
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 330వ రోజు షెడ్యూల్ ఖరారైంది. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తురు నైట్ క్యాంప్ శిబిరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి డీ పోలురు క్రాస్, చింతల పోలురు క్రాస్, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. మిళియపుట్టి వద్ద జరిగే బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 329వ రోజు ముగిసింది. ఆదివారం ఉదయం జననేత గుడెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సన్యాసినీలపురం, డమర, రాంపురం క్రాస్, నర్సింగపల్లి, జగన్నాధపురం, కంచుకోట, జంటురు క్రాస్, బందపల్లి మీదుగా కొత్తురు క్రాస్ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. జననేత నేడు 12.6 కిలోమీటర్లు నడిచారు.