Samantha Shocking Reaction To Netizen Who Commented On Her Death, Details Inside - Sakshi
Sakshi News home page

Samantha: తను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్‌, దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సామ్‌..

Published Fri, May 27 2022 3:10 PM | Last Updated on Fri, May 27 2022 4:07 PM

Samantha Epic Reply To Netizens Who Commented On Her Death - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ పక్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. మరోపక్క సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యా​క్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తూ మోటివేషనల్‌ కొటేషన్స్‌ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్‌కు తన పెట్స్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంటూ మురిసిపోతుంది. తాజాగా వాటితో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది సమంత. ఇది చూసిన ఓ నెటిజన్‌ సామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అంటూ కామెంట్‌ పెట్టాడు.

చదవండి: బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ విన్నర్‌ బిందు మాధవి!

ఇది చూసిన సామ్‌ వెంటనే అతడి కామెంట్స్‌పై స్పందించింది. ‘అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్‌, ఫాలోవర్ష్‌ సదరు నెటిజన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అతడు తన కామెంట్‌ను డిలిట్‌ చేశాడు. అయినప్పటికి కొందరు దానికి స్క్రీన్‌ షాట్‌ తీసి రీట్వీట్‌ చేస్తున్నారు. అతడు సటైరికల్‌గా కామెంట్‌ చేసినప్పటికీ తను మాత్రం పాజిటివ్‌గా రిప్లై ఇచ్చిందంటూ సమంతపై నెటిజ​న్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం ఖుషి, యశోద చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. 

చదవండి: కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement