్ణారావు, కోట చెల్లయ్య, రెడ్డి అనంతకుమారి, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఈఓపీఆర్డీ డీవై నారాయణలు స్వామి వారికి ప్రభుత్వం తరఫున∙పట్టు వస్త్రాలను సమర్పించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం చైత్ర శుద్ధ ఏకాదశి శుభముçహూర్తం రాత్రి ఏడు గంటలకు కల్యాణోత్సవాలను వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహలను పట్టు వస్త్రాలు, బంగారు, వెండి, వజ్రాభరణాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. వ్యాఖ్యాతగా ఎన్వీ సోమయాజులు, అయ్యంగారి పట్టాబిరామయ్య వ్యవహరించారు. మ«ధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి ర«థోత్సవం పురమాడ వీధుల్లో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం గౌతమి గోదావరి లో ఏర్పాటు చేసిన హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం రాత్రి 10 గంటలకు కన్నుల పండువగా జరిగింది. రావులపాలేనికి చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరారావు దంపతులు ముత్యాల తలంబ్రాలను సమకూర్చగా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరిగింది. కల్యాణ వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యలో ఆలయ కమీటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
వాడపల్లికి పెళ్లికళ
నేటి నుంచి వెంకన్న కల్యాణోత్సవాలు రేపు రథోత్సవం, పరిణయపర్వం ఆత్రేయపురం (కొత్తపేట) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి పెళ్లికళను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎండ వేడి తగలకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేసి, ఫ్యాన్లు అమర్చారు. స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బంది పడకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లొల్ల నుంచి వాడపల్లి వరకు అనేక స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వాడపల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. స్వామివారి ప్రసాదం కొరత రాకుండా సుమారు 50 వేల లడ్డులు తయారుచేసి సిద్దంగా ఉంచారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మ¯ŒS, ఈవో తెలిపారు. కాగా బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్ర పుష్పం, కల్యాణం, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇదీ కల్యాణోత్సవాల క్రమం గురువారం ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణతో కల్యాణోత్సవాలు మొదలవుతాయి. 7న రథోత్సవం, రాత్రి స్వామి వారి కల్యాణమహోత్సవం జరుగుతాయి. ప్రభుత్వం తరఫున శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్ స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి అచారం ప్రకారం వంశ పారంపర్యంగా హైదరాబాదుకు చెందిన జఠవల్లభుల గోపాలకృష్ణ సోమయాజులు దంపతులు ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణఘట్టాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. రావులపాలెంకు చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. గౌతమి గోదావరిలో రాత్రి 10 గంటలకు తెప్పోత్సవం విద్యుత్ వెలుగుల మధ్య జరుగుతుంది. 8న పొన్నవాహన మహోత్సవం, 9న సదస్యం, 10న ప్రత్యేక పూజలు, 11న గౌతమి గోదావరిలో స్వామి వారి చక్రతీర్థస్నానం జరుగుతాయి. 12న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహీనీ కేశవ స్వామి ఆలయాల్లో స్వామి వార్ల కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవోలు బీహెచ్‌వీ రమణ మూర్తి, వై వెంకటేశ్వరరావు తెలిపారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, ర్యాలిలో వేంచేసిన జగన్మోహినీ కేశవస్వామి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జగన్మోమినీ కేశవ స్వామి కల్యాణోత్సవాలు ఏప్రిల్ ఐదో తేదీ నుంచి వారం రోజులు పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు ఏప్రిల్ ఆరోతేదీ నుంచి వారం రోజులు పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6న శ్రీ స్వామి వారి ధ్వజారోహణం, నిత్య బలిహరణ, దర్శనాలు, 7న శుక్రవారం తీర్థం, రథోత్సవం, కల్యాణం, తెప్పోత్సవం, 8న శ్రీ స్వామి వారి పొన్నహవాన మహోత్సవం, 9న సదస్యం, 10న నిత్యహోమం, నిత్య బలిహరణ, దర్శనాలు, 11న మంగళవారం చక్రతీర్థం, 12న స్వామి వారి శ్రీపుష్పోత్సవంతో స్వామివారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి. కల్యాణోత్పవాలపై ఈనెల 24న ఆర్డీఓ జి.గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు అ«ధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఈవో రమణ మూర్తి తెలిపారు. -
నాణ్యతకు తూట్లు
రూ.6 కోట్ల రోడ్ల పనుల్లో అవకతవకలు అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు ఆత్రేయపురం (కొత్తపేట) : వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారులను రూ.ఆరు కోట్లతో నిర్మిస్తుండగా తెలుగుదేశం నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లొల్ల నుంచి వాడపల్లి ఆలయానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఊబలంక నుంచి ర్యాలి వరకు రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరు కాగా ఇటీవల పనులు ప్రారంభించారు. అందుకుగాను వాడపల్లి గొడ్డుకాలువ వంతెన నుంచి ఏటిగట్టు వరకు 10 మీటర్లు, లొల్ల వంతెన నుంచి గొడ్డుకాలువ వంతెన వరకు 7 మీటర్ల రోడ్డు నిర్మించాలి. కానీ లొల్ల చెరువు గట్టు సమీపంలో, పంచాయతీ సమీపంలో టర్నింగ్ వద్ద 3 మీటర్ల వెడల్పున నిర్మిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడులతో రోడ్డు అలైన్మెంట్ పనులు ఇష్టానుసారంగా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన తెలుగుదేశం నేతలు సర్వే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆక్రమణలు తొలగింపులో అవకతవకలకు పాల్పడుతుండటంతో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు అష్టవంకర్లతో నిర్మితమయ్యేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనులు నాసిరకం సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో సిమెంట్ రోడ్డు బీటలు వారే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తునారు. దీనిపై ఆర్అండ్బీ ఏఈ మణికుమార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల అదేశాల మేరకు అవసరం మేరకే ఆక్రమణలు తొలగించి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. -
వెంకన్న ఆలయ పనులకు ఈ-టెండర్లు ఖరారు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.32.20 లక్షలతో చేపట్టనున్న ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వినైజ్డ్ మెస్ అభివృద్ధి పనులకు ఈ-టెండర్లు ఖారారైనట్లు ఈఓ బీహెచ్ఈ రమణమూర్తి మంగళవారం తెలిపారు. సుమారు 15 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారన్నారు. అన్నదాన సత్రానికి, ప్రహరీకి రూ.10 లక్షలు కేటాయించగా 15.75 శాతం తక్కువకు, పీఈబీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకాగా 15 శాతం తక్కువకు, ఫ్లోరింగ్ రూ.4.70 లక్షలు కేటాయించగా 10.01 శాతం తక్కువకు, గాల్వినైజెడ్ మెస్ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు కేటాయించగా 14.1 శాతం తక్కువకు టెండర్లు ఖారారు చేశారు. ఫిబ్రవరి 16న అధికారులు బాక్సు టెండర్లు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రూ.10 లక్షలకు మించిన పనులకు ఈ-టెండర్లు పిలవాల్సి ఉండగా బాక్సు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కేవలం రూ.32ల తక్కువకు టెండర్లను అధికార్లు ఖరారు చేసినట్లు ఆలయ ఈఓ రమణ మూర్తి తెలిపారు. దీనిపై ‘అవకతవకలపై టెండరింగ్’ అంటూ ఫిబ్రవరం 17న సాక్షిలో కథనం రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖారారైన బాక్సు టెండర్లను రద్దు చేశారు. తిరిగి ఈ-టెండర్లు ఆహ్వానించడంతో సుమారు రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. అయితే గతంలో రూ.32.20 లక్షల పనులను బాక్సు టెండర్లలో రూ.32కే దక్కించుకున్న కాంట్రాక్టర్ మరికొందరితోపాటు ఈ-టెండర్లో రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కోడ్ చేయడంతో తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. బాక్సు టెండర్ల ద్వారా పచ్చ చొక్కా కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చుదామని తీవ్రంగా ప్రయత్నించిన ఆలయ అధికారులకు, ఆ పార్టీ నియోజకవర్గ నేతలకు చివరకు ఆశా భంగమే కలిగింది. -
నాణ్యతా ప్రమాణాకు తిలోదకాలు
వెంకన్న అన్నదాన సత్రం నిర్మాణంలో అవినీతి బీటలు వారుతున్న పునాదులు వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రం పునాదులు బీటలు వారుతున్నాయి. సుమారు రూ.80 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు భవన నిర్మాణం పర్యవేక్షణ చేపట్టకపోవడంతో ఽపనులు నాశిరకంగా జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. దానికితోడు బినామీ కాంట్రాక్టర్లకు అనుభవం లేకపోవడంతోనే పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ 2016లో భవన నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు మంజూరు చేసింది. అయితే ఆ పనులపై కన్నెసిన గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్క నేతలు బినామి పేరుతో పనులు సొంతం చేసుకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నాశిరకం మెటీరియల్ వాడకం, పునాదిలో ఇసుక ఫిలింగ్ సమయంలో చౌడు మట్టి వాడటం, క్యూరింగ్ నిబంధనలు పాటించక పోవడంతో భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది పూర్తి కావస్తున్నా నేటికీ పూర్తికాకపోవడంపై పలువురు భక్తులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులు మండుటెండల్లో స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. -
టెండరింగ్
వాడపల్లి ఆలయంలో చక్రం తిప్పుతున్న నేతలు ఆదాయానికి గండికొడుతున్న వైనం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నలుగురు గ్రామ పెద్దలు తిష్టవేశారని పలువురు వెంకన్న భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పాలక వర్గం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్కా నేతలు ఆలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఆలయ అభివృద్ధి పనులకు జరిగిన టెండర్లలో నలుగురు నాయకులు చక్రం తిప్పి పనులు టెండరింగ్ అయ్యేలా ప్రయత్నాలు చేయడంతో పాటు తమ అనుచరులకే పనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఆలయ సిబ్బంది కూడా వారికి తమ వంతు సాయం అందించి స్వామి భక్తిని చాటుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రూ.32.20 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు టెండర్లలో రింగ్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది పరోక్ష సహకారంతోనే ఆలయంలో తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లకు అధికారుల సమక్షంలోనే ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున గుడ్‌విల్ రూపంలో అందించి దేవుడికి శఠగోపం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పోటీకీ వచ్చిన టెండరుదార్లను ప్రలోభాలకు గురిచేయడంతో రూ 32.20 లక్షల విలువైన పనులు 0.01 తక్కువ మొత్తానికి (రూ.32 తగ్గించి) టెండర్లు ఖరారైనట్టు ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ప్రకటించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వెంకన్న ఆలయంలో అన్నదాన సత్రానికి ప్రహరీ, ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వనైజ్డ్ మెస్‌కు దేవాదాయ శాఖ రూ.32.20లక్ష లు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు ఈ నెల 9న టెండర్లు పిలిచారు. ఆ పనులకు సంబంధించి టెండరుదార్లను ఆహ్వానించేందుకు మొక్కుబడిగా ప్రకటనలు చేసి ఆలయ పరిపాలన సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది గోప్యం పాటించారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక పత్రికల్లో టెండర్ నోటీస్ ప్రకటనలు రాకపోవడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతుంది. దీంతో రూ.32.20 లక్షలు పనులకు నాలుగు టెండర్లు మాత్రమే రాగా అందులో రెండు బినామీ అని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయంలో సుమారు రూ.కోటితో పనులు చేపట్టిన కొందరు టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికత పేరుతో బెదిరించి పను లు దక్కించుకున్నారని భక్తులు వాపోతున్నారు. టెండర్ల గురించి మరింత ప్రచారం చేసి ఉంటే 5 శాతం తక్కువకు ఖరారై దేవాదాయ శాఖకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వాడపల్లి ఆలయ పనుల్లో జరిగిన టెండరు అవకతవకలపై దృష్టిసారించి తిరిగి టెండర్లు నిర్వహించాలని వెంకన్న భక్తులు కోరుతున్నారు. -
ముగిసిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
వైభవంగా చక్రస్నాన మహోత్సవం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెం దిన శ్రీ వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆల యంలో ఐదురోజులు పాటు నిర్వహించి న బ్రహ్మోత్సావాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా స్వామి వారు కల్కి, అమ్మవారు గజలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ము గింపులో భాగంగా స్వామివారి చక్రతీర్థ స్నాన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువ జామునే విష్వక్షే్సనపూజ, పుణ్యహవచనం, పూర్ణహూతి, బాలబోగం, ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలును వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్బంగా స్వామి వార్ని ఆలయం నుంచి పల్లకి పై ఉంచి బాణాసంచా కాల్పుల నడుమ బ్యాండ్ మేళాలతో స్వామి వారిని గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ స్వామి వా రికి ఏర్పాటు చేసిన ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకు వచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకించారు. స్వామి వారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. ఉదయం 10 గంటలకు స్వామి వార్ని కల్కి అవతారం, అమ్మవారిని గజలక్ష్మీ అ వతారంలో గజవాహన సేవ, సాయంత్రం చూరో్ణత్సవం, మహదాశీర్వచనం, సాయంత్రం 4 గంట లకు అశ్వవాహనంపై స్వామి వారిని ఘనంగా ఊరేగించారు. అనంతరం స్వామి వార్ని విశేష పుష్పములతో పుష్పాల రాయుడికి ఉయ్యాల సే వ, పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
వేడుక చూడ.. వెల్లువలా..
భక్తులతో కిటకిటలాడిన ‘కోనసీమ తిరుపతి’ నయనమనోహరంగా నాలుగో రోజు బ్రహ్మోత్సవాలు సూర్య, చంద్రప్రభ వాహనాలపై స్వామి ఊరేగింపు వాడపల్లి(ఆత్రేయపురం) : అటు గౌతమిలో జలం పరవళ్లు.. ఇటు తీరంలో జనం పరవళ్లు.. ‘కోనసీమ తిరుపతి’ వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో నాలుగోరోజు∙శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన భక్తులతో గ్రామంలో కిటకిటలాడినట్టయింది. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సూర్య, చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తెచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకం చేశారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు, నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు 108 కలశాలతో అభిషేకం నిర్వహించి స్వామి వార్ని ప్రత్యేకంగా అలంకరించి సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగించారు. స్వామివారికి విష్వక్సేనæ పూజ, పుణ్యాహవచనం, కుంభపూజ, తిరుమంజనోత్సవం, విశేషారాధన, చతుర్వేద పారాయణం, బాలభోగ నివేదన, అనంతరం స్వామి వారికి అషో్టతర శత కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఏర్పాట్లను ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్ చక్రవర్తి పర్యవేక్షించారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేటితో బ్రహ్మోత్సవాలకు తెర బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. చివరిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముత్యాలపల్లకిలో ఉత్సవ మూర్తులను బాణ సంచా కాల్పుల నడుమ గోదావరి తీరానికి వెళ్లి చక్రస్నానం చేయిస్తారు. అనంతరం బాలభోగం, నివేదన, గజవాహన సేవ, అశ్వవాహన సేవ తోపాటు విశేష పుష్పాలతో స్వామివారికి ఉయ్యాలసేవ, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. -
వెంకన్న వేడుక..కన్నులకు కానుక
భక్తజనం మురిసేలా బ్రహ్మోత్సవాలు మూడోరోజు రాముని అవతారంలో స్వామి హనుమత్, గరుడ వాహనాలపై ఊరేగింపు మహిమ గల దేవునికి సుమాభిషేకం వాడపల్లి(ఆత్రేయపురం): ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం స్వామి వారికి పుష్పాభిషేకంతో పాటు హనుమద్వాహన, గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలు భక్తజనులకు కన్నులవిందుగా జరిగాయి. స్వామివారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ అనంతరం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పువ్వులతో అలంకరించారు. వజ్ర వైఢూర్యాభరణాలతో అలంకృతుడైన వెంకన్నను చూసి భక్తులు పులకించారు. ఆలయంలో భక్తులు ఆర్జిత సేవలు నిర్వహించారు. ఉదయం వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజన మంత్రపుష్పం, బలిహరణ అనంతరం 10 గంటలకు స్వామి వారికి శ్రీరాముని రూపంలో హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గరుడవాహన సేవ, స్వస్తి వచనం, నిత్యహోమం, నవమూర్తి అర్చన, అష్టోత్తర కలశారాధన, శయ్యాధివాసం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్ చక్రవర్తి పర్యవేక్షించారు. కాగా శనివారం స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఏడువారాల నోము అచరించే భక్తులతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. ఇవీ నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, అష్టోత్తర శతకలశాభిషేకం, ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు చంద్రప్రభ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, విశేష పూజలు, సేవలు జరుగుతాయి. -
వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రెండోరోజు బ్రహ్మోత్సావాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ఉదయం తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం, ఉదయం ఆ రు గంటలకు సుప్రభాతసేవ, సభ్యుల గో త్రనామాలతో పూజలు నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహర ణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వేదపండితులు వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర శ్రీ ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు జరిపించారు. స్వామి వారి ఆలయంలో భక్తులకు ఆర్జిత సేవలు, అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం 9:30 గం టలకు స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పు ణ్యాహవచనం, సప్తకలశారాధన, ఉత్సవాంత స్నపనం, నిత్యహోమం, మహాసుదర్శన హోమం, విశేష అర్చన, బలిహరణ నీ రాణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలాగే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన హంస, సింహవాహనంపై గ్రామంలో ఊరేగించారు. సా యంత్రం 5–30 గంటలకు స్వస్తివాచనము లు, నిత్యహోమాలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఏ ర్పాట్లును ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షుకులు రాధకృష్ణా, సాయిరామ్ పర్యవేక్షించారు. నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, గరుడవాహన సేవ, స్వస్తి వాచనం, నిత్యహోమం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, పంచామృతమంటపారాధన, వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజనం, బలిహరణ, హనుమద్వాహన సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందకు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో రమణమూర్తి తెలిపారు. -
ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి (ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలను బుధవారం ఆలయ ఈవో బీహెచ్ రమణమూర్తి వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన యాగశాల వద్ద హోమంలో పాల్గొన్నారు. వైఖానస ఆగమోక్తంగా యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 9.45 గంటలకు స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శేషవాహన సేవ, అనంతరం శాలావిహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, అగ్నిమధనం తదితర పూజలు నిర్వహించారు. ఈఓ ఆధ్వర్యంలో పర్యవేక్షకులు రా«ధాకృష్ణ, సాయిరామ్, శివ, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లును పర్యవేక్షించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, సప్తకలశారాధన, సాయంత్రం నాలుగు గంటలకు హంస, సింహ వాహనసేవ, స్వస్తి వచనం, నిత్యహోమాలు, రాత్రి ఏడు గంటలకు స్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈఓ వివరించారు. -
గోడ కూలి ఇద్దరు మృతి
-
తిరుమలలో వెంకన్న భక్తుల సాహసం.
-
బిచ్చమెత్తి గణపతి లడ్డూను దక్కించుకున్నారు..!
రోజూ బిక్షాటన చేసిన సొమ్మును దాచుకున్న చెంచు జాతికి చెందిన గిరిజన దంపతులు వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను వేలంలో దక్కించుకున్న సంఘటన బుధవారం వరంగల్ జిల్లా కురవిలో చోటుచేసుకుంది. చెంచు కాలనీకి చెందిన గడ్డం వెంకన్న, మంగమ్మ దంపతులు వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం ద్వారా రూ.26, 116కు తీసుకున్నారు. అప్పుడప్పుడూ కూలీ పనులకు వెళ్తున్నప్పటికీ ఈ దంపతుల ప్రధాన జీవనాధారం భిక్షాటనే. అత్యంత భక్తి ప్రపత్తులతో లడ్డూను దక్కించుకోవడం పట్ల పలువురు అభినందించారు. అనంతరం మేళతాళాల మధ్య గణపయ్యను భద్రచాలం గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తరలివెళ్లారు. -
బ్రహ్మోత్సవ వేడుకకు వేళాయె...
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సిద్ధం చేసిన స్వామి వారి ఆహ్వాన పత్రిక, పోస్టర్లను ఆదివారం స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి మాట్లాడుతూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి కొలువైన వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. వాడపల్లి ముస్తాబు.. ఐదురోజుల పాటు జరిగే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వాడపల్లి ముస్తాబవుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అష్టదళ పాదపద్మారాధన, ఐశ్వర్యలక్ష్మి హోమం, సహస్ర దీపాలంకరణసేవ, అషో్టత్తర కలశాభిషేకం తదితర అర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే అషో్టత్తర పూజలు, కల్యాణాలు, ఉప నయనాలు, వివాహలు రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సోవ ఆర్జిత సేవలకు రూ.1116 చెల్లించే భక్తులు నగదు, డీడీలు, మనియార్డర్లు ఈఓ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, వాడపల్లి, ఆత్రేయపురం మండలం, ఫోన్: 08855–271888కు పంపి, రసీదు పొందాలన్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.81 కోట్లు
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి హుండీల ద్వారా మంచి ఆదాయం సమకూరింది. గడచిన 27 రోజులకు గాను రూ.1.81 కోట్లు పైబడి ఆదాయం లభించింది. ఆలయ ఆవరణలో బుధవారం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్వామివారికి నగదు రూపేణా రూ.1,81,33,65 ఆదాయం లభించగా, భక్తుల కానుకలు రూపేణా 525 గ్రాముల బంగారం, అలాగే 5.939 కేజీల వెండి లభించినట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా అధికంగానే లభించినట్టు చెప్పారు. శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1.11 లక్షల విరాళం శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ. 1,11,111ను విరాళంగా అందించారు. గణపవరం మండలం సరిపల్లికి చెందిన పెరుమాళ్ల శ్రీరామకృష్ణమూర్తి, సక్కూబాయ్ దంపతులు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కార్యాలయంలో ఈ విరాళాన్ని జమచేయగా దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు దాతకు బాండ్ పత్రాన్ని అందించారు. -
అప్పుల బాధ తాళలేక..
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వెంకన్న(50) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెంకన్న ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వెంకన్నకు ప్రత్యేక పూజలు
పెందుర్తి : స్థానిక వెంకటాద్రిపై వెలసిన వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం అర్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. లక్ష్మిపురంలోని శ్రీదేవి భూదేవి సహిత కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వెంకన్నకు శిల్పకారుడి కానుక
తెనాలి: పట్టణానికి చెందిన శిల్పకారుడు చింతక్రింది భాస్కర్ స్థానిక వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి కోసం ముచ్చటైన కిరీటం, కర్ణాభరణాలు రూపొందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి కిరీటాన్ని పోలిన నమూనాతో వీటిని తయారు చేశారు. తన స్థోమతకు తగినట్టుగా రాగితో చేసిన కిరీటంపై బంగారు పూత పూశారు. ‘జకో’ అని పిలిచే ఆస్ట్రేలియాకు చెందిన రాళ్లను పొదిగారు. కిరీటం, కర్ణాభరణాలకు దాదాపు ఆరు వేల రంగురాళ్లను వినియోగించినట్టు భాస్కర్ చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామికి శనివారం తన కానుకగా వీటిని సమర్పించనున్నట్టు విలేకరులకు తెలియజేశారు. శిల్పకళలో ప్రఖ్యాతి చెందిన అక్కల సోదరుల మేనల్లుడైన భాస్కర్ చిన్నతనం నుంచీ శిల్పకళలో ఎదిగారు. ఇంతకు ముందు భావనారుషి ఆలయానికి రెండు కిరీటాలు, పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానానికి కవచం చేసి ఇచ్చినట్టు చెప్పారు. -
వెంకన్న దర్శనానికి 14 గంటలు
సాక్షి, తిరుమలః కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులు క్యూల్లో బారులు తీరారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 65,923 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపల రెండు కిలోమీటర్లమేర విస్తరించింది. వీరికి 14 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. కాలినడక భక్తులకు 10 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులకు డిమాండ్ మరింత పెరిగింది. గదికోసం కనీసం నాలుగు గంటల సమయం క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. కల్యాణకట్ట వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. పెరిగిపోయిన రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యాలపై దృష్టిపెట్టడంతో క్యూ కొంత వేగంగా కదిలింది. సౌకర్యాలు కొంత మెరుగుపడ్డాయి. -
న్యూడెమోక్రసీ దళ కమాండర్ వెంకన్న అరెస్ట్
గూడూరు మండలం జగన్నాయకులగూడెంకు చెందిన న్యూడెమోక్రసీ దళ కమాండర్ వెంకన్న అలియాస్ విక్రమ్‌ను అరెస్ట్ చేసి మీడియా ఎదుట పోలీసులు హాజరు పరిచారు. అతని వద్ద నుంచి ఒక రివాల్వర్, ఐదు బుల్లెట్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట పోలీసులు వెల్లడించారు. -
అధికార లాంఛనాలతో రాంరెడ్డి అంత్యక్రియలు
హాజరైన రాజకీయ ప్రముఖులు కామేపల్లి/ఇల్లెందు: పీఏసీ చైర్మన్, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం పాతలింగాలలో ప్రభుత్వ లాంఛనాలతో శనివారం నిర్వహించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో హైదరాబాద్‌లో వెంకటరెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం విదితమే. భౌతికకాయాన్ని శుక్రవారం అర్ధరాత్రి స్వగ్రామానికి తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎల్పీ జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి, ఎమ్మెల్యేలు డీకే.అరుణ, జీవన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పాయం వెంకటేశ్వర్లు, సండ్ర వెంకటవీరయ్య, రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, బలరాంనాయక్, పొన్నాల లక్ష్మయ్య, వనమా వెంకటేశ్వర్రావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకటరెడ్డి భౌతిక కాయానికి ఆయన సోదరుడు కృష్ణారెడ్డి తలకొరివి పెట్టారు. రాంరెడ్డి సోదరుడు రాంరెడ్డి దామోదర్రెడ్డ్డి, కుటుంబ సభ్యులు, వేలాదిగా అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఫోన్లో పరామర్శించిన వైఎస్.జగన్ మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరితను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ద్వారా వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వెంకట్‌రెడ్డి మృతి రాష్ట్ర, జిల్లా ప్రజలకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
కాకినాడలో విద్యార్థి మృతి
తూర్పుగోదావరి: కాకినాడలో ఓ స్కూల్ విద్యార్థి మృతి చెందాడు. పెగోడా నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న వెంకన్న(9) అనే విద్యార్థి స్కూల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడి పోయాడు. స్కూల్ భవనంపైన ఆడుకుంటూ ఉండగా సన్ సైడ్‌పై నుంచి జారి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంకన్న తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి కుటుంబసభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
బైకు, ట్రాక్టర్ ఢీ: ఇద్దరి దుర్మరణం
రాయపర్తి (వరంగల్): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. కిస్టాపురం క్రాస్‌రోడ్డు వద్ద బైక్, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనగా బైక్‌పై ఉన్న రాజు (26), వెంకన్న (28) అక్కడికక్కడే చనిపోయారు. మృతులిద్దరూ మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన వారు. -
సాక్షి రిపోర్టరుకు ప్రెస్ అకాడమీ నగదు బహుమతి
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఎన్కౌంటర్ నిందితుల ఫొటోలను అర్వపల్లి మండలంకు చెందిన సాక్షి పత్రిక రిపోర్టరు వెంకన్న ప్రాణాలకు తెగించి శనివారం సేకరించిన విషయం తెలిసిందే. ఆయన ధైర్యసాహసాలకు గుర్తుగా తెలంగాణ ప్రెస్ అకాడమీ తరపున రూ. 15 వేలనగదు బహుమతిని అందించనున్నట్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోత్సాహకాన్ని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా అందివ్వనున్నట్లు జనరల్ సెక్రటరీ క్రాంతి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో సాహసోపేతమైన జర్నలిజానికి ప్రతీకగా నిలిచిన వెంకన్నకు టీయూడబ్ల్యూ ద్వారా రూ.10వేల అవార్డును సైతం ప్రకటించారు. -
రాత్రి కరెంటుకు రైతు బలి
కురవి/మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం మాధవపురం శివారు చీకటిచింతల తం డాకు చెందిన రైతు బానోత్ వెంకన్న(38) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకన్న తన మూడు ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి సాగు చేస్తున్నాడు. ఇతని పొల మున్న ప్రాంతానికి కురవి మండలం అయ్యగారిపల్లి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. గత ఆదివారం వేకువ జామున రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గురువారం వేకువ జామున పొలానికి నీరు పెట్టేందుకు వెంకన్న వెళ్లాడు. మోటార్ ఆన్ చేసేందుకు ఫీజులు పెడుతుండగా, షాక్ కొట్టడంతో అరచి కుప్పకూలాడు. -
అనుమానించాడు.. అంతం చేశాడు
భర్త చేతిలో మహిళదారుణ హత్య ఖమ్మం క్రైం: దాంపత్య జీవితంలో ముప్పై ఏళ్లుకలిసి పయనించినా ఆమెను అతడు నమ్మలేదు. అడుగుడుగునా అనుమానించాడు... అవమానించాడు. చివరకు అంతమొందించాడు. తోడునీడనై రక్షణ కల్పిస్తాని ప్రమాణాలు చేసినోడే కసాయిగా మారి కడతేర్చాడు. బుర్హాన్‌పురంలోని ఇరవై నాలుగు గంటల పంపు వద్ద ఉన్న కొండమ్మకోరి ప్రాంతానికి చెందిన అమృతపు సుభద్ర(50) భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ సంఘటన ఖమ్మంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సుభద్ర తన భర్త సత్యనారాయణతో కలిసి కిరాణ షాపు నిర్వహిస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. వీరిలో శేషగిరి, వెంకన్నకు వివాహం జరిగింది. శేషగిరి నేలకొండపల్లి, వెంకన్న హైదరాబాద్‌లో ఉంటున్నారు. చిన్నవాడైన సాయికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సత్యనారాయణకు షుగర్ రావడంతో కొంత కాలం క్రితం కాలు తొలగించారు. దీంతో కిరాణ షాపులోనే అతడు ఉంటున్నాడు. అతడికి భార్యపై మొదటి నుంచే అనుమానం. ఆమెను నిత్యం వేధించే వాడు. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు సాయి బయటకు వెళ్లడానికి చూసి సుభద్రపై సత్యనారాయణ ఇనుప చేతికర్రతో తలపై కొట్టాడు. దీంతో ఆమె కింద పడింది. ఆపై గొంతు నులిపాడు. గట్టుచప్పుడు కాకుండా రక్తపు మరకలు తుడవడానికి సత్యనారాయణ యత్నించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా రాత్రి 2 గంటల సమయంలో దగ్గర్లోని బంధువుకు ఫోన్‌చేసి తన భార్య కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పాడు. దీంతో వారు చిన్నకూమారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పారు. అతడు నేలకొండపల్లిలో ఉన్న అన్న శేషగిరికి సమాచారం అందించి ఇంటికి వచ్చాడు. అదేసమయానికి శేషగిరి కూడా ఖమ్మం చేరుకోవడంతో ఇద్దరు కలిసి వరండాలో ఉన్న సుభద్రను ఆస్పత్రికి తరలించటానికి ప్రయత్నం చేస్తుండగా ఆమె తల వెనుక భాగంలో తగిలిన దెబ్బను గమనించారు. అప్పటికే సుభద్ర మృతిచెంది ఉంది. అనుమానం వచ్చి తండ్రిని అడుగగా అతడు పొంతన లేకుండా మాట్లాడడంతో బండారం బయటపడింది. దీంతో ఇద్దరు కుమారులు కలిసి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ సారంగపాణి, ఎస్సై సురేష్ సందర్శించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకు హత్యకు ఉపయోగించిన చేతికర్రను స్వాధీన పర్చుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. గతంలో కూడా సుభద్రపై పలుమార్లు సత్యనారాయణ దాడులు చేశాడని ఆమె కుమారులు తెలిపారు. -
కొల్లేరులో నకిలీ చేపలు
భారీగా నకిలీ కరెన్సీ చెలామణి టీడీపీ సర్పంచ్ కీలకపాత్ర గుడివాడ, కైకలూరు, కలిదిండిలతో లింకు రూ.500, 1,000 నోట్లు కర్ణాటక నుంచి వచ్చేవి కొల్లేరు తీరంలో నక్కిన నకిలీ చేపలు ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాయి. పెద్దమనిషి ముసుగులో పెద్ద మొత్తంలో దొంగనోట్లు చెలామణి చేసిన టీడీపీ నేత నిజ స్వరూపం బయటపడింది. ఇక్కడే కొందరు నకిలీ నోట్ల తయారీకి ఏర్పాట్లు చేయడం కలకలం రేపింది. కైకలూరు/గుడివాడ/కలిదిండి : జిల్లాలో కలకలం రేపిన నకిలీ కరెన్సీ నోట్ల కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల విచారణలో వెలుగుచూసిన అంశాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. టీడీపీ నాయకుడు జనానికి నకిలీ నోట్లు అంటగట్టినట్లు తెలియడం సంచలనం సృష్టించింది. కొల్లేరు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీ రాకెట్ తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే కొందరు వారికి సహరించారు. కర్ణాటక నుంచి.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన నాయక్ ద్వారా కైకలూరు నియోజకవర్గంలోని పలువురు నకిలీ నోట్లను భారీ ఎత్తున చెలామణి చేశారు. తొలుత కలిదిండికి చెందిన జలసూత్రం వెంకన్న మాత్రమే నాయక్ నుంచి నకిలీ నోట్లు తెచ్చుకుని చెలామణి చేసేవాడు. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి చెందిన సూదాబత్తుల రాంప్రసాద్, సిరిగిరి సూర్యనారాయణ, కలిదిండిలో సెల్పాయింట్ నిర్వహిస్తున్న మండా ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా కాళ్లలో సెల్పాయింట్ నిర్వహిస్తున్న దొడ్డనపూడికి చెందిన కొల్లి నాగవెంకట సత్యనారాయణ, కలిదిండి మండలం సానారుద్రవరానికి చెందిన వడ్లాని రాము, మొగల్తూరుకు చెందిన గాదె ప్రదీప్ కూడా నకిలీ నోట్ల చెలామణి ప్రారంభించారు. వీరితోపాటు మరి కొందరు కూడా దొంగనోట్లు మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నోట్ల మార్పిడి ఇలా.. నకిలీ కరెన్సీ రాకెట్లో ఆరితేరిన నాయక్‌తో పరిచయం పెంచుకున్న జలసూత్రం వెంకన్న గత డిసెంబర్ నుంచి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాయక్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఆధారంగా విజయనగరం, శ్రీకాకుళం, గుంతకల్లు, హౌరా రైల్వేస్టేషన్లకు వెళ్లి అతను పంపిన మనిషి వద్ద నుంచి వెంకన్న దొంగనోట్లు తెచ్చుకునేవాడు. అతను రూ.5వేలు కమీషన్‌పై ఇతరులకు దొంగనోట్లు సరఫరా చేస్తాడు. నాయక్ నుంచి వెంకన్నకు రూ.500, రూ.1,000 నకిలీ నోట్లు వచ్చేవి. వెంకన్న ద్వారా రూ.28.25లక్షల విలువైన నకిలీ కరెన్సీని పలువురు చెలామాణి చేశారు. వెంకన్న సొంతంగా కలర్ ప్రింటర్, స్కానర్, పేపర్ కట్టర్‌ను కొనుగోలు చేసి రూ.100 నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేశాడు. గుడివాడలోనూ ముగ్గురు.. కలిదిండి మండలంలో పట్టుబడిన దొంగనోట్ల ముఠాలో గుడివాడకు చెందిన ముగ్గురు ఉన్నట్లు తేలడంతో ఈ ప్రాంతంలో కలకలం మొదలైంది. గుడివాడకు చెందిన బండారు రమేష్ రూ.3లక్షలు, కోతిబొమ్మ సెంటర్లో ఉండే వడ్డీ వ్యాపారి రాజేష్ రూ.1.50లు విలువైన నకిలీ కరెన్సీని చెలామణి చేసినట్లు వార్తలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో ఫైనాన్స్ వ్యాపారం చేసే కిరణ్ కూడా ఈ దొంగనోట్లును పెద్ద ఎత్తున చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు సమా చారం. కర్ణాటకకు చెందిన నాయక్ ద్వారా వీరు దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నాయక్ అకౌంట్లో డబ్బులు జమచేస్తే అందుకు తగినంత దొంగనోట్లను ఓ వ్యక్తి గుడివాడ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందజేస్తాడు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో కొద్ది మంది గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిస్తున్నారని తెలుస్తోంది. నాయక్ ఖాతా నకిలీదే.. కర్నాటకకు చెందిన నాయక్ పేరుతో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా కూడా నకిలీదేనని పోలీసులు గుర్తించారు. నాయక్ పేరుతో ఇక్కడి ఏజెంట్లు డబ్బు జమ చేస్తున్న ఖాతా మరో వ్యక్తి పేరుతో ఉన్నట్లు సమాచారం. కలిదిండిలో రెండేళ్లుగా చెలామణి! కలిదిండి మండలంలో రెండేళ్లుగా దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు సమాచారం. గతంలో మండలంలోని తాడినాడకు చెందిన ఒక వ్యక్తి విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో సహా వెళ్లాడు. అక్కడ కౌంటరులో లడ్డూలు కొనుగోలు చేయటానికి ముందుగా రూ.500 నోటు ఇవ్వగా.. అది దొంగనోటు అని గుర్తించారు. మరొకటి ఇవ్వగా అది కూడా దొంగనోటు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అప్పట్లో ఆ వ్యక్తిని విచారించగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన ఒక కొబ్బరికాయల వ్యాపారి ఆ నోట్లు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి కలిదిండి మండలంలో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం. కలిదిండి మండలంలో ఎక్కువగా చేపల చెరువులు ఉండటంతో ఈ ముఠాలు సులభంగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నారు. ఎట్టకేలకు దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్‌చేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట నిఘా పెట్టాలని కొల్లేరు ప్రాంతవాసులు కోరుతున్నారు. రూ.15లక్షలు చెలామణి చేసిన టీడీపీ నేత నకిలీ నోట్ల ముఠాతో ముదినేపల్లి మండలంలోని వీరావిగుంట సర్పంచ్ భూపతి నాగరవీంద్రకు సంబంధం ఉంది. అతనికి రూ.15లక్షల విలువైన నకిలీ కరెన్సీ ఇచ్చినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకన్న పోలీసుల ఎదుట చెప్పాడు. రవీంద్ర భార్య నాగకళ్యాణి ముదినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిగా టీడీపీ తరఫున గెలుపొందారు. మండల టీడీపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే రవీంద్ర దొంగనోట్లు చెలామణి చేసినట్లు తెలియడంతో ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఆయన్ను శుక్రవారం మధ్యాహ్నమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
అలరించిన వెంకన్న ఆటాపాట
మహబూబ్‌నగర్ అర్బన్: ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న తన ఆటాపాటతో అలరించారు. తన పాటలో పల్లె కన్నీరు పెడుతున్న తీరు, పాలమూరు వలసగోసను చూపారు. పాలకుల నిర్లక్ష్యపు వైఖరిని ఎండగట్టారు. నవ తెలంగాణ నిర్మాణానికి ఏం కావాలో తెలియజేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఫంక్షన్హాల్లో ‘గోరటి వెంకన్న కవిత్వంతో ఒక రోజు’ అనే సాహితీ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమానికి ప్రజాకవి గోరటి వెంకన్న పాటనే బాట వేసిందన్నారు. ‘స్థానికత.. గోరటి ఎంకన్న కవిత్వం’ అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన ఆయన మనుషులే కాకుండా సమస్త ప్రాణికోటి స్వేచ్ఛగా ఉండాలని పరితపించిన కవి, గాయకుల్లో వెంకన్న ప్రథముడని అన్నారు. ఆయన పాట, మాట, ఆట తెలంగాణ కదనరంగానికి ఊతమిచ్చిందన్నారు. ప ల్లెసీమలు, వాగులు, వంపులు, చెరువులు, చెట్లు, పక్షలు తదితర ప్రకృతి సంపద వైభవాన్ని చాటి చెబుతూనే వాటి పట్ల పాలకుల విధ్వంసకర చర్యలను ఎత్తిచూపిందన్నారు. సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇప్పటికీ ప్రజాస్వామ్యం శేషప్రశ్నగానే మిగిలిందన్నారు. నూతన తెలంగాణ ఏర్పాటు పట్ల వెంకన్న రూపొందించిన కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందిస్తానని చెప్పారు. పోలవరం బాధితుల కోసం గళం విప్పాలి ‘ప్రపంచీకరణ, ప్రజారాజకీయాలు-ఎంకన్న కవిత్వం’ అనే అంశంపై ప్రసంగించిన వరవరరావు మాట్లాడుతూ.. మూడు లక్షల మంది ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టులో ముంచి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు. పోలవరం బాధితులు, పాలస్తీనా ప్రజల కోసం గళం విప్పాలని ఆయన వెంకన్నను కోరారు. ప్రొఫెసర్ రంగనాథాచార్యులు తన ప్రారంభోపన్యాసంలో వెంకన్న రచనలు, వాటి ప్రత్యేకతను విశ్లేషించారు. సంపాదకులు కె.శ్రీనివాస్, ప్రముఖ సాహితీవేత్తలు శిలాలోలిత, అంబటి సురేంద్రరాజు, బండి నారాయణస్వామి, ఆర్టిస్ట్ మోహన్, ఖాదర్ మొహియోద్దీన్, సీతారాం తదితరులు వెంకన్న కవిత్వంలోని వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రతినిధులు ఎక్బాల్, వెంకటేశ్వర్లు, కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
రహదారి రక్తసిక్తం
తిరుమలాయపాలెం: వరంగల్ రాష్ట్రీయ రహదారి రక్తమోడింది. ఆటోలో బయలుదేరిన వారు కొద్ది క్షణాల్లో గమ్యస్థానాలకు చేరుతారనుకునేలోపే నలుగురు వ్యక్తులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. మండలంలోని మాదిరిపురం- సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మేడిదపల్లి గ్రామానికి చెందిన మిడతపల్లి వెంకన్న(35) అనే ఆటోడ్రైవర్ తన ఆటోని బచ్చోడు నుంచి వరంగల్ జిల్లా మరిపెడకు నడుపుతున్నాడు. శనివారం బచ్చోడు నుంచి పలు గ్రామాల ప్రయాణికులను ఎక్కించుకుని మరిపెడకు బయలు దేరాడు. మధ్యాహ్నం సమయంలో సుబ్లేడు క్రాస్‌రోడ్డు నుంచి మరిపెడ వైపుకు వెళ్తున్న ఆటోని ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. కొద్దిదూరం వరకు ఆటోను ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న దిమ్మెను ఢీకొని ఆ వ్యాన్ పల్టీ కొట్టింది. ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో మేడిదపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ మిడతపల్లి వెంకన్నతో పాటు ఆటో ముందు భాగంలో కూర్చున్న మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బచ్చోడుతండాకు చెందిన గుగులోత్ సత్యం(38), నల్లగొండ జిల్లా మోతె మండలం నేరడవాయి పరిధిలోని గోపతండాకు చెందిన జర్పుల సరోజ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు. హస్నాబాద్ గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మాగి వీరస్వామి,అతని భార్య తిరపమ్మ, తవడబోయిన మంగమ్మ, పల్లి కల్పనలతో పాటు డీసీఎం వ్యాన్‌లో ప్రయాణిస్తున్న తొర్రూరు అచ్చుతండాకు చెందిన గుగులోత్ అచ్చమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న కిరాణషాపు నిర్వహిస్తున్న బోడపట్ల సత్యం మీదకు డీ సీఎం వ్యాన్ దూసుకుపోవడంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఫీల్డ్ అసిస్టెంట్ మాగి వీరస్వామి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలి వద్ద మృతిచెందిన మరోవ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. విషయం తెలిసి ఖమ్మం డీఎస్పీబాలకిషన్రావు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయనతో పాటు తహశీల్దార్ శివదాసు, ఎస్సై ఓంకార్‌యాదవ్ కూడా ఉన్నారు. మిన్నంటిన రోదనలు... సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద తమవారు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి క్షతగాత్రుల బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాం తంలో రోదనలు మిన్నంటాయి. ఆటో డ్రైవర్ వెంకన్న భార్య, ఇతర బంధువులు రోదిస్తున్న తీరు హృదయాలను కలచి వేసింది. అందరితో కలివిడిగా ఉండే వెంకన్న అకాల మరణంతో మేడిదపల్లి గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. బచ్చోడు తండాకు చెందిన గుగులోత్ సత్యం వ్యవసాయంతో పాటు కిరాణం వ్యాపారం చేస్తుంటాడు. సరుకుల కోసం మరిపెడ వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యం మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. నేరడవాయి గోపతండాకు చెందిన జర్పుల పద్మ హస్నాబాద్ జెండాలతండాలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించింది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. డీసీఎం వ్యాన్‌లో ఉన్న డ్రమ్ములు చెల్లాచెదరుగా పడ్డాయి. శోకసంద్రంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఖమ్మంసిటీ: తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్‌రోడ్డు- మాదిరిపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ఆర్తనాదాలు, వారి బంధువుల రోదనలతో జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. ఆటోను డీసీఎం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలో ఇద్దరు మృతిచెందగా, మిగతా వారిని ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు 108 అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. వీరిలో బచ్చోడు తండాకు చెందిన జి.సత్యం (45), చింతకాని మండలం నేరెడకు చెందిన బోడ సరోజి (50) ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది నిమిషాల్లోపే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మ, కాళి పరిస్థితి విషమంగా ఉంది. బి.సత్యం, మంగమ్మ, రమలు తీవ్ర గాయాలపాలయ్యారు. కల్పన, మాగి వీరస్వామి తదితరులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారి బంధువులు పెద్ద పెట్టున ఆస్పత్రికి చేరుకుని తమ వారిని చూసి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. క్యాజువాలిటీ మొత్తం గాయపడ్డ వారితో రక్తసిక్తంగా మారింది. సమయానికి ఆస్పత్రి సిబ్బంది కొంతమంది అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుల బంధువులు, 108 సిబ్బంది చేతులపైనే వారిని ఆస్పత్రిలోకి మోసుకు వచ్చారు. మృతులు, క్షతగాత్రుల బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు విజయ్, అభిరామ్ తదితర సిబ్బంది వారికి వైద్యసేవలు చేశారు. 108 సిబ్బంది రమణ, ప్రసాద్, కృష్ణయ్య సహాయం అందించారు. -
నన్నే సస్పెండ్ చేస్తారా?
బస్సుతో ఉడాయించి నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ రంపచోడవరం/గోకవరం నన్నే సస్పెండ్ చేస్తారా? అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ వినూత్న నిరసన తెలిపాడు. ఏకంగా బస్సుతో ఉడాయించి సంచలనం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన జరిగింది. గోకవరం డిపోలో పదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేసి ఏడీసీగా పదోన్నతి పొందిన సీహెచ్ వెంకన్నను రూ.లక్ష దుర్వినియోగానికి పాల్పడిన అభియోగంపై పది నెలల కిందట సస్పెండ్ చేశారు. దీనిపై నిరసన తెలపాలనుకున్న వెంకన్న ఉదయం ఐదుగంటల సమయంలో గుర్తేడు వెళ్లేందుకు పాయింట్లో పెట్టిన బస్సును రంపచోడవరం వైపు నడుపుకుంటూ వెళ్లాడు. విషయం తెలిసిన డిపో మేనేజర్ వీవీఎస్ మూర్తి సిబ్బందిని వెంటబెట్టుకుని రంపచోడవరం చేరుకున్నారు. అప్పటికే వెంకన్న బస్సును అక్కడి ఐటీడీఏ కార్యాలయం ఎదుట వదిలి పరారయ్యాడు. డిపో మేనేజర్ ఫిర్యాదుతో గోకవరం ఎస్ఐ ఆర్.శివాజీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీబీ వలలో ఏఎస్ఓ
పట్టాదారు పాస్బుక్కు కోసం లంచం తీసుకుంటూ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఏఎస్ఓ) ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం సంచలనం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ ఆర్. సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని బాగిర్థిపేట గ్రామానికి చెందిన రైతు బొడ్డు శ్రీనివాసరావు జనవరి 7న బైక్‌పై వెళుతుండగా అతడి పట్టాదారు పాస్‌పుస్తకం ఎక్కడో పడిపోరుుంది. ఎంత వెతికినా దొరకకపోవడంతో పాస్బుక్కు(బి) తిరిగి పొందేందుకు తహసీల్దార్ కార్యాలయంలో జనవరి 21న దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే నంబర్ 220(బీ)లో ఉన్న 20 గుంటల భూమి, 225సీలోని ఒక ఎకరం 30 గుంటల భూమిపై పట్టాపాస్‌పుస్తకం పొందాల్సి ఉంది. తహసీల్దార్ శ్రీనివాసరావు(ఇటీవల బదిలీపై వెళ్లారు) సంబంధిత ఫైల్‌పై సంతకం చేసి ఏఎస్ఓ శాగంటి వెంకన్న దగ్గరకు పంపారు. వెంకన్న దగ్గరికి రైతు శ్రీనివాసరావు వెళ్లగా నిబంధనల ప్రకారం పాస్‌బుక్ ఇవ్వాలంటే పోలీస్ సర్టిఫికెట్‌తోపాటు నోటరీ అఫిడవిట్ కావాలని చెప్పాడు. దీంతో ఆయన సంబంధిత సర్టిఫికెట్లన్ని తీసుకొచ్చి ఏఎస్‌ఓకు అప్పగించాడు. అన్నీ ఉన్నా పాస్‌పుస్తకం పొందాలంటే రూ.6 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. రైతు అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో రూ.4 వేలు ఇవ్వాలని తేల్చి చెప్పాడు. సరేనని ఒప్పుకున్న బాధితుడు ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మార్చి 1న వరంగల్‌లో ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. దీంతో వారి సూచనలతో అతడు మంగళవారం తహసీల్దార్ కార్యాలయూనికి చేరుకుని ఏఎస్ఓ వెంకన్నకు రూ.4 వేలు ఇచ్చాడు. దీంతో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజర్చునునట్లు ఏసీబీ డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపారు. వెంకన్నను పట్టుకున్న వారిలో సీఐలు ఎస్వీ రాఘవేందర్రావు, పి. సాంబయ్య, ఎం. వెంటేశ్వర్రావు, ఏసీబీ సిబ్బంది ఉన్నారు. -
రెక్కల కష్టం బూడిద..
పూడూరు, న్యూస్‌లైన్: ఆరుగాలం పడ్డకష్టం బూడిదపాలవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పూడూరులో గురువారం సాయంత్రం 35 ఎకరాల్లో కందిపంట కాలిపోయింది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పూడూరు శివారులో 35 ఎకరాల కందిపంట కోతకు చేరుకుంది. ప్రమాదవశాత్తు పంటకు గురువారం సాయంత్రం నిప్పంటుకుంది. రైతులు ఆర్పే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. రైతు షాబాద్ వెంకన్నకు చెందిన 2 ఎకరాల పంట, షాబాద్ బందెయ్యకు చెందిన 4 ఎకరాలు, సుల్తాన్పూర్ ఆనందం(5 ఎకరాలు), ఆలూరి అంతయ్య(4 ఎకరాలు), కావలి రాములు(3 ఎకరాలు), కావలి నాగరాజు (4 ఎకరాలు)తో పాటు మొత్తం 35 ఎకరాల పంట కాలిబూడిదైంది. మొదట పరిగి నుంచి, అనంతరం వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపుచేశాయి. లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని ైరె తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఘట్కేసర్, న్యూస్‌లైన్ : అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని పోచారం అన్నానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగు మండలంలోని పందికొండ గ్రామానికి చెందిన పసుల వెంకన్నకు ఇదే జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన స్వప్న(21)ను గతేడాది ఏప్రిల్ 17న ఇచ్చి వివాహం చేశారు. ఈ సందర్భంగా స్వప్న తల్లిదండ్రులు కట్నకానుకల కింద వెంకన్నకు ఐదు తులాల బంగారం, *3.50 లక్షల నగదు, *50వేల విలువ చేసే ఇంటి సామగ్రి, ఫ్యాషన్ప్లస్ బై క్‌ను ఇచ్చారు. అయితే ఉపాధి పనుల కోసం వెంకన్న, స్వప్న దంపతులు ఆరునెలల క్రితం ఘట్కేసర్ మండలంలోని పోచారం అన్నానగర్ కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా వెంకన్న స్థానిక ఐటీసీ కంపెనీలో హమా లీగా చేరాడు. అయితే కొద్దిరోజుల నుంచి వెంకన్న తనకు *50వేలు అదనపు కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. ఇదే విషయంపై మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతం సాయంత్రం 5 గంటలకు వెంకన్న పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన భార్యకు ఫోన్ చేయగాఆమె స్పందించలేదు. అనుమానం చెందిన వెం కన్న ఇంటికి వచ్చి చూసే సరికి స్వప్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. దీంతో వెంకన్న కాలనీవాసుల సాయంతో స్వప్నను కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వప్న అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిం చారు. కాగా, మల్కాజ్గిరి ఏసీపీ చిన్నయ్య కూ డా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన స్వప్న ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారు. అల్లుడు వెంకన్న అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతోనే తమ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.