Pharmacy student
-
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. -
బలైపోయిన అంజలి.. హార్ట్ స్ట్రోక్ అని నిర్ధారణ.. ప్రభుత్వమే కారణమా ?
-
బలైపోయిన అంజలి
సాక్షి, రాజమహేంద్రవరం / కంబాలచెరువు /బుట్టాయగూడెం : ఆత్మహత్యా యత్నం చేసి.. మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి (22) తుది శ్వాస విడిచింది. రాజమహేంద్రవరంలోని కిమ్స్ (బొల్లినేని) ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఆమె అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు అదే కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ ఆమె మెదడు పనితీరు క్షీణిస్తూ.. ఇతర అవయవాల పనితీరు సన్నగిల్లుతూ వచ్చింది. గురువారం రాత్రి పూర్తి విషమంగా మారడంతో ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. అదే సమయంలో ఆమెకు గుండె సమస్య అధికమైంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి, గుండె ఆగిపోవడంతో నాగాంజలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి తీసుకెళ్లారు. దీపక్ వేధింపుల వల్లే దారుణం ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుంది. దాని ప్రభావంతో అక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఆ ఇంజక్షన్ చాలా హానికరమైనది కావడంతో కొద్ది నిమిషాలకే కోమాలోకి వెళ్లిపోయింది. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. ఈ క్రమంలో అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆ మరుసటి రోజు అంటే.. గత నెల 24న బయటకు వచ్చిoది. దీంతో ఆమె తీసుకున్న ఇంజక్షన్ ఏమిటనే విషయం బహిర్గతమైంది. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఎవరన్నది ఆ లేఖలో ఆమె స్పష్టంగా రాయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీపక్‌ను అరెస్టు చేశారు. బాధితురాలికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆది నుంచీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి న్యాయ సహాయం అందిస్తామని కూడా చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం.. నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై 28న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత నాగాంజలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పరామర్శించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నాగాంజలిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌతుగూడెంలో ప్రజల ఆందోళన నాగాంజలి మృతితో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబులెన్స్‌లో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగాంజలి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నాగాంజలిని పొట్టన పెట్టుకుందిఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపాటు నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త కావడం వల్లే ప్రభుత్వ నిర్లక్ష్యం సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కూటమి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అ«ధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్సీపీ కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం కళ్యాణి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యకు కిమ్స్ ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యాయత్నం చేసినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడం దారుణం అని అన్నారు. నిందితుడు దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినందునే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ‘గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు’ అని వరుదు కళ్యాణి విమర్శించారు. వీళ్ల వాగ్దానాలన్నీ మాటలకే పరిమితమని, చేతల్లో చేసేదేం ఉండదని అర్థం అవుతోందన్నారు. -
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలిని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను దీపక్ రెండు,మూడు సార్లు కొట్టాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు.ఈ నెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని.. తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన నాగాంజలి.. తీవ్ర మానసిక వేదన అనుభవించింది.కాగా, దీపక్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం. -
ఫార్మా స్టూడెంట్ నాగాంజలి మృతిపై తల్లి సంచలన వ్యాఖ్యలు
-
నాగాంజలి మృతి బాధాకరం: మార్గాని భరత్
-
‘మిస్టర్ పవన్.. దీపక్ తాట ఎందుకు తీయలేదు?’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్ కాపీనే శక్తి..గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం. -
ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి
-
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.జరిగింది ఇదీ.. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి.తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది.నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. విద్యార్థిని పరిస్థితి ఆ తల్లిదండ్రులు వివరిస్తుంటే బాధనిపించింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమైంది. ఫార్మసీ విద్యార్థిని కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు. బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు… pic.twitter.com/NLm75iVpc5— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2025 -
వైఎస్ జగన్ ను కలిసిన ఫార్మసీ విద్యార్ధిని అంజలి తల్లిదండ్రులు
-
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాజమహేంద్రవరం బొల్లినేని ఆస్పత్రిలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని కుటుంబాన్ని కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మంగళవారం పరామర్శించారు. అనంతరం నిందితుడి దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీకి వినతిపత్రమిచ్చారు. ఆస్పత్రి వద్ద కళ్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక యువతిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బొల్లినేని ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయించడం దారుణమన్నారు. ఫార్మసీ విద్య చివరి సంవత్సరం పూర్తి చేసుకుని, ఉద్యోగంలో స్థిరపడాల్సిన సమయంలో విద్యార్థిని ఆస్పత్రిలో ఇలా అచేతనంగా పడి ఉండటం బాధాకరమన్నారు. సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరంలోనూ ఆమె బాధ కనిపిస్తోందన్నారు. ఇంత దారుణానికి ఆస్పత్రి ఏజీఎం దీపక్ కారకుడయ్యాడన్నారు. అతడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో బాధితురాలు ఇంజెక్షన్ చేసుకుందని, ఇప్పటివరకూ ఆమె తల్లిదండ్రులకు సీసీ టీవీ ఫుటేజీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆ ఇంజెక్షన్ ప్రమాదకరమని, ఎవరికి వారు చేసుకోలేరని చాలామంది అంటున్నారన్నారు. అలాంటప్పుడు వేరే వ్యక్తులు చేశారా? అసలు ఏం జరిగిందో సీసీ టీవీ ఫుటేజీలోనే ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్ వేసి, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి 10 రోజులైందని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత ఏం స్పందించారని నిలదీశారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానని ప్రగల్భాలు పలికిన పవన్.. దీపక్ తాట తీయాలి కదా అన్నారు. టీడీపీ సానుభూతిపరుడైతే దండించరా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. బాధితురాలికి సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని నిలదీశారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక హత్యా అనే అనుమానం కలుగుతోందన్నారు. దీపక్ చాలామంది ఆడపిల్లలను వేధించినట్లు తెలుస్తోందని, అటువంటి వ్యక్తికి ఎందుకు ప్రభుత్వం, పోలీసులు కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. విద్యార్థినిని దారుణంగా హింసించిన దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీపక్ మామ టీడీపీలో క్రియాశీలక వ్యక్తి అన్నారు. దీపక్‌పై గతంలో కేసులున్నాయంటున్నారని, అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడం వలన వెనకేసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాడతాం
రాజమహేంద్రవరం సిటీ: ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ స్పష్టం చేశారు. శనివారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోందన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు ఫార్మసీ విద్యార్థిని తన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించిందని, నిందితుడిగా పేర్కొంటున్న కిమ్స్ ఏజీఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చెడుగానే ఉందన్నారు. పోలీసులు చెప్పిన దానికి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీకి మధ్య తేడాలుండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తాను మళ్లీ పుట్టాలనుకోవడం లేదంటూ బాధితురాలు సూసైడ్ నోట్లో రాసిందంటే, ఆమె మానసికంగా ఎంతగా నలిగిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు.సూసైడ్ నోట్‌ను తారుమారు చేసేందుకు దీపక్ ప్రయత్నించాడని ఆరోపించారు. సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్ పరారయ్యాడని, ఆస్పత్రిలో సీసీ ఫుటేజీ పూర్తిగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కిమ్స్ ఏజీఎం దీపక్ టీడీపీకి చెందిన వ్యక్తి అని, అతడి మామ నగరంలో ఆ పార్టీలో క్రియాశీలక నాయకుడని, అధికార పార్టీకి చెందిన వారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని భరత్‌రామ్ పేర్కొన్నారు. పోలీసుల విచారణలో దీపక్ ఏం చెప్పాడో బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. బాధిత విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ..తన కుమార్తెను వికాస్ ఫార్మసీ కాలేజీలో చదివిస్తున్నామని, ఈ నెల 23న తమ బిడ్డ పడిపోయిందని ఫోన్ చేశారని చెప్పారు. 2 రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలియలేదన్నారు. తమకు న్యాయం జరగాలని కన్నీటిపర్యంతమై వేడుకున్నారు. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ పగడాల మృతి వెనుక కారణాలేమిటో బయటకు రావాలన్నారు. ఈ కేసు విషయమై మంత్రి లోకేశ్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయటం దారుణమని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో భూకబ్జాలు, ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతికి భరత్‌రామ్ వినతిపత్రమిచ్చారు.ఆమె పాలిట అభినవ కీచకుడు» ఫార్మసీ విద్యార్థినిని కిరాతకంగా వేధించిన కిమ్స్ ఏజీఎం దీపక్! » ఓ లెక్చరర్, కొందరు డ్యూటీ డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సులూ అతడి బాధితులే » టీడీపీతో అనుబంధం ఉండటంతో అతడు ఆడింది ఆట.. పాడిందే పాట » ఒక్కొక్కటిగా వెలుగులోకి దీపక్ లైంగిక వేధింపులు సాక్షి, టాస్క్ ఫోర్స్: రాజమహేంద్రవరంలో కిమ్స్ బొల్లినేని ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రోజులు గడుస్తున్నకొద్దీ దీపక్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యువతులను లైంగిక వేధింపులకు గురి చేయడం అతడికి సర్వసాధారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీతో అనుబంధం ఉండటం, దీపక్ మామ టీడీపీ నేత కావడంతో అతడు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిపోతోందని చెబుతున్నారు. ప్రేమ పేరిట వలపు వల విసురుతూ లైంగిక వాంఛలు తీర్చుకున్న అనంతరం యువతులను వదిలించుకునేందుకు వేధింపులకు గురి చేయడం అతడికి పరిపాటేనని బలంగా వినిపిస్తోంది. దీపక్ రాజమహేంద్రవరంలోని హోమియో కళాశాలలో చదివాడు. ఆ సమయంలో లెక్చరర్‌ను వేధించినట్టు తెలిసింది. దీంతో అతడిని కళాశాల నుంచి డీబార్ చేసినట్టు తెలుస్తోంది. కాగా.. 2019లో అతడు కిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.ఆ తరువాత ఆస్పత్రిలో వివిధ హోదాల్లో పనిచేసే ముగ్గురు సిబ్బందిని వేధించినట్టు తెలిసింది. వీళ్లే కాకుండా అతడి వేధింపులు తట్టుకోలేక డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసే సిబ్బంది పదుల సంఖ్యలో ఆస్పత్రి వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఇతడి వేధింపులపై ఫిర్యాదు చేస్తే తమ పరువుపోతుందనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదు. గతంలో ఇద్దరు సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారంలో ఆస్పత్రి యాజమాన్యం మందలించినా అతడి వ్యవహార శైలిలో మార్పులేదు. టీడీపీతో అనుబంధం ఉండటంతో.. ప్రేమ పేరిట మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛలు తీరాక సదరు యువతులు, మహిళలను వదిలించుకోవడం అతడి నైజమని, ఈ విషయంలో అతడు ఎంతకైనా తెగిస్తాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థినిపై సైతం వేధింపులకు ఒడిగట్టడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆమె మెదడు దెబ్బతినే ఇంజెక్షన్ చేసుకున్నట్టు తెలిసింది. అతగాడి వేధింపులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వెలుగు చూశాయి. ఏజీఎం దీపక్ తనను కొట్టి, గాయపరిచిన ఫొటోలను బాధిత విద్యార్థిని ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో తీసుకుని భద్రపరుచుకున్నట్టు సమాచారం. తన శరీరంపై గాయాలైన భాగాలను ఆమె ఫొటోలు తీసింది. వాటిని పరిశీలిస్తే అతగాడి క్రూరత్వం ఎలాంటిదో తెలుస్తోంది. అతని కర్కశత్వాన్ని చూసి ఆస్పత్రి సిబ్బంది సైతం అవాక్కవుతున్నారు. ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజీని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు ఆధారాలు లభించకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్మసీ విద్యార్థిని హెల్త్ బులెటిన్ విడుదలకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు కిమ్స్–బొల్లినేని ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని అధికారుల కమిటీ తెలిపింది. విద్యార్థిని హెల్త్ బులెటిన్‌ను ఈ కమిటీ శనివారం రాజమహేంద్రవరంలో విడుదల చేసింది. ఆమె తక్షణ చికిత్సకు న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా విభాగాల వైద్యులు నిరంతర పరిశీలన కొనసాగిస్తున్నారని తెలిపింది. ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొంది. డీఎంహెచ్‌వో, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి, ఎన్టీఆర్ వైద్యసేవ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ బులెటిన్ విడుదల చేశారు. విషమంగానే బాధితురాలి ఆరోగ్యంకాగా.. అంతకుముందు కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నాయి. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విద్యాదీపక్, డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. బాధిత విద్యార్థినికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. బీపీ ఇంకా తగ్గిపోవడంతో చికిత్సలో మరో రెండు ఇంజెక్షన్లు చేర్చామని తెలిపారు. గుండె, లివర్, కిడ్నీ పనితీరు బాగున్నాయని చెప్పారు. బాధితురాలు తీసుకున్న ఇంజెక్షన్ ప్రభావంతో ఆమె బ్రెయిన్ కోమాలోకి వెళ్లిందన్నారు. సీటీ స్కాన్ చేశామని, అందులో బ్రెయిన్ వాపు ఇంకా పెరుగుతోందని చెప్పారు. దీనిని నియంత్రించేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు. బ్రెయిన్ ఎక్కువగా పాడయిపోవడంతో ఆమెలో ఎటువంటి మార్పూ రాలేదని తెలిపారు. -
రాజమండ్రి వేదికగా మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి?
-
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
దారి తప్పిన దర్యాప్తు!
సాక్షి, రాజమహేంద్రవరం: లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ నెల 23న ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి. తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది. నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.ఎవరిని కాపాడేందుకీ తాత్సారం?: మార్గాని భరత్రామ్కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి శుక్రవారం ఆయన చేరుకుని ఐసీయూలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం భరత్‌రామ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిందని ఒకరు... లేదని మరొకరు చెబుతున్నారన్నారు. ఘటనపై ఈ నెల 23న ఒక ఎఫ్ఐఆర్, 24న మరొకటి ఎలా నమోదయ్యాయని నిలదీశారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు కూడా మార్చారన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే (రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు) ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కేసులో అరెస్టయిన దీపక్ టీడీపీ నాయకుడి అల్లుడని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే ఎవరినో కాపాడడానికి పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోందని భరత్‌రామ్ అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా హోంమంత్రి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. హోంమంత్రికి పరామర్శించే సమయం లేదా?ఐద్వా, మహిళా సంఘాల మండిపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. బాధితురాలు చికిత్స పొందుతున్న కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి ఐద్వా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), మహిళా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఐద్వా నేత రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా అద్భుతం జరిగితే మినహా ఆ విద్యార్థిని సాధారణ స్థితికి రాలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విద్యార్థిని సెల్‌ఫోన్ డేటాను దీపక్ డిలీట్ చేశాడని, ఆధారాలను మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేశాడన్నారు. మహిళ అయి ఉండి కూడా హోంమంత్రి ఇంత వరకూ ఎందుకు రాలేదని నిలదీశారు. బాధిత విద్యార్థినిని దీపక్ బ్లాక్మెయిల్ చేసి లోబరచుకున్నట్లు తెలుస్తోందన్నారు. అతడిపై రేప్ కేసు నమోదు చేశారో లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు.టూరిజంపై ట్వీట్ చేయడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి ఈ అకృత్యంపై ఎందుకు ట్వీట్ చేయలేదని, గుండెల్ని పిండేసే ఈ ఘోష పాలకులకు పట్టదా? అని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పెద్దమనిషి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని నిలదీశారు. పుట్టిన రోజు చేసుకున్న మహిళా హోంమంత్రి ఇంత దారుణ సంఘటన జరిగితే ఇప్పటి వరకూ స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. -
తేజస్విని డెడ్ బాడీ కలకలం.. లవర్ ఇటుక బట్టి వద్ద..
సాక్షి, శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న తేజస్విని అనుమానాస్పదంగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే, కొంత కాలంగా తిరుపతికి చెందిన సాధిక్, తేజస్విని ప్రేమించుకుంటున్నారని ఆమె పేరెంట్స్ చెప్పారు. తేజస్విని ప్రియుడు సాధికే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తేజస్విని కూడా.. సాధిక్ నడుపుతున్న ఇటుక బట్టి వద్దే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకోవడం వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తేజస్విని డెడ్ బాడీని మరోసారి పోస్టుమార్టంకు పంపించారు. కాగా, శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని, ఆమెను ఆత్మహత్య చేసుకుందని వైద్యులు నిర్ధారించారు. తేజస్విని ఆత్మహత్యేనని, ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా రిపోర్టులో ధృవీకరించారు. దీంతో ఆమె మృతిపై సస్పెన్స్ వీడింది. ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే.. -
ఘట్కేసర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామాతో నగరంలో కలకలం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. సదరు యువతి మంగళవారం మధ్యాహ్నం షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం. దాంతో యువతి కుటుంబ సభ్యులు మొదట ఆమెని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువతిని ఇంటికి పంపించారు వైద్యులు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక యువతి మరోసారి షుగర్ మాత్రలు మింగినట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున యువతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కొనసాగుతుండగా.. యువతి మరణించింది. చదవండి: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా: యువతి ఆత్మహత్య -
విద్యార్థిని కిడ్నాప్ చేయలేదు..అత్యాచారం జరగలేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం అంతా ఆమె కల్పితమాటలేనని రాచకొండ పోలీసులకు దొరికిన శాస్త్రీయ ఆధారా లతో రుజువైంది. ఈ కేసులో ఆమే సూత్రధారి.. ఆమే పాత్రధారిగా పోలీసులు తేల్చారు. తొలుత భావించినట్లుగా ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం కూడా జరగలేదని సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన దృశ్యాలు తేల్చేశాయి. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు డ్రామా ఆడిన విద్యార్థిని కేసు వివరాలను అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తితో కలసి నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్‌భగవత్ శనివారం మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే... మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. వంద మంది పోలీసులు... తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. చదవండి: (బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం) దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు. 10వ తేదీన ఏఏ సమయాల్లో ఎక్కడుందంటే... ♦సాయంత్రం 5.30: రాంపల్లి ఎక్స్ రోడ్డు నుంచి ఆటోలో ప్రయాణం ♦సాయంత్రం 5.57: యామ్నాంపేట టీస్టాల్ ముందు ఆటో దిగింది ♦సాయంత్రం 6.03: ఒంటరిగా నడుచుకుంటూ తల్లికి ఫోన్‌కాల్ చేసింది. ♦సాయంత్రం 6.15: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీవైపు వెళ్లింది. ♦సాయంత్రం 6.44: కొండాపూర్ రైల్వే గేట్ ♦సాయంత్రం 6.48: ఘట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు ♦సాయంత్రం 6.58: సాయి లేడీస్ హాస్టల్ ♦సాయంత్రం 6.59: ఘట్కేసర్ ఓల్డ్ విలేజ్ ♦రాత్రి 7.05: కల్కి ఆసుపత్రి ముందు ఆటో ఎక్కింది ♦రాత్రి 7.23: ఎన్టీపీసీ ఎక్స్‌రోడ్డు, అన్నోజిగూడలో దిగింది. అక్కడి నుంచి 150 మీటర్ల దూరంలోనే ఆమె ఆచూకీ పోలీసులకు దొరికింది. -
ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు
సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. అయితే ఆమె పోలీసులకు చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ కేసులో ఏం జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ఘటన జరిగిన రోజు నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వరకు ఆమె ఆటోలో వచి్చంది. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఘట్కేసర్ వరకు మార్గమధ్యలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే ఒంటరిగానే రోడ్డుపై ఆమె నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆటోడ్రైవర్ల పాత్రపై పక్కా ఆధారాలు లేకపోవడం, వేరేవాళ్ల మీద అనుమానాలు లేకపోవడంతో అసలు ఏం జరిగిందనేది తెలియక రాచకొండ పోలీసులు తికమకపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో తమ ఆటోడ్రైవర్లను అనవసరంగా బద్నాం చేస్తున్నారంటూ ఆటోడ్రైవర్ల సంఘాలు ఆందోళనకు దిగడం కూడా ఖాకీలకు తలనొప్పిగా మారింది. కేవలం అనుమానంతోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, అయితే ఆ నేరం తమవారే చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకే సవాల్.. కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అలాగే శుక్రవారం బాధితురాలు పోలీసుల విచారణలో తెలిసిన వ్యక్తులే నమ్మించి తీసుకెళ్లారని చెప్పారనే వివరాలతో కూడిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తుండటంతో పోలీసుల విచారణకు అడ్డంకిగా మారుతోంది. దీంతో రాచకొండ పోలీసులు ఇటు సాంకేతిక అంశా లను ఆధారంగా చేసుకొని విచారణ వేగిరం చేశారు. మరోవైపు వైద్యులు ఇచ్చే నివేదిక కూడా పోలీసులకు కీలకంగా మారనుంది. చదవండి: ఘట్కేసర్ అత్యాచార కేసు: విస్తుపోయే నిజాలు బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
ఘట్కేసర్ ఘటన: దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్/ఘట్కేసర్: బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భువనగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) కార్యాలయంలో విచారిస్తున్నారు. బాధితురాలిని గురువారం గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెరుగైన చికిత్సకోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. రాంపల్లి ఆర్ఎల్ నగర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థినిపై బుధవారం అఘాయిత్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే నాగారం సర్కిల్లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థిని ఎక్కిన సెవెన్ సీటర్ ఆటోను గుర్తించారు. దాని డ్రైవర్‌తో పాటు ఈసీఐఎల్, రాంపల్లి, యంనంపేట్, ఘట్కేసర్ మార్గాల్లో నడిచే ఆటోల డ్రైవర్లలో అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సెల్‌ఫోన్ టవర్ల నుంచి సేకరించిన సాంకేతిక అంశాలు, నిర్దేశిత లొకేషన్లలో ఉన్న సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు యంనంపేట్ ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. వీరిలో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. తొలుత కిడ్నాప్ కేసు నమోదు చేసిన కీసర పోలీసులు, గురువారం బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించడంతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాప్, దాడి, నిర్భయ చట్టంలోని సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు. మొత్తం ఆరుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రాథమిక క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ కేసులో నిందితుల్ని శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బాధితురాలు తమ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆమె స్పృహలో లేదని క్యూర్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బాధితురాలికి అంతర్గతంగా గాయాలు ఉన్నాయని, తల, కాలిపై గాయాలు ఉన్నాయని, కర్రలు లేదా రాడ్లతో దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. సూత్రధారి శివ? బీ ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం కేసులో యంనంపేట్‌కు చెందిన ఆటోడ్రైవర్ శివ సూత్రధారిగా తేలింది. ఇతడిచ్చిన సమాచారంతోనే మిగిలిన ఐదుగురు నిందితులు వచ్చి నేరంలో పాలుపంచుకున్నట్లు తేల్చారు. రాచకొండ పోలీసులు గురువారం రాత్రి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు నాగారం చౌరస్తాలో శివకు చెందిన సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. విద్యార్థిని ఒంటరిగా ఉండటంతో దుర్బుద్ధి పుట్టిన శివ ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు చెప్పి నిర్దేశిత ప్రాంతానికి రమ్మని చెప్పాడు. కీడు శంకించిన బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. మార్గమధ్యలో ప్రయాణికుల మాదిరిగా వాహనం ఎక్కిన ఇద్దరు స్నేహితులు బాధితురాలి నోరునొక్కి, కదలకుండా పట్టుకుని ఘట్కేసర్ వైపునకు తీసుకుపోయారు. యంనంపేట్ దాటిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయానికి మరో ముగ్గురు స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోపు బాధితురాలి తల్లిదండ్రుల నుంచి అందిన సమాచారం మేరకు కీసర పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. హడావుడిని గమనించిన నిందితులు బాధితురాలిని అన్నోజిగూడ సమీపానికి తీసుకువచ్చి వదిలి పారిపోయారు. -
ఘట్కేసర్ కేసు; రాడ్లతో విచక్షణ రహితంగా..
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ అత్యాచారం కేసు విచారణను కీసర పోలీసులు వేగవంతం చేశారు. విచారణ అధికారిగా కీసర ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్‌ను నియమించారు. ఘట్కేసర్ సీఐ చంద్రబాబునాయుడు సెలవులో వెళ్లడంతో విచారణ అధికారిగా నరేందర్ గౌడ్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నియమించారు. మరోవైపు బాధితురాలిని నారపల్లి క్యూర్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి క్యూర్ ఆస్పత్రికి పోలీసులు తరలించనున్నారు. మత్తు మందు ఇచ్చి అమ్మాయిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తరువాత నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులపై 365 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుగుతున్నారు. గురువారం క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రణధీర్ రెడ్డి, మేడ్చల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పద్మ మీడియాతో మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థిని బుధవారం రాత్రి 8.20 గంటలకు పోలీసులు తమ ఆస్పత్రిలో చేర్చినట్లు రణధీర్ రెడ్డి తెలిపారు. అప్పటికే బాధితురాలు అపపస్మారక స్థితిలో ఉందని, ఒంటిపై కొన్ని చోట్ల గాయాలు అయ్యాయన్నారు. రాడ్లతో విచక్షణ రహితంగా విద్యార్థినిపై దాడి చేయడంతో కాలి గాయం అయ్యిందన్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ అన్ని వైద్య పరీక్షలు చేశారనన్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉందన్నారు. వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై లైంగికదాడి యత్నం జరిగిందని బాధితురాలికి చికిత్స అందించిన క్యూర్ హాస్పిటల్ డాక్టర్ సౌజన్యా రెడ్డి తెలిపారు. ఒక్కరు కాదు ముగ్గురు దుండగులు ఉన్నారని బాధితులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు సృహ లేకుండా ఉందని, పోలీసులే ఆమెను తీసుకొచ్చారన్నారు. ఫార్మసీ విద్యార్థిని విషయం తెలియగానే హాస్పిటల్‌కు చేరుకున్నామని మేడ్చల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పద్మ తెలిపారు. మంత్రి ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం తరలించారని, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫార్మసీ విద్యార్థిని పైన అత్యాచారం జరిగిందా లేదా అనేది రిపోర్టులు వచ్చాక వెల్లడిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వ్యక్తుల్లో, వ్యక్తిత్వాల్లో మార్పు రావాలని అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో విద్యార్థిని క్షేమంగా ఉందన్నారు. ఘట్కేసర్ ఘటన పైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు రిపోర్ట్ అందిస్తామని వెల్లడించారు. చదవండి బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
సాక్షి, ఘట్కేసర్: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ ఓయూ కాలనీకి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ బస్టాప్ వెళ్లేందుకు సెవన్ సీటర్ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. అయితే కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. అప్పుడు బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా డ్రైవర్ ముందుకు తీసుకెళ్లాడు. యామన్నపేట వద్ద ఇంకో వ్యాన్ ఉండగా, ఆటోలో నుంచి ఆమెను బలవంతంగా అందులోకి ఎక్కించారు. అక్కడి నుంచి వ్యాన్‌లో ఘట్కేసర్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల సైరన్ విన్పించడంతో ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. డయల్ 100కు ఫోన్ చేయడంతో.. తను దిగాల్సిన చోట ఆపకుండా ఆటోను తీసుకెళ్తున్న సమయంలోనే బాధితురాలు తన తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి తమ సమీప బంధువైన ఓ అబ్బాయికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే అతడు డయల్ 100కు కాల్చేసి ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు కీసర, ఘట్కేసర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్ నంబర్ లొకేషన్‌ను ట్రేస్ చేయడంతో చివరికి ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు. బాధితురాలి కుడి కాలికి గాయం.. ఆటో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. అలాగే కొంతమేర ఆమె దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఎట్టకేలకు రాత్రి 7.50 ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే ఆటోడ్రైవర్‌ను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
భీమవరంలో ఎం.ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, భీమవరం: ఎం.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అలేఖ్య..కాలేజీ సమీపంలోనే ఫ్రెండ్స్‌తో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. శని, ఆదివారాలు కళాశాలకు సెలవు కావడంతో స్నేహితులంతా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. -
కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..
-
హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ జరిగి 7 రోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కిడ్నాపర్‌ను పట్టించిన వారికి రూ. 1లక్ష నజరానా ప్రకటించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి కిడ్నాపార్ల కోసం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో గాలింపు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అనుమానం వచ్చిన ప్రతి క్లూని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో కిడ్పాపర్ల ఆచూకీపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. నిన్న నల్లమల్ల అడవుల్లో ఆచూకీ ఉన్నట్లు పోలీసులు అనుమానం. ఇవ్వాళ కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 23న సోనీని కార్లో కిడ్నాప్ చేసిన రవి శేఖర్ మోస్ట్ వాంటెడ్ కిడ్నాపర్ కావడంతో హయత్ నగర్ కిడ్నాప్ కేసు పోలీసులకు సవాలుగా మారింది. కిడ్నాప్ జరిగిన రోజు, తరువాత రోజు మొత్తం 7 ఫుటేజ్లలో క్లూస్ క్లియర్‌గా లభ్యమయ్యాయి. ఘటన జరిగి వారం కావస్తున్నా, నిందితుడి వాహనం పైనే ఆధారపడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతకూ ఆచూకీ లభ్యంకాకపోవడంతో, పోలీసుల విచారణ తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పోలీసులు ఏమి చెప్పకపోవడంతో సోనీ తలిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
సోనీ కిడ్నాప్ కేసులో పోలీసుల పురోగతి
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మసీ విద్యార్థి సోనీ లో కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నల్లమల ఫారెస్ట్ ఏరియాలో కిడ్నాపర్ రవిశంకర్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ వ్యవహారంలోనూ కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆ ఆధారాల ప్రకారం సోని కిడ్నాప్‌లో బంధువుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ రవిశంకర్‌ను పట్టుకునేందుకు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు నగరంలో జరిగిన ఫార్మసీ విద్యార్థి సోనీ కిడ్నాప్ స్టోరీ ఇప్పుడు ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో కిడ్నాపర్ ఆనవాళ్లను పోలీసులు పసిగట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి ఆంధ్రా- తమిళనాడు, ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు . హైదరాబాద్‌లో కిడ్నాప్ అయిన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో తండ్రిని నమ్మించి కూతురు సోనీని తీసుకువెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్ ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన వాడుగా గుర్తించారు. ఈజీ మనీకి అలవాటుపడ్డ రవిశంకర్ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దృష్టి మళ్లించి పనికానిచ్చేయటంలో దిట్ట. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో పలు దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. అలా జైలు నుంచి విడుదలై బయటకు రాగానే మళ్లీ దొంగతనాలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఏపీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి హైదరాబాద్‌లో ప్రత్యక్షమై ఫార్మసీ విద్యార్థి సోనీని కిడ్నాప్ చేశాడు. దీంతో రవిశంకర్ స్వగ్రామం కృష్ణా జిల్లా దావులూరు కావడంతో.. ఆమెని ఏపీలో దాచి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుని కేసును చేధించాలని తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు? పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా? ఇందుకోసమే తండ్రిని ట్రాప్ చేసి కూతురు సోనిని కిడ్నాప్ చేశాడా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడి నేర ప్రవృత్తితో విసుగెత్తిపోయారు. రవిశంకర్ తీరుతో తాము అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని వాపోతున్నారు. రవిశంకర్‌ను పట్టుకుని శిక్షించాలంటున్నారు. రవిశంకర్ పై స్వగ్రామం దావులూరు వాసులు మండిపడుతున్నారు. సోనీని విడిచి పెట్టి పోలీసులకు లొంగిపోవాలని సూచిస్తున్నారు. కొడుకు పడుతున్న బాధలను చూసిఅయినా రవిశంకర్ మారాలని కోరుతున్నారు. -
ఫార్మసీ విద్యార్థి కిడ్నాప్ కలకలం
కడప అర్బన్ : కడప నగరంలో ఓ యువతి కిడ్నాప్ అయిందనే సంఘటన మంగళవారం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మాత్రం కళాశాలకు వెళ్లాల్సిన యువతి.. ఓ ఆటోలో వెళ్లి, తర్వాత ఓ ప్రైవేట్ స్కూల్లో బురఖా ధరించి, బ్యాగ్‌తో కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి కర్నూలు బస్సెక్కి నంద్యాలలో దిగినట్లు తెలిసింది. ఈ సంఘటనపై యువతి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరం జయనగర్ కాలనీలో నివసిస్తున్న డి.వెంకారెడ్డి, యల్లమ్మకు డి. మహాలక్ష్మి, డి.లక్ష్మీప్రసన్న అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. వీరు కడప నగర శివార్లలోని నిర్మల కళాశాలలో డి–ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. మహాలక్ష్మి కళాశాలకు బస్సులో వెళ్లింది. లక్ష్మీప్రసన్న మాత్రం తాను ఇంటి దగ్గరి నుంచి నడుచుకుంటూ వెళ్లి పద్మావతి స్వీట్స్ సమీపంలో ఆగివున్న ఓ ఆటో (ఏపీ04 టీయూ 1337)ను ఎక్కింది. సదరు ఆటోలో కడప నగర శివారులోని కొండాయపల్లె రోడ్డులో వున్న ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లి.. అక్కడ దిగి ఆటో డ్రైవర్‌కు రూ. 30 ఇచ్చి పంపించేసింది. తర్వాత అక్కడి నుంచి కడప ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. తరువాత కర్నూలు బస్సెక్కి నంద్యాలలో దిగినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే ఉదయం 10:16 గంటల కు తన అక్క మహాలక్ష్మి సెల్‌ఫోన్‌కు వాట్సాప్ ద్వారా ‘తాను ఆపదలో వున్నానని, కాపాడాలని’ మెసేజ్ చేసింది. ఈ మెసేజ్ చూసి కంగారు పడిన ఆమె అక్క తల్లిదండ్రులు, బంధువులతో కలిసి కడప డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. వేగవంతంగా పోలీసు దర్యాప్తు కడప డీఎస్పీ కార్యాలయం చేరుకున్న యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, తమ సిబ్బందితో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విచారణ కోసం పంపించారు. మరో వైపు కమాండ్ అండ్ కంట్రోల్ రూంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీలలో లక్ష్మీప్రసన్న తాను కళాశాలకు వెళ్లేందుకు అప్సరా సర్కిల్లో పద్మావతి స్వీట్స్ వద్ద ఆటోలో ఎక్కినట్లు కనిపించింది. తర్వాత కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కేందుకు వచ్చి, బురఖా ధరించింది. బురఖాపైన లక్ష్మీప్రసన్న వేసుకున్న బ్యాగ్, చెప్పులను పరిశీలించి గుర్తించారు. సదరు యువతి కర్నూలు బస్సెక్కి వెళ్లిందని గమనించారు. నంద్యాలలో పోలీసులకు చిక్కిన యువతి? కిడ్నాప్ కలకలం సృష్టించిన యువతి కొన్ని గంటల్లోనే నంద్యాలలో ప్రత్యక్షమైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడికి తానొక్కతే వెళ్లిందా? ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లిందా? అనే విషయాలపై పోలీసు బృందం ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. సదరు యువతిని కడపకు తీసుకుని వస్తున్నట్లు సమాచారం. యువతి అదృశ్యం కేసుగా నమోదు లక్ష్మీప్రసన్న, తన అక్క మహాలక్ష్మి సెల్‌ఫోన్‌కు తా ను ఆపదలో వున్నానని మెసేజ్ పెట్టడంతో కంగా రు పడిన ఆమె తల్లిదండ్రులు చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు చిన్నచౌక్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో ప్రాథమికంగా ఆటోను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
చదువుపై అనాసక్తి.. జీవితం సమాప్తి..
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కాలేజిలో డీ ఫార్మసీ చదువుతున్న ఆవుల చైతన్య యాదవ్ (18) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలకు వెళ్లని విద్యార్థి జమ్మలమడుగు రోడ్డులోని తన గదిలోనే ఫ్యాన్‌కు టవల్ కట్టి ఉరి వేసుకున్నాడు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు కర్నూలు జిల్లా, నంద్యాలలోని సంజీవనగర్‌కు చెందిన ఆవుల వెంకటసుబ్బయ్యకు భార్య లక్ష్మితో పాటు కుమారుడు చైతన్య, కుమార్తెలు అపర్ణ, శ్రావణి ఉన్నారు. అతను ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తున్నాడు. చైతన్య ఇంటర్ పూర్తి చేసిన వెంటనే ఏడాది క్రితం తిరుపతిలో రేడియాలజి కోర్సులో చేరాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో చైతన్యను ప్రొద్దుటూరులో చేర్పించారు. కళాశాలకు సరిగా వెళ్లేవాడు కాదు.. చైతన్యతోపాటు అదే కాలేజికి చెందిన సంజీవ్, నవీన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు కలిసి జమ్మలమడుగు రోడ్డులో ఓ గదిని బాడుగకు తీసుకొని ఉంటున్నారు. కాలేజిలో చేరినప్పటి నుంచి చైతన్య సరిగా వచ్చేవాడు కాదని స్నేహితులు చెబుతున్నారు. రోజు కళాశాలకు వెళ్లడానికి అందరూ గదికి తాళం వేసి రాగా చైతన్య మాత్రం ‘ మీరు వెళ్లండి.. నేను టిఫెన్ చేసి వస్తాను’ అని చెప్పి వచ్చేవాడు కాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో మే నెలలో కాలేజికి రెండు వారాలు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ నెల 1 నుంచి తరగతులు ప్రారంభమైనా అతను నంద్యాల నుంచి రాలేదు. కుటుంబ సభ్యులతో కలిసిపుట్టిన రోజు వేడుకలు. ఈ నెల 18న చైతన్య పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను బాగా చేసుకున్నాడు. 19న ప్రొద్దుటూరుకు వచ్చిన అతను కాలేజికి వెళ్లలేదు. తండ్రికి ఫోన్ చేసి ప్రొద్దుటూరుకు రమ్మని చెప్పడంతో ఆయన రెండు రోజుల క్రితం వచ్చారు. కాలేజికి వెళ్లాలనిపించలేదు నాన్నా..! అని తండ్రికి చెప్పాడు. గురువారం కుమారుడ్ని తీసుకొని తండ్రి వెంకటసుబ్బయ్య కాలేజికి వెళ్లి అక్కడి అధ్యాపకులతో మాట్లాడారు. శుక్రవారం నుంచి కాలేజికి వస్తానని చైతన్య అధ్యాపకులతో అన్నాడు. బాగా చదువుకోమని చెప్పి తండ్రి అదే రోజు నంద్యాలకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి ఫోన్ చేసి కాలేజికి వెళ్లాలని, బాగా చదువుకోవాలని చెప్పాడు. గదిలో ఉన్న స్నేహితులు కాలేజికి రమ్మని చెప్పగా ‘మీరు వెళ్లండి.. నేను తర్వాత వస్తానని’ చెప్పాడు. వారు వెళ్లిన కొంత సేపటికే అతను గదిలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో కళాశాలకు చెందిన స్నేహితులు గదికి వెళ్లి చూడగా అప్పటికే చైతన్య ఉరికి వేలాడుతున్నాడు. దీంతో వారు స్నేహితులకు, స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలియడంతో త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. చదవలేనని అక్కకు చెప్పొచ్చు కదరా.. తల్లిదండ్రులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించసాగారు. ‘చదువుకోలేనని మాతో చెప్పకుంటే.. అక్కతోనైనా చెప్పొచ్చుకదరా..మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోతావా నాయనా.. ఏం బాధ వచ్చిందిరా నీకు..’ అంటూ తల్లి లక్ష్మీ కుమారుడి మృతదేహంపై పడి రోదించసాగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. చైతన్య స్నేహితులు జిల్లా ఆస్పత్రికి చేరుకొని చైతన్య మృతదేహాన్ని సందర్శించారు. కళాశాల యాజమాన్యం కూడా మార్చురీ వద్దకు వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు. విద్యార్థి తండ్రి వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణంరాజునాయక్ తెలిపారు. -
బాత్రూంలో జారిపడి ఫార్మసీ విద్యార్థి మృతి
చిన్నకోడూరు (మెదక్) : మరుగుదొడ్డిలో కాలు జారి పడి ఎం.ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం గుర్రాలగొందిలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు ... గ్రామానికి చెందిన కొడిసెల్ల యాదగిరి, నర్సవ్వ దంపతుల కుమారుడు సతీష్(23) ఎం.ఫార్మసీ సెకండియర్ చదువుతున్నాడు. కాగా సతీష్‌కు ఆదివారం గుండె నొప్పి రావడంతో సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత సమస్య లేదని చెప్పారు. సోమవారం ఉదయం సతీష్ ఇంట్లో మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లోపల సతీష్ కిందపడిపోయి ఉన్నాడు. అప్పటికే అతడు మృతిచెందాడు. మరుగు దొడ్డిలో పడిపోవటంతో సతీష్ తలకు బలమైన గాయాలయ్యాయి. అయితే, మరుగు దొడ్డిలో పడి బలమైన గాయాలతో సతీష్ చనిపోయాడా? లేక గుండెపోటుతో మృతి చెందాడా? అనేది తేలాల్సి ఉంది. -
'నా ఎదుటే మా అమ్మాయిపై దాడికి దిగాడు'
-
ర్యాగింగ్ జరిగిందని రుజువైతే...కేసు మారుస్తాం: సీఐ
విశాఖ : విశాఖ భీమిలీలోని ఎన్ఆర్ఐ కళాశాల హాస్టల్ భవనంపై నుంచి పడి గాయపడిన ఫార్మసీ విద్యార్థి ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈనెల 19న ప్రశాంత్ భవనం పైనుంచి పడిపోయిన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. మరోవైపు ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ తట్టుకోలేకే తన తమ్ముడు భవనంపైనుంచి దూకాడని ప్రశాంత్ సోదరి సంధ్య ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చేవరకూ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయటానికి వీలు లేదని పట్టుబట్టారు. కాగా ప్రశాంత్ వారం క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. హాస్టల్లో ఉండలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదని సమాచారం. ఈ ఘటనపై భీమిలీ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి మృతిపై ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగిందని రుజువైతే ...ర్యాగింగ్ కేసుగా మార్చుతామని ఆయన తెలిపారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కాగా కళాశాల యాజమాన్యం మాత్రం తమ కళాశాలలో ర్యాగింగ్ అనేదే లేదని, ప్రశాంత్ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని చెబుతోంది. -
హాల్‌టికెట్ ఇవ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫార్మసీ కోర్సు చదువుతున్న కవిత అనే విద్యార్థినిని ఫీజు కట్టాలంటూ యాజమాన్యం గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఆమెకు హాల్ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కవిత.. ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఇక్కడ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. -
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్, న్యూస్‌లైన్: వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఓ ఎం.ఫార్మసీ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన అర్తల రామ్మూర్తి (28) నగరంలోని కేర్ ఆస్పత్రిలో పనిచేస్తూ, బాటసింగారంలోని ఎస్ఎల్సీ కళాశాలలో ఎం.ఫార్మసీ చదువుతున్నాడు. శుక్రవారం మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై తోటి విద్యార్థులు కోదండ రాముడు, తిమోదిన్లతో కలిసి పల్సర్ బైక్(ఏపీ09సీఎల్ 8070)పై నగరం వైపు వస్తున్నాడు. ముషీరాబాద్‌లో నివాసి బాబు కుమారుడు ఇంటర్ విద్యార్థి నరేష్, రాంనగర్‌లోని ప్రై వేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుప్రియలు బైక్(ఏపీ03ఏజెడ్ 4916)పై వస్తూ అబ్ధుల్లాపూర్ గండిమైసమ్మ వద్ద మలుపు తిరుగుతున్నారు. నగరం నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు (ఏపీ37బీపీ 0001) అదుపుతప్పి డివైడర్‌కు అవతలి వైపు దూసుకెళ్లి రెండు బైకులను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో బైక్‌పై ఉన్న నరేష్, సుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. రామ్మూర్తి బైక్‌పై ఉన్న తిమోదిన్, కోదండ రాముడుకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆదిత్య ఫిషరీస్ ప్రై వేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీకి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.