నితీశ్‌కు కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో బుధవారం ఓ కార్యక్రమంలో వీరిద్దరూ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మోదీ బిహార్‌కు రూ. 1.25లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఆయన రూ.1.25పైసలు కూడా ఇవ్వరని అన్నారు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ నుంచి బిహార్‌కు వలస వెళ్లిన ప్రజలు నితీశ్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్‌ను నితీశ్ సమర్థించారు.
బీజేపీలోకి జేడీయూ ఎమ్మేల్యేలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నితీశ్ నేతృత్వంలోని జేడీయూకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. బిహార్ అభివృద్ధిని కాంక్షించిన ఎమ్మెల్యేలను నితీశ్‌కుమార్ పలు రకాలుగా వేధించారని బీజేపీ బిహార్ అధ్యక్షుడు మంగల్‌పాండే ఆరోపించారు.