తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ స్వామి హెచ్చరించారు.
తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ స్వామి హెచ్చరించారు. మంగళవారం తిరుమలలో ఏఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ... పాస్టర్ సుధీర్కు చెందిన ల్యాప్టాప్తోపాటు సిస్టమ్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఇటీవల పాస్టర్ సుధీర్ తిరుమలలో అన్య ప్రచారం నిర్వహిస్తున్న కార్యక్రమం మీడియాలో హాల్చల్ చేసింది. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి సుధీర్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దాంతో సుధీర్కు కోర్టు రిమాండ్ విధించింది.