Talasani Srinivasa Yadav
-
రొటీన్‌గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్‌గా నడుస్తోంది: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని చెప్పారు. నవంబర్ 27న 15 నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధుల జనరల్ బాడీ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఈ సమావేశం ఎలా నిర్వహించాలి అనే దానిపై గ్రేటర్ లీడర్లు అందరం చర్చించాం. వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. తర్వాత మా చేతుల్లోకి రావొచ్చు. టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారు. మేం అన్నింటినీ ఎదుర్కొంటాం. దేశంలో ఏం జరుగుతుందో అన్ని గమనిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. రొటీన్‌గా చేస్తే పట్టించుకోం. కానీ టార్గెట్‌గా నడుస్తోంది. నాకు జ్వరం వస్తే కూడా రాజకీయం చేశారు. ఇవన్నీ భయపడి ఉంటే హైదరాబాద్‌లో ఎలా ఉంటాం' అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. చదవండి: (పదే పదే క్లీన్‌బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?) -
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
కార్మికులకు త్వరలో కొత్త పథకం
గన్‌ఫౌండ్రీ: కార్మికులను ధనవంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కార్మికుల కోసం త్వరలో ఓ కొత్త పథకం తీసుకువస్తామన్నారు. తాను సైకిల్ మీద పాల వ్యాపారం ప్రారంభించానని, నిరంతరం కçష్టపడితేనే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటామని అన్నా రు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. మేడే సందర్భంగా మం త్రి మల్లారెడ్డి కార్మికుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంత రం మైహోం గ్రూప్, ఎన్ఎస్ఎన్ కృష్ణవేణి షుగర్స్, సాగర్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎల్ అండ్ టీ వంటి పలు కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం అవార్డులు, 40 మంది కార్మిక విభాగం ప్రతినిధులకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.చందర్, రాష్ట్ర పాఠశాల మౌలిక వసతుల కల్పన చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణీ కుముదిని, కమిషనర్ అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు. పప్పు పహిల్వాన్ రాహుల్ పప్పు పహిల్వాన్‌గా పేరున్న రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి ఏం ఒరగబెడతారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని, అందుకే రాహుల్‌ను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ నిర్వహించిన మే డే వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన కార్మికులకు శ్రామిక్ అవార్డులు అందజేశారు. -
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గురువారం బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో రెండున్నర కిలోల బంగారంతో బోనం తయారు చేయించనున్నట్లు చెప్పారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, సీఈ సీతారాములు, ఈఓ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లి నాయగం, జోనల్ కమిషనర్ రవికిరణ్, వాటర్‌వర్క్స్ జీఎం హరిశంకర్, ఆలయ ట్రస్టీ సాయిబాబాగౌడ్, కమిటీ సభ్యులు అశోక్‌యాదవ్, హనుమంతరావు, ఉమానాథ్‌గౌడ్, బలరాం, శ్రీనివాస్‌గుప్తా, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్) -
నేడు నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/ నర్సంపేట రూరల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరగనున్నాయి. తెలుగు సినిమాలకు వేల పాటలు రాసిన ఆయన.. కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఫిలిం చాంబర్లో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించుకున్నారు. తక్కువ కాలం జీవించి, ఎక్కువ కాలం జీవించే కవిత్వాన్ని రాసిన తెలంగాణ పాటల పూదోట కందికొండ యాదగిరి అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ఈ సందర్భంగా కొనియాడారు. కందికొండ అందరివాడని, ఆయన లేనిలోటు తీర్చలేమని పేర్కొన్నారు. అభిమానుల సందర్శన అనంతరం కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య కందికొండ మృతదేహాన్ని స్వగ్రామం నాగుర్లపల్లికి తరలించారు. మధ్యలో అంబులెన్సును నర్సంపేట పట్టణంలోని అమరువీరుల స్థూపం వద్ద కాసేపు ఆపారు. పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు, కళాకారులు, అభిమానులు పూలు చల్లి నివాళులు అర్పించాక.. నాగుర్లపల్లికి తీసుకెళ్లారు. అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కందికొండ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తాం: తలసాని కందికొండ యాదగిరి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పాటలెన్నో కందికొండ రాశారని.. ఆయన మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. -
మేడారానికి జాతీయ హోదా.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్
సాక్షి, ములుగు జిల్లా: మేడారం జాతరకు జాతీయ హోదా విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ కు జాతీయ హోదా ఇవ్వకుంటే దేనికి ఇస్తారని తలసాని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంలో జరిగే పండుగలకు జాతీయ హోదా ఇస్తారా అని చురకలంటించారు. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పండుగలకు జాతీయ హోదా ఉండదని, మేడారానికి ఇవ్వమని స్పష్టం చేయడంపై స్పందించారు. కేంద్ర మంత్రి తలతోక లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయించి మూడేళ్ళు అవుతుందని, ఇప్పటి వరకు దానికి అతి గతి లేదని అన్నారు. బీజేపీ నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని దుయ్యబట్టారు. జాతరకు జాతీయ హోదా ఉండదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఇంతకముందు మేడారం జాతరకు జాతీయ హోదా ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగలకు జాతీయ హోదా ఎక్కడలేదని, కావాలంటే విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి రేణుకాసింగ్, మాజీ రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్, బిజేపి ఓబిసి సేల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులు రెండేళ్లకోసారి జరుపుకునే ప్రకృతిపండుగ మేడారం జాతర అని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని కరోనా మహమ్మారి మీద విజయం సాధించి, సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకున్నానని పేర్కొన్నారు. చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి? గిరిజన విశ్వవిద్యాలయంకు 45 కోట్లు కేటాయించామని, త్వరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో కేంద్రం మ్యూజియం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం నిధుల కేటాయించిందని వెల్లడించారు.గిరిజనులకు బిజేపి, కేంద్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఏడుగురికి మంత్రులు ఇచ్చి, గిరిజనల అభ్యున్నతికీ ప్రధాని మోదీ దోహదపడుతున్నారని తెలిపారు. చదవండి: మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే? పోటెత్తిన భక్తులు మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క ఆగమనంతో రాత్రి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. దీంతో మేడారం జాతర ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారింది. అటు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వనదేవతలను దర్శించుకొని ఎత్తుబంగారం సమర్పించుకున్నారు. సీఎం వస్తారా? రారా? ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. తోపులాట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను పోలీసులు నేట్టేశారు. దీంతో జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మీడియా ప్రతినిధులను సముదాయించారు. -
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
-
హైదరాబాద్‌లో లాక్డౌన్ పక్కాగా అమలవుతోంది: మంత్రి తలసాని
-
మమ్మల్ని బండబూతులు తిట్టడం సరికాదు: తలసాని
హాలియా : సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమను బండ బూతులు తిట్టడం సరికాదని పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలోని బాధ్యతగల వ్యక్తులు నీచమైన భాష మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్‌లో ఉప ఎన్నికలు ఉన్నందున ప్రచారం ఎవ్వరైనా చేసుకోవచ్చు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడంలో తప్పులేదన్నారు. ఎప్పుడూ నీతి సూత్రాల గురించి మాట్లాడే జానారెడ్డికి ఎలా మాట్లాడాలో తెలియాదా అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లేక, ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల నివారణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్‌కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్తో సబ్బండ వర్గాలకు న్యాయం మాడుగులపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ధర్మాపురం, గోపాలపురం గ్రామాల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జానారెడ్డి 40ఏళ్లుగా చేయలేని అభివృద్ధి ఈ సారి చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతరెడ్డి యాదగిరి రెడ్డి,మాజీ ఎంపీపీ దాసరి నరసింహ్మ,పగిళ్ల సైదులు,రాములు పాల్గొన్నారు. -
హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్‌లు బుధవారం ట్యాంక్ బండ్‌ను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. వరద నీటి దృష్ట్యా నగర వాసులంతా బయటకు రావొద్దని ఇళ్లలోని సురక్షితంగా ఉండాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. (చదవండి: వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) అదే విధంగా జలమండలి ఎండీ దాన కిషోర్ హిమాయత్ సాగర్‌ను సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు. జలాశయం దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ మహాత్మగాంధీ బస్‌స్టాండ్‌లోకి వరద నీరు భారీగా రావడంతో వచ్చిపోయే బస్సులకు ఆటంకం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు) -
ఆ విషయం కూడా తలసానికి తెలియదా?
సాక్షి, హైదరాబాద్ : ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రైవేట్ కంపెనీల కోసం పేదల భూముల్ని లాక్కొంటున్నారని మండిపడ్డారు. దళిత, గిరిజనుల కు మూడు ఎకరాలు ఇస్తామంటూ చెప్పి అవి ఇవ్వకపోగా వారి అసైన్డ్ భూములనే ప్రభుత్వం తీసుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వ భూములను ఫార్మాసిటీ పేరుతో దాదాపు 8వేల ఎకరాలను ప్రభుత్వం ఆక్రమణలోకి తీసుకుందని భట్టి వ్యాఖ్యానించారు. అసలు ఫార్మాసిటీ ద్వారా ఎలాంటి ప్రజా ప్రయోజనాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు సామన్య ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కోవడం దుర్మార్గమన్న భట్టి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తే సహించమన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి తరపున కాంగ్రెస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. (తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు లేఖ) ఫార్మా వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. ఫార్మాసిటీ ని మొత్తం ప్రభుత్వం బ్రోకరేజ్ గా మార్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2.68 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు 2016-17లో నిర్మిస్తామని కేసీఆర్ సభలో వాగ్దానం చేసి మరిచారని విమర్శించారు. ఇప్పుడు అసలు వాటి జాడే లేదని, ఫీల్డ్‌లో ఉన్న 3428 ఇళ్లు మాత్రమే చూపించారని దుయ్యబట్టారు. మంత్రి తలసానికి కూడా ప్రభుత్వం లక్ష ఇళ్లు కూడా కట్టలేదన్న సంగతి తెలియనట్లుందని, కేవలం కాగితపు లెక్కలే చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని సైతం తొలిగించిదని తెలిపారు. (ఆ పార్టీలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి) -
గ్రేటర్ బయట ఇళ్లను చూపిస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తామని చెప్పి మంత్రి, నగర మేయర్ పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘డబుల్’ ఇళ్ల పరిశీలనలో భాగంగా తుక్కుగూడలోని మంకల్‌లో వారంతా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు చూపిస్తామని 3428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. జీహెచ్ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని అన్నారు. గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా? అని ప్రశ్నించారు. (చదవండి: ప్రగతి భవన్: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) మరోవైపు లక్ష ఇళ్ల జాబితా ఇస్తాం.. మీరే చూసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగర శివారులో కట్టిన ఇళ్లు కూడా నగర వాసుల కోసమేనని మంత్రి తెలిపారు. దీంతో స్థలాలు చూపిస్తాం.. నగరంలోనే ఇళ్లు నిర్మించాలని భట్టి మరోసారి సవాల్ విసిరారు. స్థలాలు చూపిస్తే ఇళ్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి తలసాని జవాబిచ్చారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే కాదు.. హైదరాబాద్‌లో అభివృద్ధిని కూడా చూపిస్తామని తెలిపారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం తమకున్నాయని మంత్రి తలసాని మీడియాతో పేర్కొన్నారు. (చదవండి: బస్తీమే.. సవాల్!) -
తలసానితో కలిసి పర్యటించిన భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గురువారం పరిశీలించారు. జియాగూడ, గోడే ఖబర్, అంబేడ్కర్ నగర్లో ఇళ్లను పరిశీలించిన వారిద్దరూ... కట్టెలమండి, సీసీనగర్, కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. కాగా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలపై కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ నేత మధ్య శాసనసభలో నిన్న వాడీవేడీ చర్చ నడిచింది. ప్రభుత్వం కట్టిన ఇళ్లను చూపెట్టాలని భట్టి విసిరిన సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. ఆ మేరకు మంత్రి తలసాని ఈరోజు ఉదయం నేరుగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు తీసుకెళ్లారు. (చదవండి: భట్టి సవాలును స్వీకరించిన తలసాని) ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3,428 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పరిశీలించాం. ఉదయం నుంచి ఇళ్లను పరిశీలిస్తున్నాం. 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఇవాళ నాలుగు చోట్ల తిరిగాం. రేపు ఎల్లుండి ఇళ్లను పరిశీలిస్తాం. మంత్రి తలసాని, మేయర్‌తో కలిసి ఇళ్లను పరిశీలించాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల క్వాలిటీపై ఇంజినీరింగ్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం ఇళ్లు చూశాక నా నిర్ణయం ప్రకటిస్తా. రాజీవ్ గృహకల్ప ఇళ్లు కట్టించి చాలా ఏళ్లయింది. వాటికి వీటికి తేడా చూడాలి’ అన్నారు. కేసీఆరే స్వయంగా డిజైన్ చేశారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. కొల్లూరు, ఎల్బీనగర్, ముషీరాబాద్ లాంటి చోట్ల రేపు పరిశీలనకు వెళతామని చెప్పారు. పేదవారికి గూడు ఉండాలని స్వయంగా సీఎం కేసీఆరే ఈ ఇళ్లను డిజైన్ చేశామని మంత్రి తెలిపారు. మారేడ్ పల్లి అనేది హౌసింగ్ బోర్డ్ స్థలమని, జీహెచ్ఎంసీ దానిని స్వాధీనం చేసుకొని ఇళ్లు కట్టడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. అయినప్పటికీ పేదలందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో వాటిల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పేదవాడు గొప్పగా బతకాలని కోటి రూపాయల విలువ ఉండే ఈ ఇళ్లను ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. పేదల నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మరో 50చోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. (చదవండి: ఎల్ఆర్ఎస్ జీవో 131 ని సవరిస్తూ ఉత్తర్వులు) -
త్వరలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తాం: తలసాని
-
భట్టి ఇంటికి తలసాని
-
గణేష్ ఉత్సవాలపై రేపు తలసాని సమావేశం
-
త్వరలో షూటింగ్స్‌కి అనుకూలంగా జీవో
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సీఎం కేసిఆర్‌గారు కూడా పరిశ్రమ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికిరణ్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్ మాట్లాడుతూ –‘‘తెలంగాణాను సాధించటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కేసిఆర్‌గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమానూ తొలి రోజే చూస్తారు. చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేష¯Œ ్స అంతా కలిసి లీడ్ తీసుకుని సినిమాల చిత్రీకరణ గురించి మాట్లాడటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్ నామా కూడా పాల్గొన్నారు. -
నిత్యావసర సరుకులు అందజేత...
సినీ–టీవీ కార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు తలసాని సాయికిరణ్ ‘తలసాని ట్రస్ట్’ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకు వచ్చారు. 12 వేల మంది సినీ, 2 వేల మంది టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం అందించే ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, సి.కళ్యాణ్ , ‘దిల్’ రాజు, కొరటాల శివ,రాధాకృష్ణ, రామ్మోహన్రావు, తలసాని సాయి చేతుల మీదుగా ఆయా యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనాల్సి ఉంది. అయితే సమీప బంధువు చనిపోయిన కారణంగా హాజరు కాలేకపోయానని చిరంజీవి తెలిపారు. -
సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్ పాలసీ
‘‘సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టబోతున్నాం’’ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా, టీవీ షూటింగ్ అనుమతులు, థియేటర్ల రీ ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్ల ప్రతినిధులతో తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు గురువారం సమావేశం నిర్వహించారు. సినిమా థియేటర్లకు ప్రత్యేక విద్యుత్ టారిఫ్, ఫ్లెక్సీ టికెటింగ్ ధరలు, ఆన్లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ‘‘సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీలో ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరగుతుంది’’ అని తలసాని చెప్పారు. సినీ రంగానికి చెందిన ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, థియేటర్లలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా, పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. ఈ సమావేశంలో నటుడు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్. శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సి. కళ్యాణ్, కేఎస్ రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ల ప్రతినిధులు బాపినీడు, పి. కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పీపుల్స్ ప్లాజాలో చికెన్, ఎగ్ మేళా
-
కోవిడ్ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’
సాక్షి, హైదరాబాద్: చికెన్ తింటే కరోనా వైరస్ (కోవిడ్-19) వస్తుందనే అసత్య ప్రచారాలను నమ్మొద్దని, కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో.. భారత్‌లో కోడి మాంసం తిని ఎవరూ చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ఆసత్య ప్రచారాలను తిప్పికొంట్టేందుకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ ఎగ్స్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న పలు ఉదంతాల నేపథ్యంలో చికెన్, గుడ్ల విక్రయాలు, వినియోగం తగ్గిపోయింది. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి వ్యయం రూ.77 ఉంటే రూ.30 నుంచి 35 అమ్మాల్సి వస్తుంది. గుడ్డు ఉత్పత్తి రూ.4 ఉంటే 2.80 చొప్పున విక్రయించాల్సి వస్తుంది. గత రెండు మాసాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది’అని ఈటల పేర్కొన్నారు. చికెన్ ఎగ్స్ మేళాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రకాల వంటకాలు.. గంగ పుత్రులు, ముదిరాజులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్లో జరగుతున్న ఫిష్ ఫెస్టివల్లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఫెస్టివల్ లో 100రకాల చేపల వంటకాలు ఉన్నాయని తెలిపారు. బేగం బజార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రభుత్వం పెద్ద చేపల మార్కెట్ కట్టిస్తుందని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్‌కు ఒక ఔట్ లెట్ ఇస్తున్నామని చెప్పారు. చేపలు,చికెన్ తింటే కరోన వైరస్ రాదని మంత్రి స్పష్టం చేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్ -
మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ ఫైన్
-
రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి పేరొస్తుంది
-
మంత్రి తలసానికి జరిమానా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం రూ.5వేల జరిమానా విధించింది. ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నెక్లెస్‌రోడ్ సర్కిల్ వద్ద అనధికారికంగా భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసినందుకు జారీ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే సర్.. ఉయ్ లవ్ కేసీఆర్..’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట ఈ కటౌట్ ఉండటంతో ఆయనకు చలానా జారీ చేశారు. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల చిత్రాలు ఉన్నాయి. ఈ అనధికార హోర్డింగ్‌వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ‘సురక్ష యోజన వెల్ఫేర్ సొసైటీ’ ట్విటర్ ద్వారా జీహెచ్ఎంసీ కమిషనర్, టీఆర్ఎస్ పార్టీ, సీఎంవో కార్యాలయం, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌యాదవ్‌ల పేరిట పోస్ట్చేసింది. ఈవీడీఎం డైరెక్టర్‌తో పాటు మరికొందరు జీహెచ్ఎంసీ అధికారులు, మున్సి పల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌లకు కూడా కాపీ పోస్ట్ చేసింది. చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని కోరడంతోపాటు తీసుకున్న చర్యల నివేదికను కూడా పంపాలంది. దీంతో ఈవీడీఎం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరు, ఇంటిచిరునామాలతోనే చలాన్‌ను జారీ చేసింది. ఇందుకు రూ.5 వేలను మంత్రి చెక్కు ద్వారా చెల్లించినట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి తెలిపారు. సోషల్ మీడియాలో చర్చ... ఈ అంశంపై సోషల్‌మీడియాలో పలువురు స్పందించారు. చలానా వేయడం బాగానే ఉంది కానీ పెద్దవ్యక్తులకు ఇంత తక్కువ వేస్తే.. ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయని, వారిష్టమొచ్చినట్లు హోర్డింగులు పెడుతూనే ఉంటారని కొందరు స్పందించారు. వారి ఆదాయాన్ని బట్టి చలానా వేయాలని సూచించారు. స్థితిమంతులైన వారు బాగానే ఉంటారు కానీ హోర్డింగు మీదపడ్డ వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. పేదలను టెన్షన్‌కు గురిచేయొద్దన్నారు. అవసరమైతే రూల్స్ మార్చాలన్నారు. ఏ4 సైజున్న ప్రకటనకు, భారీ హోర్డింగుకూ ఒకే విధంగా పెనాల్టీలేంటని ప్రశ్నించారు. డ్రంకన్ డ్రైవ్ తరహాలో నిబంధనలు ఉండాలని సూచించారు. అమాయక ప్రజలపై పడకముందే దాన్ని అక్కడినుంచి తొలగించాలని కొందరు కోరారు. ఏర్పాటు చేసిన వారే తొలగించేలా ఏర్పాట్ల చేయాలని ఇంకొందరు సూచించారు. నిబంధనల మేరకే... చట్టం, నిబంధనల మేరకే తాము చలానాలు విధిస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ స్పష్టం చేశారు. అనధికార బోర్డు, కటౌట్, ఫ్లెక్సీ ఏదైనా, ఎంత సైజుదైనా రూ.5 వేల జరిమానానే ఉందన్నారు. ఈవీడీఎం విభాగం ఇష్టానుసారంగా చలానాలు విధిస్తోందని ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో పలువురు ధ్వజమెత్తడం తెలిసిందే. కాగా, ఫ్లెక్సీ విషయంలో వివాదం తలెత్తడంతో తలసాని ఏర్పాటు చేసిన కేసీఆర్ కటౌట్‌ను అధికారులు తొలగించారు. -
కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం:తలసాని
సాక్షి, ఉండి: సంక్రాంతి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటుచేసిన కోడిపందాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమని అన్నారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని కొనియాడారు. కోడిపందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని ప్రశంసించారు. -
సంక్రాంతి 2020; పందెం రాయుళ్ల అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి/పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ఈసారి కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాల జాడేలేకుండా పోయింది. గతంలో కోడి పందేల బరుల వద్దే అనధికారికంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. దాంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి పెద్ద ఎత్తున ఆడేవారు. కాగా, 2020 సంక్రాంతి సంబరాల్లో జూదాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల చర్యలు ఫలించాయి. ఇక సంప్రదాయ కోడి పందాల్లో కత్తి కట్టడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. మూడు రోజులపాటు సరదాగా గడిపేందుకు, ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ కోడి పందేల్ని వీక్షించేందుకు వచ్చామని ఔత్సాహికులు వెల్లడించారు. అయితే, అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (చదవండి : కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె) బరిలో నిలిచిన పందెం కోళ్లు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజు కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. భీమవరం, నరసాపురం, ఆచంటతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 100కు పైగా బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఉంగుటూరు మండలం గొల్లగూడెం, బాదంపూడి, నల్లమాడు గ్రామాల్లో కోడిపందాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. 3 కోళ్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసుల అరెస్టు చేశారు. రూ. 4780 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉండి సంక్రాంతి సంబరాల్లో తలసాని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పా ప్రభుత్వం మారుతుందని. మా రాష్ట్రం నుంఛఙ ఒకాయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాం అలాగే ఇచ్చాం. ఒక పెద్ద భవనం కట్టి హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పుకునే తిరిగి ఒకాయన మూలన పడ్డాడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం మంచి పరిణామం. కేసు నమోదు.. సాక్షి, చిత్తూరు : పీలేరులో రెండుచోట్ల (జాండ్ల, యర్రగుంట్ల వద్ద) కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని చుట్టుముట్టి 10 మంది పందెం రాయుళ్లని, 2 కోడి పుంజులను లక్షా వెయ్యి రూపాయల నగదు , 54 కోడి కత్తులు, ఒక కారు , రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని బి.కొత్తకోటలో ఆరు మంది పందెం రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి.. రెండు కోళ్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.15 వేల 620 ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వాజేడు మండలానికి సమీపంలో ఉన్న చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. పందాల్లో పాల్గొనేందకు రాష్ట్రం నుంచి గుట్టుగా పోయేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. అసలే ఏజెన్సీ అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో.. పోలీసులకు కోడి పందాల కట్టడి చేయడం కష్టతరంగా మారింది. -
వారం రోజుల్లో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా వారం రోజుల్లో సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, దీంతో ఎంతో సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. షూటింగ్‌ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్ని శాఖలు అందజేశాయని, మరికొన్ని శాఖలు ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్డీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎఫ్డీసీ సీఐవో కిషోర్‌బాబు,పలువురు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఆ నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల నేపథ్యంలో మంత్రి తలసాని అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ప్రజా పతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. గణేష్ ఉత్సవ సమితితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాని,హైదరాబాద్‌లో 54 వేల వినాయక ప్రతిమలను పూజలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని, అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తరపున హుస్సేన్ సాగర్‌లో గంగ హారతి ఇస్తామని, హారతి ఎప్పుడనే అంశంపై పురోహితులను చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వ్యాఖ్యనించారు. నిమజ్జనం కోసం 26 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సోమవారం ఖైరతాబాద్ గణేష్ పనులను పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సర్వ మతాలను గౌరవించే నగరమని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. బందోబస్తు విషయంలో రాజీ పడేది లేదన్నారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ముంబైలో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరిగేవని, అయితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పండుగ విజయవంతంగా జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రానున్న గణేష్ ఉత్సవాల పై అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామని, మునుపెన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పండుగలను ఆదరిస్తూ చాలా గొప్పగా జరుపుతున్నారని కొనియాడారు. -
ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్న కేసీఆర్
రాంగోపాల్‌పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు తెల్లవారుజాము 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు, రంగం వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో రెండువేల మంది సిబ్బందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారికి శాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారీ ఊరేగింపు వంటి ప్రధాన ఘట్టాలు రెండు రోజులపాటు కొనసాగుతాయి. గతేడాది ఘటోత్సవం నుంచి రంగం వరకు 15 రోజుల పాటు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 25 లక్షలు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే కనీసం 5 లక్షల మందికి పైగా దర్శనానికి వస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
మహా ప్రసాదం
-
చేపప్రసాదం.. భారీగా జనం
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా బాధితులకోసం బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదం పంపిణీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే చేపప్రసాదంకోసం జనం భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆస్తమా వ్యాధిగ్రస్తులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడింది. శుక్రవారం రాత్రి నుంచే ఆస్తమా బాధితులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకున్నారు. ఈసారి మృగశిరకార్తె సాయంత్రం ప్రవేశించిన దృష్ట్యా చేపప్రసాదం పంపిణీ కూడా సాయంత్రం ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బత్తిన హరనాథ్గౌడ్, ఆయన కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు మంత్రి తలసాని ఆస్తమా వ్యాధి బాధితులకు చేపప్రసాదం అందజేసి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 173 ఏళ్లుగా, మూడు తరాలుగా బత్తిన సోదరులు చేపప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే చేప ప్రసాదం అనేది తెలంగాణలో పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఆదివారం కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ కొనసాగనున్న దృష్ట్యా ప్రజలు ఓపిగ్గా వేచి ఉండాలన్నారు. ఆస్తమా బాధితులు ప్రతి ఒక్కరికీ చేపప్రసాదం లభించే విధంగా మందు తయారు చేసినట్లు బత్తిన హరనాథ్గౌడ్ తెలిపారు. అందరూ చేప ప్రసాదం తీసుకొనే వెళ్లాలన్నారు. ఆదివారం తరువాత మరో రెండు రోజులపాటు తమ ఇంటి వద్ద ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు. తాము సూచించిన నియమాలకు అనుగుణంగా చేపప్రసాదం సేవిస్తే ఆస్తమా నయమవుతుందన్నారు. గత సంవత్సరం సుమారు 70 వేల మందికి పంపిణీ చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య లక్షకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచే ఎక్కువ సంఖ్యలో.... జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు, హేతువాదులు, వైద్యనిపుణులు చేపప్రసాదం అశాస్త్రీయమని ప్రచారం చేస్తున్నప్పటికీ జనంలో ఆదరణ మాత్రం తగ్గడం లేదు. చేపప్రసాదం రూపంలో అందజేసే మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి బాధితులు వచ్చారు. తప్పని పడిగాపులు...: ఇలా ఉండగా ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లు మాత్రం క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడేందుకు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కూపన్ల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం 6 గంటలకు పంపిణీ ప్రారంభమైంది. దీంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చి ంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పత్యం పాటించాలి: బత్తిన సోదరులు చేప ప్రసాదం తీసుకున్న ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు కొన్ని సూచనలు చేశారు. వారు పత్యం పాటించాలన్నారు. మందు స్వీకరించిన తర్వాత గంటన్నరపాటు ఏమీ తినరాదన్నారు. మందును ఆరు మాత్రలుగా చేసి నీడలో 7 రోజులపాటు ఎండబెట్టాలన్నారు. వీటిని మూడు సార్లు 23 జూన్, జూలై 8, జూలై 23వ తేదీల్లో ఉదయం పరగడుపున ఒక మాత్ర, నిద్రబోయే ముందు ఒకటి గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి.45 రోజుల పాటు కింద పేర్కొన్న వస్తువులనే వాడాలి. పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామకూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వగరు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, ఆవు నెయ్యి, మోసంబీలు (బత్తాయిపండ్లు), ఆన్జీర్ పండ్లు, ఆవుపాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. స్నేహితుల సహకారంతో తెలుసుకున్నాను స్థానిక ఆస్పత్రులు, పలు రకాల మూలికలు తీసుకున్నప్పటికి ఆస్తమా తగ్గలేదు. ఆస్తమా రోగులకు హైదరాబాద్ నగరంలో ప్రతి యేటా ఉచితంగా చేప ప్రసాదం అందిస్తారనే విషయాన్ని స్నేహితుడి ద్వారా తెలుసుకొని ఇక్కడకు వచ్చాను. – దిలీప్, ఉత్తరప్రదేశ్ మొదటి సారిగా వచ్చాను గత రెండు సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. ఉబ్బసం తగ్గేందుకు హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారన్న విషయం తెలుసుకొని రెండు రోజుల ముందే ఇక్కడికి వచ్చాను. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, అధికారుల ఏర్పాట్లు బాగున్నాయి. – భవానీ శంకర్, రాజస్థాన్ -
సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు రూ.10వేల కోట్లతో శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఐదేళ్లలో బలమైన అడుగులు వేయగలిగామని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఐదేళ్లలో బలమైన పునాదులు పడ్డాయన్నారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉండేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. గతంలో నెలకొన్న సమస్యల వలయం నుంచి బయటపడడమే కాకుండా.. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడకు వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి.. తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తమవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సృష్టించిన సంపద అంతా సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికన సమస్త ప్రజానీకానికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనలతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. ‘రైతుబంధు’ ఆనందాన్ని నింపింది.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి.. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని, దీంతో రైతుల మోములో ఆనందాన్ని చూడగలుగుతున్నామన్నారు. రైతులకు రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కింద తొలకరికి ముందే ఏడాదికి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. జిల్లాలో 2,67,202 మంది రైతులకు మొదటి విడతగా.. రూ.257.75కోట్లు అందించినట్లు తెలిపారు. రబీకి సంబంధించి ఇప్పటివరకు 2,47,835 మంది రైతులకు.. రూ.250.53కోట్లు అందించామన్నారు. భూ రికార్డుల నవీకరణలో భాగంగా జిల్లాలో 9.57 లక్షల ఎకరాల భూముల రికార్డులు ఆధునికీకరించారని చెప్పారు. 380 రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా నిర్వహించారని, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా రెండు విడతల్లో 2,71,574 పాస్ పుస్తకాలను రైతులకు అందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో చాలామంది సన్న, చిన్నకారు రైతులు ఉన్నారని, పేద రైతులు చనిపోతే ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి.. రైతుకు బీమా పట్టా అందిస్తున్నట్లు తెలిపారు. రైతుకు రూ.5లక్షల బీమా కల్పించి.. వారు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వివరించారు. 2,464 ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి.. డబుల్ బెడ్రూం పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాకు 14,560 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటివరకు 6,397 గృహాల పనులు చేపట్టి.. 2,464 గృహాల సముదాయాలను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 750 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక రోడ్ల నిర్మాణం, విస్తరణ కోసం సమగ్ర విధానంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ.43కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లను రెండు వరుసల రహదారులుగా విస్తరింపజేశామన్నారు. అలాగే రెండు వరుసల రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకుగాను.. రూ.165కోట్లు ఖర్చు చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.213కోట్లతో 58 పనులు చేపట్టామన్నారు. జిల్లాలో రూ.120కోట్లతో 17 వంతెనలు, చెక్‌డ్యాంలు, రూ.77కోట్లతో ధంసలాపురం వంతెన పనులు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. సీఆర్ఎఫ్, ఎస్సీఎస్డీఎఫ్, ఎస్టీఎస్డీఎఫ్కు సంబంధించిన పనుల్లో భాగంగా జిల్లాలో రూ.438కోట్లతో 127 పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అధునాతన వైద్య సేవలు.. ప్రజలకు ఆధునిక పరిజ్ఞానంతో అధునాతనమైన వైద్య విధానంతో మెరుగైన వైద్య సేవలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆస్పత్రుల్లో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రతకుగాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి మన జిల్లా పెద్దాస్పత్రికి రెండుసార్లు కాయకల్ప అవార్డు లభించిన విషయం అందరికీ తెలుసన్నారు. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి ప్రసవం జరిగి.. తల్లీ–బిడ్డను ఇంటికి చేర్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 8,863 కేసీఆర్ కిట్లను అందించినట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో నూతన ఒరవడిని సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాధ్యమంలో నాణ్యమైన బోధనతోపాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా 2019 మార్చి వార్షిక పరీక్షల్లో 92.43 శాతం ఫలితాలను సాధించినట్లు గుర్తు చేశారు. వయోజన విద్యలో భాగంగా జిల్లాలో 15 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న 2వేల మందిని నిరక్షరాస్యులుగా గుర్తించి.. వీరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రగతి.. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్య ప్రగతి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.29కోట్లతో 13 (33/11కేవీ) సబ్స్టేషన్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.17.58కోట్లు విడుదల చేశామన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి కోసం రూ.125లకే విద్యుత్ కనెక్షన్లు అందించామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. 2018–19లో రూ.137కోట్లతో 71 నూతన పరిశ్రమలను స్థాపించామని, తద్వారా 1,235 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 332 గొర్రెల పెంపకం సహకార సంఘాలను ఏర్పాటు చేసి.. 34,258 మంది సభ్యులను నమోదు చేశారని తెలిపారు. ఇప్పటివరకు 15,357 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.143.97కోట్లతో గొర్రెల యూనిట్లను అందించినట్లు తెలిపారు. వీటితోపాటు ఉద్యానవన,, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చి.. పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక ఖమ్మం నగర ప్రజల అవసరాలకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, 2017–18లో నగరంలో దాదాపు రూ.17.65కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో రూ.101.44కోట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. నగరంలోని లకారం చెరువును రూ.4కోట్లతో సుందరంగా తీర్చిదిద్ది.. ప్రజలకు ఆహ్లాద వాతావరణం కలిగించే ప్రాంతంగా మార్చామన్నారు. రూ.56కోట్లతో గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. తొలుత నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి, బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఖమ్మం, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నగర పాలక సంస్థ మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జేసీ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్లు హన్మంతు కొడింబా, ఆదర్శ్ సురభి, జెడ్పీ సీఈఓ ప్రియాంక, కార్పొరేషన్ కమిషనర్ జె.శ్రీనివాసరావు, డీఆర్వో శిరీష, కలెక్టరేట్ ఏఓ మదన్‌గోపాల్, డీఆర్డీఓ బి.ఇందుమతి, ఖమ్మం రూరల్ తహసీల్దార్ అశోక్ చక్రవర్తి, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ పోరాటయోధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మంత్రులకు షాక్!
కంటోన్మెంట్: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలో నిలచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయా పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ స్థానాల్లోనే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగించలేకపోయింది. ఆయా మంత్రులు ఓటేసిన బూత్‌లలోనూ టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కకపోవడం గమనార్హం. మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌లో నివాసముండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్‌ల ఓట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కస్తూర్బా కాలేజీలోని పోలింగ్ బూత్ నెం.220లో ఉన్నాయి. ఈ బూత్‌లో బీజేపీకి 395, కాంగ్రెస్‌కు 153 ఓట్లు రాగా... టీఆర్ఎస్కు కేవలం 89 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీతో పోలిస్తే టీఆర్ఎస్ 306 ఓట్లు తక్కువ రావడం గమనార్హం. ∙మంత్రి మల్లారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ స్కూల్లోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 207 ఓట్లు రాగా... మంత్రి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి 179 ఓట్లు దక్కాయి. ఈ బూత్‌లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్కు 28 తక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీ సైతం ఈ బూత్‌లో 169 దక్కించుకోవడం గమనార్హం. -
చిన్న సినిమాలను ఆదరించాలి
‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇండస్ట్రీ కూడా ప్రాంతాల విభేదం లేకుండా ప్రతిఒక్కరినీ ఆదరించాలి. సినిమా ఇండస్ట్రీ అనేది లక్షలాదివాళ్లకి ఉపాధి కల్పిస్తు్తంది. చిన్న సినిమాలకు ప్రమోషన్ ఎంతో అవసరం. అందరం చిన్న చిత్రాలను ఆదరించాలి’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీకాంత్, మేఘాచౌదరి, అభయ్ ముఖ్య పాత్రల్లో జైరాజాసింఘ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభయ్ అదాక నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీకి ఎంతమంది కొత్తవారు వస్తే అంత కొత్త కథలు వస్తాయి. అభయ్‌కి, జైరాజాసింఘ్కి ఈ సినిమా మొదటి చిత్రంలా లేదు. ఎంతో అనుభవం ఉన్నవారిలా తీశారు. ‘జెర్సీ’ సినిమా కూడా చాలా బావుంది. ‘మార్షల్’ చిత్రం మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. అభయ్ మాట్లాడుతూ– ‘‘ఒక నటుడిగా, నిర్మాతగా నా ప్రయత్నం వెనుక ముందునుంచి నా వెన్నంటే ఉన్న తలసానిగారికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ అన్న కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. జయ్‌రాజ్ తన సొంత సినిమాలాగా చేశారు’’ అన్నారు. ‘‘మెడికల్ యాక్షన్ మూవీ ఇది. ఒక మనిషి ఇంత ఈజీగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఒక సైంటిస్ట్. అందులోంచి వచ్చిన కథే ‘మార్షల్’ అన్నారు జైరాజాసింఘ్. ‘‘నేను కథ విన్నాక రెండురోజులు టైం అడిగి ఓకే చెప్పాను. పైగా కొత్త దర్శకుడుకి అవకాశం ఇవ్వాలనుకున్నా. ఈ సినిమా చూశాక తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు’’ అని శ్రీకాంత్ అన్నారు. మేఘాచౌదరి మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, నేపథ్య సంగీతం: కె.జి.ఎఫ్.రవిబాసుర్, కెమెరా: స్వామీ ఆర్.ఎం. -
‘హైటెక్‌సిటీకి ఫౌండేషన్ ఎవరు వేశారో చూపిస్తా’
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్ధం కావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం నిధులు ఇస్తుందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అల్లుడిగా నీవు(చంద్రబాబు) వచ్చినపుడు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది మేమే.. నేను హుందాగా మాట్లాడుతా అని చంద్రబాబు అంటున్నారు.. హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా చంద్రబాబు’ అని తలసాని ప్రశ్నించారు. ప్రధానికి, మాకు లింక్ ఎందుకు పెడుతున్నారని తలసాని అడిగారు. చంద్రబాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, చంద్రబాబు వద్ద మేము పనిచేశామని ఆయన గురించి మాకు బాగా తెలుసునని తలసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వస్తే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి ఎక్కడ ఫౌండేషన్ వేశారో చూపిస్తానని సవాల్ విసిరారు. ఒడిశా, కలకత్తా వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందని అన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డే మొదలు పెట్టారని, నదుల అనుసంధానం కూడా 80 శాతం రాజశేఖర్ రెడ్డియే చేశారని వ్యాఖ్యానించారు. -
తిట్టలేదనే వారి బాధ: తలసాని
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభలో తమని తిట్టలేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నట్టున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిట్టలేదనే బాధతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. వాస్తవాలు చూడటానికి రాష్ట్రంలో కంటివెలుగు శిబిరాల్లో కంటి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ సభలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవడానికి నిబంధనలున్నాయనే విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మ య్యకు సొంత ఊరిలోనే పరపతి లేదన్నారు. కాంగ్రెస్ దిక్కూదివానం లేని పార్టీ అని, ఆ పార్టీ నేతలకు బుద్ధి లేదని విమర్శించారు. లెక్కలు తేల్చుకుందామా? మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదా, సాగుకు 24 గంటలు కరెంటు అందడం లేదో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి ఇచ్చారో, టీఆర్ఎస్ హయాంలో ఎందరికి ఇస్తున్నామో లెక్క తేల్చుకుందామా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారి చెప్పడం సాధ్యం కానన్ని ఉన్నాయన్నారు. దళితులకు మూడెకరాల భూమి గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి సమాచారం తెప్పించుకుని చూడాలన్నారు. కేసీఆర్ హఠావో అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందా అని ప్రశ్నించారు. వీహెచ్‌ను కాంగ్రెస్ నేతలే పట్టించుకోరని, ఆయన టీఆర్ఎస్పై విమర్శలు మానుకోవాలని సూచించారు. డబ్బు మూటలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సభలన్నా, ఎన్నికలన్నా మీకు వణుకు.. కాంగ్రెస్ నేతలకు సభలన్నా, ముందస్తు ఎన్నికలన్నా భయమని తలసాని విమర్శించారు. ఎన్నికలు ముం దొచ్చినా, వెనుకొచ్చినా టీఆర్ఎస్దే విజయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలే బాగుపడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టు టీఆర్ఎస్ పాలిస్తుందా అని ప్రశ్నిం చారు. తెలంగాణలో ప్రజల కోసమే అప్పు చేస్తున్నామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల గుండెల్లో ప్రగతి నివేదన సభ రైళ్లు పరిగెత్తించిందన్నారు. కమీషన్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని తలసాని విమర్శించారు. -
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. సోమ వారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదని, కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాల్లో కూరుకుపోయిందన్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా అది పనిచేయదని, గుడ్ గవర్నెన్స్‌తో అవన్నీ గాలికి కొట్టుకుపోతాయని అన్నారు. ధర్మరాజు గురించి కథలుగా విన్నామని, అప్పుడు ఆ ధర్మరాజు ఏం చేశారో మనకు తెలీదు కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం ధర్మరాజు అని తలసాని అభివర్ణించారు. బీసీ వర్గాలకు ఎవరూ చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని, స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం, బీసీలకు మరిన్ని పథకాలు ప్రకటిస్తారన్నారు. రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్లనీయకుండా తామేమీ చేయడం లేదనీ, ఒకప్పుడు మంత్రి హరీశ్‌రావును కూడా ఉస్మానియాలోకి వెళ్లకుండా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. -
జులై 15 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం
-
సినీ సమస్యలపై హై లెవెల్ కమిటీ వేయండి
సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మహిళా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలసి వినతి పత్రం అందజేశాయి. చిత్ర పరిశ్రమలోని కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింప చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. స్పందించిన మంత్రి.. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని, సమస్యలపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో పీవోడబ్లు్య నాయకురాలు సంధ్య, సామాజికవేత్త సుజన, న్యాయవాది సుజన, భూమిక, ఆశ, రజియా, కళావతి, సృజన, సుమిత్ర, ఝాన్సీ తదితరులు ఉన్నారు. -
'అసత్యాలు మాట్లాడితే కేసు పెట్టే చట్టం'
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విధి లేకే సోనియా తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 కాదు .. కనీసం 7 సీట్లు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్నారు. గ్రేటర్ లో ఒక్క సీటు కూడా గెలవని మీరు ప్రత్యామ్నామయా అని తలసాని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. అసత్యాలు మాట్లాడితే కేసు పెట్టే చట్టం తీసుకువస్తామన్నారు. నోటికి వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తలసాని హెచ్చరించారు. మరో వైపు పొత్తు పెట్టుకోకుండా బీజేపీ 10 స్థానాల్లో ఎపుడు గెలవలేదని తెలిపారు. -
జూన్ 20 నుంచి గొర్రెల పంపిణీ
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 20న ప్రారంభించనున్నట్లు పశుసం వర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు విధివిధానాలపై సోమవారం మంత్రి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల పంపిణీని జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభిస్తారనే సమాచారం త్వరలోనే తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఈ సంవ త్సరం 2లక్షల కుటుంబాలకు, వచ్చే ఏడాది మిగిలిన 2లక్షల కుటుంబాలకు గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు తహసీల్దార్,ఎంపీడీవో, పశువైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ పనిచేస్తుందని వివరించారు. 20 నుంచి వర్క్‌షాప్‌లు... ఈ పథకంపై ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. మే 1 నుంచి 10 వ తేదీ వరకు పశుసంవర్థకశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రామాల్లో గొల్ల, కుర్మలను రూ.51 రుసుముతో సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. సొసైటీలులేని గ్రామాల్లో నూతన సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. అదే నెల 10 నుంచి 20 వరకు గ్రామసభలు నిర్వహించి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నూతనంగా రానున్న 40లక్షల గొర్రెలకు దాణా కొరత ఏర్పడ కుండా చూడాలన్నారు. గడ్డి విత్తనాలు, చాప్ కట్టర్లపై సబ్సిడీ గొర్రెలకు దాణా కొరత ఏర్పడకుండా 75% సబ్సిడీపై గడ్డి విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. గడ్డిని కత్తిరించే చాప్కట్టర్లను కూడా 75% సబ్సిడీపై అందజేస్తామన్నారు. గొర్రెల మంద వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిం చేలా నియోజకవర్గానికి సంచార పశువైద్య శాల త్వరలో అందుబాటులోకి వస్తుందన్నా రు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేస్తామన్నారు. -
బీజేపీ నేతలు పిచ్చిమాటలు మానాలి
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల అంశంపై బీజేపీ నేతలు పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలు తీరు గురించి తెలుసుకుని కిషన్ రెడ్డి మాట్లాడాలని తలసాని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోను వందశాతం అమలు చేశామని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించినంత మాత్రానా బీజేపీ నేతలు పెద్దవాళ్లు కాలేరని తలసాని అన్నారు. -
సబ్సిడీపై గొర్రె పిల్లల పంపిణీకి నిధులు
బడ్జెట్లో కేటాయింపులు: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: గొల్ల, కుర్మల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేసేందుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిందని పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో తలసాని అధ్యక్షతన మంత్రివర్గ ఉపసం ఘం భేటీ అయింది. ఈ సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజ య్యయాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డైరెక్టర్ వెంకటే శ్వర్లు, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ హాజరైయ్యా రు. అనంతరం తలసాని మాట్లాడుతూ... కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల వ్యయంతో (20+1యూనిట్‌గా) గొర్రె పిల్లలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. అందులో 2 లక్షల కుటుంబాలకు ఈ సంవత్సరం, మిగిలినవారికి వచ్చే ఏడాది గొర్రె పిల్లలను పంపిణీ చేస్తామన్నారు. -
రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ
⇒ గొర్రెలు, మత్స్యరంగాల అభివృద్ధి ఉపసంఘం సిఫారసు ⇒ 4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 4 లక్షల కుటుంబాలకు రూ. 5 వేల కోట్లతో 75 శాతం సబ్సిడీపై 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని గొర్రెలు, మత్స్యరంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో రెండోసారి సమావేశమైంది. ఈ ఉపసంఘంలో మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశానికి జూపల్లి మినహా సభ్యులంతా హాజర య్యారు. సభ్యులు పలు అంశాలపై చర్చించి ముఖ్యమంత్రికి సమర్పించనున్న నివేదికలో ఈ మేరకు సిఫారసు చేయనున్నారు. రాష్ట్రంలో 4 లక్షల యాదవ, కురుమ కుటుం బాలు ఉండగా... ఇందులో 2 లక్షల కుటుం బాలకు ఈ ఏడాది 20+1(20 గొర్రెలు, 1 గొర్రెపోతు) చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. మిగిలిన 2 లక్షల కుటుంబాలకు వచ్చే ఏడాది పంపిణీ చేయాలని సూచించిం ది. లబ్ధిదారులు గొర్రెల పెంపకం సొసైటీల్లో సభ్యత్వం కలిగి ఉండాలని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి గొర్రెల ను కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ప్రాంతంలోనే గొర్రెలకు ఇన్సూరెన్స్ ట్యాగ్ వేస్తారు. కిలోల లెక్కన ధరను నిర్ణయించా లని... లబ్ధిదారుల ఎంపికకు సరైన మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలవాలని ఉపసంఘం స్పష్టంచేసింది. టెండర్‌ను దక్కించుకున్న వారే లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలను సరఫరా చేస్తారు. ఒక్కొక్క యూనిట్ ధర రూ. 1.25 లక్షలు. అసలు గొర్రెలు లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. మత్స్యశాఖపై జరిగిన చర్చలో భాగంగా సభ్యత్వ నమోదు... ఇతర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవ ర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికీ లబ్ధి...
ఆ మేరకు పాడి, మత్స్య, పశుసంవర్ధక నిధులు: తలసాని సాక్షి, హైదరాబాద్: ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా పాడి, మత్స్య, పశుసంవర్ధక విభా గాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించను న్నట్లు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాల యంలో ఆ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేష్‌చందా, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మత్స్య శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పశుసంవర్ధక, పాడి, మత్స్య, గొర్రెలకు సంబంధించి వచ్చే బడ్జెట్లో ఏవిధమైన కార్యక్రమాలు చేపట్టాలి, అవసరమైన నిధులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఆ వివరాలను మీడియాకు వివరించారు. ప్రతి జిల్లాలో ఐదు మత్స్య మార్కెట్ల ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని తలసాని చెప్పారు. త్వరలో రెండు ఫిషరీస్ కళాశాలలు రాష్ట్రంలో రెండు ఫిషరీస్ కళాశాలలను త్వర లో ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే కాలం లో గ్రామాల్లోని చిన్న చెరువులు, రిజర్వాయ ర్లు, మిషన్ కాకతీయ చెరువులలో పెద్దఎత్తున చేప పిల్లలను పెంచాలని కార్యాచరణ ప్రణా ళిక రూపొందించామన్నారు. మత్స్యశాఖలో ఖాళీల భర్తీతో పాటు అదనపు పోస్టుల మంజూరు, కొత్త మార్కెట్ల ఏర్పాటు, ఆధునీ కరణ చేపట్టి రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతా లకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాదులో చేపల మోడల్ మార్కెట్ల ఏర్పాటుకు సంబం ధించి సంక్రాంతి అనంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామన్నారు. గతంలో మత్స్య శాఖకు రూ.5కోట్లు కేటాయిస్తే రూ.కోటి కూడా ఖర్చు చేసేవారు కారని, ప్రస్తుతం రూ.101 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. పశు సం వర్ధక శాఖ ద్వారా 100 మొబైల్ వాహనాలను మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. విజయ డెయిరీ తెలంగాణ అవుట్లెట్లను పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, హైవేల వద్ద పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. గోపాల మిత్ర సర్వీసులను విస్తృతంగా వినియోగిం చుకుంటామని తలసాని వెల్లడించారు. -
గాంధీభవన్‌లో పనికిమాలినవారు చేరారు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజలను సీఎం కలవడంలేదని విమర్శించడం సమంజసమా అని నిలదీశారు. గాంధీభవన్‌లో పనికిమాలినవారందరూ చేరారని తలసాని అన్నారు. బుద్ధిలేని కాంగ్రెస్ నేతలు తమపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తమను విమర్శించేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. -
రైతులందరికీ పాడి ప్రోత్సాహకం
- త్వరలో నిర్ణయం... మంత్రి తలసాని వెల్లడి - పశువ్యాధులు లేని ప్రాంతంగా తెలంగాణకు గుర్తింపు సాక్షి, హైదరాబాద్ విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు లీటరుకు ఇస్తోన్న రూ. 4 ప్రోత్సాహకాన్ని ఇతర రైతులందరికీ వర్తించేలా త్వరలో జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 3.80 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచేందుకు వాల్ పెయింటింగ్, హోర్డింగ్స్ ద్వారా విస్త్రృత ప్రచారం కల్పిస్తామన్నారు. జాతీయ రహదారులు, పర్యాటక ప్రాంతాల్లో ఔట్లెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమిళనాడు, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. పాలు, పాల ఉత్పత్తుల్లో కల్తీని నివారించేందుకు ఫుడ్‌సేఫ్టీ, ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఏ విధమైన పశు వ్యాధులు లేని ప్రాంతంగా పారిస్‌లోని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ గుర్తించిందని పశుసంవర్థకశాఖ వెల్లడించారు. ఆంత్రాక్స్, యాంటీరేబిస్ వంటి వ్యాక్సిన్లను వీబీఆర్ఐ ల్యాబ్‌లో అదనంగా తయారు చేసి రాష్ట్ర అవసరాలకే కాకుండా బయటి ప్రాంతాలకు విక్రయించే వెసులుబాటు కల్పించేలా నూతన ఫ్లాంటు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వెటర్నరీ పాలిటెక్నిక్ పేరు మార్చి జిల్లాస్థాయి వెటర్నరీ ఆసుపత్రులుగా మార్చే ప్రతిపాదన ఉందన్నారు. మారుమూల గ్రామాల్లోని పశువులకు వైద్య సేవలు అందించేందుకు నియోజకవర్గానికి ఒక మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు తె లిపారు. చేపల చెరువుల్లో ప్రభుత్వపరంగా నూటికి నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లల సరఫరాకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేజ్ కల్చర్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాలు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో పశుసంవ ర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితరులు పాల్గొన్నారు. -
రేపు హెచ్ఎండీఏ పరిధిలో హరితహారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11న హెచ్ఎండీఏ పరిధిలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యార్థుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు, పాఠశాలల నుంచి కార్పొరే ట్ సంస్థల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్ నగరాన్ని నందన వనంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మహాకార్యంలో ప్రజలంతా పాలుపంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనీసం ఒక మొక్క నాటాలని ఆయన కోరారు. -
ఎవరినీ బెదిరించలేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు సాయికిరణ్ ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, బెదిరించలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. సాయిపై కిడ్నాప్ కేసు నేపథ్యంలో గురువారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామకోటేశ్వరరావు తదితరులతో కలసి 2011 ఓ నిర్మాణ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో సొమ్మును తాము రామకోటేశ్వరరావుకు ఇచ్చామన్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాల్సిందిగా రామకోటేశ్వరరావు నుంచి ప్రతిపాదన వచ్చిందని.. అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదన్నారు. బుధవారం రామకోటేశ్వరరావు, అతని మిత్రుడు కృష్ణ, మరో భాగస్వామి రామకృష్ణ, తన కుమారుడు సాయి కిరణ్ తాజ్ కృష్ణ లాబీల్లో కూర్చుని ఈ విషయమై మరోసారి చర్చించుకున్నారని తెలిపారు. కొంత డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన రామకోటేశ్వరరావు, మిగతా మొత్తాన్ని నాలుగైదు నెలల్లో ఇస్తానని ప్రతిపాదించాడన్నారు. ఈ మేరకు హామీ ఇస్తూ వైట్‌పేపర్ మీద తానే రాసిచ్చాక సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు ముగించుకుని, అక్కడి నుంచి బయలు దేరారన్నారు. ఆ తర్వాత తన కుమారుడు బెదిరించాడని రామకోటేశ్వరరావు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనిపై పూర్తి వివరాలను శుక్రవారం మరోసారి మీడియాకు వెల్లడిస్తానని మంత్రి చెప్పారు. -
నేను మంత్రినయ్యా.. మరి మీరు..?
- ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలతో తలసాని శ్రీనివాస్‌యాదవ్ సాక్షి,హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాసనసభా సమావేశాలు ఒకేసారి జరుగుతుండడంతో తరచూ తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లాబీల్లో కలుసుకుంటున్నారు. ఒకప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావులు మంగళవారం లాబీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంలో టీఆర్ఎస్లో చేరిన తనకు మంత్రి పదవి వచ్చిందని.. ఏపీలో అధికారంలో ఉండి కూడా మీకు మంత్రి పదవులు రాలేదని తలసాని అన్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు చిరునవ్వులు చిందిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. -
మున్సిపల్, వ్యాట్ బిల్లులకు మండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలక, వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులకు ఆదివారం శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎన్నికల సంస్కరణలు, అధికారులకు అధికారాల వికేంద్రీకర ణకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రవేశపెట్టగా, విలువ ఆధారిత పన్నుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండలిలో ప్రవేశపెట్టారు. వ్యాట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించ కపోవడం పేదలపై పెనుభారం మోపినట్లవుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. -
'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు'
హైదరాబాద్: కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని సినిమా రంగంలో గల సమస్యలపై శనివారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినిమా ప్రముఖులు సురేష్‌బాబు, సి. కళ్యాణ్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలను చలన చిత్రాల షూటింగ్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.అలాగే నంది అవార్డుల పేరు మర్పు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరారు. అలాగే సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. -
మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది
హైదరాబాద్(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ఇష్టంలేని భూవన తండ్రి కె. మహేంద్రనాధ్ రెడ్డి తమను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు సాయి కిరణ్ తనను బెదిరించి ఈ నెల 24న భువన కల్వాను తన తల్లిదండ్రుల వద్దకు పంపేలా చే సినట్లు తెలిపారు. అప్పటి నుంచి తన భార్య కనిపించడం లేదన్నాడు. భువనను కలిసేందుకు ప్రయత్నించగా ఈ నెల 26న సాయికిరణ్ అతని స్నేహితులు వెంకట్, మరో వ్యక్తి తనను కొట్టడమేగాక తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఫొటోలు, లెటర్లు లాక్కున్నట్లు తెలిపాడు, వల్లబ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అభినవ్‌పై కేసు... తన కుమార్తెను అభినవ్ అనే యువకుడు దొంగచాటుగా వివాహం చేసుకోవడంతోపాటు, తన ఇంటికి వచ్చి కత్తితో బెదిరించి గాయపరిచాడని మారేడుపల్లికి చెందిన వ్యాపారవేత్త తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లాకు చెందిన కే.మహేంద్రనాథ్‌రెడ్డి అనే వ్యాపారవేత్త మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు మహేందర్‌రెడ్డి రెండో కుమార్తెను ప్రేమ పేరుతో నమ్మించి దొంగచాటుగా వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత అతని వేధింపులు తాళలేక ఆమె పుట్టింటికి చేరింది. ఈనెల 26వ తేదీ రాత్రి అభినవ్ మద్యం మత్తులో తమ ఇంటికి వచ్చి కత్తి చూపించి హత్య చేస్తానని బెదిరించాడని, ఈ ఘర్షనలో తనకు గాయాలయ్యాయని రవీంద్రనాథ్‌రెడ్డి అదే రాత్రి తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాణభయంతో కడప జిల్లాకు వెళ్లిపోయాడు. శనివారం అతను పోలీసులను కలిసి పరిస్థితి వివరించడంతో పోలీసులు అభినవ్‌పై ఐపీసీ 324, 506 సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తలసాని వ్యవహారంపై సీఎస్‌కు రాజ్‌భవన్ లేఖ
-
తలసాని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరం సనత్ నగర్ పరిధిలోని రాణీగంజ్ బస్తీవాసులను ఖాళీ చేయాలని తలసాని బెదిరిస్తున్నట్టు మర్రి శశిధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మర్రి శశిధర్‌తో పాటు రాణీగంజ్ బస్తీవాసులు కూడా తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు. -
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంపై తలసాని సమీక్ష
హైదరాబాద్: నవంబర్ 14 నుంచి 20 వరకూ నిర్వహించనున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. బాలల చిత్రోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై శాఖల సమన్వయం కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేయనున్నట్టు తెలిపారు. చలనచిత్ర పరిశ్రమకు అవసమరమైన అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పుణె, చెన్నైలలో ఉన్న చలనచిత్ర శిక్షణ సంస్థలను హైదరాబాద్‌లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తలసాని చెప్పారు. గ్రామజ్యోతి, వాటర్‌గ్రిడ్ లాంటి పథకాలు జనంలోకి వెళ్లేలా చలనచిత్ర పరిశ్రమ సహకరించాలని తలసాని కోరారు. -
'దమ్ముంటే జైల్లో పెట్టండి'
-
'కాంగ్రెస్ నేతల్లా దొంగపనులు చేయం'
హైదరాబాద్: కుంభకోణాలు, దొంగ పనులు చేయడం, ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్పేమెంట్లు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకే అలవాటని వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దుయ్యబట్టారు. దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం చిల్లర చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పురోగతిపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధ్ది ఉంటే వెంటనే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్దకెళ్లి కర్ణాటకలో నిర్మితమవుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. మద్యం పాలసీ విషయంలో అన్ని పార్టీల నేతలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. గుడుంబాను అరికట్టడం కోసమే ప్రభుత్వం ఛీప్‌లిక్కర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్న వైనం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? గుజరాత్లో ప్రతీ పాన్‌షాప్‌లో లిక్కర్ దొరుకుతుందనే విషయం బీజేపీ నేతలకు తెలియదా? అని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తానే కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు, ఏడాదిన్నర పూర్తవుతున్నా ఏపీలో ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో ప్రధాని నరేంద్రమోదీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చి రద్దు చేశారన్నారు. -
‘డిసెంబర్ నాటికి సెట్‌టాప్ బాక్స్‌లు తప్పనిసరి’
హైదరాబాద్: డిసెంబర్ 31 నాటికి కేబుల్ టీవీ వీక్షకులు సెట్‌టాప్ బాక్స్‌లు పెట్టుకోవడం తప్పనిసరని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బుధవారం హైటెక్స్‌లో 4వ కేబుల్ ఎక్స్పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేబుల్ ఆపరేట్లు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. పోల్ టాక్స్ రద్దు చేయాలని ఎంఎస్‌వోలు ఈ సందర్భంగా మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. -
టీఆర్ఎస్పై ఎదురుదాడే..!
అందివచ్చిన అవకాశంతో దూకుడు పెంచిన టీటీడీపీ ‘ఓటుకు కోట్లు’తో పోయిన పరువు కాపాడుకునేందుకు తంటాలు హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో పడిన మచ్చను తలసాని వ్యవహారంలో టీఆర్ఎస్పై ఎదురుదాడి ద్వారా చెరుపుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస్ లక్ష్యంగా దూకుడు పెంచింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య జైలుకు కూడా వెళ్లారు. ఇదే కేసులో పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు రావడంతో పరువు మరింత దిగజారింది. ఈ కేసుతో ఆత్మరక్షణలో పడిన పార్టీనేతలు ఇప్పుడు అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. కలసి వచ్చిన అవకాశం గత ఎన్నికల్లో టీటీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా వారిలో ఐదుగురు టీఆర్ఎస్ గూటికి చేరారు. ముఖ్యంగా టీడీపీ టికెట్‌పై గెలిచి, టీఆర్ఎస్లో చేరడంతో పాటు మంత్రి కూడా అయిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు, టీటీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్నారని, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కోర్టు గడప ఎక్కింది. ఈ కేసు విచారణలో ఉండగానే, ‘తలసాని రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి అందలేదు’ అనే సమాచారం వెలుగులోకి రావడం.. టీటీడీపీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారింది. రాజీనామా చేయకుండానే, చేసినట్లు అబద్ధం ఆడి, మంత్రివర్గంలో చేరిన తలసానిని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఆపార్టీ నాయకులు ఎక్కడ అవకాశం చిక్కినా.. అటు తలసానిపై, ఇటు టీఆర్ఎస్పైనా విమర్శలు సంధిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదనే ఉద్దేశంతోనే దూకుడు పెంచినట్టు కన్పిస్తోంది. -
తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి
4.5 కోట్ల మంది ప్రజలను ఆయన మోసం చేశారు: గండ్ర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసగించినందుకు తలసానిపై సుమోటోగా చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర మీడియాతో మాట్లాడుతూ తలసాని రాజీనామాకు సంబంధించి తమకు మొదటి నుంచి అనుమానం రావడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరగా అసలు విషయం బయటపడిందన్నారు. రాజీనామా లేఖ ఇవ్వకుండానే, ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి చేత రాజీనామా చేయించకుండానే మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఏ రకమైన ఆదర్శ పాలనవుతుందని ఎద్దేవా చేశారు. తలసానిపై 420 కేసు పెట్టాలి: షబ్బీర్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు మంత్రి తలసానిపై తక్షణమే సుమోటోగా 420 కేసు నమోదు చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీని తలసాని అవమానపరిచారని మండిపడ్డారు. తలసాని దుశ్చర్యపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున చర్చకు పట్టుబడుతామన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో షబ్బీర్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు. సీఎం ఓవైపు నీతి వాక్యాలు వల్లిస్తూ మరోవైపు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ నరసింహన్ పాత్రపైనా అనుమానం కలుగుతోందని షబ్బీర్ పేర్కొన్నారు. తలసాని రాజీనామా చేశారా లేదా అని గవర్నర్ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌కు నిజాయితీ ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగరాదన్నారు. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదన్నారు. -
‘తలసాని’ రాజీనామాపై మల్లగుల్లాలు!
రాజీనామా లేఖ అందలేదన్న అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఇరకాటంలో అధికార పార్టీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ప్రజల్లో పలుచనవుతామని శ్రేణుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ‘బంగారు తెలంగాణ’.. ‘తెలంగాణ పునర్నిర్మాణం’ నినాదాలతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలను టీఆర్ఎస్ తన గూటికి చేర్చుకుంది. వలస వచ్చిన నేతలకు పదవులూ కట్టబెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇదే తరహాలో గులాబీ గూటికి చేరారు. అందరిలా ఆయన కూడా ఎమ్మెల్యేగా కొనసాగి ఉంటే అధికార పార్టీ ఇరుకున పడేది కాదు. కానీ తలసానికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఇప్పుడు పెద్ద వివాదమై కూర్చుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు తలసాని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తన రాజీనామా లేఖను చూపించారు. ఆ లేఖను స్పీకర్‌కు పంపిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ తన రాజీ నామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పేవారు. కానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక సమాచారం మేరకు అసలు తలసాని ఎలాంటి రాజీ నామా లేఖ రాయలేదని తేలింది. ఈ మేర కు శాసనసభ కార్యదర్శి కార్యాలయం త మకు తలసాని లేఖ అందలేదని ప్రకటిం చింది. దీంతో తలసానితో పాటు, ఆయనను చేర్చుకుని అందలం ఎక్కించిన టీఆర్ఎస్ కూ డా ఇరుకునపడినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో తలసాని లక్ష్యంగానే విపక్షాలు అధికార పార్టీపై ధ్వజమెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మం త్రివర్గంలో ఎలా కొనసాగుతారని నిలదీశాయి. అయినా, అధికార పార్టీ పెద్దల నుంచి స్పందన లేకుండా పోయింది. ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలు హైదరాబాద్‌లో విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికి సైతం ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ కూడా స్పీకర్‌తో తలసాని రాజీనామా ఆమోదంపై మాట్లాడారని, దీనిపై త్వరలో ని ర్ణయం వెలువడకుంటే, తానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ పేర్కొన్నారని సమాచారం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. తలసాని అసలు రాజీనామా చేయలేదని తేలడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ విమర్శలకు మరింత పదును పెట్టాయి. గవర్నర్, స్పీకర్ లక్ష్యంగా ఆరోపణలు సంధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తలసాని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి టీఆర్ఎస్ నాయకత్వానికి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నా రు. దీనిపై నిర్ణయం ఆలస్యమయ్యేకొద్దీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరగడంతో పాటు.. ప్రజల్లో పలుచనైపోతామన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో అధి నేత కేసీఆర్ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తలసాని విషయంలో వీలైనంత త్వరలోనే ఏదో ఒక చర్య తప్పక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి.. ఆమోదింపజేసి సనత్‌నగర్‌లో ఉపఎన్నికకు వెళతారా? లేక తాత్కాలికంగా ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? అన్నదానిపైనే నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఎన్నారైలు అండగా నిలవాలి: తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి ఎన్నారైలు అండగా నిలవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ, తెలంగాణ జాగృతి సంస్థలు సంయుక్తంగా డెట్రాయిట్లో మంత్రి తలసానితో ‘ మీట్ అండ్ గ్రీట్ ’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ వద్ద కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న, కవి సుద్దాల అశోక్ తేజ, టీన్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ పి.వి.శ్రీనివాస్, పీఓడ బ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
'ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి'
అమీర్‌పేట: అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణపనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని రాష్ట్ర వాణిజ్యపన్నులు, సినీమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం అమీర్‌పేట డివిజన్లో ఎస్ఆర్టీ క్వార్టర్స్ లో కాస్ట్ కాలనీలో సివరేజీ పనులను ప్రారంభించిన ఆయన మధ్యలో ఆగిపోయిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఆర్నగర్ని ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిపేరింగ్ గోడౌన్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణపనులు పూర్తయితే ఆసుపత్రి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పనులు ఎందుకు నిలిచిపోయాయన్న దానిపై పూర్తి వివరాలు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో వైద్యవిధాన పరిషత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయిస్తానని చెప్పారు. కాలనీల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'
హైదరాబాద్: టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పని చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో? లేదో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్పీకర్ మధుసూధనాచారికి సోమవారం కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేఖ రాశారు. తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని స్పీకర్ ను శశిధర్ రెడ్డి కోరారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసి ఉంటే దానిని ఎందుకు ఆమోదించటం లేదో తెలపాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్ పదవిలో కొనసాగకూడదన్నారు. -
'ఆ ఘనకార్యాన్ని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసి తిరిగి చంద్రబాబు తెలంగాణ సర్కార్‌పై ఎదురుదాడికి దిగుతున్నారని వారు మండిపడ్డారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదని, ఆ అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరారవు అన్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని చంద్రబాబు దిగజార్చుతున్నారని, ఢిల్లీలో తెలుగు వారి పరువు తీశారని ఆయన విమర్శించారు. తమ చేష్టలతో బాబు తెలుగు జాతి గౌరవాన్ని, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చవద్దని తుమ్మల హితవు పలికారు. సెక్షన్ 8ని అడ్డు పెట్టుకుని బాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని తుమ్మల అన్నారు. తప్పు చేసేందే కాకుండా దబాయిస్తున్నారని, పైపెచ్చు తాను చేసిన ఘనకార్యాన్ని ప్రధాని వద్ద కూడా చెప్పుకోవటం సిగ్గుమాలిన పని అన్నారు. తనను అరెస్ట్ చేస్తే తెలంగాణ సర్కార్‌కు అదే ఆఖరు రోజు అన్న చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే...తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తామని చెప్పటమే అని, అది ఆయనకు సాధ్యపడుతుందా అని తుమ్మల ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు చాలా సిల్లీగా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీ పోలీసులను తెచ్చుకుంటామంటున్న ఆయన...నీళ్లు, కరెంట్ కూడా తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీయే కాదని, దేశంలో ఎక్కడకు తిరిగినా చంద్రబాబును ఎవరూ కాపాడలేరని తలసాని అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి ఇంకా గగ్గోలు పెట్టడం దుర్మార్గపు చర్చ అని తలసాని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విషయంలో సంబంధం లేదని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదని ఆయన సూటిగా ప్రవ్నించారు. -
'ఆ ఘనకార్యాన్ని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని'
-
'రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు' అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో తాను స్టీఫెన్‌సన్‌తో మాట్లాడలేదని, రేవంత్‌ను పంపలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తాను చేసిన తప్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పణంగా పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే పరిటాల రవి హత్యను కూడా చంద్రబాబు తన రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. పరిటాల హత్య కేసులో దోషి అయిన జేసీ దివాకర్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారని అన్నారు. మరోపక్క, చంద్రబాబు తనకు గతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని, ఆ విషయంలో నా పిల్లల మీద ప్రమాణం చేస్తా' అని తలసాని చెప్పారు. తనకు డబ్బులు ఇచ్చినట్లయితే ఆయన కొడుకుపై చంద్రబాబు ప్రమాణం చేస్తారా? అంటూ తలసాని సూటిగా ప్రశ్నించారు. -
అలాంటి దిక్కుమాలిన పని మేం చేయం..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగే...దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. శనివారం తలసాని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఒళ్లంతా విషమేనని, ఏపీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసేంత దరిద్రపు ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వానికి లేవన్నారు. ట్విట్టర్ పిట్ట.. ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఛాంబర్లలో నిఘా కోసం మనుషులను పెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని తలసాని ఎద్దేవా చేశారు. అలాంటి నీచమైన ఆలోచన తమకు లేదన్నారు. టీడీపీలాగా దిక్కుమాలిన పని తాము చేయమని తలసాని అన్నారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసునని, రేవంత్ వ్యవహారంలో కళ్లముందు జరిగిన సంఘటనను పక్కదారి పట్టిస్తున్నారని, విచిత్రమైన వితండవాదం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తోందని తలసాని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఆయన అన్నారు. -
అలాంటి దిక్కుమాలిన పని మేం చేయం..
-
మరో చేదు అనుభవం
టీడీపీ ఎమ్మెల్యేలకు మీడియా పాయింట్, స్పీకర్ చాంబర్లోకి నో ఎంట్రీ స్పీకర్ చాంబర్ ముందు ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు స్పీకర్ మౌఖిక ఆదేశాలున్నాయన్న చీఫ్ మార్షల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మీడియా పాయింట్ , స్పీకర్ చాంబర్లోకి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బర్తరఫ్‌తో పాటు టీడీపీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని మంగళవారం రోజంతా స్పీకర్ చాంబర్లోనే నిరసన జరిపిన టీడీపీఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు టీడీఎల్పీ కార్యాలయంలో సమావేశమై కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద, రాజేందర్‌రెడ్డి మీడియా పాయింట్వద్ద మాట్లాడేందుకు బయలు దేరారు. వీరిని అక్కడే ఉన్న మార్షల్స్ అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సాయన్న, మాగంటి గోపీనాథ్, గాంధీ, మాధవరం కృష్ణారావు అక్కడికి వచ్చి ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిం చారు. తమకు స్పీకర్ నుంచి మౌఖిక ఆదేశాలున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా మీడియా పాయింట్ వద్దకు వెళుతుంటే సభ్యులమైన తమను అడ్డుకునే హక్కు ఎక్కడిదని వారు గొడవకు దిగారు. లిఖితపూర్వక ఉత్తర్వులు తీసుకురమ్మని చీఫ్ మార్షల్‌ను కోరారు. అయినా వినకుండా మార్షల్స్ అడ్డుగా ఉంటే వారిని నెట్టుకొని వెళ్లి మీడియా పాయింట్లో ప్రభుత్వం అనుసరి స్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. అనంతరం శాసనసభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని చీఫ్ మార్షల్‌పై హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. లాబీల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను స్పీకర్ చాంబర్ ముందు మరోసారి మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన శాసనసభ్యులు.. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. అరగంట తరువాత మార్షల్స్ వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. తమను గవర్నర్ వద్దకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకోకుండా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించి అక్కడే వదిలేశారు. అనంతరం సొంత కార్లలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలసి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ఆందోళన చేస్తున్న సమయంలో అటువైపు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీరిని చూసి నవ్వుతూ వెళ్లిపోయారు. స్పీకర్‌సార్ .. ఇదేం పద్ధతి..?: సండ్ర శాసనసభలోని సభ్యులందరి హక్కులను కాపాడాల్సిన సభాపతి ఒకరిద్దరి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. గవర్నర్‌ను కలసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హరీశ్‌రావు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. కొత్త సంప్రదాయం నెలకొల్పుతామని కేసీఆర్ చెబుతున్న మాటల అర్ధమిదేనా?’ అని ప్రశ్నించారు. శాసనసభ్యులను మీడియా పాయింట్‌కు రాకుండా, లాబీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని నిలదీశారు. తమను కలిసేందుకు స్పీకర్ ఇష్టపడడం లేదని, ఇదేం పద్ధతి అని అడిగారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తలసాని దొంగ రాజీనామా చేశారు. దాన్ని ఏం చేయబోతున్నారో కూడా స్పీకర్ చెప్పడం లేదన్నారు. -
'దమ్ముంటే రాజీనామా చేసినట్లు ప్రకటించాలి'
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్‌కి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ఎన్నికలకు తలసాని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాజీనామాను ఆమోదింప చేసుకోవట్లేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి తలసాని శ్రీ నివాసయాదవ్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసినట్లు టీటీడీపీ నేత ఎర్రబెల్లి వెల్లడించారు. మంగళవారం రాజభవన్ వద్ద ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టం పరిశీలనలో ఉండగానే మంత్రిగా ప్రమాణం చేయడం అనైతికమని ఆయన తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ ఇచ్చినట్లు ఎర్రబెల్లి వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
పార్టీ ఫిరాయించినందుకు తలసాని, తీగల, చల్లాకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటివరకు ఏడుగురికి... సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సోమవారం నోటీసులు జారీ చేశారు. దీం తో ఇప్పటిదాకా ఫిరాయింపుల కేసులో నోటీసులు అందుకున్న శాసనసభ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది. తాజా నోటీసులు అందుకున్న వారిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), చల్లా ధర్మారెడ్డి (పరకాల) ఉన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల కంటే ముందే వీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి అంకమైన ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం సమయంలో సభ్యులంతా శాసనసభకు హాజరు కావాలంటూ టీడీపీ విప్ జారీ చేసింది. బిల్లుపై చర్చ అనంతరం ఆ పార్టీ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. వాకౌట్ చేసిన సమయంలో ఈ ముగ్గురు శాసనసభ్యులు తమతో పాటు బయటకు రాకుండా సభలోనే ఉన్నారని, విప్ ధిక్కరించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్లో చేరిన సమయంలో కేసీఆర్‌తో వారు దిగిన ఫొటోలను, పత్రికా క్లిప్పింగ్‌లను కూడా ఫిర్యాదులతో జత చేశారు. కాగా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వలస వెళ్లిన రెడ్యానాయక్ (డోర్నకల్), విఠల్‌రెడ్డి (ముధోల్), కె.కనకయ్య (ఇల్లెందు) ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ (వైరా)కు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వ్యూహాత్మకంగా వలసలకు స్టాప్ వెంట వెంటనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే పార్టీలో తలెత్తే అసంతృప్తి, బయటనుంచి వచ్చే విమర్శలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా వలసలను నిలుపు చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరు కాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తమ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, వచ్చే ఏడాది ఆరంభం దాకా వీరిని పార్టీలో చేర్చుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. -
29న టీఆర్ఎస్లో చేరనున్న తలసాని, తీగల?
ఎప్పటినుంచో చేరుతారని భావిస్తున్న టీ-టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో బలోపేతం కావాలని భావిస్తున్న టీఆర్ఎస్.. ఈ నేతలను చేర్చుకోవాలని నిర్ణయించింది. నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో ఈనెల 29న జరిగే బహిరంగ సభలో తలసాని, తీగల, ధర్మారెడ్డి మరికొందరు ఇతర నాయకులు చేరతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం శంఖారావం పూరించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్, తీగ కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి సహా మరికొందర ఉనాయకులను పార్టీలో చేర్చుకుని, హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసుకోవలని నిర్ణయించారు. వాస్తవానికి తలసాని, తీగల ఇంతకుముందే దసరా సమయంలో టీఆర్ఎస్లో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి గానీ, అప్పట్లో ఆగిపోయారు. ఇప్పుడు వాళ్లు చేరడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
కెసిఆర్‌తో గంటసేపు ఏకాంతంగా...
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో దాదాపు గంటసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. తలసాని కూడా టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఈ భేటీ మరింత బలం చేకూరుస్తోంది. తెలంగాణ శాసనసభ టీడీపీ పక్ష నాయకుడి పదవిని ఆశించిన తలసాని ఆ పదవి లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఆ పదవికి ఎర్రబెల్లి దయాకరరావును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తలసానికి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు సన్నిహితుడు. ఆయన రాయబారం ఫలితంగా తలసాని టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. తలసానితో పాటు పలువురు టిడిపి నేతలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. తలసాని విజ్ఞప్తి మేరకు కెసిఆర్ ఈ సాయంత్రం సనత్ నగర్‌లోని ఐడిహెచ్ కాలనీ సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో టిడిపికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్లో చేరనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, సలీం టిఆర్ఎస్లో చేరిపోయారు. తుమ్మల చేరుతున్నట్లు ప్రకటించారు. తలసాని కూడా చేరితో ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో దిగజారిపోతున్నట్లు భావించాలి. -
టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. అలాగే, శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో నాయకుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్లయింది. ఇక అసెంబ్లీలోడిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలను ఎంపిక చేశారు. శాసన మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా అరికెల నర్సారెడ్డి వ్యవహరించనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో విప్‌గా సండ్ర వెంకట వీరయ్యను నియమించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను మాత్రం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థాయితోనే చంద్రబాబు సరిపెట్టేశారు. ముందునుంచి తెలంగాణ టీడీపీ ఫోరం ఛైర్మన్‌గా వ్యవహరించిన ఎర్రబెల్లికే టీ-టీడీఎల్పీ పీఠాన్ని కట్టబెట్టారు.