తూర్పుగోదావరి: కాకినాడలో ఓ స్కూల్ విద్యార్థి మృతి చెందాడు. పెగోడా నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న వెంకన్న(9) అనే విద్యార్థి స్కూల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడి పోయాడు. స్కూల్ భవనంపైన ఆడుకుంటూ ఉండగా సన్ సైడ్‌పై నుంచి జారి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంకన్న తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి కుటుంబసభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.