గుండె ఆరోగ్యంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, సరిగ్గా పనిచేయడానికి తోడ్పడే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆహారంలో ఉపయోగించే వంట నూనెలు మన గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తుంటార. చాలా మందికి గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి నూనెలు తీసుకోవడం మంచిదనేది తెలియదు. అయితే బాలీవుడ్ నటి మాధరీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఐదు బెస్ట్ నూనెలు గురించి వెల్లడించారు. అవెంటో తెలుసుకుందామా..!
డాక్టర్ శ్రీరామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే బెస్ట్ నూనెల గురించి షేర్ చేసుకున్నారు. కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన ఆయన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు వంట నూనెల గురించి సవివరంగా తెలిపారు. ఆయన గుండె ఆరోగ్యానికి సిఫార్సు చేసిన ఐదు వంటనూనెలు ఏంటంటే..
రైస్ బ్రాన్ ఆయిల్
వేరుశెనగ నూనె
ఆవాల నూనె
ఆలివ్ నూనె
నువ్వుల నూనె
ఈ నూనెలలో ప్రతి ఒక్కదాని వినియోగం వల్ల పొందే ప్రయోజనాలెంటంటే..
రైస్ బ్రాన్ ఆయిల్
ఈ నూనెలో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరిచి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
వేరుశెనగ నూనె
దీని వల్ల గుండెకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ ఈ ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించి, గుండెను ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
ఆవాల నూనె
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఒమేగా -3 ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖ్యమైనవి. ఆవనూనెలోని విటమిన్ ఈ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి.
ఆలివ్ నూనె
ఇది గుండెకు దాని ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఆలివ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒలీక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయిలను పెంచి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో పాలీఫెనాల్స్, విటమిన్ ఈ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ రెండూ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆలివ్ నూనె మెడిటరేనియన్ డైట్‌లో ప్రధానంగా ఉపయోగిస్తార కూడా.
నువ్వుల నూనె
ఈ నూనెలో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సెసమోల్, సెసమిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి. నువ్వుల నూనెలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
(చదవండి: 45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment