బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది | Man Attacked On His Lover In Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

Oct 15 2020 12:57 PM | Updated on Nov 24 2020 3:58 PM

Man Attacked On His Lover In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్య తేజస్విని ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న నాగేంద్రబాబు అలియాస్‌ స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో కోపోద్రేకుడైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ  చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, దాడి చేసిన అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement