Khushi
-
పవన్ కల్యాణ్ రికార్డ్‌ని 3రోజుల్లోనే అందుకున్న మహేశ్ బాబు
మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన హిట్ సినిమా మురారి రీ- రిలీజ్ అయింది. తొలిరోజే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 5.46 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. మహేశ్‌బాబు- సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం ఆగస్టు 9న రీ-రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మహేష్‌బాబు రీ రిలీజ్ సినిమాల్లో బిజినెస్మెన్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా మురారి నిలిచింది. బిజినెస్మెన్ ఫస్ట్ డే రూ. 5.7 కోట్లు రాబట్టింది.పవన్ ఖుషి చిత్రాన్ని బీట్ చేసిన మురారిసౌత్ ఇండియాలో ఇప్పటి వరకు రీ-రిలీజ్ చిత్రాలు భారీగానే విడుదలయ్యాయి. అయితే, ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సౌత్ ఇండియా చిత్రంగా పవన్ కల్యాణ్ 'ఖుషి' ప్రథమ స్థానంలో ఉంది. 2022 డిసెంబర్ 31న రీ-రిలీజ్ అయిన ఈ సినిమా పదిరోజుల పాటు కొనసాగింది. అప్పట్లో సుమారు రూ. 7.5 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఖుషి సినిమానే కలెక్షన్ల పరంగా టాప్‌లో ఉంది. అయితే, మహేశ్ మురారి సినిమా కేవలం 3రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఇప్పటికే రూ. 8.31 కోట్ల కలెక్షన్లు రాబట్టి రీ-రిలీజ్ సినిమా కలెక్షన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇంకా బాక్సాఫీస్ వద్ద మురారి సందడి కొనసాగుతుంది. కలెక్షన్లు క్లోజింగ్ అయ్యే సమయానికి రూ. 10 కోట్ల మార్క్‌ను మురారి చేరుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ 10రోజుల కలెక్షన్ల రికార్డ్‌ను మహేశ్ కేవలం 3రోజుల్లోనే సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.2001లో విడుదలైన మురారి చిత్రానికి ఇప్పుడు కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుండటంతో మహేష్ బాబు తన ఆనందాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. అభిమానులు ఇచ్చిన తిరుగులేని మద్దతుకు ఆయన ధన్యవాదాలు చెప్పాడు. మురారి రీ-రిలీజ్ విజయం సినిమా రీ-రిలీజ్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. 2001 నంది అవార్డుల కార్యక్రమంలో మురారి సత్తా చాటింది. ఏకంగా మూడు నంది అవార్డులను దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. 2015లో హిందీలో రౌడీ చిరుతగా డబ్ చేయబడిన మురారి.. 2006లో కన్నడలో గోపిగా రీమేక్ చేయబడింది.విజయ్ గిల్లీ పరిస్థితి ఏంటి..?మహేశ్ బాబు 'ఒక్కడు' చిత్రాన్ని కోలీవుడ్‌లో 'గిల్లీ' పేరుతో దళపతి విజయ్ రీమేక్ చేశాడు. 2004లో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే, రీసెంట్గా రీ-రిలీజ్ అయిన గిల్లీ సినిమా రూ. 32.5 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కానీ, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్రమైన దుమారం రేగింది. రికార్డుల కోసం ఇలా తప్పుడు కలెక్షన్లు ప్రకటించారని ఒక కామెంట్ ఉంది. కొందరు మాత్రం అందులో నిజం లేదని కొట్టిపడేశారు. విజయ్ అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో సుమారు 10 రోజుల పాటు గిల్లీ సినిమా టికెట్లు కొనుగోలు చేశారని ఒక విమర్శ ఉంది. సుమారు 30రోజుల పాటు కొన్ని థియేటర్స్‌లలో గిల్లీ చిత్రాన్ని ప్రదర్శించారు. దీంతో సౌత్ ఇండియా రీ-రిలీజ్ టాప్ సినిమాల జాబితాలో గిల్లీ సినిమానా..? మురారి చిత్రమా..? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. -
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
ఆ భయం లేదు!
‘‘లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించే విధానం మారింది. కథ, నటీ నటుల పాత్రల్లో కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు. అందుకే ప్రయోగాత్మక, కొత్త తరహా పాత్రలే చేయాలనుకుంటున్నాను. కథ నచ్చి, అందులో నా పాత్ర బలంగా ఉంటే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీ’’ అన్నారు ఖుషీ రవి. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన హారర్ చిత్రం ‘పిండం’. ఈ చిత్రం ఈ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఖుషీ రవి మాట్లాడుతూ– ‘‘నటిగా కన్నడంలో ‘దియా’ నా తొలి చిత్రం. ఆ చిత్రం తర్వాత పెళ్లి చేసుకున్నాను. నాకో పాప ఉంది. ఇక ‘పిండం’ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో నేను మేరీ పాత్రలో నటించాను. కథ రీత్యా ఇద్దరు కుమార్తెలు నాకు. మూడో ప్రసవం కోసం గర్భిణిని. కెరీర్‌ప్రారంభంలోనే తల్లి పాత్రæచేస్తే నా కెరీర్ ఏమౌతుందోననే భయం, అభద్రతాభావం నాకు లేవు. నా మరో చిత్రం ‘రుద్ర’లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తున్నాను. సవాల్ అనిపించే పాత్రలు చేయడం నాకు ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు. -
ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు – దర్శకుడు సాయికిరణ్ దైదా
‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్‌లు రాసేవాడిని. కోన వెంకట్‌గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్‌లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
ముప్పైకి పైగా భయపడే సీన్లు ఉన్నాయి
‘‘నా 30 ఏళ్ల వయసులోనే ఐటీ కంపెనీలను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశాను. దాంతో సినిమా తీయడం సులభం అనుకున్నాను. కానీ వంద కాదు.. వెయ్యి కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత సులభం కాదని తెలుసుకున్నాను. వందల మంది కలిసి పని చేస్తూ, అన్నీ కలిసి వస్తేనే ఓ సినిమా పూర్తవుతుంది. లేదంటే ఎన్ని కోట్లు డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. శ్రీరామ్, ఖుషీ జంటగా ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ– ‘‘నాకు యూఎస్‌లో ఐటీ కంపెనీలున్నాయి. సాయికిరణ్‌కు సినిమాలపై ఆసక్తి. ఓ సినిమా చేద్దామని ఇండియా వచ్చాం. సిద్ధు జొన్నలగడ్డతో మేం చేయాల్సిన ‘డల్లాస్ దేశీ దొంగలు’ సినిమా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో కథ అనుకున్నాం. అది కూడా కుదర్లేదు. ఆ నెక్ట్స్ ‘పిండం’ కథను రెడీ చేశారు సాయికిరణ్. ఓ సందర్భంలో సాయికిరణ్ వాళ్ల నాన్నమ్మ ఓ భవంతిని చూపించి, ఓ కథ చె΄్పారట. ఆ కథకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘పిండం’ కథ రాశారు. ఈ సినిమాలో ముప్పైకి పైగా భయపడే సన్నివేశాలు ఉన్నాయి. 1930, 1990, 2023.. ఇలా మూడు కాలమానాల్లో స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఇక మా సంస్థలో మొదలైన తొలి చిత్రం ‘డల్లాస్‌లో దేశీ దొంగలు’ ఉంటుంది. మరికొన్ని కథలు ఉన్నాయి’’ అన్నారు. -
మల్టీకలర్ డ్రెస్ లో వావ్ అనిపిస్తున్న ఖుషి కపూర్..చూశారంటే మైమరిచిపోవాల్సిందే (ఫోటోలు)
-
భయపెట్టే పిండం!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది. డిసెంబరు 7న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. -
Khushi Pandey: ఖుషీతో దిల్ ఖుష్
చిన్నతనంలో తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారికి నొప్పి తెలియకుండా ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు. అయితే లక్నోకు చెందిన ఖుషీ అందుకు భిన్నం. తన తండ్రిలా మరెవరూ కష్టపడకూడదని తానే ఓ సామాజిక కార్యకర్తగా మారి సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఖుషీ పాండే. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఖుషీ పాండే బాల్యం ఉన్నావ్ అనే ఊళ్లో గడిచింది. తన తండ్రి నుంచి చిన్ననాటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఖుషీ తండ్రికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ పెన్సిల్ కొనే స్థోమత కూడా లేదప్పుడు. ఈ విషయం తెలుసుకుని,∙నాన్నలా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదు అనుకుంది. నిరుపేదలకు సాయం చేయాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. ఖుషీ పెద్దయ్యేసరికి నాన్న వాళ్ల లక్నోకి మకాం మార్చారు. అక్కడ ఓ షాపులో పనిచేస్తూ తరువాత కాంట్రాక్టర్‌గా మారారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా రావడంతో ఖుషీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో ఖుషీ ‘లా’ పూర్తయ్యాక, సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. చదువు పూర్తయ్యాక వెంటనే నిరుపేదలకు చదువు చెప్పడం ప్రారంభించింది. మురికివాడల్లోని పిల్లలను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి సాయంత్రం రెండుమూడు గంటలు చదువు చెప్పేది. రోజుకి యాభై మంది వరకు ఖుషీ క్లాసులకు హాజరయ్యేవారు. తన దగ్గరకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తోంది. తాతయ్య మరణంతో... అది 2020 ... ఒకరోజు రాత్రి ఖుషీ వాళ్ల తాతయ్య షాపు నుంచి తిరిగి వస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించక ఎదురుగా వచ్చే కారు తాతయ్య సైకిల్ని ఢీ కొట్టడంతో ఖుషీ తాతగారు అక్కడికక్కడే చనిపోయారు. తాతయ్యను ఎంతో ఇష్టపడే ఖుషీ ఈ చేదు సంఘటనను తట్టుకోలేకపోయింది. సైకిల్‌కు లైట్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనుకుని ప్రతి సైకిల్‌కు లైటు ఉండాలాని భావించింది. రోజూ కూలి పనిచేసుకునేవారు తమ సైకిళ్లకు లైట్లు పెట్టుకోవడానికి తగ్గ స్థోమత ఉండేది కాదు. దాంతో వాళ్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల ఖరీదు చేసే లైట్లను ఉచితంగా పంచింది. ఇలా ఇప్పటిదాకా 1500 మంది వాహనాలకు బ్యాటరీతో నడిచే లైట్లను అమర్చింది. లైట్లు అమర్చడానికి ‘ఇన్స్టాల్ లైట్స్ ఆన్ బైస్కిల్’ అని రాసిన ఉన్న ప్లకార్డు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఎంతోమందికి అవగాహన కల్పించింది. అప్పట్లో ఖుషీ చేసిన ఈ పనిని ఓ ఐఏఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎనభైమంది యువకులు ఖుషీతో కలిసి సైకిళ్లు, ట్రక్కులకు, ఇతర వాహనాలకు లైట్లు అమర్చడంలో ఖుషీకి సాయంగా నిలిచారు. పాఠాలతో పైసలు సంపాదించి... ఖుషీ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు నిధులు చాలా కావాలి. ఇందుకు తన తండ్రి, బంధువులు సమకూర్చిన మొత్తం ఏమాత్రం సరిపోలేదు. దాంతో యూట్యూబ్‌లో ‘లా’ తరగతులు చెప్పడంతోపాటు, ఇతర పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ్త నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలకు అండగా... బాలికలకు శానిటరీ ప్యాడ్ ల గురించి అవగాహన కల్పించడం, విద్యుత్ సదుపాయం లేని వారికి సోలర్ ల్యాంప్స్ అందించడం, ‘జీవిక సాథీ’ ప్రాజెక్టు పేరుతో దివ్యాంగ మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు కుట్టుమిషన్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
ఓ ఆత్మ ప్రతీకారం
వీర్, శ్రీ హర్ష, నిషా, ఖుషి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో కేవీ పాపారావు నిర్మించిన ‘చండిక’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఓ ఆత్మ ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని కొత్తగా చూపించాం. ఈ చిత్రంలో నిర్మాత గురురాజ్ ఓ కీలక పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు నేనే కథ రాశాను’’ అన్నారు చిత్రనిర్మాత కేవీ పాపారావు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ విన్, కెమెరా: నగేశ్. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
నాతో రా... ఖుషీ సెకండ్ సాంగ్ విన్నారా?
‘నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా..’ అంటూ విజయ్ దేవరకొండ పాడగా, ‘పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా..’ అంటున్నారు సమంత. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రంలోని రెండో పాట ఇది. ఈ చిత్రదర్శకుడు శివ నిర్వాణ తెలుగు వెర్షన్‌కి ఈ పాట రాయగా, తమి ళంలో మదన్ కార్కీ సాహిత్యం అందించారు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి, హిందీలో జుబిన్ నాటియల్, పలక్ ముచ్చల్, కన్నడంలో హరిచరణ్ శేషాద్రి, చిన్మయి, మలయాళంలో కేఎస్ హరిశంకర్, శ్వేతా మోహన్ ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
ఆరాధ్య...
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఆరాధ్య..’ అంటూ సాగే రెండో పాటను బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఖుషి’ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘నా రోజా నువ్వే..’ పాట వంద మిలియన్లకు చేరువలో ఉంది. ‘ఆరాధ్య..’ పాట ప్రోమోను సోమవారం, పాటను బుధవారం విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: జి. మురళి. -
Khushi Pandey: మండే ఎండలు కాస్త జాగ్రత్త
‘అబ్బబ్బా! ఎండలు మండిపోతున్నాయి’ అని ఇంట్లో కూర్చొనే అపసోపాలు పడుతుంటారు చాలామంది. అలాంటిది ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడడం సామాన్య విషయం కాదు. కాని సామాన్యులకు తప్పదు. తనను తాను సామాజిక కార్యకర్తగా పరిచయం చేసుకునే లక్నోకు చెందిన ఖుషీ పాండే వీధి వీధి తిరుగుతూ పండ్లు, కూరగాయలు అమ్ముకునేవాళ్లకు, రిక్షా కార్మికులకు కాటన్ టవల్స్ ఇవ్వడంతో పాటు ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. ‘నో నీడ్ టు వర్రీ ఎబౌట్ ది హీట్’ కాప్షన్‌తో కూడిన ఖుషీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్ది సమయంలోనే 5.15 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మీ వీడియో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నేను టోపీలు పంచాలనుకున్నాను. ఈ వీడియో చూసిన తరువాత కాటన్ టవల్స్ బెటర్ అనిపించింది. తలతోపాటు మెడను కూడా కవర్ చేస్తాయి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ
-
లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్:పాన్-ఇండియా స్టార్ సమంతా రూత్ ప్రభు కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, 13వ అంతస్తులో కొనుగోలు చేసిన ఇల్లు 3,920 చదరపు అడుగులతో 7,944 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా , 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ ఏరియాతో ఉంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన సమంతా తాజాగా అత్యంత ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ (డ్యూప్లెక్స్) కొత్తగా సామ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను తాజాగా సమంత సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆరు పార్కింగ్ స్లాట్లతో జయభేరి ఆరెంజ్ కౌంటీలో 3BHK లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 13, 14 ఫ్లోర్లలో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ నివేదించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.7.8 కోట్లు. ఇటీవల ముంబైలో రూ. 15 కోట్ల విలువైన రాజభవన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు జూబ్లీహిల్స్‌లో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూడా ఉందట. దీంతో ఆమె నికర విలువ రూ. 89 కోట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంతా రీసెంట్గా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ డ్రామా `శాకుంతలం`తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాళిదాసు నాటకం ఆధారంగా, శకుంతల, పెరూ రాజవంశం రాజు దుష్యంత్‌ల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కూడా నటించారు.భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.11 కోట్లు మాత్రమే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు విజయ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం రిలీజైన ఈ మూవీలో ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
విజయ్, సమంతల 'ఖుషీ'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది చిత్రబృందం. అయితే రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో ఖుషీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసినా కుదరలేదు. సమంత అనారోగ్య కారణాలతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైంది. సమ్మర్లో వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఖుషి కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. కాగా.. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. #Kushi ❤️ Sept 1st. With full love,@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic & your man. pic.twitter.com/97rT3t8zoC — Vijay Deverakonda (@TheDeverakonda) March 23, 2023 -
ఈ ఏడాది సరికొత్త ప్రేమకథా చిత్రాలు ఇవే..!
సినిమాల్లో ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. లవ్ స్టోరీలను సినీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడతారు. భాష ఏదైనా ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఉంటుంది. గతేడాదిలో పలు ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా కూడా నిలిచాయి. అందులో సీతారామం మూవీ ఒకటి. మరీ ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రేమకథలను పరిచయం చేసేందుకు టాలీవుడ్లో సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దాం. ప్రేమకావ్యం.. శాకుంతలం కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణుకథ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి నటిస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోన్ నంబర్ ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మన ఫోన్ నెంబర్ తర్వాత నెంబర్ వారితో పరిచయం ప్రేమగా మారితే ఎలా ఉంటుందన్నదే ప్రధాన కథాంశం. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని- కీర్తి సురేశ్ 'దసరా' నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. యాక్షన్ చిత్రంగా తెరకెస్తున్నప్పటికీ ఓ మంచి ప్రేమకథ ఉందని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ - సమంత 'ఖుషి' పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే పేరుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. -
సమంత-విజయ్ దేవరకొండల 'ఖుషీ' సినిమా ఆగిపోయిందా? ట్వీట్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ సడెన్‌గా సమంత అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, తన పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ కేటాయించకపోవడంతో సామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఇవ్వట్లేదని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా ఆగిపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ నిర్వాణ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఖుషి రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో సినిమా ఆగిపోయిందనే రూమర్స్‌కి ఫుల్స్టాప్ పెట్టినట్లయ్యింది. #khushi regular shoot will start very soon 👍 everything is going to be beautiful❤️ — Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023 -
అప్పటి హిట్ టైటిల్.. ఇప్పుడు రిపీట్..
ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకట్టుకుంటుంది. అందుకే ఒక్కొక్కసారి హిట్ అయిన పాత సినిమాల పేర్లను టైటిల్‌గా పెడుతుంటారు. అఫ్కోర్స్ కథకు తగ్గట్టుగా ఉందా అని కూడా చూస్తారనుకోండి. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా పాత సినిమాల టైటిల్స్ వాడాలంటే ఆ సినిమా విడుదలై ఐదేళ్లయినా అయ్యుండాలి లేదా ఆ నిర్మాత అనుమతి ఇస్తే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో 5 టైటిల్స్ రిపీట్ అయ్యాయి. పాత చిత్రాల హిట్ టైటిల్స్‌తో రూపొందుతున్న తాజా చిత్రాలపై ఓ లుక్కేద్దాం.. అప్పుడు రొమాంటిక్.. ఇప్పుడు యాక్షన్ 'విక్రమ్' నాగార్జున హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘విక్రమ్’. వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన 36 ఏళ్లకు మరోసారి ‘విక్రమ్’ పేరు తెరపైకి వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథిగా చేశారు. అప్పటి ‘విక్రమ్’ రొమాంటిక్ యాక్షన్ అయితే ఈ ‘విక్రమ్’ యాక్షన్ థ్రిల్లర్. తెలుగు, తమిళంలో ఈ నెల 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ 'మేజర్' వేరు రవిచంద్రన్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కన్నడ చిత్రం ‘సిపాయి’. ఇందులో సౌందర్య కథానాయికగా నటించగా హీరో చిరంజీవి ముఖ్య పాత్ర చే శారు. 1996లో విడుదలై కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని 1998లో ‘మేజర్’ పేరుతో తెలుగులో డబ్ చేసి, విడుదల చేశారు. ఈ చిత్రంలో మేజర్ చంద్రకాంత్ పాత్రను చిరంజీవి చేశారు. ఇది రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అయితే అడివి శేష్ హీరోగా నటించిన తాజా ‘మేజర్’ కథ వేరు. ఇది బయోపిక్. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంతో ఈ సినిమా రూపొందింది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొం దిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ 'ఖుషి' ‘నువ్వు గుడుంబా సత్తి అయితే నేను సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ అంటూ ‘ఖుషి’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఆ ‘ఖుషి’లానే ఈ ‘ఖుషి’ కూడా లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడదల కానుంది. చారిత్రక 'కంచుకోట' ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా, సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించిన జానపద చిత్రం ‘కంచుకోట’. సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘కంచుకోట’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మదన్ హీరోగా, ఆశ, దివ్య హీరోయిన్లు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుంది. రివెంజ్ 'రుద్రవీణ' చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘రుద్రవీణ’. కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ మాస్ యాక్షన్ రోల్స్ చేస్తూ వచ్చిన చిరంజీవి ఈ చిత్రంలో అందుకు భిన్నంగా కనిపించారు. కాగా ‘రుద్రవీణ’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహించారు. రివెంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్ ఏమన్నదంటే..
స్టార్ హీరోయిన్ సమంత ఓ పక్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. మరోపక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని షేర్ చేస్తూ మోటివేషనల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్‌కు తన పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ మురిసిపోతుంది. తాజాగా వాటితో దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది సమంత. ఇది చూసిన ఓ నెటిజన్ సామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘తన పెట్స్ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అంటూ కామెంట్ పెట్టాడు. చదవండి: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి! ఇది చూసిన సామ్ వెంటనే అతడి కామెంట్స్‌పై స్పందించింది. ‘అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్, ఫాలోవర్ష్ సదరు నెటిజన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అతడు తన కామెంట్‌ను డిలిట్ చేశాడు. అయినప్పటికి కొందరు దానికి స్క్రీన్ షాట్ తీసి రీట్వీట్ చేస్తున్నారు. అతడు సటైరికల్‌గా కామెంట్ చేసినప్పటికీ తను మాత్రం పాజిటివ్‌గా రిప్లై ఇచ్చిందంటూ సమంతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం ఖుషి, యశోద చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. చదవండి: కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్ -
కశ్మీర్ టు హైదరాబాద్
కశ్మీర్లో ‘ఖుషి’ పూర్తయింది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత నెల 23న కశ్మీర్లో మొదలైన ‘ఖుషి’ తొలి షెడ్యూల్ పూర్తయినట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. ‘‘కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేశాం. డిసెంబరు 23న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్. -
షూటింగ్లో ప్రమాదం.. విజయ్, సామ్‌కి గాయాలు?
Vijay Devarakonda-Samantha: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటిస్తున్నసినిమా 'ఖుషి'. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్లో చిత్రీకరిస్తుండగా విజయ్, సమంతకి గాయలయ్యాయని, ఆ వెంటనే వీరిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు టాక్. వివరాల ప్రకారం.. సమంత, విజయ్ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో వారికి గాయాలైనట్లు సమాచారం. షూటింగ్ చేస్తుండగా వీరిద్దరు లిడర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట. కానీ ఆ సీన్ చేస్తున్నప్పుడు నీటిలో పడడందో వీరికి గాయాలైనట్లు సమాచారం. తక్షణమై స్పందించిన చిత్ర యూనిట్ వీరిద్దరికి చికిత్స అందించారు. ఈ ఘటనపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కాగా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్లు డైరెక్టర్ శివనిర్వాణ ట్విటర్లో తెలిపారు. ‘ఖుషి’ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ మూవీతో పాటు విజయ్, పూరీ జగన్నాథ్‌తో జనగనమణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి: Vijay Devarakonda-Samantha: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! -
'ఖుషి' టైటిల్‌తో వస్తున్న విజయ్, సామ్
VD11 First Look: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇదే డైరెక్టర్‌తో కలిసి జనగనమణ మూవీ చేయనున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇందులో సమంత అతడితో జోడీ కట్టింది. సోమవారం ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్‌డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. విజయ్, సమంతల మూవీకి ఖుషి టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇందులో విజయ్ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. An explosion of Happiness, laughter, Love and family bonding ❤️#Kushi - Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release Spread the joy this Christmas, New Years 😍@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I — Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం ఒకరి విప్లవం మరొకరికి ఉగ్రవాదం.. అదిరిన 'విక్రమ్' ట్రైలర్ -
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
ఈ డాన్ ప్రత్యేకం
అక్రమ్ సురేష్ హీరోగా, ఢిల్లీ బ్యూటీ ఖుషీ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘అక్రమ్’. సురేష్ మేడిది దర్శకత్వంలో అమరావతి మూవీస్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ మాస్ యాక్షన్ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అక్రమ్ సురేష్ పుట్టినరోజు సందర్భంగా ‘రాణా’ పాత్ర లుక్‌ని నటుడు సుమన్ లాంచ్ చేశారు. సురేష్ మేడిది మాట్లాడుతూ– ‘‘డాన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రాక్, రాణా, అక్రమ్, రాణా ప్రతాప్‌సింగ్ అనే నాలుగు పాత్రల్లో హీరో కనిపిస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అందరికీ నచ్చే చిత్రమిది. మోస్ట్ స్టైలిష్ యాక్షన్ సినిమా. డాన్ల సినిమాల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. భారీ సెట్లో చిత్రీకరించిన ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్. ఓ షెడ్యూల్, 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజర్‌ని రిలీజ్ చేస్తాం. సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటిగారు అక్కినేనికి ‘నటసామ్రాట్’ బిరుదును ఇచ్చారు. ఈ చిత్రంలో అక్రమ్ సురేష్ గెటప్ చూసి ‘టాలీవుడ్ తలైవా’ అనే బిరుదును ఇచ్చారు’’ అన్నారు. చిత్ర సమర్పకుడు విస్సా కోటి, శివకుమార్ పాల్గొన్నారు. పోసాని కృష్ణమురళి, సుమన్, లిపికా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.యు.సాయి, కెమెరా: అనీల్. -
స్క్రీన్ టెస్ట్
♦ ‘తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది..’ పాట రచయిత ఎవరు? ఎ) వేటూరి బి) భువనచంద్ర సి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) సి.నారాయణరెడ్డి ♦ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించిన చిరంజీవి సినిమా ఏది? ఎ) స్టాలిన్ బి) శంకర్‌దాదా ఎంబీబీఎస్ సి) ఠాగూర్ డి) శంకర్‌దాదా జిందాబాద్ ♦ మీరు గుడుంబా సత్తిగారు కావొచ్చు.. తొక్కలో సత్తిగారు కావొచ్చు..ఐ డోంట్ కేర్.. బట్ ఐ యామ్ సిద్ధు.. సిద్ధార్థ రాయ్’.. పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఎ) తొలిప్రేమ బి) ఖుషి సి) సుస్వాగతం డి) అన్నవరం ♦ తండ్రుల తర్వాత కొడుకు పక్కన నటించిన హీరోయిన్లున్నారు. కానీ, కొడుకుతో మూడు సినిమాల్లో నటించిన తర్వాత తండ్రితో జోడీ కట్టిన ఈ తరం హీరోయిన్? ఎ) అనుష్క బి) కాజల్ అగర్వాల్ సి) లావణ్యా త్రిపాఠి డి) సమంత ♦ జూనియర్ ఎన్టీఆర్‌ను రెండు పాత్రల్లో చూపించిన తొలి దర్శకుడు ఎవరు? ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) బి.గోపాల్ ♦ అంధురాలిగా నటించి, నంది అవార్డు అందుకున్న కథానాయిక ఎవరు? ఎ) మధుశాలిని బి) లయ సి) వేద డి) శ్రీదివ్య ♦ చేతిలో ఫోనుతో ఓర చూపు చూస్తున్న ఈ అమ్మాయి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇంతకీ ఎవరామె? ఎ) రంభ బి) రమ్యకృష్ణ సి) సుహాసిని డి) మీనా ♦ హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా యూ టర్న్ తీసుకుని, తిరిగి హీరోగా సెటిల్ అయిన నటుడు ఎ) శ్రీకాంత్ బి) గోపీచంద్ సి) రవితేజ డి) నవదీప్ ♦ తండ్రి చిరంజీవి సూపర్‌హిట్ పాటల్లో ఒకటైన ‘వాన.. వాన.. వెల్లువాయె..’ రీమిక్స్ సాంగ్‌లో కొడుకు రామ్‌చరణ్‌తో ఆడిపాడిన హీరోయిన్? ఎ) సమంత బి) కాజల్ అగర్వాల్ సి) తమన్నా డి) రకుల్ ప్రీత్‌సింగ్ ♦ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను తెలుగులో యువరాణిగా చూపించిన దర్శకుడు ఎ) జయంత్ సి.పరాన్జీ బి) కె.విజయ భాస్కర్ సి) రామ్‌గోపాల్ వర్మ డి) త్రివిక్రమ్ ♦ బాలకృష్ణ తొడకొడితే రైలు వెనక్కి వెళ్లే సీన్ ఏ సినిమాలోనిది? ఎ) నరసింహనాయుడు బి) సమర సింహారెడ్డి సి) సీమ సింహం డి) పలనాటి బ్రహ్మనాయుడు ♦ ప్రభాస్ సినిమాకి టైటిల్‌గా పెట్టిన నందమూరి తారక రామారావు సినిమా ఏది? ఎ) అడవి రాముడు బి) బొబ్బిలిపులి సి) యమగోల డి) ఏదీ లేదు ♦ ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’... ఈ డైలాగ్ రాసిన రచయిత? ఎ) చిన్నికృష్ణ బి) కోన వెంకట్ సి) పూరి జగన్నాథ్ డి) పరుచూరి బ్రదర్స్ ♦ అనుష్క తొలిసారి వేశ్య పాత్రలో నటించిన తెలుగు సినిమా? ఎ) అరుంధతి బి) వేదం డి) పంచాక్షరి డి) నాగవల్లి ♦ కాలేజీ క్యాంపస్‌లో సైకిల్ చైన్ తెంపి హీరోయిజం చూపించి ట్రెండ్ సెట్ చేసిన కథానాయకుడు? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) బాలకృష్ణ ♦ హీరోయిన్ చార్మి ఇప్పటి వరకూ తన కెరీర్లో ఏ సినిమాకి నంది అవార్డు అందుకున్నారు? ఎ) సుందరకాండ బి) రాఖీ సి) మంత్ర డి) చిన్నోడు ♦ రవితేజ లేటు వయసులో యూనిఫామ్‌తో స్కూల్‌కి వెళ్లి పదో తరగతి చదివే సినిమాలో టీచర్‌గా పని చేసే హీరోయిన్? ఎ) దీక్షాసేథ్ బి) నయనతార సి) త్రిష డి) ఇలియానా ♦ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలసి నటించిన ‘మనం’ చిత్రంలోని ‘కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’ సింగర్? ఎ) అనూప్ రూబెన్స్ బి) మాస్టర్ భరత్ కోరస్ సి) హేమచంద్ర డి) కారుణ్య ♦ ఈ స్టిల్ ఏ సినిమాలోది? ఎ) దానవీరశూరకర్ణ బి) శ్రీకృష్ణపాండవీయం సి) మాయాబజార్ డి) నర్తనశాల ♦ తెరపై ఫ్రేమ్ కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ టెక్నాలజీ వాడతారు.. అదేంటో తెలుసా? ఎ) వీఎఫ్ఎక్స్ బి) డీఐ సి) గ్రీన్ మాట్ డి) సీజీ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) బి 4) బి5) సి 6) బి 7) డి 8) బి 9) సి 10) బి 11) డి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) సి 17) డి 18) బి19) ఎ 20) బి -
చాంపియన్స్ రుతిక్, ఖుషి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్షిక ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో జియాన్ స్పోర్ట్స్ స్విమ్మర్లు రుతిక్ రెడ్డి, ఖుషి బన్సల్ సత్తా చాటారు. సికింద్రాబాద్‌లోని గురుమూర్తి స్విమ్మింగ్‌పూల్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన 15 ఏళ్లు పైబడిన బాలుర ఫ్రీస్టయిల్ ఈవెంట్‌ను రుతిక్ రెడ్డి ఒక నిమిషం 01.33సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలవగా, వై. హేమంత్ రెడ్డి (1:02:75 సె.), సమీర్ తోమర్ (1:08:32 సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో ఖుషి ఈవెంట్‌ను నిమిషం 17:51 సెకన్లలో పూర్తిచేసి తొలి స్థానాన్ని సాధించింది. తేజస్వి పీటర్ (1:41:04 సె.), అభిజిత (1:43:66 సె.) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. వాకింగ్, జిమ్‌తో పాటు స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పల తరుణి, ఆకుల రూప, అడిషనల్ స్పోర్ట్స్ కమిషనర్ అర్జిత్ కుమార్ సింగ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ విజయ్‌రాజ్, డీఎంసీ శైలజ, స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్‌రాజ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉమేష్, ఈఈ సురేష్, స్విమ్మింగ్‌ఫూల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెడలిస్ట్ విభాగం విజేతల వివరాలు అండర్–8 బ్రెస్ట్‌స్ట్రోక్ బాలురు: 1. అభయ్ (సిల్వర్ ఓక్స్), 2 యశస్వ (జియాన్ స్పోర్ట్స్), 3. వేద్ కార్తీక్; బాలికలు: 1. లోహిత (ఎల్బీ స్టేడియం) అండర్–10 బాలుర బ్యాక్‌స్ట్రోక్: 1. కె. మనీశ్ (జీహెచ్ఎంసీ), 2. రాహుల్ (శాంతినికేతన్), 3. ఎం. నిశాంత్ (ఎల్బీ స్టేడియం); బాలికలు: 1. డి. సిరి, 2. ప్రహర్షిత (బీఎస్ఆర్కేవీ). అండర్–12 బాలుర బటర్‌ఫ్లయ్: 1. జగదీశ్ వర్మ (సరూర్‌నగర్), 2. వైభవ్ బాలాజీ (బ్లూ డాల్ఫిన్), 3. ధీరజ్ (జియాన్ స్పోర్ట్స్); బాలికలు: 1. జి. కశ్యపి (షార్క్స్ ప్రొ), 2. ఆస్థా (ఆర్ఆర్సీ), 3. ఉరిధి (జియాన్ స్పోర్ట్స్). అండర్–14 బాలుర బటర్‌ఫ్లయ్: 1. కె. సాయి అభిషేక్ (జియాన్ స్పోర్ట్స్), 2. వై. జశ్వంత్ రెడ్డి, 3. బి. నిహార్ (జియాన్ స్పోర్ట్స్); బాలికలు: 1. జి. హంసిని (జియాన్ స్పోర్ట్స్), 2. నందన (బ్లూ డాల్ఫిన్). నాన్ మెడలిస్ట్ విభాగం విజేతల వివరాలు అండర్–8 బాలురు: 1. సుశాంత్ దేశాయ్ (ఎల్బీ స్టేడియం), 2. చాణక్య (బ్లూ డాల్ఫిన్), 3. తేజస్ (హెచ్‌పీఎస్ కిడ్స్); బాలికలు: 1. వినీల (బ్లూ డాల్ఫిన్), 2. దిత్యా చౌదరి (హెచ్‌పీఎస్), 3. సాయి ప్రజ్ఞ (జియాన్ స్పోర్ట్స్). అండర్–10 బాలురు: 1. బి. అభినవ్, 2. డి. వర్షిత్ (జియాన్ స్పోర్ట్స్), 3. ఆదిత్య; బాలికలు: 1. ప్రీతి (షార్క్ ప్రొ), 2. ధ్రుతి (ఎల్బీ స్టేడియం), 3. శ్రీయ. అండర్–12 బాలురు: 1. గుణవంత్ రెడ్డి (సిల్వర్ ఓక్స్), 2. ధ్రువ్ (షార్క్ ప్రొ), 3. తనుశ్ (సెయింట్ పీటర్స్); బాలికలు: 1. సొహిని సిన్హా (మెరిడియన్ స్కూల్), 2. నందిని (డాల్ఫిన్), 3. ఆద్య (గ్లెండాల్ అకాడమీ). -
ఖుషి హీరోకి గ్రీన్ సిగ్నల్!
‘ఖుషి’ అనగానే పవన్ కల్యాణ్, భూమిక గుర్తొచ్చారా? వారిద్దరూ మరోసారి సందడి చేస్తే చూడ్డానికి బాగుంటుం దని సంబరపడిపో తున్నారా? అయితే మేము చెబుతున్నది తమిళ ‘ఖుషి’ జంట విజయ్, జ్యోతిక గురించి. ఈ ఇద్దరూ జంటగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏయం. రత్నం నిర్మించిన తమిళ ‘ఖుషి’ పదహారేళ్ళ క్రితం 2000లో విడుదలైంది. ఆ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ కల్యాణ్, భూమిక జంటగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేశారు రత్నం. ఆ సంగతి అలా ఉంచితే... ‘ఖుషి’ తర్వాత విజయ్–జ్యోతిక ‘తిరుమలై’ అనే చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రం విడుదలై పధ్నాలుగేళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఇద్దరూ కలసి సినిమా చేయలేదు. ఇప్పుడు ఒక సినిమాలో నటించనున్నారని భోగట్టా. అయితే జంటగా కాదు. విజయ్ హీరోగా అట్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కాజల్, సమంత కథానాయికలనీ... ముఖ్యపాత్రలో జ్యోతిక నటించనున్నారనీ టాక్. -
మరోసారి ఖుషీ ఖుషీగా...
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు ఎస్‌జె సూర్య కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో ‘కొమరం పులి’ వంటి డిఫరెంట్ చిత్రం వచ్చింది. 2001 ఏప్రిల్ 27న ‘ఖుషి’ విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత, ‘ఖుషి’ విడుదలైన రోజునే వీరి కాంబినేషన్లో మూడో సినిమా ప్రారంభమైంది. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా హైదరాబాద్‌లోని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో బుధవారం ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిపారు. ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్ గౌతమ్‌రాజు కెమేరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు ఎస్‌జె సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారాయన. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. ‘బిల్లా’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలకు పనిచేసిన సౌందర్ రాజన్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫ్యాక్షన్ లీడర్ లవ్‌స్టోరీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ జూన్‌లో ప్రారంభించనున్నాం. హీరోయిన్, చిత్రం టైటిల్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని తెలిపారు. -
బోరుబావిలో పడిన చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సైన్యం, అధికారులు తీవ్రంగా శ్రమించి చిన్నారి ఖుషిని బయటకి తీసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోజు ఉదయం చిన్నారి ఖుషి నవాబ్‌జంగ్ ప్రాంతంలోని 25 అడుగుల లోతున్న బోరుబావిలో పడింది. తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతున్న సమయంలో చిన్నారి బోరుబావిలో పడింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం ఘటనాస్థలికి చేరుకుని కొన్ని గంటలపాటు శ్రమించి చిన్నారి బయటకు తీసుకురాగలిగారు. కానీ, ఆసుపత్రికి రాకముందే చిన్నారి మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రిస్క్ చేస్తున్న పవర్‌స్టార్
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబందం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ ఇప్పుడో భారీ రిస్క్ చేస్తున్నాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన హిట్‌తో పాటు అదే స్ధాయిలో భారీ ప్లాప్ కూడా ఇచ్చిన ఓ దర్శకుడితో మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ను యూత్ ఆడియన్స్‌కు దగ్గర చేసిన సక్సెస్ఫుల్ సినిమా ఖుషి. ఈ సినిమాతో ఒక్కసారిగా టాప్ స్టార్స్ లిస్ట్‌లో చేరిపోయిన పవన్, ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ ఒక్క సక్సెస్, ఆ తరువాత పవన్ పదేళ్ల పాటు హిట్ ఇవ్వలేకపోయినా అతడి స్టార్ ఇమేజ్ను కాపాడింది. ఈ సినిమాకు దర్శకుడు ఎస్ జె సూర్య. ఖుషి లాంటి సినిమా ఇచ్చాడన్న నమ్మకంతో సూర్యతో కలిసి కొమరం పులి సినిమా చేశాడు పవన్. అయితే ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అంతేకాదు అలాంటి కథ ఎంచుకున్నందుకు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోన్నాడు. ఇప్పుడు మరోసారి అదే రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం గబ్బర్‌సింగ్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలోనటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమా తరువాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను రేణుదేశాయ్ నిర్మించే అవకాశం ఉందన్న టాక్ వినిపించినా ఫైనల్‌గా పవన్ స్నేహితుడు శరత్ మరార్ చేతికే వెళ్లింది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
రికార్డుల రాణి.. రెండేళ్ల ఖుషీ
మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఈ వండర్ కిడ్ వయసు రెండేళ్లు. అయితేనేం తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో శ్లోకాలు, పద్యాలు, ఆండ్రాయిడ్ ఫోన్లో పజిల్స్ పరిష్కరించడం, బొమ్మలను జత చేయడం, వివిధ రకాల జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, రంగులను గుర్తించడం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో అంకెలను గుర్తించడం, జంతువుల అరుపులు చెప్పడం, వివిధ రకాల వాహనాలు, వంట సామగ్రి, జామెట్రీ వస్తువులు, శరీర భాగాలను గుర్తించడం, నవ్వడం, ఏడవడంతోపాటు అనుకరించడం వంటి వాటిలో ఖుషీ విశేష ప్రతిభను చాటుతోంది. సానా గిరీశ్‌కుమార్, సుధతి దంపతుల కూతురు ఖుషీ(2) తన అసాధారణ ప్రతిభతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థల నుంచి చైల్డ్ ప్రోడ్జి బిరుదు అందుకుంది. ఆదివారం మంచిర్యాలలో ఖుషీ రికార్డులను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ భారత సమన్వయకర్త బింగి నరేందర్‌గౌడ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయకర్త జి.స్వర్ణశ్రీ పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఖుషీకి రికార్డులు ప్రకటించారు. రికార్డుల బ్యాడ్జిలు, పతకాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
అలా ఏలా మూవీ పోస్టర్స్
-
అలా ఏలా మూవీ స్టిల్స్
-
గాల్లో తేలినట్టుందే మూవీ వర్కింగ్ స్టిల్స్
-
గాల్లో తేలినట్టుందే మూవీ పోస్టర్స్
-
పీక్కోవడమంటే శ్రీదేవికి పరమ చికాకు!
పిల్లలు తండ్రిని ముద్దుగా 'పప్పా' అని పిలుచుకోవడం సర్వ సాధారణం. దాదాపు అందరి ఇళ్లలో అలా పిలుచుకోవడం సహజమే.. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఇంట్లో కూడా ఆయన పిల్లలు జాహ్నవి, ఖుషీలు అలానే పిలుచుకుంటారు. ఇందులో ప్రత్యేకత ఏమి లేదు.. అయితే ఉన్న ప్రత్యేక అంతా బోని కపూర్ ను ఆయన భార్య, ఒకనాడు బాలీవుడ్ పై వెలుగు వెలిగిన అందాల తార శ్రీదేవి కూడా 'పప్పా' అని పిలుస్తుందంటా! శ్రీదేవి పప్పా అని పిలుచుకుని బోని ఏ పని చేసిన సహింస్తుందటా.. కాని ఒక పని చేస్తే అసలు శ్రీదేవికి ఎక్కడ లేని చిరాకేస్తుందట!. ఇంతకి అందాల తార శ్రీదేవిని బోని చిరాకు పరిచే విషయమేమిటనగా.. ఇప్పటికే జుట్టూ ఊడి పోయి అసలే బట్టతలతో కనిపించే బోని కపూర్.. వీలు చిక్కినప్పుడల్లా.. ఉన్ననాలుగు వెంట్రకల్ని కూడా పీక్కోవడం శ్రీదేవికి అసలే నచ్చదట. దాంతో వెంట్రకలు పీక్కోవడం ఆపు.. అలా పీక్కోవడం కొనసాగిస్తే.. తల మీద ఒక్క వెంట్రుక కూడా మిగలదు అని అరవడం శ్రీదేవి వంతు అవుతుందని కపూర్ కుటుంబంలోని సభ్యుడు వెల్లడించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం. -
35వ వసంతంలోకి భూమిక చావ్లా
టాలీవుడ్ హీరో సుమంత్ సరసన యువకుడు చిత్రం ద్వారా 2000 సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన భూమిక చావ్లా గురువారం ఆగస్టు 21 తేదిన 35వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. భూమిక చావ్లా అసలు పేరు రచన చావ్లా. కొద్దికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ, భోజ్ పూరి, మలయాళ, పంజాబీ చిత్రాల్లో 30కి పైగా చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో ఖుషీ, సల్మాన్ ఖాన్ తో తేరేనామ్, అభిషేక్ బచ్చన్ తో రన్, మహేశ్ బాబుతో ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి, రవితేజతో నా ఆటోగ్రాఫ్, చిరంజీవితో జై చిరంజీవ, మిస్సమ్మ, గాంధీ మై ఫాదర్, సత్యభామ, అనసూయ తదితర చిత్రాల్లో భూమిక నటన విమర్శల ప్రశంసలందుకుంది. కెరీర్ గ్రాఫ్ టాప్ రేంజ్ లో సాగుతుండగానే యోగ గురువు భరత్ ఠాకూర్ ను 21 అక్టోబర్ 2007 సంవత్సరంలో నాసిక్ లోని దేవ్‌లాలీలోని ఓ గురుద్వారాలో పెళ్లాడింది. ఆ తర్వాత తకిట తకిట చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. తమిళ చిత్రం కలవాడియా పోజుదుగల్ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, తెలుగులో అలివేలు మంగ, ఏప్రిల్ ఫూల్, మలయాళంలో రాత్రిమజా, తమిళంలో చితిరాయిల్ నీల సొరూ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.