తిరుపతి అభివృద్ధి కోసం రూ.188 కోట్లు కేటాయిస్తూ మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలోని అభివృద్ధి పనులన్నింటికీ ఆ మొత్తంలో నిధులు కేటాయించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు తెలిపారు. తిరుపతి లో టీటీడీ సత్రాల అభివృద్ధి, కాలేజీలు, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల భవంతులు, 14 మార్గాల్లో రోడ్ల అభివృద్ధి, అధునాతన ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, చెరువుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.