స్క్రీన్ టెస్ట్
వర్మ ఏ ఊరిలో జన్మించారు?
ఎ) భీమవరం
బి) విజయవాడ
సి) హైదరాబాద్
డి) రాజమండ్రి
వర్మ తండ్రి కృష్ణంరాజు వర్మ చిత్ర పరిశ్రమలోని ఏ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు?
ఎ) కెమేరా బి) ఆర్ట్
సి) సౌండ్ రికార్డింగ్
డి) డ్యాన్స్
దర్శకుడు కాకకుందు వర్మ ఓ హోటల్ సైట్ ఇంజినీర్‌గా పనిచేశారు. అప్పుడాయన అందుకున్న జీతం ఎంత?
ఎ) 500 బి) 800
సి) 1200 డి) 1500
మీడియా వార్‌పై వర్మ తీసిన హిందీ సినిమా మీకు తెలుసా?
ఎ) రణ్ బి) సర్కార్ రాజ్
సి) డిపార్ట్‌మెంట్
డి) కంపెనీ
ఏ రాజకీయ నాయకుడు వర్మకు క్లాస్‌మేట్?
ఎ) దేవినేని ఉమ
బి) లగడపాటి రాజగోపాల్
సి) కేశినేని నాని
డి) దేవినేని రాజశేఖర్
కథానాయికలలో వర్మ ఆరాధ్య దేవత?
ఎ) ఊర్మిళ బి) జయసుధ సి) మధుబాల డి) శ్రీదేవి
పవన్‌కల్యాణ్‌తో ఓ సినిమా నిర్మించాలనుకుని, చివరకు అదే కథతో జేడీ చక్రవర్తి హీరోగా వర్మ నిర్మించిన సినిమా ?
ఎ) మనీ బి) గులాబీ
సి) వైఫ్ ఆఫ్ వరప్రసాద్
డి) మనీ మనీ
శృంగారతార సిల్క్ స్మిత వర్మ తీసిన ఓ సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) గోవిందా గోవింద
బి) అంతం
సి) గాయం డి) దెయ్యం
ఏ సినిమాతో వర్మ నిర్మాతగా మారారు?
ఎ) గులాబీ బి) రాత్
సి) మనీ డి) సత్య
వర్మ దర్శకత్వంలో హీరోగా పరిచయమైన ప్రముఖ హీరో మేనల్లుడు ఎవరు?
ఎ) నాగచైతన్య బి) సాయిధరమ్ తేజ్
సి) సుమంత్ డి) సుశాంత్
వర్మ నిర్మించిన ఏ హిందీ సినిమాకు ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ హిందీ’గా నేషనల్ అవార్డు వచ్చింది?
ఎ) దిల్‌సే బి) శూల్
సి) జేమ్స్
డి) అబ్ తక్ చప్పన్
ఉత్తమ దర్శకుడిగా వర్మ ఎన్ని నంది అవార్డులు అందుకున్నారు?
ఎ) రెండు బి) మూడు
సి) నాలుగు డి) ఐదు
వర్మ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్?
ఎ) ఊర్మిళ బి) ఆంత్ర మాలి
సి) నిషా కొఠారి డి) రేవతి
వర్మంటే ఎక్కువగా మాఫియా, హారర్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ, ఆయన దర్శకత్వంలో చేసిన ఓ సినిమాకు బ్రహ్మానందం ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) క్షణక్షణం బి) మనీ
సి) అనగనగా ఒక రోజు
డి) మనీ మనీ
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నటించిన ఆర్జీవీ సినిమా?
ఎ) శివ బి) రాత్
సి) సత్య డి) గాయం
హీరోల్లో అమితాబ్ బచ్చన్‌తో వర్మ ఎక్కువ సినిమాలు చేశారు. వీళ్ల కాంబినేషన్‌లో రిలీజైన సినిమాలు ఎన్ని?
ఎ) 6 బి) 8 సి) 12 డి) 14
రామ్‌గోపాల్ వర్మ కూతురి పేరేంటి?
ఎ) ప్రణతి బి) మహతి
సి) రేవతి డి) సుమతి
మణిరత్నం దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఆయనతో కలసి వర్మ కథ అందించారు?
ఎ) దళపతి బి) దొంగ దొంగ
సి) ఇద్దరు డి) రోజా
ఈ కిందివాటిలో వర్మ రాసిన రెండు పుస్తకాలు ఏవి?
ఎ) నా ఇష్టం
బి) వోడ్కా విత్ వర్మ
సి) గన్స్ అండ్ థైస్
డి) మీ ఇష్టం
ఏ సినిమా టైమ్‌లో వర్మ తన శిష్యులతో ఈ ఫొటో దిగారు?
ఎ) క్షణక్షణం
బి) గాయం
సి) గోవిందా
గోవింద
డి) శివ
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు: 1) ఎ 2) సి 3) బి 4) ఎ 5) బి 6) డి 7) సి 8) ఎ 9) బి
(తెలుగులో ‘రాత్రి’గా విడుదలైంది) 10) సి 11) బి 12) బి (మూడు... శివ, క్షణక్షణం, ప్రేమకథ)
13) ఎ (12 సినిమాలు. ‘అంతం’ బైలింగ్వల్. హిందీలో ‘ద్రోహి’గా విడుదల చేశారు) 14) సి
15) డి 16) బి (సర్కార్–3 త్వరలో విడుదల కానుంది. అది 9వ సినిమా) 17) సి 18)
బి 19) ఎ, సి (‘వోడ్కా విత్ వర్మ’ పుస్తకాన్ని రచయిత సిరాశ్రీ రాశారు) 20) డి