Cooking oils
-
వంటనూనె తగ్గించండి.. వ్యాయామం చేయండి
సిల్వాస్సా: దేశంలో ఊబకాయ సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా మారుతారని అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో అవస్థలు పడే ప్రమాదం ఉందన్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఖ్య అని చెప్పారు. ఒబేసిటీ అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. ఊబకాయ సమస్యను అధిగమించడానికి వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వంట నూనెల విని యోగం తగ్గించుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. నిత్యం వ్యాయామం చేయాలని, శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించడానికి దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ షాపుల్లో ఔషధాలు కొనుగోలు చేయడం వల్ల మధ్య తరగతి ప్రజలు, పేదలకు ఇప్పటికే రూ.30,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో పర్యటించారు. సిల్వాస్సా పట్టణం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.460 కోట్లతో నిర్మించిన ‘నమో హాస్పిటల్’ను ప్రారంభించారు.11 నుంచి మోదీ మారిషస్ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ నుంచి మారిషస్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుందని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గూలం ఆహా్వనం మేరకు మారిషస్ జాతీయ దినోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేసింది. రూ. 32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలో లెక్కించలేరుకాంగ్రెస్ను ఎద్దేవా చేసిన ప్రధాని మోదీసూరత్: చట్టసభల్లో సున్నా సీట్లు ఉన్న రాజకీయ పార్టీలు రూ.32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్కించలేవని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ కింద పేదలకు ఇప్పటిదాకా రూ.32 లక్షల కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి ఆదాయపు పన్ను మినహాయింపును రూ.12 లక్షల వరకు పెంచామని అన్నారు. శుక్రవారం గుజరాత్‌లోని సూరత్‌లో ‘సంతృప్తస్థాయిలో ఆహార భద్రత’ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను శనివారం పూర్తిగా మహిళలకే అప్పగించబోతున్నానని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
రూపాయి వెలవిల.. వంటనూనె సలసల
సాక్షి, హైదరాబాద్ : అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుతుండడంతో దేశీయంగా వంటనూనెల ధరలకు రెక్కలొస్తున్నాయి. జనవరి 24వ తేదీ నుంచి రూపాయి విలువ భారీగా పడిపో వటంతో, వంటనూనెల ధరల్లోనూ మార్పులు వచ్చా యి. రాష్ట్రంలో 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి. మూడేళ్ల క్రితం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. లీటర్ సన్‌ఫ్లవర్ నూనె రూ.200 వరకు చేరింది. పామాయిల్ ధరలు కూడా అప్పుడు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంతో ధరలు దిగివచ్చినప్పటికీ.. లీటర్ నూనె ధర ఆయా కంపెనీల విలువను బట్టి రూ.125 పైనే కొనసాగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచింది. రిఫైన్డ్ నూనెలపై సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. దీంతో మరోసారి దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.135 ఉన్న లీటర్ వంట నూనె ధర.. ప్రస్తుతం రూ.150 దాటింది. 60 శాతం దిగుమతే..మనదేశంలో వినియోగించే వంటనూనెలో 60 శాతానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. నవంబర్ నుంచి ఆ తర్వాతి ఏడాది అక్టోబర్ వరకు నూనె సంవత్సరంగా అంతర్జాతీయంగా పేర్కొంటారు. గత నూనె సంవత్సరంలో అత్యధికంగా 164.7 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసు కుంది. ఇందుకోసం రూ.1,38,424 కోట్లను వెచ్చించింది. భారత్‌కు నూనెను ఎగుమతి చేసే దేశాల్లో ఇండోనేషియా, అర్జెంటీనా మొదటి రెండు స్థానాల్లో ఉండగా, పామాయిల్‌ను మలేషియా అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్, రష్యా నుంచి క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్న నూనెలకు డాలర్ల రూపంలో చెల్లిస్తుండడంతో ఆ ప్రభావం రిటైల్ నూనెల మార్కెట్‌పై పడుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ నూనెల ధరలు ఆయా కంపెనీలను బట్టి రూ.150 నుంచి రూ.170 వరకు ఉన్నాయి. కాగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఐదు నెలల కనిష్ట స్థాయి 4.31 శాతానికి తగ్గింది. ఇది 2024 డిసెంబర్లో 5.22 శాతం ఉండగా, ఏడాది క్రితం 5.1 శాతంగా ఉంది. -
ఎట్టకేలకు పెరిగిన ఆయిల్‌పామ్ ధర
సాక్షి, అమరావతి: క్రూడ్ పామాయిల్(సీపీవో)పై కేంద్రం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల ప్రభావంతో దేశీయంగా ఆయిల్‌పామ్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.13,950 ఉన్న తాజా ఆయిల్ పామ్ గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్ను ధర రూ.19,040కి పెరిగింది. సీజన్‌కు ముందుగానే ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో)ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీ కంటే మంచి ధరను తెలంగాణ రైతులు పొందగలుగుతున్నారు.దిగుమతి సుంకం పునరుద్ధరణతో..ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా పెరిగిన వంటనూనె ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా సీపీవోపై 49 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2022లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్స్ ధరలు టన్ను రూ.77వేల దిగువకు పడిపోయాయి. ఫలితంగా టన్ను రూ.23,635 నుంచి గతేడాది అక్టోబర్‌లో రూ.12,100కు పడిపోయింది.వయబిలిటీ ధరను సవరించడంతో పాటు క్రూడ్ పామ్ ఆయిల్(సీపీఓ)పై దిగుమతి సుంకాలను పునరుద్ధరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో క్రూడ్ ఆయిల్స్‌పై 20 శాతం చొప్పున దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడంతో పాటు సోయాపై 5.5 శాతం నుంచి 27.50 శాతం, రిఫైన్డ్ ఆయిల్స్‌పై 13.75 శాతం నుంచి 35.75 శాతానికి దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ ధరల ప్రభావందీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు టన్ను రూ.1.25 లక్షలకు పెరిగింది. ఫలితంగా దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతూ వచ్చాయి. అడ్‌హక్ కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని రైతులకు టన్ను రూ.19,040 చొప్పున ధర లభిస్తోంది. కాగా తెలంగాణాæ రాష్ట్ర ప్రభుత్వం సీజన్ ప్రారంభంలోనే ఓఈఆర్ను ప్రకటించడంతో టన్ను రూ.19,150 చొప్పున ధర లభిస్తోంది. గడిచిన ఐదేళ్లు మాదిరిగానే 2024–25 సంవత్సరానికి కూడా ఓఈఆర్ ప్రకటించాలని ఆయిల్‌పామ్ రైతులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓఈఆర్ ప్రకటనలో జరుగుతున్న జాప్యం రానున్న ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఓఈఆర్ ప్రకటిస్తే రైతులకు మరింత మేలుదిగుమతి సుంకం పునరుద్ధరణ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ప్రభావంతో దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం రూ.13,950 ఉన్న టన్ను గెలల ధర ప్రస్తుతం రూ.19 వేలకు పైగా పలుకుతోంది. మరింత పెరిగే అవకాశం కూడా కన్పిస్తోంది. గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఓఈఆర్ ప్రకటిస్తే ఆయిల్‌పామ్ రైతులకు మేలు కలుగుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
వంట నూనె ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలవుతున్న వేళ వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు 23 నుంచి 37 శాతం వరకు పెరగడంతో పండగ వేళ సామాన్యులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నెలలో రూ.100 ఉన్న పామాయిల్ ధర రూ.137 (37 శాతం) పెరగ్గా, సోయాబీన్ నూనె రూ.120 నుంచి రూ.148 (23 శాతం), సన్‌ఫ్లవర్ రూ.120 నుంచి రూ.149 (23.5 శాతం), ఆవ నూనె రూ.140 నుంచి రూ.181 (29శాతం), వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.187 (4 శాతం) మేర పెరిగాయి. దేశీయంగా నూనెగింజల సాగు పెద్దగా లేకపోవడంతో దేశం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా 58 శాతం ఇతర దేశాల నుంచే భారత్‌కు వస్తోంది. నూనెల వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. దేశీయంగా నూనె పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. శుధ్ది చేయబడిన ఆవ నూనెల దిగుమతి సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. సెపె్టంబర్ 14 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపట్టారు. దీనితో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు నూనెగింజల సాగులో ముందున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది. ఈ ప్రభావం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన ధరల ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు దీపావళి సందర్భంగా చేసుకునే తీపి పదార్థలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వీట్ల ధరలను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొత్త పంట మార్కెట్లోకి వచ్చే వరకు ధరలు దిగిరావని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
సామాన్యులకు షాక్.. వంటనూనెలు ప్రియం
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్‌ఫ్లవర్ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో లీటర్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.16 పెరిగింది. సూపర్మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్‌కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్‌కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్‌కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు. -
గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడే బెస్ట్ ఆయిల్స్ ఇవే..!
గుండె ఆరోగ్యంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, సరిగ్గా పనిచేయడానికి తోడ్పడే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆహారంలో ఉపయోగించే వంట నూనెలు మన గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తుంటార. చాలా మందికి గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి నూనెలు తీసుకోవడం మంచిదనేది తెలియదు. అయితే బాలీవుడ్ నటి మాధరీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఐదు బెస్ట్ నూనెలు గురించి వెల్లడించారు. అవెంటో తెలుసుకుందామా..!డాక్టర్ శ్రీరామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే బెస్ట్ నూనెల గురించి షేర్ చేసుకున్నారు. కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన ఆయన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు వంట నూనెల గురించి సవివరంగా తెలిపారు. ఆయన గుండె ఆరోగ్యానికి సిఫార్సు చేసిన ఐదు వంటనూనెలు ఏంటంటే..రైస్ బ్రాన్ ఆయిల్వేరుశెనగ నూనెఆవాల నూనెఆలివ్ నూనెనువ్వుల నూనెఈ నూనెలలో ప్రతి ఒక్కదాని వినియోగం వల్ల పొందే ప్రయోజనాలెంటంటే..రైస్ బ్రాన్ ఆయిల్ఈ నూనెలో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరిచి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.వేరుశెనగ నూనెదీని వల్ల గుండెకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ ఈ ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించి, గుండెను ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఆవాల నూనెఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఒమేగా -3 ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖ్యమైనవి. ఆవనూనెలోని విటమిన్ ఈ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి.ఆలివ్ నూనెఇది గుండెకు దాని ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఆలివ్ ఆయిల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒలీక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయిలను పెంచి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్)ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో పాలీఫెనాల్స్, విటమిన్ ఈ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ రెండూ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆలివ్ నూనె మెడిటరేనియన్ డైట్లో ప్రధానంగా ఉపయోగిస్తార కూడా. నువ్వుల నూనెఈ నూనెలో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సెసమోల్, సెసమిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి. నువ్వుల నూనెలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. View this post on Instagram A post shared by Dr. Shriram Nene (@drneneofficial) (చదవండి: 45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!) -
పతంజలికి భారీ షాక్, లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: పతంజలి ఫుడ్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 64 శాతం క్షీణించి రూ.88 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.241 కోట్లుగా ఉంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఈ విభాగంలో కంపెనీ నికర నష్టాలు ఎదుర్కొన్నది. ఫుడ్ వ్యాపారం మెరుగైన పనితీరుతో ఆదుకుంది. మొత్తం ఆదాయం రూ.7,370 కోట్ల నుంచి రూ.7,810 కోట్లకు పెరిగింది. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) వంట నూనెల విభాగం ఆదాయం రూ.5,891 కోట్లుగా ఉంది. వంట నూనెల ఆదాయం తగ్గినప్పటికీ, అమ్మకాల పరిమాణం 1.4 టన్నుల మేర పెరిగినట్టు, ఇది వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 36 శాతం అధికమని పతంజలి ఫుడ్స్ తెలిపింది. ‘‘వంట నూనెల పరిశ్రమపై ధరలు క్షీణత ప్రభావం బలంగా పడింది. క్రితం త్రైమాసికం నుంచి చూస్తే ధరలు తగ్గిపోవడంతో, అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వ కారణంగా, రవాణాలో ఉన్న స్టాక్ కారణంగా నష్టపోవాల్సి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించింది. జూన్ త్రైమాసికంలో నమోదైనదంతా కూడా సైక్లికలే’’అని వివరించింది. తమ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం అనుకున్న విధంగా పనితీరు చూపించిందని.. నూతన ఉత్పత్తుల విడుదలతో ఇది మరింత వృద్ధిని చూస్తుందని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్థానా పేర్కొన్నారు. ఆదాయం, లాభాలకు ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ పెద్ద మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. -
పప్పు.. నిప్పు!
సాక్షి, హైదరాబాద్: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్ దాల్) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే.. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. స్టాక్.. బ్లాక్ మార్కెట్‌కు? పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
వంట నూనె ఒంటికి మంచిదా? ఎంతవరకు! ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వంట నూనె వినియోగంపై భిన్న వాదనలు ఉన్నాయి. నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని కొందరు అంటారు. అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని మరికొందరు చెబుతుంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు గానుగ (కోల్డ్ ప్రెస్) నూనెనే ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా రిఫైన్డ్ (శుద్ధి చేసిన) ఆయిల్స్ మార్కెట్‌ను ఆక్రమించాయి. ప్యాకేజ్డ్ నూనెల వినియోగం పెరిగిపోయింది. కొన్నాళ్లకు శుద్ధి చేసిన నూనెలు మంచివి కావనే వాదన మొదలైంది. దీంతో మళ్లీ గానుగ నూనె వినియోగం మొదలైంది. అయితే గానుగ నూనెలే మంచివని, శుద్ధి చేసిన నూనెలు మంచివి కావన్న ప్రచారం ఏమాత్రం సరికాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అంటున్నారు. ‘అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 2 వేల వరకు కేలరీలు కావాలి. కష్టపడి పని చేసేవారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అయితే అందులో 25 నుంచి 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి..’అని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి నూనె మంచిది, ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 85 శాతం శుద్ధి చేసిన వంట నూనెలే.. ప్రస్తుతం ప్రపంచంలో వాడుతున్న వంట నూనెల్లో 85 శాతం శుద్ధి చేసినవే. రిఫైన్డ్ నూనెల్లో వాడే రసాయనాలు అన్నీ కోడెక్స్ (నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించే అంతర్జాతీయ సంస్థ) నిర్ధారించినవే. కోడెక్స్ సహా మన దేశంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫారసు చేసిన హాని చేయని రసాయనాల్ని రిఫైనింగ్‌లో వాడుతున్నారు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకోవచ్చు. అందులో విషం ఉంటుందనేది ఏమాత్రం నిజం కాదు. అంతేకాదు కొన్ని గింజల నుంచి గానుగ పద్ధతిలో నూనెను తయారు చేయలేం. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, కుసుమ గింజలనే గానుగ చేసి నూనె తీయవచ్చు. కానీ పామాయిల్, సోయాబీన్ నూనెలను ఆ పద్ధతిలో తీయలేం. వాటిని రిఫైన్ చేయకుండా వాడలేం. ప్రపంచంలో మూడింట రెండో వంతు పామాయిల్, సోయాబీన్ నూనెలనే వాడతారు. మన దేశంలో ఏడాదికి 23 మిలియన్ టన్నుల నూనె వాడతారు. కానీ మనం 8 మిలియన్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలినది దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి గానుగ నూనె అందరికీ ఇవ్వలేం. గానుగ నూనె మంచిది కాదని కూడా చెప్పడం లేదు. శుద్ధి చేసిన నూనెలు మంచివి కావని ప్రచారం చేయడమే తప్పు. ఎక్కువ రాదు కాబట్టి గానుగ నూనె ధర ఎక్కువ గింజలను గానుగ ఆడించినప్పుడు వాటి నుంచి నూనె మొత్తం రాదు. దాదాపు 25 శాతం చెక్కలోనే ఉండిపోతుంది. కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది. ఇక శుద్ధి చేసిన నూనెలను తయారు చేసే కంపెనీలు పెద్దమొత్తంలో తక్కువ ధరకు ముడిపదార్థాలు కొంటాయి. పైగా యంత్రాలతో నూనె మొత్తాన్నీ తీస్తాయి. అందువల్ల వాటి ధర తక్కువగా ఉంటుంది. ఇక గానుగ చేసేందుకు వాడే గింజల్లో పుచ్చిపోయినవి ఉంటే వాటి నూనె విషంగా మారుతుంది. ఉదాహరణకు పుచ్చిపోయిన పల్లీలతో నూనె తీస్తే అందులో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. అయితే అవే గింజలను రిఫైన్ చేస్తే ఎఫ్లాటాక్సిన్ పోతుంది. అప్పుడు అది మంచిదవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే రిఫైన్డ్ నూనెల్లో కల్తీ జరుగుతుందని చెప్పడం నిజం కాదు. ఆమ్లాలు సమాన నిష్పత్తిలో ఉండాలి నూనెల్లో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడూ సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఈ మూడూ సమతూకంలో లేకపోతే అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుండాలి. ఒమెగా–3 ఆమ్లాలు అన్ని నూనెల్లో ఉండవు. కేవలం సోయాబీన్, ఆవనూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉంటాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కాబట్టి ఒమెగా–3 ఉన్న నూనెలను వాడనివారు, ఇతర నూనెలు వాడుతున్నవారు తప్పనిసరిగా అవిసె గింజలు దోరగా వేయించినవి రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి ఒమెగా–3 లభిస్తుంది. కానీ మన వద్ద నిత్యం చేపలు తినే పరిస్థితి ఉండదు. అలాగే అందరూ చేపలు తినరు. కాబట్టి ఆ ఆమ్లాలున్న నూనెలు వాడాలి. ఆలివ్‌నూనెలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 75 శాతం ఉంటాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. నూనెల మిక్సింగ్ మంచిది రెండు అంతకంటే ఎక్కువ నూనెలను కలిపి వాడాలి. ఒక నూనెలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు సమాన నిష్పత్తిలో లేనప్పుడు, సమాన నిష్పత్తిలోకి తీసుకొచ్చేలా ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ నూనెలు ఇంట్లోనే కలిపి వాడుకోవచ్చు. ప్రతి నూనె ప్యాకెట్ మీద ఆ మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తి ఉంటుంది. మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తితో పాటు నూనెల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే కొన్ని గామా ఒరిజినాల్, టోకోఫిరాల్స్ (విటమిన్–ఈ), పైటోస్టిరాల్ వంటి పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు రైస్బ్రాన్లో ఒరిజనాల్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది. దాదాపు అన్నింటిల్లోనూ పైటోస్టిరాల్ ఉంటుంది. దీనికి కొలెస్టరాల్ తగ్గించే స్వభావం ఉంది. నువ్వుల నూనెలో సిసీమోల్, సిసీమోలిన్ అనే యాంటీæ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ లేబిలింగ్‌లో చూసుకోవాలి. ప్యాకింగ్‌పై ఉన్న అధికారిక సమాచారంతోనే దాన్ని వాడాలా లేదా తెలుసుకోవచ్చు. నూనె లూజ్‌గా అమ్మకూడదు లూజ్ ఆయిల్ అమ్మడం నిషేధం. చట్ట ప్రకారం నేరం. లూజ్ అంటే ప్యాక్ చేయకుండా కొలిచి అమ్మే నూనె. దీనిని కొనకూడదు. ప్యాకేజ్డ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకెట్లు, ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించే నూనెలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉండాలి. పోషక విలువలు, కొలెస్ట్రాల్ వంటివి ఎంతున్నాయో ముద్రించాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్న బ్రాండెడ్ కంపెనీలవే వాడాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఉంటే బ్రాండెడ్ కంపెనీల నూనెలనైనా కొనకూడదు. సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకోవాలి. గడువు తేదీ కూడా చూసుకోవాలి. లైసెన్స్ లేకున్నా, నిబంధనల ప్రకారం నూనె ప్యాకెట్లపై వివరాలు లేకున్నా ఎఫ్ఎస్ఎస్ఏఐ టోల్ ఫ్రీ నంబర్ (1800112100) కు ఫోన్ చేయవచ్చు. -
రూ.280 కోట్లతో ‘కార్గిల్’ వంటనూనెల శుద్ధి కర్మాగారం
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ కార్గిల్ ఇండియా తమ దక్షిణ భారతదేశ వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ వంట నూనెల తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసి ఆధునీకరించినట్లు తెలిపింది. బుధవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘జెమిని ప్యూరిట్’ బ్రాండ్ పేరుతో సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా కార్గిల్ ఇండియా ఇన్‌గ్రిడియంట్స్ (దక్షిణాసియా) కన్జూమర్ బిజినెస్ లీడర్ అవినాష్ త్రిపాఠి మాట్లాడుతూ దేశవ్యాప్త సన్‌ఫ్లవర్ వినియోగంలో 70 శాతం దక్షిణ భారతదేశంలోనే జరుగుతోందని, దీంతో దక్షిణ దేశ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ‘జెమిని ప్యూరిట్’ని విజయవాడలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం వద్ద సన్‌ఫ్లవర్, రిఫైండ్ పామాయిల్, పామోలిన్, వనస్పతి, బేకరీ షార్టెనింగ్స్‌ను తయారు చేసి అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద 4.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
మళ్ళీ షాక్ ఇవ్వనున్న వంట నూనెల ధర ..!
-
రైతు బజార్లో తక్కువ ధరకు వంట నూనెల విక్రయాలు
కడప అగ్రికల్చర్: రాష్ట్రవ్యాప్తంగా వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సామాన్యుడు కనీవిని ఎరుగని రీతిలో ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు కొని తినలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు వినియోగదారులకు బ్రాండెడ్ ఆయిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో విజయ్ బ్రాండ్‌కు చెందిన సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, పామాయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్‌ను విక్రయించేందుకు సిద్ధం చేసి ధరలను కూడా ఖరారు చేశారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతు బజార్లో ఉన్న అన్ని కిరాణా షాపుల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. రైతు బజార్‌కు సంబంధించిన కొంతమంది సిబ్బంది ద్వారా కూడా వీటిని విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టమాటాలను.. ఇటీవల బహిరంగ మార్కెట్లో కిలో టమాటాల ధర రూ. 100 నుంచి 120 దాకా పలికింది. ఈ తరుణంలో ప్రజల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కర్నాటక నుంచి దిగుమతి చేసుకుని రైతు బజార్ ద్వారా కిలో రూ. 65తో విక్రయించింది. ప్రస్తుతం రూ.52తో విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలకు విజయ్ బ్రాండ్ ఆయిల్ బహిరంగ మార్కెట్లో ఆయిల్ ధరలు బాగా పెరిగాయి. దీంతో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజారులో విజయ్ బ్రాండ్‌కు సంబంధించిన ఆయిల్ ఉత్పత్తులను తీసుకొస్తోంది. ధరలు కూడా బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా ఉండనున్నాయి. ఈ నూనెలు రెండు మూడు రోజుల్లో రైతుబజార్‌కు వస్తాయి. – హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌శాఖ, కడప -
విజిలెన్స్ విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు.. విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా మార్గాలపై దృష్టి గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. -
ప్రభుత్వ ఔట్లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్లెట్లలో 1,01,165 లీటర్ల వంట నూనెను విక్రయించడం విశేషం. ఇందులో రైతుబజార్లలో 70,580 లీటర్లు, మున్సిపల్ మార్కెట్లలో 30,585 లీటర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనె విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీ.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్‌ను సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసి 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్‌ఫ్లవర్ స్థానంలో సోయాబీన్, రైస్‌బ్రాన్ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు ఔట్లెట్లలో ప్రభుత్వ ధరలకే.. అంతర్జాతీయంగా నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి రావడంతో పాటు ఎక్కడా కూడా కృత్రిమ కొరత తలెత్తలేదు. హోల్‌సేల్ విక్రేతల సాయంతో 256 రిటైల్ ఔట్లెట్స్ ద్వారా సుమారు 11.20లక్షల లీటర్ల వంట నూనెను ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే అందించడం గమనార్హం. విజయ ఆయిల్స్‌కు మంచి ఆదరణ వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విజయ ఆయిల్ పేరుతో విక్రయాలు చేపట్టింది. మార్కెట్ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాం. – చవల బాబురావు, ఏపీ ఆయిల్‌ఫెడ్ ఎండీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాం.. ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం – గిరిజా శంకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్‌పై సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
సంచలనం, వంట నూనెతో అద్భుతం..కుకింగ్ ఆయిల్‌తో కాస్ట్లీ విమానం నడిపారు!
సీట్లు నిండినా..గల్లా ఖాళీ అవుతుంది ఇదీ ప్రస్తుతం విమానయాన పరిస్థితి. అందుకే విమానాయన సంస్థలు ఆవ నూనె, వంట నూనెతో విమానాల్ని నడిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. తాజాగా 496 మంది ప్రయాణించే కాస్ట్లీ విమానం 'ఎయిర్ బస్ ఏ380'లో వంటింట్లో వాడే వంట నూనె ఫ్యూయల్‌గా ఉపయోగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే విమానం నిర్దేశించిన ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాలి నుంచి కాదు ఆవ మొక్క నుంచి ఇంధనం ఐదేళ్ల క్రితం గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందని అనడంతో విమానయానం కష్టాలు ఇక తీరిపోయినట్లేనని భావించారు. ఎందుకంటే అసలు విమానయానం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న చమురు ధరలతో..వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం దాటుతోంది. దాంతో ఆల్ట్రనేటీవ్ ఫ్యూయల్ వైపు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యచరణకు నోచుకోలేదు. కానీ గతేడాది భారత శాస్త్రవేత్త,జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పునీత్ ద్వివేదీ బృందం ఆవాల మొక్క ద్వారా విమానం ఇంధనం తయారవుతుందనగానే ఆశలు చిగురించాయి. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయోచ్చని పునీత్ ద్వివేది తెలిపారు. ద్వివేదీ గత 4 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తుండగా..ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేపట్టింది. వంట నూనెతో అద్భుతాలు ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్ ఏ380 ఫ్లైట్‌ను ఫ్రాన్స్‌లో ట్రయల్స్ నిర్వహించారు. సంచలనం ఏంటంటే ఈ విమానంలో వంటింట్లో వాడే వంటనూనె ( ఇది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(saf అని కూడా పిలుస్తారు)ను ఉపయోగించడం. ఈ విమానం రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ సాయంతో మార్చి 25న టౌలౌస్‌లోని బ్లాగ్నాక్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. మార్చి 29న టౌలౌస్ నుండి నైస్‌కు వెళ్లేందుకు అదే నూనెను ఉపయోగించి ఏ380 ప్లైట్‌ను మరో ట్రైల్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇంధన పనితీరు బాగున్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ 'హైడ్రోప్రాసెస్డ్ ఎస్టర్స్, ఫ్యాటీ యాసిడ్స్' లేదా హెచ్ఈఎఫ్ఏ నుండి ఈ ప్రత్యేకమైన కుకింగ్ ఆయిల్‌ను తయారు చేసింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆయిల్‌ను విమానాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. మార్చి2021లో వైడ్ బాడీ ఏ 350 ఫ్లైట్‌లో, గత అక్టోబర్‌లో ఏ319 నియో అనే విమానంలో ఈ ఆయిల్‌ను ఫ్యూయల్‌గా ఉపయోగించారు. తాజాగా కాస్ట్లీ విమానం ఏ380 లో ఉపయోగించి టెస్ట్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తించారు. కాగా ఎయిర్‌బస్ యాజమాన్యం తన విమానాలన్నింటిలో ఈ కుకింగ్ ఆయిల్‌ను ఉపయోగించేందుకు సర్టిఫికేట్ పొందాలని చూస్తుంది. అప్పటి వరకు ప్రయోగాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ! -
వంట నూనెల అక్రమ నిల్వలపై విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై విజిలెన్స్ శాఖ దాడులు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 214 దుకాణాలు, సూపర్ మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. పలుచోట్ల లీటర్ ప్యాకెట్లలో వంట నూనె 910 గ్రాములే ఉన్నట్టు తేలింది. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న 53 దుకాణాలు, సూపర్ మార్కెట్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. మార్చిలో మొత్తం 5,328 దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి 1,690 కేసులు నమోదు చేశారు. -
సామాన్యులకు భారీ షాక్, వంట నూనె రేట్లు మరింత పైకి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మన దేశంలో వంట నూనెల ధరలు గతంలో ఎన్నడూ లేని రోజు రోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం ప్రారంభమైన ఫిబ్రవరి నెల నుంచి భారత్‌లో వంట నూనెల ధరలు అంతకంతకూ పెరుగుతున్నట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ బిజోమ్ డేటా తెలిపింది. బ్రాండెడ్ సన్ ఫ్లవర్, వనస్పతి, ఆవాలు, వేరుశెనగ నూనె ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. రష్యా - ఉక్రెయిన్ దేశాలు సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేసే ప్రధాన దేశాలలో ఉక్రెయిన్, రష్యా దేశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల రవాణా చేస్తూ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాలు ప్రతి ఏడాది భారత్‌కు 2.5 నుంచి 3 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేస్తున్నాయి. ఇందులో దాదాపు 70% ఉక్రెయిన్ నుండి వస్తుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇలా మొత్తంగా ఉక్రెయిన్, రష్యాలు కలిసి గతేడాది ఎడిబుల్ ఆయిల్ ను 1.6 మిలియన్ టన్నులను సరఫరా చేస్తూ.. దిగుమతుల్లో దాదాపు 13% వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న కారణంగా భారత్‌లో వంట నూనెల ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగినట్లు బిజోమ్ అంచనా వేసింది. దేశంలోని 7.5 మిలియన్ల రిటైల్ అవుట్లెట్లలో ప్యాక్ చేసిన వినియోగ వస్తువుల విక్రయాల ఆధారంగా ప్యాకేజ్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు ఫిబ్రవరిలో వరుసగా 4% పెరిగాయి. అయితే మస్టర్డ్ ఆయిల్ 8.7%, సోయాబీన్ నూనె ధరలు స్వల్పంగా 0.4% తగ్గగా, వనస్పతి 2.7% పెరిగింది. వేరుశెనగ నూనె 1% పెరగ్గా.. భారతీయ గృహాలలో విస్తృతంగా వినియోగించే పామాయిల్ ధరలు 12.9% తగ్గాయి. ఫిబ్రవరి 2020తో పోలిస్తే పామాయిల్ ధరలు ఇప్పటికీ 22.9% పెరిగాయి. కొంచెం సర్ధుబాటు భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు సెప్టెంబరు, డిసెంబర్ త్రైమాసికం మధ్య కొంత దిద్దుబాటుకు గురయ్యాయి. జనవరి నెలలో బిజోమ్ డేటా ప్రకారం.. గత రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి నుండి ధరలను 10-30% సడలింపుగా సూచించింది. అయినప్పటికీ, ఫిబ్రవరి నెల చివరలో ఉక్రెయిన్‌లో జరిగిన వివాదం వంట నూనెతో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గత రెండు త్రైమాసికాలుగా ఎడిబుల్ ఆయిల్ ధరలు కొంత స్థిరత్వాన్ని కనబరుస్తున్నాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ ధోరణిని మార్చడానికి దారితీసిందని బిజోమ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అక్షయ్ డిసౌజా అన్నారు. మార్చిలో రిలీజ్ కానీ డేటా ఎడిబుల్ ఆయిల్ ధరలు సంవత్సరానికి 15-20% పెరిగాయని, మార్చి 17న విడుదల చేసిన ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ట్రాకర్ నివేదిక బీఎన్పీ పారిబాస్ ఇండియా హెడ్ కునాల్ వోరా తెలిపారు. చాలా ఎడిబుల్ ఆయిల్స్ ధరలు ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిలు. ప్రీ-కోవిడ్ కాలంతో పోలిస్తే లేదా ఫిబ్రవరి 2020, ఉదాహరణకు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 50%, వనస్పతి నూనె 58% పెరిగింది, సోయాబీన్ నూనె దాదాపు 20% పెరిగింది. -
దిగొస్తున్న వంటనూనెల ధరలు .. ఫలిస్తున్న ఏపీ ప్రభుత్వ చర్యలు
సాక్షి, అమరావతి: ఆకాశానికి ఎగబాకిన వంట నూనెల ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌తో ధరలపై నిఘా, ఆకస్మిక తనిఖీలు.. మరోవైపు రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే విజయ ఆయిల్స్ విక్రయాల ఫలితంగా వంట నూనె ధరలు దిగొస్తున్నాయి. ఎమ్మార్పీకంటే కనీసం రూ.5 నుంచి రూ.55 వరకు తగ్గించి అమ్ముతున్నారు. మార్కెట్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయంగా వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టించారు. పాత నిల్వలను కూడా ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారు. దీంతో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. జనవరిలో లీటర్‌కు రూ.150–175 మధ్య ఉండగా, ఒకేసారి రూ.200 దాటాయి. ప్రియా ఆయిల్స్ అయితే లీటర్ రూ.200 నుంచి రూ.265 కు పెంచేశారు. వెంటనే ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. స్టాక్ లిమిట్‌పై ఆంక్షలు విధించింది. టాస్క్‌ఫోర్స్‌తో మార్కెట్లో ధరలపై నిరంతర నిఘా పెట్టింది. హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రధాన నగరాల్లో 75 మందికి పైగా వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులపై 6ఏ కేసులు నమోదు చేసింది. 1,802 టన్నులకు పైగా వివిధ రకాల నూనెలను స్వాధీనం చేసుకుంది. తక్కువ ధరలకే ఆయిల్స్ రైతుబజార్లు, మునిసిపల్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వాటిలో విజయా ఆయిల్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లల్లో స్వాధీనం చేసుకున్న నూనెలను కూడా ఈ కౌంటర్లలో విక్రయిస్తోంది. ఈ విధంగా గత 15 రోజుల్లో 61,759 లీటర్లు విక్రయించింది. ఇటీవల ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించింది. ఈ చర్యలతో ధరలు దిగొచ్చాయి. ఎమ్మార్పీ కంటే రూ.55 వరకు తగ్గించి విక్రయించేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. వంట నూనెల ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు నియంత్రణ చర్యలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పామాయిల్ వారికి అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పామాయిల్‌ను మార్కెట్లో రూ.175కు విక్రయిస్తున్నారు. అయితే, ప్రభుత్వం పామాయిల్ లీటర్ రూ.150కే విక్రయించాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా దీనిని విక్రయిస్తున్నారు. విజయ రిఫైన్డ్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్ ఆయిల్స్ రూ.170కే అందుబాటులో ఉంచింది. ధరలు అదుపులోకి వచ్చాయి ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. రైతు బజార్లతో పాటు మున్సిపల్ మార్కెట్లలో విజయా ఆయిల్స్ అందుబాటులోకి తెచ్చాం. వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. మార్కెట్‌పై నిఘాతో పాటు విస్తృత తనిఖీల ఫలితంగా ధరలు అదుపులోకి వచ్చాయి. పామాయిల్‌ను మంగళవారం నుంచి లీటర్ రూ.150కే అందుబాటులో ఉంచుతున్నాం. – చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్ 5వేల జనాభా ఉన్న గ్రామాల్లోనూ నూనెల కౌంటర్లు రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లతో పాటు ఐదు వేలు జనాభా ఉన్న గ్రామాల్లో కూడా ప్రత్యేక కౌంటర్లతో నూనెలు విక్రయించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ చెప్పారు. ధరల నియంత్రణ టాస్క్ ఫోర్స్ కమిటీతో మంగళవారం ఆయిల్ ఫెడ్ ఎండీ బాబూరావుతో కలిసి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కమిషనర్ మాట్లాడారు. మార్కెట్లో పామాయిల్ లీటర్ ప్యాకెట్లో 900 గ్రాములకు బదులు 870 గ్రాములే ఉంటోందన్నారు. కొంతమంది ప్యాకెట్లపై ఎమ్మార్పీని చెరిపేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని చెప్పారు. ఇటువంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
వంట నూనెల విక్రయాలకు 150 కియోస్కులు
సాక్షి, అమరావతి: మునిసిపల్ మార్కెట్లు, సూపర్ బజార్లలో ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా వంట నూనెల విక్రయాలను పెంచనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వంట నూనెల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సోమవారం భేటీ అయిందన్నారు. ఏపీ ఆయిల్‌ఫెడ్ ద్వారా 111 మునిసిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనెల విక్రయాలకు 150 కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఆయిల్‌ఫెడ్ ఉత్పత్తులను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు వారాల్లో వంట నూనెల ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. సన్‌ఫ్లవర్ నూనె లీటర్ రూ.191, వేరుశనగ నూనె రూ.175, పామాయిల్ రూ.155కు మార్కెట్లో లభ్యమవుతున్నాయని చెప్పారు. నూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా వంట నూనెల అక్రమ నిల్వలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం 337 హోల్‌సేల్, రిటైల్ దుకాణాలతోపాటు సూపర్ మార్కెట్లు, ఆయిల్ తయారీ సంస్థలపై దాడులు చేసి 141 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకుల చట్టం కింద 65, తూనికలు–కొలతలు చట్టం కింద 1,056, ఆహార భద్రత చట్టం కింద 41, మరో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు -
కృత్రిమ కొరత సృష్టిస్తే కొరడా
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రాష్ట్రంలో చాలామంది వ్యాపారులు వంటనూనెల పాత నిల్వలను దాచేయడం ద్వారా కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్నారని.. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యాపార సంస్థలపై బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు డీజీ ఎస్.బాగ్చి హెచ్చరించారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా తక్కువ రేట్లకే వంట నూనెలను అందిస్తుండటంతో పాటు విజిలెన్స్ తనిఖీలు కూడా సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఫలితంగా రెండు, మూడ్రోజులుగా వంట నూనెల ధరలు నిలకడగా ఉన్నాయన్నారు. విజయవాడలోని విజిలెన్స్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని ప్రభుత్వ అవుట్లెట్లలో నూనెలు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసం తగిŠగ్ ధరలు అదుపులోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు, వివిధ సంస్థలతో సమావేశం నిర్వహించి సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచాలని కోరినప్పటికీ వారిలో మార్పు రాలేదన్నారు. ఇకపై మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలోనూ 7 నుంచి 10 బృందాలు నిత్యం తనిఖీల్లో పాల్గొంటున్నాయని బాగ్చి వివరించారు. రూ.29 కోట్ల విలువైన నూనె నిల్వలు సీజ్ ఈ నెల 6 నుంచి 19 వరకు రాష్ట్రంలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపార సంస్థలు, సూపర్మార్కెట్లు, నూనెల తయారీ సంస్థలపై 1,890 తనిఖీలు నిర్వహించినట్లు బాగ్చి వెల్లడించారు. వీటిల్లో పరిమితికి మంచి నిల్వలను గుర్తించడంతో నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం (ఈసీ) కింద 59 కేసులు నమోదు చేసి సుమారు రూ.29 కోట్ల విలువైన 1,500 టన్నుల నూనె నిల్వలను సీజ్ చేశామన్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అధిక నిల్వలు ఉన్నాయన్నారు. కృష్ణాజిల్లాలో ప్రియాగోల్డ్ బ్రాండ్‌కు చెందిన పామాయిల్ నిల్వలను అధికంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. సుమారు 5.67 టన్నులు ప్రియాగోల్డ్ బ్రాండ్ నూనె నిల్వలను సీజ్ చేశామన్నారు. స్వలాభం కోసమే ఈ నిల్వలను దాచిపెట్టారన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వారిపై తూనికలు, కొలతల చట్టం కింద 889 కేసులు, ఆహార భద్రత చట్టం కింద 38 కేసులు నమోదు చేశామన్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో తయారీ మరోవైపు.. ఎటువంటి అనుమతుల్లేకుండా వంట నూనెలను స్థానికంగా తయారుచేసి వాటిని ప్రముఖ కంపెనీల పేరుతో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టామని బాగ్చి వెల్లడించారు. కొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుంటే.. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీనే పెంచేసినట్లు గుర్తించామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తుంటే 94409 06254 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
‘వంట నూనె ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వంట నూనెలను ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విజిలెన్స్ దాడులు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. పాత స్టాక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు పెడతామని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బ్రాండ్ల పేరుతో మోసం చేసిన 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. అక్రమాలపై 9440906254 వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని శంఖబ్రత బాగ్చి సూచించారు. -
వంట నూనెలకు రైతు బజార్లలో అదనపు కౌంటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల ధరలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వంట నూనెలపై సీఎస్ అధ్యక్షతన ప్రైస్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సన్ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్ నూనెలు ఎమ్మార్పీకే ప్రజలకు అందాలని చెప్పారు. ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద వివిధ రైతు బజార్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, చౌక ధరల దుకాణాల్లో కూడా నూనెలు విక్రయించాలని ఆదేశించారు. స్వయం సహాయక బృందాలు, మొబైల్ వాహనాల ద్వారా కూడా నూనెలు అమ్మాలని చెప్పారు. హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్, స్టాకిస్టులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాకు పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ స్టాకు గుర్తిస్తే దానిని స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్లోకి వెంటనే విడుదల చేసి తక్కువ ధరకు అమ్మాలని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, డీఎస్‌వోల నేతృత్వంలో నిఘా పెట్టి అక్రమంగా నిల్వ చేసే వారిపై 6ఎ కేసులు నమోదు చేసి స్టాకును స్వాధీనం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఈవో కార్యదర్శి గిరిజా శంకర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వంట నూనెల ధరల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సివిల్ సప్లైస్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, వ్యవసాయ–మార్కెటింగ్ శాఖ కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ ఎండీ, ఏపీ ఆయిల్‌ఫెడ్ ఎండీ, రైతు బజార్ల సీఈవో, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీ ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు వంట నూనెల ధరలను సమీక్షించి, సంబంధిత విభాగాల అధికారులకు సూచనలిస్తుందని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో స్థానిక మార్కెట్లలో ధరలను పెంచాల్సిన అవసరం లేదు. అయినా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. వ్యాపారులు, డీలర్ల వద్దనున్న పాత నిల్వలను పాత ధరలకే అమ్మాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్‌కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది. వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్‌కు వస్తోంది. యుద్ధం కొనసాగితే.. ‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్‌ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది. దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్‌కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్‌కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది. -
వంటింటికి ఊరట.. రైతు బజార్లలో వంటనూనె విక్రయాలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్‌శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే. అది మరింత ‘ప్రియ’ం ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.170–175, పామాయిల్ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్‌తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్‌తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి. రైతు బజార్లలో ‘విజయ’ నూనెలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వంట నూనెలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏపీ ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా విజయ డిస్ట్రిబ్యూటర్లను సమీప రైతుబజార్లతో అనుసంధానించారు. ధరల్లో వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ప్రత్యేకంగా బోర్డులను ప్రదర్శిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యమైన నూనె ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200 నుంచి రూ.265 వరకు పలుకుతున్న పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరు శనగ, రైస్‌బ్రాన్ నూనెలను రైతు బజార్లలో రూ.163 నుంచి రూ.178కే అందుబాటులో ఉంచారు. ఎలాంటి కోటా లేకుండా విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 61 ప్రధాన రైతుబజార్లలో విక్రయాలను ప్రారంభించారు. వీటిలో 27 చోట్ల విజయ ఆయిల్ అవుట్‌లెట్స్ ఉండగా మిగిలిన చోట్ల రైతుబజార్లలోని ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తు న్నారు. లీటర్ పామాయిల్ రూ.163, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్ నూనెలు రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆయిల్ ఫెడ్ వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని నిల్వలు సేకరించైనా ప్రజలకు వంటనూనెలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు లభ్యం కావడంతోపాటు నాణ్యత బాగుందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో వంటనూనెలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు విక్రయిస్తున్నాం. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే లీటర్ రూ.37 నుంచి రూ.87 తక్కువ ధరకే విజయ నూనెలను అందుబాటులో ఉంచాం. ధరలు అదుపులోకి వచ్చేవరకు విక్రయాలు కొనసాగుతాయి. –చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇతర కంపెనీలను ప్రోత్సహిస్తే చర్యలు మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా వంట నూనెల విక్రయాలను ప్రారంభించాం. ధరల్లో వ్యత్యాసం తెలియచేసేలా రైతుబజార్లలో బోర్డులు ప్రదర్శిస్తున్నాం. విజయ నూనెలను కాకుండా అధిక ధరలు కలిగిన ఇతర కంపెనీల నూనెల విక్రయాలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు నాణ్యత బాగుంది.. రోజురోజుకు పెరుగుతున్న వంట నూనెల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విజయ నూనె విక్రయాలు చేపట్టటాన్ని స్వాగతిస్తున్నాం. భవానీపురం రైతు బజార్లో లీటర్ రూ.170 చొప్పున రెండు వేరుశనగ నూనె ప్యాకెట్లు కొనుగోలు చేశా. నాణ్యత చాలా బాగుంది. –వి.వెంకటలక్ష్మి, భవానీపురం, విజయవాడ ఎంతో ఊరట.. మార్కెట్లో నూనె ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం ఎంతో ఊరటనిస్తోంది. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. భవానీపురం రైతు బజార్లో ఆయిల్ చాలా బాగుంది. ఉల్లి, టమాటా ధరలు పెరిగిన ప్పుడు కూడా ఇదే రీతిలో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. –వన్నంరెడ్డి సురేష్, రామలింగేశ్వరనగర్, విజయవాడ -
రెండో రోజూ విజిలెన్స్ దాడులు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నెపంతో వంటనూనెలు, నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజూ కొరడా ఝుళిపించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 126 చోట్ల తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫో ర్స్మెంట్ సోమవారం మరో 142 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిమితికి మించి నిల్వలు కలిగి ఉన్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో ఈ చట్టం కింద మొత్తం 20 కేసులు నమోదు చేసినట్లయ్యింది. అదే విధంగా తూనికలు కొలతల చట్టానికి విరుద్ధంగా గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై 73 కేసులు నమోదు చేశారు. ఈ చట్టం కింద రెండు రోజుల్లో 127 కేసులు నమోదు చేశారు. ఆహార భద్రతా చట్టం కింద నాణ్యత సరిగాలేకపోవడంతో 15 కేసులు నమోదు చేశారు. దీంతో రెండు రోజుల్లో ఈ కేసుల సఖ్య 27కి చేరింది. మొత్తం మీద రెండు రోజుల్లో వంట నూనెలు, పప్పుధాన్యాల నిల్వలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 174 కేసులను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
వంట నూనెల బ్లాక్ దందాపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పేరిట రాష్ట్రంలో నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార, పౌర సరఫరాల చట్టం ప్రకారం పరిమితికి మించి వంట నూనెలు, పప్పు దినుసుల నిల్వలను కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న వైనంపై ‘ధరల దాడి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పామాయిల్‌తోపాటు పెరుగుతున్న ఇతర వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలను నియంత్రించడానికి విజిలెన్స్ అధికారులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 126 చోట్ల తనిఖీలు నిర్వహించగా.. 16 చోట్ల పరిమితిని మించి నిల్వలు కలిగి ఉండటాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న వంటనూనెల హోల్‌సేల్ వ్యాపార గోడౌన్లో అధికారుల తనిఖీలు అధిక ధరలకు విక్రయిస్తున్న 15 మందిపై లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 ప్రకారం కేసులు నమోదు చేశారు. కొన్నిచోట్ల వంట నూనెల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లు పరిమితిని మించి నిల్వలు కలిగి ఉన్నా, అధిక ధరలకు విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరించింది. -
వంట నూనెలకు యుద్ధం సెగ
తాడేపల్లిగూడెం: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం వంట నూనెలపై పడింది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెల (సన్‌ఫ్లవర్ ఆయిల్)దిగుమతి భారత్‌కు దాదాపుగా ఆగిపోయింది. మన దేశానికి రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతాయి. ఇండోనేషియా డొమెస్టిక్ సేల్స్ పేరిట పామ్‌క్రూడ్, పామాయిల్‌ను ఇతర దేశాలకు పంపించడం లేదు. రష్యా నుంచి 30 శాతం, ఉక్రెయిన్ నుంచి 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ మనకు దిగుమతి అవుతుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా ఈ నూనెలు తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాల నిమిత్తం దిగుమతి చేస్తారు. మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్, పామ్‌క్రూడ్ దిగుమతి అవుతాయి. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఆయా దేశాల నుంచి నూనెల దిగుమతులు తగ్గాయి. ఉన్నట్టుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తెరపైకి రావడంతో ఈ ప్రభావం నూనెల ధరలపై పడింది. లీటరుకు రూ.30 నుంచి రూ.40 పెరుగుదల దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధర వారం రోజుల వ్యవధిలో లీటరుకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరు రూ.115 నుంచి రూ.145కు చేరింది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ నిల్వలు నిండుకోగా.. లీటరు ధర రూ.130 నుంచి రూ.170కి ఎగబాకింది. ధరలకు «రెక్కలు రావడంతో స్థానికంగా లభించే రైస్‌బ్రాన్ ఆయిల్ ధర కూడా పెరిగింది. లీటర్ రూ.145 నుంచి రూ.170కి చేరింది. వేరుశనగ నూనె ధర లీటరు రూ.139 నుంచి రూ.165కు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దిగుమతిదారుల వద్దే నిల్వలు రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామ్‌క్రూడ్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకున్న ఐదారు కంపెనీలు నిల్వలను తమ వద్దే ఉంచుకున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి నిలిచిపోయింది. ఇండోనేషియాలో స్థానిక అవసరాల నిమిత్తం డొమెస్టిక్ సేల్స్ పేరిట ఎగుమతులను ఆ దేశం నిలిపివేసింది. మలేషియాలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు దిగుమతి అయిన ఈ నూనెలు అక్కడే ఉండిపోయాయి. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగుమతిదారులు ఆచితూచి సరుకును గుత్త వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో నూనెల కొరత మార్కెట్‌ను వెంటాడుతోంది. రాష్ట్రంలోని గుత్త, రిటైల్ వ్యాపారుల వద్ద నూనెల నిల్వలు దాదాపుగా అయిపోతున్నాయి. దిగుమతిదారుల నుంచి సరుకు వచ్చే అవకాశాలు తగ్గాయి. దీంతో ఉన్న సరుకు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతోంది. -
వంట నూనెల ధరలు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత కొన్ని నెలలుగా దేశీయంగా వంట నూనెలు ప్రియం కావడం వినియోగదార్లతోపాటు ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకసార్లు శుద్ధి, ముడి వంట నూనెల దిగుమతి సుంకాలను తగ్గించింది. సరఫరాను పెంచడానికి లైసెన్స్ లేకుండా శుద్ధి చేసిన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు వ్యాపారులను అనుమతించింది. ముడి పామాయిల్, కొన్ని ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలను ప్రారంభించడాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. భారత్‌లో ఏటా 2.25 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో దిగుమతుల వాటా ఏకంగా 65 శాతం దాకా ఉంది. -
గుడ్‌న్యూస్: కేంద్రం నిర్ణయంతో.. తగ్గిన వంట నూనెల ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం తగ్గముఖం పట్టడం విశేషం. దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ధరలు 1.95 శాతం నుంచి 7.17 శాతం దాకా ఎగబాకాయి. మనదేశంలో ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాక ధరలు 3.26 శాతం నుంచి 8.58 శాతం వరకూ పడిపోయాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో గత నెల రోజుల్లో సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్ ధరలు వరుసగా 1.85 శాతం, 3.15, 8.44, 10.92 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయా నూనెల ధరలు భారత్‌లో సెప్టెంబర్ 11 నుంచి ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడంతో భారీగా తగ్గాయి. పెరిగిన పప్పుల ధరలు భారత్‌లో గత ఏడాది కాలంగా గోధుమల ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. హోల్‌సేల్, రిటైల్ ధరలు వరుసగా 5.39 శాతం, 3.56 శాతం తగ్గాయి. గత నెల రోజుల్లో బియ్యం ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 0.07 శాతం తగ్గగా రిటైల్ మార్కెట్లో మాత్రం 1.26 శాతం పెరగడం గమనార్హం. ధాన్యం, గోధుమలకు కనీస మద్దతు ధరలను(ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,940, గోధుమల ధర క్వింటాల్‌కు రూ.1,975గా నిర్ధారించింది. అయినప్పటికీ దేశీయంగా బియ్యం, గోధుమల ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగించే పరిణామమే. అదే సమయంలో కొన్ని పప్పు ధాన్యాల ధరలు పెరిగాయి. బంగాళాదుంపల ధర గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సగటున 44.77 శాతం తగ్గింది. ఉల్లిపాయలు, టమోటా ధరలు సైతం తగ్గాయి. ఉల్లిపాయల ధర సగటున 17.09 శాతం, టమోటాల ధర సగటున 22.83 శాతం తగ్గినట్లు తేటతెల్లమవుతోంది. -
మనం వాడే నూనె మంచిదేనా?
పత్తి పంటను పండిస్తున్నది దూది కోసం మాత్రమే కాదు. తరచి చూస్తే ఇది నూనె గింజల పంట కూడా అని అర్థమవుతుంది. ప్రధాన ఉత్పత్తి దూది... ఉప ఉత్పత్తులు నూనె, చెక్క. పత్తి గింజల ఉప ఉత్పత్తులు దేశ విదేశాల్లో అనాదిగా ఉపయోగంలో ఉన్నవే. అయితే, పత్తి విత్తనాల్లో విషతుల్యమైన బీటీ(బాసిల్లస్ తురింగీనిసిస్ అనే సూక్ష్మజీవి) జన్యువును ‘జన్యుమార్పిడి సాంకేతికత’ ద్వారా చొప్పించి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇలా తయారైన బీటీ పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంట నూనెల్లో, నూనె తీసిన తర్వాత మిగిలిన చెక్కను పశువుల దాణాలో కలుపుతున్నారు. 20 ఏళ్లుగా మన దేశంలో మన ఆహార చక్రంలో ఇవి కలుస్తున్నాయి. జన్యుమార్పిడి సోయా చిక్కుళ్ల చెక్క (జీఎం సోయా మీల్) దిగుమతిపై నిషేధాన్ని గత నెలలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి సడలించడంతో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో బీటీ పత్తి గింజల నూనె, చెక్కలో మిగిలి ఉండే బీటీ విష ప్రభావం ప్రజలు, పశువుల ఆరోగ్యంపై ఎలా ఉందనేది ఆసక్తిగొలిపే అంశం. వినియోగం భారత్‌లోనే ఎక్కువ కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సి.ఐ.సి.ఆర్.) సమాచారం ప్రకారం– 20వ శతాబ్దం తొలి నాళ్ల నుంచి పత్తి గింజల ఉత్పత్తుల వినియోగం ప్రారంభమైంది. మన దేశంలో దేశీ రకాల పత్తి గింజలను పశువులకు దాణాగా పెట్టేవారు. 1914లో ఇండియన్ ఆయిల్ కంపెనీ తొలి పత్తి గింజల నూనె మిల్లును ఏర్పాటు చేసింది. మిల్లు ఆడించిన పత్తి గింజల బరువులో 45% పత్తి చెక్క, 16% ముడి నూనె వస్తాయి. జన్యుమార్పిడి బీటీ పత్తి సాగు మన దేశంలో ప్రారంభమయ్యే నాటికి, 2002లో మన దేశంలో 41.32 లక్షల టన్నుల పత్తి గింజల నుంచి 4.13 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అయ్యింది. ఇందులో దేశవాళీ పత్తి గింజల నుంచి తీసిన నూనె 90% వరకు ఉంటుంది. 2020వ సంవత్సరం నాటికి 90%కి పైగా మన దేశంలో బీటీ పత్తి సాగులోకి వచ్చింది. 13.9 లక్షల టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా బీటీ పత్తి గింజల నూనెను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఇదే సంవత్సరంలో చైనాలో 13.7 లక్షల టన్నులు, బ్రెజిల్లో 6.8 లక్షల టన్నులు, పాకిస్తాన్లో 3.2 లక్షల టన్నులు, అమెరికాలో 2.2 లక్షల టన్నుల పత్తి గింజల నూనె ఉత్పత్తయ్యింది. ఆ దేశాలు కూడా 90% పత్తిని జన్యుమార్పిడి వంగడాలతోనే పండిస్తున్నాయి. లోతైన పరిశోధనల ఆవశ్యకత జన్యుమార్పిడి ఆహారతోత్పత్తుల వల్ల మనుషుల్లో ఎలర్జీలు, పశువుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. బీటీ పత్తి గింజల్లో ఉండే బీటీ జన్యువులు, బీటీ ప్రొటీన్లు నూనెలో ఎంత మేరకు ఉన్నాయనేది కనుగొనటం సాంకేతికంగా పెద్ద సవాలని సి.ఐ.సి.ఆర్. పూర్వ సంచాలకులు, డాక్టర్ కేశవ్ ఆర్.క్రాంతి అంటున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ పత్తి సలహా సంఘం సాంకేతిక సమాచార విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ‘‘2000–2002 వరకు నాగపూర్‌లోని సీఐసీఆర్ ప్రయోగశాలలో మేం జరిపిన ప్రయోగాల్లో బీటీ పత్తి గింజల ముడి నూనెలో బీటీ జన్యువు, బీటీ విషం ఆనవాళ్లు కనిపించాయి. అయితే, శుద్ధిచేసిన తర్వాత కనిపించలేదు’’ అని ఆయన అన్నారు. ‘‘అయితే, మేము ఎలీసా, పీసీఆర్‌లతో పరీక్షలు జరిపాం. వీటిని ప్రాథమిక ప్రయోగాలుగా భావించవచ్చు. క్వాంటిటేటివ్ పీసీఆర్ లేదా ఆర్టీ–పీసీఆర్ (రియల్‌టైమ్ పీసీఆర్) పరీక్షలంతటి మెరుగైన ఫలితాలను ఈ పరీక్షలు ఇవ్వలేవు. నూనెను వేడి చేసి వాడతాం కాబట్టి లేశమాత్రంగా ఉన్న బీటీ జన్యువులు, బీటీ ప్రొటీన్ల ద్వారా మనుషులకు హాని జరగడానికి అవకాశాలు లేవు. ఏదేమైనా, ఈ అంశంపై అత్యాధునిక పద్ధతుల్లో లోతైన శాస్త్రీయ అధ్యయనాలు భారత్‌లో జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నది నా దృఢమైన అభిప్రాయం’’ అని వ్యాస రచయితకు ఇచ్చిన ఈ–మెయిల్ ఇంటర్వ్యూలో కేశవ్ క్రాంతి అభిప్రాయపడ్డారు. చెత్తబుట్టలో స్థాయీ సంఘం సిఫారసులు లక్షల టన్నుల్లో వినియోగంలో ఉన్న బీటీ పత్తి గింజల నూనె, చెక్క వంటి జన్యుమార్పిడి ఆహారోత్పత్తులపై శాస్త్రీయమైన భద్రతా పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ప్రజలకు తెలియజెప్పవలసిన గురుతర బాధ్యత జెనిటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ఉంది. బీటీ పత్తి సాగుపై నిర్ణయం తీసుకున్నప్పుడే నూనె, చెక్కల ప్రభావం గురించి కూడా నియంత్రణ సంస్థలు పట్టించుకొని ఉండాల్సింది. కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి పత్తి అక్రమంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ పత్తి గింజల నూనె, చెక్కతో మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం క్షుణ్ణంగా అధ్యయనం చేసి దశాబ్దం క్రితమే ఇచ్చిన సిఫారసులను సైతం వరుస కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా పెడచెవిన పెట్టడం వల్లనే ప్రజారోగ్యం పెనుప్రమాదంలో పడిందని గుర్తించాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో అయినా, బహుళజాతి సంస్థల ఒత్తిళ్లను పక్కన పెట్టి, పాలకులు దృష్టి సారించాల్సిన అతి ముఖ్యమైన అంశాలివి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీల హవా నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మొత్తం అమ్మకాల్లో విడినూనెల వాటా 70 శాతం ఉండేది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడీ వాటాను ప్యాక్డ్ విభాగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత బ్రాండ్లు క్రమంగా మార్కెట్‌ను చేజిక్కించుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నూనెను దిగ్గజ బ్రాండ్లు పోటీ ధరలో అందిస్తుండడంతో వీటి డిమాండ్ పెరిగిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఇప్పుడు దేశంలో ఒక్కో కస్టమర్ ఏటా సగటు వినియోగం 18 కిలోలకు చేరింది. 2000 సంవత్సరానికి ముందు ఇది కేవలం 10 కిలోలు మాత్రమే. ఇదీ నూనెల మార్కెట్.. దేశవ్యాప్తంగా 23.5 మిలియన్ టన్నుల వంట నూనెల వినియోగం జరుగుతోంది. ఇందులో దిగుమతులు 15 మిలియన్ టన్నులు. మిగిలినది దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. వినియోగం ఏటా 2.5–3 శాతం పెరుగుతోంది. పామ్ ఆయిల్ 9 మిలియన్ టన్నులు, సోయా 4.5, సన్‌ఫ్లవర్ 2.5, ఆవ నూనె 2.5, కాటన్ సీడ్ ఆయిల్ 1.2, రైస్ బ్రాన్ ఆయిల్ 1 మిలియన్ టన్నులు, మిగిలినది పల్లి నూనె, నువ్వుల నూనె వంటివి ఉంటాయి. ఇక దేశీయంగా 2018–19లో సోయా ఆయిల్‌సీడ్ 11 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆవాల ఉత్పత్తి గతేడాది 7 మిలియన్ టన్నులు కాగా, ఈ ఏడాది 8.5 మిలియన్ టన్నులు, రైస్ బ్రాన్ ఆయిల్ 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి కానుంది. దేశంలో సన్‌ఫ్లవర్ ఉత్పత్తి దాదాపు లేనట్టే. పల్లి నూనె పదేళ్ల క్రితం వినియోగం 1.2 మిలియన్ టన్నులు ఉంటే, ఇప్పుడు 200 టన్నులకు వచ్చి చేరింది. ధర పెరిగే అవకాశం లేదు.. వంట నూనెల ధర ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘అంతర్జాతీయంగా వంట నూనె గింజలు, నూనె ధర తగ్గింది. మరోవైపు డాలర్ విలువ పడిపోతోంది. దిగుమతులు చవక అయ్యాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. అందుకే నూనెల ధర పెరగదు. ఇక రైతులకు మద్దతు ధర దొరక్కపోతే నూనె గింజల ఉత్పత్తి నుంచి తప్పుకుంటారు. ఇదే జరిగితే వచ్చే 10 ఏళ్లలో దిగుమతులే 25 మిలియన్ టన్నులకు చేరుకోవడం ఖాయం. అందుకే ప్రభుత్వమే చొరవ తీసుకుని మంచి మద్దతు ధర నిర్ణయించాలి. దిగుమతి సుంకం పెంచాలి. ఇవన్నీ జరిగితే రైతులను ప్రోత్సహించినట్టే’ అని వివరించారు. ఫుడ్ ఇండస్ట్రీ 20 శాతం.. దేశీయంగా జరుగుతున్న మొత్తం నూనెల వినియోగంలో ఫుడ్ ఇండస్ట్రీ వాటా 20 శాతముంటుందని ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా వెల్లడించారు. నమ్కీన్, స్నాక్స్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఫుడ్ పరిశ్రమ కొంత కాలంగా కాటన్ సీడ్ ఆయిల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తోందన్నారు. పత్తి గింజల నూనె ధర తక్కువ కూడా. ఇతర వంటకాల్లోనూ వాడేందుకు ఈ నూనె అనువైనది అని వివరించారు. ఏటా 13 లక్షల టన్నుల కాటన్ సీడ్ ఆయిల్ భారత్‌లో ఉత్పత్తి అవుతోంది. భారత్‌లో కర్జూర ఉత్పత్తి.. దేశంలో నూనె గింజల ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. పంట వైశాల్యంలో ఎలాంటి మార్పు లేదు. ఉత్పాదకతే తగ్గుతోందని మహారాష్ట్ర అగ్రికల్చర్ కాస్ట్, ప్రైస్ కమిషన్ చైర్మన్ పాషా పటేల్ తెలిపారు. ‘దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దేశవ్యాప్తంగా వర్షాలు క్షీణించాయి. ప్రభుత్వమే చొరవ తీసుకుని పచ్చదనాన్ని పెంచాల్సిందే. మరో విషయమేమంటే తక్కువ నీటిని వినియోగించే బాంబూ, కర్జూర వంటి పంటల వైపు రైతులు మళ్లుతున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్‌లో కర్జూర పంట వేస్తున్నారు’ అని వివరించారు. -
వ్యాధులను వండుతున్నారు!
అందమైన ప్యాకింగ్.. ఆకట్టుకునే ప్రచారం.. ఇవే ఇప్పుడు వ్యాపార రహస్యాలు.ఆ వస్తువులోని నాణ్యత.. తయారీ ప్రాంతంలో పాటిస్తున్న ప్రమాణాలు ఇవేవీ కనిపించకపోవడంతో ప్రజలు బోల్తా పడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలో విజిలెన్స్ అధికారులుఓ ఆయిల్ ట్రేడర్ దుకాణంలో తనిఖీ నిర్వహించగా బొద్దింకలుకలగలిసి వంటనూనె గుట్టు రట్టయింది. రూ.10లక్షల విలువ చేసే సరుకును అధికారులు సీజ్ చేశారు. అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వంటనూనె తయారీదారుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో, బొద్దింకల అవశేషాలతో కూడిన నూనె తయారు చేసి, ప్రజలకు అంటగడుతున్నాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకెళితే... విజయకుమార్ అనే వ్యాపారి పాతూరులోని తిలక్‌రోడ్డులో వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండానే రైతుల నుంచి వేరుశనగ కొనుగోలు చేసి, స్వయంగా నూనె తయారు చేస్తున్నాడు. ఏళ్ల తరబడి యంత్రాలను శుభ్రం చేయకుండా అలానే వినియోగిస్తున్నాడు. అపరిశుభ్రతతో ఆ పరిసర ప్రాంతం కంపు కొడుతోంది. బొద్దింకలు కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. తయారు చేసిన వేరుశనగ నూనెలో బొద్దింకలు పడి మృతిచెందాయి. అయినా నిర్వాహకుడు వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. డబ్బు యావలో పడి ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించాడు. దుకాణం సీజ్ : వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ దుకాణంపై సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు హానికలిగించే రీతిలో ఆయిల్ తయారీ చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్ఐ రామకృష్ణయ్య గుర్తించారు. దీంతో దాదాపు రూ. 10లక్షలు విలువజేసే వేరుశనగనూనె, పామాయిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు దుకాణాన్ని సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రోత్సాహకాలు ఆగితే మూసివేతే...!
వంట నూనెల పరిశ్రమలో వింత పరిస్థితి వ్యాట్ మినహాయింపు కోసమే కొత్త ప్లాంట్లు పాతవాటికే మేకప్ వేసి కొత్తవిగా చూపిస్తున్న తీరు... కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో నిలదొక్కుకుంటున్న బడా ప్లాంట్లు పోటీ పడలేక చిన్న ప్లాంట్లు మూత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వటం రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. తద్వారా కొత్త పరిశ్రమలు వస్తాయి. కాకపోతే వంట నూనెల పరిశ్రమలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది. కొత్త పారిశ్రామిక విధానం వస్తే చాలు. పాత ప్లాంట్లు మూతపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి!!. ఎందుకంటే వ్యాట్ మినహాయింపు ఉన్నంత కాలం మాత్రమే కంపెనీలు మనగలుగుతున్నాయి. ఎపుడైతే ఈ ప్రయోజనం ఆగిపోతోందో అప్పటి నుంచి కంపెనీలకు కష్టాలు మొదలవుతున్నాయి. ప్రణాళిక ప్రకారం వ్యాపారాన్ని నిర్వహించే ఒకటిరెండు పెద్ద సంస్థలు మినహా మిగిలిన చిన్న కంపెనీలు ప్లాంట్లను మూసివేయక తప్పడంలేదు. ఎందుకంటే అటు పెద్ద ప్లాంట్లతో గానీ, ఇటు కొత్తగా ప్లాంటు పెట్టి వ్యాట్ ప్రయోజనాలు పొంది తక్కువ ధరకు నూనెలను విక్రయిస్తున్న కంపెనీలతో గానీ అవి పోటీ పడలేకపోతున్నాయి. ప్రోత్సాహమే అడ్డంకి... వంట నూనెలపై తెలుగు రాష్ట్రాల్లో 5 శాతం వ్యాట్ ఉంది. రూ.11 నుంచి 250 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టే మధ్య తరహా కంపెనీకి.. చెల్లించిన వ్యాట్‌లో ప్రభుత్వం 75 శాతాన్ని రీయింబర్స్ చేస్తోంది. విద్యుత్ చార్జీల్లోనూ రాయితీలున్నాయి. ప్లాంటులో ఉత్పత్తి మొదలైన నాటి నుంచి ఐదేళ్లపాటు వ్యాట్ ప్రయోజనం ఉంటుంది. నికర లాభం 1-2 శాతానికే పరిమితమైన వంట నూనెల రంగంలో ఈ ప్రోత్సాహం ఏ కంపెనీకైనా పెద్ద ప్రయోజనం కిందే లెక్క. దీంతో ఈ కంపెనీలు మార్కెట్లో పోటీ పడటానికి ఇతర కంపెనీల కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. అయితే అయిదేళ్లు పూర్తి చేసుకున్న కంపెనీలు మాత్రం ధర తగ్గించి విక్రయించలేకపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాయిలాపడ్డ కంపెనీల్లో ఎన్సీఎస్ ఇండ స్ట్రీస్, కేడియా అగ్రోటెక్, క్లీన్ సిటీ బయో ఫ్యూయెల్స్, బయో మ్యాక్స్, నేచురల్ బయో ప్యూయెల్స్, గుడ్హెల్త్ అగ్రోటెక్, నిఖిల్ రిఫైనరీస్తోపాటు మరో 10 కంపెనీలున్నాయి. తిరిగి కొత్త ప్లాంట్లతో.. కొత్త ప్రభుత్వం రాగానే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం సహజం. కొన్ని కంపెనీలకు ఈ అంశమే కలిసి వస్తోంది. పోటీలో నిలదొక్కుకోలేక ప్లాంట్లను మూసివేసిన ఈ కంపెనీలు... కొత్త ఎత్తుగడతో తిరిగి రంగప్రవేశం చేస్తున్నాయి. కొత్త ప్లాంటు పెడితే ప్రోత్సాహకాలు పొందవచ్చన్నది వీటి ఆలోచన. అనుకున్నదే తడవుగా పాత ప్లాంట్లను తుక్కు కింద విక్రయించినట్లు కాగితాల్లో చూపిస్తున్నాయి. అదే యాజమాన్యం కొత్త పేరుతో పాత ప్లాంటుకు సమీపంలోనే మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఈ ప్లాంటుకు కావాల్సిన సామగ్రిని పాత ప్లాంటు నుంచి తీసుకొస్తున్నాయి. బ్యాంకుల నుంచి యథావిధిగా రుణాలను తీసుకుంటున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లోని రిఫైనరీల వార్షిక సామర్థ్యం 43 లక్షల టన్నులు. ఇవి ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు నూనెలను సరఫరా చేస్తున్నప్పటికీ వినియోగం కంటే సామర్థ్యం రెండింతలుగా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం మిస్.. కొన్ని కంపెనీల తీరుతో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ఇలా చేస్తుండటం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) ఎండీ ప్రదీప్ చౌదరి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ‘‘అటు బ్యాంకుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయి. మూతపడ్డ కంపెనీలు నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోతున్నాయి. ఈ ఆస్తుల విలువ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000-4,000 కోట్లు ఉంటుంది’’ అని ఆయన తెలియజేశారు. డిమాండ్‌ను మించి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ రంగంలో ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని జెఫ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ‘2009-14 కాలంలో కొత్తగా ఏడు ప్లాంట్లు వచ్చాయి. కంపెనీని బట్టి ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలు 2017తో ముగుస్తాయి. ఇటీవలే రెండు రాష్ట్రాల్లోనూ నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారు. సమస్య పునరావృతం కాకుండా వంట నూనెల కంపెనీలకు ఇచ్చే ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి’ అని అన్నారాయన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలను కలిసి సమస్యను తెలియజేసేందుకు కృష్ణపట్నం ఎడిబుల్ ఆయిల్స్ రిఫైనర్స్ అసోసియేషన్ సన్నద్ధమవుతోంది కూడా.