హైదరాబాద్: నవంబర్ 14 నుంచి 20 వరకూ నిర్వహించనున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. బాలల చిత్రోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై శాఖల సమన్వయం కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్తోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేయనున్నట్టు తెలిపారు.
చలనచిత్ర పరిశ్రమకు అవసమరమైన అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పుణె, చెన్నైలలో ఉన్న చలనచిత్ర శిక్షణ సంస్థలను హైదరాబాద్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తలసాని చెప్పారు. గ్రామజ్యోతి, వాటర్గ్రిడ్ లాంటి పథకాలు జనంలోకి వెళ్లేలా చలనచిత్ర పరిశ్రమ సహకరించాలని తలసాని కోరారు.
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంపై తలసాని సమీక్ష
Published Tue, Aug 25 2015 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement
Advertisement