
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వంట నూనెలను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విజిలెన్స్ దాడులు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.
పాత స్టాక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు పెడతామని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బ్రాండ్‌ల పేరుతో మోసం చేసిన 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. అక్రమాలపై 9440906254 వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని శంఖబ్రత బాగ్చి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment