
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. సోమ వారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదని, కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాల్లో కూరుకుపోయిందన్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా అది పనిచేయదని, గుడ్ గవర్నెన్స్‌తో అవన్నీ గాలికి కొట్టుకుపోతాయని అన్నారు.
ధర్మరాజు గురించి కథలుగా విన్నామని, అప్పుడు ఆ ధర్మరాజు ఏం చేశారో మనకు తెలీదు కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం ధర్మరాజు అని తలసాని అభివర్ణించారు. బీసీ వర్గాలకు ఎవరూ చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని, స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం, బీసీలకు మరిన్ని పథకాలు ప్రకటిస్తారన్నారు. రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్లనీయకుండా తామేమీ చేయడం లేదనీ, ఒకప్పుడు మంత్రి హరీశ్‌రావును కూడా ఉస్మానియాలోకి వెళ్లకుండా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.