కోతలు మళ్లీ షురూ.. | Increased power cut in karimnagar district | Sakshi
Sakshi News home page

కోతలు మళ్లీ షురూ..

Published Thu, Oct 17 2013 4:43 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

Increased power cut in karimnagar district

మంథని, న్యూస్‌లైన్ : కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యా యి. నిరంతర సరఫరాతో కొంతకాలంగా ఊపిరి పీల్చుకున్న పల్లెవాసులను విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. గురువారం నుంచి జిల్లాలో అధికారికంగా విద్యు త్ కోత అమలుకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి మండలస్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. పెరిగిన విద్యుత్ వాడకానికి సరిపడా ఉత్పత్తి జరగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తుందని, ప్రజలకు నచ్చజెప్పాలని మౌఖి కంగా సూచించారు.
 
 గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వర కు సరఫరా నిలిచిపోనుంది. సబ్‌స్టేషన్ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, 11 నుంచి 1 గంట వరకు కోత విధించనున్నారు. మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు కరెంట్ కట్ చేయనున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణాలకు కోతల నుంచి మినహాయింపు ఇచ్చారు. సీమాంధ్ర ఉద్యమం దృష్ట్యా అనధికారికంగా కొద్ది రోజులుగా సరఫరాలో అంతరాయం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ఆ శాఖ కోతల అమలుకు చర్యలు చేపట్టింది. ఎండకాలం మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కరెంటు కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement