స్క్రీన్ టెస్ట్
♦ ‘తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది..’ పాట రచయిత ఎవరు?
ఎ) వేటూరి బి) భువనచంద్ర సి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) సి.నారాయణరెడ్డి
♦ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించిన చిరంజీవి సినిమా ఏది?
ఎ) స్టాలిన్ బి) శంకర్‌దాదా ఎంబీబీఎస్ సి) ఠాగూర్ డి) శంకర్‌దాదా జిందాబాద్
♦ మీరు గుడుంబా సత్తిగారు కావొచ్చు.. తొక్కలో సత్తిగారు కావొచ్చు..ఐ డోంట్ కేర్.. బట్ ఐ యామ్ సిద్ధు.. సిద్ధార్థ రాయ్’.. పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది?
ఎ) తొలిప్రేమ బి) ఖుషి సి) సుస్వాగతం డి) అన్నవరం
♦ తండ్రుల తర్వాత కొడుకు పక్కన నటించిన హీరోయిన్లున్నారు. కానీ, కొడుకుతో మూడు సినిమాల్లో నటించిన తర్వాత తండ్రితో జోడీ కట్టిన ఈ తరం హీరోయిన్?
ఎ) అనుష్క బి) కాజల్ అగర్వాల్ సి) లావణ్యా త్రిపాఠి డి) సమంత
♦ జూనియర్ ఎన్టీఆర్‌ను రెండు పాత్రల్లో చూపించిన తొలి దర్శకుడు ఎవరు?
ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) బి.గోపాల్
♦ అంధురాలిగా నటించి, నంది అవార్డు అందుకున్న కథానాయిక ఎవరు?
ఎ) మధుశాలిని బి) లయ సి) వేద డి) శ్రీదివ్య
♦ చేతిలో ఫోనుతో ఓర చూపు చూస్తున్న ఈ అమ్మాయి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇంతకీ ఎవరామె?
ఎ) రంభ బి) రమ్యకృష్ణ సి) సుహాసిని డి) మీనా
♦ హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా యూ టర్న్ తీసుకుని, తిరిగి హీరోగా సెటిల్ అయిన నటుడు
ఎ) శ్రీకాంత్ బి) గోపీచంద్ సి) రవితేజ డి) నవదీప్
♦ తండ్రి చిరంజీవి సూపర్‌హిట్ పాటల్లో ఒకటైన ‘వాన.. వాన.. వెల్లువాయె..’ రీమిక్స్ సాంగ్‌లో కొడుకు రామ్‌చరణ్‌తో ఆడిపాడిన హీరోయిన్?
ఎ) సమంత బి) కాజల్ అగర్వాల్ సి) తమన్నా డి) రకుల్ ప్రీత్‌సింగ్
♦ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను తెలుగులో యువరాణిగా చూపించిన దర్శకుడు
ఎ) జయంత్ సి.పరాన్జీ బి) కె.విజయ భాస్కర్ సి) రామ్‌గోపాల్ వర్మ డి) త్రివిక్రమ్
♦ బాలకృష్ణ తొడకొడితే రైలు వెనక్కి వెళ్లే సీన్ ఏ సినిమాలోనిది?
ఎ) నరసింహనాయుడు బి) సమర సింహారెడ్డి సి) సీమ సింహం డి) పలనాటి బ్రహ్మనాయుడు
♦ ప్రభాస్ సినిమాకి టైటిల్‌గా పెట్టిన నందమూరి తారక రామారావు సినిమా ఏది?
ఎ) అడవి రాముడు బి) బొబ్బిలిపులి సి) యమగోల డి) ఏదీ లేదు
♦ ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’... ఈ డైలాగ్ రాసిన రచయిత?
ఎ) చిన్నికృష్ణ బి) కోన వెంకట్ సి) పూరి జగన్నాథ్ డి) పరుచూరి బ్రదర్స్
♦ అనుష్క తొలిసారి వేశ్య పాత్రలో నటించిన తెలుగు సినిమా?
ఎ) అరుంధతి బి) వేదం డి) పంచాక్షరి డి) నాగవల్లి
♦ కాలేజీ క్యాంపస్‌లో సైకిల్ చైన్ తెంపి హీరోయిజం చూపించి ట్రెండ్ సెట్ చేసిన కథానాయకుడు?
ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) బాలకృష్ణ
♦ హీరోయిన్ చార్మి ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఏ సినిమాకి నంది అవార్డు అందుకున్నారు?
ఎ) సుందరకాండ బి) రాఖీ సి) మంత్ర డి) చిన్నోడు
♦ రవితేజ లేటు వయసులో యూనిఫామ్‌తో స్కూల్‌కి వెళ్లి పదో తరగతి చదివే సినిమాలో టీచర్‌గా పని చేసే హీరోయిన్?
ఎ) దీక్షాసేథ్ బి) నయనతార సి) త్రిష డి) ఇలియానా
♦ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలసి నటించిన ‘మనం’ చిత్రంలోని ‘కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’ సింగర్?
ఎ) అనూప్ రూబెన్స్ బి) మాస్టర్ భరత్ కోరస్ సి) హేమచంద్ర డి) కారుణ్య
♦ ఈ స్టిల్ ఏ సినిమాలోది?
ఎ) దానవీరశూరకర్ణ బి) శ్రీకృష్ణపాండవీయం సి) మాయాబజార్ డి) నర్తనశాల
♦ తెరపై ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే ఈ టెక్నాలజీ వాడతారు.. అదేంటో తెలుసా?
ఎ) వీఎఫ్‌ఎక్స్ బి) డీఐ సి) గ్రీన్ మాట్ డి) సీజీ
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) డి 2) సి 3) బి 4) బి5) సి 6) బి 7) డి 8) బి 9) సి 10) బి 11) డి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) సి 17) డి 18) బి19) ఎ 20) బి