Fisheries College
-
చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి
ముత్తుకూరు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆక్వా రంగంలో బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు సూత్రాలతో ముత్తుకూరులో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పడింది. రాష్ట్రంలోని ఏకైక కళాశాలగా 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నీలి విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని 1991 ఆగస్ట్ 31వ తేదీన నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్లో బీఎఫ్ఎస్సీ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్) నాలుగు సంవత్సరాల కోర్సు 20 సీట్లతో ప్రారంభమైంది. 1995 మార్చి 10వ తేదీన ఈ కళాశాలకు నూతన భవనం ఏర్పడింది. పీహెచ్డీ స్థాయికి.. దేశంలో మొత్తం 28 మత్స్య కళాశాలున్నాయి. ముత్తుకూరులోని మత్స్య కళాశాల తొలుత తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండగా, తర్వాత శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. తొలుత బీఎఫ్ఎస్సీ కోర్సులతో మొదలై క్రమంగా ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ స్థాయికి ఎదిగింది. శాస్త్రవేత్తలుగా.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు మత్స్య శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. బోధనతో సరిపెట్టకుండా పరిశోధనలు చేయిస్తూ, సముద్ర ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నారు. ఈ కళాశాలకు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో 73 ఎకరాలు, ఎగువమిట్టలో 47 ఎకరాల భూములున్నాయి. ఎగువమిట్ట భూముల్లో చేపల పెంపకం జరుగుతోంది. విద్యార్థులు ఇక్కడ తరచూ శిక్షణ పొందుతున్నారు. విశాలమైన క్రీడా మైదానం, అనేక దేశ, విదేశీ పుస్తకాలతో లైబ్రరీ, ల్యాబ్, సమావేశ మందిరం, హాస్టళ్లు తదితర సౌకర్యాలతో ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయిని సంతరించుకుంది. క్షేత్ర సందర్శన తరగతి గదుల్లో మత్స్య శాస్త్రాన్ని అభ్యసించడమే కాకుండా ఆక్వా సాగు, రైతుల కష్ట, నష్టాలు స్వయంగా తెలుసుకునే నిమిత్తం BFSc నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు ‘ఫివెప్’ (ఫిషరీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 110 రోజులపాటు గ్రామాల్లో నివాసం ఉంటూ రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల యాజమాన్యం, మేత వినియోగం, అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు, పట్టుబడి తదితర అంశాలపై అవగాహన పెంచుకుంటారు. దీనిపై ఒక నివేదిక రూపొందిస్తారు. అలాగే, ‘ELP’ (ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 వారాల ఈ కార్యక్రమంలో ఫైనలియర్ విద్యార్థులు రంగు చేపల పెంపకం చేసి, అమ్మకాలు చేస్తారు. చేపలు, రొయ్యల ఊరగాయలు, వడియాలు తయారు చేసి, అమ్మకాలు చేస్తారు. భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. కోర్సు సబ్జెక్ట్‌లు BFMSc - విద్యార్థుల సంఖ్య - 154 8 MFMSc - విద్యార్థుల సంఖ్య - 12 6 PHd - 7 3 మెండుగా ఉద్యోగావకాశాలు విద్యార్థులకు బోధనతోపాటు, శిక్షణ, క్షేత్ర సందర్శన చాలా ముఖ్యం. మత్స్య కళాశాలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి కళాశాలలో చదివిన విద్యార్థులు చాలామంది దేశ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. – డాక్టర్ రామలింగయ్య, అసోసియేట్ డీన్ ప్రతిపాదన ఉంది మన రాష్ట్రంలో మరో రెండు మత్స్య కళాశాలలు అవసరం. తమిళనాడులో నాలుగు, మహారాష్ట్రలో మూడు మత్స్య కళాశాలలున్నాయి. ఈ కోణంలో మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, నరసాపురంలో రెండు మత్స్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. – డాక్టర్ డి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఫిషరీస్ డీన్ -
కృషి, అనుభవం భవిష్యత్‌కు సోపానం
- బీఎఫ్ఎస్సీ ఫైనల్ ఇయర్లోనే ‘ఉపాధి’ - పచ్చళ్ల తయారీలో విద్యార్థులు - రంగు చేపల పెంపకంలో శిక్షణ - అమ్మకాల ద్వారా అనుభవం ముత్తుకూరు (సర్వేపల్లి) : ముత్తుకూరులోని మత్స్యకళాశాల బీఎఫ్ ఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్లో భాగంగా ‘ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రొగ్రాం(ఈఎల్పీ–కృషి అనుభవ పథకం)లో భాగస్వామ్యులవుతున్నారు. బీఎఫ్ఎస్సీ పూర్తి చేసినప్పటికీ భవిష్యత్‌లో ఉద్యోగాలు లభించని వారు వ్యాపార రంగంలో రాణించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఏడేళ్ల క్రితం ఈ పథకం అమల్లో పెట్టారు. ఆక్వా ఫార్మింగ్, ఆర్నమెంటల్ ఫిష్, అక్వా క్లినిక్, వాల్యూ యాడెడ్ ఫిష్ ప్రొడెక్టŠస్ తదితర 4 రంగాల్లో అనుభవం గడించాలి. కళాశాలల్లో ప్రస్తుతం 28 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులున్నారు. ఒక్కొక్క రంగంలో ఏడుగురు విద్యార్థులు 150 రోజుల పాటు అనుభవం గడించడంలో పాటుపడుతున్నారు. రొయ్యల పచ్చళ్లు, చేపల ఊరగాయల తయారీలో కొందరు శిక్షణ పొందుతున్నారు. రంగు చేపల పెంపకం, రొయ్యలు–చేపల పెంపకం, వ్యాధులు–నివారణ పద్ధతులపై మిగిలిన వారు వివిధ ప్రాంతాల్లో స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. పెట్టుబడులు–ఆదాయాలు ఈఎల్పీ పథకంలో విద్యార్థులు అనుభవం గడించేందుకు కావాల్సిన పరికరాలు, సామగ్రి కొనుగోలు కోసం ఎస్వీవీయూ కొంత మొత్తం పెట్టుబడి నిధిగా ఇస్తుంది. నాలుగు రంగాల్లో నాలుగు బృందాలుగా ఏర్పడిన విద్యార్థులు ఈ పెట్టుబడితో వారి వారి రంగాల్లో వ్యాపారం చేయాలి. పథకం పూర్తయ్యే లోపు సంపాదించిన మొత్తంలో పెట్టుబడి తిరిగి చెల్లించి, వచ్చిన లాభాలు పంచుకుంటారు. చేపలు, రొయ్యలు కొనుగోలు చేసి, వాటితో ఊరగాయలు, పచ్చళ్లు తయారు చేస్తారు, కళాశాల ద్వారం వద్ద స్టాల్లో పెట్టి వాటి అమ్మకాలు సాగిస్తారు. కళాశాలలోనే(ఆర్నమెంటల్ ఫిష్) రంగు చేపల పెంపకం చేసి, వాటిని అమ్మకాలు చేస్తారు. రూ.9 లక్షలతో రిటైల్ ఔట్లెట్ ఈఎల్పీ పథకంలో విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల కోసం కళాశాల ఆవరణలో రిటైల్ ఔట్లెట్ ఏర్పా టు కానుంది. రూ.9 లక్షలు ఖర్చు అవుతుందని ఎస్వీవీయూకి ప్రతిపాదనలు పంపాం. ఉద్యోగాలు లభించకున్నా వ్యాపారాల ద్వారా విజయవంతం కావచ్చన్న ఆత్మ విశ్వా సం విద్యార్థుల్లో కలిగించేందుకే పథకాన్ని అమలు చేస్తున్నాము. –డాక్టర్ ధనపాల్, ఇన్చార్జ్, ఈఎల్పీ -
ప్రతి కుటుంబానికీ లబ్ధి...
ఆ మేరకు పాడి, మత్స్య, పశుసంవర్ధక నిధులు: తలసాని సాక్షి, హైదరాబాద్: ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా పాడి, మత్స్య, పశుసంవర్ధక విభా గాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించను న్నట్లు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాల యంలో ఆ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేష్‌చందా, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మత్స్య శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పశుసంవర్ధక, పాడి, మత్స్య, గొర్రెలకు సంబంధించి వచ్చే బడ్జెట్లో ఏవిధమైన కార్యక్రమాలు చేపట్టాలి, అవసరమైన నిధులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఆ వివరాలను మీడియాకు వివరించారు. ప్రతి జిల్లాలో ఐదు మత్స్య మార్కెట్ల ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని తలసాని చెప్పారు. త్వరలో రెండు ఫిషరీస్ కళాశాలలు రాష్ట్రంలో రెండు ఫిషరీస్ కళాశాలలను త్వర లో ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే కాలం లో గ్రామాల్లోని చిన్న చెరువులు, రిజర్వాయ ర్లు, మిషన్ కాకతీయ చెరువులలో పెద్దఎత్తున చేప పిల్లలను పెంచాలని కార్యాచరణ ప్రణా ళిక రూపొందించామన్నారు. మత్స్యశాఖలో ఖాళీల భర్తీతో పాటు అదనపు పోస్టుల మంజూరు, కొత్త మార్కెట్ల ఏర్పాటు, ఆధునీ కరణ చేపట్టి రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతా లకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాదులో చేపల మోడల్ మార్కెట్ల ఏర్పాటుకు సంబం ధించి సంక్రాంతి అనంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామన్నారు. గతంలో మత్స్య శాఖకు రూ.5కోట్లు కేటాయిస్తే రూ.కోటి కూడా ఖర్చు చేసేవారు కారని, ప్రస్తుతం రూ.101 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. పశు సం వర్ధక శాఖ ద్వారా 100 మొబైల్ వాహనాలను మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. విజయ డెయిరీ తెలంగాణ అవుట్లెట్లను పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, హైవేల వద్ద పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. గోపాల మిత్ర సర్వీసులను విస్తృతంగా వినియోగిం చుకుంటామని తలసాని వెల్లడించారు. -
మత్స్యకళాశాలలో పీహెచ్డీ కోర్సులు
–సోమవారం నుంచి తరగతులు ప్రారంభం అభివృద్ధి పనులకు నిధుల వరద ముత్తుకూరు: ముత్తుకూరు మత్స్యకళాశాలలో 2016–17 సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులు ప్రారం¿¶భం కానున్నాయి. సోమవారం నుంచి తరగతులు మొదలవుతాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆమోదంతో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ వీటిని మంజూరు చేసింది. మొదటి సారిగా 'అక్వాకల్చర్' విభాగంలో 2 సీట్లకు సంబంధించి ఈ కోర్సులు మొదలవుతాయి. బీఎఫ్ఎస్సీ మొదటి సంవత్సరం సీట్ల సంఖ్య 40కి పెంచారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది విద్యార్థులు చేరారు. త్వరలో జరిగే 3వ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లు కూడా భర్తీ అవుతాయని ప్రొఫెసర్లు భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 8 మంది చేరారు. చిత్తూరు, పశ్చిమగోదావరి, అనంతపురం, కడప జిల్లాల నుంచి ఒక్కొక్క విద్యార్థి చేరారు. అభివృద్ధి పనులకు నిధుల వరద: మత్స్యకళాశాల అభివృద్ధికి ఎన్నడూ లేనంతగా నిధులు మంజూరయ్యాయి. ఐసీఏఆర్ ద్వారా రూ.కోట్ల నిధులు విడుదలయ్యాయి. ముఖ్యంగా కళాశాల ప్రధాన భవనంపై అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరుకాగా, మొదటి దశలో రూ.1.20 కోట్లు విడుదలయ్యాయి. విద్యార్థినుల హాస్టల్ భవనం మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు, అక్వాకల్చర్ అనిమల్ హెల్త్ విభాగం అదనపు భవన నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరైంది. ముఖ్యంగా ఆర్నమెంటల్ ఫిష్ రేరింగ్ యూనిట్(రంగు చేపల పెంపక కేంద్రం) నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరైంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయి. అలాగే, ఫిషరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ల్యాబ్ భవన నిర్మాణానికి రూ.1 కోటి మంజూరైంది. పీజీ విద్యార్ధుల హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. జనవరిలో కళాశాల రజతోత్సవాలు: రాష్ట్రంలో ఏకైక మత్స్యకళాశాల ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయి సందర్భంగా జనవరిలో మూడు రోజుల పాటు రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఇన్చార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ రామలింగయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా వెనామీ రొయ్యల పెంపకం స్థితిగతులపై భారీ స్థాయిలో వర్క్‌షాప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రజతోత్సవాల నిర్వహణకు అసోసియేట్ డీన్ డాక్టర్ కే ఎస్ కృష్ణప్రసాద్ కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. -
మత్స్యకళాశాల అభివృద్ధికి రూ.3.63 కోట్లు
జనవరిలో రజతోత్సవాలు ముత్తుకూరు : ముత్తుకూరులోని మత్స్యకళాశాల స్థాయి పెంచేందుకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నడుంకట్టింది. ఇందులో భాగంగా కళాశాల మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.1.20 కోట్లు విడుదల చేసింది. అలాగే సంఖ్య పెరుగుతున్న విద్యార్థినుల హాస్టల్ మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. రూ.81 లక్షలతో నిర్మించిన మినీ ఆడిటోరియంను జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఈ ఆడిటోరియానికి అదనపు హంగులు సమకూర్చేందుకు రూ.45 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. మరో వైపు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో ఉన్న ఫామ్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు రూ.45 లక్షలు మంజూరైంది. ఎగువమిట్టలోని క్షేత్రంలో గిడ్డంగి నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థుల మెస్, డైనింగ్ గది నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది. ఇద్దరు డీన్లు రాక నేడు ఎస్వీవీయూ నుంచి సోమవారం మత్స్యకళాశాలకు ఇద్దరు డీన్లు వస్తున్నట్టు అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్ చెప్పారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ మూర్తి, ఫిషరీస్ డీన్ డాక్టర్ రమణ తదితరులు వస్తున్నారన్నారు. 2017 జనవరిలో కళాశాల రజతోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కమిటీలు కూడా నియమించామన్నారు.