సాక్షి, శ్రీకాకుళం: ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ ప్రభుత్వ హయంలో తాము పడుతున్న కష్టాలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వి భానమ్మ అనే మహిళ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తనను అకారణంగా తొలగించారని తెలిపారు. అలాగే చాపరకు చెందిన రాజారావు కుటుంబ సభ్యులు జననేతను కలిసి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ కుమారుడికి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత తమ వద్ద లేదని వాపోయారు.
ఉద్యోగ భద్రతల కల్పించాలని కోరుతూ..
ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను వీఆర్‌ఏలు కలిశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. తమకు జీతాలు కూడా సరిగా రావడం లేదని వైఎస్ జగన్‌కు తెలిపారు.
స్కూలు పిల్లల ఆవేదన..
వైఎస్ జగన్‌ను కలిసిన చాపర జడ్పీ స్కూల్ విద్యార్థులు తమకు అరకొరగా పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. ఒక పుస్తకాన్ని ఇద్దరు, ముగ్గురు పంచుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న పదో తరగతి పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు.
రుణమాఫీ అందక ఇబ్బందులు పడుతున్నాం..
పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసిన పాతపట్నం రైతులు తాము ఎదురుకుంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రుణమాఫీ అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏక కాలంలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను బ్యాంకర్లు ఎగవేతదారులుగా చూస్తునారనే అవమాన భారంతో కుంగిపోతున్నామని అన్నారు.
తిత్లీ బాధితుని ఆవేదన..
జాడుపల్లి గ్రామానికి చెందిన రైతు కోట భీముడు తన ఆవేదనను జననేతతో చెప్పుకున్నారు. తుపాన్ వల్ల 6 ఎకరాల్లో వేసిన పంట నష్టపోవాల్సి వచ్చిందని.. అయిన ప్రభుత్వం నుంచి రూపాయి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములపై హక్కు లేదంటున్నారు..
ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను సీతారామపల్లి గ్రామస్తులు కలిశారు. తరతరాలుగా 200 ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని.. ఇప్పుడు అధికారులు వాటిపై తమకు ఎలాంటి హక్కులు లేవంటున్నారని జననేతకు తమ ఆవేదనను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment