ప్రతి కుటుంబానికీ లబ్ధి...
ఆ మేరకు పాడి, మత్స్య, పశుసంవర్ధక నిధులు: తలసాని
సాక్షి, హైదరాబాద్: ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా పాడి, మత్స్య, పశుసంవర్ధక విభా గాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించను న్నట్లు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాల యంలో ఆ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేష్చందా, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మత్స్య శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పశుసంవర్ధక, పాడి, మత్స్య, గొర్రెలకు సంబంధించి వచ్చే బడ్జెట్‌లో ఏవిధమైన కార్యక్రమాలు చేపట్టాలి, అవసరమైన నిధులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఆ వివరాలను మీడియాకు వివరించారు. ప్రతి జిల్లాలో ఐదు మత్స్య మార్కెట్ల ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని తలసాని చెప్పారు.
త్వరలో రెండు ఫిషరీస్ కళాశాలలు
రాష్ట్రంలో రెండు ఫిషరీస్ కళాశాలలను త్వర లో ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే కాలం లో గ్రామాల్లోని చిన్న చెరువులు, రిజర్వాయ ర్లు, మిషన్ కాకతీయ చెరువులలో పెద్దఎత్తున చేప పిల్లలను పెంచాలని కార్యాచరణ ప్రణా ళిక రూపొందించామన్నారు. మత్స్యశాఖలో ఖాళీల భర్తీతో పాటు అదనపు పోస్టుల మంజూరు, కొత్త మార్కెట్ల ఏర్పాటు, ఆధునీ కరణ చేపట్టి రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతా లకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాదులో చేపల మోడల్ మార్కెట్ల ఏర్పాటుకు సంబం ధించి సంక్రాంతి అనంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామన్నారు. గతంలో మత్స్య శాఖకు రూ.5కోట్లు కేటాయిస్తే రూ.కోటి కూడా ఖర్చు చేసేవారు కారని, ప్రస్తుతం రూ.101 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. పశు సం వర్ధక శాఖ ద్వారా 100 మొబైల్ వాహనాలను మార్చి లేదా ఏప్రిల్లో ప్రారంభిస్తామన్నారు. విజయ డెయిరీ తెలంగాణ అవుట్లెట్లను పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, హైవేల వద్ద పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. గోపాల మిత్ర సర్వీసులను విస్తృతంగా వినియోగిం చుకుంటామని తలసాని వెల్లడించారు.