'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి' | marri sasidhar reddy wrote a letter to speaker madhusudhana chary | Sakshi
Sakshi News home page

'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'

Published Mon, Jun 15 2015 5:02 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM

'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి' - Sakshi

'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'

హైదరాబాద్:  టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పని చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో? లేదో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.  ఈ మేరకు స్పీకర్ మధుసూధనాచారికి సోమవారం కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేఖ రాశారు.  తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని స్పీకర్ ను శశిధర్ రెడ్డి కోరారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసి ఉంటే దానిని ఎందుకు ఆమోదించటం లేదో తెలపాలన్నారు.

 

టీడీపీ ఎమ్మెల్యే తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్ పదవిలో కొనసాగకూడదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement