chadalavada krishnamurthy
-
తిరుపతిలో టీడీపీ నేత చదలవాడ రౌడీయిజం
-
టీడీపీలో టీటీడీ చైర్మన్ పదవి చిచ్చు
అమరావతి: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో అప్పుడే చిచ్చు మొదలైంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంతకు ముందు కూడా రాయపాటి తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు ఆశాభంగం తప్పలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ ఛాన్స్ దక్కింది. దాంతో మరోసారి రాయపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న రాయపాటి సాంబశివరావుపై ఈసారి అయినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కటాక్షం లభిస్తుందో లేదో మరి. మరోవైపు ఇదే పదవిపై కన్నేసిన ఎంపీ మురళీమోహన్ కూడా తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం మురళీమోహన్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక టీటీడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వాన్ని నియమించనుంది. కాగా ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ నేత కావడంతో ఈసారి టీటీడీ చైర్మన్ పదవి కోస్తా జిల్లాల వారికే కేటాయించాలని డిమాండ్ తెరమీదకు వస్తోంది. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి. -
మళ్లీ తెరపైకి లడ్డూ ధరల పెంపు అంశం
నేడు టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చ సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్లు, లడ్డూ ధరల పెంపు, కాటేజీల అద్దెలు పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం(నేడు) జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు కూడా చేశారు. అలాగే 29వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగే తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. -
188 కోట్లతో తిరుపతి అభివృద్ధి
-
188 కోట్లతో తిరుపతి అభివృద్ధి
- టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం - విద్య, వైద్య, వసతులకు పెద్దపీట సాక్షి, తిరుమల: తిరుపతి అభివృద్ధి కోసం రూ.188 కోట్లు కేటాయిస్తూ మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలోని అభివృద్ధి పనులన్నింటికీ ఆ మొత్తంలో నిధులు కేటాయించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు తెలిపారు. తిరుపతి లో టీటీడీ సత్రాల అభివృద్ధి, కాలేజీలు, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల భవంతులు, 14 మార్గాల్లో రోడ్ల అభివృద్ధి, అధునాతన ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, చెరువుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. సమావేశంలో తీర్మానాలివి.. ► రూ.78.28 కోట్లతో కిలో రూ.364 చొప్పున 21.50 లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలు ► నవంబర్ 14న ఏపీ, తెలంగాణల్లో ఎనిమిదో విడత ‘మనగుడి’ కార్యక్రమం నిర్వహణకు రూ.63.93 లక్షల మంజూరు. నెలాఖరున శంషాబాద్‌లో శ్రీనివాసకల్యాణం నిర్వహణ ► రూ. 5.2 కోట్లతో తిరుచానూరులో నిత్యాన్నప్రసాద భవన నిర్మాణం ► రూ. 5.6 లక్షలతో చంద్రప్రభ వాహనం తయారీ, అమ్మవారి ఆలయంలో బంగారుపూత పనులకు రూ.2.67 లక్షల మంజూరు ► టీటీడీలోని కాంట్రాక్టు కార్మికుల వేతనం రూ.6,700 నుంచి రూ. 13 వేలకు పెంపు. ► టీటీడీ ఉద్యోగులకు రూ.12,500 బ్రహ్మోత్సవ బహుమానం, కాంట్రాక్టు కార్మికులకు రూ.6,250 మంజూరు హా రూ. 1.6 కోట్లతో అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండపంలోని గుప్తకామేశ్వరి, ఇతర ఆలయాల అభివృద్ధి ► వైఎస్సార్ కడపజిల్లా మైదుకూరులోని భీమేశ్వరి స్వామి ఆలయం అభివృద్ధికి రూ.22.50 లక్షలు, ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షల మంజూరు హా విజయనగరంలో నేత్ర వైద్యశాల నిర్మాణానికి పుష్పగిరి నేత్ర సంస్థకు 25 సంవత్సరాలకు కౌలుకు టీటీడీ స్థలం కేటాయింపు. హా రూ. 14.50 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న ఎస్వీబీసీ స్టూడి యో నిర్మాణం టెండర్ పనులకు ఆమోదం. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడికి నోటీసు తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన డాక్టర్ ఏవీ రమణ దీక్షితులకు సోమవారం టీటీడీ నోటీసు జారీ చేసింది. అక్టోబర్‌లో జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన తన మనవడితో కలసి గర్భాలయ ప్రవేశం చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు కూడా ఆలయ అధికారులు చూశారు. ఇందులో భాగంగా ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు సోమవారం ఆయనకు నోటీసు జారీ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. -
ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానం
- వేడుకగా శ్రీవారి ధ్వజారోహణం - తిరుమల కొండ మీద బ్రహ్మోత్సవ సంబరం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా ఆలయంలో సోమవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా స్వామి వాహనమైన గరుత్మంతుడి పతాకాన్ని(ధ్వజపటం) బంగారు ధ్వజ స్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులు క్రతువును నిర్వహించి మంగళ ధ్వనులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చివాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు(ఆదిశేషుడు), గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు సోమవారం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి నాందిగా కంకణం ధరించారు. పెద్దశేషుడిపై పరంధాముడి దర్శనం బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వాహన మండపంలో వేంచేశారు. రాత్రి 9 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాల, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. వాహన సేవ ముందు భజన బృందాల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, సంకీర్తనలు భక్తులను అలరించాయి. శ్రీవారికి ఏపీ సీఎం పట్టువస్త్రాలు సమర్పణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 7.40 గంటలకు సీఎం సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం పచ్చకర్పూరపు వెలుగులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూప విశేషాలు, క్షేత్ర సంప్రదాయాలు అర్చకులు సీఎంకు వివరించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కే ఎస్ శ్రీనివాసరాజు సీఎంకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. తర్వాత చంద్రబాబు పెద్ద శేషవాహన సేవ లోని మలయప్పస్వామివారిని దర్శించుకున్నారు. -
చినజీయర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్
సీతానగరం (తాడేపల్లిరూరల్): జీయర్ ఆశ్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం రాత్రి కలిశారు. చినజీయర్‌స్వామిని ఆయన తిరుపతికి రావాలని ఆహ్వానించారు. వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు. అహోబిల రామానుజ జీయర్ స్వామి, జెట్ కార్యదర్శి చక్రధర్ ఉన్నారు. -
ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సందర్శంచారు. మంగళవారం ఉదయం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం వచ్చే నెల 12 వ తేదీ నుంచి జర గబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చదలవాడ పరిశీలించారు. -
ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు
సాక్షి, తిరుమల: వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. దానికి తక్షణమే రూ. 20 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు సోమవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. మరికొన్ని నిర్ణయాలు.. ► వైఎస్సార్ కడప జిల్లాలోని దేవుని కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల వసతి సముదాయం నిర్మాణం కోసం రూ. 5 కోట్లు కేటాయించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద తుమ్మూరులోని కరియమాణిక్యస్వామి, శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు. తిరుమలలోని రాఘవేంద్రస్వామి మఠానికి అదనపు స్థలం కేటాయించారు. స్విమ్స్ ఆస్పత్రిలో మాలిక్యులర్ బయాలజీ పరిశోధనశాల ఏర్పాటుకు రూ. 6.03 కోట్లు, డయాలసిస్ భవనంలో అదనపు గదుల నిర్మాణానికి రూ. 3.68 కోట్లతో చేపట్టిన టెండర్ పనులకు ఆమోదం తెలిపారు. ► రూ. 3.92 కోట్లతో తిరుపతిలోని కోదండ రామస్వామి సత్రం, రూ. 3.67 కోట్లతో గోవింద రాజస్వామి సత్రం అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ. 1.25 కోట్లతో విజయనగరం జిల్లా కొత్త వలసలో కల్యాణ మండపం నిర్మాణానికి అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లా కందుకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 25 లక్షలు కేటాయించారు. ► రూ. 1.06 కోట్లతో తిరుమల శ్రీవారి ఆలయానికి 1,150 పట్టువస్త్రాలు కొనుగోలు చేయనున్నారు. ► శ్రీవారి సేవా వ్యవస్థను బలోపేతం చేసేందుకు శ్రీవారి సేవా సెల్‌ను ఏర్పాటు చేశారు. ► టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 12,200, కాంట్రాక్టు కార్మికులకు రూ. 6,100 బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వరద బాధితులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు టీటీడీ ఆరు బృందాలను పంపింది. మంగళవారం నుంచి టీటీడీ వైద్యులు తమ సేవలందించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తారని చైర్మన్, ఈవో ప్రకటించారు. కాగా విచక్షణ కోటా కింద కేటాయించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ధరలతో పాటు కల్యాణ మండపాలు, తిరుమలలోని గదుల అద్దెలు పెంచాలని టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ నిర్ణయించింది. మరోవైపు తిరుమలలో సోమవారం ఆరని తాజా లడ్డూలు పంపిణీకి సిద్ధం చేశారు. భక్తుల చేతికి అందకుండానే పొడిగా మారడంతో వాటి పంపిణీ ఆపేశారు. -
డైరెక్టర్ పదవిపై మోసం చేశారు: చదలవాడ
తిరుపతి: చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై తన అనుచరులు దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్పందించారు. తాను ఎలాంటి దాడికి పాల్పడలేదని వివరణ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీలో తనకు 50శాతం వాటా ఉందని తెలిపారు. ఈ షుగర్ ఫ్యాక్టరీలో డైరెక్టర్ పదవి ఇస్తామని మోసం చేశారని ఆయన చెప్పారు. ఫ్యాక్టరీ యజమాని వినోద్బేడి మోసాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో రైతులకు న్యాయం చేయడానికి కృషి చేశానని అన్నారు. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై చదలవాడ కృష్ణమూర్తి అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దాడి చేసినట్టు.. పోలీసులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేసు నమోదుకు లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. -
టీటీడీ భక్తి చానల్‌పై చదలవాడ ఫైర్
తిరుపతి : టీటీడీ భక్తి చానల్ తీరుపై తిరుమల తిరుపతి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ భక్తి చానల్ ఓ అవినీతి పుట్ట అని వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాలుగా రూ.కోట్లు దుర్వినియోగం చేశారని చదలవాడ శుక్రవారమిక్కడ ఆరోపించారు. భక్తి చానల్ అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. -
రుత్వికులకు టీటీడీ చైర్మన్ చీవాట్లు
సమాచారం లోపంతో ఆలస్యంగా వచ్చిన చదలవాడ అప్పటికే ముగిసిన యాగం తిరుమల: టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి ఆగ్రహం వ చ్చింది. తను వచ్చేలోపే వరుణయాగం పూర్తి చేయడం పై శుక్రవారం ఆయన రుత్వికులకు చీవాట్లు పెట్టారు. తిరుమల పారువేట మండపం వద్ద నిర్వహించే వరుణయాగంలో మూడోరోజు కార్యక్రమం కోసం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రావాలని పండితులు ఆహ్వానించారు. ఆ సమాచారం చైర్మన్‌కు అందలేదు. దీంతో ఆయన సతీసమేతంగా మధ్యాహ్నం 12.50 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యాగం ముగిసింది. దీంతో చైర్మన్ నిర్ఘాంతపోయారు. ‘‘మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాల్సిన యాగాన్ని 12 గంటలకే ఎలా ముగి స్తారు? అలా చేయడం సరికాదు? నాకు అందిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకు యాగం ఉంటుందని చెబితేనే నేను వచ్చాను? లేనిపక్షంలో రాను?’’ అని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి యాగాన్ని పర్యవేక్షించే టీటీడీ పండితుడు వడ్లమానిని నిలదీశారు. ‘‘మధ్యాహ్నం కాకముందే ఆకలవుతోందా?’’ అంటూ చీవాట్లు పెట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి 12 గంటలకే పూర్తి చేశామని వడ్లమాని బదులిచ్చారు. తర్వాత చైర్మన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న చదలవాడ
-
తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది
ఈ ప్రాణం తిరుపతివాసులదే ఏరోజూ మచ్చ తెచ్చేలా వ్యవహరించను విద్య, వైద్యం, సంక్షేమమే ధ్యేయం తిరుమల, తిరుపతికి తాగునీటి సమస్య రాకుండా కృషి దాతల సాయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం టీటీడీ ఈవో బాగా పనిచేస్తున్నారు చదలవాడ కృష్ణ్ణమూర్తి వెల్లడి తిరుపతి కార్పొరేషన్: ‘బతికేందుకు పొట్ట చేతపట్టుకుని వచ్చిన నన్ను అక్కున చేర్చుకుని, రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతివాసులే, వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటా’ అని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం రాత్రి తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలుకుతూ ఇంటి వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటికి చేరుకున్న కృష్ణమూర్తికి ఆయన భార్య, చదలవాడ విద్యాసంస్థల చైర్పర్సన్ చదలవాడ సుచరిత ఆత్మీయ స్వాగతం పలికారు. చదలవాడ నివాసం వద్ద రాత్రి వరకు కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా చదలవాడ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఈ స్థాయిలో అందరి ముందు నిలబడ్డానంటే అందుకు తిరుపతివాసులే కారణమన్నారు. అందుకే ఈపదవి తిరుపతి వాసులకే చెందాలి అని చెమ్మగిల్లిన కళ్లతో ఉద్విగ్నంగా మాట్లాడారు. ఏరోజూ మచ్చ తెచ్చుకునేలా వ్యవహరించలేదన్నారు. ఇకపై వ్యవహరించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, వివాదాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. తిరుపతి అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని, ఇకపై మరింత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. తిరుపతిలో విద్యా, వైద్యం, సంక్షేమం ఈ మూడు అంశాలే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు వారసులు అంటూ ఎవ్వరూ లేరని, ఈ పదవిని సొంతానికి వాడుకోనని అన్నారు. టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థను రాజకీయాలకు వాడుకుని చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించబోనని, తప్పు చేస్తే ఎవ్వరైనా సరే నిలదీయవచ్చన్నారు. ప్రస్తుతం తిరుమలలో కొత్త ఈవో చాలా చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తిరుపతివాసులకు స్థానిక కోటాలో దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమల,తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. దాతల సహకారంతో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు. అభినందనల వెల్లువ చదలవాడ కృష్ణమూర్తికి ఆయన నివాసంలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, బుల్లెట్ రమణ, నీలం బాలాజీ, గుణశేఖర్ నాయుడు, టీటీడీ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు అభినందనలు తెలిపారు. -
సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు
తితిదే కొత్త చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సాక్షి, హైదరాబాద్: సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. వారికి సకల సౌకర్యాలు కల్పించడంద్వారా మంచివాడిననిపించుకుంటానన్నారు. తితిదే చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తానన్నారు. నూతన విధానాన్ని అమలుచేయడంద్వారా బాలాజీ దర్శనాన్ని సులభతరం చేస్తానన్నారు. అనవసర వివాదాల జోలికెళ్లబోనన్నారు.‘నేను అత్యంత సామాన్యుడిని. సామాన్య భక్తులకే అవకాశమిస్తా, పొరపాట్లకు తావివ్వను’ అని కృష్ణమూర్తి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు టీటీడీ చైర్మన్ పదవినిచ్చి సముచిత స్థానం కల్పించారని, ఆయన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చేవరకూ మీడియా బాగా ప్రచారం చేసిందని, మీడియాకు కూడా రుణపడి ఉంటానన్నారు. -
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా చిత్తూరు జిల్లా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. పాలకవర్గానికి ఏడాది కాలపరిమితిగా నిర్ణయించారు. ఈ పాలకమండలిలో 15 మంది సభ్యులను నియమించారు. మరో ముగ్గురు అధికార హోదాలో సభ్యులుగా ఉంటారు. చదలవాడ 1999 నుంచి 2004 వరకు టీడీపీ తరఫున తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పాలకమండలిలో మిత్రపక్షమైన బీజేపీ సభ్యులకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణకు చెందిన బీజేపీ వారెవరికీ అవకాశం ఇవ్వలేదు. కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకుడిని సభ్యుడిగా నియమించారు. పాలకమండలి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి (శృంగవరపుకోట), పిల్లి అనంతలక్ష్మి (కాకినాడ గ్రామీణ), డోల బాలవీరాంజనేయస్వామి (కొండెపి), తెలంగాణకు చెందిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), జి. సాయన్న (సికింద్రాబాద్ కంటోన్మెంట్), టీడీపీ నేతలు వై.టి.రాజా (తణుకు మాజీ ఎమ్మెల్యే), ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు), ఎన్టీఆర్ హాయాంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన ఎ.వి.రమణ (ైెహ దరాబాద్), తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వి.కృష్ణమూర్తి, జె.శేఖర్‌రెడ్డి, డి.పి.అనంత్ (బీజేపీ), సంపత్ రవినారాయణ న్ (బిజినెస్), సీఐఐ మహిళా విభాగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లా, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ సిఫార సు మేరకు తిరుపతికి చెందిన పి.హరిప్రసాద్‌ను సభ్యులుగా నియమించారు. వీరితోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా, టీటీడీ ఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా జె.ఎస్.వి.ప్రసాద్, దేవాదాయశాఖ కమిషనర్‌గా అనూరాధ, టీటీడీ ఈవోగా సాంబశివరావు వ్యవహరిస్తున్నారు. తమిళనాడు నుంచి ఎండీఎంకే నేత వి.గోపాలస్వామి (వైగో) సిఫారసు మేరకు కృష్ణమూర్తికి పాలకవర్గంలో స్థానం కల్పించినట్టు తెలిసింది. -
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి నియామకం
హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని నియమించారు. సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. టీటీడీ కార్యవర్గంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత్రి నీతా అంబానీకి చోటు కల్పించారు. టీటీడీ కాలపరిమితి ఏడాదికాలం ఉంటుంది. చదలవాడ తిరుపతి నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. చదలవాడకు ఈ పదవి ఇవ్వనున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ రోజు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. టీటీడీ సభ్యులు వీరే: నీతా అంబానీ, బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలిత కుమారి, రవి నారాయణ్, శ్యాం సుందర్ శివాజీ, వై. శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వర రావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకులు సత్యనారాయణ (బీజేపీ), భాను ప్రకాశ్ (బీజేపీ), కే రాఘవేంద్రరావు, దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్ యాదవ్, తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రా రెడ్డి (బీజేపీ), గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య, తమిళనాడు నుంచి కృష్ణమూర్తిలను నియమించినట్టు సమాచారం. -
టీటీడీ ఛైర్మన్ గా చదలవాడ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చదలవాడ పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆదివారం లోగా వెలువడనున్నాయి. కాగా,18మంది సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని బోర్డు సభ్యులుగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోర్డు సభ్యునిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. -
టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ !
హైదరాబాద్ : టీటీడీ బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. టీటీడీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. బోర్డు సభ్యులుగా సీఎన్ రవిశంకర్, భాను ప్రకాశ్ రెడ్డి, అనంత్ (కర్ణాటక), ఆకుల సత్యనారాయణ, పత్తివాడ నారాయణ స్వామి, బండారు సత్యనారాయణమూర్తి నియమించాలని నిర్ణయించారని తెలిసింది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలో బోర్డు ఛైర్మన్, సభ్యుల దస్త్రంపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అకాశముంది.