Praja Sankalpa Yatra
-
ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారు: పెద్దిరెడ్డి
-
సామాజిక సాధికారతకు బాట
రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి సరిగ్గా ఆరేళ్ల క్రితం తొలి అడుగు పడింది. ప్రజల కష్టాలు తెలుసుకుని... కన్నీళ్లు తుడిచి... నేనున్నా అంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆరేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ పాదయాత్ర ఓ సంచలనం. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జనం విజయం అందించిన తర్వాత, వైఎస్పార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పాలనలో పెద్దపీట వేసింది. సామాజిక న్యాయమంటే నినాదం కాదు విధానమని సీఎం వైఎస్ జగన్ చాటి చెబుతున్నారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్ ... రావాలి జగన్ అంటూ నినదిస్తూ అన్ని వర్గాల ప్రజలు పూలబాట పరచి అపూర్వ స్వాగతం పలికారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు విని, వాటిని పరిష్కరించి... జీవితాల్లో వెలుగులు నింపుతానని జగన్ భరోసా ఇచ్చారు. రెండే రెండు పేజీల మేనిఫెస్టో పాదయాత్రలో కోట్లాది మందితో మమేక మైనప్పుడు వారు తన దృష్టికి తెచ్చిన, తాను గుర్తించిన సమస్యల పరిష్కారమే అజెండాగా కేవలం రెండే రెండు పేజీలతో 2019 ఎన్నికల మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో గెలిపించడం ద్వారా వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని ప్రజలు అందించారు. జగన్ ముఖ్యమంత్రిగా 2019 మే 30న ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టడం ద్వారా సామాజిక విప్లవానికి నాంది పలికారు. సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేయాల్సిన విధానామని అధికారం చేపట్టిన రోజే చాటిచెప్పారు. సీఎం వైఎస్ జగన్ 2019 జూన్ 8న 25 మందితో ఏర్పాటుచేసిన తొలి మంత్రివర్గం ద్వారా సామాజిక న్యాయాన్ని ఎలా చేయాలో దేశానికి చాటిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14 మందికి (56 శాతం) మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే, అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మరో అడుగు ముందుకేసి ఆ వర్గాల వారికి ఏకంగా 17 మందికి(70 శాతం) స్థానం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ, వైస్ ఛైర్పర్సన్ గా తొలి సారిగా మైనార్టీ మహిళను నియమించారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. వైఎస్సార్సీపీకి ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవుల్లో 68 శాతం(29 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ అదే ప్రాధాన్యం ఇచ్చారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి వంటి వారు కూడా ఈ స్థాయిలో ఆ వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ... ఇప్పటికి 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నవ రత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ. 2.40 లక్షల కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా జమా చేశారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. దీని ద్వారా ఆ వర్గాల ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కి, ఆర్థిక సాధికారత సాధించడానికి బాటలు వేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. సుమారు 30 లక్షల మందికిపైగా ఇంటి స్థలాలను ఇచ్చి, పక్కా గృహాలను నిర్మిస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి అభివృద్ధి చేసి... ఇంగ్లీషు మీడియం భోదనను ప్రవేశపెట్టి... అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ ఆ వర్గాలు విద్యా సాధికారత సాధించడానికి బాటలు వేశారు. ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా ఊతమిచ్చి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే, అందులో గత 53 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షలు. సామాజిక సాధికారత సాధించడానికి బాటలు వేసిన సీఎం వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదల్లోనూ నానాటికీ ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, నగరపాలక వంటి స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ... బద్వేలు, ఆత్మకూరు శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రికార్డు మెజారిటీతో విజయం సాధించడమే అందుకు నిదర్శనం. గత 53 నెలలుగా జగన్ చేసిన మేలును వివరించడానికి అక్టోబర్ 26 నుంచి వైఎస్సార్సీపీ ప్రారంభించిన సామాజిక సాధికార యాత్రకు అన్ని వర్గాల పేదలు బ్రహ్మరథం పడుతూ, 2024 ఎన్నికల్లోనూ సామాజిక న్యాయ నిర్మాత జగనే కావాలి జగనే రావాలి అంటూ ఒక్కటై నినదిస్తున్నారు. – రామగోపాల్ ఆలమూరు‘సాక్షి’ స్పెషల్ కరెస్పాండెంట్ -
ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు
సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర.. ఏపీ రాజకీయ ప్రస్థానంలో మరిచిపోలేని ఒక ఘట్టం. నేటితో(సోమవారం) ఆ యాత్ర పూర్తై నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ సురేష్ తదితరులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి జగన్. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు మ్యానిఫెస్టోలో రూపొందించారు. ఇప్పటివరకూ 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి చేశారు. ప్రజలకు ఏమీ కావాలో అది చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్. ప్రజలకు మంచి చేశారు కనుకే దైర్యంగా ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతున్నారు. జగన్ జీవితం తెరచిన పుస్తకం. వైఎస్సార్సీపీ అంటే దేశంలోనే విలక్షణమైన పార్టీగా నిలబడింది. ప్రజల నమ్మకాన్ని జగన్ ఏనాడూ వమ్ము చెయ్యలేదు. చాలా వరకూ అధికార పార్టీలు ముందస్తు కోరుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. 2024లో షెడ్యుల్ ప్రకారమే రాష్టంలో ఎన్నికలు జరుగుతాయి. పవన్-చంద్రబాబులు తమ అక్రమ సంబంధాన్ని పవిత్రం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ చావుకు కారణం అయిన వారిని పరామర్శించడం ఏంటి? అక్రమ సంబంధాన్ని సక్రమం చెయ్యడం కోసం కలుస్తున్నారు. తెలంగాణలో కిందా మీదా పడి బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు చంద్రబాబు. టీడీపీ -జనసేన కలవడం శుభపరిణామం అని సీపీఐ రామకృష్ణ అంటున్నాడు. ఎరుపు కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో.?, బలమైన జగన్నీ ఎదుర్కోడానికి వీళ్లంతా ఏకం అవుతున్నారు. చంద్రబాబు, పవన్‌లు ఎన్ని పగటి కలలు కన్నా ప్రజాబలం ఉన్న జగన్నీ ఏమీ చెయ్యలేరు. ఒకవైపు జగన్ ఉన్నారు.. ఆటు వైపు గుంట నక్కలు ఉన్నాయి. ప్రజల్లో ఉండి, ప్రజలకు ఏం కావాలో అది చేసిన నాయకుడు జగన్. చంద్రబాబు, పవన్ ఏ విలువలు, సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారో ప్రజలకు అర్థం అయింది. ఒక బలవంతమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారంతా ఒకటవుతున్నారు. సీపిఐ రామకృష్ణ కామెంట్స్ విచిత్రంగా ఉంది. మరి బీజేపీ కూడా వారితో కలిస్తే ఏం చెప్తారు?, ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. దుష్టశక్తులు ఇంకా ఏమేమి చేస్తాయో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం అవటాన్ని జనం చూడాలి. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్తారు’ అని పేర్కొన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో వేల సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టాం. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నినాదం వచ్చింది’ అని స్పష్టం చేశారు. -
మహా సంకల్పానికి జన నీరాజనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. ఊరూవాడా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత కేక్‌లు కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పట్లో పాదయాత్ర చేపట్టడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. పాదయాత్రలో ప్రజల సమస్యలు, కష్టాలను దగ్గర నుంచి చూసి.. వాటిని పరిష్కరించడానికి ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం.. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నాలుగు నెలల్లోనే 98 శాతం హామీలను అమలు చేయడాన్ని చాటిచెబుతూ ప్రజాప్రతినిధులు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గృహ నిర్మాణ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వాసుబాబు, కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాపరెడ్డి, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు పాల్గొన్న వారికి నూతన వస్త్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. పాదయాత్ర హామీలే ఎన్నికల మేనిఫెస్టోగా.. ఈ సందర్భంగా గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 98 శాతం హామీలను అమలు చేశారన్నారు. పాదయాత్ర లక్ష్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్లారన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, వికేంద్రీకరణతో సుపరిపాలన అందిస్తుండటంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక కుప్పకూలిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌తో కలసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ప్రజలు నిర్మించిన వైఎస్సార్సీపీ కంచుకోటను బద్ధలు కొట్టలేరని స్పష్టం చేశారు. సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు నిరంకుశ పాలనను నిరసిస్తూ, ప్రజలకు నేనున్నానంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన 3,648 కిమీల పాదయాత్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చి సామాజిక మహావిప్లవాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారని కొనియాడారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఊరూరా వేడుకలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి ఐదేళ్లు గడచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మరపురాని మహా ‘సంకల్పం’
నాకున్నదల్లా ఒక్కటే కసి. నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని.. అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు మంచి జరగాలన్న కసి. అన్ని కులాల్లోని పేదలను ఆదుకోవాలన్న కసి. రాష్ట్రాన్ని దేశ శిఖరాగ్రాన నిలపాలన్న కసి. – ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఆదివారంతో సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం సృష్టించి చరిత్రకెక్కింది. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6వ తొలి అడుగు వేశారు. ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లను తుడిచారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరచిన 98 శాతం హామీలను మూడున్నరేళ్లలోనే నెరవేర్చారు. కోట్లాది హృదయాలను స్పృశించిన ప్రజా సంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. ‘జయహో జగన్’ అంటూ తరలి వచ్చిన ప్రజానీకం తమ సాధక బాధకాలను తెలియచేసింది. పూలబాట పరచి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, ఉపాధి లేని యువత, విద్యార్థులు, రైతన్నలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. జగన్ అనే నేను.. పాదయాత్రలో ‘వైఎస్ జగన్ అనే నేను..’ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ‘వైఎస్ జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను..’ అని చెప్పే వరకు నడిపించాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ఇంకా నడిపిస్తునే ఉన్నాయి. 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల వైఎస్సార్ సీపీ ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ సీఎం జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని కనబరిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్రను తిరగరాశారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఏకంగా 19 చట్టాలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా.. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన సీఎం జగన్ అందులో పేర్కొన్న ‘నవరత్నాల’ అమలును వడివడిగా చేపట్టారు. భారీ ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ బిల్లు రూపొందించి కేంద్రానికి పంపారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలనే దృఢ సంకల్పంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని కులాలు రాజకీయంగా సమానంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు కాగా కోవిడ్ కష్ట కాలంలోనూ నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరోఎత్తు. ఒక వైపు గత సర్కారు రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో ముంచెత్తి ఖాళీ ఖజానా అప్పగించింది. మరో వైపు ప్రపంచవాప్తంగా మహమ్మారి కరోనా కమ్మేసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రానికి పునరుజ్జీవం కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారు. నేడు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు, కేక్ కటింగ్‌లు జననేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నవంబర్ 6వతేదీతో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, కేక్ కటింగ్‌లు చేయాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సూచించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 97 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారని పేర్కొంది. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ నేటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. -
Andhra Pradesh: జనపథం.. జగన్ మార్గం
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. భవితపై భరోసా కల్పిస్తూ నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నేటికి మూడేళ్లు. జన జీవనాన్ని దుర్భరంగా మార్చిన టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడి.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే రాజన్న రాజ్యం సాధనే లక్ష్యంగా 2017 నవంబర్ 6న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి తొలి అడుగు వేశారు. ప్రజల సమస్యలు వింటూ.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ.. జనంలో ఆత్మస్థైర్యం నింపారు. ఎముకలు కొరికే చలిలో.. మండే ఎండల్లో.. కుండపోత వర్షాల మధ్య 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. చారిత్రక విజయంతో ప్రజారంజక పాలన ► పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాల్లో, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. రాజన్న రాజ్యానికి అదే రోజే పునాది వేశారు. ► ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి ఏడాదే 95 శాతం అమలు చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. సంక్షేమ పథకాల ద్వారా 1.16 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశారు. ► వివిధ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 50 శాతానికిపైగా కేటాయించి.. సామాజిక న్యాయానికి అసలు సిసలు నిర్వచనం చెప్పారు. అందులో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశారు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ► వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చి వేసిందని ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొన్నారు. 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు యాత్ర సాగిందని తెలిపారు. -
ప్రజాసంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు
-
వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌దే
-
నా యాత్ర.. నా ప్రయాణం ప్రజల కోసమే
-
పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తి అయిన సందర్బంగా వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో సంబరాలు
-
మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం
‘నాకున్నదల్లా ఒక్కటే కసి. నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని.. అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు మంచి జరగాలన్న కసి. అన్ని కులాల్లోని పేదలను ఆదుకోవాలన్న కసి. రాష్ట్రాన్ని దేశ శిఖరాగ్రాన నిలపాలన్న కసి’ అంటూ అశేష జనవాహిని నడుమ.. పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా చేస్తున్న జైజగన్ నినాదాల మధ్య సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ చెప్పిన మాటలివి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ మాటలకు కట్టుబడే పాలన సాగిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం.. చరిత్రాత్మకం. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. ( ఫైల్ ఫోటో ) రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. అన్ని జిల్లాల్లో జనం ‘జయహో జగన్’ అంటూ తరలి వచ్చి తమగోడును వెళ్లబోసుకున్నారు. మరో వైపు పూలబాట వేసి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, అర్హతలున్నా ఉద్యోగం.. ఉపాధి లేని యువత, విద్యార్థులు, అన్నమో రామచంద్రా అంటూ రైతులు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఎక్కడికక్కడ వారి బాధలు చెప్పుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో అక్క చెల్లెమ్మలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఫైల్) జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. పాదయాత్రలో ప్రజలకు ‘జగన్ అనే నేను’.. అంటూ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ఆయన్ను ‘జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను’ అని చెప్పే వరకు నడిపించాయి. ఇప్పటికీ అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వరకు నడిపిస్తున్నాయి. 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్రను తిరగరాశారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఏకంగా 19 చట్టాలు చేశారు. ( ఫైల్ ఫోటో ) సంక్షేమాభివృద్ధి రెండు కళ్లుగా.. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్.. అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. భారీ ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం కోసం బిల్లు రూపొందించి, కేంద్రానికి పంపారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని కులాల వారు రాజకీయంగా సమానంగా ఎదగాలనేదే సీఎం జగన్ లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కోవిడ్ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరో ఎత్తు. ఒకవైపు గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో పడేసి అప్పగించింది. మరో వైపు ప్రపంచంలోనే భయంకరమైన మహమ్మారి కరోనా కమ్మేసింది. అయినా... మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడక రాష్ట్రానికి పునరుజ్జీవం తెచ్చారు ముఖ్యమంత్రి జగన్. సచివాలయ వ్యవస్థతో గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుల ముందు నిలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్సార్ ఎలాగైతే సంక్షేమ పాలనను అందించారో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తన తండ్రి బాటలో పయనిస్తూనే ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహానేతతో కలిసి పని చేసిన తామంతా.. జగన్, తన తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండగలరా.. అని తొలుత ఆలోచించామన్నారు. అయితే తమ సందేహాల న్నింటినీ పటాపంచలు చేసేలా జగన్ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ఆశయ సాధన దిశగా పయనిస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వ నిర్వాకాల కారణంగా పలు రకాల సంక్షోభాలతో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని వైఎస్ జగన్ గట్టెక్కించడమే కాకుండా, సంక్షేమ పాలనను అందిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఎంత పవిత్రమైనవో తమకు ఎన్నికల మేనిఫెస్టో కూడా అంతే పవిత్రమైందని చెప్పిన నేతగా జగన్‌ను బొత్స కొనియాడారు. ఏడాదిన్నరలోనే 90 శాతం హామీలను అమలు చేసిన సీఎంగా చరిత్రలో తనకు తెలిసి మరొకరు లేరన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే ప్రజలతో చర్చించి వాటిని మరింత పటిష్టం చేస్తామన్నారు. కుట్రలకు అదర లేదు, బెదరలేదు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఉంటే తమకు అడ్డం అనుకున్న ఏ దుష్టశక్తులు కుట్ర చేశాయో తెలియదు గానీ ఆయన్ను అంతమొందించేందుకు యాత్రలో హత్యాయత్నం జరిగిందన్నారు. అయినా ఆయన అదర లేదు.. బెదర లేదన్నారు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్ తన తండ్రి వైఎస్సార్ సమాధి ఇడుపులపాయ సాక్షిగా అశేష జనవాహిని మధ్య పాదయాత్రను ప్రారంభించారని గుర్తు చేశారు. జగన్ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారని చెప్పారు. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఈరోజుకీ కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ చేసిన యాత్ర చరిత్రలో నిలిచి పోయిందన్నారు. పాదయాత్ర ఆసాంతం పాల్గొన్న వారికి సన్మానం ఈ కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రి జగన్‌ను దీవిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ ముఖ్య నేతలంతా నివాళులరి్పంచారు. జగన్‌తో పాటు పాదయాత్రలో ఆసాంతం పాల్గొన్న నేతలు, కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి, జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు, కనకదుర్గ దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు, అధికార ప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. -
సంకల్పానికి సలాం
సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ అంటూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఇంటింటా ఆరా తీశారు. జై జగన్.. అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ అంటూ కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా సాగిన ఈ యాత్రలో వైఎస్ జగన్ నాడు ప్రజల కష్టనష్టాలను కళ్లారా చూశారు. ప్రజలందరి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నవరత్నాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ప్రజలు అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టడంతో అధికార పగ్గాలు చేపట్టి.. నేడు ఆ ప్రజలందరి ఆకాంక్షల మేరకు పాలన కొనసాగిస్తున్నారు. గత 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. మా మేనిఫెస్టో మాకు ఓ భగవద్గీత, ఓ బైబిల్, ఓ ఖురాన్ అని చెప్పిన మాటలను అక్షరాలా అమలు చేస్తున్నారు. ఎన్నెన్నో విప్లవాత్మక చట్టాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజా చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు. – కృష్ణా జిల్లాల్లోని విజయవాడ తూర్పు, సెంట్రల్, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు నిర్వహించారు. పాదయాత్ర ద్వారా పలు సమస్యలు పరిష్కరించారు. – గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, మాచర్లలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. – విశాఖ జిల్లాలో పార్టీ నేతలు తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, అనంతరం బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. – విజయనగరం జిల్లాలో ఉత్సవాలు మిన్నంటాయి. భాజాభజంత్రీలతో సాగిన ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. – తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు.. పాదయాత్రలు, సేవా కార్యక్రమాలతో పాటు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్‌రామ్, తదితరులు పాల్గొన్నారు. – అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధులు రచ్చబండ కార్యక్రమాలు, పాదయాత్రలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్ల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. – శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. – వైఎస్సార్ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రైల్వేకోడూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటిలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన పాదయాత్రలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు. కుప్పం, చిత్తూరులో ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. – కర్నూలు జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలకు విశేష స్పందన లభించింది. అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. – ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. – శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. – పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం పాదయాత్రలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాదయాత్ర చేశారు. -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అద్వితీయమైన రీతిలో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే నా కసి.. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. -
ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు రేపటితో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 'ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు' పేరిట 10రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.(చదవండి : ఏపీ: 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వే) 'పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను వైఎస్ జగన్ దగ్గర్నుంచి చూశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చారు. సీఎం జగన్ విశ్వసనీయతకు కట్టుబడి పాలన సాగిస్తున్నారు.గత ప్రభుత్వం ఊహకందని అప్పులు మిగిల్చి వెళ్లింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయ్యింది.కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రజల్ని ఆదుకున్నాం. సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశారు కాబట్టే నిర్ణీత సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమాల్లోనియోజకవర్గ ఎమ్మెల్యేలు ,ఇన్ చార్జ్ లు ,స్థానిక నేతలు పాల్గొంటారు' అని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన సీడీ, కరపత్రాలను సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.(చదవండి : మానవత్వం చాటుకున్న మహిళా మంత్రులు) -
‘వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే తమకు అంటగట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు చేస్తే, చంద్రబాబు ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. ‘‘జడ్జి సోదరుడిపై దాడి చేసింది టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అని తేలింది. ఇప్పుడు చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి. రామకృష్ణ అనే వ్యక్తి వెనుక టీడీపీ ఉందని తెలిసిపోతోంది. ప్రతాప్ రెడ్డి వైసీపీ అని తేలితే నేను రాజకీయాలు మానుకుంటా. టీడీపీకి దళితులు, మైనారిటిలపై గౌరవం లేదు. అధికారం పోయేసరికి వారిపై చంద్రబాబుకు ప్రేమ పుట్టింది’ అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే కోపం’) సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకం ద్వారా 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘పాదయాత్ర సమయంలో సీఎం జగన్ కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను గమనించారు. అన్ని జిల్లాల్లోనూ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆనాడే అన్ని ప్రాంతాలకు నీరు అందించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. సాగునీరందని భూములకు రూ. 2340 కోట్లతో బోర్లు వేయాలనుకున్నారు. కానీ అప్పటికప్పుడు మరో రూ.1600 కోట్లతో మోటార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.164 నియోజకవర్గాల్లో ఒక్కో రిగ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఒక్క రైతు వైఎస్ జగన్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
జననేత పాదయాత్ర పుస్తకావిష్కరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జననేత పాదయాత్రపై గొల్లల మామిడాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి రాసిన పాదయాత్ర పుస్తకాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు క్యాంపు కార్యాలయం విడుదల చేశారు. కాఫీ టేబుల్ బుక్ తరహాలో ఈ పుస్తకాన్ని ముద్రించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రస్తావనతో మొదలైన ఈ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర, రాజ్యాధికారం చేపట్టడం, నవరత్నాలు అమలు తదితర అంశాలపై సాగింది. ప్రత్యేక కథనాలతో కూడిన ఛాయాచిత్రాలు ఆకట్టుకున్నాయి. 150 పేజీల ఈ పుస్తకాన్ని వినాయక పబ్లికేషన్స్ ప్రచురించింది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు భీమవాదం భరత్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వజ్ర సంకల్పం
-
ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి ఏడాది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ అమరావతి: ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017 నవంబర్ 6వ తేదీన మొదలైన ప్రజా సంకల్ప యాత్ర గత ఏడాది జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల మీదుగా సాగిన ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి గత ఏడాది మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా తొలి సంతకంతోనే అవ్వా తాతల పింఛన్‌ను రూ.2,250 చేసి దివంగత వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించారు. ఏటా రూ.250 పెంచుకుంటూ వెళతామని చెప్పారు. మీ కష్టాలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని చెప్పిన మాటను మరవకుండా అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన మేరకు నవరత్నాల పథకాల్లో 90 శాతం ఇప్పటికే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగించి నేటికి సరిగ్గా ఏడాడైన నేపథ్యంలో ఇదే రోజు ప్రతిష్టాత్మక ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుడుతుండటం విశేషం. -
ప్రజా సంకల్ప జాతర
సాక్షి, తూర్పు గోదావరి: ఎన్నో ఆశలు.. మరెన్నో సమస్యలు.. ఇంకెన్నో వినతులు.. విన్నారు.. నేనున్నా అన్నారు.. భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇంకేముంది ప్రజలే గెలిపించుకున్నారు. పగ్గాలు చేపట్టిందే తడవుగా నవోదయానికి నాందిగా నవరత్న మాలికలను అందజేసే పనిలో నిమిషం ఖాళీ లేకుండా ముందుకు సాగిపోతున్నారు. మమ్మల్ని వదిలేశారు అనే మాట లేకుండా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా భూమిని సాగు చేస్తున్న రైతు ఏ మేరకు లబ్ధి పొందుతున్నాడో.. అదే స్థాయిలో కౌలు రైతుకూ నేనున్నా అంటూ భరోసా ఇచ్చి చేతల్లోనూ రైతు బాంధవుడని అనిపించుకున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి మొదలుకొని ధరల స్థిరీకరణ వరకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అలాగే ఆశా కార్యకర్తల వేతనాల పెంపుతో ఆయా వర్గాలు ఎంతో హుందాగా బతికేందుకు ఆసరా కల్పించారు. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు రూ.వెయ్యి పెంచడంతో వారి ఆనందానికి అవధులు లేవు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు మానసిక స్థైర్యం కల్పించారు. ఇక ఆక్వా రంగం అభివృద్ధికి విద్యుత్ చార్జీల తగ్గింపు, ఏజెన్సీ ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నిర్ణయాల పట్ల ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే ఆలయ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయం భగవంతుడి ముందు అంతా సమానమని చెప్పకనే చెప్తూ వివక్షకు తావులేని ప్ర భుత్వం తమదని చాటి చెప్పారు. ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా తగ్గించే విధంగా మొదట బెల్టు దుకాణాల పైనా.. తరువాత మద్యం దుకాణాల తగ్గింపుపైనా చకచకా నిర్ణయాలు తీసుకుని అక్కచెల్లెమ్మల చేత ఇది కదా జగనన్న ప్రభుత్వం అంటే అనిపించేలా సాగిపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంగన్వాడీల్లో ఆనందోత్సాహాలు కాకినాడ సిటీ: జిల్లాలోని అంగన్వాడీలకు జీతాల పెంపు ప్రతిపాదన కేబినెట్ ఆమోదం పొందడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. చిరుద్యోగులపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలను ఆయా వర్గాలు అభినందిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,545 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 5,113 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 432 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. 5,113 మంది అంగన్వాడీ హెల్పర్లు (ఆయాలు) ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు గతంలో రూ.10,500 వేతనం ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1000 అదనంగా పెంచడంతో వీరికి వేతనం రూ.11,500 పెరిగింది. ఆయాకు గతంలో రూ.6 వేల వేతనం ఉంటే ఇప్పుడు రూ.1000 పెంచడంతో వేతనం రూ.7 వేలు అయ్యింది. తాజా వేతనాలు జూలై నెల నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో సుమారు 11 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ కార్యకర్తలకు నెలకు రూ.1.1 కోటి వేతనాలు అదనంగా చెల్లించనున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. గ్రామాల్లో కొలువుల జాతరే బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోను పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల్లో మమేకమై, రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో పదిమందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 1072 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 24,440 మంది గ్రామ వలంటీర్ పోస్టులు, 12,700కు పైగా గ్రామ సచివాలయాల్లో పోస్టులు మంజూరు కానున్నాయి. జగన్మోహన్రెడ్డి అన్నమాట ప్రకారం ఆగస్టు 15 నాటికి వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించి అక్టోబర్ రెండు నుంచి గ్రామ సచివాలయాలకు ఊపిరిపోయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామానికి పది మందిని ఉద్యోగాల్లో నియమించడం, ప్రతి కుటుంబానికి ఒక వలంటీర్‌ను నియమించడం వల్ల గ్రామ ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ సెంటర్‌కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మీ సమస్యని సంబంధిత అధికారులకు తెలియజేస్తాం అనేవారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారమయ్యేవి కాదు. ఇప్పడు అలా కాకుండా సీఎం కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్ నేరుగా వలంటీర్లకు రావడం, వాటిని 72 గంటల్లో పరిష్కరించే విధానమే ఈ గ్రామ సచివాలయాల లక్ష్యం. తద్వారా పల్లెలు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలుగా తయారుకాగలవు. గిరిజనులకు వరం ఉచిత విద్యుత్ రంపచోడవరం: ఆదివాసీలకు నెలకు 200 యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించడంపై ఏజెన్సీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు భారంగా మారిన తరుణంలో 200 యూనిట్ల వరకు గిరిజనులు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం శాసన సభలో ప్రకటించింది. దీంతో విద్యుత్ బిల్లుల కోసం వినియోగించే డబ్బులు తమ ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 37,119 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. అలాగే చింతూరు ఐటీడీఏ పరిధిలో మరో 22 వేల మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. పాదయాత్ర ద్వారా గిరిజన పల్లెల్లో సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గిరిజనుల కష్టాలు తెలుసుకుని.. గ్రామాల్లో గిరిజనుల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్ గిరిజనులకు విద్యుత్ బిల్లులో 200 యూనిట్ల వరకూ ఉచితం ప్రకటించడం ఆనందంగా ఉంది. అరకొర ఆదాయంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న మాకు ప్రభుత్వ ప్రకటన వరంగా మారింది. –బందం విజయలక్ష్మి , వీఆర్ పురం మద్యం.. పరిమితం మండపేట: దశల వారీ మద్యం నిషేధం అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేయగా, అక్టోబరు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపుల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న షాపుల్లో 25 శాతం రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 137 మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. నిబంధనలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా విక్రయాలు భారీగా తగ్గనున్నాయి. జిల్లాలో 546 మద్యం షాపులు ఉండగా, 45 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రోజుకు రూ.6.83 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లాలో మద్యాన్ని ఏరులై పారించింది. 2015 నాటికి జిల్లాలో 54 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 480 ప్రైవేటు దుకాణాలు ఉండగా విక్రయాలు పెంచుకునేందుకు ప్రభుత్వ దుకాణా లను రద్దుచేసి ప్రైవేట్ పరం చేసింది. గుడి, బడి పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ దుకాణాలు వెలిశాయి. లిఫ్టింగ్‌ను తెరపైకి తెచ్చి బెల్టుషాపుల ఏర్పాటులో వ్యాపారులకు వెసులుబాటు ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కింది. ఈ హైవేలను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్డు (ఎండీఆర్)ల పరిధిలోకి తీసుకువచ్చి హైవేలలో యథేచ్ఛగా మద్యం విక్రయించుకునే అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. దశలవారీ నిషేధం దిశగా అడుగులు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే దశలవారీగా మద్య నిషేధం హామీపై తొలి అడుగువేశారు జగన్. బెల్టు షాపు తీయకుంటే మద్యం దుకాణం లైసెన్సు రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్టోబర్ నుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ప్రస్తుత షాపుల లైసెన్సును పొడిగించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందాలు ఇచ్చిన నివేదికలపై గురువారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం వల్ల బెల్టు షాపులు ఉండవు. నిర్ణీత వేళల్లోనే దుకాణం తెరిచి ఉంచడంతో విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలకు బ్రేక్ పడుతుంది. దీంతో మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పలువురు అంటున్నారు. -
జగనే..ప్రభంజనమై
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): గతేడాది జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్డు కమ్ రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జననేతకు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. లక్షలాది మంది తరలివచ్చి ‘తూర్పు’లోకి జననేతను తోడ్కొని వచ్చారు. అక్కడి నుంచి ఏకధాటిగా అలుపెరగని విధంగా పాదయాత్రగా ఆయన ముందుకు సాగారు. కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అరుదైన మైలురాళ్లు అధిగమించారు. 2,400, 2,500, 2,600, 2,700 కిలోమీటర్ల మైలురాళ్లను దాటి చరిత్ర సృష్టించారు. 200వ రోజు కూడా ఇక్కడే పూర్తి చేసుకున్నారు. ఇది జిల్లా చరిత్రలో అరుదైన ఘట్టంగా లిఖితమైంది. జిల్లాలోని 17 నియోజకవర్గాల పరిధిలోని 32 మండలాల్లో ఉన్న 232 గ్రామాల్లో పాదయాత్ర సాగించిన జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. 412 కిలోమీటర్ల మేర నడిచి జిల్లాలో చరిత్ర సృష్టించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 15 బహిరంగ సభల్లో పాల్గొని జిల్లాలోని అనేక వర్గాల వారికి పలు హామీలిచ్చారు. అడుగడుగునా పూల వర్షం అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ...నుదుట తిలకం దిద్ది మంగళహారతులిస్తూ...దిష్టి తీస్తూ ఎక్కడికక్కడ మహిళలు జననేతకు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డను చూసేందుకు వృద్ధులు సైతం ఓపిక తెచ్చుకుని రోడ్లపైకి వచ్చారు. యువకుల సందడి, విద్యార్థినుల హడావుడి... రాఖీలు కట్టిన అక్కా చెల్లెమ్మల ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఓ వైపు ఘన స్వాగతం పలికిన జనం...మరోవైపు సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ తరలివచ్చిన బాధిత ప్రజలు... ఇలా ఎక్కడికొచ్చినా జన కోలాహలమే. సమస్యలతో సతమతమవుతున్న వారందరూ జగన్‌కు తమ బాధలను చెప్పుకున్నారు. అందరి సమస్యలూ ఓపిగ్గా విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా మేలు చేస్తానని, నవరత్నాలతో అందర్ని ఆదుకుంటానని , రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి వారికి భరోసా ఇచ్చారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, నిర్లక్ష్య పాలనను నడిరోడ్డుపై జగన్ నిగ్గ దీసినప్పుడు జనం పెద్ద ఎత్తున ఈలలు వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు...మంత్రులు,..ముఖ్య నేతల వరకు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో చెప్పినప్పుడు ఔనంటూ నినదించారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయిన బాధితులు అన్నొడొచ్చాడు...అండగా ఉంటానని హామీ ఇచ్చారని ఊరట చెందారు. ఇసుక వేస్తే రాలనంతగా బహిరంగ సభలకు జనం పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా జననేతకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పొడవునా ప్రజలు బారులు తీరడంతో రహదారులు జన గోదారులయ్యాయి. గోదారమ్మలా జనాభిమానం పొంగి పొర్లింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లిన ప్రతిచోటా జనసంద్రమయ్యింది. ప్రజలతో మమేకమై....ప్రజా సమస్యలు తెలుసుకుని....వారికి భరోసా ఇచ్చి....ముందుకు సాగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఒక ప్రభంజనంలా సాగింది. పాదయాత్ర ఆద్యంతం మహిళలు, రైతులు, విద్యార్థు«లు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు పాదయాత్రలో జననేతను కలిసి తమ బాధలు చెప్పుకుని భరోసా పొందారు. మండుటెండలను లెక్కచేయలేదు. జోరున వర్షం కురిసినా వెనక్కి తగ్గలేదు. పాదయాత్రను ఏకధాటిగా కొనసాగించారు. జిల్లాలో అనేక వారధులను దాటుకుని పాదయాత్రను సాగించారు. జిల్లాలో పాదయాత్ర సాగిన కిలోమీటర్లు 412 నియోజకవర్గాలు 17 మండలాలు 32 గ్రామాలు 232 మున్సిపాలిటీలు 8 కార్పొరేషన్లు 2 బహిరంగ సభలు 15 ఆత్మీయ సమావేశాలు 2 పాదయాత్ర జరిగిన రోజులు 50 అధికారమిచ్చారు సుదీర్ఘ యాత్రలో వైఎస్ జగన్ వెంట వేలాదిగా కదిలారు. అడుగులో అడుగేసి నడిచారు. ‘మీ వెంటే ఉం టామని’ చెప్పారు. ‘మాకు అండగా ఉంటున్న మీకు మద్దతిస్తామంటూ’ అభి మానం చూపారు. మాట ఇస్తే మడమ తిప్పని వంశం నుంచి వచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయ చేస్తారని అప్పుడే భావించారు. ఎన్నికలెప్పుడు వస్తాయా? ఎప్పుడు ఓటేసి గెలుపిద్దామా? అని నాడే శపథం పూనారు. అన్నట్టుగానే సార్వత్రిక ఎన్నికల్లో కసిగా ఓటేశారు. మాట మీద నిలబడే నేత కోసం అర్ధరాత్రి వరకు బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జననేతను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గెలిపించి పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.ఆ రోజులు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆ అడుగుల సవ్వడి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆ జన ప్రవాహం కళ్లల్లో కదులుతూనే ఉంది. పరవళ్లు తొక్కే గోదారమ్మలా సాగిన యాత్ర....జనదారులుగా మారిన రహదారులు... నేల ఈనిందా...ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టుగా జరిగిన సభలు ఇంకా కళ్లెదుటే కదలాడుతున్నాయి. ఆ మహత్తర ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో అడుగు పెట్టి అప్పుడే ఏడాదైంది. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర గతేడాది జూన్ 12న జిల్లాలో అడుగుపెట్టింది. ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో ఎన్నో సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులను కళ్లారా చూశారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. బాధలను విన్నారు. అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను నెరవేరుస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పనని చేసిన వ్యాఖ్యలను కార్యరూపంలో పెట్టారు. ఊహకందని విధంగా ‘సంక్షేమ’ సంతకాలు చేస్తున్నారు. నెరవేర్చుతున్న హామీలు పాదయాత్రలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. వ్యక్తిగత ఇబ్బందులు తెలియజేశారు. బాధలు చెప్పుకుని ఉపశమనం పొందారు. అన్నీ వింటూ నేనున్నానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కన్నీళ్లు తుడిచి అధికారంలోకి వసే తానేం చేస్తానో చెప్పి ఊరట కల్పించారు. అక్కడికక్కడే అనేక హామీలిచ్చారు. ► ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలమిచ్చి, ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు నిన్న జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ► సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా కార్యరూపంలోకి తెచ్చారు. ► దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నిషేధం అమలుకు అడుగులు వేశారు. ► గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతానని చెప్పిన జగన్ కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల నియామకానికి ఆయన ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. ► యానిమేటర్లకు ప్రతి నెలా రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అధికారిక ప్రకటన చేశారు. ► నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన పథకాలన్నింటినీ అమల్లోకి తెస్తున్నారు. -
పేదోళ్లనూ వదల్లేదు
సాక్షి, అమరావతి : సహజ వనరులైన ఇసుక, మట్టి నుంచి భారీఎత్తున దోపీడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు ఆఖరికి పట్టణ పేదలనూ వదలకుండా వారి ఇళ్ల నిర్మాణాల్లో భారీ దోపిడీకి పాల్పడింది. పట్టణ ప్రాంత పేదలకు కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో సీఎం చంద్రబాబు కాజేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ వ్యయం... ఏపీలో నిర్మాణ వ్యయానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలే ఇందుకు నిదర్శనం. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో చేపట్టిన ఐదు లక్షల నిర్మాణాల్లో ఏకంగా రూ.13,170.75 కోట్లు కాజేశారు. ఒక పక్క యూనిట్ వ్యయం పెంచి ఆ మొత్తాన్ని ఖజానా నుంచి తీసుకుంటూ, మరోపక్క పేదలపై ఏకంగా రూ.17,730 కోట్ల అప్పుల భారం మోపుతూ ఈ దోపిడీ ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో సాగింది. దీనిని అధికార వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. ఇది ఖజానా దోపిడీ.. వాస్తవానికి ఈ నిర్మాణాలను షీర్వాల్ టెక్నాలజీతో చేపట్టారు. దీనిప్రకారం యూనిట్ వ్యయం బాగా తక్కువగా ఉండాలి. కానీ సంప్రదాయ నిర్మాణాలకు మించిన యూనిట్ ధరను షీర్వాల్ టెక్నాలజీకి నిర్ణయించారు.వ్యూహాత్మకంగా రూ.పదితో అయ్యే పనికి కాంట్రాక్టర్లకు తొలుతే రూ.20 ఇచ్చేసి... వారి నుంచి ఆ పది రూపాయలను తిరిగి తీసుకున్నారు. దీన్ని ‘ఖజానా నుంచి దోపిడీ’గా ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. పొరుగున ఉన్న కర్ణాటకలో సంప్రదాయంగా 367 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ యూనిట్ వ్యయం రూ.3.80 లక్షలు మాత్రమే. అంటే చదరపు అడుగుకు రూ.1,356. ఇందులోనే విద్యుత్ సహా అంతర్గత, బాహ్య మౌలిక సదుపాయాలన్నీ కలిపి ఉంటాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం 300 చదరపు అడుగుల ఇంటి యూనిట్ వ్యయం రూ.5.98 లక్షలుగా, 365 చదరపు అడుగుల ఇంటి వ్యయం రూ.6.83 లక్షలుగా, 430 చదరపు అడుగుల యూనిట్ వ్యయం రూ.7.68 లక్షలుగా నిర్ధారించింది. షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.2,134.77గా నిర్ధారించింది. కర్ణాటక కంటే అదనంగా నిర్ధారించిన రూ.734 మొత్తం సొంత ఖాతాల్లోకి వేసుకోవడానికే అని తెలుస్తోంది. పేదలపై రూ.17,730.88 కోట్ల రుణ భారం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఈ మూడు లక్షల రూపాయలతోనే పట్టణ పేదలకు చక్కటి ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదలపై అప్పుల భారం మోపి యూనిట్ వ్యయాన్ని భారీగా పెంచేసింది. ఒక్కో పేదవాడిపై రూ.2.65 లక్షల నుంచి రూ.4.65 లక్షల వరకు రుణ భారం మోపారు. ఈ ఇళ్ల నిర్మాణాలను కూడా చంద్రబాబు సర్కారు అస్మదీయ సంస్థలకే అప్పగించింది. ఇందులో ఎల్అండ్టీకి రూ.12 వేల కోట్లపైగా విలువైన పనులు, రూ.26 వేల కోట్ల పనులను షాపూర్ జీ పల్లోంజీ, ఎన్సీసీ, కనకమేడల వరప్రసాద్ సంస్థలకు ఇచ్చారు. మొత్తం ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.38,265.88 కోట్లుగా (మౌలిక వసతులతో కలిసి మొత్తం 17,92,50,000 చదరపు అడుగులు) నిర్ధారించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.7,500 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.13,035 కోట్లు. లబ్ధిదారుల (అప్పు) వాటా రూ.17,730.88 కోట్లుగా పేర్కొన్నారు. అయితే, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.734 మేర పెంచడం ద్వారా ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం రూ.17,730.88 కోట్లను దోచేసింది. 15 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్దిష్ట సమయం పెట్టుకున్నా అస్మదీయ కాంట్రాక్టర్లకు మరింత ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎస్కలేషన్ క్లాజ్‌ను టెండర్ నిబంధనల్లో పొందుపర్చారు. రుణమంతా మాఫీ చేస్తాం కమీషన్ల కోసం పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాన్నీ వదల్లేదని, వాటి అంచనాలను అక్రమంగా పెంచేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల్లో సభల్లో ఇప్పటికే పలుసార్లు ప్రస్తావించారు. అంతేకాక పట్టణ పేదలను అప్పుల పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను తీసుకోవాలని సూచిస్తూనే, వారిపై మోపిన ఈ అప్పుల భారాన్ని తమ పార్టీ అధికారంలోకి రాగానే తొలగిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీనిప్రకారం చూస్తే... ఐదు లక్షల మంది పట్టణ పేదల ఇళ్ల అప్పుల భారం మొత్తం రూ.17,730.88 కోట్లు రద్దయి ఉపశమనం కలగనుంది. -
జగన్ మాట.. ప్రగతికి బాట
సాక్షి, గుంటూరు : రాత్రి లేదు.. పగలు లేదు.. ఓవర్ డ్యూటీలు.. అడుగడుగునా తనిఖీలు.. కొంచెం రిమార్కు ఉన్నా మెమోలు, సస్పెన్షన్లు.. ఇన్ని కష్టాలకు ఎదురొడ్డి బతుకు చక్రాన్ని నడుపుతున్నా.. జీవిత భద్రత మాత్రం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ పోరాటాల జెండా ఎత్తినా, నిరసనల హారన్ మోగించినా పట్టించుకున్న దిక్కు లేదు. కనీసం వారి గోడు ఆలకించాలన్న ధ్యాస ప్రభుత్వానికి అంతకన్నా లేదు. ఈ ఐదేళ్లలో డబుల్ డ్యూటీలు, ఇంక్రిమెంట్లలో కోతలు, పనిష్మెంట్ వాతలతో కార్మికుల జీవితాలు కమిలిపోయాయి. అందుకే ఆర్టీసీ కార్మికులను కదిలిస్తే వారి కష్టాలన్నీ కన్నీటి ధారలవుతున్నాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో అనేక మంది ఆర్టీసీ కార్మికులను కలిశారు. వారి బాధలను మనసారా ఆలకించారు. తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేసిన విన్నపంపై జగన్ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చారు. మడమతిప్పని నేత మాట ఇవ్వడంతో కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ప్రగతి బాట పడతాయని నమ్ముతున్నారు. దశాబ్దాల నాటి డిమాండ్లు. ఆదుకోండయ్యా అంటే పట్టించుకోని ప్రభుత్వం. ఏకంగా సంస్థనే నిర్వీర్యం చేసే కుట్ర. ఇదీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి, అందులో పనిచేసే కార్మికులకు పట్టిన దుర్గతి. గత ఐదేళ్లలో తమకు జరిగిన అన్యాయానికి కార్మికులు రగిలిపోతున్నారు. రెండేళ్లకుపైగా ఎదురు చూస్తున్న 50 శాతం ఫిట్‌మెంట్‌ను ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నామమాత్రంగా 25 శాతం ఇచ్చి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచి, ఆర్టీసీ కార్మికులకు విస్మరించడం వారిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వైపే కార్మికులంతా మొగ్గు చూపుతున్నారు. నయవంచన.. ఆర్టీసీ ఉద్యోగులను తగ్గించే విధంగా వీఆర్ఎస్ జీవోను తీసుకువచ్చారు. దీనితో సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర పన్నుతుందని, ఆ జీవోను వెంటనే నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థలైన విమానాలకు 1 శాతం, రైల్వేకు 4 శాతం వ్యాట్ విధిస్తున్న ప్రభుత్వాలు, ఆర్టీసీకి మాత్రం డీజిల్‌పై 29 శాతం వ్యాట్ విధిస్తుంది. దీంతో ఆర్టీసీ లాభాలన్నీ కూడా డీజిల్‌కే పెట్టాల్సిన పరిస్థితి. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వ్యాట్‌ను సగానికి పైగా తగ్గించి కాస్త నష్టాల బారి నుంచి ఆర్టీసీని బయట పడేశారు. ఇప్పటికే పల్లె వెలుగు బస్సులను సగానికిపైగా రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్ బస్సులను అద్దె ప్రాతిపదికగా తీసుకుంది. అందులో కూడా టీడీపీకి చెందిన ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లనే నియమించారు. దీనికి తోడు మూడు శాతం ఉన్న ఎంవీ ట్యాక్స్‌ను 15 శాతానికి పెంచారు. గుంటూరు రీజియన్‌లో సమస్యలు గుంటూరు రీజియన్‌లో సిబ్బంది కొరత అధికంగా ఉండటంతో డబల్ డ్యూటీలు చేయాల్సిన దుస్థితి. ఇక మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డబుల్ డ్యూటీలు, కొన్ని ఫిట్నెస్ బస్సుల్లో విధులు నిర్వర్తిస్తూ బస్సులు ఆగిపోవడంతో రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. కనీసం మహిళల రెస్ట్ రూమ్ నిర్వహణ కూడా సక్రమంగా లేదు. గుంటూరు డిస్పెన్సరీలో మందుల కొరత అధికంగా ఉంది. గుంటూరులో మందులు దొరక్కపోతే విజయవాడ వెళ్లి తెచ్చుకోవాల్సిందే. గ్యారేజీల్లో ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానమే నడుస్తోంది. ఏటా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ చెప్పడం మంచి నిర్ణయం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ జరిగే లోపు ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు ఆర్టీసీకి కేటాయించి, ఉన్న అప్పులను ప్రభుత్వమే తీర్చాలి. పల్లె వెలుగు సర్వీసులకు డీజీల్‌పై వ్యాట్ తగ్గించడం ద్వారా ఆర్టీసీకి వచ్చే నష్టాలను కొంతైన తగ్గించవచ్చు. –రవీంద్రరెడ్డి, ఎన్ఎంయూ గుంటూరు రీజనల్ కార్యదర్శి మంచి రోజులు వస్తాయి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వలన సంస్థకు, అందులో పనిచేసే ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయి. ఇప్పటి వరకు కాలం చెల్లిన బస్సులతో తంటాలు పడుతున్నాం. ఆ సర్వీసుల స్థానంలో కొత్త బస్సులు వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. విద్యా, వైద్యం లాగానే ఆర్టీసీకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే.. కార్మికులకు న్యాయం జరుగుతుంది. – బి.వి.రమణ, కండక్టర్ -
ఉచిత బోరు.. రైతుల కష్టాలు తీరు
సాక్షి , విజయవాడ : కనుచూపు మేరలో ఎండమావులు తప్ప నీళ్లు కనపడవు. 15 వందల అడుగుల లోతున బావులు తవ్వినా జలధార జాడ కనపడదు. ఉన్న మోటబావులు ఎండిపోతున్నాయి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక.. మండే ఎండల్ని తాళలేక పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ప్రజలు ఎందరో.. ఆత్మహత్యలు చేసుకున్న వారు మరెందరో. ఈ పరిస్థితి ఒక్క రాయలసీమ జిల్లాలకే పరిమితం కాదు. గోదావరి జిల్లాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రాణం తీసిన అప్పు అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఆమె పేరు గంగమ్మకు నిండా 40 ఏళ్లు కూడా లేవు. ఆమె భర్త రామానుజకు 2.75 ఎకరాల పొలం ఉంది. ఏటా వర్షాలు పడకపోవడంతో తన పొలంలో బోరు వేయించాలని నిర్ణయించుకున్నాడు. రూ.70 వేల అంచనాతో పనులు మొదలుపెట్టగా.. రూ.5 లక్షలు దాటింది. మొదటి బోరు ఫెయిలైంది. రెండు, మూడు, నాలుగు కూడా ఫెయిలయ్యాయి. చివరి బోరులో నీరు పడినా కనకాంబరం పూల తోట ఎండిపోయింది. కారణం.. ఆ బోరు నుంచి వచ్చిన నీరు సరిపోలేదు. రామానుజ కంట నీరు ఆగలేదు. అప్పు పెరిగింది. వడ్డీ తడిసి మోపెడైంది. అంతిమంగా రామానుజ ఊపిరి ఆగింది. నిత్యం రాష్ట్రంలో ఇలా ఎందరో ఉసురు తీసుకుంటున్నారు. ఒకప్పుడు వంద, రెండు వందల అడుగులు తవ్వితే నీళ్లొచ్చేవి. ఇప్పుడు 1,500, 1,800 అడుగుల దిగువకు వెళ్లినా నీళ్లు కనిపించడం లేదు. మరీముఖ్యంగా.. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఎంత లోతుకు వెళ్లినా నీళ్లు పడటం లేదు. దీంతో అక్కడి రైతులు పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు. చేసిన బాకీలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఈ దుస్థితిని కళ్లారా చూసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఓ భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇది అమలైతే రామానుజ లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి రాదు. అందుకే.. లక్షలాది మంది అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. భూగర్భ జలాలే కీలకం వ్యవసాయంలో భూగర్భ జలాలు కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దాదాపు 45 శాతం భూమి భూగర్భ జలాల ఆధారంగా సాగవుతోంది. 1998 నుంచి 2003 మధ్య కాలంలో భూగర్భ జలమట్టం 2.50 మీటర్లు తగ్గింది. మోట లేదా దిగుడు బావులు ఎండిపోతున్నాయి. గొట్టపు బావుల సంఖ్య పెరుగుతోంది. కోస్తాలో 64 మండలాలు, రాయలసీమలో 169 మండలాల్లో అధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. వైఎస్ హయాంలో ఏం చేశారంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బోరుబావులు వేసుకునే రైతుల కోసం ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు. ఒక వేళ బోరు విఫలమైతే బీమా పొందే అవకాశం కల్పించింది. రూ.1,200 ప్రీమియం, జియాలాజికల్ సర్వే కోసం మరో రూ.1,000 (చిన్న, సన్నకారు రైతులైతే రూ.500) చెల్లిస్తే సరిపోతుంది. సదరు రైతు బోరు వేసినా నీరు పడకపోతే రూ.10 వేల పరిహారం లేదా బోరు వేయడానికి అయిన వాస్తవ ఖర్చును పొందవచ్చు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ వాల్టా చట్టంలో మార్పులు చేశారు. సింగిల్ విండో వ్యవస్థను తీసుకువచ్చారు. పదేపదే బోర్లు వేసుకుని రైతులు నష్టాలు పాలు కాకుండా బీమా సదుపాయాన్ని కల్పించారు. 2006 జనవరి నాటికి 5,389 కొత్త బోరు బావులకు అనుమతి ఇచ్చారు. పోటీపడి పక్కపక్కనే బోర్లు వేసుకోకుండా రైతు భాగస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చారు. సంబంధిత బోరు కింద ఎంత భూమి ఉండాలో నిర్ణయించి ఆ ప్రకారం రైతులంతా నీళ్లను వినియోగించుకునే పద్ధతి ప్రవేశపెట్టారు. భూగర్భ జలాలను పెంపొందించే విధానాలను రైతులు ఆచరించేలా చేశారు. వేరుశనగ వంటి పంటల్లో తుంపర సేద్య పద్ధతిని ప్రవేశపెట్టి చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ హామీతో కలిగే మేలు ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రకటించారు. కనీసం 300 అడుగుల లోతున బోరు వేయాలంటే అన్ని ఖర్చులతో కలుపుకుని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఇంత చేసినా నీరు పడకపోతే రైతులు అల్లాడిపోవాల్సిందే. ఇలా ఒకటికి రెండుసార్లు బోర్లు వేసుకుని నష్టపోతున్న వారెందరో ఉన్నారు. ఇటువంటి దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని నీరు పడేంత వరకు ఎన్నిసార్లయినా బోర్లు తవ్వుతుంది. దీనివల్ల రైతులకు ఆర్థిక భారం తప్పుతుంది. నీరూ దొరుకుతుంది. ఈ పథకంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
పేదింట.. చదువుల పంట
సాక్షి, గుంటూరు : ఐదేళ్ల కాలంలో అనేక మంది ప్రతిభ గల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. అనేక ఆంక్షలతో ఫీజుల్లో ఎగనామం పెట్టడంతో వారి ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు ఫీజులను పెంచుకునేందుకు అనుమతిలిచ్చేసిన టీడీపీ ప్రభుత్వం.. పెరిగిన ఫీజులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపచేయలేదు. కాలేజీ ఫీజు ఎంతైనా ప్రభుత్వం మాత్రం ఏటా రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. మంచి ర్యాంకు తెచ్చుకుని ఏ–గ్రేడ్ కళాశాలలో సీటు సంపాదించిన విద్యార్థులకు ఇదే వర్తింపజేసింది. దీంతో మిగిలిన ఫీజులు చెల్లించకలేక సీ గ్రేడ్, డీ గ్రేడ్ కళాశాలల్లోనే చేరాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్పయాత్ర ద్వారా విద్యార్థుల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని ప్రకటించారు. వీటితోపాటు ప్రతి ఇంటా ఉన్నత విద్యావంతులు ఉండాలనే లక్ష్యంలో అనేక వరాలిచ్చారు. జగన్ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ ఇచ్చిన వరాలు.. పేద విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తారు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు ప్రతి విద్యార్థికి ఇస్తారు. సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఇస్తారు. (ఫీజు ఎంతైతే అంత +రూ.20 వేలు) ప్రభుత్వ సహకారం అందలేదు 2013లో వైజాగ్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. అగ్రశ్రేణి కళాశాల కావడంతో అక్కడ ఫీజు రూ. 80 వేలు ఉంది. ప్రభుత్వం కేవలం రూ.35 వేలు ఇస్తానని చెప్పడంతో మిగిలిన డబ్బు చెల్లించే స్థోమత లేక సీటు వదులుకున్నాను. ఇక గత్యంతర లేక గుంటూరులోని మామూలు కళాశాల్లో చేరాను. ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చి ఉంటే బీటెక్ చివరి సంవత్సరంలోనే మంచి ప్లేస్మెంట్ సాధించి ఉండేవాడిని. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. – షేక్ అబ్దుల్ రజాక్, ఎంటెక్ విద్యార్థి, పిడుగురాళ్ల -
మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల : ఇడుపులపాయలోని మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్ జగన్ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక శనివారం పర్యటనలో భాగంగా తొలుత పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ జగన్.. అనంతరం చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లిలో గల గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న ఆయన.. శనివారం వీరంజనేయస్వామి క్షేత్రం, సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా ఇడుపులపాయలోని తన తండ్రి, మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పులివెందులలో దారిపొడవునా వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. -
కడప శివారులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
-
సంకల్ప భయం
-
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం..
-
హోదా కోసం పోరాడుతున్నది వైఎస్ జగన్ మాత్రమే
-
ప్రజల గుండె చప్పుడు వింటూ..!
-
జననేతకు జైకొట్టిన జనసంద్రం
-
‘విజయ సంకల్ప’ ఉత్సవాలు
సాక్షి నెట్వర్క్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాయి. యాత్ర విజయవంతం అయిన సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కిలోమీటర్‌కు ఒక కొబ్బరికాయ చొప్పున 3,648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. పలు జిల్లాల్లో ర్యాలీలు, వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. మంగళగిరి పానకాల నృసింహ స్వామి ఆలయంలో 3,648 కొబ్బరికాయలను కొట్టి మొక్కు చెల్లించి వైఎస్ జగన్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ఆలయానికి స్వామివారి దర్శనార్థం వచ్చిన మహిళా భక్తులు సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలంటూ కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, దామర్ల ఉమామహేశ్వరరావు, బొమ్ము శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోనూ మొక్కు చెల్లింపు వైఎస్సార్సీపీ యువనేత భూమన అభినయ్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత 3,648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. వాడవాడలా జగన్నినాదం అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర విజయోత్సవ సంబరం అంబరాన్నంటింది. వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మసీదు, దర్గాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. అనంతపురంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన మోటార్ సైకిల్, ఆటోల ర్యాలీని అడ్డుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బుధవారం ర్యాలీ నిర్వహించేందుకు మంగళవారమే ఆ పార్టీ నేతలు 1వ పట్టణ ఎస్సై శేఖర్‌బాబుకు అర్జీని, చలానాతోపాటు అందజేశారు. దీంతో వారు అనుమతుల కోసం పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడగా, అందుకు వారు మౌఖికంగా అనుమతిచ్చారని నాయకులు తెలిపారు. అయితే ర్యాలీ ప్రారంభం కాగానే ఎస్ఐ వచ్చి అనుమతులు లేవని అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు నేతృత్వంలో పోలీసుల తీరుకు నిరసనగా టవర్ క్లాక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ముగిసిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ జనం మనిషి
-
విజయ సంకల్పం
-
జన యాత్ర
-
విజయ శంఖారావం
-
వైఎస్ఆర్ రైతు భరోసా
-
మేము వైఎస్ఆర్సీపీ సోల్జర్స్.. పార్టీ విజయం కోసం కృషిచేస్తాం
-
నడిచారు గెలిచారు
-
వైఎస్ జగన్‌ను కలిసిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన కవిటి మండలం కిడ్నీ వ్యాధి బాధితులు
-
ప్రజాసంకల్పయాత్రకు వచ్చిన స్పందన అపూర్వం
-
తూర్పున సంకల్ప సూరీడు
-
పశ్చిమ ఒడిలో రాజన్న బిడ్డ
-
ఒక్కో అడుగు ఒక్కో జ్ఞాపకంలా..
సాక్షి, శ్రీకాకుళం : జనం కోసం శ్రమిస్తున్న నాయకుడిని ఊళ్లన్నీ కలిసి ఊరేగిస్తున్నాయి. ప్రజాసంక్షేమం కోసం అడుగులు వేస్తున్న శ్రామికుడికి పల్లెలు పట్టం కడుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఊరూరా తిరుగుతున్న రాజన్న బిడ్డ... పేదవాడి గుండె గూటికి చేరవుతున్నారు.ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర... రాజకీయంగా చరిత్రను సృష్టించడేమ కాదు... సాయం కోరిన వారికి న్యాయం చూస్తూ సాగుతోంది. వైఎస్ జగన్‌పైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నామంటూ... జనం ఆయన తోడై నడుస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రను దిగ్విజయం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తికానున్న తరుణంలో... ఒక్కో అడుగు ఒక్కో జ్ఞాపకం కావాలని ప్రజలు తాపత్రయపడుతున్నారు. మొత్తంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ పాదయాత్ర ఒక పండుగలా సాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ను దళిత మహాసేన కలిసింది. దళితులకు అండగా ఉండాలని దళిత మహాసేన నాయకులు జననేతను కోరారు. చంద్రబాబు హయాంలో దళితులపై టీడీపీ నేతల దాడులు పెరిగిపోయాయని ప్రతిపక్షనేతకు వివరించారు. ఇచ్ఛాపురంలో భారీ పైలాన్ జననేత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాదయాత్ర దిగ్విజయంగా ముగింపు దశకు చేరుకుంది. ప్రజాసంకల్పయాత్ర విజయానికి గుర్తుగా ...ఆ మహాఘట్టాన్ని ఆవిష్కరించేలా విజయస్థూపం ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో ఏర్పాటు చేసిన పైలాన్ చిరస్మరణీయంగా నిలిచిపోనుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య జననేత ఈ పైలాన్‌ను ఆవిష్కరించ నున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా..యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ పైలాన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
338వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 338వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం లక్కవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసపురం, జింకిభద్ర క్రాస్, సోంపేట, ఇసకపాలెం క్రాస్, మండపల్లి క్రాస్ మీదుగా తలతాంపారి వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని అవిష్కరించిన వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అవిష్కరించారు. ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికిక వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, పపాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గం సమన్వయకర్త పరియా సాయిరాజ్, పాతపట్నం నియోజకవర్గం సవన్వయకర్త రెడ్డి శాంతిలు పాల్గొన్నారు. -
అదే ఆదరణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆయన అడుగుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదు. ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 3600 కిలోమీటర్లు మైలురాయిని దాటేసి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. వన్నె తగ్గని ప్రజాదరణతో జనహోరు నడుమ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సోంపేట మండలంలో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం ఉదయం సోంపేట మండలం తురక శాసనం నుంచి పాదయాత్ర ప్రారంభించి, లక్కవరం కూడలి వరకు నిర్వహించారు. ప్రజాసంకల్పయాత్ర ముగిం పు దశకు రానుండడంతో వెంట వచ్చే జనం రోజు రోజుకూ రెట్టింపవుతున్నారు. యాత్ర పొడవునా వందలాది మంది ప్రజలు తమ సమస్యలను, వ్యక్తిగత ఇబ్బందులును జగన్‌తో చెప్పుకున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటూ భవి ష్యత్‌పై భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు. పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానంగా నవరత్నాల పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా ప్రదర్శనలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రజల్లో నవరత్నాల అమలు, ప్రాధాన్యతపై అవగాహన పెంచేలా ప్రదర్శన చే యించా రు. అలాగే యాత్ర ప్రారంభమైన తురకశాసనం నుంచి లక్కవరం క్రాస్ వరకు ప్రత్యేకంగా చతురశ్వాల ఆహ్వానంతో పాటు కోయ డాన్సులు, పలు సంప్రదాయ నృత్యాల సందడి కొనసాగింది. పాదయాత్ర సాగిందిలా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం సోంపేట మండలం తురకశాసనం నుంచి పాదయాత్ర ప్రారంభమై, పాలవలస క్రాస్, కొర్లాం, బారువ కూడలి మీదుగా లక్కవరం కూడలి వరకు యాత్ర సాగింది. అడుగడుగునా వందలాది మంది జనం తమ సమస్యలను జగన్‌కు వివరించారు. సాక్షరభారత్ కోఆర్డినేటర్లు, ఆటో కార్మికులు, సీపీఎస్ బాధితులు, ఆశ వర్కర్లు, ఐక్యదళిత మహానాడు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసి తమ వినతులను సమర్పించారు. అలాగే తిత్లీ తుపాను బాధితులు కూడా తమకు జరిగిన నష్టాలకు తగిన పరిహారాలను ప్రభుత్వం అందివ్వలేదంటూ జగన్ వద్ద వాపోయారు. అలాగే ఉల్లి రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేదంటూ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ వాపోయారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల ప్రజలకు సాగునీటి వనరుగా ఉన్న పైడిగాం ప్రాజెక్టు తిత్లీ తుపానుతో ధ్వంసమైందని, దీన్ని పునరుద్ధరించాలని జగన్‌ను పలువురు రైతులు విన్నవించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాలను కల్పిస్తామని జగన్ ప్రకటించడంపై ఐక్య దళిత మహానాడు ప్రతినిధులు హర్షం ప్రకటించారు. అలాగే వడ్డెర, చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు జగన్ చేతుల మీదుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరింపజేశారు. ఈ వెబ్సైట్ ద్వారా వడ్డెర, చేనేతలకు దివంగత వైఎస్సార్ చేసిన మేలు, అలాగే జగన్ ఈ కులాలకు ఇచ్చిన అవకాశాలను ప్రజలకు తెలియజేసేలా చేస్తామని గుంటూరు చెందిన ప్రతినిధులు తెలియజేశారు. పాల్గొన్న నేతలు ప్రజాసంకల్పయాత్రలో జగన్ పాదయాత్రకు పలువురు నేతలు అడుగులు వేస్తూ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇఛ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఇఛ్చాపురం, పలాస, టెక్కలి సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, ప్రముఖ సినినటుడు విజయచందర్, జిల్లా మహిళా విభాగ అధ్యక్షుడు చింతాడ మంజు, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ (బాబా), అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా కన్వీనర్ దువ్వాడ శ్రీకాంత్, రాష్ట్ర పార్టీ వివిధ విభాగాల కార్యదర్శులు నర్తు రామారావు, తమ్మినేని చిరంజీవి నాగ్, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. 3600 కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్ 2017 నవంబర్ 6న మొదటి కిలో మీటర్ మైలురాయిని దాటిన జగన్ ప్రజాసంకల్ప యాత్ర దారిపొడవునా పలు ప్రాంతాల్లో కీలక మైలురాళ్లను దాటింది. ఇందులో భాగంగా శనివారం సోంపేట మండలం బారువ కూడలి వద్ద 3600 కిలోమీటర్లను దాటారు. ఈ సందర్భంగా ఈ కూడలిలో జగన్ ప్రత్యేకంగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అనంతరం యాత్ర పొడవునా పలువురు వృద్ధులు, మహిళలు జగన్‌తో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘అన్నా..నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండన్నా.. నువ్వు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారంటూ..’ పలువురు జగన్ యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ ‘మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలేæ నాకు ఇన్ని మైలురాళ్లు దాటేంత శక్తి ఇస్తున్నాయని’ అన్నారు. -
ప్రజా సంకల్పం@ 3,600
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజల కష్టాలు తెలుసుకుని, వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 337వ రోజు శనివారం అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్ వద్ద 3,600 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వరకూ పాదయాత్రలో భాగంగా ఇప్పటికే 1,000, 2,000, 3,000 కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమిస్తూ వచ్చిన వైఎస్ జగన్.. 3,600 కిలోమీటర్ల మైలురాయిని కూడా శనివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య అధిగమించారు. ఉదయం ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని సోంపేట మండలం తురకశాసనం వద్ద ప్రారంభమైన పాదయాత్ర.. పాలవలస గేటు, కొర్లాం, బారువ క్రాస్, లక్కవరం క్రాస్ వరకూ సాగింది. జనకెరటం.. ఘనస్వాగతం సముద్ర తీరానికి దగ్గరలో సోంపేట మండలంలో శనివారం సాగిన ఆయన పర్యటనలో జన కెరటం ఎగసిపడింది. అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. యువత ఉత్సాహంగా కేరింతలుకొడుతూ ఘనస్వాగతం పలికారు. సరిగ్గా బారువ జంక్షన్ వద్దకు రాగానే 3,600 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడంతో జగన్ అక్కడ ఓ వేప మొక్కను నాటి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. జనహోరు మధ్య కదిలిన జగన్‌కు దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు. రాజకీయ వివక్ష టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాజకీయ వివక్ష చూపుతోందని పలువురు బాధితులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన తుపానుకు నష్టపోయినవారు ఈ విషయంపై ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. పలువురు ఉద్యోగ సంఘాలవారు జగన్‌ను కలిసి.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానాల వల్ల లక్షలాది మందికి ఉద్యోగ అభద్రత ఏర్పడిందని చెప్పారు. పాలవలస గ్రామం వద్ద కొందరు కలిసి.. తమ ఊర్లో పెద్ద సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అందువల్ల తామే ఓ స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటై ఆదుకుంటున్నట్లు వివరించారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేదయ్యా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి వచ్చిన ఉల్లి రైతులు కొందరు.. తమకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని జగన్‌కు మొరపెట్టుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా తమ పంటను కొనుగోలు చేయించాలని విజ్ఞప్తిచేశారు. గతేడాది క్వింటా ఉల్లి రూ.7,000 పలికితే.. ఈ ఏడాది రూ.1,500కు పడిపోయిందని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని అవ్వలు, దివ్యాంగులు ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. వారితో పాటు ఫీజురీయింబర్స్ కావడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించ లేదని, సంక్షేమ పథకాల అమల్లో పార్టీ వివక్ష చూపుతున్నారని, జన్మభూమి కమిటీల అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని.. ఇలా పలువర్గాల వారు జగన్‌కు ఫిర్యాదు చేశారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే.. అంతా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు వచ్చి పార్టీలో చేరడం తరచూ జరిగేదే.. కానీ శనివారం అసలే పార్టీతోనూ సంబంధంలేని.. రాజకీయ నేపథ్యమే లేని ఓ కుటుంబం పాదయాత్ర సాగుతున్న చోటికొచ్చి వైఎస్ జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా వేయించుకున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు, ఆయన సంకల్పంతో తాము స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపుకోసం కృషిచేస్తామని వారు వివరించారు. కక్షతో తొలగించారు అన్నా.. సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లను ఈ ప్రభుత్వం కక్షతో తొలగించింది. తొమ్మిదేళ్లు శ్రమించి పనిచేశాం. ప్రభుత్వం అనేక పనులు అప్పగించినా వాటిని పూర్తిచేశాం. అయినా అకారణంగా మమ్మల్ని తొలగించారు. వేలాది మందికి జీవనోపాధి లేకుండా చేశారు. – ఇచ్ఛాపురం సాక్షర భారత్ కో–ఆర్డినేటర్ల యూనియన్ నేతలు ఉల్లిపంటకు గిట్టుబాటు ధర రానీయడం లేదు అన్నా.. ఉల్లిపంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నాం. గతేడాది క్వింటా రూ.7 వేలు పలికిన ఉల్లి.. నేడు రూ.1,500కు పడిపోయింది. ఎక్స్పోర్ట్ రకం చిన్నబళ్లారికి సింగపూర్‌లో గిరాకీ ఉన్నప్పటికీ దళారుల సిండికేట్‌తో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక సాధారణ రకం పెద్దబళ్లారి మార్కెట్లో కిలో రూ.2 పలుకుతోంది. కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. మార్కెఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తే కొంతవరకు దళారుల దోపిడీ తగ్గుతుంది. దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – జి.ఓబుల్‌రెడ్డి, షరీఫ్, చంద్ర ఓబుల్‌రెడ్డి, మైదకూరు, వైఎస్సార్‌కడప జిల్లా. పైడిగాం ప్రాజెక్టును పునరుద్ధరించాలి 1962లో నిర్మించిన పైడిగాం ప్రాజక్టు పూర్తిగా దెబ్బతింది. తిత్లీ తుపానుకు పాడైపోయింది. సాగునీరందడం లేదు. ప్రాజెక్టు పునరుద్ధరణ, ఆధునికీకరణ చేస్తే 10 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. సోంపేట, ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేయండయ్యా.. – సింగాన భాస్కరరావు, సుంకిడి, సోంపేట మండలం నేతన్న కోసం.. వడ్డెరన్న కోసం.. శ్రీకాకుళం అర్బన్: గుంటూరు జిల్లా బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యుడు మురుగుడు రాఘవేంద్రరావు.. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ చేతులమీదుగా ‘నేతన్న కోసం జగన్.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభింపజేశారు. అలాగే వైఎస్సార్సీపీ గుంటూరు జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి.. ‘వడ్డెరన్న కోసం జగన్.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను ప్రతిపక్షనేత చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. చంద్రబాబు పాలనలో చేనేతలు, వడ్డెరలు రోడ్డునపడ్డారని, వైఎస్సార్ తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాలనలోనే తమకు మేలు జరుగుతుందని వారుచెప్పారు. -
కరువు నేల ప్రకాశించేలా..
-
వైఎస్ జగన్‌ను కలిసిన రాజమండ్రికి చేందిన రుద్ర కుటుంబం
-
వైఎస్ జగన్‌ను కలిసిన కడప జిల్లా ఉల్లి రైతులు
-
3600 కి.మీ పౌలురాయిని దాటిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
కాసేపట్లో 3600 కి.మీ చేరుకోనున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
337వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
ఇడుపులపాయ - ఇచ్ఛాపురం విజయసంకల్పం
-
ఆదుకోవాల్సిన యజమాన్యం తప్పించుకుందన్న
-
ఆడపిల్లల కష్టాలు, భద్రతపై వైఎస్ జగన్‌కు లేఖ రాసిన వేణుక
-
336వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
ప్రశ్నించే వారిపై ప్రతిపక్ష ముద్ర
పోలాకి(ప్రజాసంకల్పయాత్ర బృందం): తిత్లీ ప్రభావిత ఉద్దానం ప్రాంతంలో న్యాయం చేయాలని అడిగిన బాధితులకు అండగా ప్రశ్నించేవారందరిపైనా ప్రతిపక్షముద్ర వేశారని చైతన్య ఉద్దానం రైతాంగ సంక్షేమ సంఘనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మందస మండలం బహడపల్లి వద్ద వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సంఘ నాయకులు, తిత్లీ బాధిత రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపరిహారం గుర్తించడంలోనూ.. పంపిణీ చేయడంలోనూ జరిగిన అక్రమాలపై ప్రశ్నించినందుకు కేసులుపెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తే 16 మందిపై దేశద్రోహం కేసులు పెట్టారని చెప్పారు. తిత్లీ తుఫాన్ సమయంలో పర్యవేక్షణకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారుల అవగాహన లోపంతో అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఉద్దానం ప్రాంతంలో జీడి, కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. జీడిమామిడి బోర్డు స్థానికంగా ఏర్పాటయ్యేలా కృషిచేయాలని విన్నవించారు. ఉద్దానం అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మహేంద్రతనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ద్వారా బొడ్డపాడు మీదుగా జంతిబందకు సాగునీరు ఇప్పించాలని కోరారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చినా ఆయన మరణానంతరం పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిచిన ప్రతిపక్షనేత ఉద్దానం ప్రాంత రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంఘనాయకులపై పెట్టిన అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో చైతన్య ఉద్దానం రైతాంగ సంక్షేమ సంఘం మందస మండల అధ్యక్షుడు మామిడి మాధవరావు, నాయకులు బాబూరావు, ముకుందరావు, హడ్డి, తులసయ్య, కృష్ణారావు, సోమనాథం తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
2004 నుంచి అమలు చేస్తున్న సీపీఎస్ విధానం రద్దు చేయాలి. పాత పింఛను విధానం కొనసాగించాలి. షేర్ మార్కెట్ విధానంలో విశ్రాంత ఉద్యోగులకు పింఛను ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. వృద్ధాప్యంలో ఆసరా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరిగే సీపీఎస్‌ను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి. – ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు, మందస మండలం -
వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రజాసంఘాల నాయకులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీడిపిక్కల కార్మికులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన యాదవ సంఘాల నాయకులు
-
335వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
బాధితులకు బాంధవుడిగా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతి ప్రకోపించిన ప్రాంతాల్లో పాదయాత్రికుడు పాదం మోపాడు. బాధితులందరికీ తా ను అండగా ఉంటానని ప్రజాసంకల్పయాత్రలో భరోసా కల్పించడంతో బాధితుల కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. సోమవారం పలాస నియోజకవర్గంలో వజ్రపుకొత్తూరు మండలంలో వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తిత్లీ తుఫాన్ ప్రభావిత పరిసరాల్లో, కిడ్నీ వ్యాధిగ్రస్తుల గ్రామాల్లో యాత్ర దిగ్విజయంగా సాగింది. అడుగడుగునా జగన్‌కు మహిళలు హారతులు పట్టారు. అలాగే తాము పడుతున్న కష్టాలను జగన్‌కు వివరించారు. తిత్లీ తుఫాన్ బీభత్సంతో ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు పూర్తిగా నేలకొరిగిపోగా, జీడి చెట్లన్నీ ధ్వంసమైన పరిస్థితులను పలువురు రైతులు జగన్‌కు చూపించారు. ఈ సందర్భంగా ధ్వంసమైన పలు కొబ్బరి తోటలను జగన్ నేరుగా పరిశీలించారు. అలాగే కిడ్నీ వ్యాధి గ్రస్తులను జగన్ నేరుగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం రాజం కాలనీ నుంచి యాత్రను ప్రారంభించి, ధర్మాపురం, గరుడభద్ర, తర్లగాదురు క్రాస్, అక్కుపల్లి మీదుగా గాదురు, చీపురుపల్లి కూడలి, డెప్పూరు కూడలి వద్ద వరకు యాత్ర సాగింది. కిడ్నీ రోగులకు నెల పింఛన్ రూ.10 వేలు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిడ్నీ రోగులకు నెల పింఛన్‌గా రూ.10 వేలు ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం డెప్పూరు గ్రామానికి చేరుకున్న జగ న్కు అక్కడ వరుస ఇళ్లల్లో ఉన్న కిడ్నీ రోగులు కలుసుకుని వారి కష్టాలు తెలుసుకున్నారు. జిల్లాలో కిడ్నీ రోగులకు తగినంతగా డయాలసిస్ కేంద్రాలు పనిచేయడం లేదని బాధితులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చలించిపోయిన జగన్, తమ పార్టీ అధికారంలోకి రాగానే రూ.10 వేల పింఛన్‌ను ఇస్తానని చెప్తూనే కిడ్నీ రోగులు అధికంగా ఉన్న ఉద్దానం ప్రాంతంలోనే కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే యాత్రలో భాగంగా పలు చోట్ల కొబ్బరి, జీడి పంటల బాధితులు జగన్‌ను కలిసి తమ పంట నష్టాలకు తగిన పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని వివరించారు. దీనిపై జగన్ స్పంది స్తూ పలు కొబ్బరి తోటలను పరిశీలించి బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటానని, కొబ్బరిచెట్టుకు రూ.3 వేలు వరకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీడి పంట హెక్టార్‌కు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. మత్స్యకార ప్రాంతంలో పాదయాత్ర ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 334వ రోజున వైఎస్ జగన్ వజ్రపుకొత్తూరు మండలంలో మత్స్యకార గ్రామాల్లోనే యాత్ర సాగింది. సోమవారం ఉదయం రాజాం కాలనీ నుంచి ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి సాగర తీరాన డెప్పూరు గ్రామ పరిధిలోకి వెళ్లి యాత్ర ముగిసింది. దారిపొడవునా మహిళలు, తిత్లీ బాధిత రైతులు, జీడి కార్మికులు జగన్‌ను కలిసి తమ గోడును వివరించారు. యాత్ర పొడవునా భారీ సంఖ్యలో జనాలు, మత్స్యకారులు జగన్‌తో అడుగులు కలిపారు. దీంతో రోజంతా 11.1 కిలోమీటర్ల వరకు యాత్రను సాగించారు. పాదయాత్రలో పాల్గొన్న నేతలు ప్రజాసంకల్పయాత్రలో సోమవారం పలువురు నేతలు జగన్‌ను కలిసి సంఘీబావం ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పలాస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, పిరియా సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన 334వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
335వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 335వ రోజు షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వంకులూరు క్రాస్ నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చిన్న వంకులూరు, అనకాపల్లి క్రాస్, రంగోయి క్రాస్, రాంనగర్, బహడపల్లి, నల్లబొడ్లూరు, గుజ్జులురు, బి జగన్నాథపురం మీదుగా నారయణపురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 334వ రోజు ముగిసింది. జననేత నేడు 11.1 కిలోమీటర్లు నడిచారు. సోమవారం ఉదయం జననేత పలాస నియోజకవర్గం రాజాంకాలనీ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ధర్మపురం, గరుఢభద్ర, తర్లగాదురు క్రాస్,అక్కుపల్లి, గాదురు, చీపురుపల్లి జంక్షన్ మీదుగా డెప్పురు వరకు జననేత పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 3,574.1 కిలోమీటర్లు నడిచారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు
-
‘కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తాం’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకోని.. వారిలో భరోసా నింపడానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంక్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం జననేత పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ వైఎస్ జగన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ముగ్గురు, నలుగురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారుంటే ఇంటికి ఒక్కరికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు తెలిపారు. ప్రభుత్వం తమకు ఎలాంటి పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయారు. ఆస్పత్రికి వెళ్తే మందులు కూడా లేవంటున్నారని చెప్పారు. ఉయాలసిస్ యంత్రాలు సరిపోక రోజుల తరబడి పడిగాపులు కాయల్సి వస్తుందని అన్నారు. కిడ్నీ వ్యాధితో వందల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కాగా, జననేత హామీలపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆశా వర్కర్లు
-
పలాస బహిరంగ సభలో అశేష జనవాహిని
-
పలాస శ్రీకాకళం జిల్లా వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు
-
ముగిసిన 332వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
స్టేలతో తప్పించుకుని తిరుగుతున్నది చంద్రబాబే
-
332వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
‘చదువుకోవడానికి సరిపడ పుస్తకాలు లేవన్నా..’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ ప్రభుత్వ హయంలో తాము పడుతున్న కష్టాలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వి భానమ్మ అనే మహిళ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తనను అకారణంగా తొలగించారని తెలిపారు. అలాగే చాపరకు చెందిన రాజారావు కుటుంబ సభ్యులు జననేతను కలిసి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ కుమారుడికి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత తమ వద్ద లేదని వాపోయారు. ఉద్యోగ భద్రతల కల్పించాలని కోరుతూ.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను వీఆర్ఏలు కలిశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. తమకు జీతాలు కూడా సరిగా రావడం లేదని వైఎస్ జగన్‌కు తెలిపారు. స్కూలు పిల్లల ఆవేదన.. వైఎస్ జగన్‌ను కలిసిన చాపర జడ్పీ స్కూల్ విద్యార్థులు తమకు అరకొరగా పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. ఒక పుస్తకాన్ని ఇద్దరు, ముగ్గురు పంచుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న పదో తరగతి పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ అందక ఇబ్బందులు పడుతున్నాం.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసిన పాతపట్నం రైతులు తాము ఎదురుకుంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రుణమాఫీ అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏక కాలంలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను బ్యాంకర్లు ఎగవేతదారులుగా చూస్తునారనే అవమాన భారంతో కుంగిపోతున్నామని అన్నారు. తిత్లీ బాధితుని ఆవేదన.. జాడుపల్లి గ్రామానికి చెందిన రైతు కోట భీముడు తన ఆవేదనను జననేతతో చెప్పుకున్నారు. తుపాన్ వల్ల 6 ఎకరాల్లో వేసిన పంట నష్టపోవాల్సి వచ్చిందని.. అయిన ప్రభుత్వం నుంచి రూపాయి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములపై హక్కు లేదంటున్నారు.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను సీతారామపల్లి గ్రామస్తులు కలిశారు. తరతరాలుగా 200 ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని.. ఇప్పుడు అధికారులు వాటిపై తమకు ఎలాంటి హక్కులు లేవంటున్నారని జననేతకు తమ ఆవేదనను తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు
-
331వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 331వ రోజు పాదయాత్రను బుధవారం పాతపట్నం నియోజకవర్గంలోని మెళియపుట్టి సమీపంలోని చాపర నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుపురం, జోడురు క్రాస్, రామచంద్రపురం క్రాస్, జాడుపల్లి, పదనాపురం క్రాస్, ఎస్ జాడుపల్లి క్రాస్ మీదుగా రంగడి ఘటి క్రాస్ వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తారు. జననేత ఇప్పటివరకు 3,529.1 కిలోమీటర్లు నడిచారు. అడుగుముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళులు వంగావీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ జగన్‌ను కలిసిన పదో తరగతి విద్యార్థులు ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జననేతను చాపర జడ్పీ స్కూలు విద్యార్థులు కలిశారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న తమకు ఇంకా టెస్ట్ బుక్స్ అందలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
331వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
చంద్రబాబు హయాంలో అన్నీ గోవిందా..
-
330వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
329వ రోజు పాదయాత్ర డైరీ
-
330వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 330వ రోజు షెడ్యూల్ ఖరారైంది. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తురు నైట్ క్యాంప్ శిబిరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి డీ పోలురు క్రాస్, చింతల పోలురు క్రాస్, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. మిళియపుట్టి వద్ద జరిగే బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 329వ రోజు ముగిసింది. ఆదివారం ఉదయం జననేత గుడెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సన్యాసినీలపురం, డమర, రాంపురం క్రాస్, నర్సింగపల్లి, జగన్నాధపురం, కంచుకోట, జంటురు క్రాస్, బందపల్లి మీదుగా కొత్తురు క్రాస్ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. జననేత నేడు 12.6 కిలోమీటర్లు నడిచారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన విశ్వ బ్రాహ్మణులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన టెక్కిలి ఆర్టీసీ కార్మిక సంఘాలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన సమస్యలు చెప్పుకున్న గూడెం గ్రామస్తులు
-
ముగిసిన 328వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
బాబు నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని మాట్లాడుతున్నాడు
-
సిపిఎస్ రద్దు చేస్తామని పకటించిన వైఎస్ జగన్
-
వైఎస్ జగన్‌కు చిరుకానుక ఇచ్చిన చిన్నారి
-
328వ రోజు పాదయాత్రలో మరో మైలురాయి..
-
328వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
వైఎస్ జగన్‌ను ఆశీర్వదించిన పండితులు
-
327వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
327వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
326వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
జగనన్నను చూడాలని తపించిన ఓ చిన్నారి
-
326వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
322వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 322వ రోజు ఆదివారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని దేవాది శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కోమర్తి, గుండువిల్లిపేట, కరిమిల్లిపేట క్రాస్, సత్యవరం క్రాస్ మీదుగా జమ్ము జంక్షన్ వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. సాయంత్రం నరసన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైఎస్ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి ‘పురం’ మాజీ ఎమ్మెల్యే ఘని
సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం ఆయన టీడీపీకి రాజీనామా చేసి, ఆ ప్రతిని చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఘనీకి జగన్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలాఉంటే ‘అనంత’ తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గంలో ఘని కీలక నేత. 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో నందమూరి బాలకృష్ణ ‘పురం’ నుంచి పోటీ చేయడంతో టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టిక్కెట్ నిరాకరించింది. మైనార్టీలకు టీడీపీలో సరైన గుర్తింపు దక్కకపోవడం, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చకపోవడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. ఈయన రాజీనామాతో హిందూపురం లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో బాలకృష్ణ విజయం కోసం ఘని తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతోమైనార్టీ నేతలంతా దాదాపు టీడీపీకి దూరమైనట్లే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడి సామాన్య కార్యకర్తలా వైఎస్సార్సీపీలో చేరాను. పార్టీ అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడతా. మైనార్టీలకు టీడీపీలో ఏ మాత్రం గౌరవం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్ను పక్కనపెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా మైనార్టీలకు స్థానం కల్పించలేదు. మైనార్టీలకు గతంలో న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. భవిష్యత్తులో కూడా జగన్మోహన్రెడ్డితోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లకు ఆయన కట్టుబడి ఉన్నారు. హిందూపురం పార్లమెంట్లో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి, నియోజకవర్గంపై ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో ‘పురం’లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన మైనార్టీ సోదరులు, పురం నియోజకవర్గ ప్రజలు ఇక మీదట కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నా. -
సీపీఎస్ రద్దు చేయాలని వినతి
శ్రీకాకుళం: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 1.82 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంలో ఉన్నారని, దీనివల్ల ఇప్పటికే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌పై అధ్యయనానికి కమిటీ వేసిందని, ఇదంతా కాలయాపన కోసమేనన్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ ఇప్పటికే సీపీఎస్ రద్దుకు సంబంధించి హామీ ఇచ్చానని గుర్తు చేశారు. -
314వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,400.7 కిలోమీటర్లు 06–12–2018, గురువారం ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందడం గర్వంగా అనిపించింది.. భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తపించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర మొదలుపెట్టాను. నాన్నగారు ఆ మహనీయుడి పేరు మీద ఎచ్చెర్లలో యూనివర్సిటీ ఏర్పాటుచేయడం గొప్పగా అనిపించింది. సాయంత్రం ఆ యూనివర్సిటీ ఎదురుగా వెళుతున్నప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు.సిబ్బందిని కూడా నియమించని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం.. యూనివర్సిటీని కళావిహీనం చేసిందని వాపోయారు. ఉదయం అంబేడ్కర్ సేవా సమితి, జై భీమ్ యువజన సంఘం ప్రతినిధులు తదితరులు కలిశారు. కొద్ది నెలల కిందట కొత్తవలస గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన విషయం చెప్పారు. కనిమెట్ట ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధి పనులు జరక్కుండా జన్మభూమి కమిటీలు అడ్డుకున్నాయని తెలిపారు. 30కి పైగా ఎస్సీ కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఐదెకరాల భూమిని నీరు–చెట్టు పేరుతో జన్మభూమి కమిటీలు తవ్వేశాయని, చెరువులో కలిపేశాయని ముషినివలస గ్రామస్తులు మండిపడ్డారు. అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురవడం, ఆయన విగ్రహాలకు అపచారం జరగడం, గ్రామగ్రామానా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా అరాచకాలు చేస్తుండటం, పాలించేవారు రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేసేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదేనా రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయుడికి ఇచ్చే నివాళి.. అనిపించింది. తిత్లీ దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లినా ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలేదని లోలుగు వద్ద కుమ్మరులు వాపోయారు. తమ గ్రామాల వద్దనున్న కెమికల్ ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాలు జీవితాలను కబళించి వేస్తున్నాయని కేశవదాసుపురం, నర్సాపురం అగ్రహారం గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. నీరు కలుషితమై కిడ్నీ, క్యాన్సర్ తదితర జబ్బులు ప్రబలుతున్నాయన్నారు. భూములు నిస్సారమైపోతున్నాయని వాపోయారు. వైఎస్సార్ అంటే వల్లమాలిన అభిమానం.. ఆయనే మా నిజమైన హీరో.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలు మా రాష్ట్రంలోనూ అమలుచేస్తున్నారంటూ సంబరపడ్డారు.. ఒడిశా నుంచి వచ్చి నన్ను కలిసిన యువకులు. నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందడం, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా అనిపించింది. జన్మభూమి కమిటీల అరాచకాలకు, పాలక నేతల కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలిచిన ఘటన ఈ రోజు నా దృష్టికొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. పొందూరు మండలంలో 880 మందికి అన్ని అర్హతలున్నా నిర్దాక్షిణ్యంగా పింఛన్లు పీకేశారట. మంచానికే పరిమితమైపోయిన దివ్యాంగులకు సైతం వైకల్యమే లేదనడం.. బతికి ఉన్న వాళ్లను కూడా చనిపోయినట్టు చూపించడం.. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులకు భర్తలు బతికే ఉన్నారంటూ పింఛన్లు పీకేయడం ఎంత దారుణం! ‘నేను చనిపోలేదు బతికే ఉన్నా’అని పింఛన్ కోల్పోయిన అమ్మణ్ణమ్మ అనే అవ్వ కోర్టుకు పోయి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. భర్త చనిపోయినా.. నువ్వు వితంతువు కాదంటూ మెట్ట లక్ష్మి అనే సోదరి పింఛన్‌ను ఆపేశారు. ‘ఈ పింఛన్ అక్కర్లేదు.. నా భర్తను చూపెట్టండి చాలు’.. అంటూ న్యాయమూర్తిని వేడుకుందట ఆ అభాగ్యురాలు. ఇలాంటి కేసులన్నీ విన్న న్యాయమూర్తులు దిగ్భ్రాంతికి గురై ప్రభుత్వానికి అక్షింతలు వేశారట. కోర్టును ఆశ్రయించిన 498 మందికి బకాయిలతో సహా పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారట. ఈ పాలకులకు ఇది చెంపపెట్టే. పింఛనే జీవనాధారంగా బతికే నిరుపేదల కడుపుకొట్టడం న్యాయమేనా? ఈ న్యాయపోరాటం సాగుతున్న సమయంలోనే 40 మంది లబ్ధిదారులు చనిపోయారట. వారి జీవనాధారమైన పింఛన్ ఆపేసి వారి ఉసురు తీసిన ప్రభుత్వానిదే బాధ్యత కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని జిల్లాల్లో వేలాది మంది కోర్టుకెళ్లి తమకు నిలిపేసిన పింఛన్లు తెచ్చుకోవడం మీకు సిగ్గుచేటైన విషయం కాదా? కోర్టుకెళ్లలేని నిస్సహాయులు లక్షల్లో ఉండటం వాస్తవం కాదా? ఇదిలా ఉంటే.. సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇచ్చేశామని చెప్పుకోవడం ఆత్మవంచన కాదా? అర్హత ఉండి.. పింఛన్లు రానివారెవ్వరూ లేరని ప్రచారం చేయడం.. ఎవర్ని మోసం చేయడానికి? -
వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పార్టీలోకి సీపీఎం నాయకులు
సాక్షి, చింతూరు/శ్రీకాకుళం : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననేత నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చింతూరు మండలానికి చెందిన సీపీఎం నాయకులు, ఎంపీపీ చిచ్చిడి మురళితో సహా.. మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బుధవారం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. బాబు మమ్మల్నిమోసం చేశాడు ఎన్నికలకు ముందు రజకులను ఎస్సీల్లో కలుపుతామని హామీనిచ్చిన చంద్రబాబు మోసం చేశాడని రజక సంఘం నాయకులు ఆరోపించారు. రజకులకు ఒక కార్పొరేషన్, రాజకీయంగా ప్రాధాన్యం కలిపించాలని పాదయాత్రలో పాల్గొని వైఎస్ జగన్‌ను కోరారు. ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగులు వైఎస్ జగన్‌కు విన్నవించారు. బలసల రేవు వంతెన నిర్మించాలని కోరుతూ వాల్తేరు గ్రామ ప్రజలు వైఎస్ జగన్‌కు విన్నవించారు. 650 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. -
313వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 313వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రాపాక జంక్షన్, ఎరుకలపేట క్రాస్, కృష్ణాపురం మీదుగా రెడ్డి పేట వరకు నేడు పాదయాత్ర సాగనుంది. తమ సమస్యలను పరిష్కారించడానికి వస్తున్న జగనన్నను చూడడానికి ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జగన్ పాదయాత్ర అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. -
312వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
312వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 312వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం అంతకాపల్లి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వీఆర్ అగ్రహారం క్రాస్, పొగిరి, మర్రివలస క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వైఎస్ జగన్ పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గంగువారి సిగడాం మండలంలోని గేదెలపేట క్రాస్, మెట్టవలస క్రాస్, పలఖండ్యాం, సంతవురిటి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,369.5 కిలోమీటర్లు నడిచారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఇంటిట్రేడ్ స్కామ్ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు
-
నీరాజనం.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర జన జాతరలా సాగింది. అడుగడుగునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. కష్టాలు చెప్పుకున్నారు. బహిరంగ సభలకు గిరిపుత్రులు భారీగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఎదురైన కష్టాలను ఏకరువుపెట్టారు. జననేతకు వస్తున్న ఆదరణకు జడిసి ఏకంగా ఆయనపై హత్యాయత్నం చేయడం చూసి విలవిల్లాడిపోయారు. ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా మీకేం కాదు.. మీతోనే మంచి రోజులు వస్తున్నాయని నమ్ముతున్నాం.. మళ్లీ రాజన్న పాలన మీతోనే సాధ్యం.. ఎన్ని కష్టాలెదురైనా మేమంతా మీ బాటలోనే నడుస్తాం’ అని స్పష్టీకరించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి విజయనగరం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో సెప్టెంబర్ 24న ప్రవేశించిన పాదయాత్ర నేటితో ముగియనుంది. అభిమానుల జయ జయ ధ్వానాల నడుమ 36 రోజుల పాటు 311.5 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో జననేత వేసిన ఒక్కో అడుగు ఒక చరిత్రగా నిలిచింది. తొలిరోజు ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఇందుకు గుర్తుగా దేశపాత్రునిపాలెంలో జననేత ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించారు. అదే రోజున కొత్తవలసలో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. విజయనగరంలో జనం కనుచూపు మేర జననేత అడుగులో అడుగు వేశారు. పైడితల్లమ్మవారి రెండు జాతరలు ఒకేసారి వచ్చినట్లుగా భారీ సంఖ్యలో జననేత సభకు హాజరయ్యారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, ఆ పార్టీ మహిళా మోర్చా నాయకురాలు రమణితో పాటు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ సభ్యత్వం స్వీకరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం శాసససభకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని అక్కడి సభలోనే అధినేత ప్రకటించారు. నెల్లిమర్ల మండల కేంద్రంలోని మొయిద జంక్షన్ వద్ద సభ జరుగుతుండగా ఓ ఆటో వచ్చింది. అందులో గర్భిణి ఉండటాన్ని గమనించిన జగన్.. తన ప్రసంగాన్ని నిలిపివేసి ఆటోకు దారివ్వాలని కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఆమె సకాలంలో ఆస్పత్రికి చేరగలిగింది. పార్వతీపురంలో పోటెత్తిన ప్రజాభిమానం పార్వతీపురం నియోజకవర్గంలో ఇసుక వేస్తే రాలనంతగా జనం పాదయాత్రకు పోటెత్తడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభకు ఒడిశా ప్రాంతం నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. కురుపాం నియోజకవర్గంలో ప్రవేశించిన రోజు పాదయాత్ర 300 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో భాగంగా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కట్టపై జననేత నడక సాగించారు. -
మన్యంలో మగ్గిపోతున్నామయ్యా..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అయ్యా.. మావి గిరిజన గ్రామాలు.. కనీస వసతులు లేక కునారిల్లుతున్నాం.. గొంతు తడుపుకుందామంటే మంచి నీటికి కూడా కరువే.. కలుషిత నీరే మాకు దిక్కు.. రాకపోకలకు రహదారులూ సక్రమంగా లేవు.. రోగమొస్తే దైవాధీనం.. సమస్యల గురించి పాలక పార్టీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు. అధికారులూ శ్రద్ధ చూపడం లేదు’ అని వివిధ గ్రామాల గిరిజనులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 304వ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కురుపాం నియోజకవర్గంలోని జియమ్మవలస మండల గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో తురకనాయుడు వలస వద్ద 3,300 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. శిఖబడి క్రాస్ నుంచి ప్రారంభమైన యాత్ర గెడ్డతిరువాడ, ఇటిక, కుందరతిరువాడ క్రాస్, చిన్నకుడమ క్రాస్, తురకనాయుడువలస వరకు సాగింది. ఆద్యంతం మన్నెం ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. తాము ఎదుర్కొంటున్న అసంఖ్యాకమైన సమస్యలను జననేత దృష్టికి తెచ్చారు. అంకువరం, చిన్న బుడ్డివరం గ్రామ మహిళలు జగన్‌ను కలిసి తమకు తాగునీరు అందడం లేదని మొర పెట్టుకున్నారు. గెడ్డకు వెళ్లి కలుషిత నీరు తెచ్చుకుని తాగాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. ఈ నీటి వల్ల తరచూ అనారోగ్యం పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలన్నీ వారికేనట.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమ గ్రామాల కోసం ఒక ఫిల్టర్ బావిని ఏర్పాటు చేసినా, ఈ పాలకులు అక్కడి నుంచి పైపులు, కొళాయిలు వేసిన పాపాన పోలేదని ప్రజలు జగన్ ఎదుట వాపోయారు. అధికార పార్టీ నాయకులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అలమండ, కొండ చిలకాం, టీకే జమ్ము, పెద్ద తోలుమండ గ్రామాల్లో కనీస వసతులు లేవని, అనేక సమస్యలున్నాయని తూర్పు ముఠా గ్రామాల గిరిజనులు వివరించారు. రావాడ రామభద్రాపురం వద్ద 2004లో వైఎస్ గిరిజన పాఠశాలను మంజూరు చేశారని, గిరిజన రైతులు అందుకోసం పొలం ఇచ్చినా ఆ తర్వాత దాని అతీగతీ లేదన్నారు. రావాడ రామభ్రద్రాపురంలో ఉన్న పీహెచ్సీ, సీహెచ్‌సీలో పరిస్థితులు మెరుగు పరిచేలా చూడాలని విన్నవించారు. జియమ్మవలస గ్రామానికి వట్టి గెడ్డ రిజర్వాయరుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వాలని పలువురు కోరారు. ఆధార్‌తో అనుసంధానం చేయలేదని కొద్ది నెలలుగా తనకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని శిఖబడి గ్రామం వద్ద ఓ మహిళ ఫిర్యాదు చేసింది. టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, రుణాలను ఇస్తున్నారని అర్హులైన తమకు మంజూరు చేయడం లేదని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. జన్మభూమి కమిటీల ఇష్టానుసారం పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను జగన్ వద్దకు తీసుకు వచ్చి వారి అనారోగ్య సమస్యలను చెప్పుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం వచ్చేలా చూడాలని కోరారు. తురకనాయుడు వలస వద్ద 3,300 కి.మీ అధిగమించిన పాదయాత్ర, మొక్క నాటుతున్న వైఎస్ జగన్ తిత్లీ బాధితులను ఆదుకోలేదు.. తాము తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని శివాడ గ్రామానికి చెందిన తిత్లీ తుపాను బాధితులైన పలువురు రైతులు జగన్‌ను కలుసుకుని విన్నవించారు. తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయిందని అగ్రిగోల్డ్ బాధితులు పలువురు జననేత వద్ద కష్టాలు ఏకరువుపెట్టారు. మీరు అధికారంలోకి రాగానే ఆదుకోవాలని కోరారు. కాగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్ పాదయాత్ర జిల్లాలో 350 కిలోమీటర్ల మేర సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. -
కురుపాం విజయనగరం జిల్లా వైఎస్ జగన్ పాదయాత్ర
-
ముగిసిన 302వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
45 ఏళ్ళు పైబడిన అక్కచెల్లెమ్మలకు వైఎస్అర్ చేయూత
-
ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు యాగీ
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీఎంవలస మండలం మహిళలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన తోటపల్లి నిర్వాసితులు
-
302వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
302వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కురుపాం(విజయనగరం): రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 302వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం కురుపాం నియోజకర్గంలోని సీమనాయుడు వలస శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బట్లబద్ర, జోగిరాజుపేట, పుతిక వలస, కాటమ్ దొర వలస క్రాస్ మీదుగా కురుపం వరకు పాదయాత్ర కొనసాగునుంది. సాయంత్రం కురుపాం వద్ద జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన కొండవీటి జ్యోతిర్మయి.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిశారు. టీటీడీలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని జననేతకు వినతి పత్రం అందజేశారు. టీటీడీ పేరును ధార్మిక సేవా పరిషత్గా మార్పు చేయాలని అన్నారు. టీటీడీ పరిధిలోని 25కి.మీ వరకు మద్యం అమ్మకాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. -
25న శ్రీకాకుళంలోకి ప్రవేశించనున్న ప్రజాసంకల్పయాత్ర
-
301వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
ప్రజా సంకల్పం@300 రోజులు
-
301వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
300వ రోజు పాదయాత్ర డైరీ
-
౩౦౦వరోజు ముగిసిన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన తోటపల్లి నిర్వాసితులు
-
ప్రజాసంకల్పప యాత్ర : సెలూన్షాపులోకి వెళ్లిన వైఎస్ జగన్
-
జననేతకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి
-
పోటెత్తిన పార్వతీపురం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం జనంతో పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనాభిమానం తరలివచ్చింది. ప్ర త్యర్థుల ఊహలను తలకిందులు చేసేలా అంచనా లకు మించిన జనం హాజరుకావటంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయటంతో పాటు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రగా వచ్చిన జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట వేలాది అడుగులు అనుసరించాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం తొలి సారిగా ఆయన ప్రసంగించనుండటంతో ఈ బహిరంగ సభకు జనప్రవాహం తరలివచ్చింది. ఒడిశా లోని రాయఘడ, గుణుపూరు ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం వచ్చి స్వచ్ఛంద మద్దతు పలకటం విశేషం. జగన్ రాకతో మురిసిన పార్వతీపురం పార్వతీపురం పట్టణ ముఖద్వారం జనసంద్రంతో మురిసిపోయింది. తరలివచ్చిన అభిమాన నేతను చుట్టుముట్టింది. ఆయన రాకతో పట్టణమంతా జైజగన్ నినాదాలతో హోరెత్తింది. 299వ రోజైన శనివారం పార్వతీపురం మండలం సూరంపేట వద్ద పాదయాత్ర ప్రారంభించిన జననేత నర్సిపురం మీదుగా వసుంధరానగర్కు చేరుకున్నారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజనానంతరం యర్రాకృష్ణమూర్తి కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. సభ ముగిసిన అనంతరం జననేత పార్వతీపురం పట్టణ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస వద్దకు చేరుకున్నారు. జగన్‌కు తోడుగా అశేష జనవాహిని రాకతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖ నుంచి రాయపూర్ వెళ్లే రహదారి కిటకిటలాడింది. రోడ్డుకు ఇరువైపులా ఏ మేడ చూసినా జనంతో కనిపించగా వారందరికీ జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ధ్వజమెత్తిన జగన్ నాలుగున్నరేళ్ల టీడీపీ హయాంలో సాగిన అవినీతి, అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్జగన్మోమన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తీరును తూర్పారబట్టారు. బ్యూటిఫికేషన్ పనుల నుంచి అంగన్వాడీ పోస్టులు, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్ పోస్టులను అమ్ముకోవటం వరకూ అన్నింటిపైనా కడిగిపారేశారు. జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు నిర్లక్ష్య నటనను ఎండగట్టారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆ రెండు ప్రాజెక్టులను పూర్తిచేసి వేలాది ఎకరాలకు సాగు నీరందించిన విషయాన్ని గుర్తు చేశారు. 2003 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతే వైఎస్సార్ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేయించారనీ, మిగిలిన పదిశాతం పనులు కూడా గడచిన నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేయించలేకపోయారని మండిపడ్డారు. సీతానగరంలో నిజాం కాలం నాటి షుగర్ ఫ్యాక్టరీ ఎన్సీఎస్ యాజమాన్యానికి కట్టబెట్టిన చంద్రబాబు, ఆ ప్యాక్టరీకి చెరుకు పంపిణీ చేస్తున్న రైతుల బకాయిలు రూ. 13కోట్లు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకపోవడంపై ధ్వజమెత్తారు. జిల్లాలోని 26 మండలాల్లో కరువు తాండవిస్తుంటే కేవలం నాలుగు మండలాల పేర్లు ప్రకటించి చేతులు దులుపుకోవడాన్ని తప్పుపట్టారు. పార్వతీపురం పట్టణ ప్రజలకు కనీసం తాగు నీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కుట్ర కాదని ఎలా అంటారు విశాఖ విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఎక్కడా మాట్లాడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్వతీపురం బహిరంగ సభలో పెదవి విప్పారు. తనపై జరిగిన కుట్ర జరగలేదని ఎలా అంటారని, సీసీ టీవీ ఫుటేజ్ మాయం నుంచి రెస్టారెంట్ యజమాని సీఎం సన్నిహితుడే కావడం వరకూ అన్నిటిలోనూ తనను మట్టుబెట్టాలనే కుట్ర ఉందని జగన్ స్పష్టం చేశారు. తన తల్లి, చెల్లిపైనా అభాండాలు వేస్తుంటే బాధేస్తోందని, ఈ కుట్రలను తలచుకున్నప్పుడల్లా తాను కలత చెందుతున్నానని జగన్ అంటున్నప్పుడు జనం ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో సభలో నిశ్శబ్దం అలముకుంది. అన్నా.. నీ వెంట మేమున్నామనే నినాదం నలుదిశలా ప్రతిధ్వనించింది. ఎన్ని కుట్రలు చేసినా. అంతమొందించాలని చూసినా తాను భయపడేది లేదని, జనం కోసం, జనంలోనే ఉంటానని జగన్ ఉద్వేగం నడుమ స్పష్టం చేశారు. యాత్రలో వేదనలు ప్రజా సంకల్పయాత్రలో పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి జననేతవద్ద తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. రైతులు ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను తెలియజేశారు. ప్రొఫెషనల్కోర్సులు చదివినా ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావటం లేదని డీఈడీ విద్యార్థులు వాపోయారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నప్పటికీ తమను కాదని, గిరి జనేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారని గిరిజన ని రుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేసింది. ఒడిశా రాష్ట్రంలోని రాయఘడ జిల్లాకు చెందిన యువకులు విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన విషయం తెలుసుకుని చలించిపోయామని జననేత వద్ద పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెం టరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట నియోజకవర్గాల సమన్వయకర్తలు అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, డీసీసీబీ ఛైర్మన్ మరిశర్ల తులసి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, పార్టీ నాయకులు జమ్మా న ప్రసన్నకుమార్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఒడిశా యువకులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన గిరిజన నిరుద్యోగులు
-
299వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
వైఎస్ జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
-
298వ రోజు వైఎస్ జగన్ ఫ్రజాసంకల్ప యాత్ర
-
298వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
298వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజా సమస్యలను ఆలకిస్తూ.. వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 298వ రోజు షెడ్యూల్‌ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం పార్వతీపురం నియోజకవర్గంలోని చినరాయుడుపేట నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నిడగల్లు క్రాస్, మురిపివలస మీదుగా సురమ్మపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనవిడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 297వ రోజు ముగిసింది. సాలూరు నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు పాదయాత్ర కొనసాగింది. జననేత నేడు 10.2కిలో మీటర్ల దూరం నడిచారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 3,238.2కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. -
297వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
296వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
తలవంచని ధీరుడు..
-
వైఎస్ జగన్‌ను కలిసిన కుమ్మరి కులస్తులు
-
295వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభం
-
గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
కృష్ణ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
సంకల్పానికి ఏడాది: ఒంగోలు పార్టీకార్యలయంలో కేక్ కట్ చేసిన నేతలు