answer sheets
-
10th class: పదోతరగతి పరీక్షలు.. పాసయ్యేందుకు లంచంతో విద్యార్థుల ఎత్తుగడ!
బెంగళూరు: ‘పాస్ అయ్యేందుకు లంచమా?!’ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులు ఆన్సర్ షీట్లలో నోట్లు పెట్టి, పాస్ చేయమంటూ ఇన్విజిలేటర్లను అభ్యర్థించిన సంఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండికర్ణాటక రాష్ట్రం (Karnataka) బెల్గావి జిల్లా చిక్కోడిటౌన్‌లో పదోతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకనం చివరి అంకానికి చేరుకుంది. అయితే ఈ పదోతరగతి పరీక్షాపేపర్ల మూల్యాంకనం సమయంలో పలువురు ఇన్విజిలేటర్లకు ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు తారసపడ్డాయి. దీంతో కంగుతిన్న ఇన్విజిలేటర్లు ఆన్సర్ షీట్లలో ఈ కరెన్సీ నోట్లు ఎందుకు వచ్చాయా? అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.‘సార్.. సార్ నన్ను పాస్ చేయండి. మీ దణ్ణం పెడతా. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. సార్ ఇవిగో రూ.500 ఛాయ్ తాగండి.. నన్ను పాస్ చేయండి. నన్ను పాస్ చేయించలేదనుకో అంటూ ఇలా విద్యార్థులు ఎగ్జామ్స్ ఆన్సర్ షీట్ల మీద పలువురు విద్యార్థులు ప్రాధేయపడుతూ రాశారు. వారిలో ఓ పదో తరగతి విద్యార్థి తన ఆన్సర్ షీట్ మీద రూ.500 నోటు పెట్టి పాస్ చేయమని అభ్యర్థించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రిక్వెస్ట్ చూసిన ఓ ఇన్విజిలేటర్ ‘మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు’ అంటూ ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ విద్యార్థి రూ.500 నోటు ఇస్తే మరికొందరు విద్యార్థులు తమకు పలు రిక్వెస్టులు చేసినట్లు చీక్కోడి టౌన్లో పదో తరగతి పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేస్తున్న ఇన్విజిలేటర్లు చెబుతున్నారు. వాటిల్లో విద్యార్థులు అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ప్లీజ్ పాస్ చేయండి సార్. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది.నేను పాసాయితే నా ప్రేమను కొనసాగిస్తాసార్ ఇదిగో రూ.500 .. ఛాయ్ తాగి నన్ను పాస్ చేయండిమీరు నన్ను పాస్ చేయిస్తే .. నేను మీకు డబ్బులిస్తానేను పాస్ కాకపోతే మా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరూ అని ఆన్సర్ షీట్లో రాశారు.చివరికి పలువురు ఇన్విజిలేటర్లు ఆ ఆన్సర్ షీట్లలోని కరెన్సీ నోట్లను ఉన్నతాధికారులకు అందించారు. విద్యార్థులు రాసిన ఆన్సర్ల ఆధారంగా మార్కులు వేశారు. -
సరిగ్గానే దిద్దుతున్నారా?
సాక్షి, ఎడ్యుకేషన్రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీపడే ఉద్యోగ నియామక పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా? వాటిని సరిగానే దిద్దుతున్నారా?అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. పలు పోటీ పరీక్షల మూల్యాంకనంపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదివి పరీక్ష రాస్తే, ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత, అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను బలపర్చేలా ఇటీవల గ్రూప్–1 పరీక్షలో వచ్చిన ఫలితాలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ‘కీ’ పాయింట్లకే పరిమితమై...పోటీ పరీక్షల్లో లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించేది మూల్యాంకనమే. ఇంతటి కీలకమైన మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించే అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుబాటులో ఉన్నవారితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దేవారికి అధికారులు నాలుగైదు ‘కీ’పాయింట్లు ఇస్తారు. అయితే, అభ్యర్థి అంతకంటే మంచి పాయింట్లతో సమాధానం రాసినా, ఫ్యాకల్టీ ఆ కీ పాయింట్ల అన్వేషణకే పరిమితమై తగిన మార్కులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతోపాటు వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్‌ను ఒక్కరితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతోంది అని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్ట్‌లు రెండు రాష్ట్రాల్లో భారీగా ఖాళీగా ఉండటమే సమస్యకు మూలకారణమని అభ్యర్థులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య నెలకొందని చెబుతున్నారు. ఇవీ కొన్ని సమస్యలు.. ⇒ గ్రూప్–1 మెయిన్స్‌లో ఉండే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. పాలిటీ వరకు మాత్రమే అకడమిక్స్‌లో ఉంటుంది. మూల్యాంకనం చేసే అధ్యాపకులకు ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. దీంతో వారు కీ షీట్‌పైనే ఆధారపడి మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో బయాలజీ, ఫిజిక్స్, సమకాలీన సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాల ఉంటాయి. కానీ, డిగ్రీ స్థాయిలో కోర్ సైన్స్ సబ్జెక్టులే ఉంటాయి. కరెంట్ టాపిక్స్ ఉండవు. దీంతో ఎవాల్యుయేటర్స్ కరెంట్ టాపిక్స్‌పై అవగాహన లేకుండానే మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ జనరల్ ఎస్సే పేపర్లో హిస్టరీ, కల్చర్, ఎకనమీ, పాలిటీ, కరెంట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూల్యాంకన చేయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ను నియమించాలి. కానీ.. అలా జరట్లేదని అభ్యర్థులు అంటున్నారు. ⇒ వేర్వేరు సబ్జెక్టులు కలిపి ఉండే పేపర్ల విషయంలో సెక్షన్ వారీగా వేర్వేరు సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు 75 శాతం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4,330 ఉంటే.. 1,048 మంది మాత్రమే ఉన్నారు. వీరిలోనూ గత నెలలో దాదాపు 150 మంది పదవీ విరమణ చేశారని సమాచారం. తెలంగాణలో 2,825 పోస్టులకు గాను 873 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ⇒ డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా దాదాపు 40 శాతం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరతతో బోధన ప్రమాణాలు తగ్గడమే కాకుండా.. పరీక్షల నిర్వహణలో ప్రొఫెసర్ల భాగస్వామ్యం లేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి. అనువాదం కూడా సమస్యే పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నల అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రశ్న పత్రాన్ని ముందుగా ఇంగ్లిష్‌లో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఇందుకోసం అఫీషియల్ ట్రాన్స్‌లేటర్స్‌ను నియమిస్తున్నారు. వారు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోకుండా మక్కీకి మక్కీ (ట్రూ ట్రాన్స్లేషన్) అనువాదం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌ను (శాసన ఉల్లంఘన ఉద్యమం) పౌర అవిధేయత ఉద్యమం అని అనువాదం చేస్తుండటంతో అదేమిటో తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమే కావటంలేదు. ప్రశ్న పత్రం అనువాద ప్రక్రియలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి కనీసం ఏడెనిమిది మందిని భాగస్వాములను చేస్తే సమస్య పరిష్కారమవుతందని నిపుణులు చెబుతున్నారు. సమయాభావం పోటీ పరీక్షల్లో ఎదురవుతున్న మరో సమస్య సమయాభావం. అభ్యర్థులకు మొత్తం ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కూడా కొన్ని సందర్భాల్లో సమయం సరిపోవడం లేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్న పత్రం రూపొందించిన వారికి సైతం 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో చదవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థులు కనీసం 30 నుంచి 40 ప్రశ్నలు చదవకుండానే సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లోని సీశాట్‌లో 80 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తారు. మెయిన్స్‌ను కూడా ఆబ్జెక్టివ్ చేయాలా? గ్రూప్–1 మెయిన్స్ ప్రశ్న పత్రం రూపకల్పన, మూల్యాంకన సమస్యల నేపథ్యంలో మెయిన్స్‌ను కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సంబంధిత సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ప్రశ్న పత్రం రూపొందించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి గ్రూప్–1లో కచ్చితంగా ఇద్దరు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. మొదటి, రెండో మూల్యాంకనాల్లో మార్కుల మధ్య 5 శాతం వ్యత్యాసం ఉంటే మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి. అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో ఇదే విధానం అమలవుతోంది. రెండు, మూడు సబ్జెక్టుల సమ్మిళితంగా ఉన్న పేపర్ల విషయంలో.. సెక్షన్ వారీగా సంబంధిత సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నపత్రం అనువాదం ఉండాలి. – ప్రొఫెసర్. వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ యూపీఎస్సీ తరహాలో చేయాలిగ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనం కూడా యూపీఎస్సీ సివిల్స్ మూల్యాంకనం మాదిరిగా ఒక నిర్దిష్ట విధానంలో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మెయిన్స్‌కు 1:13 (ఒక్కో పోస్టుకు 13 మంది చొప్పున) ఎంపిక చేస్తారు. మూల్యాంకనానికి దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఎంపికచేస్తారు. వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ల మూల్యాంకనానికి సెక్షన్ వారీగా వేర్వేరు నిపుణులను నియమిస్తారు. యూపీఎస్సీ మూల్యాంకనంలో కీ పాయింట్లను కేటాయించినప్పటికీ.. సమాధానంలో అదనపు సమాచారం ఉంటే.. వాటికీ మార్కులు ఇస్తారు. రాష్ట్రాల స్థాయిలో ఈ విధానం లేదు. -
టెన్త్.. జవాబు పత్రాలు చిందర వందర
సాక్షి, హైదరాబాద్/కారేపల్లి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖద్వారంగా భావించే పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పరీక్షలు నిర్వహించామా.. జవాబు పత్రాలు పంపించామా.. అంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో శనివారం వెలుగు చూసిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది.. ఏం జరిగిందంటే..: ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోమట్లగూడెం(గాం«దీనగర్)లోని హైస్కూల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిశాక జవాబు పత్రాలను కారేపల్లి పోస్టాఫీస్‌లో పార్శిల్ బుకింగ్ చేశారు. అక్కడి సిబ్బంది జవాబు పత్రాలను మూడు పార్శిళ్లు చేసి బ్యాగులో సీల్ వేసి కారేపల్లి బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే బస్ కండక్టర్‌కు అప్పగించారు. బస్సు ఖమ్మం పాత బస్టాండ్‌కు సాయంత్రం చేరుకుంది. అక్కడి నుంచి ఆర్ఎంఎస్ (రైల్వే మెయిల్ సర్వీస్) క్యాంప్ ఆఫీస్‌కు పంపించి, ఆ తర్వాత నిర్దేశిత మూల్యాంకన కేంద్రానికి చేరవేస్తారు. అయితే, శుక్రవారం సాయంత్రం జవాబుపత్రాల బ్యాగ్‌ను ఖమ్మం పాత బస్టాండ్‌లో బస్సు నుంచి కిందకి పడేయగా, డ్రైవర్ బస్సును కదిలించడంతో టైరు ఆ బ్యాగ్ పైనుంచి వెళ్లింది. దీంతో బ్యాగ్ చిరిగి కారేపల్లి మోడల్ స్కూల్లో పరీక్ష రాసిన విద్యార్థుల జవాబుపత్రాలు బయట పడ్డాయి. ఈ విషయం శనివారం బయటకురావడంతో కలకలం రేగింది. జవాబు పత్రాలన్నీ భద్రం.. జవాబు పత్రాలు రోడ్డుపై పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆర్ఎంఎస్ కార్యాలయానికి ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీఈఓ సోమశేఖరశర్మ వెళ్లి ప్యాకేజీలను పరిశీలించారు. జవాబు పత్రాలన్నీ భద్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఈఓ తెలిపారు. ఇదే విషయమై కారేపల్లి పోస్ట్ మాస్టర్ ఝాన్సీ లక్ష్మిబాయిని వివరణ కోరగా.. పార్సిల్ బుకింగ్ చేయడం, ప్యాకర్ ద్వారా బస్సులో వేయడమే తమ బాధ్యత అని చెప్పారు. ఖమ్మం బస్టాండ్‌లో ఆర్ఎంఎస్ వారికి బ్యాగ్ అప్పగించే వరకు కండక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోస్టల్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ అంశంపై విద్యాశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ నివేదిక పంపారు. మూడు గంటలు ఆలస్యంగా.. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటకొచి్చన ఫొటోలను పరిశీలిస్తే బండిల్‌లోని పేపర్లు ఇప్పదీసి మళ్లీ పెట్టినట్టుగా ఉన్నాయి. ప్రతిరోజూ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. 1.30లకు జవాబు పత్రాలను పోస్టల్ శాఖకు అందజేయాలి. కారేపల్లి నుంచి ఖమ్మంకు రావడానికి గంట సమయం పడుతుంది. కానీ రాత్రి పొద్దుపోయాక ఖమ్మంకు జవాబు పత్రాలు వచి్చనట్టు తెలుస్తోంది. ఇంత ఆలస్యానికి కారణాలేంటి? ఈ ఒక్క కేంద్రమే కాదు.. జిల్లాలోని ప్రతీ పరీక్ష కేంద్రం నుంచి జవాబు పత్రాలు దాదాపు 3 గంటల ఆలస్యంగా వస్తున్నట్టు సమాచారం. ఆ మూడు గంటల్లో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించాం. రవాణా వల్లే బండిల్ పగిలిందని కలెక్టర్ చెప్పారు. డీఈవో చేత విచారణ చేయిస్తున్నాం. ఎక్కడైనా అవకతవకలు జరిగాయా అన్న కోణంలోనూ విచారణ చేపట్టాలని ఆదేశించాం. పరీక్షలపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది. – ఈవీ నర్సింహా రెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్. -
సర్కారు మెప్పు కోసం.. విద్యార్థులకు ముప్పు!
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వం మెప్పు కోసం వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు రికార్డు సమయంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక లెక్చరర్‌తో పరిమితికి మించి బుక్లెట్లు వేల్యుయేషన్ చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మూల్యాంకనం షెడ్యూల్‌ను కూడా అధికారులు కుదించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. అయితే, రెండుసార్లు ఈ షెడ్యూల్‌ను మార్చేసి ఏప్రిల్ 3 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశించినట్టు సమాచారం. ఆ తక్కువ సమయంలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశామన్న గొప్ప కోసం... ఏదైనా పొరపాటు జరిగి మార్కులు తప్పుగా నమోదైతే విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయనే విషయాన్ని విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్లో లిమిట్ 30.. టార్గెట్ 45 జవాబు పత్రాలుఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభించారు. మొదటి పరీక్షగా నిర్వహించిన సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ఆ రోజే పూర్తి చేశారు. ఇంగ్లిష్‌తోపాటు ఇతర పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఈ నెల 17న ప్రారంభించి విడతల వారీగా ఏప్రిల్ 8 నాటికి పూర్తి చేయాలని తొలుత షెడ్యూల్ నిర్ణయించారు. కానీ, తర్వాత తుది గడువును ఏప్రిల్ 5కి మార్చారు. తాజాగా 3వ తేదీకి కుదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. మూల్యాంకనంలో రోజుకు ఒక ఎగ్జామినర్ (లెక్చరర్) ఉదయం 15, మధ్యాహ్నం 15... మొత్తం 30 జవాబు పత్రాలనే దిద్దాలనేది నిబంధన. ఇలా చేస్తే ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. కానీ, ఈసారి 30 జవాబు పత్రాలే దిద్దాలని చెప్పినా... ఎగ్జామినర్లపై ఒత్తిడి తెచ్చి అదనంగా మరో 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పొడిచి విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగేలా ఎక్కువ పేపర్లు దిద్దించడంపై లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో జవాబు పత్రాల్లో మార్కులు తప్పుగా నమోదై ఒక్క పేపర్ తప్పినా విద్యార్థికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. -
విద్యార్థుల భవిష్యత్‌తో సర్కారు చెలగాటం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికత వినియోగం పేరుతో ఉన్నత విద్యామండలి ‘నిధులకు’ టెండర్ పెట్టింది. పేద విద్యార్థులు కట్టిన ఫీజులను ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఆన్లైన్ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చే నెపంతో.. రూ.కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ విధానంలో విద్యార్థులెవ్వరూ ఆన్లైన్లో పరీక్షలు రాయరు. కేవలం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను మాత్రమే కంప్యూటర్లో చూస్తూ మార్కులు వేయాల్సి ఉంటుంది. అంటే జవాబు పత్రాలను స్కానింగ్ చేసి పంపిస్తే.. వాటిని మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఉన్నత విద్యా మండలి టెండర్లు పిలిచింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ‘మార్కులు’..విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళితే వాటి పారదర్శకత ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. పైగా అధ్యాపకులు కూడా కంప్యూటర్‌పై చూస్తూ మూల్యాంకనం చేసి మార్కులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో మాన్యువల్‌గా నమోదు చేయాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వల్ల మార్కులను ట్యాంపరింగ్ చేసినా.. గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. పరీక్షల ప్రశ్నపత్రాల ముద్రణలోనూ సాంకేతికత పేరుతో విద్యార్థుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాన్ని ఆన్లైన్లో యూనివర్సిటీలకు, కాలేజీలకు పంపించి.. పరీక్షకు కొన్ని క్షణాల ముందు వాటిని ప్రింట్ తీసుకొని ఇచ్చేలా ఆలోచనలు చేస్తోంది.ఒకవేళ పరీక్ష సమయానికి ప్రింటింగ్‌లో సమస్యలు తలెత్తితే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాగే ప్రశ్నపత్రాలు లీకయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.పైలట్ ప్రాజెక్టు ఎందుకు నిర్వహించలేదు?రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల పరిధిలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ వేర్వేరు యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ఒకే సంస్థ ఆన్లైన్లో పరీక్షల మూల్యాంకనం చేపట్టడం ఎంత వరకు విజయవంతం అవుతుందనే అనుమానాన్ని విద్యావేత్తలు లేవనెత్తుతున్నారు. కనీసం పైలెట్ ప్రాజెక్టు కింద ఏదైనా యూనివర్సిటీ పరిధిలో అయినా నిర్వహించాలనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కొందరు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమ స్వలాభం కోసమే చేపడుతున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. -
తొలుత ఫెయిల్.. రీవాల్యుయేషన్లో 90% మార్కులు
దుండిగల్: పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురతున్నారు. వా ల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాం«దీనగర్‌లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్డపడ్డానని, 9.5 గ్రేడ్ సా«ధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యా న్ని నింపారు.తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్ట్‌కు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్టెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రీవాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కు లు వచ్చాయి.9.3 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఎగ్జామినర్లదే తప్పు..పదవ తరగతి జవాబు పత్రాలను ముగ్గురు అధికారులు దిద్దుతారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అస్టిసెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలకు మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచి్చన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపరును దిద్దిన ముగ్గురు అధికారులూ అజాగ్రత్తగా వ్యవహరించారు.రీ వ్యాలుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిచారు. రీ కరెక్షన్లో మీ అమ్మాయి పాసైందని, ఎస్ఎస్íసీ సరి్టఫికెట్ తీసుకెళ్లండని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్‌గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
మరో 10,542 టెన్త్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సంబంధించి మరో 10,542 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 55,996 మంది రీ వెరిఫికేషన్/ రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.మార్కుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసిన 43,714 మంది జవాబు పత్రాలను ఈ నెల 23న ఆయా స్కూళ్లకు ఆన్లైన్లో పంపించారు. మరో 10,542 మంది జవాబు పత్రాలను సోమవారం ఆయా స్కూళ్లకు పంపించగా, మిగిలిన 1,710 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసి త్వరలోనే పంపిస్తామని తెలిపారు. -
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
ఆ సబ్జెక్టు వరకు పాస్ చేసేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ఉట్నూర్ కేంద్రంలో సోమవారం మాయమైన పదో తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ సబ్జెక్టు వరకూ వారిని పాస్ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు టెన్త్ పరీక్ష సందర్భంగా ఉట్నూర్ కేంద్రంగా ప్రైవేటు విద్యార్థులు (సప్లిమెంటరీ) 9 మంది పరీక్ష రాశారు. ఆ పేపర్లను ముందే నిర్ణయించిన ప్రకారం వాల్యూయేషన్ కేంద్రానికి తరలించాల్సి ఉంది. వీటిని దగ్గర్లోని పోస్టాఫీసుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయాయి. దీన్ని గుర్తించిన విద్యాశాఖాధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. జవాబు పత్రాలు మాయమైన ఘటనకు విద్యార్థులను బాధ్యులను చేయడం సరికాదని భావించి, ఆ సబ్జెక్టు వరకు పాస్ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. -
పోస్టల్ ఉద్యోగుల అలసత్వమే..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ కేసులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సోమవారం ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉట్నూర్ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్‌కు పంపించాలి. పోస్టాఫీస్ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్ వెంటఉండి వాటిని బస్టాండ్‌కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్ (కట్ట) నుంచి ఒకటి మిస్ అయ్యింది. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్ బండిల్ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్ చేరుకున్నారు. మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ నాగేందర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు ఉట్నూర్ చేరుకొని బండిల్ మిస్సింగ్ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్ బండిల్ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్‌తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిపై వేటు టెన్త్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ ఘటనలో పోస్టాఫీస్ ఉద్యోగి ఎంటీఎస్ రజితపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ కు తరలించారు. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు. -
పదో తరగతి పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వచ్చన్ పేపర్ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. పొరపాటున మరో వాట్సాప్ గ్రూప్‌లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని, అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం పదో తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఇవి ఆటో నుంచి మాయమయ్యాయి. విషయం బయటకు రావడంతో అధికారులు బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్‌కు కారణమైన ఇద్దరు తపాలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న వీ రజిత(ఎంటీఎస్), నాగరాజు(ఔట్ సోర్సింగ్)లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
ఆదిలాబాద్: ఊట్నూర్లో పదో తరగతి ఆన్సర్‌షీట్లు మిస్సింగ్
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ootnur మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో ఉన్నారు ఎస్సై భరత్. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. సాక్షితో డీఈఓ ప్రణీత మాట్లాడుతూ.. ‘‘ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించాం. పోస్టాఫీస్ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగానే అవి పోయాయి. కాబట్టి, పోస్టల్ అధికారులదే బాధ్యత. వాళ్లకు ఆన్సర్‌షీట్లు అప్పగించినట్లు మా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యమే. ఇందులో మా తప్పిదం ఏం లేదు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారామె. ఇదీ చదవండి: పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. టెన్త్ పేపర్ అవుట్! -
హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు
న్యూఢిల్లీ: ఆన్సర్ షీట్లను సమర్పించాల్సిందిగా, పునర్మూల్యాంకనం చేయాల్సిందిగా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో ఆ మేరకు నిబంధనలుంటే తప్ప అలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని పేర్కొంది. విచక్షణాధికారంతో నిర్దిష్ట ఆదేశాలిచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 హైకోర్టులకు కల్పించిన అధికారాలను ఈ విషయంలో ఉపయోగించరాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు పీజీ డిప్లొమా విద్యార్థుల ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనానికి ఆదేశిస్తూ 2019లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పులను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది. -
వారాంతంలో గ్రూప్–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ వారాంతంలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వేగవంతం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత స్కానింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి శనివారం నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తి! ఈనెల 16న పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్‌కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. శుక్రవారం నాటికి స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. చదవండి: కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..! -
దురాశకు పోయారు.. అడ్డంగా దొరికారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పక్కదారి పట్టారు. పరీక్షలు సరిగా రాయకుండానే అత్యధిక మార్కులు తెచ్చుకోవాలని దురాశకు పోయారు. పరీక్ష సమయంలో రాసిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం జేఎన్టీయూకేకు వెళ్లే సమయంలో మార్చేసి, వాటి స్థానంలో ప క్కాగా చూసి రాసిన జవాబు పత్రాలను పెట్టేద్దామని పథక రచన చేశారు. అందులో భాగంగా జేఎన్టీయూకే ఔట్ సో ర్సింగ్ సిబ్బందితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూల్యాంకనం కోసం వెళ్లే జవాబు పత్రాల వాహనాల రాకపోకలు అన్నీ తెలిసిన శ్రీకాకుళం వాసి ప్లాన్ ప్రకారం మార్గ మధ్యలో ఆ విద్యార్థుల జవా బు పత్రాలు మార్చేశాడు. మూ ల్యాంకనం సమయంలో ముగ్గురు విద్యార్థుల జవాబు పత్రాలు నూరు శాతం పక్కా గా ఉండడంతో ఎగ్జామినేషన్ సిబ్బందికి అ నుమానం వచ్చింది. దాని తో పాటు జవాబు పత్రాలకు ముగ్గురు విద్యార్థుల హాల్ టిక్కెట్లు అతికించి ఉండటాన్ని గుర్తించారు. సాధారణంగా జవాబు పత్రాలకు హాల్‌టిక్కెట్లు అతికించి ఉండవు. అడ్డదారి పట్టిన విద్యార్థులు తొందరలో తమ హాల్ టిక్కెట్లను జవాబు పత్రాలకు పెట్టేశారు. (చదవండి: అసూయపడి.. ఉసురు తీసి) ఇంకేముంది అడ్డంగా దొరికిపోయారు. జేఎన్టీయూకే అధికారుల దృష్టికెళ్లాక పూర్తిగా ఆరా తీసే సరికి మొత్తం గుట్టు రట్టయ్యింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి శ్రీకాకుళం జిల్లా వాసే. ఈయన గతంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేసి మానేశాడు. గత ఏడాది నవంబర్‌లో బీటెక్ ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. విజయనగరం జిల్లా ప్రైవేటు కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జంబ్లింగ్‌లో భాగంగా విశాఖ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు రాశారు. పరీక్షలు అయ్యాక జవాబు పత్రాలను మూ ల్యాంకనం కోసం ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు లారీల ద్వా రా కాకినాడ జేఎన్టీయూకే వర్సిటీకు వెళ్లాయి. వర్సిటీ పరీక్షల విభాగానికి చెందిన సిబ్బంది లారీల ద్వారా వాటిని తీసుకు వెళ్లారు. అంతవరకు బాగానే ఉన్నా దానికి ముందు జరిగిన డీల్ ఏకంగా మార్గ మధ్యంలో జవాబు పత్రాలను మార్చేసే వరకు వెళ్లింది. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లో పనిచేసి మానేసిన రామ్మోహన్ అనే వ్యక్తి జేఎన్టీయూకే ఔట్ సోర్సింగ్ సిబ్బందితో ఉన్న పరిచయాలను అడ్డగోలు వ్యవహారానికి వాడుకున్నాడు. (చదవండి: రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి) ముందుగా విజయనగరం ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను ట్రాప్ చేశాడు. పరీక్ష సమయంలో ఎలా రాసినప్పటికీ మూల్యాంకనం కోసం వెళ్లే స మయంలో వాటిని తీసేసి, నూరు శాతం పక్కాగా రాసిన జవాబు పత్రాలను పెట్టించే ఏర్పాటు చేస్తాన ని ముగ్గురు విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే వర్సిటీ సిబ్బంది, రామ్మోహనరావుతో కలిసి ముందస్తు పథకం ప్రకారం జవాబు పత్రాలను మార్చేశారు. వైజాగ్ దాటిన తర్వాత ఒప్పందం కు దుర్చుకున్న ముగ్గురు విద్యార్థుల జవాబు పత్రాలు మార్చారు. కాకపోతే పొరపాటున వారి హాల్ టి క్కెట్లు కూడా జవాబు పత్రాలతో ఉంచేశారు. జవా బు పత్రాలతో పాటు హాల్‌టిక్కెట్ కూడా జతపరిచి ఉండటం, రైటింగ్ చాలా అందంగా ఉండటంతో పా టు అన్ని ప్రశ్నలకు సక్రమంగా సమాధానాలు ఉండటంతో వర్సిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీనిపై సబ్జెక్టు నిపుణుల కమిటీ వేశారు. పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు రామ్మోహన్‌ను విచారించడంతో నిజం బయటకు వచ్చింది. జవాబు పత్రాలు ఏ స మయంలో ఏ రకంగా వస్తాయన్నది ఎలా తెలిసింద ని రామ్మోహన్‌ను ఆరా తీసే సరికి గతంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేశానని, అప్పట్లో జేఎన్టీయూకే ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పరిచయాలు ఏర్పడ్డాయని, వారితో కలిసి ఈ రకంగా చేశామని రామ్మోహన్ సంబంధిత కంట్రోల్ ఎగ్జామినర్‌కు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి గుట్టు రట్టు అవడంతో అప్రమత్తమైన జేఎన్టీయూకే అధికారులు అప్రమత్తమై కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశార తప్పు ఒప్పుకున్నారు నిపుణుల కమిటీ వేశాం. విద్యార్థులను, ఎగ్జామినేషన్ విభాగంలోని ఉద్యోగి రామ్మోహన్‌ను పిలిచి మాట్లాడాం. తప్పు చేశామని ఒప్పుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. జేఎన్టీయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ముగ్గురిని విధుల నుంచి తొలగించాం. విద్యార్థులపైన, రామ్మోహన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – సత్యనారాయణ, జేఎన్టీయూకే రిజిస్ట్రార్ -
చనిపోయిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు!
పాట్నా: రెండేళ్ల క్రితం చనిపోయిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వం నాలుక్కరుచుకున్న ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 17న కాంట్రాక్టు ఉపాధ్యాయులు వారిని క్రమబద్దీకరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరీక్షా పత్రాలు దిద్దేందుకు వెళ్లిన టీచర్లను అడ్డగించడమే కాక వారిపై దాడికి దిగారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సదరు ఉపాధ్యాయులు ఎందుకొచ్చిన గొడవ అని విధులకు గైర్హాజరయ్యారు. దీంతో వారిపై బెగుసరై జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన టీచర్లను సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రెండేళ్ల క్రితం మరణించిన ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ యాదవ్ పేరు ఉండటమే కాక అతను బెగుసరైలోని ఓ కేంద్రంలో ఆన్సర్ కాపీలను దిద్దాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా ఈ ఘటనపై బీహార్ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమిత్ కుమార్ స్పందిస్తూ దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘పది’ జవాబు పత్రాలు గల్లంతు
కాగజ్‌నగర్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల గల్లంతయిన ఘటన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జవాబు పత్రాలు గల్లంతు కాగా రెండు రోజుల అనంతరం దొరికాయి. ఈ మేరకు బుధవారం కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న కాగజ్‌నగర్ పట్టణంలోని మూడు కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 65 మంది విద్యార్థులు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు రాయగా వాటికి సంబంధించిన జవాబు పత్రాలను అదే రోజు సాయంత్రం పట్టణంలోని తపాలా కార్యాలయానికి తరలించారు. పోస్టల్ అధికారులు ఒక బ్యాగులో జవాబు పత్రాలను భద్రపరిచి రైలు ద్వారా మంచిర్యాల సార్టింగ్ కేంద్రానికి తరలించడానికి ప్రయత్నించారు. జవాబు పత్రాల బ్యాగుతోపాటు మొత్తం 13 బ్యాగులు ఆటోలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. గ్రాండ్‌ట్రంక్ (జీటీ) ఎక్స్‌ప్రెస్‌లో మంచిర్యాలకు తరలించడానికి ఆర్ఎంఎస్ (రైల్వే మెయిన్ సర్వీసెస్) బోగీలో ఎక్కిస్తుండగా అందులో ఒక బ్యాగు లేనట్లు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. అయినా ఎంతకూ దొరక్కపోవడంతో ఈ నెల 11న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో నుంచి జారిపడటంతో.. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాగులు తరలించిన రోజు ఈదురుగాలులతో కూడిన వర్షం ఉండటంతో ఆటో నుంచి జవాబు పత్రాలు కింద పడినట్లు తేల్చారు. ఆ బ్యాగు గుర్తుతెలియని మహిళకు దొరకడంతో ఆమె ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో అప్పగించింది. రైల్వే ఉద్యోగి విధు లు ముగించుకుని బుధవారం ఇంటికి రావడంతో అతని కంట పడింది. పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. డీఈవో భిక్షపతి సమక్షంలో పరీక్ష కేంద్రాల సూపరింటెం డెట్లు శంకరయ్య, హన్మంతు, వరలక్ష్మి బ్యాగును పరిశీలించారు. తాము వేసిన సీలులో ఏ తేడా లేదని తేలడంతో జిల్లా అధికారికి అప్పగించారు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జవాబు పత్రాలు గల్లంతైన ట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. -
ఆ ఆన్సర్ షీట్లు చూసి టీచర్లు షాక్
ఆగ్రా : పరీక్షలకు ముందు సరైన సన్నద్ధత లేక, సమాధాన పత్రాల్లో దేవుడి బొమ్మలు వేస్తూ.. దేవుడా మమ్మల్ని పాస్ చేయించూ అంటూ కోరుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాల్లో మాదిరే భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమాధాన పత్రాలు చూసి పేపర్ మూల్యాంకన చేసే టీచర్లే షాకైపోయారు. వర్సిటీ 2017-18 సంవత్సరానికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ సమాధాన పత్రాల్లో విద్యార్థులు హనుమాన్ భజన్లు, హారతి పాటలు రాశారు. భక్తి పాటలు, హారతి లైన్లతో విద్యార్థులు తమ సమాధాన పత్రాలను నింపేశారని పేపర్లు మూల్యాంకన చేసిన టీచర్లు పేర్కొన్నారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా హారతి లైన్లకు అర్థం కూడా రాసినట్టు ఓ టీచర్ చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్ తనని చదువుల్లో మంచి ప్రతిభ గల వాడిగా భావిస్తుందని, తనని పాస్ చేయాలని లేదంటే ఆమె తనని విడిచిపెడుతుందంటూ ఓ విద్యార్థి తన మనోవేదనను వెల్లబుచ్చాడు. ఇలా సమాధాన పత్రాల్లో వింత వింత జవాబులతో పేపర్లు దిద్దే టీచర్లకే చుక్కలు చూపించారు. కొన్ని కేసుల్లో 20 పేజీల సమాధాన పత్రాలను సినిమా స్క్రిఫ్ట్‌లు, కవితలు, పాస్ మార్కులు వేయాలంటూ అభ్యర్థనలు ఇవే కనిపించాయని, కొంతమంది విద్యార్థులైతే ఏకంగా టీచర్లను ప్రలోభపెట్టేందుకు కరెన్సీ నోట్లను కూడా ఆఫర్ చేసినట్టు ఓ సీనియర్ టీచర్ చెప్పారు. వింత వింత సమాధానాలు రాసిన విద్యార్థుల తుది ఫలితాలు జూన్ 15న వర్సిటీ అధికారులు వెల్లడించనున్నారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకుండా.. ఇలాంటి సిల్లీ సిల్లీ అంశాలు రాసి పాస్ కావాలని విద్యార్థులు యోచిస్తున్నారని భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జీఎస్ శర్మ అన్నారు. ప్రతి రోజు టీచర్లు 5000కు పైగా సమాధాన పత్రాలను దిద్దుతారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫైనల్ ఎగ్జామ్స్‌కు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. -
పది జవాబు పత్రాలకు భద్రత కరువు
-సెక్యూరిటీ లేకుండానే తరలింపు -ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు జూపాడుబంగ్లా: పదోతరగతి ప్రశ్నపత్రాలను పటిష్టబందోబస్తు మధ్య పోలీసుస్టేషన్లకు తరలించి భద్రపర్చే అధికారులు జవాబు పత్రాల తరలింపు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. జూపాడుబంగ్లాలోని రెండు పరీక్ష కేంద్రాలలో 443 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలను రాస్తున్నారు. వారు రాసిన జవాబు పత్రాలను స్పీడ్‌పోస్టు ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలి. స్పీడ్‌పోస్టు సౌకర్యం జూపాడుబంగ్లాలో లేకపోవటంతో నందికొట్కూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్పీడ్ పోస్టుచేస్తున్నారు. నందికొట్కూరు వరకు తీసుకెళ్లేందుకు పోలీసుల బందోబసు్త ఉండాలి. అయితే ఎలాంటి పోలీసు ప్రొటెక్షన్ లేకుండా జవాబు పత్రాలను పరీక్షాకేంద్రాల చీఫ్‌లు యథేచ్ఛగా వారి ఇష్టారాజ్యంగా బస్సులు, ఆటోల్లో తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎక్కడైనా జవాబు పత్రాలు తారుమారైనా, మిస్అయినా అందుకు బాధ్యత ఎవ్వరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ విజయభాస్కర్‌ను ప్రశ్నించగా వాస్తవంగా పదోతరగతి పరీక్షల జవాబు పత్రాలను పోలీసు ప్రొటెక్షన్తోనే తరలించాలి. అయితే తగినంత పోలీసు సిబ్బంది లేరనే కారణంతో వారు రావటం లేదు. దీంతో మేమే బస్సుల్లో జవాబుపత్రాలను నందికొట్కూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్పీడ్పోస్టుచేస్తున్నట్లు తెలిపారు. -
జవాబు పత్రాలకు విపరీతమైన ఫీజులు చెల్లవు
విశ్లేషణ ప్రవేశ ఫీజు, చదువుల ఫీజు పోను, విశ్వవిద్యాలయాల పరీక్షా కేంద్రాలు బోలెడంత ఫీజు వసూలు చేసి, పరీక్షలు నిర్వహిస్తాయి. మార్కుల తదుపరి లెక్కింపునకు, పునర్ మూల్యాంకనానికి కూడా వందల రూపాయల ఫీజు కట్టమంటాయి. దాంతోపాటు విద్యార్థులు తాము రాసిన జవాబు పత్రాల ప్రతి అడిగితే దానికి 750 నుంచి రూ.2 వేల దాకా రుసుం డిమాండ్ చేస్తాయి. ఇవన్నీ వర్సిటీల నియమ నిబంధన లను అనుసరించి జరుగుతాయి. విద్యార్థులు తమ జవా బులకు మార్కులు సరిగ్గా రాలేదనుకుంటే జవాబు పత్రం చూడాలని కోరుకునే అవకాశం 2005కు ముందు లేదు. వారు కేవలం రీకౌంటింగ్ అడగవచ్చు. దానికి కొంత ఫీజు కట్టాలి. పరీక్షాధికారి జవాబులకు వచ్చిన మార్కులు కూడి, కూడికల్లో తప్పులేదని రాసి ఓ కాగితం ఇస్తాడు. విద్యార్థి ముందు లెక్కించాలని పట్టు బడితే ఆ పనిచేస్తాడు. లేకపోతే అదీ లేదు. విద్యార్థి తను ఏం రాశానో చూసుకుంటానంటే ఇచ్చేవారే కాదు. అయితే 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన తరవాత విద్యార్థుల సమాధాన పత్రాలు సమాచార మేనని కనుక తమ జవాబు పుస్తకం కాపీ తమకు ఇవ్వాలని డిమాండ్ మొదలైంది. యూపీఎస్సీ, సీబీ ఎస్ఈ తదితర సంస్థలు పరీక్షా పత్రానికి విద్యార్థి ఇచ్చే జవాబులు, వాటికి మూల్యాంకన చేసిన పరిశీలకులు ఇచ్చిన మార్కులు కూడా ధర్మకర్తృత్వ బాధ్యత కింద ఇచ్చిన సమాచారం కనుక ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా వాదించారు. ఆదిత్య బందోపాధ్యాయ దీన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లవలసి వచ్చింది. జవాబులు విద్యార్థి సొంత సమాచారమని, దానిపైన మూల్యాంకనంలో లభించిన మార్కులు కూడా ఇవ్వతగిన సమాచారమే నని సుప్రీంకోర్టు తేల్చివేసి, విద్యార్థులకు తమ జవా బులు తాము చదువుకునే సమాచార హక్కును, పంతుళ్ల మూల్యాంకన జవాబుదారీతనాన్ని నిర్ధారించింది. అయితే మరొకరి సమాధాన పత్రాన్ని అడిగితే మాత్రం అది మూడోవ్యక్తి సమాచారం, వ్యక్తిగత సమాచారం కూడా అవుతుందని, కనుక ఇవ్వడానికి వీల్లేదన్నది. అంతవరకు బాగానే ఉంది. కానీ జవాబు పత్రాన్ని పొందడానికి ఎంత ఫీజు చెల్లించాలనేది మరో సమస్య. దీన్ని కూడా తీవ్ర వివాదం చేసి కాలహరణం చేస్తు న్నారు. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు కనుక జవాబు పుస్తకం ఖరీదును వారే నిర్ణయి స్తారని, అంత డబ్బు విద్యార్థులు కట్టాలని వారు వాదిం చారు. ఒక్కొక్క పేపర్‌కు రూ. 750 ఇవ్వాలని, మొత్తం అయిదు పేపర్లకు గాను రూ.3,750లు ఇవ్వాలని ఢిల్లీ యూనివ ర్సిటీ కోరింది. విశ్వవిద్యాలయం పాలకవర్గం సాధికారికంగా రూపొందించిన నియమాల ప్రకారం విద్యార్థులు ఇంత ఫీజు కడితేనే జవాబు పుస్తకం ఇస్తామని అంటున్నారని, ఇది ఆర్టీఐ చట్టం, నియమా లకు విరుద్ధమని విద్యార్థులు వాదించారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 7 ప్రకారం నిర్ణీత ఫీజును చెల్లించి సమాచారం ప్రతిని పొందే హక్కు ఉంది. 7(2)(ఎ) కింద అడిగిన సమాచారాన్ని కాపీ చేయడానికి అయ్యే ఖర్చు లెక్కించి ఫలానా సొమ్ము ఫలానా విధంగా చెల్లించాలని పీఐఓ తెలియజేయవలసి ఉంటుంది. సమాచార హక్కు చట్టం (ఫీజు ఖర్చుల క్రమబద్ధీకరణ) నియమాలు 2005 నాలుగో నియమం ప్రకారం, పేజీకి రెండు రూపాయలు లేదా పెద్ద సైజు కాగితం అయితే ఆ కాగితం ఖరీదు ఎంతయితే అంత కోరాలని నిర్ధారించారు. ఈ లెక్కన జవాబు పత్రంలో విద్యార్థి వంద పేజీలు రాస్తే, రెండొందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఢిల్లీ విశ్వవిద్యాలయం రూ. 750 ఫీజు వసూలు చేస్తున్నది. అసమంజసమైన ఫీజు విధించడం అంటే అది సమాచార నిరాకరణే అవుతుం దని విద్యార్థి వాదించారు. రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు ఇటు వంటి కేసే వచ్చింది. ఆర్టీఐ నియమాల ప్రకారం పేజీకి రెండు రూపాయలు ఇవ్వాలా లేక యూనివర్సిటీ నిర్ధారిం చిన మేరకు వేయి రూపాయలు చెల్లించాలా అనే సవాలును పరిశీలించింది. పేజీకి రెండు రూపా యల కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేయరాదని అల్కా మటోరియా వర్సెస్ మహారాజా గంగాసింగ్ యూనివ ర్సిటీ (ఏఐఆర్ 2013 రాజస్థాన్126) కేసులో రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. దానిపై యూనివర్సిటీ అధికా రులు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని కొట్టివేసింది. అంటే పేజీకి రెండు రూపాయల కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదన్న రాజస్థాన్ హైకోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా శాసనంగా మిగిలిపోయింది. ఢిల్లీ హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మపీఠం కూడా పారస్ జైన్ వర్సెస్ భారత కంపెనీ సెక్రటరీల సంస్థ (ఎల్పీఏ 275 ఆఫ్ 2014) కేసులో జవాబు పత్రం చూడటానికి రూ. 450ల ఫీజు, జవాబు పత్రం కాపీ పొందడానికి రూ. 500ల ఫీజు వసూలు చేయడం చెల్లదని, ఆర్టీఐ నియమాలు 2005 రూల్ 4 ప్రకారం పేజీకి 2 రూపాయలు మాత్రమే తీసుకోవాలని నిర్ధారించింది. అంతకన్నా ఎక్కువ ఫీజు వసూలు చేసే అధికారం ఇచ్చిన నియ మాన్ని కొట్టివేసింది. విద్యార్థులవద్ద డబ్బులేకపోతే విద్యాసంస్థలు జవాబుదారీతనం నుంచి తప్పించుకో వడం, రూ.750లు లేని విద్యార్థులకు జవాబులు చూసుకునే హక్కు లేదనడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించ డమే. సహచట్టాన్ని, నియమాల్ని, కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించినందుకు సీఐసీ కారణ వివరణ గమనిక జారీ చేసింది. దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా ఉత్తర్వును అమలు చేయాలని యూజీసీని, మానవ వనరుల మంత్రిత్వ శాఖను సీఐసీ ఆదేశించింది. (అబ్నే ఇంగ్టీ వర్సెస్ ఢిల్లీ యూనివర్సిటీ కేసు ఇఐఇ/అ/ఇ/2015/901116 లో 15 జనవరి 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
జవాబు పత్రాలను చూపాల్సిందే
విశ్వవిద్యాలయాలు, పరీక్ష సంస్థలు విద్యార్థులకు తమ జవాబులను చూసుకునే అవకాశాన్ని నిరాకరిస్తుంటాయి. భారీ ఫీజులు కట్టి, చదివి జవాబులు రాసిన పత్రాలు విద్యార్థులవి కాకుండా ఉండవు. పరీక్ష రాసిన వారికి ఎన్ని మార్కులు ఇచ్చా రో తెలుసుకునే హక్కు ఉందని ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించ కుండా ఉండటమే 90 శాతం వరకు జరుగు తుంటుంది. అలాంట ప్పుడు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించవచ్చా? నిస్సందేహంగా ప్రయోగించవచ్చు అనేదే సమాధానం. ఢిల్లీలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన ఒక యువకుడు తనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలపాలని ఆర్టీఐ చట్టం కింద కోరాడు. తాను రాసిన రెండంచెల పరీక్షల జవాబు పత్రాల ప్రతిని అభ్యర్థించాడు. ఇవ్వరాదని నిర్ణయించిన ప్రజా సమాచార అధికారి ఏమీ చెప్పలేదు. మొదటి అప్పీలులో ఆ అభ్యర్థికి చుక్కెదురే అయింది. సమాచార కమిషన్ ముందుకు వెళ్లక తప్పలేదు. రెండు ఉత్తరాల ద్వారా అభ్యర్థికి మొత్తం సమాచా రం అందించామని సమాచార అధికారి అనడం, అభ్యర్థి కాదనడం జరిగిపోయింది. 2010లో నిర్వ హించిన పరీక్షల ఫలితాలను 2014లో ప్రకటిం చడమే దుర్మార్గమంటే, మార్కులను వెబ్సైట్లో ఉంచకపోవడం మరో దుర్మార్గం అధికారిక వెబ్ సైట్లో ప్రజా సమాచార అధికారి వివరాలు, సమాచార హక్కుకు సంబంధించిన ఇతర వివరా లేవీ లేవని అభ్యర్థి ఫిర్యాదు చేశాడు. విచారణ సమయంలో అధికారి ఫైళ్లు పట్టుకు వచ్చి, ఈ అభ్యర్థికి ప్రధాన పరీక్షలో 83 శాతం మా ర్కులు వ చ్చాయని వెల్లడించారు. జవాబు పత్రం ఇవ్వడం మాత్రం కుదరదని, పరీక్షలో అభ్యర్థి రాసి న జవాబులు రహస్యాలని అసలు ‘రహస్యం’ విడ మరిచారు. పరీక్ష రాసిన విద్యార్థి జవాబులు రహ స్యాలనే ఈ వాదన వినీ వినీ విసుగెత్తింది. ‘‘కాదు నాయనా, కాదు’’ అని సుప్రీంకోర్టే చెప్పినా అర్థం కాకపోవడాన్ని బట్టే మన విద్యాలయాలు, పరీక్షా సంస్థల్లో పరిపాలన ఎంత దారుణమో అర్థమవు తుంది. ఈ జవాబు పత్రాలనన్నిటినీ ఒక గదిలో ఉంచి తాళం వేసి, రెండో, మూడో తాళం చెవులను అధికారుల వద్ద ఉంచుతారట. ఏం ప్రయోజనం? 2010 నాటి రికార్డులను వెబ్సైట్లో ఉంచలేద ని, అభ్యర్థికి జవాబు పత్రాలు ఇవ్వలేదని చివరకు విచారణలో అర్థమైంది. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యు కేషన్ వర్సెస్ ఆదిత్య బంధోపాధ్యాయ కేసు’లో సుప్రీం ఇదే సమస్యపై గుణపాఠం నేర్పింది. మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలు నమ్మి ఇచ్చిన గోప్య పత్రాలు కావని, పరీక్ష రాసిన వ్యక్తికీ, పరీక్ష నిర్వహించిన సంస్థకూ మధ్య ధార్మిక సంస్థ కు, లాభోక్తకు మధ్య ఉండే ధర్మకర్తృత్వ సంబం ధం ఏమీ లేదని, ఆ పేరిట జవాబు పత్రాలను, మార్కులను విద్యార్థులకు తెలుపకుండా, రహ స్యంగా ఉంచే విద్యాసంస్థల విధానం చెల్లదని విస్పష్టంగా చెప్పింది. ధర్మకర్తృత్వ సంబంధంలో ఒకరు మరొకరికి ఇచ్చిన పత్రాలు రహస్యాలనీ, వాటిని వెల్లడించాల్సిన అవసరం లేదని సెక్షన్ 8(1)ఇ లో మినహాయింపు ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని విద్యార్థి రాసిన సమాధానాలను, వాటికి వేసిన మార్కులను రహస్యంగా ఉంచాలనుకోవ డం చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయ స్థానం సరైన వివరణ ఇచ్చింది. విశ్వవిద్యాలయాలకు, పరీక్ష సంస్థలు ప్రశ్న పత్రాలు తమ సొంతం అని భావిస్తుంటారు. ఆ ప్రశ్నలకు విద్యార్థులు ఇచ్చిన జవాబులు కూడా విద్యాసంస్థల సొంత ఆస్తి అనుకుంటారు. ఈ దురభిప్రాయం తొలగే వరకు విద్యార్థులకు తమ జవాబులను చూసుకుని, నకలు తీసుకునే భాగ్యం కలుగదు. ఈ అంశంపై ఎన్నో వివాదాలు, కేసులు నడిచి, తీర్పులు వెలువడ్డాయి. సమాధాన పత్రాల ను చూపమంటే తమ సొంత ఆస్తిలో వాటా అడిగినట్టుగా అధికారులు భయపడిపోతున్నారు. మంచోచెడో, ప్రతిభావంతమైనవో కావో విద్యా ర్థుల జవాబులు వారి సొంతం. మరెవరికో కాదు, భారీ ఫీజులు కట్టి చదివి, పాఠాలు ఎలా చెప్పినా విని, పరీక్షకు ఫీజు కూడా కట్టి, తోచిన జవాబులు రాసిన విద్యార్థి పత్రాలు అతనివి కాకుండా ఉం డవు. చెత్త జవాబులు రాసి ఉంటే విద్యార్థికి ఆ విష యం తెలిస్తే... సరైన సమాధానాలను తెలుసుకోవ డానికి ప్రయత్నం చేస్తాడు. మంచి జవాబులే అయితే తోటివారు చూసి నేర్చుకోవచ్చు. పరీక్షల ఫలితాలను ఇచ్చినట్టుగానే, మార్కు లేసిన జవాబు పత్రాలను కూడా ఆయా సంస్థలే తమంతట తాముగానే ఇవ్వాలి. ఎన్ని మార్కులు ఎందుకు వేశారో లేదా వేయలేదో చెప్పవలసిన జవాబుదారీతనం ఉపాధ్యాయులకు ఉండాలి. లేక పోతే తమకు ఇష్టమైనవారికి ఇష్టమొచ్చినన్ని మా ర్కులు వేసి ముందుకు తోసి, ఇష్టంలేని వారిని వెనక్కు తోసి అన్యాయానికి పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకు తావేలేని పార దర్శకతే కావ లసింది. ఆడామగా, కుల, మత, ఉత్తర, దక్షిణ, ఆంధ్ర, తెలంగాణ, ధనిక పేద తేడాలతో విద్యా ర్థులను విభజించే దుర్మార్గం మార్కులు వేయడం లో కనిపిస్తుంది. కనుక జవాబుల పత్రాలను వెల్లడించాల్సిందే. ఉత్తమమైన జవాబులను గ్రం థాలయాల్లో ఉంచాలి. బాగాలేని జవాబులను ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాలి. అప్పుడే మార్కులు ఇవ్వడంలో నేరాలను నివారించగలు గుతాం. సమాచార హక్కు చట్టం విద్యాలయాల మూల్యాంకన అక్రమార్కులకు చరమగీతం పాడే చక్రమని తెలుసుకోవాలి. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్