స్క్రీన్‌ టెస్ట్‌ | Screen Test movie quiz | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, May 23 2017 1:04 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

స్క్రీన్‌ టెస్ట్‌ - Sakshi

స్క్రీన్‌ టెస్ట్‌

1 పవన్‌కల్యాణ్‌ ‘ఖుషి’, మహేశ్‌బాబు ‘ఒక్కడు’, ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’... ఈ మూడూ ఈ హీరోల కెరీర్‌లో 7వ సినిమా. ఈ మూడు సినిమాల మధ్య మరో కామన్‌ థింగ్‌ ఉంది! అదేంటో తెలుసా?
ఎ) సంగీత దర్శకుడు ఒక్కరే
బి) హీరోయిన్‌ ఒక్కరే
సి) విడుదలైన ఏడాది ఒక్కటే
డి) మాటల రచయిత ఒక్కరే

2 హీరో నాని సహాయ దర్శకుడిగా చేసినప్పుడు ఒక్క హీరోకే కథ చెప్పారు. టాలీవుడ్‌ బెస్ట్‌ డ్యాన్సర్లలో ఒకరైన ఆ యంగ్‌ హీరో ఎవరో తెలుసా?
ఎ) ఎన్టీఆర్‌    బి) రామ్‌చరణ్‌
సి) అల్లు అర్జున్‌  
డి) రామ్‌

3 రజనీకాంత్‌ అభిమానిగా ప్రభాస్‌ నటించిన సినిమా పేరు?
ఎ) డార్లింగ్‌ బి) ఏక్‌ నిరంజన్‌
సి) మున్నా
డి) బుజ్జిగాడు

4 దాదాపుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన సినిమాలకు ఆయనే మాటలు రాశారు. కానీ, ‘శివమణి, ఆంధ్రావాలా’ చిత్రాలకు ఓ ప్రముఖ రచయిత మాటలు రాశారు. ఆయనెవరు?
ఎ) సాయిమాధవ్‌ బుర్రా
బి) కోన వెంకట్‌
సి) ఆకుల శివ
డి) వేమారెడ్డి

5 ఓ పాటలో రవితేజ, అల్లు అర్జున్‌ అతిథులుగా కనిపించిన చిరంజీవి సినిమా పేరు?
ఎ) డాడీ బి) శంకర్‌దాదా
ఎంబీబీఎస్‌
సి) శంకర్‌దాదా జిందాబాద్‌ డి) ఖైదీ నంబర్‌ 150

6 బాలకృష్ణ తాతయ్యగా, తండ్రిగా, కొడుకుగా త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సినిమా?
ఎ) చెన్నకేశవరెడ్డి
బి) ఒక్క మగాడు
సి) లెజెండ్‌
డి) అధినాయకుడు

7 ‘రావుగారూ... నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి’ అని బ్రహ్మానందం నవ్వించిన సినిమా?
ఎ) రెడీ బి) ఢీ
సి) అదుర్స్‌
డి) దేనికైనా రెడీ

8 ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేరులో ‘ఎస్‌.ఎస్‌.’ అంటే ఏంటో తెలుసా?
ఎ) శివశ్రీ
బి) సక్సెస్‌ అండ్‌ సక్సెస్‌
సి) శ్రీశైల శ్రీ
డి) సత్యశివ

9 తమన్నాకు ఏ సినిమాతో బ్రేక్‌ వచ్చింది?
ఎ) హ్యాపీడేస్‌
బి) 100% లవ్‌
సి) రచ్చ డి) ఆవారా

10 అమితాబ్‌ బచ్చన్‌ అతిథిగా నటించిన తెలుగు సినిమా?
ఎ) దృశ్యం
బి) ఇజం
సి) నిజం
డి) మనం

11 ‘శ్రీమంతుడు’లోని మామిడి తోట ఫైట్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ (ఫైట్‌ మాస్టర్‌) ఎవరు?
ఎ) పీటర్‌ హెయిన్స్‌
బి) రామ్‌–లక్ష్మణ్‌
సి) అణల్‌ అరసు
డి) సెల్వ

12 ‘రేసు గుర్రం’లోని ‘సినిమా చూపిస్త మావ’ పాటకు డ్యాన్స్‌ మాస్టర్‌ ఎవరో తెలుసా?
ఎ) జానీ     బి) శేఖర్‌
సి) రఘు
డి) రాజు సుందరం

13 లిటిల్‌ హార్ట్స్‌ బిస్కెట్‌ ప్యాకెట్‌తో హీరోయిన్‌కి తన ప్రేమను ప్రపోజ్‌ చేయడానికి వెంకటేశ్‌ వెయిట్‌ చేసిన సీన్‌ ఏ సినిమాలోనిది?
ఎ) ప్రేమంటే ఇదేరా
బి) ప్రేమించుకుందాం రా
సి) కలిసుందాం రా
డి) ప్రేమతో రా

14 విజయశాంతికి మేకప్‌మ్యాన్‌గా పనిచేసి, తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్‌హిట్‌ సినిమాలు తీసిన నిర్మాత ఎవరు?
ఎ) ఏ.యం. రత్నం బి) బొమ్మదేవర రామచంద్రరావు
సి) పీతాంబరం
డి) రాము

15 హీరోయిన్‌ కాకముందు త్రిష
ఈ టైటిల్‌ విన్నర్‌.
ఎ) మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌
బి) మిస్‌ ఇండియా
సి) మిస్‌ హైదరాబాద్‌
డి) మిస్‌ మద్రాస్‌

16 రాశీఖన్నా ఏ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ పాడారు?
ఎ) సుప్రీమ్‌  బి) హైపర్‌
సి) జోరు
డి) బెంగాల్‌ టైగర్‌

17 సుమారు 30 ఏళ్ల తర్వాత శ్రీదేవి చేసిన సౌతిండియన్‌ సినిమా?
ఎ) పులి
బి) ఇంగ్లీష్‌ వింగ్లీష్‌
సి) మామ్‌
డి) ఉత్తమ విలన్‌

18 ఈ సీనియర్‌ నటి పేరు తమ పిల్లలకు పెట్టాలంటే తల్లిదండ్రులకు హడల్‌!
ఎ) ఛాయాదేవి
బి) సూర్యకాంతం
సి) ఎస్‌. వరలక్ష్మి
డి) కన్నాంబ

19 ఈ ఫొటోలోని ఇప్పటి స్టార్, యంగ్‌ హీరోయిన్‌ ఎవరు?
ఎ) హన్సిక  
బి) తమన్నా
సి) శ్రియ  డి) ఖుష్బు

20 ఈ స్టిల్‌
ఏ సినిమాలోనిది?
ఎ) పల్నాటి పౌరుషం
బి) పల్నాటి సింహం
సి) అల్లూరి సీతారామరాజు
డి) రుద్రమనాయుడు
 

సమాధానాలు
1) బి 2) సి 3) డి
4) బి 5) సి 6) డి
7) బి  8) సి 9) ఎ
10) డి 11) సి
12) ఎ 13) బి
14) ఎ 15) డి
16) సి 17) ఎ
18) బి 19) ఎ
20) బి
 

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement