కశ్మీర్‌ టు హైదరాబాద్‌ | Vijaydevarakonda khushi released on 23 dec 2022 | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ టు హైదరాబాద్‌

Published Tue, May 24 2022 5:58 AM | Last Updated on Tue, May 24 2022 5:59 AM

Vijaydevarakonda khushi released on 23 dec 2022 - Sakshi

‘వెన్నెల’ కిశోర్, విజయ్‌ దేవరకొండ

కశ్మీర్‌లో ‘ఖుషి’ పూర్తయింది. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. వై. రవిశంకర్, నవీన్‌ ఎర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత నెల 23న కశ్మీర్‌లో మొదలైన ‘ఖుషి’ తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

‘‘కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నాం. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లొకేషన్స్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. డిసెంబరు 23న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement