సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 331వ రోజు పాదయాత్రను బుధవారం పాతపట్నం నియోజకవర్గంలోని మెళియపుట్టి సమీపంలోని చాపర నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుపురం, జోడురు క్రాస్, రామచంద్రపురం క్రాస్, జాడుపల్లి, పదనాపురం క్రాస్, ఎస్ జాడుపల్లి క్రాస్ మీదుగా రంగడి ఘటి క్రాస్ వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తారు. జననేత ఇప్పటివరకు 3,529.1 కిలోమీటర్లు నడిచారు.
అడుగుముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళులు
వంగావీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన పదో తరగతి విద్యార్థులు
ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జననేతను చాపర జడ్పీ స్కూలు విద్యార్థులు కలిశారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న తమకు ఇంకా టెస్ట్ బుక్స్ అందలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment