జవాబు పత్రాలను చూపాల్సిందే | Exam boards should be showed answer sheets to students | Sakshi
Sakshi News home page

జవాబు పత్రాలను చూపాల్సిందే

Published Fri, Aug 7 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

జవాబు పత్రాలను చూపాల్సిందే

జవాబు పత్రాలను చూపాల్సిందే

విశ్వవిద్యాలయాలు, పరీక్ష సంస్థలు విద్యార్థులకు తమ జవాబులను చూసుకునే అవకాశాన్ని నిరాకరిస్తుంటాయి. భారీ ఫీజులు కట్టి, చదివి జవాబులు రాసిన పత్రాలు విద్యార్థులవి కాకుండా ఉండవు. పరీక్ష రాసిన వారికి ఎన్ని మార్కులు ఇచ్చా రో తెలుసుకునే హక్కు ఉందని ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించ కుండా ఉండటమే 90 శాతం వరకు జరుగు తుంటుంది. అలాంట ప్పుడు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించవచ్చా? నిస్సందేహంగా ప్రయోగించవచ్చు అనేదే సమాధానం. ఢిల్లీలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన ఒక యువకుడు తనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలపాలని ఆర్టీఐ చట్టం కింద కోరాడు. తాను రాసిన రెండంచెల పరీక్షల జవాబు పత్రాల ప్రతిని అభ్యర్థించాడు.
 
 ఇవ్వరాదని నిర్ణయించిన ప్రజా సమాచార అధికారి ఏమీ చెప్పలేదు. మొదటి అప్పీలులో ఆ అభ్యర్థికి చుక్కెదురే అయింది. సమాచార కమిషన్ ముందుకు వెళ్లక తప్పలేదు. రెండు ఉత్తరాల ద్వారా అభ్యర్థికి మొత్తం సమాచా రం అందించామని సమాచార అధికారి అనడం, అభ్యర్థి కాదనడం జరిగిపోయింది. 2010లో నిర్వ హించిన పరీక్షల ఫలితాలను 2014లో ప్రకటిం చడమే దుర్మార్గమంటే, మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం మరో దుర్మార్గం  అధికారిక వెబ్ సైట్‌లో ప్రజా సమాచార అధికారి వివరాలు, సమాచార హక్కుకు సంబంధించిన ఇతర వివరా లేవీ లేవని అభ్యర్థి ఫిర్యాదు చేశాడు.
 
 విచారణ సమయంలో అధికారి ఫైళ్లు పట్టుకు వచ్చి, ఈ అభ్యర్థికి ప్రధాన పరీక్షలో 83 శాతం మా ర్కులు వ చ్చాయని వెల్లడించారు.  జవాబు పత్రం ఇవ్వడం మాత్రం కుదరదని, పరీక్షలో అభ్యర్థి రాసి న జవాబులు రహస్యాలని అసలు ‘రహస్యం’ విడ మరిచారు. పరీక్ష రాసిన విద్యార్థి జవాబులు రహ స్యాలనే ఈ వాదన వినీ వినీ విసుగెత్తింది. ‘‘కాదు నాయనా, కాదు’’ అని సుప్రీంకోర్టే చెప్పినా అర్థం కాకపోవడాన్ని బట్టే మన విద్యాలయాలు, పరీక్షా సంస్థల్లో పరిపాలన ఎంత దారుణమో అర్థమవు తుంది. ఈ జవాబు పత్రాలనన్నిటినీ ఒక గదిలో ఉంచి తాళం వేసి, రెండో, మూడో తాళం చెవులను అధికారుల  వద్ద ఉంచుతారట. ఏం ప్రయోజనం?
 2010 నాటి రికార్డులను వెబ్‌సైట్లో ఉంచలేద ని, అభ్యర్థికి జవాబు పత్రాలు ఇవ్వలేదని చివరకు విచారణలో అర్థమైంది. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యు కేషన్ వర్సెస్ ఆదిత్య బంధోపాధ్యాయ కేసు’లో సుప్రీం ఇదే సమస్యపై గుణపాఠం నేర్పింది.
 
 మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలు నమ్మి ఇచ్చిన గోప్య పత్రాలు కావని, పరీక్ష రాసిన వ్యక్తికీ, పరీక్ష నిర్వహించిన సంస్థకూ మధ్య ధార్మిక సంస్థ కు, లాభోక్తకు మధ్య ఉండే ధర్మకర్తృత్వ సంబం ధం ఏమీ లేదని, ఆ పేరిట జవాబు పత్రాలను, మార్కులను విద్యార్థులకు తెలుపకుండా, రహ స్యంగా ఉంచే విద్యాసంస్థల విధానం చెల్లదని విస్పష్టంగా చెప్పింది. ధర్మకర్తృత్వ సంబంధంలో ఒకరు మరొకరికి ఇచ్చిన పత్రాలు రహస్యాలనీ, వాటిని వెల్లడించాల్సిన అవసరం లేదని సెక్షన్ 8(1)ఇ లో మినహాయింపు ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని విద్యార్థి రాసిన సమాధానాలను, వాటికి వేసిన మార్కులను రహస్యంగా ఉంచాలనుకోవ డం చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయ స్థానం సరైన వివరణ ఇచ్చింది.
 
 విశ్వవిద్యాలయాలకు, పరీక్ష సంస్థలు ప్రశ్న పత్రాలు తమ సొంతం అని భావిస్తుంటారు. ఆ ప్రశ్నలకు విద్యార్థులు ఇచ్చిన జవాబులు కూడా విద్యాసంస్థల సొంత ఆస్తి అనుకుంటారు. ఈ దురభిప్రాయం తొలగే వరకు విద్యార్థులకు తమ జవాబులను చూసుకుని, నకలు తీసుకునే భాగ్యం కలుగదు. ఈ అంశంపై ఎన్నో వివాదాలు, కేసులు నడిచి, తీర్పులు వెలువడ్డాయి. సమాధాన పత్రాల ను చూపమంటే తమ సొంత ఆస్తిలో వాటా అడిగినట్టుగా అధికారులు భయపడిపోతున్నారు. మంచోచెడో, ప్రతిభావంతమైనవో కావో విద్యా ర్థుల జవాబులు వారి సొంతం.  మరెవరికో కాదు, భారీ ఫీజులు కట్టి చదివి, పాఠాలు ఎలా చెప్పినా విని, పరీక్షకు ఫీజు కూడా కట్టి, తోచిన జవాబులు రాసిన విద్యార్థి పత్రాలు అతనివి కాకుండా ఉం డవు. చెత్త జవాబులు రాసి ఉంటే విద్యార్థికి ఆ విష యం తెలిస్తే... సరైన సమాధానాలను తెలుసుకోవ డానికి ప్రయత్నం చేస్తాడు. మంచి జవాబులే అయితే తోటివారు చూసి నేర్చుకోవచ్చు.
 
పరీక్షల ఫలితాలను ఇచ్చినట్టుగానే, మార్కు లేసిన జవాబు పత్రాలను కూడా ఆయా సంస్థలే తమంతట తాముగానే ఇవ్వాలి. ఎన్ని మార్కులు ఎందుకు వేశారో లేదా వేయలేదో చెప్పవలసిన జవాబుదారీతనం ఉపాధ్యాయులకు ఉండాలి. లేక పోతే తమకు ఇష్టమైనవారికి ఇష్టమొచ్చినన్ని మా ర్కులు వేసి ముందుకు తోసి, ఇష్టంలేని వారిని వెనక్కు తోసి అన్యాయానికి పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకు తావేలేని పార దర్శకతే కావ లసింది. ఆడామగా, కుల, మత, ఉత్తర, దక్షిణ, ఆంధ్ర, తెలంగాణ, ధనిక పేద  తేడాలతో విద్యా ర్థులను విభజించే దుర్మార్గం మార్కులు వేయడం లో కనిపిస్తుంది. కనుక జవాబుల పత్రాలను వెల్లడించాల్సిందే. ఉత్తమమైన జవాబులను గ్రం థాలయాల్లో ఉంచాలి. బాగాలేని జవాబులను ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాలి. అప్పుడే మార్కులు ఇవ్వడంలో నేరాలను నివారించగలు గుతాం. సమాచార హక్కు చట్టం విద్యాలయాల మూల్యాంకన అక్రమార్కులకు చరమగీతం పాడే చక్రమని తెలుసుకోవాలి.
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
 - మాడభూషి శ్రీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement