swamy
-
తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ దీక్ష
-
శబరిమల భక్తులకు ‘స్వామి చాట్‌బాట్’
శబరిమల దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తులకు సమగ్ర సమాచారం అందించేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందులో భాగంగా శబరిమల దర్శనార్థం వెళ్లేవారికి ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళలోని పథనంథిట్ట జిల్లా అధికారులు తెలిపారు.ముత్తూట్ గ్రూప్‌తో కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఏఐ డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’ అనే చాట్‌బాట్‌ను ప్రారంభించారు. శబరిమలకు రాకపోకలు సాగించే భక్తులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. వారికి పూర్తి భద్రత అందించేందుకు దీన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?రోజులవారీగా ఆలయ దర్శన సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. ఈ చాట్‌బాట్‌ను ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సిద్ధం చేశారు. శబరిమల దగ్గర్లోని చూడదగిన దేవాలయాల వివరాలు కూడా అందులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. -
సుబ్రమణ్య స్వామి Vs ఏపీ.
-
ఆ 5 కోట్లు ఎవరెవరు పంచుకుంటారంటే..!
-
జడల రామలింగేశ్వర స్వామి మొక్కు.. 12 అడుగుల జుట్టు..
-
దుష్ట సంప్రదాయానికి తెరలేపిన కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి
తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే చెల్లుతుంది. ఆయన శిష్యబృందం కూడా అదే దారిలో పయనిస్తోంది. నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ సమ్మేళనం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దుష్ట కుల రాజకీయానికి తెరలేపడంపై నియోజకవర్గంలోని మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన 40 సంవత్సరాల నుంచి ఏ రోజూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయలేదు. కానీ, దళితులైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాదిగ ఆత్మీయ సమావేశం పెట్టి సరికొత్త కుటిల రాజకీయానికి ఎమ్మెల్యే స్వామి తెరతీయడంపై మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు మాదిగలను పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. వైఎస్సార్ సీపీ తరఫున కొండపి నుంచి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుండటంతో మాల, మాదిగ అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇటీవల మంత్రి సురేష్ మాల, మాదిగ అని వేరు చేయకుండా సింగరాయకొండలో దళితుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాల, మాదిగలు తనకు రెండు కళ్లు లాంటివారని స్పష్టం చేశారు. టీడీపీకి మాదిగలు దూరమవుతున్నారని, అందుకు ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు. మాదిగల మనుగడను, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కొండపి నియోజకవర్గానికి మంత్రి సురేష్ వచ్చారని భావిస్తున్నామని మాదిగలు కూడా అంటున్నారు. కొండపికి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా మంత్రి సురేష్ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గమనించి మాదిగ సామాజికవర్గం టీడీపీకి దూరం అవడాన్ని గమనించిన ఎమ్మెల్యే స్వామి.. ప్రస్తుతం దుష్ట కుల రాజకీయానికి తెరలేపారని మాదిగ సామాజికవర్గం ఆరోపిస్తోంది. ఇన్నాళ్లు మాదిగ సామాజికవర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. గత పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ మాదిగల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఇప్పటివరకు సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించని ఏకై క ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఎమ్మెల్యే స్వామి అని మాదిగలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో మంత్రి సురేష్ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారని మాదిగలు గుర్తుచేస్తున్నారు. కొండపిలో మంత్రి సురేష్ పోటీ చేస్తుండటంతో ప్రస్తుతం మాదిగలపై టీడీపీ కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తోందని, ఇదే ప్రేమ మొదటి నుంచి చూపించి ఉంటే మాదిగలు టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్నందున టీడీపీకి మాదిగలు గుర్తుకురావడం బాధగా ఉందని మాదిగ సామాజికవర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఓట్ల కోసం ఎన్ని ఆత్మీయ సమావేశాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేమని మాదిగలు తెలియజేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మాదిగ సామాజికవర్గం వారు ఉన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మాదిగల ఆత్మీయ సమావేశానికి సుమారు రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మాదిగలు కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి మాదిగలు దూరంగా ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలేగానీ.. ఈ విధంగా కుల విభజన రాజకీయాలు చేస్తే కలిసికట్టుగా టీడీపీకి, స్వామికి గుణపాఠం చెబుతామని దళితులు స్పష్టం చేస్తున్నారు. -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
కేశినేని నానికి చంద్రబాబుకి గొడవేంటంటే..!
-
పెళ్లి చేయండంటూ.. యువకుడు తీవ్ర నిర్ణయం!
సాక్షి, మంచిర్యాల: మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన దుర్గం మొండయ్య, గుణబాయి దంపతుల చిన్న కుమారుడు దుర్గం స్వామి (28) వాంకిడి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతుండేవాడు. శుక్రవారం సైతం రాత్రి 8 గంటల ప్రాంతంలో పెళ్లి చేయాలని కుటుంబ సబ్యులతో వాదనకు దిగాడు. మద్యం మానేస్తేనే పెళ్లి జరుగుతుందని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సబ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే' హత్య చేశారా..! అసలేం జరిగింది..??
మహబూబాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొట్టి చంపి కుంటలో పడవేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్సై నైనాల నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేలకుంటకు చెందిన మూడు స్వామి(33)కి అదే గ్రామానికి జ్యోతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా స్వామి మద్యానికి బానిసయ్యాడు. గత శుక్రవారం భార్య జ్యోతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి గారింటికి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం నుంచి అతను కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారికి ఫోన్ చేసి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం రేలకుంట శివారులోని పుల్లమ్మకుంటలో మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని విలపించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్వామికి ఇన్సూరెన్స్ చేయించి పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘వర్షాలే కాదు ప్రళయం కూడా రావచ్చు’
హుబ్లీ(బెంగళూరు): రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు జలప్రళయం సంభవించే అవకాశం ఉందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రళయం వచ్చే ప్రమాదం ఉందని కోడిమఠం శివానంద శివయోగి చెప్పారు. గతంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పడుతుందని చెప్పిన జోస్యం నిజమైందన్నారు. అదే విధంగా రాబోయే కాలంలో విశ్వంలో దురంతం సంభవిస్తుందన్నారు. మూడు గండాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు దేశాలు మునిగి పోతాయన్నారు. ప్రజల ఆకాల మృత్యువుకు బలవుతారని, విజయదశమి నుంచి సంక్రాంతి వరకు ఈ దుస్సంఘటనలు చోటు చేసుకోనున్నామని తెలిపారు. పాలకులు జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు. చదవండి: శృంగారానికి 18 ఏళ్ల వయసొద్దు.. ‘సమ్మతి’ వయసు 16కు తగ్గించండి: కేంద్రానికి హైకోర్టు కీలక వినతి -
సాక్షి టీవీ చేతిలో పూర్ణానంద రిమాండ్ రిపోర్ట్
-
Tirupati : తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’
కోలారు(బెంగళూరు): ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తరువాత దేశానికి మరో ప్రమాదం పొంచి ఉందని కోడిమఠం శివానంద శివయోగి స్వామి తెలిపారు. ఆయన తరచూ జోస్యాలు చెబుతూ ఉండడం తెలిసిందే. గురువారం తాలూకాలోని సుగటూరు గ్రామంలోని యోగి నారాయణస్వామి మఠాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో చెప్పినట్లుగా ఈసారి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం వచ్చింది. అదే విధంగా ఈ సంవత్సరం పెద్ద ప్రమాదం సంభవిస్తుందని తెలిపిన విధంగానే ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆపై దేశానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. కై వార తాతయ్య మళ్లీ పుట్టి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. అలాంటి సూచనలు ఇప్పటికే కొండ ప్రాంతంలో కనిపించిందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత దారి తప్పితే ప్రభుత్వానికి ప్రమాదమని తెలిపారు. చదవండి: పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్ -
ఫ్లోరోసిస్ విముక్తి పోరాట యోధుడి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/మర్రిగూడ: ఫ్లోరోసిస్ విముక్తి పోరాట యోధుడు అంశాల స్వామి (37) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ఎలక్ట్రిక్ (3 చక్రాల) సైకిల్‌పై తండ్రితో కలసి ఊరికి వెళ్లి వచ్చి ఇంటి ముందు ర్యాంప్ ఎక్కే క్రమంలో ఆయన కింద పడిపోయారు. శనివారం ఉదయం రక్తపు వాంతులతో స్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తపు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించగా, స్వామిని పరీక్షించిన ఆయన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108కు కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి స్వామిని పరీక్షించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు. ట్రైకిల్ పై నుంచి పడినప్పుడు స్వామి తలలో అంతర్గతంగా గాయాలైనట్లు భావిస్తున్నారు. స్వామి మృతిచెందడంతో ఆయన స్వగ్రామం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య ప్రస్తావన రాగానే వెంటనే అంశాల స్వామి గుర్తుకు వస్తారు. దీనితోనే ఫ్లోరైడ్ సమస్యపై జిల్లాలో ఉద్యమం జరిగిన తీరు, అందులో స్వామి పాత్ర ఎంత కీలకమన్నది అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరోసిస్ బాధితుల తరఫున ఆయన ఢిల్లీలో తన గళం వినిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఫ్లోరోసిస్ సమస్య కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. అందులో అంశాల స్వామి కీలక భూమిక పోషించారు. అనేక ఏళ్లపాటు ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో భాగస్వామి అయ్యారు. అంశాల స్వామి గర్భస్థ ఫ్లోరైడ్ బాధితుడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల వెంకటమ్మ, సత్యనారాయణకు నలుగురు సంతానం. అందులో పెద్దవాడైన స్వామికి 37 ఏళ్లు. ముగ్గురు చెల్లెళ్లలో ఒకరు అనారోగ్యంతో మరణిస్తే, మరొకరు ఫ్లోరోసిస్‌తోనే మృతి చెందారు. కాగా, శనివారం సాయంత్రం స్వామి అంత్యక్రియలను నిర్వహించారు. ప్రతిపోరాటంలో ముందున్న స్వామి నదీ జలాల ద్వారానే ఫ్లోరైడ్ సమస్య పీడ విరగడవుతుందన్న భావనతో ఏర్పాటైన జల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ స్వామి కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధానమంత్రులు వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, దేవెగౌడ, చంద్రశేఖర్‌ను కలిశారు. పలువురు ముఖ్యమంత్రులను కలసి ఫ్లోరైడ్ సమస్యను వివరించారు. 17 సార్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేశారు. ఐక్యరాజ్యసమితి వరకు ఫ్లోరైడ్ సమస్యను తీసుకెళ్లగలిగారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌ను కలసి ఫ్లోరోసిస్ సమస్యకు కృష్ణా జలాలతోనే పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎన్నికల్లో పోటీ ఫ్లోరైడ్ సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు అంశాల స్వామి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అప్పట్లో నాంపల్లి మండల జెడ్పీటీసీగా పోటీ చేశారు. వారణాసిలో ఎంపీగా పోటీ చేసి సమస్యను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రత్యేక కార్పొరేషన్ కావాలని.. ఫ్లోరోసిస్ బాధితులు మంచానికే పరిమితమై కుటుంబానికి భారమవుతున్నందున ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్పొరేష¯న్ ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ వికలాంగులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని స్వామి అడుగుతుండేవారు. కాగా, శివన్నగూడెం ప్రాజెక్టుకు అంశాల స్వామి పేరు పెట్టాలని జల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కంచుకట్ల సుభాష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బ్యాటరీ ట్రైసైకిల్‌లో డిజైన్ లోపం వల్లనే అంశాల స్వామి ప్రమాదానికి గురై మృతి చెందాడని వారు ఆరోపించారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వామికి ఓ సంస్థ ఈ ట్రైసైకిల్‌ను ఇచ్చిందని వారు తెలిపారు. స్వామి మృతిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
నల్లగొండ ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి మృతి.. కేటీఆర్ సంతాపం..
నల్లగొండ: ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో స్వామి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. స్వామి తన గుండెళ్లో చిరస్థాయిగా గుర్తుంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గతంలో అంశలస్వామి ఇంట్లో కేటీఆర్ భోజనం చేశారు. ఆయనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా మంజూరు చేయించారు. My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg — KTR (@KTRBRS) January 28, 2023 అంశల స్వామి బైక్ ప్రమాదానికి గురై తలకు గాాయాలు కావడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన చాలా సంవత్సరాలుగా అనేక అంశాలపై గళమెత్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చదవండి: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ -
గిరిజనులకు అండగా.. విశాఖ శ్రీ శారదా పీఠం
-
మురుఘ మఠాధిపతికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
సాక్షి,బెంగళూరు: రాష్ట్రమంతటా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి రాజేంద్ర శివమూర్తి స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైస్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మురుగ మఠానికి చెందిన శివమూర్తి మురుగ శరణారావుకు.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మురుగ మఠాధదిపతి శివమూర్తికి ఛాతీలో నొప్పి రావడంతో భారీ బందోబస్తు మధ్య చిత్రదుర్గ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత అనంతపురం జిల్లా జైలుకు తరలించనున్నట్లు చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ పరశురాం తెలిపారు. కాగా గురువారం రాత్రి మురుఘ రాజేంద్ర మఠంలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించారు. గత నెల 26న చిత్రదుర్గలోని మురఘశ్రీ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు స్వామీజీపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారంరోజుల ఉత్కంఠ వారం రోజులుగా ఈ విషయం రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో స్వామీజీ చేసుకున్న దరఖాస్తుపై విచారణ కూడా శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు మఠం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చివరకు రాత్రి హైడ్రామా మధ్య స్వామీజీ అరెస్ట్‌ను ప్రకటించారు. ఇదివరకే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. శుక్రవారం నుంచి స్వామీజీని పోలీసులు విచారించనున్నారు. స్వామీజీకి మద్దతుగా, వ్యతిరేకంగా పలువురు నేతలు ప్రకటనలు చేశారు. చదవండి: కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే.. -
అమ్మవారి విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి..
ముదిగొండ: దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనంకోసం తీసుకువెళుతుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ ఉండగా, ఊరేగింపు అనంతరం బయలుదేరి న స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బాణాపురం సమీపాన ఇసుక బావి వద్ద అమ్మవారి విగ్రహం ఉన్న ట్రాక్టర్ ముందుగా వెళ్లింది. ఆ వెనుకాల ఉన్న ట్రాక్టర్లో 25 మంది గ్రామస్తులు ఉండగా, ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొందరు గాయపడగా 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతో పాటు కొందరు మండల స్థాయి నేతలు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని నియమించాలని నిర్ణయించారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. అలాగే, త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. నేడు దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ రాక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శనివారం దేవదాయశాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రికి నివేదక అందిస్తారని దేవాలయం ఫిట్ పర్సన్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీ తెలిపారు. -
జైల్లో స్టాన్ స్వామికి సిప్పర్
ముంబై : ఎల్గార్‌పరిషత్ కేసులో తలోజా జైలులో ఉన్న స్టాన్‌స్వామి(83)కి సిప్పర్‌తో పాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతోన్న ఆదివాసీ హక్కుల నేత స్టాన్‌స్వామిని మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అక్టోబర్ 8న అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), స్టాన్ స్వామి పట్ల అమానవీయం గా ప్రవర్తించడాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. అరెస్టు సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సిప్పర్‌ని తిరిగి అందజేయాల్సిందిగా కోరుతూ స్టాన్‌స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా చేతులు వణుకుతున్నందున సిప్పర్ ద్వారా ఆహారపదార్థాలను సేవించేందుకు అనుమతి నివ్వాలంటూ ఆయన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకి విన్నవించారు. శనివారం తలోజా జైలుని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీపీ చేరింగ్ దోర్జే, స్టాన్‌స్వామి అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనం తరం జైలు అధికారులు స్టాన్ స్వామికి సిప్పర్, స్ట్రా, వీల్ ఛైర్, వాకింగ్ స్టిక్, వాకర్తోపాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేశారు. -
చంద్రబాబు ఆంతరంగిక కాపలాదారు జస్టిస్ ఎన్వీ రమణ
జస్టిస్ బీఎస్ఏ స్వామి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ ఫైర్ బ్రాండ్. దళిత, బలహీన వర్గాల్లో ఎంతో పేరున్న ఆయన హైకోర్టులో కులతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అందులో జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మధ్య ఉన్న బాంధవ్యాన్ని, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు యథాతథంగా ఇలా ఉన్నాయి. సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు ఆంతరంగిక కాపలాదారు జస్టిస్ ఎన్వీ రమణ. చంద్రబాబుకు, ఈ పెద్ద మనిషి (ఎన్వీ రమణ)కి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఏంటో మాకెవ్వరికీ తెలియదు. వాస్తవానికి చంద్రబాబు.. ఎన్వీ రమణను రాజ్యసభకు పంపాలనుకున్నారు. కానీ అదనపు అడ్వొకేట్ జనరల్‌ను చేశారు. న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అదనపు ఏజీ హోదాలో ఆయనేమీ పెద్ద కేసుల్లో వాదనలు వినిపించింది లేదు. చంద్రబాబుకు, హైకోర్టు జడ్జీలకు మధ్య జస్టిస్ రమణ లైజనింగ్ చేసేవారు. న్యాయమూర్తుల అవసరాలను చూసుకునేవారు. పదవీ విరమణ తర్వాత పోస్టులిస్తామని ఆశ చూపేవారు. తద్వారా చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు రాకుండా చూసేవారు. జస్టిస్ ఎన్వీ రమణ ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్ చేసేవారు కాదు. ఆశావహులంతా ఆయన ఇంటి ముందు, ఆయన ఛాంబర్ ముందు క్యూలో నిలబడేవారు. సీనియర్ న్యాయమూర్తులు కూడా ఆయన చెప్పినట్లు ఆడేవారు. ఎస్బీ సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణే. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా ఉన్నారు. అందుకే రోహిణిని జడ్జిని చేశారు.. చంద్రబాబు కోసం జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన ప్రతి ప్రధాన న్యాయమూర్తిని ప్రలోభపెట్టేవారు. ప్రభా శంకర్ మిశ్రా మినహా పలువురు ప్రధాన న్యాయమూర్తులు ఈ ఇద్దరి ఎర కోసం వలలో చిక్కుకుని, వారు చెప్పినట్లు ఆడేవారు. న్యాయవాది ఎన్.శోభ హైకోర్టు న్యాయమూర్తి అయితే తన తోకగా ఉండరన్న ఉద్దేశంతో జస్టిస్ రోహిణిని న్యాయమూర్తి చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ న్యాయ వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే, పరిస్థితులు చాలా బాగుండేవి. కానీ న్యాయ వ్యవస్థ తలరాత మరోలా ఉంది. -
'7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో'
సాక్షి, విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసులో నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు. పోలీసులకు వివరాలు చెప్పాం. దివ్య పెళ్లి ఇతర విషయాలు నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా మాకు తెలీదు. సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది. నా కూతర్ని అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలి' అని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్) పోలీసుల విచారణలో కొత్త విషయాలు దివ్య తేజస్విని హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య, నాగేంద్ర వివాహంపై పోలీసుల విచారణలో ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారు. అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందకు పోలీసులు బృందం విష్ణు కాలేజీకి వెళ్లింది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు దివ్య కాల్ చేయగా.. ఏప్రిల్ 2న దివ్యకు నాగేంద్ర నుంచి చివరి కాల్ వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును బెజవాడ పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం జీజీహెచ్ సర్జికల్ వార్డులో నాగేంద్రబాబుకు చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి అన్నారు. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి. వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అతను సాధారణ స్థితికి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది' అని ఆమె వెల్లడించారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!) -
మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: బెజవాడలో కలకలం రేపిన దివ్య తేజస్విని హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దివ్యతో తనకు పెళ్లి జరిగినట్లు నిందితుడు నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మంగళగిరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆమె తండ్రి వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపిస్తూ స్పృహ కోల్పోయాడు. దీంతో స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక నిందితుడి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. (చదవండి: గంజాయి తాగుతాడు, పనికిరాని వాడు: దివ్య తల్లి) మరోవైపు.. నాగేంద్ర చెబుతున్నవన్నీ అసత్యాలని, ఇంజనీరింగ్ చదువుతున్న తమ కూతురు అలాంటి పనికిరాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందని దివ్య తల్లి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. దివ్య తేజస్విని హత్య కేసులో మాచవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 449, 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) ఎవరికీ చెప్పలేదని చెప్పాడు: నాగరాజు గుంటూరు: దివ్య తేజస్వినిని పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర తనకు చెప్పాడని అతడి సోదరుడు నాగరాజు మీడియాకు తెలిపాడు. ఈ విషయం గురించి రాత్రి దివ్య ఇంటికి వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడానని, ఆయన ఇందుకు ఒప్పుకోలేదని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. బెజవాడలో గురువారం చోటుచేసుకున్న దివ్య హత్యోదంతం గురించి నాగరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన జరగగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నాగేంద్ర కోసుకున్నాడు అని చెప్పారు. నేను పని దగ్గర నుంచి డైరెక్ట్‌గా ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాను. అక్కడే నా సోదరుడితో మాట్లాడాను. దివ్య, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అని కూడా అన్నాడు. ఏం జరిగిందో క్లారిటీ లేదు. జరిగిన విషయాన్ని కరెక్టుగా చెప్పలేదు. పెళ్లి చేసుకున్న అని మాత్రం చెప్పాడు’’ అని తెలిపాడు. -
‘ఆ తిరుగుబోతును ఎందుకు పెళ్లి చేసుకుంటుంది’
సాక్షి, విజయవాడ: ‘‘కావాలనే నా కుమార్తె గురించి ప్రేమ, పెళ్లి అని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా దివ్య భీమవరంలోని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. నా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. అపురూపంగా చూసుకున్నాం. ఆ నాగేంద్ర పెయింటింగ్ పని చేస్తాడు. గంజాయి తాగి తిరుగుతూ ఉంటాడు. అలాంటి తిరుగుబోతుకు, దివ్య పేరుతో సంబంధం కలుపుతున్నారు. ఎందుకు పనికిరానివాడిని తను ఎందుకు పెళ్లిచేసుకుంటుంది? ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’’అంటూ ఉన్మాది స్వామి చేతిలో బలైపోయిన దివ్య తేజస్విని తల్లి కుసుమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) తన కూతురు గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిని ప్రేమ పేరుతో వేధించిన నాగేంద్ర బాబు అలియాస్ స్వామి, గురువారం ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతి చెందిన విషయం విదితమే.(చదవండి: దివ్య, స్వామి మంచి స్నేహితులు) ఈ ఉన్మాదం ఇంకెంతకాలం: వాసిరెడ్డి పద్మ నగరంలో చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఘటనను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంట్లోకి చొరబడి, నిద్రపోతున్న అమ్మాయిపై దాడి చేయడం దారుణం. తన గొంతు కోసి అమానుషంగా ప్రవర్తించాడు. మంచం మీద నిద్ర పోతున్న పిల్ల.. మార్చురీకి వచ్చి చేరింది. ఇటువంటి ఆగడాలను అరికట్టాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం తెచ్చారు. ఇటువంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి. ‘‘నేను ప్రేమిస్తే.. నాకే దక్కాలి’’ అనే ఉన్మాదం ఎంతకాలం? ప్రేమించకపోతే మరణ శాసనం రాస్తారా..? చంపేస్తారా?’’ అని ప్రశ్నించాలి. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసేవిధంగా, కేంద్రం కూడా దిశ లాంటి చట్టానికి వెంటనే ఆమోదం తెలపాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. యేళ్ల తరబడి కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ ఘటనలు పెరుగుతున్నాయి. మనోవర్తి కేసులపై కూడా న్యాయ వ్యవస్థ ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. శిక్షలు పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆడ పిల్లలు మా ప్రాణం, మా ప్రాధాన్యత అనేలా అందరూ ఆలోచించాలి. ప్రేమ పేరుతో ఉన్మాదం, దారుణాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడాలి’’అని పేర్కొన్నారు. -
బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాక్షి, విజయవాడ : నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్య తేజస్విని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న నాగేంద్రబాబు అలియాస్ స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో కోపోద్రేకుడైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, దాడి చేసిన అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వామీజీ వేషం.. ఆత్మ పేరుతో మోసం
చిత్తూరు, మదనపల్లె టౌన్ : అతడిది స్వామీజీ వేషం.. నమ్మించి మోసం చేయడం..భూతవైద్యం పేరు తో లక్షలు దండుకోవడం అతడి అకృత్యాలు. ఈ క్రమంలోనే ఓ మహిళను మోసగించి కటకటాల పాలయ్యాడు. మృతి చెందిన ఆమె భర్త ఆత్మ ఇంట్లో తిరుగుతోందని.. ఆ దెయ్యాన్ని వెళ్లగొడతానని నమ్మించి ఆరు లక్షల రూపాయలు లాక్కుని మాయమయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతని వ్యవహారం బయటపడింది. వన్ టౌన్ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్ఐ లోకేష్ మంగళవారం విలేకరులకు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ, రాయునిచెరువు వడ్డిపల్లె(ఆర్సీ వడ్డిపల్లె)కు చెందిన లేట్ వెంకటప్ప కుమారుడు డేరంగుల రామకృష్ణ అలియాస్ రామకృష్ణ స్వామిజీ(47) ఒకప్పుడు చిన్న చిన్న కూలి పనులతో కాలం వెళ్లదీసేవాడు. 15 ఏళ్ల క్రితం గుప్తనిధుల ముఠాలో చేరి జిల్లాతో పాటు పలు మండలాల్లో గుప్త నిధులను వెలికితీసేవాడు. అక్కడ నకిలీ విగ్రహాలను పెట్టి జనాన్ని నమ్మించి రూ.లక్షలు దండుకునేవాడు. ఇంతటితో ఆగకుండా స్వామిజీ వేషంతో భూతవైద్యాలు చేసేవాడు. ఇదిలా ఉండగా.. మదనపల్లె బుగ్గకాలువకు చెందిన షేక్ హసీనా భర్త మస్తాన్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇంటిలో మస్తాన్ ఆత్మ తిరుగుతోందని, గుప్త నిధులు ఉండడం వల్లే అలా జరుగుతోందని ఆమెను నమ్మించాడు. తాను ఎంతో మందికి భూతవైద్యం చేసి దెయ్యాలను వెళ్లగొట్టానని.. అలా ఇక్కడ కూడా చేస్తానని ఆమెను నమ్మించి రూ.6 లక్షలు తీసుకున్నాడు. తరువాత స్వామిజీ కనిపించకుండా మాయమయ్యాడు. అనుమానించిన బాధితురాలు మోసపోయానని నాలుగు రోజుల క్రితం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి కల్యాణ మండలం సర్కిల్ వద్ద కారులో వెళుతుండగా పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. -
కపటస్వామి బరితెగింపు
కర్ణాటక, కోలారు: తాలూకాలోని హొళలి గ్రామంలో 18 సంవత్సరాల యువతిని పెళ్లి చేసుకున్న 48 సంవత్సరాల దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్ రాఘవేంద్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా పెళ్లాం, నా జోలికి వస్తే సుపారి కిల్లర్ల చేత చంపేయిస్తానని యువతి బావ ఎం.అరుణ్‌కుమార్‌ను కపటస్వామి బెదిరిస్తున్నాడు. గత ఫిబ్రవరి 22న నిందితుడు యువతితో కలిసి పరారై తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. ఘటనపై కోలారు రూరల్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్ని రోజులు తప్పించుకుని తిరుగుతున్న అతడు యువతితో పెళ్లి తరువాత స్వామీజీ గెటప్ తీసేసి మామూలుగా తయారయ్యాడు. మిమ్మల్ని లేపేస్తా.. ఈ నేపథ్యంలో రాఘవేంద్ర యువతి బావ అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అని దూషించాడు. నేనిప్పుడు స్వామీజీ కాదని, పెళ్లి చేసుకున్నానని మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదని 50 లక్షలు అయినా , కోటి రూపాయలు అయినా బెంగుళూరులో ఉన్న మా కుర్రాళ్లకు చెప్పి హత్య చేయిస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కపట స్వామిజి బెదిరింపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతి అక్క తన చెల్లెలుతో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని కోరినా అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం తన భార్యకు మీకు ఎలాంటి సంభంధం లేదని కపట స్వామి తేల్చి చెప్పాడు. వంచకుడు ప్రస్తుతం మురుడేశ్వరలో ఉన్నాడనే సమాచారంతో కోలారు పోలీసులు అక్కడకు వెళ్లారు. -
హిందుత్వవాదికి ముస్లిం డ్రైవర్ !
కర్ణాటక, బొమ్మనహళ్లి: ఉడుపి శ్రీకృష్ణమఠాధిపది శ్రీ విశ్వేశతీర్థ స్వామి పేరు వినగానే గుర్తుకువచ్చేది ఆయన హిందుత్వ వాది అని. అయితే ఆయన కారు డ్రైవర్ మాత్రం ఒక ముస్లిం యువకుడిని నియమించుకున్నారు. దీంతో అనేకులు స్వామీజీపై అభ్యంతర వ్యక్తం చేశారు. అయితే ఏ ఒక్కరి మాటలను స్వామీజీ పట్టించుకోలేదు. నాకు కారు డ్రైవర్ కావాలి తప్ప ఆయన ఏ మతస్తుడు అనేది తనకు అవసరం లేదని చెప్పేవారు. ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ... స్వామీజీ వద్ద తనతో పాటు, తమ కుటుంబానికి చెందిన మొత్తం ముగ్గురు ఇక్కడ డ్రైవర్లగా పనిచేశామన్నారు. తన ఇద్దరి సోదరుల తరువాత తాను ఏడాదిన్నరగా స్వామీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. పేజావర స్వామిజీని హిందుత్వ వాది అంటారని, అయితే స్వామిజీ మనసులో అటువంటి భావాలు ఉండవన్నారు. పైగా తన వద్ద పనిచేయడం కష్టంగా ఉందా అని స్వామీజీ అడిగేవారని ఆరిఫ్ అన్నారు. తనకు మఠంలో ఎటువంటి ఆంక్షలు కూడా పెట్టేవారు కాదని, పైగా నమాజ్ కూడా చేసుకోమని స్వామీజీ చెప్పేవారని అన్నారు. స్వామీజీ భగవద్గీతతో పాటు ఖురాన్ కూడా చదివేవారని అందులో మంచి మాటలు తనకు వివరించేవారని ఆరిఫ్ గుర్తు చేసుకున్నారు. ముస్లిం పండుగల సమయంలో అనేక మందికి స్వామీజీ సహాయం చేసేవారని, తనకు కూడా ఎన్నోమార్లు సహాయం కావాలా అని అడిగేవారని అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన మహానుభావుడు స్వామీజీ అని ఆరిఫ్ గుర్తు చేసుకున్నారు. -
ప్రబోధాశ్రమ ఘటనలో జేసీకి షాక్
అనంతపురం, తాడిపత్రి: చిన్నపొలమడ సమీపంలోని ప్రబోధాశ్రమంపై 2018 సెప్టెంబర్ 17న జరిగిన దాడి చేసిన కేసులో జేసీ సోదరుల (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరులను తాడిపత్రి రూరల్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆకుల చంద్రశేఖర్, బాబు (బార్ బాబు), మిద్దె హనుమంతరెడ్డి, గన్నెవారిపల్లి మాజీ సర్పంచ్ చింబిలి వెంకరమణ ఉన్నారు. జేసీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు, బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు దద్దం సుబ్బరాయుడు ముందస్తు సమాచారంతో పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలిసింది. అరెస్టయిన నలుగురినీ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారిని రిమాండ్‌కు ఆదేశించారు. మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం? ప్రబోధాశ్రమ ఘటనలో పాల్గొన్న మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కేవలం 25 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో జేసీ సోదరులు వేలాదిమంది అనుచరులతో కలిసి ఆశ్రమంపైన, అక్కడి భక్తులు, వాహనాలపైన దాడిచేసిన విషయం విదితమే. త్వరలోనే మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. -
ఎవరు చెబితేనేమిటి?
కంచి పరమాచార్య జీవితంలో ఇదొక సంఘటన. ఆయన ఎక్కడికైనా వెళ్లాలంటే పల్లకిని ఉపయోగించేవారు. అలాగే ఓమారు ఆయన పల్లకిలో వెళ్తూ వెళ్తూ ఓ చోట పల్లకిని ఆపించి అందులో నుంచే ప్రసంగిస్తుండగా ఒకతను ఆయనను విమర్శించాడు. ‘‘ఇతరులు నలుగురైదుగురు మోస్తుండగా దర్జాగా పల్లకిలో కూర్చుని ప్రయా ణం చేస్తుంటారు. ఈయన సాధువేంటీ? ఓ మనిషిని మరొక మనిషి మోయడం తగునా! ఇది ఆయనకు తెలీదా? సాధువు అనే అతను అన్ని సుఖాలనూ త్యజించాలి కదా. ఎంత హీనమైన తంతిది. మరొకరి భుజాలపై ప్రయాణం చేసే ఈయనను సాధువని ఎలా అనుకోవాలి? ఈ పెద్దమనిషి మనకు హితవచనాలూ సామాన్య ధర్మాలు చెప్పడమా! అసలీయనకు ఏమర్హత ఉంది.. ఛీఛీ..’’ అని అన్నాడు. ఈ మాటలన్నీ పరమాచార్య చెవిన పడ్డాయి. మరుక్షణమే పరమాచార్య పల్లకిని నేల మీదకు దింపించి పల్లకిలోంచి ఇవతలకు వచ్చారు. ‘‘ఆయన చెప్పినదాంట్లో తప్పేముంది. సబబే కదా..’’ అని తన వెంట ఉన్నవారితో అన్నారు. అయితే పల్లకీ మోసిన వాళ్లు.. ‘‘ఎవరో ఏదో అన్నారని మీరిలా దిగడం మాకు బాధగా ఉంది. వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోకండి. మిమ్మల్ని మా భుజాలమీద తీసుకుపోవడం మా భాగ్యం’’ అన్నారు. అయినా పరమాచార్య తన మాట కొనసాగిస్తూ.. ‘‘ఆ మనిషి చెప్పింది నిజమే. సుఖాన్ని త్యజించని వారు సాధువెలా అవుతారు. నాకీ పల్లకి వద్దు. ఇక మీదట నేనెక్కడికి వెళ్లి నడచిపోతాను’’ అని ఓ గట్టి నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగానే ఎక్కడి వెళ్లినా ఆయన నడిచే వెళ్తుండేవారు. పరమాచార్య చివరి వరకూ ఈ నిర్ణయం నుంచి తప్పుకోలేదు. – జగద్రేణు -
తల్లి లేకుండానే ఈ లోకంలోకి వచ్చారా?
అన్నిరంగాల్లో మహిళలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారు. అడుగడుగునా ఎదురవుతున్న ప్రతిబంధకాలను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ సమాన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అతివలు వడివడిగా ముందుకు సాగుతున్నారు. అయితే ప్రగతి పథాన పరుగిడుతున్న పడతులకు ప్రతిచోటా ప్రోత్సహించే పరిస్థితులు కనబడటం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో జీర్ణించుకుపోయిన పురుషాంహకారం మహిళలకు ఆటంకాలు సృష్టిస్తుండటం నేటికీ ఆగలేదు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. ‘రాజ్ మెడికాన్ 2019’ సదస్సు చివరి రోజు ప్రేరణాత్మక ప్రసంగం చేసేందుకు వచ్చిన మోటివేషనల్ గురు స్వామి జ్ఞానవాత్సల్య చిటపటలాడుతూ వెళ్లిపోయారు. ఆయనగారి అసహనానికి కారణం మహిళామణులు. స్వాములోరు అక్కడకు రావడమే ఒక షరతు మీద వచ్చారు. ఆయన పెట్టిన నిబంధనకు నిర్వాహకులు కూడా ఒప్పుకున్నారు. జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు గురించి తెలియక తరుణీమణులంతా ‘ముందుకు’ రావడంతో ఆగ్రహించిన ఆయన అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్–సర్వీసెస్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏఆర్‌ఐఎస్‌డీఏ) సంయుక్తంగా జూన్ 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు 26వ ‘రాజ్ మెడికాన్ 2019’ సదస్సును నిర్వహించాయి. నేటి సమాజంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపాలన్న లక్ష్యంతో జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో ఈ సదస్సును జరిపారు. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా స్వామి జ్ఞానవాత్సల్య ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రసంగించేందుకు ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన ఆయన.. ముందు వరుసలో మహిళలు కూర్చొని ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆడిటోరియంలోని ముందు వరుసల్లో మహిళలు కూర్చోవడానికి వీల్లేదని కార్యక్రమం ప్రారంభం కావడానికే ముందే నిర్వాహకులకు ఆయన హుకుం జారీచేశారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా జరగడంతో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. ముందు ఏడు.. తర్వాత మూడు ‘‘స్వామి జ్ఞానవాత్సల్య ప్రేరణాత్మక మాటలు వినేందుకు చాలామంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చుకున్నారు. మహిళలు మొదటి ఏడు వరుసల్లో కూర్చోరాదని హఠాత్తుగా నిర్వాహకులు ప్రకటన చేశారు. మొదటి మూడు వదిలిపెట్టి నాలుగో వరుస నుంచి వనితలు కూర్చోవాలని తర్వాత మరోసారి ప్రకటించారు. ఈ గందరగోళం ఏంటని నిర్వాహకులను మహిళా వైద్యులు అడగ్గా.. ఇది స్వామి జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు అని సమాధానమిచ్చారు. ‘‘పోనీలే పెద్దాయన ప్రసంగం బాగా చేస్తాడు కదా అని ఆయన పెట్టిన నిబంధనకు అంగీకరించేందుకు మేమంతా సిద్ధమయ్యాం. డిమాండ్లు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రసంగం చేయకుండా జ్ఞానవాత్సల్య వెళ్లిపోయారు!’’ అని ఆయన నిర్వాకాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన డాక్టర్ రీతు చౌదరి వివరించారు. మహిళలు ముందు వరుసలో ఆసీనులయ్యారన్న అసహనంతోనే జ్ఞానవాత్సల్య ప్రసగించకుండానే వెనుదిరిగారని ఏఆర్‌ఐఎస్‌డీఏ ప్రతినిధి డాక్టర్ అజయ్ చౌదరి ధ్రువీకరించారు. మా జోలికి రాకండి స్వామి జ్ఞానవాత్సల్య పురుషాధిక్య వైఖరిపై మహిళా వైద్యులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తాము ముందు కూర్చున్నామన్న ఒకే ఒక్క కారణంతో ఆయన వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. అందరికీ సుద్దులు బోధించే స్వామిజీలు కూడా ఆడవాళ్లను చులకనగా చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని నిరసించారు. ‘‘మహిళలపై వివక్షను ఒప్పుకోబోము’’ అన్నారు అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, లిబరేషన్ మాస పత్రిక సంపాదకురాలు కవితా కృష్ణన్. ‘‘స్త్రీలను ద్వేషించే ఇటువంటి ఆజ్ఞలు సైన్స్, మెడికల్ రంగంలోనే కాదు ఎక్కడా అనుమతించం. తాము 19వ శతాబ్దంలోనే ఉన్నట్టే ఉంటామని ఎవరైనా అంటే అటువంటి వారిని అలాగే ఉండిపొమ్మంటాం. కానీ మహిళలను ఇందులోకి లాక్కండి. వివక్షకు గురిచేసే ఆదిమ కాలం నాటి భావజాలాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక వనితలు ఉండరు. వైద్య, సాంకేతిక రంగాలకే కాదు అన్నిటికీ ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి’’ అని కవితా కృష్ణన్ గళమెత్తారు. వివక్ష తగునా..? స్వామి జ్ఞానవాత్సల్య వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను వివక్షకు గురిచేయకుండా స్వామికి సెల్ఫ్ మోటివేషన్ అవసరమని, చేసుకోవాలని చురకలు అంటించారు. ఇటువంటి వారు చెప్పే ప్రబోధాలను బహిష్కరించాల్సిన అవసరముందన్నారు. విద్యాధికులైన డాక్టర్లే ఇటువంటి వివక్షను ఎదిరించకపోతే వారి కంటే నిరక్షరాస్యులే నయమనిపిస్తారని నినదించారు. ఇలాంటి స్వాములు చెప్పే హితవచనాల కన్నా తాము చేసే సేవలే అమూల్యమైనవని డాక్టర్లు గుర్తించాలని సూచించారు. ఇరుకు మనస్తత్వం కలిగిన ఇలాంటి స్వాములు మహిళలకు జీవనగమ్యాలను నిర్దేశిస్తామనడం గర్హనీయమని కుండబద్దలు కొట్టారు. ‘తల్లి లేకుండానే ఆయన ఈ లోకంలోకి వచ్చారా?’ అని ట్విటర్లో ఓ మహిళ ఘాటుగా ప్రశ్నించారు. స్త్రీల పట్ల వివక్ష భావన కలిగిన ఇటువంటి వ్యక్తిని వైద్యులు తమ సదస్సుకు ఆహ్వానించకుండా ఉంటే బాగుండేదని మరొకరు అభిప్రాయపడ్డారు.ఈ మొత్తం వ్యవహారంపై స్వామి జ్ఞానవాత్సల్య ఇప్పటివరకు స్పందించలేదు. – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
దంపతీ దక్షిణామూర్తి
దక్షిణామూర్తి జ్ఞానమూర్తి. విద్యను అర్థించే ఎవరైనా దక్షిణామూర్తిని ప్రార్థించాల్సిందే. మర్రిచెట్టు నీడలో తన చేతిముద్రలతో మహర్షుల మౌనాన్ని తీర్చిన బాలుడు ఈయన. దక్షిణం వైపు తిరిగి కూర్చుంటాడు కనుక ఇతడిని దక్షిణామూర్తి అంటారు. సాధారణంగా దక్షిణామూర్తి అంటే 8 సంవత్సరాల బాలుడని అందరి భావన. ఆయన చుట్టూ మహర్షులు కొలువుతీరి ఉంటారు. ఆయన వారికి మౌనంతో, చిన్ముద్రతో జ్ఞానాన్ని ఉపదేశించి వారి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. చిత్తూరు జిల్లా సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయంలో అరుదైన దక్షిణామూర్తి రూపం ఒకటి ఉంది. ఈ స్వామికి పక్కనే అమ్మవారు కూడా దర్శనమిస్తుంది. ఇదే ఇక్కడి విశేషం. ఇక్కడి వారంతా ఆయనను దంపతీ దక్షిణామూర్తి అంటారు. ఇటువంటి అరుదైన విగ్రహం తమిళనాడులోని ఊతుకోట అనే ఊరిలో మరొకటుంది. ప్రపంచంలో అమ్మ వారితో కలిసి ఉన్న దక్షిణామూర్తి విగ్రహాలు ఇవి రెండే. ఈ స్వామి రూపాన్ని దర్శిస్తే ...ఆసీనస్థితిలో ఉండి కుడికాలును కిందకు జారవిడిచి, ఎడమకాలును పైకి మడిచి, కుడిచేత చిన్ముద్రను, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి, పరహస్తాలలో కుడివైపు గొడ్డలిని, ఎడమవైపు జింకను పట్టుకుని ఉంటాడు. దక్షిణామూర్తి కుడివైపు అమ్మవారు ఆయనను ఆరాధనాభావంతో చూస్తూ ఉంటుంది. స్వామివారి కుడికాలి కింద అపస్మారుడుంటాడు. ఈ స్వామిని దర్శిస్తే మనలోని చక్కటివిద్య లభిస్తుంది. విద్యాపరమైన మందమతి వంటి దోషాలు తొలగి విజయం సాధిస్తారు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఆధ్యాత్మికత ముసుగులో యువతులపై అత్యాచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: మహిమగల స్వామిగా పరిచయం చేసుకుంటాడు. మాయమాటలతో మహిళలను, యువతులను లొంగదీసుకుంటాడు. అత్యాచారాలు చేసి ఆస్తులను అపహరిస్తాడు. ఇలా 50 మంది యువతుల జీవితాలతో ఆటలాడి పరారైన చెన్నైకి చెందిన దొంగస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేంద్ర నేర పరిశోధన విభాగం పోలీసులు ఈ దొంగస్వామిని వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించి విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. చెన్నై, టీనగర్‌కు చెందిన వెంకటశరవణన్ (48) తనకు తానే ఒక ఆధ్యాత్మికవేత్తగా ప్రచారం చేసుకుంటూ తన పేరును ప్రసన్న వెంకటాచార్యర్ చతుర్వేదిగా చెప్పుకోసాగాడు. 2002లో చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం ఇతని మాయలోపడింది. 2004లో పారిశ్రామికవేత్త పెద్ద కుమార్తె (16)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బైటకు పొక్కడంతో పారిశ్రామికవేత్త భార్య, పెద్దకుమార్తెతో కలిసి పరారయ్యాడు. దీంతో చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో సదరు పారిశ్రామికవేత్త చతుర్వేదిపై ఫిర్యాదు చేశాడు. కేంద్ర నేర పరిశోధక విభాగ పోలీసుల విచారణలో సుమారు 50 మందికి పైగా యువతులు చతుర్వేది మాయకు లోనైనట్లు ఆధారాలు దొరికాయి. చతుర్వేదిపై కేసులు పెట్టి, అతని సహాయకులు శ్రీధర్, బాలమురుగన్‌లను అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. చతుర్వేదిని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో వాంటెడ్ నేరస్థుడిగా శుక్రవారం ప్రకటించి విదేశాలకు పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు పంపించారు. -
మేమేసిన రోడ్లపై నడవొద్దు
మీరు మా పార్టీ వారు కాదు..మీరు మాకు ఓట్లు వేయలేదు..మీకు సమాధానం చెప్పాల్సినఅవసరం నాకు లేదు..అసలు నేను వేయించిన రోడ్లపై నడవొద్దు..మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. ఇది సమస్యల పరిష్కారం కోరుతూ తన వద్దకు వచ్చిన రైతులపై కొండపి శాసన సభ్యుడు స్వామి చేసిన వ్యాఖ్యానాలివి. పొన్నలూరు మండలం పెదవెంకన్నపాలెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం, పెద వెంకన్నపాలెం(పొన్నలూరు): గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొనేందుకు కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి శుక్రవారం మండలంలోని పెదవెంకన్నపాలెం వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నల్లూరి రమేష్‌తో పాటు పలువురు రైతులు తమకు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనికి ఆయన ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు పార్టీ కార్యక్రమమని, తాను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు మా పార్టీ వారు కాదంటూ అని పరుష పదజాలంతో వాడు, వీడు అంటూ దూషించారు. మీకు దిక్కున్న వారికి చెప్పుకోండన్నారు. పైగా మీరు మాకు ఓటు కూడా వేయలేదని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైతులు మాట్లాడుతూ మీరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయి ఉండి సమస్యలను పరిష్కరించమని మీ దృష్టికి తీసుకుని వస్తే ఈ విధంగా మాపై ఆగ్రహం వ్యక్తం చేయడమేమనిటని నిలదీశారు. తరువాత ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న వారిపై, ప్రశ్నించిన వారిపై పోలీసులను ఎమ్మెల్యే ఉసిగొల్పి వారి నోరు నొక్కే ప్రయత్నం చేశారు. సమస్యలను పరిష్కరించాలని అడిగిన గ్రామస్తులకు పార్టీలను అంటగడుతూ మీరు నాకు ఓటు వేయలేదు. నేను వేసిన రోడ్ల పై మీరు నడవద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. నీవేమైనా సొంత డబ్బులతో రోడ్లేశావా ప్రజల సొమ్ముతో వేసిన రోడ్ల పై నడవద్దని ఎలా చెప్తావని ప్రజలు ఎమ్మెల్యే పై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరకుమారి, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, కర్ణా కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైరల్‌గా మారిన బాబా ఆడియో టేప్
అనంతపురం,ఉరవకొండ: వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని గోవిందప్ప ఆశ్రమ పీఠాధిపతి గురునాథస్వామి ఓ భక్తురాలిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లున్న ఆడియో టేప్ ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. వేలాదిమంది తరలివచ్చే ఈ ఆశ్రమంలో అమావాస్య రోజు పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు, పూజలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లాకు చెందిన ఓ భక్తురాలిని పీఠాధిపతి లైంగికంగా వేధించినట్లు ఓ ఆడియో టేపు ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉరవకొండ సీఐ సయ్యద్ చిన్నగౌస్ సోమవారం ఆశ్రమానికి వెళ్లి విచారించారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఆశ్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
పాదుకలకే పట్టం
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. ఓరోజు వైకుంఠవాసుడి శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది. కించపరిచింది.‘‘నేను విష్ణుమూర్తి శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు... అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తాను... నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు. కానీ విష్ణుమూర్తి ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి.పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు... మిమ్మల్ని నేనెప్పుడూ తక్కువ చేయలేదుగా... కిరీటం చెప్పిన మాటలకా బాధపడుతున్నారు...’’ అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తన గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు... దాన్ని మరచిపొండి... కిరీటం మాటలు పట్టించుకోకండి... నేనురామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. సరేనా...’’ అని హామీ ఇచ్చాడు.ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. – వై. సాత్యకి -
స్వామీజీ చివరి లేఖ
యశవంతపుర : ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మరణానికి ముందు జిల్లా ఎస్పీకి లేఖ రాసిన విషయం బయటపడింది. అష్టమఠాలలో ఒక్కటైన శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి గతనెల 24న ఎస్పీకి లేఖ రాశారు. తనకు పట్టద దేవుడు దక్కకుంటే జరిగే పరిణామాలకు మిగిలిన ఏడు మఠాధిపతులే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. పట్టద దేవుడు తనకు దక్కే వరకు పోరాటం చేస్తా, అది దక్కకుంటే కారణం సప్త మఠాధిపతులే కారణం అని వివరించారు. సమస్య పరిష్కరించాలని 24న ఎస్పీకి లేఖ రాశారు. ఈ విషయం మూడు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది సివిల్ విషయం కావడంతో కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించినట్లు సమాచారం. విష ఆనవాళ్లు లేవు : స్వామీజీ మరణానికి సంబంధించి ఆదివారం పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. మృతదేహంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు లేవని వెల్లడైంది. అయితే ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చే వరకు విచారణను చేయటం కష్టమని పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన నివేదికలో మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినటం వల్ల స్వామిజీ మృతి చెందారని పేర్కొన్నారు. -
పోస్టుమార్టం నివేదికే కీలకం
యశవంతపుర : ఉడిచి శిరూరు లక్ష్మీవర తీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు పోస్టుమార్టం నివేదికే కీలకంగా మారింది. నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. శనివారంలోపు నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వామికి ఆప్తురాలిగా భావిస్తున్న రమ్యాశెట్టి స్నేహితుడు ఇక్బాల్ (45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రమ్యాశెట్టి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే పోస్టుమార్టం నివేదిక తరువాత ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. అప్పుడే శాస్త్రీంగా దర్యాప్తు మొదలువుతుందని పోలీసులు చెబుతున్నారు. డీవీర్ నిపుణులు రాక : సీసీ కెమెరా డీవీఆర్‌ను పరిశీలించడానికి బెంగళూరు నుంచి నిపుణులను రప్పించారు. ఇదే కీలక సాక్ష్యంగా పోలీసులకు ఉపయోగపడనుంది. అదే విధంగా తరచూ మఠానికి వచ్చిపోయే భక్తుల వివరాలు సేకరించారు. ముంబైకు రెండు బృందాలను పంపించారు. పశ్చిమ విభాగం ఐజీ అరుణ్ చక్రవర్తి, ఎస్పీ నింబర్గిలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్వామీజీ వైకుంఠ ఆరాధన 31న మూల మఠంలో నిర్వహించాలని నిర్ణయించారు. రూ. కోటి బంగారం భద్రం : స్వామి వద్దనున్న కోటి విలువ గల బంగారు అభరణాలు భద్రంగా ఉన్నట్లు ఉడిపి పోలీసులు తెలిపారు. బంగారు నగలను ఎవరూ దోచుకెళ్లలేదని, ఆయన ఆస్పత్రికి చేరే ముందు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలతో పోలీసులు సతమతమవుతున్నారు. మరో అనుమానితుడు బులెట్ గణేశ్‌ను అదుపలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మూటలో విదేశీ మద్యం, కండోమ్స్
యశవంతపుర(కర్ణాటక): ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసు విచారిస్తున్న పోలీసులకు మఠం పక్కలోని స్వర్ణనదిలో డీవీఆర్ (వీడియో రికార్డర్) బాక్స్ దొరికింది. స్వామి ధరించిన అనేక బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నిత్యం స్వామి వేసుకున్న చేతి కడియాలు, మెడలో వేసుకునే ఖరీదైన బంగారు గొలుసు, చేతి ఉంగరం, బంగారు తుళసి మాల కనిపించటం లేదు. స్వామికి చెందిన మూడు బంగారు కడియాలలో ఒక కడియాన్ని అప్పుడప్పుడు ఆయన భక్తురాలుగా చెప్పుకునే రమ్యాశెట్టి ధరించేవారని తెలిసింది. ఆమె నగలు ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో మిగిలిన బంగారును కూడా రమ్యాశెట్టినే దాచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారంపై రమ్యాశెట్టి మక్కువ భక్తులు దానం చేసిన బంగారంపై రమ్యాశెట్టికి వ్యామోహం పెరగటంతో శుభ కార్యాలకు స్వామి ధరించే బంగారాన్ని ఆమె ధరించేవారని తెలిసింది. స్వామి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తరువాత మఠంలోని బంగారు అభరణాలు గల్లంతయినట్లు ప్రచారం జరుగుతోంది. మణిపాల్ ఆస్పత్రిలో చేరినప్పుడు అయన చేతికి మూడు ఉంగరాలు ఉండగా, మిగిలిన నగలను మఠంలోని తన గదిలో భద్రపరిచిన్నట్లు తెలిసింది. దీనితో మఠంలో పని చేస్తున్న అనుమానితులను పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. స్వామి తన వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు సమాచారం. ఆయన నిత్యం ఒక కేజీ బంగారు నగలను ధరించేవారు. అవి చాలా పురాతన కాలం నాటివని భక్తులు అంటున్నారు. రమ్యాశెట్టి మాత్రమే స్వామి గదికి వెళ్లేవారని రెండు రోజుల నుండి ఆమెను విచారిస్తున్న పోలీసులు చెబుతున్నారు. అజ్ఞాతంలో రమ్యా విచారణ మంగళవారం సాయంత్రం నుండి రమ్యాశెట్టిని పోలీసులు అజ్ణాత ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఆమె ఐదు మంది సహచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారు వాడిన ముబైల్ నంబర్ల ఆధారంగా ముంబైకి లింక్‌లు ఉన్నట్లు నిర్థారించారు. బంధుమిత్రుల శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె పోటోలను పోలీసులు సేకరిస్తున్నారు. గత రెండేళ్ల నుండి అమె స్వామిని మోసపుచ్చి లూటీ చేసిదంటూ సామాజిక మాధ్యమాలలో ఆరోపణలు వస్తున్నాయి. రమ్యాశెట్టి సుళ్యకు చెందిన మహిళ కాగా, ఆమె ముంబైలో కూడా కొంతకాలం నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మఠానికి అప్పుడప్పుడు ముంబైకి చెందిన బంగారం వ్యాపారులను పిలిపించి స్వామికి పరిచయం చేసినట్లు తెలిసింది. నాలుగు నెల క్రితం ఒక యాంటిక్ ఆభరణాన్ని ఆమె ధరించినట్లు పోలీసులు ఒక ఫోటోను సేకరించారు. దానిని స్వామి కూడా కొన్నిసార్లు ధరించినట్లు గుర్తించారు. నిత్య పూజలు ప్రారంభం బుధవారం నుండి శిరూరు మఠంలో నిత్యపూజలు, నైవేద్యలను ప్రారంభించారు. మూల మఠంలో ముఖ్యప్రాణ, మూల దేవుడుకి నైవేద్యం పెట్టి పూజలు చేశారు. లక్ష్మీ వరతీర్థస్వామి రోజు నాలుగుసార్లు బియ్యంతో నైవేద్యం, మూడుసార్లు పూజలు చేసేవారని భక్తులు తెలిపారు. మఠంలోనికి అర్చకులు, సిబ్బంది తప్ప భక్తులను అనుమతించటం లేదు. పోలీసుల విచారణ ముగిసిన తరువాత తదుపరి పీఠాధపతిని నియమించే అవకాశం ఉంది. నదిలో డీవీఆర్ స్వాధీనం మఠం పరిధిలోని బావిలో డీవీఆర్ దొరికిందని అందరూ ఊహించారు. కానీ దొరికిన మూటలో విదేశీ మద్యం, కండోమ్స్ లభించాయి. స్వామి నిద్రించే గదిలో కొన్ని ఔషధాలు కనిపించాయి. రమ్యాశెట్టితో సన్నిహితంగా ఉన్న అటోడ్రైవర్ జగదీశ్‌ను కూడా విచారిస్తున్నారు. డీవీఆర్‌ను హిరియడ్క మఠం పక్కలోని స్వర్ణ నదిలో పడేసిన్నట్లు చెప్పడంతో అక్కడ బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో గజ ఈతగాళ్ల సాయంతో దీనిని బయటకు తీశారు. రికార్డయిన సమాచారం ఉందో లేదో పోలీసులకు అర్థం కావటంలేదు. నదిలో వేసింది ఎవరనేది పోలీసులు విచారిస్తున్నారు. -
వేషం మార్చి... పరారీకి యత్నించి...
యశవంతపుర : ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామి మృతికి సంబంధించి ఆయన సన్నిహితురాలిగా భావిస్తున్న రమ్యాశెట్టి సోమవారం పోలీసుల కళ్లుగప్పి పారిపోవడానికి యత్నించి చివరకు పట్టుపడ్డారు. వివరాలు... అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో సోమవారం ఉదయం రమ్యాశెట్టిని దర్యాప్తు బృందం విచారణ చేసింది. మళ్లీ మధ్యాహ్నం హాజరు కావాలని సూచించారు. అయితే ఆమె బుర్కా ధరించి తన ముగ్గురు స్నేహితురాళ్లతో తప్పించుకోవడానికి పథకం వేసింది. ఒక కారులో ముగ్గురు బయలుదేరారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు మరోవాహనంలో వెంబడిం చారు. కారు బెళ్తంగడి తాలూకా అళదంగడి శ్రీ సత్యదేవద ఆలయం వద్ద రమ్యా కారు పంక్చర్ అయ్యింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా రమ్యగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం. రమ్య కుమారుడితో పాటు అతని స్నేహితులను కూడా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మఠానికి చెందిన మాజీ మేనేజర్ సునీల్ సంపిగెత్తాయను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అమ్మకానికి శిరూరు టవర్స్ మణిపాల్‌లోని శిరూరు టవర్స్‌ను స్వామిజీ విక్రయానికి నిర్ణయించారు. టవర్స్‌ను అమ్మే విషయంపై జ్యోతిషుడు ప్రజ్వల్, రియల్ వ్యాపారి కిశోర్‌ల వద్ద చర్చించినట్లు సమాచారం. పది ఎకరాల్లో విస్తరించిన ఈ టవర్‌ను రూ.180 కోట్లకు విక్రయించాలని నిర్ణయించారు. అదే వ్యవహారమే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. బావిలో సీసీ కెమెరా డీవీఆర్ : మఠంలో సీసీ కెమెరాలు, డీవీఆర్లు మఠం బావిలో పడేసినట్లు అనుమానం రావడటంతో సోమవారం రాత్రి వరకు పోలీసులు మఠం బావిలో గాలించారు. అయితే అందులో మద్యం బాటిళ్లు లభించడంతో పాటు మరికొన్ని వస్తువులు లభించాయి. అదృశ్యమైన సీసీ కెమెరా డీవీఆర్ దొరికిందని ప్రచారం జరగడంతో ఐజీ చక్రవర్తి, ఉడిపికి వచ్చారు. కేసు పురోగతిపై ప్రత్యేక బృందాలతో ఆరాతీశారు. అనంతరం మఠాన్ని సందర్శించి కొన్ని గదులను పరిశీలించారు. మూలమఠంలోని బృందావనం వద్దకు వెళ్లి ఎస్పీ లక్ష్మణ్ నింబర్గితో మాట్లాడారు. ఎవరిని అరెస్ట్ చేయలేదు యశవంతపుర : మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామి మృతి కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని పశ్చిమ విభాగం ఐజీపీ అరుణ్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఉడిపి ఎస్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. స్వామి మృతి కేసును విచారణకు ఐదు బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందేహాలను నమ్మవద్దని భక్తులు సూచించారు. మంగళవారం పరారవుతున్న రమ్యాశెట్టిని అరెస్టు చేసిన విషయంపై ఐజీ సమాధానం దాటవేశారు. -
మఠాధిపతి మృతికి ముంబై లింకు?
యశవంతపుర: శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామి అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మఠంలో అమర్చిన సీసీ కెమెరా డీవీఆర్ అదృశ్య కావడంతో పథకం ప్రకారమే ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వామి మరణానికి కొద్ది రోజుల ముందు మఠానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎత్తుకెళ్లిన వ్యక్తి ఎవరనేది పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలాఉంటే రమ్యాశెట్టికి స్వామీజీ ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేసి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీనికి తోడు రెండు రోజుల క్రితం స్వామిజీ ఆప్తుడిగా భావిస్తున్న జగదీశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతడి విచారణలో పోలీసులు కీలక సమాచారం లభించినట్లు బయటపడింది. మఠంలో సీసీ కెమెరాలు కూడా మాయం కావడంతో పోలీసులకు బలమైన ఆధారాలు లభించలేదు. కెమెరాల అదృశ్యం వెనుక ముంబై మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత సోమవారం మూల మఠంలో వనమహోత్సవం సందర్భంగా వంట మనుషులను కూడా పోలీసులు పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. విచారణలో రోజుకోమలుపు తిరుగుతుండటంతో ఏడు బృందాలు విచారణలో నిమగ్నమయ్యాయి. ముంబై వెళ్లిన పోలీసు బృందం లక్ష్మీవర తీర్థ స్వామిజీ మరణం వెనుక భూ మాఫియా ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక పోలీసు బృందం ముంబై వెళ్లింది. మఠం పేరుతో దాదాపు రూ. 500 కోట్ల విలువైన మూడు వందల ఎకరాల భూమి ఉంది. దీంతో పాటు భూ కబ్జాతో పాటు రూ. కోట్ల విలువైన ఆభరణాలను కూడా దోచుకోవచ్చనే ఉద్దేశ్యంతో ముంబై మాఫియా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండచ్చని అనుమానం కలుగుతోంది. ఇక కొన్ని సందేశాలు వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్‌గా మారడంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రమ్యాశెట్టికి భూ మాఫియాకుఏమిటీ సంబంధం? పోలీసులు అదుపులో ఉన్న రమ్యాశెట్టికి ముంబైకి చెందిన భూ మాఫియాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం పోలీసులకు కలుగుతోంది. మోసపోయిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు స్వామి వద్ద అప్పుగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా స్వామీజీ ఉపయోగిస్తున్న మూడు మొబైల్ నెంబర్లకు చెందిన ఫోన్‌కాల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వామిజీ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే కేసు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని ఉడిపి జిల్లా ఎస్పీ లక్ష్మన నింబరిగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. -
సహజ మరణమా? విష ప్రయోగమా?...
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రముఖ మఠాల్లో ఒకటైన ఉడుపి జిల్లా శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామీజీ (55) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనది సహజ మరణమా, లేక కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు ముసురుకున్నాయి. సోమవారం మూలమఠంలో జరిగిన వన మహోత్సవంలో భోజనం చేశారు. అనంతరం ఆయన తీవ్ర అస్వస్థత పాలయ్యారు. దీంతో మణిపాల్ కేఎంసీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే ఆయన శరీరంలో విషపు ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు ప్రకటించటంతో అనుమానాలు మొదలయ్యాయి. లక్ష్మీవర తీర్థస్వామీజీ ఆకస్మిక మృతి బాధాకరమని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. మృతి వెనుక ఎలాంటి అనుమానాలు ఉన్నట్లు తేలినా సీబీఐతో విచారణ చేయిస్తామని తెలిపారు. బాల్యంలోనే సన్యాస దీక్ష స్వామీజీ అసలు పేరు హరీశ్ ఆచార్య. కుందాపుర తాలూకా మడామక్కిలో విఠల ఆచార్య, కుసుమమ్మ దంపతులకు 1964 జూన్ 8న జన్మించారు. 1971 జూలై 2న తన ఎనిమిదో ఏట సన్యాసం పుచ్చుకున్నారు. అనంతరం ఉడుపి జిల్లాలోని అష్టమఠాల్లో ఒకటైన శిరూరు మఠం చేరుకున్నారు. ఇప్పటివరకు మఠాధిపతిగా మూడుసార్లు బాధ్యతలు తీసుకున్నారు. స్వామీజీలకున్యాయపర అధికారాలు కావాలని పలుసార్లు డిమాం డ్ చేసి వార్తలకెక్కారు. స్వామీజీ సంగీతం, కరాటె అంటే బాగా ఇష్టపడేవారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించారని వార్తలు వచ్చాయి. జనసంద్రం మధ్య అంత్యక్రియలు ఆస్పత్రి నుంచి స్వామీజీ పార్థివ దేహాన్ని శిరూరు వద్ద ఉన్న కృష్ణమఠానికి తరలించారు. అనంతరం భారీ జనసందోహం మధ్య ఉడుపిలోని కృష్ణమఠం నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న మూలమఠానికి పూలతో అలంకరించిన వాహనంలో తరలించారు. దారి పొడవునా అభిమానులు, భక్తులు బారులు తీరారు. కాగా ఉడుపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ పర్యవేక్షించారు. మూలమఠం వద్ద పది నిమిషాల పాటు ఉంచి భక్తులకు దర్శన అవకాశమిచ్చారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. సమాజానికి ఎంతో లోటు: శివకుమార్ స్వామీజీ, సిద్ధగంగా మఠాధిపతి శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామీజీ ఆకస్మిక మరణంతో సమాజం చాలా నష్టపోయింది. స్వామీజీ చాలా దూరదృష్టితో ఉండేవారు. శిరూరు మఠంలో సాంస్కృతిక, ధార్మిక తదితర వాటిలో శిక్షణ ఇచ్చేవా రు. తాము ఎల్లప్పుడూ ఆయన ఆశీస్సులు పొందేవాళ్లం. ప్రముఖుల సంతాపం... కాగా, లక్ష్మీవర తీర్థస్వామీజీ హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు స్పందించారు. లక్ష్మీవర తీర్థస్వామీజీ మాకు మార్గదర్శకుడిగా ఉండేవారు. ఆయన ఆకస్మిక మృతికి చింతిస్తున్నా. సమాజంలోని భక్తులు, ప్రజలు చాలా నష్టపోయారు. నిత్యం ఆయన సేవలు పొందే భాగ్యం కోల్పోయారు. అని మాజీ ప్రధాని దేవగౌడ తెలిపారు. ‘శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామీజీ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. స్వామీజీ బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్ని శాస్త్రాల్లో విజ్ఞానం సంపాదించారు. అలాంటి వ్యక్తి అకాలంగా మరణించడం బాధాకరం’ అని మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప తెలిపారు. -
మహిళా కండక్టర్‌పై స్వామిజీ దాడి
కొలిమిగుండ్ల(కర్నూలు) : విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై సోమవారం ఓ స్వామిజీ దాడికి పాల్పడ్డాడు. నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఉదయం తాడిపత్రికి బయలుదేరింది. ఆ బస్సులో వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన కండక్టర్ బూరుగల సుబ్బలక్ష్మి విధులు నిర్వర్తిస్తున్నారు. మార్గంమధ్యలో ఇటిక్యాల గీతాశ్రమానికి చెందిన జయదేవ్‌స్వామి బనగానపల్లెలో బస్సు ఎక్కాడు. కొలిమిగుండ్ల వరకు టికెట్ తీసుకోవడంతో స్టేజీ రాగానే దిగాలని కండక్టర్ సూచించారు. అందుకు అంగీకరించని స్వామి తాను ఇటిక్యాలలో దిగుతానని పట్టుబట్టాడు. ఎక్స్‌ప్రెస్ సర్వీసు కావడంతో టికెట్ తీసుకున్న స్టేజీలోనే దిగాలని పేర్కొన్నా పట్టించుకోలేదు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సు జమ్మలమడుగు క్రాస్ రోడ్డు వద్దకు చేరగానే ఆవేశంతో ఊగిపోయిన ఆయన కండక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు అడ్డుకుని జయదేవ్‌స్వామికి దేహశుద్ధి చేశారు. బస్సును కొలిమిగుండ్ల స్టేషన్‌కు తీసుకొచ్చి కండక్టర్ స్వామిపై ఫిర్యాదు చేశారు. -
కథా శతక పద్యం
‘నన్ను పట్టి కుదిపిన ఒక సంఘటనను చిన్నకథగా రాసాను. అలాంటి కథా సారాంశంతో కూడిన వేమన పద్యం ఒకటి నాకు యాది కొచ్చింది. ఇంకేం? కథ కింద పద్యం ఉంచాను. వేమన పద్యంలో మూడవ పాదం మార్గదర్శి లక్షణాన్ని కలిగి ఉంటుంది. కనుక ఆ పాదంలోని ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టాను. అలా ఒక కొత్త రూపం పురుడు పోసుకుంది’ అని ‘కశప’ నేపథ్యం చెబుతారు బి.వి.ఎన్.స్వామి. అలా 117 చిన్న కథలు రాశారు. వాటికి, మల్లికార్జున పండితారాధ్యుని ‘శివతత్త్వసారము’, పాల్కురికి సోమన ‘వృషాధిప శతకము’, బమ్మెర పోతన ‘నారాయణ శతకం’, ధూర్జటి ‘కాళహస్తీశ్వర శతకం’, కుసుమ ధర్మన్న ‘హరిజన శతకం’, శ్రీశ్రీ ‘సిరిసిరిమువ్వ శతకం’లాంటి వాటితోపాటు నేడు రాస్తున్న పద్య కవుల రచనల్లోని పద్యాలను జత చేశారు. ఒక పద్యానికి కథ రాయడం కాదు; ఒక కథ రాసి దానికి అనుగుణమైన భావం గల పద్యాన్ని యావత్ తెలుగు సారస్వతంలో గాలించడం! ఇదొక ప్రయోగం. ఇందులోని సాహిత్య ప్రయోజనం కన్నా రచయిత పడిన శ్రమ గమనించదగ్గది. -
కడియపులంకలో గుబాళించనున్న ఆధ్యాత్మికత
– బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి -28న షిర్డీసాయి, 30న వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠాపనలు కడియం (రాజమహేంద్రవరం రూరల్) : మండలంలోని కడియపులంక గ్రామం హరిహరక్షేత్రంగా భాసిల్లుతుందని బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి అన్నారు. కడియపులంకలోని శ్రీ అపర్ణాసమేత అనంతేశ్వరస్వామి పంచాయతనక్షేత్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 30న విగ్రహ ప్రతిష్ఠాపనలు జరుగుతాయని, 28న శ్రీ షిర్డి సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని చెప్పారు. ఆలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించిన ఆయన స్థానిక ఆలయ కమిటీ, భక్తులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.కోటికి పైగా భక్తుల విరాళాలతో ఆలయం రూపుదిద్దుకుందన్నారు. హరిహరుల ఆలయాలు పక్కపక్కనే నిర్మితమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రమైన మృగశిర నక్షత్రంలో స్వామివారి ప్రతిష్ఠాపన జరుగుతుందన్నారు. శంకర జయంతి, రామానుజాచార్య సహస్ర జయంతి తదితర ప్రాధాన్యమైన రోజుల్లోనే ప్రతిష్ఠాపనకు నిర్ణయించడం విశిష్టతను సంతరించుకుందన్నారు. తొలి దర్శనానికి పలువురు పీఠాధిపతులను ఆహ్వానించినట్లు తెలిపారు. 30న మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. అనేక విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసిన శ్రీమాన్ నల్లాన్‌చక్రవర్తుల సంతోషాచార్యుల బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్ఠాపనలు జరుగుతాయన్నారు. ఏర్పాట్లను ఆలయ నిర్మాణ కమిటీ, గ్రామ భక్తజనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. -
శోభాయమానంగా పొన్నవాహన మహోత్సవం
భక్తులతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం వాడపల్లి(ఆత్రేయపురం) : శ్రీవారి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం పొన్నవాహ న మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని పల్లకీ, పొన్నవాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి పోటెత్తింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బిహెచ్.వి.రమణ మూర్తి ఆధ్వర్యం లో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆది వారం సదస్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈఓ తెలిపారు. -
చలించని భక్తికి ప్రతీక.. శూలాల వేడుక..
-నగరంలో సుబ్రహ్మణ్యస్వామి తిరువీధి ఉత్సవం -వంటిపై శూలాలు గుచ్చుకుని మొక్కు తీర్చుకున్న భక్తులు రాజమహేంద్రవరం కల్చరల్ : వంటికి పూచికపుల్ల తాకితేనే విలవిలలాడతారు కొందరు. అలాంటిది వారు శూలాలనే దేహంలోని వివిధ భాగాల్లో అవలీలగా గుచ్చుకున్నారు. ఆ శూలాలతోనే తిరువీధి ఉత్సవంలో అలవోకగా పాల్గొన్నారు. లాలాచెరువు బర్మాకాలనీలో వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యస్వామి తిరువీధి ఉత్సవం నిబద్ధతతో భక్తులు సంతరించుకునే శక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈనెల 3న ఆలయంలో ప్రారంభమైన స్వామివారి ఉత్తర ఫల్గునీ పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం పుష్కరాలరేవులో కలశస్థాపన అనంతరం విశాఖ నుంచి వచ్చిన గురుస్వాముల పర్యవేక్షణలో మొక్కు ఉన్న భక్తులు శూలాలు గుచ్చుకుని తిరువీధి ఉత్సవంలో పాల్గొన్నారు. వారికి ఇతర భక్తులు పాదాభివందనం చేశారు. వందలాది భక్తుల శరవణఘోషతో ఉత్సవం పుష్కరాలరేవు, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, హోటల్ షెల్టాన్, శీలం నూకరాజు రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేకరథం అనుసరించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, కార్యదర్శి సీహెచ్ మురళీకృష్ణ, కోశాధికారి నరసింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సత్యదేవా! సత్ఫలితమివ్వు!
-రత్నగిరికి వెల్లువెత్తుతున్న టెన్త్ విద్యార్థులు -వివాహాలతో ఆలయ ప్రాంగణంలో పెరిగిన రద్దీ అన్నవరం : పౌర్ణమి పర్వదినం, ఆదివారం కలిసి రావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వివాహాలు జోరుగా జరుగుతుండడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులు, సత్యదేవుని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు, సత్రాలు నిండిపోయాయి. కాగా ఈ నెల 17 నుంచి çపరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటూ పెద్దసంఖ్యలో స్వామి సన్నిధికి వస్తున్నారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకుంటున్నారు. వీరందరితో ఆలయప్రాంగణంలో సందడికి తెరిపి ఉండడం లేదు. స్థానిక శ్రీసత్యసాయి విద్యావిహార్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవాలని వారిని పండితులు ఆశీర్వదించారు. సత్యదేవుని దర్శించిన 20 వేలమంది భక్తులు ఆదివారం సత్యదేవుని 20 వేలమంది దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు గోకులంలో సప్తగోప్రదక్షణ అనంతరం రావి చెట్టుకు పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,619 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
కళ్యాణ వైభోగమే
నేడు భీమేశ్వరస్వామి సన్నిధిలో స్వామివార్ల కల్యాణోత్సవాలు, అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనారసింహుని వివాహ వేడుక రేపు జి.మామిడాడలో సూర్యనారాయణమూర్తి, పుట్టకొండ లక్షీ్మనరసింహస్వామి, పిఠాపురంలో కుంతీమాధవస్వామి, ధవళేశ్వరంలో జనార్దునుడి కల్యాణాలు కల్యాణ మహోత్సవాల సందడితో ఆలయాలు కళకళలాడుతున్నాయి. కల్యాణకాంతులు విర జిమ్ముతున్నాయి. ఆకాశ పందిళ్లు.. భక్తుల సందళ్లతో కల్యాణతంతు కడు రమణీయంగా.. కమనీయంగా సాగనున్నాయి. మేళతాళాల మధ్య స్వామివార్లు పరిణయ వేడుకకు సిద్ధమయ్యారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి వార్ల కల్యాణ మహోత్సవాలు సోమవారం జరగనున్నాయి. మంగళవారం జి.మామిడాడలో సూర్య నారాయణ మూర్తి, పుట్టకొండలో లక్ష్మీనరసింహస్వామి, పిఠాపురంలో కుంతీమాధవస్వామి, ధవళేశ్వరంలోని ధవళగిరిపై వేంచేసిన జనార్దనుడి కల్యాణాలు మంగళవారం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెదపూడి : మండలంలోని జి.మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారి కల్యాణ మహోత్సావానికి అంతా సిద్ధమైంది. స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య వేదమార్గ ప్రతిషా్ఠపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో ఈనెల 7న భీష్మ ఏకాదశి మంగళవారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి మోర్త మురళీ వీరభద్రరావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మ¯ŒS కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బాణసంచా సిద్ధం చేశారు. బాణసంచా పోటీల్లో గెలుపొందిన వారికి కాసు బంగారం బహుమతి ఇస్తారు. కల్యాణం రోజున ఆలయంలో జరిగే కార్యక్రమాలు ఇవే.. ఈ నెల3న రథసప్తమితో ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఈ నెల11తో ముగిస్తాయి. 7న భీష్మ ఏకాదశి, స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు నిత్యోపాసన, విశేషహోమం, బలిహరణ, ఎనిమిది గంటలకు «ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్లో అన్నసమారాధన, మధ్యాహ్నం 12.35 గంటకు శ్రీవారి రథోత్సవం, రాత్రి ఏడు గంటలకు కనులపండువగా స్వామి వారి కల్యాణం జరుగుతుంది. కల్యాణ మహోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాలు 8న ఉదయం, సాయంత్రం నిత్యార్చన, నిత్యహోమాలు, 9న నిత్యార్చన, నిత్యహోమాలు, శ్రీవారికి సదస్య మహోత్సవం10న స్వామివారి గరుడ వాహన తిరువీధి ఉత్సవం,∙11న పవిత్ర తుల్యభాగనది తీరాన స్వామి వారి చక్రస్నానం, ఆలయంలో మహాపూర్ణాహుతి, ఉయ్యాలసేవ, శ్రీపుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
కర్నూలు న్యూసిటీ: ఆధ్యాత్మికతతో మానిసక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ ఆ«ధ్యాత్మివేత్త శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్కుమార రామాను జీయరు స్వామి అన్నారు. ఆదివారం కర్నూలులోని జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణశాల)లో ధనుర్మాస వ్రత మహాత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ... వారంలో ఒక్కరోజైనా దేవాలయాలకు వెళ్లి దేవున్ని దర్శించుకోవాలన్నారు. తమ సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్నారు. గోరక్షణశాల మాజీ ధర్మకర్త మండలి సభ్యుడు శ్రీకాంత్ నాయుడు, గోరక్షణశాల సిబ్బంది రమణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు. -
సుబ్బారాయుడి కల్యాణం చూతము రారండి
ఘనంగా షష్ఠి మహోత్సవాలు ప్రారంభం రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కల్యాణం అన్నవరం : దేవస్థానం హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి షష్ఠి మహోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వధూవరులను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి వివాహమహోత్సవాన్ని పురస్కరించుకొని ముత్తయిదువులు పసుపు దంచారు. రాత్రి ఏడు గంటలకు మయూర వాహనంపై వల్లీ, దేవసేన అమ్మవార్లను, స్వామివారిని శేషవాహనంపై పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. కార్యక్రమాలను అన్నవరం దేవస్థానం ప్రధానార్చకులు గాడేపల్లి వెంకట్రావు, అర్చక స్వాములు ఇంద్రగంటి బుల్లి, నర్సింహమూర్తి, అన్నవరం గ్రామ పురోహితుడు దేవులపల్లి మూర్తి, ఆలయ అర్చకుడు మూర్తి తదితరులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. l -
మధ్వసిద్ధాంతం మహోన్నతం
ఉత్తరాధి మఠాధీశులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ కాకినాడ కల్చరల్ : మధ్వసిద్ధాంతం మహోన్నతమైనదని ఉత్తరాధి మఠాధీశులు శ్రీసత్యాత్మతీర్థ స్వామిజీ తెలిపారు. రామారావుపేటలోని మధ్వసభ సమావేశ మందిరంలో స్వామిజీ శనివారం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. మధ్వ గృహస్తులు అచరించాల్సిన నియమా లు, సిద్ధాంతాలను మధ్వాచార్యులు తెలియజేశారని, వాటిని అనుసరిచించడం ద్వారా జన్మను సార్థకత చేసుకోవాలన్నారు. కాకినాడ మధ్వసభ కమిటీ ప్రతినిధి రాచూరి రాఘవేంద్ర స్వామి మాట్లాడు తూ కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని మధ్వ గృహస్తులకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాసుదేవాచార్, నరసింహాచార్, తాడూరి రంగారావు, కొప్పెల్ల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇండో-పాక్ పై మోదీకి స్వామి లేఖ
న్యూఢిల్లీ: ఇండో-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బీజీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. దేశీయ పరిశ్రమలు, జాతీయ భద్రత రీత్యా పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతిని నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, దేశీయ సిమెంట్ పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడం, జాతీయ భద్రతా కారణాలరీత్యా మాత్రమే దేశంలోకి సిమెంట్ దిగుమతి నిషేధించాలని అభ్యర్థిస్తున్నానని స్వామి మోదీకి రాసిన ఒక లేఖలో విజ్క్షప్తి చేశారు. పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతులను అనుమతించడమంటే నిషిద్ధ వస్తువులు, హానికరమైన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి అక్రమ రవాణాకు ఆస్కారం అందించినట్టేనని ఆయన వాదించారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి సిమెంట్ దిగుమతికి మన దేశం ఒక డంపింగ్ గ్రౌండ్ గా మారిందన్నారు. పాకిస్తాన్ నుంచి పన్నులు లేని సిమెంట్ దిగుమతులకు అనుమతి ఇవ్వడం ద్వారా దేశీయ సిమెంట్ పరిశ్రలను పణంగా పెట్టారని విమర్శించారు. సిమెంట్ పై కాకుండా సిమెంట్ తయారీకి అవసరమైన పదార్థాలపై పన్నులు విధించడం ద్వారా దిగుమతి సుంకాన్ని ఆకర్షించవచ్చని స్వామి సూచించారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు ఇది వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. -
స్వామి సోడాకాయానంద!
హ్యూమర్ ‘‘ఏంట్రా విశేషాలు?’’ ఎరక్కపోయి అడిగా మా రాంబాబు గాడిని. ‘‘ఏం లేదురా మొన్న ఊరెళ్లి వచ్చా. చాలా రోజుల తర్వాత అక్కడ సోడా తాగా. నిజానికి దాన్ని సోడా అని అంటాంగానీ అది రెండు కూరగాయలకు సరిపెట్టు అయిన ఒక వెజిటెబుల్’’ అన్నాడు రాంబాబు. ‘‘అది వెజిటెబుల్ ఏమిట్రా నా తలకాయ’’ అన్నాను. ‘‘కూరగాయ లేదా కాయ గూర అనే దాంట్లో ‘కాయ’ అనే శబ్దం ఉంది చూశావా? అలాగే సోడానూ సోడాకాయ అంటారు. అలాగే దానిలోని గోలీని గోలీకాయ అంటారు. చూశావా... ఇలా రెండు కాయ శబ్దాలను తనలో దాచుకున్న దానిని వెజిటబుల్ అంటే తప్పేమిటి? కాకపోతే కాస్త సొరకాయ వంటి షేపుతో, టెంకాయ వంటి నీళ్లతో నిండి ఉండే కాయేరా ఈ సోడాకాయ’’ అన్నాడు వాడు. అక్కడితో ఆగకుండా... ‘‘మన సిటీలో కనిపించడం లేదు కానీ... మొన్న ఊరెళ్లినప్పుడు గోలీ సోడా కనిపించగానే అలా పాతజ్ఞాపకాల్లోకి వెళ్లిపోయా. అలా ఒల్డ్ మెమరీస్‌లో చాలా సేపు ఉండిపోయా. అంతేకాదు... కాసేపు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను’’ అన్నాడు వాడు ఎమోషనల్ అయిపోతూ. ‘‘సోడా తాగావు. ఆనందించావు. కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు?’’ అడిగా. ‘‘అరేయ్... సోడా ఎంత గొప్పది రా. నీళ్లను రీ-ఇన్ఫోర్సు చేస్తే ఉండే పవర్ సోడాలో ఉంటుంది. నాలుగైదు గ్లాసుల దాహం ఒక్కటంటే ఒక్క సోడాయే తీరుస్తుంది. ఏదైనా చెబితే ఆర్చేవారా, తీర్చేవారా అంటుంటారు చూశావా... కానీ సోడా కచ్చితంగా తీర్చేదేరా. దాహం తీర్చే పరమాద్భుతమైన వరప్రదాయని అది. చూడ్డానికి ఏదో సోడాలా అలా నిరాడంబరంగా కనిపిస్తుంది కానీ... అది నిజంగా ఫిలాసఫీని చెప్పే గురువురా’’ అన్నాడు. ‘‘కళ కళ కోసమే అన్నట్లు సోడా సోడా కోసమే. మహా అయితే తాగడం కోసమే. అంతే. నువ్వు దానికి లేనిపోని మహిమలు అంటగట్టకు, దాని మహత్యాలు చెప్పి నన్ను విసిగించకు’’ అన్నాను. ‘‘నిజం రా. సోడాలో ఒక తత్వబోధ ఉంది. ఒక పరమార్థం ఉంది. ఒక సందేశం ఉంది. అందులోని గోలీని చూశావా?’’ అన్నాడు వాడు. ‘‘చూశాను. నాకు మామూలు గోలీలాగే కనిపించింది. అందులో ఏముంది గొప్ప?’’ అడిగా. ‘‘గుండెలో పదిలంగా ఉంచుకోవాల్సిన జ్ఞానాన్ని అహంకరించుకొని తలకు ఎక్కించుకోకూడదు సోడాలోని గోలీలా. పనికిరాని గ్యాస్ అండ చూసుకొని అహంకరించి అట్టడుగు వర్గాలైన నీళ్లకు దూరంగా ఉండిపోవాలని కోరుకోకూడదు. ఏదో ఒక రోజు ఆ దురంహంకారాన్ని బలంగా నొక్కి కిందికి దించేసేలా గర్వభంగం జరుగుతుందని బోధిస్తుంటుంది రా గోలీ. ఏ గ్యాసునైతే తనకు అండ అనుకొని గోలీ గురుత్వాకర్షణ శక్తిని ఎదురు నిలిచిందో, ఏ గ్యాసునైతే నమ్ముకుని గోలీ సోడా మూతిని అంటిపెట్టుకొని ఉన్నత స్థానంలో ఉన్నానంటూ నీలిగిందో... కాస్తంత ఒత్తిడితో అదే గ్యాసు పైకి తేలిపోతుంది. తన నుంచి దూరంగా వెళ్లిపోతుంది. తాను దూరంగా ఉంచుదామనుకున్న అట్టడుగున ఉన్న ఆ నీరు తనను దాటుకుంటూ తన మీదుగానే తాగేవాడి నోట్లోకి వెళ్లిపోతాయి. అందుకే అహంకారం ఎప్పటికైనా కుయ్యిమనే శబ్దం చేస్తూ తస్సుమంటుందనే తత్వజ్ఞానం బోధిస్తుంది సోడా కాయలోని గోలీకాయ. అంతేకాదు సోడాకాయ ఆత్మజ్ఞానాన్నీ బోధిస్తుంది’’ అన్నాడు రాంబాబు. ‘‘అసలు సోడాకాయకూ, ఆత్మజ్ఞానానికీ సంబంధం ఏమిట్రా’’ అంటూ వాణ్ణి నిలదీశాను. ‘‘చెబుతా విను. నీ దేహాత్మ సోడాకాయ లాంటిది. అందులోని నీళ్లు పరమాత్మ స్వరూపం. పైన ఉండే గ్యాసు నీకు ఊపిరిని అందించే వాయువు. ఏదో ఒక రోజున నీకు ఆయువు తీరిపోక తప్పదు. ఆయువు తీరాక వాయువు కూడా ఉండదు సోడాలో! ఆరోజున నీ సోడాకాయ లాంటి నీ దేహాత్మను వీడి నీళ్లనే ఆ పరమాత్మ వెళ్లిపోతుంది. ఈ జ్ఞానం కలిగిన నాడు బయటకు వచ్చిన ఆ గ్యాసు... సోడా మూతి దగ్గర కాసేపు జ్ఞాన చక్రంలా ఆవరించుకొని ఉంటుంది. జీవితం బుద్బుద ప్రాయమైనదని ఖాళీ అయిన సోడాకాయ మళ్లీ మళ్లీ నిండుతుందనీ, నిండినది ఖాళీ అవుతుంటుందని... ఈ మహాచక్రం ఇలా సాగుతూ ఉంటుందని తత్వ బోధ చేస్తుంటుందిరా ఆ పరమ గురువైన ఆ మహా సోడాకాయానంద’’ అన్నాడు. ‘‘నువ్వు అంటే నిజమే అనిపిస్తుంది కానీ సోడాకాయ ఎందుకు రా అలా కు..య్.. మంటూ ఈల వేస్తుంది. అలా విజిల్ వేయడం తప్పు కదా’’ అన్నాను. ‘‘అది పోకిరీ విజిల్ కాదు రా... మళ్లీ మళ్లీ పుట్టే దాహార్తిని తీర్చడం కోసం నన్ను నేను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకొని పుడుతూ ఉంటా అని చెప్పేందుకు ఓ మృదుమధురమైన పాటలాంటి స్వరంరా అది. నీలాంటి అజ్ఞానులు దాన్ని విజిల్ అని పొరబడుతుంటారు’’ అంటూ నాకు జ్ఞానబోధ చేశాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి
బాలాజీచెరువు (కాకినాడ) : గత వారం వినాయక నిమజ్ఞనం సందర్భంగా అతిసూక్ష్మ వినాయక ప్రతిమను తయారు చేసిన కళాకారుడు ఆరిపాక రమేష్ ఇప్పుడు తాజాగా మరో అతి సూక్ష్మ విగ్రహాన్ని తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని సూదిలో ఇమిడేలా తయారుచేశారు. కేవలం 20 మిల్లీగ్రాములు బంగారంతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. -
మహానందీశ్వరుడికి సహస్రఘటాభిషేకం
– ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం మహానంది : మహానందీశ్వరస్వామివారికి ఆదివారం సహస్రఘటాభిషేక పూజలు వైభవంగా జరిగాయి. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, పండిత బృందం ఆధ్వర్యంలో విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహస్ర ఘటాల్లో గంగావాహన, ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం, కలశ ఉద్వాసన, పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహానందీశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం చేపట్టారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజు, శివారెడ్డి పాల్గొన్నారు. -
స్వామి మళ్లీ పేల్చారు..!
ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన బిల్లు జీఎస్టీపై అసలు నోరు మెదపనని, దానిపై తాను మాట్లాడితే ఘర్షణలు జరుగుతాయన్న సుబ్రహ్మణ్యస్వామి మాట మార్చారు. తనదైన వివాదాస్పద శైలిలో వస్తే గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ నెట్ వర్క్(జీఎస్టీఎన్)పై ట్విట్టర్లో బాంబు పేల్చారు. జీఎస్జీ బిల్లును ఆమోదిస్తున్న రాష్ట్రాలు జీఎస్టీఎన్ వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ సీఎంలకు లేఖలు రాస్తానని ట్వీట్ చేశారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సమావేశమైన నేపథ్యంలో స్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును బీజేపీ పాలిత ఎనిమిది రాష్ట్రాలు ఆమోదించిన సంగతి తెలిసిందే. దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి జీఎస్టీఎన్ పేరుతో ఒక స్వచ్చంద, లాభపేక లేని సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. జీఎస్టీఎన్ నిర్మాణం జాతి వ్యతిరేకకు సంబంధించిందని స్వామి వ్యాఖ్యానించారు. జీఎస్టీఎన్లో 24.5 శాతం స్టేక్ ప్రభుత్వం చేతిలో, మరో 24.5 శాతం రాష్ట్రాల చేతిలో ఉంటుంది. మిగిలిన 51 శాతం స్టేక్ ప్రభుత్వేతర ఆర్థిక సంస్థల స్వాధీనంలోకి వెళ్లిపోతుందని స్వామి ఆరోపిస్తున్నారు. జీఎస్టీఎన్లో మెజార్టీ స్టేక్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్ ఐసీ హౌసింగ్ లిమిటెడ్, హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ స్ట్రాటజిగ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిడెట్ వంటి ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి జీఎస్జీఎన్ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఎస్టీఎన్ ను వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ రాష్ట్ర సీఎంలకు లేఖ రాస్తా అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీడీపీ వృద్ధికి జీఎస్టీ సమాధానం కాదని, కార్మిక ఉత్పాదకత, అధిక పెట్టుబడులు అవసరమని ముందు నుంచి స్వామి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యనే రఘురామ్ రాజన్‌పై కామెంట్లుచేసి తీవ్ర వివాదాస్పదంగా మారారు. హైకమాండ్ ఆదేశాలతో ఈ మధ్యన కొంచెం సైలెన్సు అయిన స్వామి, ఈసారి డైరెక్ట్‌గా హైకమాండ్‌పైనే విమర్శలకు దిగారు. I am writing to Amit Shahji and all BJP CMs that while ratifying the Constitutional Amendments for GST Bill they should oppose GSTN. — Subramanian Swamy (@Swamy39) August 27, 2016 -
మార్మోగిన వేదఘోష
ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు వాడపల్లి వెంకన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు కన్నుల పండువగా జరిగిన పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించింది. శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి త్రయాహ్నిక దీక్షాపూర్వక పవిత్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడి గ్రామానికి చెందిన వేదపండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి, పండిత సత్కారం, నీరాజనంతో ఉత్సవాలు ముగిశాయి. పవిత్రోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యాన రాధాకృష్ణ, సాయిరామ్, శివాలయ కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. -
ఆ మంత్రులు చాయ్ పే చర్చలో పాల్గొన్నాలి
న్యూఢిల్లీ: జంతు వధపై ఇద్ధరు కేంద్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఇరువురు చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని సమస్యకు పరిష్కారం కనుగొనాలని సలహా ఇచ్చారు. అంతే కాని బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. పర్యావరణం పరిరక్షణపై మేనక చాలా కాలంగా కృషి చేస్తున్నారని ఆమె లేవనెత్తిన అంశాలకు మంత్రి బహిరంగంగా కాకుండా ఫోన్ లో సమాధానం చెబితే బాగుండేదని స్వామి అభిప్రాయపడ్డారు. అడవిపందులు, కోతులు, నీలి ఎద్దులు, నెమళ్ల వధకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర్రాల్లో అనుమతించిన విషయం తెలిసిందే. -
చిన్న పరిశ్రమల పని ముగిసిపోయింది!
న్యూఢిల్లీః సుబ్రమణ్యస్వామి ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజన్ విధానాలతో చిన్న పరిశ్రమలకు పాతర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా మల్టీ నేషనల్ కంపెనీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపిస్తున్నారని, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని స్వామి విరుచుకుకు పడ్డారు. రాజన్ తప్పుడు విధానాల ఆధారంగానే తాను విమర్శలు చేయాల్సి వస్తోందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పొట్ట కొట్టి, బహుళజాతి సంస్థలకు మేలు చేసేందుకు ఆయన ఈ విధానాలను అనుసరిస్తున్నారంటూ స్వామి ఆరోపించారు. ఆర్ బీ ఐ గవర్నర్ రాజన్ వ్యవసాయ వ్యతిరేక బ్యాంకింగ్ విధానాలను అనుసరించారని వాటిని తాను చార్జిషీటులో పొందిపరచినట్లు స్వామి తెలిపారు. ఢిల్లీలో జరిగిన భారతీయ కిసాన్ అభియాన్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన స్వామి... అధిక వడ్డీరేట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీవ్ర నష్టాల్లో ముంచేస్తున్నాయని, దీంతో దేశవాళీ ఉత్పత్తులు తగ్గిపోవడమే కాక, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. రఘురామ రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ పదవినుంచీ వెంటనే తొలగించాలని కోరుతూ స్వామి ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. -
కాంగ్రెస్ కు రాజ్యాంగంపై పాఠాలు చెబుతాను: స్వామి
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశ పెట్టడుతానని చెప్పడంపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఘాటుగా స్పందించారు. ఆపార్టీకి రాజ్యాంగంపై పాఠాలు చెబుతాననిక విమర్శించారు. అగస్టా వెస్ట్ లాండ్ కు సంబందించి తాను సభలో ప్రవేశ పెట్టిన పత్రాలు నిజమైనవేనని స్పష్టం చేశారు. ఈ ఒప్పందమే బోగస్ అని ఆయన ఆరోపించారు. అతి పెద్ద రాజకీయ పార్టీ తన పరువును పూర్తిగా కోల్పోయిందని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ ,అగస్టా కేసుల్లో కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టినందుకే ఆపార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఎప్పుడు తీర్మానం పెట్టినా తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నానని తెలిపారు. ముందు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవి కావని ఆరోపించారని, ఇప్పడు అందులోని సమాచారం తప్పు అని ఆరోపిస్తున్నారని తెలిపారు. వారికి రాజ్యాంగ నిబందనలపై పాఠాలు చెబుతానని స్పష్టం చేశారు. సుబ్రమణ్య స్వామి కి సమాచారం అందిచిన వెబ్ సైట్ లపై పరువు నష్టం దావా వేస్తామని, వాటికి సంఘ్ పరివార్ సంస్థలతో సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం
-
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న గవర్నర్
-
వెహికల్ ఇన్స్పెక్టర్ను దుర్బాషలాడిన జడ్పీటీసీ భర్త
కరీంనగర్ : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌తో పెగడాపల్లి జెడ్పీటీసీ గజ్జెల వసంత భర్త స్వామి దుర్బాషలాడారు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరప్రసాద్ రోజూ వారీగా అలగనూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో నెంబర్ ప్లేట్ లేని జేసీబీని వరప్రసాద్ సీజ్ చేసి ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ భర్త స్వామి ఈ రోజు ఉదయం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి నా బండినే... పట్టుకుంటావా అని వరప్రసాద్‌పై దుర్బాషలాడాడు. ఈ తతంగం మొత్తాన్ని వరప్రసాద్ సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ విషయంపై తిమ్మాపూర్ ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై వరప్రసాద్ ఫిర్యాదు చేశాడు. -
తిరుమలలో అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు
తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ స్వామి హెచ్చరించారు. మంగళవారం తిరుమలలో ఏఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ... పాస్టర్ సుధీర్‌కు చెందిన ల్యాప్‌టాప్‌తోపాటు సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఇటీవల పాస్టర్ సుధీర్ తిరుమలలో అన్య ప్రచారం నిర్వహిస్తున్న కార్యక్రమం మీడియాలో హాల్చల్ చేసింది. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి సుధీర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దాంతో సుధీర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. -
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసుల సస్పెంన్షన్
-
పగబట్టిన పైశాచకత్వం!
అంగారకుడిపై కాలుమోపుతున్నాం. చంద్రమండంలంపై నీటి జాడ కనుగొంటాం అంటున్నాం..! అయినా మనిషి మారలేదు.. మూఢత్వం ముసుగు తీయలేదు. కర్మభూమిలో నీతి జాడ విడిచాడు. ఆధునిక ప్రపంచంలో.. అనాగరిక సమాజం ముగ్గురి మహిళలను వెంటాడింది.. వేధించింది. విజ్ఞానం ఆకాశవీధిలో దూసుకెళ్తుంటే.. అజ్ఞానం నడివీధిలో అబలలను వివస్త్రులను చేసింది. పాశవికంగా దాడులు చేసింది. వికృత చేష్టలతో బెదిరించి అమాయకులను ఊరు దాటించింది. చేతబడి అని ముద్ర వేసి వారి జీవితాలను చేష్టలుడిగేలా చేసింది. -సాక్షి ప్రతినిధి, అనంతపురం అనంతపురం శివారులోని ప్రజాశక్తినగర్.. జూలై 28.. సమయం తెల్లవారుజామున 5.30 గంటలు.. ఊరు, వాడా ఇంకా నిద్దురలోనే ఉంది. ఓ వీధిలో లలిత, హేమావతి, పార్వతి అనే మహిళల ఇళ్లముందు పందిమాంసం, నువ్వులు, పసుపు, కుంకుమ కన్పించాయి. వీటిని ఎవరు మా ఇంటి ముందు పడేశారని వీధిలోని వారిని అడగటమే ఆ ముగ్గురు చేసిన తప్పయింది. దారిన పోయే కంప వీళ్లకు చుట్టుకుంది. ఆ ముగ్గురే వాటిని వీధిలో వేసి చేతబడి చేస్తున్నారని కొందరు కాలనీవాసులు ఆరోపించారు. వాగ్వాదానికి దిగారు.. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానయింది. కాలనీవాసులు ఓ స్వామీజీని పిలిపించారు. జరిగిన విషయం అతనికి చెప్పారు. కళ్లు మూసుకుని ఆ ముగ్గురు మహిళలు చేతబడికి పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. సమయం.. రాత్రి 9.30 గంటలు. ఊరంతా చీకటి.. ఆ కాలనీవాసులు కూడా కటిక చీకటిలోకి వెళ్లిపోయారు. మానవత్వం మచ్చుకైనా కనిపించకుండా పోయింది. కన్నూమిన్నూ కానని మనుషులు.. ఆ ముగ్గురు మహిళలపై పగతీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ ఆడపడుచులను వీధిలోకి లాక్కొచ్చారు. పూర్తిగా వివస్త్రలను చేశారు. అడ్డొచ్చిన పార్వతి భర్త పోతులయ్యను చితకబాదారు. ఒంటిపై వస్త్రం లేక.. సిగ్గుతో చితికిపోతున్న మహిళలపై భౌతికంగా దాడిచేశారు. శాపనార్థాలు పెడుతూ బూతుపురాణం అందుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాలనీ కాపురుషులు చివరి నిమిషంలో ఆ ఆడబిడ్డలకు దుస్తులు ఇచ్చేశారు. పోలీసులు కాలనీ వాసులను చెదరగొట్టారు. బాధితుల ఫిర్యాదుతో అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బతుకు బరువు.. జరిగిన అవమానాన్ని మరవలేక.. వేదనతోనే బతుకీడుస్తున్నారు ఆ మహిళలు. ఈ ముగ్గురు ఆడపడుచులదీ మూడు గాథలు. లలిత ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలేయడంతో.. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. హేమావతి భర్త చనిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తూ బతుకీడుస్తోంది. ఇక పార్వతి తన భర్తతో కలసి కూలి పని చేసుకుంటుంది. కాయకష్టాన్ని నమ్ముకుని ఆ దంపతులు జీవిస్తున్నారు. సీరియల్ ఎటాక్స్.. కొన్ని రోజులు గడిచాయి.. సెప్టెంబర్ 10.. హేమావతి ఆస్పత్రికి వెళ్లింది. గతంలో వికృత చేష్టలతో కలకలం సృష్టించిన దుండగులు మళ్లీ రెచ్చిపోయారు. హేమావతి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. మరో ఆరు రోజులు గడిచాయి. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి.. ఆ దుర్మార్గుల కన్ను పార్వతి ఇంటిపై పడింది. మూకుమ్మడిగా దాడి చేసి ఆమె ఇంటిని తగులబెట్టారు. అర్ధరాత్రి పిల్లలను తీసుకుని ఆ తల్లి.. భర్త, ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊరు దాటింది. ఈ సంఘటనతో పోతులయ్య.. పార్వతి, పిల్లలను వదిలి సొంతూరుకు వెళ్లిపోయాడు. వరుస దాడులతో బెంబేలెత్తిన లలిత ఆ అద్దె ఇంటిని వదిలేసి నగరంలోని ఓ కాలనీకి చేరుకుని బతుకు జీవుడా అనుకుంది. సెప్టెంబర్ 29.. ఈసారి హేమావతి ఇంటిని కాల్చేసి చేతులు పైశాచికానందం పొందారు వాళ్లు.. ఉన్న ఇల్లు కాస్తా బూడిదపాలు అవ్వడంతో.. హేమావతి గుండెలవిసేలా రోదించింది. పోలీసుల విచారణలో ‘చేతబడి’ ఉత్తదే!: ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేశారు. మహిళలు కాలనీవాసులపై చేతబడి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తేల్చారు. లేనిపోని అనుమానాలతో ముగ్గురిని వేధించిన కాలనీ వాసులను మందలించారు. మూఢనమ్మకాలను నమ్మొద్దని వివరించారు. సంఘటన జరిగిన రోజు నుంచి ఇద్దరి పోలీసులను ‘డే అండ్ నైట్’అక్కడే కాపాల ఉంచారు. జనవిజ్ఞాన వేదిక ద్వారా అవగాహన: విషయం తెలుసుకున్న జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రజాశక్తినగర్‌కు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. చేతబడి అనేది అపోహ మాత్రమే అని, చేతబడి పేరుతో ఎవ్వరూ ఎవ్వరినీ ఏమీ చేయలేరని వివరించారు. అలాంటి అపోహలతో సాటి మనుషులపై అలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. చేతబడి కాక ఇంకేదైనా కారణముందా?: ముగ్గురిపై జరిగిన వేధింపులు, దాడులు పరిశీలిస్తే.. వారిని కాలనీ నుంచి వెళ్లగొట్టాలని పథకం ప్రకారం దాడులు చేసినట్టు అనిపిస్తోంది. పార్వతి, హేమావతికి 1.5 సెంట్లలో ఇళ్లు ఉన్నాయి. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికే ఈ కుట్రలకు పాల ్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎస్ఐ తీరుపై ఆగ్రహం
తూప్రాన్, న్యూస్‌లైన్: ఎస్ఐ తీరుపై కోనాయిపల్లివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా లాఠీచార్జి చేశారంటూ మం డిపడ్డారు. అధికారులు వచ్చి ఎస్ఐపై చర్యలు తీసుకునే వరకు పో లింగ్లో పాలొనేది లేదని భీష్మిం చుకు కూర్చున్నారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. తహశీల్దార్ వచ్చి నచ్చజెప్పడంతో రెండుగంటల త ర్వాత పోలింగ్ కొనసాగింది. వివరాలోకి వెళ్తే..మండల పరిధిలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామంలో పోలింగ్ జరుగుతుండగా ఉదయం 9 గంటల ప్రాంతంలో మక్తామాసాన్పల్లికి చెం దిన ఎస్ఐఅనిల్రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గుంపుగా ఉన్నారంటూ ఇప్ప యాదగిరిపై లాఠీచార్జి చేశారు. అయితే అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఎస్ఐ తీరును నిరసిస్తూ పోలింగ్‌ను బహిష్కరించారు. అకారణంగా లాఠీచార్జి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ స్వామి, తూప్రాన్ పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో స్థానిక సీఐ సంజయ్‌కుమార్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఎస్ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తిరి గి 11 గంటలకు పోలింగ్‌లో పాల్గొన్నారు. కాసేపు ఎన్నికలను బహిష్కరించిన కూచారంతండావాసులు తమ తాండకు వెళ్లేందుకు సరైన మార్గంలేక రైల్వేలైన్ కింద నుంచి వెళ్లాల్సి వస్తుందంటూ మండల పరి ధిలోని కూచారంతండావాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ నిరంజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరకుని తాండ వాసులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అనంతరం ఓ టు హక్కును వినియోగించుకున్నా రు. ఇదిలాఉండగా మండలంలో 53 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. మొత్తం 42,103 ఓటర్లు ఉండ గా ఇందులో పురుషులు 21,177, మహిళలు 20,926 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కోక్క పోలింగ్ కేం ద్రంలో ఆరుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎం మిషన్ మోరయించడంతో గుండ్రెడ్డిపల్లి గ్రా మంలో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే తూప్రాన్ పట్టణంలో పట్టగోడుగుల వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ నెలకొనడంతో ఉద్రిక్తత నేలకొంది. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
కాలి స్పర్శకోసం జనం ఎదురుచూపులు
-
హిందూ,ముస్లీంల ఆధ్వర్యంలో కుళ్లాయి స్వామి బ్రహ్మొత్సవాలు