ఆరుగాలం పడ్డకష్టం బూడిదపాలవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పూడూరులో గురువారం సాయంత్రం 35 ఎకరాల్లో కందిపంట కాలిపోయింది.
పూడూరు, న్యూస్‌లైన్: ఆరుగాలం పడ్డకష్టం బూడిదపాలవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పూడూరులో గురువారం సాయంత్రం 35 ఎకరాల్లో కందిపంట కాలిపోయింది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పూడూరు శివారులో 35 ఎకరాల కందిపంట కోతకు చేరుకుంది. ప్రమాదవశాత్తు పంటకు గురువారం సాయంత్రం నిప్పంటుకుంది. రైతులు ఆర్పే యత్నం చేసినా ఫలితం లేకపోయింది.
రైతు షాబాద్ వెంకన్నకు చెందిన 2 ఎకరాల పంట, షాబాద్ బందెయ్యకు చెందిన 4 ఎకరాలు, సుల్తాన్‌పూర్ ఆనందం(5 ఎకరాలు), ఆలూరి అంతయ్య(4 ఎకరాలు), కావలి రాములు(3 ఎకరాలు), కావలి నాగరాజు (4 ఎకరాలు)తో పాటు మొత్తం 35 ఎకరాల పంట కాలిబూడిదైంది. మొదట పరిగి నుంచి, అనంతరం వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపుచేశాయి. లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని ైరె తులు కన్నీటిపర్యంతమయ్యారు.