రాత్రి కరెంటుకు రైతు బలి
కురవి/మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం మాధవపురం శివారు చీకటిచింతల తం డాకు చెందిన రైతు బానోత్ వెంకన్న(38) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకన్న తన మూడు ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి సాగు చేస్తున్నాడు. ఇతని పొల మున్న ప్రాంతానికి కురవి మండలం అయ్యగారిపల్లి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది.
గత ఆదివారం వేకువ జామున రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గురువారం వేకువ జామున పొలానికి నీరు పెట్టేందుకు వెంకన్న వెళ్లాడు. మోటార్ ఆన్ చేసేందుకు ఫీజులు పెడుతుండగా, షాక్ కొట్టడంతో అరచి కుప్పకూలాడు.