Delhi Chief Minister Arvind Kejriwal
-
Arvind Kejriwal: రెండ్రోజుల్లో రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలవడం తెలిసిందే. ఆదివారం భార్య సునీతతో కలిసి ఆయన ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంంను ఎంపిక చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారంటే... నేరస్తుడినని భావిస్తే నాకు ఓటేయకండి ‘‘దేశ ప్రజలను, ఢిల్లీవాసులను అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడా? లేక నేరస్తుడా? ప్రజలే తీర్పు చెప్పాలి. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ప్రతి గల్లీకి, ప్రతి గడపకూ వెళ్తాను. నిజాయితీపరుడని అనుకుంటే నాకు ఓటేయండి. నేరస్తుడినని భావిస్తే వేయకండి. మీరు వేసే ప్రతి ఓటూ నా నిజాయతీకి సర్టిఫికెట్. ఆప్‌కు ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై, మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా.సీతలా నాకు అగి్నపరీక్ష ‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగి్నపరీక్ష ఎదుర్కోవాల్సి వచి్చంది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగి్నపరీక్షకు సిద్ధంగా ఉన్నాను. కేజ్రీవాల్ చోర్, అవినీతిపరుడు, భరతమాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు. నేను ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అనే ఆటాడేందుకు రాలేదు. దేశానికి మంచి చేద్దామని వచ్చా. ఆప్‌ను విచి్ఛన్నం చేసేందుకే నన్ను జైలుకు పంపించారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం, సీబీఐ, ఈడీలతో భయపెట్టడం, తప్పుడు కేసులు, జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.. ఇలా ఒక ఫార్మూలా రూపొందించుకున్నారు. నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆప్ విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు. కానీ మా పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆప్‌కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జైలులో ఉండగా పీఎం పదవికి రాజీనామా చేయలేదు’’.భార్యను సీఎం చేయడానికే డ్రామాలు: బీజేపీ భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెర తీశారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన్ని ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఆప్‌లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఆప్ కొత్త సీఎం ఎవరు? కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిశీ, గోపాల్ రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో దళితులు, ముస్లింల ప్రాబల్యంగా అధికం గనుక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని పరిశీలకులు అంటున్నారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని కేజ్రీవాల్‌కు షరతు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు ఆరు నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైనా సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనను తోసిపుచి్చంది. అన్ని కేసులకూ ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.కేజ్రీవాల్‌కు షరతులివే...మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు (ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీంధర్మాసనం ఈ రెండు షరతులనూ విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఆ సందర్భంగా పేర్కొంది. దాంతో అవి అమల్లోనే ఉండనున్నాయి) ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి. విచారణ త్వరగా పూర్తయేందుకు సహకరించాలి.పంజరంలో చిలుక కావొద్దు సీబీఐకి జస్టిస్ భూయాన్ హితవు ఈడీ కేసులో బెయిల్ షరతులను తప్పుబట్టిన న్యాయమూర్తి విడిగా 33 పేజీల తీర్పు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచి్చనా పలు ఇతర అంశాలపై జస్టిస్ భూయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంలో తనకెలాంటి అసంబద్ధతా కన్పించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా జస్టిస్ భూయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తూ విడిగా 33 పేజీల తీర్పు రాశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా ఏమన్నారంటే... → ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సీబీఐకి, ఈడీ కేసులో బెయిల్ వచి్చన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచి్చంది? → బెయిల్‌ను అడ్డుకోవడమే దీని వెనక ఉద్దేశంగా కని్పస్తోంది. → ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనుక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు. → సహాయనిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కుంటుంది. → బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు కచ్చితంగా చట్టవిరుద్ధమే.→ ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడటం అక్రమం. → సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెత సీబీఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కని్పంచడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతోందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి. → సీబీఐని పంజరంలో చిలుకగా ఇదే న్యాయస్థానం ఇటీవలే ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలుకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే → సీఎం కార్యాలయంలోకి వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు!నా పోరు ఆగదు జైలు నా స్థైర్యాన్ని పెంచింది: కేజ్రీవాల్ ‘‘జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని వెయ్యి రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్కా దేశసేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వర్షంలోనే చండ్గీరాం అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘జైలు తాళాలు విరిగి పడ్డా యి. కేజ్రీవాల్ విడుదలయ్యారు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనం పై నుంచి వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈసీని బలహీనపరిచేందుకు, ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దన్నుగా నిలిచింది. నేను సత్యమార్గంలో నడవడమే అందుకు కారణం’’ అన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద, ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు. -
జైల్లోంచి పనిచేయకుండా కేజ్రీవాల్‌పై నిషేధం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది. ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి, సీనియర్ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
INDIA bloc: విపక్షాల గొంతు నొక్కుతోంది
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది. ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. -
కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులోనే చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జూన్ 3–జూలై 7వ తేదీల మధ్య కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు 26 రెట్లు పడిపోయినట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు కేజ్రీవాల్ జీవితంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చని అధికారిక నివేదికలే చెబుతున్నాయన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై బీజేపీ, ఎల్జీ పదే పదే వెలువరిస్తున్న తప్పుడు నివేదికలు, చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయన్నారు. ‘కేజ్రీవాల్ పూరీలు, స్వీట్లు తదితరాలను అతిగా తింటున్నారని, అవసరం లేకున్నా ఇన్సులిన్ అడుగుతున్నారని వీరే గతంలో ఆరోపించారు. కోర్టు జోక్యంతో ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు జరిపి ఆయనకు ఇన్సులిన్ ఇచ్చారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ వైద్యులు సూచించిన మోతాదు కంటే తక్కువగా తింటున్నారని, అందుకే షుగర్ లెవెల్స్ పడిపోయాయని అంటున్నారు’అని సంజయ్ సింగ్ వివరించారు. దీని వెనుక కేజ్రీవాల్ ప్రాణాలు తీసేలా భారీ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ సెంట్రల్ జైలులో జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు తొలుత ఆయనను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో అవినీతి వ్యవహారాలపై విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజ్ఞాపన సమరి్పంచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనను కోర్టుకు తెలియజేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని, తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈ కేసుతో సంబంధం లేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్‌కు సిసోడియాను బాధ్యుడిని చేస్తూ తాను సీబీఐకి స్టేట్మెంట్ ఇచి్చనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిసోడియాకు గానీ, ఇతరులను గానీ వ్యతిరేకంగా తాను సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. అరెస్టు ఇప్పుడే ఎందుకంటే.. తాము నిజాలు మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి ఉందని తమ విజ్ఞాపనలో సీబీఐ పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఇప్పుడే అరెస్టు చేయాలని ఎందుకు భావిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వేచి చూశామని, ఎన్నికలు ముగియడంతో అరెస్టు చేసి, విచారణ కొనసాగించాలని నిర్ణయించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సిఫార్సు చేసినట్లు కేజ్రీవాల్ సేŠట్‌ట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అనంతరం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి, మూడు రోజులపాటు కస్టడీలో ఉంచి విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అమితాబ్ రావత్ అనుమతి ఇచ్చారు. బయటకు రాకుండా కుట్రలు: సునీతా తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా మొత్తం వ్యవస్థ కుట్రలు సాగిస్తోందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో చట్టం అమల్లో లేదని, కేవలం నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనూ సింఘ్వీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. -
Delhi liquor scam: జైల్లోనే కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సు«దీర్‌కుమార్ జైన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్‌ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. -
Delhi Court: కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు విధించింది. అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్‌కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు. ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్‌గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది. ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈడీది అంతులేని దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్‌పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్‌వర్డ్‌ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు. ‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్‌కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్‌కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం.. జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం. ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు. అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు. ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్. ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మే 10: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం. మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్. జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ. జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు. -
Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు. నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. -
బిభవ్ కుమార్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, కేజ్రీ వాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. శనివారం కేజ్రీవాల్ ఇంటికి బిభవ్ వచ్చాడని తెల్సుకుని ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్లారు. బిభవ్‌ను ప్రశ్నించే నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్ట్‌చేసినట్లు తర్వాత ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా బిభవ్ విచక్షణరహితంగా, నెలసరి బాధ ఉందని చెప్పినా వినకుండా చెంపలు చెళ్లుమనిపించి, ఛాతి, పొట్ట, పొత్తికడుపుపై పలుమార్లు తన్నాడని బిభవ్‌పై మలివాల్ ఫిర్యాదు చేయడం తెల్సిందే. శుక్రవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్చేయడం గమనార్హం. కోర్టు ఎదుట బిభవ్‌ను హాజరుపరిచి దర్యాప్తు నిమిత్తం తమ కస్టడీకి కోరతామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఆరోజు ఘటనాస్థలిలో ఉన్న 10 మంది నుంచి స్టేట్మెంట్లు నమోదుచేశామని వెల్లడించారు. బిభవ్ ఫిర్యాదును పట్టించుకోండి: అతిశిఢిల్లీ పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావిస్తే మలివాల్‌పై బిభవ్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోద ుచేయాలని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిశి శనివారం డిమాండ్‌చేశారు. పత్రకాసమావేశంలో అతిశి సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఏసీబీ నమోదుచేసిన ఒక అక్రమ నియామకాల కేసులో మలివాల్ ఇరుక్కున్నారు. అరెస్ట్ నుంచి తప్పించాలంటే కేజ్రీవాల్‌ను కేసులో ఇరికించాలని ఆమెను బీజేపీ బ్లాక్మెయిల్ చేసింది. బీజేపీ చేసిన ఈ కుట్రలో మలివాల్ ఒక పావు మాత్రమే. అపాయింట్మెంట్ లేకుండా సీఎం ఇంటికి ఆమె ఎందుకొచ్చినట్లు? ఒకవేళ సీఎంను కలిసి ఉంటే వాళ్ల ప్లాన్ ప్రకారం బిభవ్‌తో గొడవ, అరెస్ట్ జరిగేవి కాదు. బీజేపీకి ఒక విధానం ఉంది. మొదట కేసులు పెడతారు. తర్వాత బెదిరించి వినకపోతే జైల్లో పెడతారు. సీఎం ఆఫీస్‌లో డ్యూటీలో ఉన్న భద్రతా అధికారిపై మలివాల్ దుర్భాషలాడి గొడవ పడ్డారు. అనుమతిలేకుండా లోపలికి వచ్చారు. ఈ ఉల్లంఘన అంశాలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేరు? ఎఫ్ఐఆర్ ప్రతిని పోలీసులు కోర్టుకు ఇవ్వరట. నిందితుడి లాయర్‌కు ఇవ్వరట. కానీ రెండ్రోజులుగా మీడియాలో అది చక్కర్లు కొడుతోంది. ఈ కుట్ర ఎంతపెద్ద స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతోంది ’’ అని మోదీ సర్కార్‌పై అతిశి ఆరోపణలు గుప్పించారు. మరో వీడియో విడుదలఘటన జరిగిన రోజునాటి సీసీటీవీ ఫుటేజీ మరొకటి బయటికొచ్చింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది మలివాల్‌ను చేయిపట్టుకుని ఇంటి బయటకు బలవంతంగా తీసుకొచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ చేతిని మలివాల్ విదిలించుకుని దూరం జరిగి, అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో రికార్డయింది. అయితే ‘‘మలివాల్ ఆరోపించినట్లు ఆమె నడవలేకపోతున్నట్లు వీడియోలో లేదు. మామూలుగానే నడుస్తున్నారు. మహిళా పోలీస్ అధికారిని నెట్టిపడేశారు. షర్ట్ చిరిగిందని, బటన్స్ ఊడిపోయాయని చెప్పిందంతా అబద్ధమని ఈ వీడియోలో తేలిపోయింది’’ అని అతిశి ఆరోపించా. అయితే పూర్తి నిడివి ఫుటేజీ విడుదలచేయకుండా కత్తిరించి అతికించిన ఎడిటెడ్ వీడియోను విడుదలచేసి ఆప్ మలివాల్ వ్యక్తిత్వహననానికి పాల్పడుతోందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ తీవ్రంగా తప్పుబట్టారు. బిభవ్ అరెస్ట్‌తో ఆప్ చెత్త చరిత్ర పేజీలు ఇప్పుడు బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మలివాల్‌కు చేసిన వైద్యపరీక్షల వివరాలు బహిర్గతమయ్యాయి. మెడికో లీగల్ సర్టిఫికెట్ ప్రకారం మలివాల్ ఎడమ కాలు బొటనవేలు సమీపంలో, కుడి చెంపపై గాయాలున్నాయి. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
న్యూఢిల్లీ: బెయిల్‌పై బయటికొచ్చాక ఆప్ ఎన్నికల ప్రచారపర్వంలో ఎన్నికల వేడిని రాజేసిన కేజ్రీవాల్ శనివారం ప్రధాని మోదీకి కొత్త సవాల్ విసిరారు. తన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీజీ మీరు కొత్తరకం జైలు ఆట ఆడుతున్నారని తెలుసు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ ఇలా ఆప్ నేతలను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపిస్తున్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు నేను, నాతోపాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వస్తాం. ఎంత మందిని అయితే మీరు జైలులో పడేద్దామనుకుంటున్నారో అంత మందిని ఒకేసారి అరెస్ట్‌చేసి జైల్లో వేసేయండి’’ అని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ‘ సంజయ్ సింగ్‌ను చెరసాలలో వేశారు. ఈరోజు బిభవ్ కుమార్‌ను అరెస్ట్‌చేశారు. కంటికి శస్త్రచికిత్స తర్వాత మా ఎంపీ రాఘవ్ చద్దా లండన్ నుంచి తిరిగొచ్చారు. ఆయనను కూడా జైలుకు పంపుతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్లనూ కారాగారంలో వేస్తామని గతంలో బీజేపీ వెల్లడించింది’ అని ‘ఎక్స్’లో కేజ్రీవాల్ ఒక వీడియోను షేర్చేశారు. డ్రామాలు ఆపండి: బీజేపీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ‘‘ ఈ డ్రామాలు ఆపండి. మేం చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాం. మీ సొంతిట్లో మీ పార్టీ ఎంపీని చితకబాదితే ఆరు రోజులైనా మీరు మౌనం వీడట్లేరు. మహిళా ఎంపీపై దాడి ఉదంతంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంపై మీరెందుకు స్పందించట్లేరు? చర్యలెందుకు తీసుకోవట్లేరు?’’ అని సచ్దేవ్ నిలదీశారు. -
Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
అమృత్సర్: మోదీ సర్కార్ హయాంలో దేశపరిస్థితులు రష్యాను తలపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘‘ భారత్‌లో కొనసాగుతున్న ఈ నియంతృత్వ పాలనకు ఇంక ఎంతమాత్రం ఆమోదించేదిలేదు. గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇలా పనిగట్టుకుని విపక్షనేతలను జైల్లో పడేయడం ఎన్నడూ చూడలేదు. రష్యాలో అయితే కీలక విపక్షనేతలందర్నీ జైలుకు పంపేసి, కొందర్ని చంపేసి పుతిన్ దేశాధ్యక్ష ఎన్నికలు జరిపి 87 శాతం ఓట్లు గుప్పిట బిగించారు. ఎన్నికల్లో విపక్షాలు లేకపోవడంతో ఓట్లు పొందడానికి నువ్వు ఒక్కడివే మిగులుతావు’’ అని మోదీనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘ వాళ్లు(బీజేపీ) నన్ను, ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైల్లో పడేశారు. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మంత్రులను జైలుకు పంపారు. విపక్ష నేతలను చెరసాలలో వేశాక ఒకే పార్టీ, ఒక్కడే అగ్రనేత సాధ్యం. అప్పుడు ప్రజాస్వామ్యం అసాధ్యం. ఇది జరక్కుండా మనం ఆపాలి’’ అని అన్నారు. ‘ నేను జైలు గదిలో ఉన్నపుడు గదిలో రెండు సీసీటీవీ కెమెరాలతో 13 మంది అధికారులు అనుక్షణం గమనించేవారు. ఒక ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్లేది. అక్కడ రెండు టీవీల్లో గమనించేవారు. నన్ను ఎలాగైనా అణచేస్తామని విశ్వప్రయత్నం చేశారు. అరెస్ట్‌తో అంతా అయిపో తుందని, పార్టీ ముక్కలు చెక్కలై ప్రభుత్వం కూలు తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆప్ ఒక కుటుంబం. కుటుంబానికి ఏదైనా కష్టమొస్తే కుటుంబసభ్యులంతా ఏకమై పోరాడతారు. నా అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కేజ్రీవాల్‌గా మారి పోరాడారు’’ అని అన్నారు.నన్ను నిరుత్సాహపరచకండి‘‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జైలులో ఎవరినైనా కలవడానికి వస్తే గదిలో మాట్లాడే ఏర్పాటుచేయాలని జైలు నియమావళిలో ఉంది. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వచ్చినపుడు ఒక గదిలో జైలు సూపరింటెండెంట్ భేటీ ఏర్పాట్లుచేయలేదు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్తానాలను గెల్చుకునేలా ఆప్ నేతలు కష్టపడాలి. జూన్ రెండో తేదీన జైలుకెళ్తా. జూన్ 4 నాటి ఫలితాలను అక్కడి టీవీలో చూస్తా. టీవీలో ‘పంజాబ్‌లో అన్ని సీట్లు ఆప్ గెలిచింది’ అనే వార్త కోసం ఎదురుచూస్తుంటా. నన్ను నిరుత్సాహ పరచకండి’’ అని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్‌మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్ హిట్‌మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
Delhi Liquor Scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్షీట్లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది. 38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్చేస్తున్నాం. -
మలివాల్ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ పీఎస్ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీచేసింది. కేజ్రీవాల్ మౌనమేల?: బీజేపీ సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి ‘ఎక్స్’లో హిందీలో పోస్ట్‌చేశారు. -
Supreme Court: ఎలాంటి మినహాయింపులు లేవు!
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు బెయిల్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టంచేసింది. అయితే తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరిని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు బెయిల్ తర్వాత ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చేస్తున్న ప్రసంగాలను తప్పుబడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనలను, ప్రసంగాలను సమరి్థస్తూ కేజ్రీవాల్ తరఫు లాయర్లు చేసి వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. ‘‘ ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయంగా తోచిందో దానిని ఉత్తర్వుల రూపంలో మేం వెల్లడించాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ అభ్యర్థన తిరస్కరణ ‘‘ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే జూన్ రెండో తేదీన తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోండి’’ అని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీనిపై కోర్టు..‘ అది అంతా ఆయన ఊహ మాత్రమే. ఈ విషయంలో మేం ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’’ అని ఈడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ‘‘తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరికి అడ్డుచెప్పం. తీర్పుపై విమర్శలను మేం స్వాగతిస్తున్నాం. ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏ రోజున లొంగిపోవాలనేది మా ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్. ఈ ఉత్తర్వు ద్వారానే చట్టం అమలవుతుంది’’ అని కోర్టు తెలిపింది. ‘‘ సొంత ఊహలతో బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నారు. ఆయన ఏం చేద్దామనుకుంటున్నారు? వ్యవస్థకు చెంపపెట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. ‘‘ ఆయన జూన్ రెండో తేదీన తప్పకుండా లొంగిపోవాల్సిందే. అయితే ఈ కేసు గురించి ఆయన మాట్లాడొచ్చు అనిగానీ మాట్లాడకూడదు అని గానీ మేం బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. అమిత్ షా సంగతేంటి?: కేజ్రీవాల్ లాయర్ ‘‘సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక ట్రీట్మెంట్ జరిగినట్లు అనిపిస్తోంది. ఈయన బెయిల్ ఇతరుల సాధారణ బెయిల్ మాదిరి కనిపించట్లేదు. నేనే కాదు దేశంలో చాలా మంది ఇలాగే భావిస్తున్నారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న మాటలను కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోర్టుకు గుర్తు చేశారు. ఆయన సంగతేంటి?అని ప్రశ్నించారు. ఆ విషయం జోలికి తాము వెళ్లదల్చుకోలేదని ధర్మాసనం తెలిపింది. ‘‘ ఆప్‌కు ఓటేయకపోతే జైలుకు వెళ్లక తప్పదేమో అని కేజ్రీవాల్ అనలేదు. కావాలంటే ఆమేరకు కోర్టులో అఫిడవిట్ సైతం సమరి్పస్తాం’’ అని సింఘ్వీ తెలిపారు. మద్యం కేసులో కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ వేస్తాం: ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ దాఖలుచేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సందర్భంగా కోర్టుకు ఈడీ ఈ విషయం తెలిపింది. ఈడీ కేసులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చుతామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు సైతం ఈడీ తెలిపింది. అమిత్ షా వ్యాఖ్యలు అభ్యంతరకరం: కపిల్ సిబల్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో స్పెషల్ ట్రీట్మెంట్ జరిగి ఉండొచ్చని అమిత్ షా మాట్లాడటం చాలా అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీల ఉద్దేశాన్నే ప్రశ్నిస్తున్నారు. జనం ఇలా అనుకుంటున్నారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. జనం మాటను మీరు(అమిత్) నమ్మకపోతే ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం ఏమొచి్చంది? జనం మాటను మీరు నమ్మితే మీ అభిప్రాయంగానే ఇంటర్వ్యూలో చెప్పాలిగానీ జనాన్ని ఎందుకు మధ్యలో లాగుతారు?’’ అని నిలదీశారు. -
రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అనే విషయం వదిలేసి రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టిపెట్టాలని, అది మీ బాధ్యత అని ఓటర్లకు ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్ హితవు పలికారు. బుధవారం చాంద్నీ చౌక్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార రోడ్‌షోలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ హరియాణా, ఉత్తరప్రదేశ్.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాకబు చేశా. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ గెలవబోయే సీట్లు బాగా తగ్గిపోతున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం పని మొదలుపెడతాం. దీంతో నియంతృత్వం అంతమవుతుంది. నేను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అన్న ఆలోచనలు పక్కనపడేయండి. రాజ్యాంగ పరిరక్షణే అత్యవశ్యకం. అది మీ బాధ్యత’’ అని ఓటర్లకు హితవు పలికారు. -
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. హామీలు ఇవే...1. పేదలకు ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 2. నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం. 3. ఉచితంగా చికిత్స ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. 5. అగి్నవీర్ యోజన నిలిపివేత అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం. 6. పంటలకు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం. 7. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం. 8. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.9. అవినీతి నుంచి విముక్తి నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్‌ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం. 10. స్వేచ్ఛా వాణిజ్యం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. బీజేపీ కుట్ర విఫలం తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి. 2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
Delhi High Court : జేమ్స్‌బాండ్ సీక్వెల్సా?
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పదేపదే పిటిషన్లు దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ వేసిన ఈ తరహా పిటిషన్‌పై ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘దీనిపై ఢిల్లీ లెఫ్ట్గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టం చేసినా పదేపదే అవే పిటిషన్లు వేస్తున్నారు. ఇవేమీ జేమ్స్‌బాండ్ సినిమా సీక్వెల్స్ కావు. వ్యవస్థను వెక్కిరించేలా పిటిషన్లు వేస్తే ఊరుకోం. మీకు రూ.50,000 జరిమానా వేస్తాం’’ అని సందీప్‌ను హెచ్చరించింది. ఆయన తరఫున లాయర్ వాదించబోయినా, ‘‘రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనుకుంటే వీధి చివరికెళ్లి ఇచి్చ రండి. మీ క్లయింట్ నేత కాబట్టి రాజకీయాలు చేస్తారు. మేం రాజకీయాల్లో మునగదల్చుకోలేదు’’ అని స్పష్టం చేసింది. -
Delhi liquor scam: అమెరికా జోక్యంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది దేశ అంతర్గత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని స్పష్టంచేసింది. బుధవారం ఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలియజేసింది. భారత్‌లో అమెరికా మహిళా దౌత్యవేత్త, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీచేసింది. దీంతో బుధవారం ఆమె ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. విదేశాంగ శాఖ అధికారులతో దాదాపు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా, వేగవంతంగా, చట్టపరంగా న్యాయం పొందే అర్హత సీఎం కేజ్రీవాల్‌కు ఉంది’ అని మంగళవారం అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత న్యాయప్రక్రియపై అమెరికా వ్యాఖ్యలను తప్పుబడుతూ భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దౌత్య సంబంధాలకు సంబంధించి దేశాలు తోటి దేశాల సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇవ్వాలి. తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఇదే బాధ్యతతో మెలగాలి. బాధ్యత విస్మరిస్తే బాగుండదు. భారత్‌లో న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది. సత్వర న్యాయమే దాని అంతిమ లక్ష్యం. దానిపై ఇతరుల అభిప్రాయాలు అవాంఛనీయం’’ అని ఆ ప్రకటనలో భారత్ తన అసంతృప్తిని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై వ్యాఖ్యలు చేసిన జర్మనీ దౌత్యవేత్త, డెప్యూటీ చీఫ్ మిషన్‌కు ఇటీవల భారత్ సమన్లు జారీచేసిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనే జరగడం గమనార్హం. -
Sunita Kejriwal: కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు. క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్ బ్లడ్‌షుగర్ లెవెల్ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి. హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన అరెస్టులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తనను ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 2వ తేదీలోగా స్పందించాలని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి సూచించారు. తదపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. -
రాత్రంతా లాకప్‌లో..
న్యూఢిల్లీ: ఆప్ సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో తొలి రాత్రి భారంగా గడిచింది. లాకప్ రూములో ఉంచి మంచం లేకుండా పరుపు, దుప్పటి మాత్రం ఇచ్చారు. ఏసీ సదుపాయం కల్పించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో గురువారం సాయంత్రం నుంచి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గంటల తరబడి ప్రశ్నించిన ఈడీ అధికారులు, రాత్రి 11 గంటల ప్రాంతంలో అరెస్టు చేయడం తెలిసిందే. రాత్రి భోజనం అనంతరం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కేజ్రీని లాకప్ గదికి తరలించారు. అక్కడ ప్రత్యేక సదుపాయాలేవీ కలి్పంచలేదు. కేజ్రీవాల్ పెద్దగా నిద్ర పోకుండా భారంగానే గడిపినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం చాయ్, అల్పాహారం అందించారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. కాసేపటికి కాఫీ ఇచ్చారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు. నిర్బంధంలో సీఎం కుటుంబం: ఆప్ మంత్రుల ధ్వజం కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు ఆయన నివాసంలోనికి పోలీసులు అనుమతించడం లేదంటూ ఆప్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ‘‘సీఎం కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రిని, అరెస్ట్‌తో కుంగిపోయిన కుటుంబాన్ని ఓదార్చనివ్వరా? ఇందుకు ఏ చట్టం అనుమతినిచ్చింది? హౌజ్ అరెస్ట్‌ను ఆపేయండి’’ అంటూ నినదించారు. అధికారం కోసమే అరెస్టు: కేజ్రీవాల్ భార్య తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ఢిల్లీ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కేజ్రీవాల్ భార్య సునీత మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతోనే అరెస్టు చేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశ్నించేవారిని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. -
Delhi excise policy case: కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం విధానం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించనందున ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ కోర్టులో రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదటి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ శనివారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రెండో ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు పత్రాలను కేజ్రీవాల్‌కు అందజేయాలని ఈడీని ఆదేశించింది. -
బీజేపీకి పెద్ద సవాల్‌గా ఎదిగాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీకి రాజకీయాల్లో అతిపెద్ద సవాల్‌గా, కొరకరాని కొయ్యలా తయారయ్యాం కాబట్టే ఆప్‌పై బీజేపీ అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే గెలుపు కావచ్చు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దేశానికి బీజేపీ నుంచి విముక్తి కలి్పస్తాం. ఆ బాధ్యత ఆప్ తన భుజస్కంధాలపై వేసుకుంది. సభలో ఆప్కే మెజారిటీ ఉందనేది స్పష్టం. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ వైపు లాక్కుని, ఆప్ సర్కార్‌ను కూల్చేద్దామని బీజేపీ కుట్ర పన్నింది. అందుకే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది’’ అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. తర్వాత విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (55)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చెటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021–22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటలపాటు ప్రశ్నించింది. మండిపడ్డ ఆప్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్ మండిపడింది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులో తమ అధినేతను ఎలాగైనా ఇరికించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోందని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి చాలినన్ని రుజువులున్నాయని సుప్రీం బెయిల్ నిరాకరణతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. కనుక నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఎలాంటి రుజువులూ లేవని కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలంతా ఇప్పటిదాకా చెప్తూ వచి్చందంతా పచ్చి అబద్ధమని రుజువైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ అన్నారు. ఆది నుంచీ వివాదాలే ఢిల్లీ మద్యం విధానాన్ని 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మద్యం లైసెన్సుదారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్ సర్కారు లబ్ధి చేకూర్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. మద్యం విధానం తప్పుల తడక అని, ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు కనీసం భారీ నష్టం జరిగిందని, ఆప్ నేతలు తదితరులు లైసెన్సుదారుల నుంచి పలు మార్గాల్లో లబ్ధి పొందారని సీఎస్ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్ సర్కారు రద్దు చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. -
‘ఇండియా’ కూటమిలోనే ఉంటాం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి తాము బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ తేలి్చచెప్పారు. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉంటామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యరి్థగా మీ పేరును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించగా... తామే ప్రధానమంత్రి అని దేశంలోని 140 మంది భారతీయులు భావించేలా ఒక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ బదులిచ్చారు. కేవలం ఒక వ్యక్తిని కాదని, పౌరులందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు. -
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అధికార నివాసం నిర్మాణంలో అవకతవకలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ కోసం చేపట్టిన నూతన అధికారిక నివాసం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని అధికారులపై ఈ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే పూర్తిస్థాయి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీఎం కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని సీబీఐ సోమవారం ఢిల్లీ ప్రజా పనుల విభాగానికి లేఖ రాసింది. కేజ్రివాల్ కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.43.70 కోట్లు కేటాయించింది. కానీ, రూ.44.78 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. 2020 సెప్టెంబర్ 9 నుంచి 2022 జూన్ దాకా ఈ సొమ్ము ఖర్చు చేశారు. -
రోజంతా కేజ్రీవాల్ ధ్యానం
న్యూఢిల్లీ: దేశాభ్యున్నతి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రోజంతా ధ్యానం, పూజలు, ప్రార్థనలు చేశారు. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగినట్టు ఆప్ ట్వీట్ చేసింది. అంతకుముందు ఉదయం ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధిని కేజ్రీవాల్ సందర్శించి నివాళులర్పించారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థనలు చేస్తానని కేజ్రీవాల్ మంగళవారమే పేర్కొన్నారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని జైళ్లపాలు చేస్తున్నారని, దోచుకుంటున్న వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. -
కేజ్రీవాల్‌కు సంకెళ్లే
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కీలక సూత్రధారి అని బీజేపీ ఆరోపించింది. అతి త్వరలో ఆయనకు సంకెళ్లు తప్పవని జోస్యం చెప్పింది. కరోనా ఉధృతి సమయంలో ప్రజలంతా సాయం కోసం అల్లాడిపోతుంటే కేజ్రీవాల్ మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం ఆరోపించారు. ఆయన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ‘‘ఎక్సైజ్ విధానం కుంభకోణంలో మూలాలు కేజ్రీవాల్ ఇంటికే దారి తీస్తున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందే’’ అన్నారు. మరోవైపు తనపై సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసిందని ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్ సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నా సీబీఐ ఇలా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మోదీజీ! నేనెక్కడున్నానో తెలియడం లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా’’ అటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తి ఒక్క రూపాయి కూడా సీబీఐకి దొరకలేదన్నారు. సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఇప్పటిదాకా నిందితులెవరికీ లుకౌట్ నోటీసులివ్వలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు అనుమతి లేకుండా దేశం దాటలేరు. కాబట్టి వారికి ఆ నోటీసులు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ కేసులో 8 మంది ప్రైవేటు వ్యక్తులకు లుకౌట్ నోటీసులిచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మాత్రం, కుంభకోణాలకు పాల్పడితే లుకౌట్ నోటీసులొస్తాయి తప్ప గ్రీటింగ్ కార్డులు కాదనడం విశేషం. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కరడుగట్టిన అవినీతిపరులని ఆరోపించారు. సిసోడియా తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక మోదీ వర్సెస్ కేజ్రీ: సిసోడియా కేజ్రీవాల్ ప్రధాని అవుతారని సిసోడియా జోస్యం చెప్పారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు అవకాశమిచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌గా జరగడం ఖాయం’’ అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం రోజూ ఉదయమే సీబీఐ–ఈడీ అంటూ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. మరిన్ని హైదరాబాద్ లింకులు? ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన పలు హోల్‌సేల్, రిటైల్ మద్యం వర్తకుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మద్యం లైసెన్సులను దక్కించుకున్న పలువురు వ్యక్తులు, కంపెనీలకు హైదరాబాద్ మూలాలున్నాయి. ఇక్కడి అడ్రస్లతోనే వారు టెండర్లు దాఖలు చేశారు. ఈ పాలసీకి పాపులారిటీ పెంచేందుకు 50 మంది దాకా స్టాండప్ కమేడియన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లు తదితరులను పనిముట్లుగా వాడుకున్నట్టు తేలింది. వీరి విదేశీ యాత్రలు, విదేశాల నుంచి అందిన నిధులపై విచారణ సాగుతోంది’’ అని వివరించారు. -
కశ్మీర్‌పై రాజకీయాలు వద్దు
న్యూఢిల్లి: జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల దాడుల వల్ల కశ్మీరీ పండిట్లు బలవంతంగా వలస వెళ్లాల్సి వస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ చెప్పారు. పండిట్లు కశ్మీర్ లోయను వదిలి, బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారని గుర్తుచేశారు. ఓ వర్గంపై దాడులను, టార్గెట్ కిల్లింగ్స్‌ను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆప్ ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘జన ఆక్రోశ్ ర్యాలీ’లో కేజ్రివాల్ మాట్లాడారు. పండిట్ల దుస్థితిని చూస్తే అధికార బీజేపీకి నీచ రాజకీయాలు చేయడం తప్ప పరిస్థితిని చక్కదిద్దే సత్తా లేదని తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఇండియా గనుక దృఢమైన నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ అనే దేశం మిగలదన్నారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లో పండిట్లను, ముస్లిం భద్రతా సిబ్బందిని ఉగ్రవాదులు హత్య చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కొన్ని సినిమాల ప్రమోషన్లో బిజీ ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. -
13 పాయింట్ల ఎజెండాతో గోవా అభివృద్ధి
-
‘ఆప్’ జాతీయ కన్వీనర్‌గా మూడోసారి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)జాతీయ కన్వీనర్‌గా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహక సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు. కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ‘ఆప్’ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా, జాతీయ కోశాధికారిగా ఎన్.డి.గుప్తా ఎన్నికయ్యారు. ఇక ఐదేళ్ల పదవీ కాలానికి ఆఫీస్ బేరర్లను కూడా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌తో సహా 34 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్ పేరును ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల అమలు కోసం కేజ్రీవాల్ అలుపెరుగని కృషి సాగిస్తున్నారని, జాతీయ కన్వీనర్‌గా ఆయనను వరుసగా మూడోసారి ఎన్నుకోవడం సముచితమైన నిర్ణయమని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో మరోసారి నిర్వహించనున్న జాతీయ కార్యనిర్వాహక భేటీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు పేర్కొంది. -
ఢిల్లీలో కరోనాకు కాలుష్యం తోడు
న్యూడిల్లీ: ఢిల్లీ కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. కాలుష్యం కారణంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకి 7 వేలకు పైగా కేసులు నమోదవుతుంటే, గత 24 గంటల్లో 104 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత అయిదు నెలల కాలంలో ఢిల్లీని కరోనా ఈ స్థాయిలో వణికించడం ఇదే. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోయి కేసులు కూడా పెరుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు నుంచి 10 రోజుల్లో కరోనా నియంత్రణలోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ‘‘గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాటిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మరో వారం రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది’’ అని కే్రజ్రీవాల్ చెప్పారు. వాయు కాలుష్యం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని, పంట వ్యర్థాల దహనం వచ్చే ఏడాది నాటికి ఉండకూడదని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 44 వేల కొత్త కరోనా కేసులు దేశంలో గత 24 గంటల్లో 44,879 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,28,795కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 547 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,28,668కు చేరుకుందని తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 81,15,580కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.97 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,84,547గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 5.55 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.47గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 122 మంది మరణిం చారు. ఈ నెల 12 వరకూ 12,31,01,739 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 11,39,230 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. -
లాక్‌డౌన్‌ని ఎత్తివేయలేం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రానందున మరో వారం పాటు లాక్డౌన్ మినహాయింపులివ్వడం సాధ్యంకాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేశ జనాభాలో ఢిల్లీ జనాభా 2 శాతం మాత్రమే ఉండగా, దేశంలోని మొత్తం కోవిడ్–19 కేసుల్లో, 12 శాతం ఢిల్లీలోనే ఉన్నాయని కేజ్రీవాల్ వివరించారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు. -
‘కేజ్రీవాల్ మీరు చేసింది తప్పే’
న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించారంటూ ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ నేతలైన రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భారతీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటంటే.. 2014లో ఢిల్లీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారాన్ని అడ్డుకోవాలని ఆప్ నేత సోమ్‌నాథ్ భారతీ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీస్ శాఖ స్పందించలేదు. దాంతో విధులు సక్రమంగా నిర్వహించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని జనవరి 20న కేజ్రీవాల్, మరికొందరు నేతలు కలిసి రైలు భవన్ ఎదుట ధర్నా చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 250-300మందితో కలిసి కేంద్ర హోంమంత్రి కార్యాలయం వైపు కవాతు నిర్వహించారు. వీరి చర్యలను అడ్డుకోవాలని చూసిన అధికారులపై దౌర్జన్యానికి దిగారని పోలీసులు వెల్లడించారు.నిషేదిత ఉత్తర్వులను ఉల్లఘించడమే కాకుండా, కార్యకర్తలను ప్రసంగాలతో రెచ్చగొట్టినందుకు కేజ్రీవాల్‌తో సహా మరో ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద చార్జీషీట్ దాఖలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నేడు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కేజ్రీవాల్ చర్యలను తప్పు పట్టింది. ఉద్యోగుల విధులకు భంగం కల్గించారని పేర్కొంది. అయితే ఈ ధర్నాతో ఆప్ నేత సంజయ్ సింగ్, జర్నలిస్ట్ అశుతోష్‌లకు సంబంధం లేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేయడం కొసమెరుపు. -
ఢిల్లీలో ఆప్ భారీ ర్యాలీ
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడురోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలిపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడం లక్ష్యంగా ఆప్ ఈ ర్యాలీని తలపెట్టినప్పటికీ, పోలీసులు అడ్డుకోవడంతో మోదీ ఇంటికి చాలా దూరంలోనే ర్యాలీ ఆగిపోయింది. ఢిల్లీలోని మండీహౌస్ ప్రాంతం నుంచి ఆప్ ఈ ర్యాలీని ప్రారంభించగా, అక్కడకు ఎక్కువ మంది కార్యకర్తలు రాకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీకి అనుమతించేది లేదని ప్రకటించిన పోలీసులు.. మండీహౌస్‌కు దగ్గర్లోని ఐదు ఢిల్లీ మెట్రోరైల్ స్టేషన్లను మధ్యాహ్నమే మూసివేశారు. ఆ ప్రాంతానికి చేరుకునే బస్సులను కూడా నిలిపివేశారు. ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లు ర్యాలీని అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ 45 వేల మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న ఈ ర్యాలీ సాయంత్రం 4.45 గంటలకు మండీహౌస్ వద్ద ప్రారంభమై ఆరు గంటల సమయంలో పార్లమెంట్ స్ట్రీట్ వద్దనే ఆగిపోయింది. ర్యాలీ సమయంలో ఏచూరి మాట్లాడుతూ ‘బీజేపీ పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇందుకు నిరసనగానే ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం’ అని చెప్పారు. మేం సమ్మె చేయడం లేదు: అధికారులు ఐఏఎస్ అధికారులు సమ్మె చేస్తున్నారంటూ ఆప్ చెబుతుండటాన్ని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. అనవసరంగా ఆప్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని బా«ధ్యులుగా చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు కలసి ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తమకు భద్రత లేని సమావేశాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారులపై కేజ్రీవాల్ వెనక్కు తగ్గారు. అధికారులంతా తమ కుటుంబంలో భాగమేనన్న ఆయన.. మంత్రులతో సమావేశాల్లో పాల్గొనే సమయంలో వారికి పూర్తి భద్రత ఉంటుందని హామీనిచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని బాయ్‌కాట్ చేయడం మానేసి పనుల్లో నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేశారు. నా స్థానంలో ఎలా వెళ్తారు.. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశానికి తన స్థానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెళ్లేందుకు తాను అనుమతినివ్వలేదని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌కు బదులుగా బైజల్ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారని వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి స్థానంలో ఎల్జీ భేటీకి వెళ్లారు?’ అని ప్రశ్నించారు. అయితే బైజల్ సమావేశానికి రానేలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. -
రైల్వేస్టేషన్ లో కేజ్రీవాల్‌కు నిరసన సెగ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరసన సెగ తగిలింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆయనను గురువారం బీజేపీ మహిళ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాలుగు రోజుల పంజాబ్ పర్యటనలో భాగంగా కేజ్రీవాల్ ఇవాళ ఉదయం చండీగఢ్ బయలు దేరారు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కేజ్రీవాల్‌ను బీజేపీ మహిళా కార్యకర్తలు అడ్డగించి నినాదాలతో హోరెత్తించారు. మహిళలపై వేధింపులకు ఆప్ నేతలు కేరాఫ్‌గా మారారని, మహిళలను అవమానించేలా మాట్లాడడం ఆప్ నేతలకు అలవాటైపోయిందని విమర్శలు గుప్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యేల వ్యవహారంపై కేజ్రీవాల్ స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆప్ నేత అశుతోష్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. -
కోర్టుకు రావాలంటూ ఢిల్లీ సీఎంకు ఆదేశం
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో ఈ నెల 17న కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్వీందర్ సింగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆదేశించారు. బీజేపీ ఎంపీ రమేష్ బిదురి వేసిన క్రిమినల్ పరువునష్టం కేసును శనివారం ఢిల్లీ కోర్టు విచారించింది. ఈ రోజు కేజ్రీవాల్ కోర్టుకు హాజరు కావాల్సివుండగా, న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. విదేశాల్లో ఉన్నందున కోర్టుకు హాజరుకాలేనని కేజ్రీవాల్ విన్నవించడంతో కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించింది. అయితే 17న జరిగే తదుపరి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టుకు విన్నవించారు. కోర్టు తదుపరి విచారణలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారంటూ రమేష్ బిదురి ఆయనపై కేసు వేశారు. -
సింధూ, సాక్షికి ఢిల్లీ సీఎం సన్మానం
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, రెజ్లర్ సాక్షి మాలిక్‌లకు ఆయన సన్మానించి, ఢిల్లీ ప్రభుత్వం తరఫున ప్రకటించిన చెక్కులను అందచేశారు. బ్యాండ్మింటన్‌లో గెలిచి రజతం సాధించిన పీవీ సింధుకు రూ.2 కోట్లు, రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్‌కు రూ.కోటి బహుమానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సింధూ, సాక్షి మాలిక్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కృషి, అంకితభావంతో వారు అనుకున్నది సాధించారని అన్నారు. అలాగే సింధూ, సాక్షిమాలిక్ కోచ్‌లు గోపీచంద్, మణిదీప్ సింగ్‌లకు చెరో రూ. 5లక్షల చెక్‌లు అందచేశారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌కు పీవీ సింధూ కృతజ్ఞతలు తెలిపింది. క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందని... తమకు లభించిన గౌరవం మరవలేనిదని సింధూ అన్నారు. రియో ఒలింపిక్స్‌కు వెళ్లేటప్పుడు తమ వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదన్నారు. అయితే పతకం సాధించి భారత్‌కు తిరిగి వచ్చాక.. తమ మ్యాచ్‌లను టీవీ సెట్ల వద్ద కూర్చుని చూశామని ప్రతి ఒక్కరూ చెబుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందని... తల్లిదండ్రులతో పాటు తమకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ సింధు కృతజ్ఞతలు తెలిపింది. -
రాజకీయాల్లోకి రండి
సహాయానికి యువత ఆహ్వానం చేతులు కలుపుదామని పిలుపు సాక్షి, చెన్నై : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటూ ఐఏఎస్ అధికారి సహాయం కు యువత ఆహ్వానం పలుకుతోంది. రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తూ, తమ సీఎం సహా యం అన్న నినాదంతో ఇలక్కు(లక్ష్యం,టార్గెట్) పేరిట తిరుచ్చికి చెందిన సంస్థ చెన్నైలో ఆది వారం ర్యాలీ నిర్వహించింది. ‘సహాయం ఐఏఎస్’- పేరు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్మోగుతున్న విషయం తెలిసిందే. అవినీతికి వ్యతిరేకిగా, సంచనాల అధికారిగా ముద్ర పడ్డ సహాయం ఉద్యోగ పయనం బదిలీల పర్వం తోనే సాగుతూ వస్తున్నది. పుదుకోట్టైలో జన్మించిన ఆయన సివిల్ సర్వీసు ఉత్తీర్ణత సాధించినా, ఐఏఎస్ పదవిని ఎంపిక చేసుకోలేదు. తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా 1991లో దిండుగల్ జిల్లా ఒట్టన్ చత్రం సబ్ డివిజన్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద సమరమే చేస్తూ వస్తున్నారు. తదుపరి కాంచీపురం జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరించి ఇసుక మాఫియా గుండెల్లో నిద్రించడమే కాకుండా, ఓ కోలా సంస్థకు వ్యతిరేకంగా వ్యవహరించి, ప్రజల దాహార్తిని తీర్చారని చెప్పవచ్చు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌గా సివిల్ సప్లయ్ విభాగంలో రేషన్ మాఫియాకు దడ పుట్టించారు. ఎక్కడ విధులు నిర్వర్థించినా అక్కడల్లా సంచలనమే. ఇందుకు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన కానుక బదిలీ పర్వం. ఇప్పటి వరకు ఈయన 20 సార్లకు పైగా బదిలీల ఉత్తర్వుల్ని అందుకున్నారని చెప్పవచ్చు. నామక్కల్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యాక, మరో సంచలనం సృష్టిస్తూ ఐఎఎస్‌ల నెత్తిన గుది బండగా మారారు. తన ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించి ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి తాను వత్తాసు పలికేది లేదని చాటుకున్నారు. ఈ సమయంలో సహాయంకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంచి గుర్తింపును ఇచ్చింది. మదురై జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ అక్కడి అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ సమయంలో ఎన్నికల విధులతో పాటుగా, అక్కడి గ్రానైట్ మాఫియా కుంబకోణాల్ని తవ్విన సహాయం సంచలన ప్రకటన చేశారు. వేల కోట్ల మేరకు సాగిన ఈ స్కాం చివరకు కోర్టుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్ మాఫియా స్కాంలపై విచారించాలంటూ పదుల సంఖ్యల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎన్నికల అనంతరం ప్రాధాన్యత లేని శాఖలో పడి ఉన్న సహాయంకు హైకోర్టు అండగా నిలిచింది. మదురై కేంద్రంగా సాగిన గ్రానైట్ స్కాం విచారణ బాధ్యతల్ని ఆయనకే అప్పగించింది. ఎన్నో ఒడి దొడుగులు, బెదిరింపులు, హత్యా హెచ్చరికలు వచ్చినా ఏ మాత్రం తగ్గకుండా, సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించిన సహాయం, కీలక సలహాలు సూచనలు సైతం ఇచ్చారని చెప్పవచ్చు. ఎక్కడ కెళ్లినా వేదికల మీద అవినీతికి వ్యతిరేకంగా, ప్రజా హితం లక్ష్యంగా ప్రసంగాలు చేసే సహాయం ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమ కారులకు, కొందరు యువతకు హీరోగా కన్పిస్తున్నట్టున్నారు. అవినీతి ఊబిలో కూరుకు పోయిన ఏలిన వాళ్లను, ఏలుతున్న వాళ్లను కడిగేద్దాం...చేతులు కలుపుదాం...మన సీఎం సహాయం అన్న నినాదాన్ని అందుకునే పనిలో పడ్డారు. ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించే నినాదాన్ని అందుకున్నారు. ఆహ్వానం : తిరుచ్చికి చెందిన ఇలక్కు( లక్ష్యం లేదా టార్గెట్) అనే సంస్థ సహాయం రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తూ సోషల్ మీడియా ద్వారా అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లను, యువతను ఏకం చేసిందని చెప్పవచ్చు. తమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా సహాయం ద్వారానే రాష్ట్రం సమగ్రాభివృద్ధి అన్న నినాదంతో ముందుకు సాగే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆదివారం చెన్నైలో భారీ ర్యాలీకి యత్నించారు. సుమారు వెయ్యి మంది వరకు తరలి వచ్చిన యువత, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లు చేతిలో ప్లకార్డులు బట్టి ఆయనకు ఆహ్వానం పలికే యత్నం చేశారు. ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం ఆవరణలో ఏకమైన వీరందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు చేయకూడదంటూ వారించారు. అయినా, తగ్గేది లేదన్నట్టుగా కాసేపు అక్కడే అటూ ఇటూ తిరుగుతూ నినాదాలతో హోరెత్తించారు. సహాయం రాజకీయాల్లోకి రావాలని, చేతులు కలుపుదాం..మన సీఎం సహాయం అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయంగా ఇలక్కు నిర్వాహకుల్ని కదిలించగా, అవినీతికి వ్యతిరేకంగా, నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీ వాల్ ఏ విధంగా సీఎం పగ్గాలు చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలించాయో, అలాంటి పరిస్థితులే రాష్ట్రంలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. సహాయం రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. -
కేజ్రీవాల్‌కు బీసీసీఐ షాక్
క్రికెటర్ల సన్మానానికి అనుమతివ్వని బోర్డు న్యూఢిల్లీ: రెండుసార్లు భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన జట్లలోని తమ రాష్ట్ర ఆటగాళ్లకు సన్మానం చేయాలనుకున్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలకు బీసీసీఐ అడ్డు తగిలింది. దీంతో ఈ కార్యక్రమం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 1983, 2011 టోర్నీల్లో ఆడిన ఢిల్లీ క్రికెటర్లు అమర్నాథ్, మదన్ లాల్, సెహ్వాగ్, గంభీర్, కోహ్లిలతోపాటు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడిని దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులో సన్మానిస్తామని ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డీడీసీఏకు తెలిపారు. దీనికి మూడో రోజు లంచ్ విరామాన్ని వినియోగించుకోవాలని భావించారు. అయితే ఇలా ఆట మధ్యలో కార్యక్రమాలు నిర్వహించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయం తెలియని బేడీ మైదానానికి వచ్చి... ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై మాజీ ఆటగాళ్లు బీసీసీఐని విమర్శించారు. కే జ్రీవాల్ ఒత్తిడి తెచ్చారు: జస్టిస్ ముద్గల్ ఆటగాళ్లకు సన్మానం చేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఒత్తిడి చేశారని... ఈ మ్యాచ్ కోసం హైకోర్టు నియమించిన పరి శీలకులు జస్టిస్ ముకుల్ ముద్గల్ తెలిపారు. అయితే బీసీసీఐ సూచనల మేరకు తాను ఇందుకు అంగీకరించలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వ కౌన్సిల్ రాహుల్ మెహ్రా, తన కు మధ్య జరిగిన సందేశాల వివరాలను ఆయన వెల్లడించారు. మరోవైపు స్టేడియంలో పాఠశాల విద్యార్థులు కూర్చున్న స్టాండ్స్ దగ్గరకు వెళ్లి ఢిల్లీ సీఎం మాట్లాడతారని మెహ్రా డిమాండ్ చేశారు. అయితే భద్రతాపరంగా ఇబ్బంది ఎదురవుతుందని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సన్మానానికి దూరంగా ఉండు’ ఒకవేళ ఢిల్లీ స్టేట్ తమ ఆటగాళ్లకు సన్మానం చేస్తే దానికి దూరంగా ఉండాలని స్థానిక క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి బీసీసీఐ సూచించింది. ‘కోహ్లి బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాడు. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో మూడో పార్టీ నిర్వహించే కార్యక్రమానికి భారత కెప్టెన్‌ను అనుమతించలేము’ అని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. అలాగే ఈ సిరీస్‌లోనే రెండో టెస్టు దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్‌కు వందో మ్యాచ్ కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడికి సన్మానం చేద్దామని భావించింది. అయితే దీనికి కూడా బీసీసీఐ అంగీకరించలేదు. -
నితీశ్‌కు కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో బుధవారం ఓ కార్యక్రమంలో వీరిద్దరూ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మోదీ బిహార్‌కు రూ. 1.25లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఆయన రూ.1.25పైసలు కూడా ఇవ్వరని అన్నారు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ నుంచి బిహార్‌కు వలస వెళ్లిన ప్రజలు నితీశ్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్‌ను నితీశ్ సమర్థించారు. బీజేపీలోకి జేడీయూ ఎమ్మేల్యేలు పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నితీశ్ నేతృత్వంలోని జేడీయూకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. బిహార్ అభివృద్ధిని కాంక్షించిన ఎమ్మెల్యేలను నితీశ్‌కుమార్ పలు రకాలుగా వేధించారని బీజేపీ బిహార్ అధ్యక్షుడు మంగల్‌పాండే ఆరోపించారు. -
'మోదీ.. మీ సుష్మాను దించేయండి'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నేరుగా విమర్శలు కురిపించారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తమ పార్టీ నేత మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ఫేక్ డిగ్రీలు, అరెస్టు చేసిన అంశంపై బీజేపీ నేతలు చర్చ లేపిన సందర్భంగా ఆయన సూటిగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ వెంటనే సుష్మా స్వరాజ్‌ను కేబినెట్ నుంచి తొలగించాలని, బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ తోమర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని చూసైనా మోదీ నేర్చుకోవాలని విమర్శించారు. తొలుత తాను కూడా తోమర్ తప్పు చేయలేదనే అనుకున్నానని, తర్వాతే అతను తప్పుచేసినట్లు గుర్తించి బాధ్యతల నుంచి తప్పించానని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీని ఆయన కేబినెట్ మంత్రులంతా తప్పుడుదారి పట్టిస్తున్నారని, ఆయన తప్పనిసరిగా లలిత్ మోదీకి వీసా సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ప్రధాని తొలగించాలని డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్‌తో అద్వానీ భేటీ రద్దు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య శుక్రవారం జరగాల్సిన భేటీ రద్దయింది. దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశముందన్న అద్వానీ మాటలు నిజాలని కేజ్రీవాల్ సమర్థించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్ అద్వానీ అపాయింట్మెంట్ కోరారని, అయితే అద్వానీ వేరే పనుల వల్ల భేటీని రద్దు చేసుకున్నారని ఆయన కార్యాలయం తమకు తెలిపిందని సీఎం కార్యాలయం తెలిపింది. బీజేపీ నేత శని, ఆదివారాలు నగరంలో ఉండడం లేదు కనుక భేటీ వచ్చేవారం జరుగుతుందని పేర్కొంది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా డిమాండ్‌పై చర్చించేందుకు సీఎం.. అద్వానీ అపాయింట్మెంట్ కోరారు. వీరి భేటీ రద్దు వెనుక బీజేపీ పాత్ర ఉందని ఊహాగానాలు వచ్చాయి. భేటీని రద్దు చేసుకోవాలని బీజేపీ ఒత్తిడి చేసిందా అని విలేకర్లు ఆ పార్టీ నేత సుధాంశు త్రివేదిని అడగ్గా ‘అద్వానీ సీనియర్ నేత. ఎవరిని, ఎప్పుడు కలుసుకుంటారన్నది ఆయనిష్టం’ అని పేర్కొన్నారు. -
కేంద్రంతో కేజ్రీవాల్ ప్రత్యక్ష పోరు
హోం సెక్రటరీ సరెండర్ చెల్లదన్న హోంశాఖ * వెనక్కి పంపే అధికారం మాకుంది: కేజ్రీవాల్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీపై ఆధిపత్య పోరులో మరోసారి కేంద్రం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్‌పాల్‌ను తొలగిస్తూ ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గురువారం రద్దు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, హోం శాఖ, భూభవనాల శాఖల ముఖ్యకార్యదర్శిగా ఉన్న ధరమ్‌పాలే కొనసాగుతారని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా భూభవనాల ముఖ్యకార్యదర్శిగా ఆప్ సర్కారు నియమించిన అశ్విన్‌కుమార్ నియామకాన్ని కూడా రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేకే శర్మ ధరమ్‌పాల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ పంపిన ఉత్తర్వుల్లో అఖిలభారత సర్వీసులు(జాయింట్ క్యాడర్) రూల్స్-1972 ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలకు.. జేసీఏ పరిధిలోని రాష్ట్రాలకు పాలనాపరమైన అవసరాలను బట్టి ఐఏఎస్ అధికారులను కేంద్ర హోం శాఖే కేటాయిస్తుందని స్పష్టం చేసింది. ఏ రూల్ ప్రకారం కూడా ఢిల్లీ ప్రభుత్వానికి అధికారుల బదిలీ విషయంలో ఎలాంటి అధికారాలు లేవని తేల్చిచెప్పింది. దీంతో ధరమ్‌పాల్‌ను కేంద్రానికి వెనక్కి పంపడం, ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన 296, 297 ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవద్దు తమ ప్రభుత్వ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం శాఖకు ఘాటుగా లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులను కేంద్రానికి సరెండర్ చేసే అధికారం తమ ప్రభుత్వానికి ఉందనీ, అదే సమయంలో ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు ఇవ్వటం కూడా తమ ప్రభుత్వ పరిధిలోని అంశమేనని ఆయన స్పష్టం చేశారు. హోం శాఖకు పూర్తిస్థాయి అధికారిని నియమించినప్పుడు తప్పకుండా ఎల్జీని సంప్రదిస్తామని ఆయన అందులో పేర్కొన్నారు. -
ఎల్జీతో కేజ్రీవాల్ భేటీ
ఢిల్లీ ఏసీబీ పనితీరుపై చర్చ * అసెంబ్లీ ప్రత్యేక భేటీ అజెండాపై వివరణ * కేంద్రం నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో సమావేశమయ్యారు. 20 నిమిషాలపాటు సాగిన వీరి భేటీలో.. ఢిల్లీ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) పనితీరుపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీ పోలీసు సిబ్బందిపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చిన మరుసటి రోజే వీరి భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఆప్ సర్కారుకు మధ్య వివాదం మొదలైన తర్వాత కేజ్రీవాల్.. ఎల్జీతో సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేకే శర్మ పాల్గొన్నారు. రెండ్రోజుల అసెంబ్లీ సమావేశాల ఎజెండాను సీఎం ల్జీకి వివరించినట్లు తెలిసింది. సమర్థ పాలన అందించేందుకు కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఎల్జీ.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శకుంతల గామ్లిన్‌ను నియమించడం, దాన్ని సీఎం తీవ్రంగా వ్యతిరేకించడం, ఇద్దరి మధ్య లేఖల యుద్ధం కొనసాగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ఎల్జీయే సర్వాధికారి అంటూ ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అధికారాలను హరించేందుకే నోటిఫికేషన్ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ రెండ్రోజుల ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం సిసోడియా.. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇది ప్రజలు గెలిపించిన ప్రభుత్వ అధికారాలను హరించే ప్రయత్నమని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం లేనందు వల్ల అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదనడాన్ని తప్పుపట్టారు. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌ను అభిశంసించే అధికారాన్ని ఢిల్లీ అసెంబ్లీకి కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఆప్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.